Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Thursday, September 16, 2021

ఇక నావల్ల కాదు

భారత వర్ష అనే బంగారు ఉంగరంలో పొదగబడిన  ఉపమాన రత్నాలను తీసి ఒక చోటకు చేర్చడం అంటే దుస్సాహసమే. భారతవర్షాలో ఉపమానాలు ఏరి ఏరి అలిసిపోయానుఆపేస్తున్నాను. ఇక నావల్ల కాదు.  

భారతవర్షలో  2000 ఉపమానాలు ఉండొచ్చు.  కొన్ని ఇక్కడ మీకోసం

నీలి గగనమందు పాలపొంగులు వంటి మేఘముల గుండా క్రిందకు జారుతున్న విమానము చూపరులకు  అప్సరవలెవిమానాశ్రయము తపమాచరించు ఋషివలె నగుపించెను.

విమాన గవాక్షము నుండి చూచుచున్న యమునకు కొచ్చి విమానాశ్రయము కోనేట తేలుచున్న తామర పుష్పమువలె, మహాబ్ధివంటి  విశాల హరిత పచ్చికలో తేలు చిన్ని ఓఁడ వలె మనోజ్ఞముగా కనిపించెను


యమున దృష్టి ఎగిరిపోవుచున్న సంగీత సంకేతములున్న కాగితములపై పడెను. పూరెక్కల వలే నున్న కాగితములను చూచి  అవి  నోరు తెరచి పాడుచున్నట్లనిపించి  మీనాక్షి లో సరస్వతికి మనసులో నమోవాక్కములర్పించుచూ శిల్పంవలె నిలిచి పోయెను.  మీనాక్షి మందగమనమున పియానో వద్దకు పోయి రాగములు పలికించుచూ గానము చేయుచుండగా ఆమె చుట్టూ ఉన్న విద్యుత్ దీపములమధ్య ఆమె ఒక విద్యుద్దీపమువలె మెరియుచూ రసరాగ సంగీత వెల్లువలోకి తానేపాటై ప్రవహించుచూ యమున అనే ప్రేమ కడలి  తనను అక్కున జేర్చుకొని ఓదార్చుచున్న అనుభూతి పొందెను

ఆహా! ఎంత ఆహ్లాదంగాయున్నవీ పూలదండలవంటి పద్యములు, భావ పరిమళములందునా మనసు ఊయలలూగుచున్నది కదా!” 


నిగనిగ లాడు పసిమి దేహము, నవనవ లాడు పూరేకుల పెదవులు, దంతములు మిలమిల మెరియు ముత్యాల సరులు, గలగల పారు సెలయేరు నగవులు, మిరపపండు రవిక, కుంభస్తనద్వయము, చూచుకములును దాచలేని జాలువారు పారదర్శక రజత శ్వేత చేలము, చిత్తిని చిట్టి చేఁతలు  మేనిమెరుపులు చూడ నీలాకాశము నేల వాలినట్లున్నది.

ఘనస్తనముల జంబునేత్రి మీనాక్షి దీర్ఘ కుంతలములను సడలించ కీకారణ్యమును తలపించు యా నిబిడ కేశములు సైకత పిరుదులపై బడి నర్తించుచుండగా గజయాన మందగమనమున మిద్దెపై హిరణ్య సమయమున సంచరించు చుండెను

శిల్ప నిర్మాణ  సౌష్టవమును కలిగి  సాహిత్య సంగీత కళాహారముల కాంతులీను యోష,   త్రివేణీ సంగమ ఘోషను ముహుర్భాషా శ్వాస లో నిలిపి భారత రాజధాని యందు సాహిత్య జ్ఞాన జిజ్ఞాసులకు  సోపానములవలె  జిగజిగలాడుజియ్యవలె, సనాతని విశ్వరూపము వలె   వెలుగుచున్న భూరి నగరు యొకటి కోపర్నికస్ మార్గమందు కళాదేవళ ధ్వజ స్తంభమువలె నిలిచియుండెను


లేలేత సూర్యకిరణములు  లేలెమ్మని జగతిని తట్టి లేపుచున్నవిఆశిరుడు శిశిర  కాంతను తన లంబ కిరణములతో తాకుచూ  హిమ  బిందువులతో తడిసిన ఆమె దేహమును ముద్దాడు చుండెను

ఆర్యాణి, కల్యాణి, కాత్యాయణి, నీహారమే, నిహారమై, ప్రకృతికి హారమై, జీవులకు  ఆహారమై  నొప్పుచున్నది కదా!"

చంద్రు కాంతిలో  జలరుహమ్ముల (కలువపువ్వుల)  మేని కాంతులు మెరియుచుండ   జోడు గుఱ్ఱములవలె అతివలిరువరు నిలిచి అతిథుల నాహ్వానించుచుండిరి.   

 విదిష  తన పుష్పాలంకృత   ద్రాష్టిగ కేశములను పొడవాటి పూల జెడను చేతపూని నిలవగాఎక్కుపెట్టిన శృంగార క్షిపణి వలె కనిపించుచుండెను.

నిహారస్నాన మాచరించిన ప్రకృతికాంత  ఆ  లోకచక్షు పసిడి  రేఖలందు తన అందములనా రబెట్టుకొని  నిగనిగ మెరియుచున్నది. 

"శిరము మబ్బులందు సరము మిద్దెనందు గల రాజగృహమును కాంచిన ఈ రాజహంస ఏల నేల వాలెననిపించును. 

మన మేనమామ,  చందమామ ముక్కొకటి  తెగిపడెనేమో!  

వన్నెలు దోచిన యామిని నందినిని  మధురస్మిత మందహాసమును గాంచి వీరులు వివశులవ్వగా  విరులు అసూయచెందినవి. 

రాధామనోహర పుష్పములు పిల్లగాలికి తలలు ఊపుచూ  పిళ్ళారిగీతమేదియో  పాడుచుండెను. 

2 comments:

  1. I never see the beauty of radha Manoharan until I read Bharatavarsha. I saw Radhamanoharam as ordinary flowers. But those flowers are looking so beautiful now.

    ReplyDelete
  2. Such beautiful flowers are my favorite flowers

    ReplyDelete