Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Sunday, April 5, 2020

How to deal with Facebook Friends

 ఒక ఫెస్బుక్ మిత్రుడు  ప్రభుత్వ ఆదాయం గురించి ఆదోళన చెందుతూ ప్రభుత్వానికి పన్నులు ముందుగా చెల్లించాలని ఆపోస్టు లో సూచించారు. ఆ మిత్రుడు పెట్టిన పోస్ట్ కు రెస్పాన్స్ ఇది. 

వ్యక్తి తనకు కలిగిన అనుభవాల మీద ఆధారపడి , అభిప్రయాలు నమ్మకాలు ఏర్పరుచుకుంటాడు.  తన నమ్మకాలను , అభిప్రాయాలను చెప్పే  హక్కు ప్రతివారికీ ఉంది. కానీ అభిప్రయాన్ని బట్టి తీర్పు చెప్పే హక్కు లేదు. ప్రభుత్వానికి పన్నులు ముందుగా చెల్లించాలని  చెప్పే పోస్ట్ మీద నా ఆలోచనలను తెలియజేస్తున్నాను.
నేను ప్రభుత్వ నుంచి ఒక్క గింజ తీసుకోలేదు రేషన్ కార్డు తీసుకోలేదు, ఏ పథకాలు ఎప్పుడూ వాడుకోలేదు , టాక్స్ లు కడుతూ పోయాను. కట్టిన టాక్స్ కి రోడ్డు లేక గుంతలలో బతుకు ఈడుస్తూ గడిపెను. రాత్రి కూడా చర్చ్ మైకుల వల్ల నిద్రలేక విలవిలా లాడెను. న్యాయం కోసం ప్రభుత్వం కోసం ప్రభుత్వాలని అర్ధించాను. రోడ్డు కావాలని ఆక్రోశించాను. అయినా ప్రభుత్వం వినిపియించుకోలేదు. నా డబ్బు నా శ్రమ దానం తో గుంతలు పూడుకుని చిరిగిన చొక్కా మాసికాలు వేసుకుని తొడుక్కున్నటు , సర్దుకుపోయాను.

చట్టం, న్యాయం , మానవతా ధర్మం , ఏమీలేకుండా దోచుకునే ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు మీరు. రాష్ డ్రైవింగ్, హెలోజెన్ హెడ్లైట్స్ , పబ్లిక్ న్యూసెన్స్ , సినీప్లెస్ ల్లో అక్రమ ధరలు, అక్రమ పార్కింగ్ ఫీజు , రోడ్డు ఆక్యుపేషన్స్ ఏమీ పట్టించుకోని ప్రభుత్వం తరుపున మాట్లాడుతున్నారు మీరు. నిజంగా ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించాలి కానీ వాస్తవానికి పక్కవాడిని ప్రశ్నించే అంత దమ్ము కూడా మనకి ఉండవు. అన్యాయాన్ని ఫెస్బుక్ లో ప్రశ్నించడం చాలా సులభం నిజం గా తమ జీవితం లో అన్యాయం జరుగుతున్నప్పుడు వెక్కివెక్కి చీకట్లో ఏడ్చేవారే ఎక్కువ. ఫెస్బుక్లో అనేకమంది నీతులు చెపుతారు.  మంచి చేయమని నీతులు చెప్పడం కాదు మీరు చేసి చూపండి. 
నిజానికి ప్రభుత్వం అంటూ ఏదీ ఉండదు. బలిసిన ఒక సామాజిక వర్గం కులం పేరుతో , తాయిలాలతో అధికారాన్నిహస్తగతం చేసుకుని ఆపై రాష్ట్ర ఖజానాని , వనరులని దోచుకోవడమే. మన రాష్ట్రానికి సమ్మందించి నంతవరుకు ఇది పచ్చి నిజం. ఇది మీకు తెలియకకాదు. అయినా మంచి చెబితే బాగుంటుంది అనుకున్నారు చెప్పేరు, మంచి చేస్తే ఇంకా బాగుంటుంది. సామాజిక భాద్యత ఫెస్బుక్లో పోస్టుతో సరిపెట్టద్దు.

వీర హిందుత్వ పోస్ట్లు షేర్ చేసుకునే వారు చాలామంది నిజమైన సమస్యలు వచ్చినప్పుడు మంచం కింద దూరేవారే. ఈ మధ్య లో " మీ ఇంటిపక్కనే చర్చ్ లు మైక్స్ తో వేధిస్తున్నాయా మాకు చెప్పండి అని పోస్ట్లు పెట్టారు. నేను అనేక సార్లు కాల్ చేస్తే అతనికి ఆన్సర్ చేయడానికి రెండు రోజులు పట్టింది. వాట్స్ ఆప్ లో వివరాలు పంపి చూడమని నాలుగు సార్లు కాల్ చేసి అలిసిపోయి వదిలేసాను. తన ఇంటివద్ద మైకుల సమస్య ఉందని చెప్పే ఒక హిందూ సింహం , నేను పోలీసులకి ఫోన్ చేసి ఇస్తే జడిసిపోయి కట్ చేసేసాడు.

నేను మైకులకి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి నైతిక మద్దత్తు తెలిపినవారు బహు స్వల్పం , నాతో కలిసొచ్చిన వారు ఎవరూ లేరు. లాయర్లు కూడా , డబ్బు ఇస్తామన్న నావల్ల కాదు అని చెప్పిన వారే. సామాజిక చైతన్యం లేనినాడు సామాజిక స్పృహ దండగ. సింహాల్లా నటించేవారు ఎక్కువ. ( నిజమైన సింహాలు తక్కువ ). నిజమైన సింహాలు ఉంటె సమాజం ఇలా ఉండదు.

3 comments:

  1. చాలా బాగ చెప్పారు సార్!, నేను కూడా ప్రభుత్వ పథకాలు ఎప్పుడు ఉపయోగించుకోలేదు.కానీ మనం ప్రత్యక్షంగా కొన్ని పన్నులు,పరోక్షంగా కొన్ని పన్నులు ప్రభుత్వానికి కడుతూనే ఉన్నాము.కానీ ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్న కూడా వాళ్లు చేసేది ఒక్కటే.పేదవారికి పధకాల రూపంలో తాయిలాలు వెయ్యటం, వాళ్ళ వర్గం వారికి, ధనవంతులకు కొమ్ము కాయడం.
    ఇది జగమెరిగిన సత్యం.ఎవరి పబ్బం వాళ్ళు గడుపుకోవటమే.ప్రశ్నించే ధైర్యం చాలా తక్కువ మందికి ఉంటుంది.ఎవరన్నా ప్రశ్నించినా వాళ్ళని పిచ్చి వాళ్ళలా చూస్తుంది ఈ సమాజం.

    ReplyDelete
  2. All facts about the politicians😠

    ReplyDelete