Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Sunday, March 29, 2020

ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బ్రతకచ్చా ?

కరోనా వచ్చింది, దేశం లాక్ డౌన్ లో పడింది.  ఎవరు  ఎంత కాలమో తెలియదు అనే వాతావరణం ఫెస్బుక్ లో బైట కూడా అలుముకుని ఉంది.  ఒక మిత్రుడు ఈ రకంగా పోస్ట్ పెట్టేడు "ఇప్పటికైనా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బ్రతకండి" ఈ పోస్ట్  పై నా మ్యూసింగ్. 

నాన్నా రాజా
"ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఆ స్టేజ్ అండ్ వుయ్ అర్ అల్ ఏక్టర్స్" అని షేక్స్ పియర్ చెప్పినట్టు , నువ్వు నేను అందరం నటులమే , స్టేజ్ అంటూ ఎక్కాక నటించక తప్పదు. నటనలో ఇన్వాల్వ్ అయిపోయి కొంతమంది నటిస్తున్నామనే సంగతి మర్చిపోతారు . ఎందుకు మర్చిపోతారంటే
మనకి నచ్చినట్టు మనం బతికితే పక్కవాడు మనని బత్కనివ్వడు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బ్రతకండి అనడం తప్పుకాదు కానీ పక్కవాడికి నచ్చినట్టు కూడా బతకాలి పెళ్ళాం లేనప్పుడు మనం రోజు బజారు కెళ్ళి పాలకోవా తెచ్చుకుని తింటే పర్వాలేదు , కానీ పాలకోవాలాంటి పిల్ల మనింటికి నాలుగు సార్లు వచ్చిందనుకోండి , మన పొజిషన్ ఏంటండీ? నిజంగా మనం తప్పుచేయలేదు ఏతప్పూ జరగలేదు అయినా బాజాలు తప్పవు.
ఎవడి పని వాడు చూసుకోడం తక్కువ ఇక్కడ.
అందుకని అబద్దాలు ఆడుతుంటాము. డబ్బుంటే కొంత నయం లేకుంటే జీవితం తో వాడు ఆటలు ఆదుకుంటాడు. వాడు ఆడుకుంటే పర్వాలేదు, మన జీవితం కూడా మనతో ఆటలు ఆడుకుంటుంది. అంటే మన అంతరాత్మ మనని షడాయించేస్తుంటుంది . అంచేతనాని మనతో మనం అబద్దాలు చెప్పి చెప్పి నిజమేదో మర్చిపోతాము.
జీవితంలో అబద్దాలు ఆడటం సహజం. అన్ని అబద్దాలు ఇతరులని మోసగిచడానికే కాదు ఇతరులని ఇంప్రెస్స్ చేయడం కోసం కొన్ని అబద్దాలు ఆడతారు , తమని తాము కాపాడుకోడం కోసం కొన్ని అబద్దాలు ఆడతారు. అందరు చదువు, డబ్బు సంపాదన , పెళ్లి, పిల్లలు ఇల్లు కారు ఈ చట్రంలో నే ఉంటూ నేను డిఫరెంట్ అంటారు. నవ్వు రాట్లా ? ఒకడు 8 PM ఒకడు Mansion House.

మనం ఇష్టం వచ్చినట్టు బ్రతకడం అని మనం ఎంత చెప్పినా  సమాజానికి కట్టుబడి బతకాల్సిందే  లేదా  చీకటి బతుకే. అంటే  ఎవరికీ తెలియ కుండా మనకి కావాల్సినట్టుగా ఉంటాము.   నేను అపార్ట్మెంట్ లో  ఐదవ అంతస్థు లో ఉంటాను. కారిడార్లో  చల్లగాలి వేస్తున్నప్పుడు చొక్కా లేకుండా తిరగాలని ఉంటుంది. ఐదవ అంతస్థు లో నాలుగు ఫ్లాట్స్ ఉన్నాయి , ఇతర స్త్రీలు ఉన్నపుడు ఆపని చేయలేను.  బాగా ఉదయం ఎవ్వరో లేవకముందు , లేదా రాత్రి అందరూ పడుకున్నాక (చొక్కా లేకుండా తిరగడం ) ఆ పని చేయగలను. 

రోడ్డు మీద ఇస్టమొచ్చిన విధిగా బైక్ నడపడం హార్న్ కొట్టడం  బార్ లేని వైన్ షాప్ వద్ద మందు కొట్టడం ఏవీ చేయలేము. క్యూ ఉన్నప్పుడు క్యూ  లో నిలబడాలి  ,  క్లాస్ లో టీచర్ ఉన్నప్పుడు లోపలి పోవడానికి " ఎక్క్యూస్ మీ"  అని వెయిట్ చేయాలి ఎవరి గదిలోకైనా  వెళ్ళేటప్పుడు తలుపు కొట్టి వెళ్ళాలి , ప్రతి చోటా పద్ధతులు అంటే సాంఘిక కట్టుబాట్లు ఉన్నాయి.  ఇవికాక వన్ వే , హెల్మెట్, సీట్ బెల్ట్ వంటి  అనేక చట్టానికి సంబందించిన రూల్స్ ఉన్నాయి. చట్టానికి సంబందించిన రూల్స్  ఉల్లంఘిస్తే శిక్ష తప్పదు.

బంధాలు అన్నీ వదిలేసుకుంటే మనకి కావాల్సి నట్టు ఉండవచ్చా ?
ఏ బంధాలు వదిలేసుకున్న సంఘము, చట్టము మారవు. రోడ్డు మీద , హోటల్ లోని బస్సు, ట్రైన్  లేదా విమానం లో ఉన్నా చట్టానికి అందుబాటులోనే ఉంటావు. ఏర్ హోస్టెస్ తో మిస్బిహేవ్ చేసినవారి గురించి వార్తల్లో చూసాం , చదివాం.  సరే చట్టాన్ని పాటిస్తాను కానీ సంఘాన్ని ఖాతరు  చేయను అనుకోడం అంత భ్రమ ఇంకొటిలేదు.  సుహాసిని , కుష్బూ ప్రేమేరీటల్  సెక్స్ 
గురించి ఇచ్చిన స్టేట్మెంట్స్ వల్ల ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు,  ఎందుకు  వెనక్కి తీసుకున్నారు? జయలలిత శశికళ చేసిన  స్నేహం పేరేంటి ?  జయలలిత డబ్బు పదవి ఉండి కూడా తన వ్యక్తిగత జీవితాన్ని ఎందుకు దాచింది ?  రష్యన్ టెన్నిస్ ప్లేయర్ మార్టినా నవ్రతాలోవా , ఆస్కార్ వైల్డ్ గురించి కొంచెం చదివినా  మీకు చాలా  విషయాలు తెలుస్తాయి.

చివరిగా  ప్రేమ , సెక్స్ , వ్యక్తిగత స్వేచ్ఛ అన్నీ చట్టానికి లోబడే ఉపయోగించుకోవాలి. లేకపోతే చిక్కులలో పడడమే కాకుండా ప్రాణాలు కోల్పోయేప్రమాదం ఉంది. సంఘాన్ని వదిలేసుకొని అడవుల్లోకి వెళ్ళిపోతే ఏంటి  నిత్యానందలాగా ఒక దీవి కొనుక్కుని పారిపోతే ఏంటి  ఇంకో పోస్ట్ లో చర్చిద్దాం. 

8 comments:

 1. అంతా జగన్నాటకమే!

  ReplyDelete
  Replies
  1. "ఇప్పటికైనా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బ్రతకండి" అనేది కష్టం అని రాసాను , కానీ ఎప్పటికైనా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బ్రతికే రోజు రావాలని కోరుకుంటున్నాను. అంటే ప్రజల ఆలోచనలో మార్పుతో ఇది సాధ్యం.

   Delete
 2. నచ్చినట్లు బతకొచ్చు కాకపోతే అన్ని బంధాలు వదిలేసుకుంటే చాలు

  ReplyDelete
 3. రామకృష్ణ గారు ఒక మిత్రుడు " ఇప్పటికైనా ఎవరికీ నచ్చినట్టు వాళ్లు బ్రతకండి " అని అదేదో మన నిర్ణయమే అన్నట్టు ఫెస్బుక్ లో రాస్తే ఇంత పోస్ట్ రాయాల్సి వచ్చింది . అతడి ఆలోచన ఎంత అపరిపక్వముగా ఉందొ కొంత మీరు అర్ధం చేసుకున్నారు అనుకుంటాను. మీరు పెట్టిన కామెంట్ చూసిన తర్వాత పోస్టును మరి కొంత పెంచాల్సిన అవసరం ఉందని, పోస్ట్ పెంచాను చదవగలరు.

  ReplyDelete
 4. This comment has been removed by the author.

  ReplyDelete
 5. అందరూ అబద్దం అనే ముసుగులో బతికేస్తున్నారు సార్.

  ReplyDelete