Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Saturday, November 6, 2021

విశ్వమానవుని వీరంగం

అడుగడుగునా అలంకారాలు

తల తిప్పితే తేనెలొలుకు చందాలు అడుగు తీసి అడుగేస్తే  వర్షంలా కురిసే వర్ణనలు. వెరసి భారతవర్ష లో అడుగడుగునా  ఉర్రూతలూపు కవనాలే, శృంగార సుమపరిమళాలే.  ఇది నిజమా అతిశయోక్తా?                   

                                    

మొట్ట మొదటి పేజీలో 

భారతవర్ష ఆనంద నిలయం ముంగిట నిలిచి తలతిప్పి  రాధా మనోహరం పుష్పాలను చూస్తాడు  అంతే  అల్ప కాంతి కే మురిసారందాలు నిగ్గరగా  అని పుష్పాలను కన్నె పిల్లల్తో పోల్చి శార్దూల పద్యం , తర్వాత  తల పైకెత్తి ఆకాశంలో చంద్రుడిని చూస్తాడు అంతే మళ్ళీ మొదలౌతుంది శృంగార కవనం

చంద్రుని  చూసిన భారతవర్ష కి  గ్రీకు పురాణములో ఎండిమియన్ గుర్తు కొస్తాడు.  ఎండిమియన్ను  మోహించి రాసలీలలో సమ్మోహ పరిచిన సెలీన్ నీవేకదా!  ఔరా ! ఇందులకే గదా  ఆకాశములోనే కాక  భారతీయ, గ్రీక్ , ఆంగ్ల పురాణములందు వెలుగొందుచున్నావు. “ఔరౌరా !!  ఆంగ్ల ప్రణయ  కవి జాన్ కీట్స్  ఎండిమియన్  పద్య కావ్యమును  నాలుగు పుస్తకములు   వ్రాసినాడనిన   నీ రూప లావణ్యము చూసి  ఎంత మురిసెనోకదా.

మరుసటి అధ్యాయంలో

పిలవని పార్టీ కార్యక్రమానికి పోవుచున్న అరుణతార  మనో వేదన

“నేడెందుకో మనసు వికలముగా నున్నది, వర్షమెందులకో తీతువుపిట్టరాయబారము వలె నున్నది, ఇది ఎట్టి దుశ్శకునమో కదా! “

 ఘోర పరాభవం చవిచూసి పార్టీ నుండి వచ్చుచున్నప్పుడు

అవమానించబడి మనస్తాపం చెంది చెప్పిన మాటలుదయ్యపుతాడిని (ఏడాదిపొడుగున గలలువేసి పిందె పాటుననే రాల్చివేయు తాటిచెట్టు; తప్పిదారి ఒకకాయ నిలిచినా, దానిలో ముంజకట్టి యుండదు) సాకిన ఫలసాయ మీరీతినే యుండునుకదా! “

అరుణ తార ఆత్మహత్యా ప్రయత్నం నుంచి విరమింపజేసి మంచిమాటలతో ఆమె బాధను మాన్పిన  పాత్రికేయ మిత్రుడు దుర్గాప్రసాద్ పట్ల అరుణ తార మనోభావాల వర్ణన

అరుణ పెదవులపై అప్రయత్నముగా చిరునవ్వు వెలసినది. ఆమె ఎదలో అవ్యక్త మధుర రాగమేదియో పలికినది. అది స్నేహారాగమై అంతర్వాహిని వలె  దేహమంతయూ ప్రాకి చిత్తవృత్తి(మూడ్) నున్నతి జేసినది.

 

మరుసటి అధ్యాయంలో

బొంబాయిలో జెట్ ఎయిర్ వేస్ విమానం దిగిన అరుణతార రూప లావణ్య వర్ణన

నాట్యధాటికి  చిక్కిన నడుము, ముద్దుమోము కళ్ళలో చురుకుతనము, ఆహార్యమందు అహంకారముతో, జక్కన  చెక్కిన తీరైన శిల్పమువలే చూచువారికితరలివెడలుచున్నతెలుగువారితరతరాల వారసత్వ సంపదలా కనిపించును

విమానాశ్రయం నుండి ఒబెరాయ్ హోటల్ లో జరిగే టెలిఫిల్మ్స్ ఉత్సవాల సమావేశ మందిరము లో 

విద్యుత్దీపకాంతిలో దగద్దగా యమానమై ప్రకాశించుచున్న సమావేశ మందిరమున ఉన్నత రంగస్థలం పై ఆసీనులై విద్యుత్ దీపములతో పోటీపడుచున్న తారలందరూ అరుణతార ప్రవేశముతో వెలవెలపోయిరి.   వారందరి మధ్యలో ఆమె తారల మధ్య చంద్రునివలె కనిపించెను.

కొద్ది క్షణాలు తరువాత ఆమె పై ప్రశంసల వర్ష కురిసిన తరువాత

విద్యాస్పర్థలో గౌడడిండిమ భట్టును ఓడించి, అతని కంచు ఢక్కను పగుల గొట్టించిన శ్రీనాధుని విజయ గర్వము అనేక మేటి నర్తకీమణుల శృంగార నాట్య భంగిమల  భంగపరిచి వారి స్థానములను కొల్లగొట్టిన ఆమె ముఖమునందు మురారిని కొంగున గట్టుకొన్న సత్యభామ దర్పము తొణికిసలాడ కాంతులీనుచున్న ఆమె ముఖమునే అందరూ చూచుచుండిరి.

తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే పదసంపద

భారత వర్ష ఠాణాలో  విదిష ఫిర్యాదును స్వీకరించక నిరుత్సాహ పరుచుచున్న పోలీసధికారితో

మీరు శల్యకవానాఖున్యాయమును పాటించుచున్నారు.

"చుంచెలుక పరుండియున్నవారి పాదములను  నొప్పింపక కరుచుట”  

నీవు  సైంధవోదకన్యాయము ను పాటించ వలెను ఎచ్చట ఓడినామో అచ్చటనే నెగ్గవలె.

“సముద్రపు  నీరు ఆవిరై , మేఘముగా మారి వర్షించి సముద్రములో కలియుట.”

నేను చదువజాలను కానీ చెప్పినచో  వినుటకు బాగున్నదిలకుమ అనగా. అగస్త్యఅదియునూ ఒక సుగుణమే, నేటివారికి పుస్తకపఠనమన్న అత్తిపూచినట్టేకోటికొక్కడు పుస్తకపఠనము నందు ఆశక్తి కనబరుచును

కోటేశ్వరావు ఏల వచ్చెను? అని అరుణ తార  లకుమను అడగగానీకివన్నీ ఎవరు జెప్పినారు?”

అరుణ తార  ఎవడో వల్లకాట్లో రామనాథాయ! నిజమా అబద్ధమా?”


చారిత్రిక, సాహిత్య, పురాణ, ఇతిహాస, వైమానిక,  ఆధ్యాత్మిక   మంజూషం.

“1940 దంకెక్ అనే ఫ్రెంచ్ పట్టణములో జర్మన్ సేన బ్రిటిష్ సేనను అడ్డగించి వెనక్కి పంపింది. అడాల్ఫ్ హిట్లర్బ్లిట్స్ క్రీగ్ఒక తరహా మెరుపుదాడి, పథకం వల్ల 68,000 బ్రిటిష్ సైనికులు చనిపోయారు అందులో మా తాతగారు ఉన్నారని భావన

1320 నుండి గుజారాత్ రాష్ట్రము సూరత్ పట్టణమున కటాలాన్ డొమెనికన్ మిషనరీచే ప్రారంభమైన కిరస్తానీ మతమార్పిడులకు బ్రిటిషుపాలన  అగ్నికి ఆజ్యము పోసినట్టు అయినది 

1862లో మతమార్పిడి పొందియున్నాడు. పాపము తొరుదత్ తల్లి ఎంతో కలత చెందెను. ఎంతో వేదన చెందిననూ  తరువాత భర్తనే అనుసరించెను. తొరుదత్ తాత గారు రసమే దత్ హిందూ స్కూల్ స్థాపకులు కీర్తికెక్కిన విద్యావేత్త, ఆమె దాయాదుఁడు రొమేష్(రమేష్ కాదు)చందర్ దత్ చరిత్రకారుడు, రచయిత మరియు పాలనాధికారి  అనిన   . .ఎస్అధికారి  ఇటువంటి విద్యాధికులైన వారిని బ్రిటిష్ వారు అధికారబలంతో సునాయాసముగా మతము మార్పిడి చేసెడివారు

మా తాతగారు సైన్యమునందు పనిచేసి రెండవ ప్రపంచ యుద్దములో పాల్గొనిరి. భారత సైనికులు రెండు లక్షల యాబదివేలమంది పాల్గొనగా ఎనబదివేలమందికి పైగా వీరమరణము పొందిరి కాలమందు సైనికులు గోతులులో  రోజులతరబడి కూర్చొని ఉండెడివారు. వారు ఏదైనా ఆరోగ్య నెపమున సెలవడిగిన కాల్చి చెంపెడివారు. బయటకుపోవుటకు అవకాశములేక  సైనికులు నిస్పృహ తో తుపాకీ గొట్టమును నోటిలో పేల్చుకుని  సెలవు తీసుకొనెడివారులెనార్డో డావించి, లిప్పి , సార్జెంట్ వంటి చిత్రకారుల కథలు. 

సాహిత్య

సుందరి అపరిక్షితకరకం అపరిక్షితకరకం అనెను. విషయము అర్ధమైన తులశమ్మగారు మౌనము వహిం చిరి.

విష్ణుశర్మ అనే సంస్కృత పండితుడు పంచతంత్రంమను అడవి జంతువులతో, కూడిన నీతి కధలను వ్రాయగా పరవస్తు చిన్నయ సూరి అనే పండితుడు వాటిని తెలుగులోకనువదించెను. పంచ తంత్రములు అనగా ఐదు తంత్రములుమిత్ర లాభము, మిత్ర భేదము, అపరిక్షితకరకం, లబ్దప్రణాసంకాకోలుకీయం. అపరిక్షితకరకం నందు పరాధికారము పైవేసుకొనరాదను కథ చెప్పబడెనుగాడిద తనది కాని పనిని చేసి ప్రాణములమీదికి తెచ్చుకొనెను.  అనవసరమైన విషయములందు జోక్యం కల్పించు కొనవలదని తల్లిని పరోక్షంగా హెచ్చరించుటయేఅపరిక్షితకరకంఅనుమాటకర్థము.


జెఫ్రీ షాజర్ కేంట్రబెరి టేల్స్ 24 కథల సంకలనం.  లండన్కు  90 మైళ్ళ దూరంలో ఉన్న సేంట్ థామస్ బెకెట్ (కేంట్రబెరి చర్చి)కు వెళ్లే 31 మంది తీర్ధ యాత్రికులు లండన్ లో టాబార్డ్ సత్రంలో బసచేస్తారు. కాలక్షేపం కొరకు యాత్రికులంతా ఒకొక్క కథ చెప్పాలని షాజర్ ఒక కథల పోటీ పెడతాడు. నెగ్గిన వారికి బహుమతిగా తిరుగు ప్రయాణంలో ఉచితభోజనం లభిస్తుందని చెపుతాడుముప్పది మంది తీర్ధయాత్రీకులు ఒక్కొక్కరు నాలుగు కథలు ( వెళ్ళు నప్పుడు రెండు, వచ్చునప్పుడు రెండు) చెప్పునని తలచి 120 కథలు వ్రాయవలెనని భావించెనుకానీ ఇరువది నలుగురు మాత్రమే కథలు చెప్పిరి. ఇందు అసంపూర్తి కధలు కూడా కలవు. వంటవాడి కథ అసంపూర్తి కథ.  తాగిన మత్తులో గుర్రం మీద నుంచి క్రిందపడిపోడం వల్ల సగం కథే చెప్తాడు కథను షాజార్ పూర్తి చేయలేదు.


ధూర్జటి మొదట రసికుడై భోగాల నుభవించి, రాజాశ్రయ సౌఖ్యాలన్నీ చవిచూసి, ముదిమి ముసిరే వేళకు మోక్షకామియై శివభక్తిలో మునిగి  శ్రీకాళహస్తి మాహాత్మ్యము, శ్రీకాళహస్తీశ్వర శతకమును  భక్త్యావేశంలో రచించినట్లువృద్ధనారీ పతివ్రత అన్నట్లు  నీవు యవ్వనంలో అన్ని సుఖములు అనుభవించి, ఇప్పుడు నా జీవితము పాడగునని వంకలు పెట్టుచున్నావు." అని తల్లి పై విరుచుకు పడెను.

లియో టాల్ స్టాయ్ విరచితమైన అన్నాకరేనీనా  వేయి పుటల  గ్రంధము , ఫ్లోబే  అను ప్రఖ్యాత ఫ్రెంచ్ రచయిత వ్రాసిన మదామ్ బొవారి....

 

పురాణ - ఇతిహాస

గరుడపురాణం: “వైతరిణీనది ఎచటకలదు?” అని దారినబోయెడి  దానయ్యడుగగా బ్రహ్మగారు ఇట్లు జెప్పిరివైతరణీ నది యమపురి దక్షిణ ద్వార మునకు 86 వేల ఆమడల(12,55,000కి.మీ)  దూరంలో  ఉంది. మరణానంతరం  జీవుడు  మార్గాన్ని ఒక రాత్రిఒక పగలు (మొత్తం ఒక్క రోజు కాలంలో) 247 ఆమడల(3600 కిలోమీటర్లు)  చొప్పున నడుస్తూ సౌమ్యము, సౌరి, నాగేంద్ర భవనము, గంధర్వ, శైలాగను, క్రౌంచ,క్రూర, విచిత్ర భవన, బహ్వా  పద, దుఃఖద, నానాక్రంద, సుతప్త, రౌద్ర, వయోవర్షణ, శీతాడ్య,  బహుభీతి అనే పదహారు పురములను దాటుకుని యమపురికి చేరుతాడు.

ఇదే 13 రోజుల సంతాపం వెనకున్న కథ. ఇదే ఈస్ట్రన్ ఆర్థోడాక్ చర్చ్ నమ్మకంప్రపంచవ్యాప్తంగా నమ్మకం ఇస్లాం, సిక్కు ధర్మాల్లో కూడా కని పించును. ధర్మాల్లో 13 రోజులు ప్రార్ధనలు చేయుదురు. ఆత్మకు ఓదార్పు నివ్వటమే ప్రార్థనల ఉద్దేశ్యం అయినప్పటికీ ఆత్మ 40 రోజులు తాను నివసించిన ప్రదేశాల్లో వదిలివెళ్లలేక సంచరించుచుండును. ఆత్మలు తమ ఇళ్ళని గుర్తించడానికి వీలుగా రష్యాలో చనిపోయిన వారి ఇంటికి చెట్ల కొమ్మలు పెట్టుచుందురు. మృతుడికి, రొట్టె ,నీళ్లు పెట్టడంపక్క వేయడం కూడా చేసెదరు. 40 రోజు మృతుడి వస్తువులని అన్నీ దానం చేసి అతడి గురుతులన్నీ చెరిపేసి విందు చేసుకుంటారుదీనర్ధమేమనగా ఇంక ఇంటికి రావద్దు, నిన్ను స్వాగతించలేము.

విశ్వామిత్రుని  తపోభంగమొనర్చవలెనని  రంభ పదివేల ఏళ్ల పాటు శిలలా ఉండవలసి వచ్చెను. భర్తల ఎదుట, గొప్ప ధర్మవేత్తలుగా పేరు పొందిన వారు చూస్తుండగానే, గుడ్డలు లాగివేయబడే హీనాతిహీనమైన పరాభవం ద్రౌపదికి జరిగినదిసుందరి వైమానికం,  విదిష ఆధ్యాత్మికం 

1 comment:

  1. Adyantam okka bhagam kuda vadalakunda chadivanu. Chivari bhagam varaku kuda Vidisha, Varsha kalavali ani manasphoortiga korukunnanu.Kanee Vidisha antardhanam ayyindi. Aadhyatmika sukham dakkinanduku santoshinchalo, bhoutika sukham dakkananduku bhadha padalo ardham kaledu.

    ReplyDelete