She became the youngest IAS without degree qualification.
" ఇంగ్లిష్ రాకున్నాఐ ఏ ఎస్ అయిపోయిన అమ్మాయి" అనే పోస్ట్ చదివినతరువాత నా స్పందన ఈ వ్యాసం రూపంలో తెలియజేస్తున్నాను . ఫోకస్ అంతా "ఇంగ్లిష్ రాకున్నా" అన్నదే. భారీ డిస్కౌంట్స్ , ఉచిత భోజనాలు బ్యాచ్, జర్నలిజం లో చేరి సమాజాన్ని మరింత బ్రష్టు పట్టిస్తున్నది, వార్తలు వ్రాసే పద్ధతి మునుపెన్నడూ లేని విధంగా దిగజారిపోయింది.
పక్కింటి పెళ్లీడు వచ్చిన అమ్మాయి కి పెళ్లవుతుంటే వారి బంధువుల 6 ఏళ్ళ పిల్ల " నాకూ పెళ్లి చెయ్యి" అని పేచీ పెట్టింది. తల్లి దండ్రులు అలానే అని ఆ చిన్న పిల్ల ని కూడా అలంకరించి నీకు కూడా పెళ్లి అన్నారు. ఇది విద్యారంగం లో నేటి పరిస్థితి , పక్కింటి వాళ్ళబ్బాయి చదువుకుని ఇంజనీరో, డాక్టరో అయితే సమగ్గా చదువు , రాత రాని మన అబ్బాయికి కూడా పేమెంట్ సీట్ తో ఇంజినీర్ లేదా డాక్టర్ చేస్తున్నాం. చదువు , అర్హత ఉందాలేదా అనవసరం. పోటీ అంతే . ఆకారం బ్రాండ్ అంతే లోపల సరుకు లేకపోయినా పర్వాలేదు . Forms exist functions vanish అంటే ఇదే .
మోడీ ప్రధానమంత్రి కావడం కోట్లమందికి ఎందుకు ఆనందాన్ని కలిగిస్తోంది ?
అవినీతి బంధుప్రీతి లేకుండా ధర్మబుద్ధి తో దేశభక్తితో సేవ చేయడం వల్లేకదా!
లక్షల కోట్లు మింగేసిన కులగులానంద చంద్ర కూడా పదవి సాధిచాడు కదా ?
మనిషి చేసే పని వల్లే వృత్తి.
ఒక పొలిస్ జేబులుకొడుతూ డబ్బు సంపాదిస్తుంటే అతడు దొంగే అవుతాడు. ( దొరకనంతవరకూ పోలీస్ గా చలామణి కావచ్చు)
ఒక దోపిడీ దారుడు ముఖ్యమంత్రి , లేదా మరో పదవి లో ఉండచ్చు అతడు దోపిడీ దొంగ గానే గుర్తింపు పొందుతాడు ( ఒక 5 సం .లు. పదవిలో వెలుగుతాడు) పదవి లేనప్పుడు తరువాత జైల్లో కూర్చున్నవాళ్ళు ఉన్నారు కదా.
కాషాయవస్త్రాలు కట్టుకున్నవారంతా హిందువులు కాలేరు ,పరీక్షలు పాసైన డిగ్రీలు సాధించిన ఉద్యోగస్తులు కాలేరు చదువుకున్నవారంతా విద్యావంతులు కారు. రూపం, స్తానం కోసం మాత్రమే పెనుగులాడకండి. పనిచేయలేనప్ప్పుడు అవి వృధా .IAS, IPS officers నిజాయతీ గా పని చేస్తే మన దేశం ఇలా ఉండదు.
విలాసవంతమైన జీవితం గడపడానికి తగిన ఉద్యోగాన్ని ఇస్తుంది అనే ఆశతో సాంకేతిక విద్యకి అర్రులు చాస్తున్నారు. నేను డాక్టర్ అవ్వాలి, ఇంజినీరు అవుతాను , ఐ ఏ ఎస్ ఆఫీసర్ అవుతాను అంటారు. అయ్యి ఏంచేస్తావు ? నేను పెద్ద పొజీషన్ లో ఉన్నాను అని బాగా డబ్బాకొట్టుకు తిరుగుతావా ? చదువు రాకున్నా డిగ్రీ కావాలి , పని చేతకాకున్నా పదవి కావాలి , అర్హత లేకున్నా అందలం కావాలి . అంతేగా ?