Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Thursday, June 1, 2017

ఎందుకు అర్ధం కాదు ?


ఎందుకు అర్ధం కాదయ్యా ? గట్టిగా అరిచాడు పడవలాంటి కారున్న డబ్బున్న ఆసామి.
అదంతే నయ్యా అర్ధం కాదు.  ఎందుకు నన్ను ప్రాణం తీసీస్తావ్ చెప్పు చెప్పు అని అన్నాడు చేతులు లేని వ్యకి.  చెప్పాల్సిందే పట్టుపట్టారు డబ్బున్న వ్యక్తి ..
డబ్బు ఎక్కువైపోడంవల్ల బ్రెయిన్ చిన్నదైపోయింది అంచేత  నీకు అర్ధం కాదు
వారిద్దరి మధ్య వాదన పెరిగింది.

 గొడవ ఇలా మొదలైంది ....
ఒక తాటాకు పందిరి  అనేక మంది. కొంత  మంది ప్లాస్టిక్ కుర్చీలలో , కొంత మంది గట్లమీద విసని కర్ర లు పట్టుకుని కూర్చున్నారు, మరి  కొంత మంది నెల మీద కూర్చొని ఉన్నారు. మంచి ఎండాకాలం . సూర్యుడు నిప్పులు చెరుగుతున్నారు. ప్రాణకోటి  ఎండవేడిమికి అల్లల్లాడుతున్నది. ఇంతలో తాపీగా ఏ సి కారు ను పందిరి క్రింద  నిలిపి  నేలమీద కూర్చున్నవారిని అస్సయ్యాంగా చూసి ... తన స్థాయి ధనికుడిని ఏ వండి బాగున్నారా అంటూ పలకరించాడు. ఆ కారు కొంచం పందిట్లో కాక దూరంగా పార్క్ చేసుకోమని కొంతమంది  ఆయన్ను అభ్యర్ధించారు. " ఏంటి దూరంగా పార్క్ చేసుకోవాలా ?" అంతా ఎండేకదా , నీడ ఎక్కడుంది చూబించు " గద్దించాడు  ధనికుడు నెంబర్ 1. అవును అవును నీడ ఎక్కడుంది , ఎండలు మండిపోతున్నాయి అంటూ మద్దతిచ్చాడు ధనికుడు నెంబర్ 2.
 ధనికుడు నెంబర్ 1. : ఈ ఎండల్లో  ఆ సి ఆగిందా మన పని అయిపోయినట్టే .
ధనికుడు నెంబర్ 2.: అవునవును
 ధనికుడు నెంబర్ 1 : ఆ ఈ రోజుల్లో ఆ సి లేని వారు నిర్భాగ్యులే
ధనికుడు నెంబర్ 2:  ఏ సి లేనిదే అస్సలు పడుకో గలుగుతున్నామా ?
సామాన్యుడు1 : ఎందుకు పాడుకోలేము బాబు . మేము కూలర్ వేసుకుని పడుకునున్నాం. మేము నిర్భాగ్యులం కాదు. కూలర్ కూడా లేని వాడు నిర్భాగ్యుడు.
సామాన్యుడు2 : మాకు కూలర్ లేదు కానీ మేము ఫ్యాన్ వేసుకుని చక్కగా  పడుకుంటున్నాం. మేమె మీ  నిర్భాగ్యులం కాదె. ఫ్యాన్ కూడా లేని వాడే నిజమైన నిర్భాగ్యుడు.
నేల మీద కూర్చున్నవాడు 1 : నా పెరట్లో జాం చెట్టు కిందనేను పడుకుంటాను. విసినికర్రతో విసురుకుంటున్నాను. నాకొచ్చిన సమస్య ఏమీలేదు విషాన్ని కర్ర కూడా లేనివాడే ఆసానియానా నిర్భాగ్యుడు . కాదనగలరా?
నేల మీద కూర్చున్నవాడు 2: నాకు పెరడు లేదు ఇల్లులేదు , కానీ నాకు చేతులు ఉన్నాయి . ఈ తుండుగుడ్డ తో ఇలా విసురుకుంటారు నేను కాదు బాబూ నిభాగ్యుడిని. ఈ చేతులు కూడా లేవే , అదిగదిగో ఆడు , ఆడు బాబూ నిజమైన నిర్భాగ్యుడు
చేతులు లేనివాడు : అస్సలు మనమంతా  నిర్భాగ్యులమే.  ఈ కార్లో వచ్చిన ఈ ఆసామి చాలా నిర్భాగ్యుడు ధనికుడు నెంబర్ 1 : నేను నిర్భాగ్యుడినా?. ఎంత మాటన్నావు రా గాడిదా !
ధనికుడు నెంబర్ 2 :అంత మాట ఎందుకన్నావురా ?
చేతులు లేనివాడు : వొదిలేయండి   బాబూ చెప్పినా మీకు అర్ధం కాదు
ఎందుకు నన్ను ప్రాణం తీసీస్తావ్ చెప్పు చెప్పు అని
నేను చెప్పినా నీకు అర్ధం కాదు. అన్నాడు చేతులు లేని వ్యకి. వారిద్దరి మధ్య వాదన పెరిగింది.
చివరకు చేతులు లేని వాడు ఇలా చెప్పాడు: మన గుడులన్నీ నాసిన మయ్యాయి , ఆవుని కాపాడు కోలేక పోతున్నాము. బజార్లో బీఫ్ ఎస్తివల్ జరుగుతున్నాది. మనం ఏమీ చేయ లేక పోతున్నాము. మన కల్చర్ దోపిడీకి గురి అయ్యింది .
ధనికుడు నెంబర్ 1 : అయితే ఏంటిరా సోట్టోడా ? నాకొడుకు అమెరికాలో ఉన్నాడు .
చేతులు లేనివాడు :  నాకొడుకు మిలటరీ కి పోయి చచ్చి పోయాడు , నీకొడుకు అమెరికా పోయి బతికి పోయాడు . ఒక్క గానొక్క కొడుకుని దగ్గ ఉంచుకోలేని నువ్వు నిర్భాగ్యుడివే కాదు దౌర్భాగ్యుడివి కూడా.
వాడు చెప్పినది ధనికుడు నెంబర్ 1 కి ఏమీ అర్ధం కాలేదు. 

1 comment:

  1. We have started our new telugu youtube channel : Garam chai .
    Please watch and subscribe our channel and encourage us too

    https://www.youtube.com/garamchai

    ReplyDelete