Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Sunday, June 19, 2022

Bharatavarsha won World record

భారతవర్ష నేడు ప్రపంచ ఖ్యాతిని పొందింది. నాకు విశ్వఖ్యాతిని తెచ్చిపెట్టింది. వరల్డ్ వైడ్ బుక్ అఫ్ రికార్డ్స్ లో నాకు చోటు దక్కింది. తెలుగులో అతిపెద్ద ప్రబంధం మరియు  అతితక్కువకాలంలో రచించబడిన అతిపెద్ద నవలగా  ప్రపంచ రికార్డ్ పొందిన తరువాత నా మనసు కి   సంతోషం కలగలేదు.  ఎందుకంటే  అత్యధికులు నిజాన్ని అంగీకరించలేరు , నిజాన్ని గౌరవించలేరు. బాహ్య ఆకర్షణలు చూసి మాత్రమే  

ది  హిందూ వాళ్ళు  మేము గిన్నిస్ సంస్థ అయితే నే ప్రచురిస్తాము అన్నారు. ఇండియా లో సంస్థలు ఇస్తే మేము పట్టించుకోము అన్నారు. వరల్డ్ వైడ్ బుక్ అఫ్ రికార్డ్స్  అమెరికా లండన్ లో ఉంది ఆస్ట్రేలియాలో కూడా ఉంది.  WBR అంతర్జాతీయ సంస్థ అని చెప్పినా, "దాన్ని స్థాపించినది భారతీయులు  అది ఢిల్లీ కి చెందినదికనుక ప్రచురించడం కుదరదు."  అని చెప్పారు.    ది  హిందూ  కూడా  భారతదేశ సంస్థే అని ఆ పని చేస్తున్న వ్యక్తి విజయవాడవాడని మర్చి పోయి మాట్లాడుతున్నాడు.  ఇక్కడ ప్రజలు  ప్రపంచ రికార్డుని మాత్రమే చూస్తున్నారు.  

తెలుగు లో అతిపెద్ద గ్రంధం వ్రాసాను అని చెపితే స్పందించిన వారికంటే మొఖం చాటేసినవారే ఎక్కువ, కళ్ళు మూసుకున్నవారు, చెవులు మూసుకున్నవారు ఎక్కువ. ప్రపంచ రికార్డ్ రాకముందు, గ్రంధాన్ని చదివినవారు తక్కువ చదివి అభినందించినవారు ఇంకా తక్కువ.  తెల్లవాడు ఏం చెబితే అదేవేదం.  సినిమావాడు ఏం చెబితే అదే ధర్మం.  ఇంకా అజ్ఞానంలో బానిసత్వం లోనే  ఉన్నాం.    

భారతవర్ష అంటే భారతదేశం , ఇందులో ఉండేది భారత ధర్మం.

ఈ గ్రంథ రచనకు 2లక్షలకు పైగా తెలుగు పదాలు వాడబడ్డాయి.

(ఒక్క ఇంగ్లిష్ పదం లేకుండా 2నిమిషాలు మాట్లాడు చూదాం అంటుంటాం.)

1265 పేజీల పూర్తి తెలుగు వ్రాసాను. ఇంగ్లిష్ లేకుండా 1265 తెలుగు పదాలు వ్రాసి చూడు తెలుస్తుంది. తెలుగు భాష  గద్య పద్యాలతో  ఎంతో హృద్యంగా భారతవర్ష గ్రంధాన్ని తీర్చి దిద్దింది. గ్రంధం మొత్తం చదవకపోయినా  కొంత చదివి భాషని మెచ్చుకున్నా    ఈ నిజాన్ని తెలుసుకుని  నా శ్రమని మెచ్చుకున్నా బాగుంటుంది కానీ ఇక్కడ రికార్డు లకి మొక్కుతారు  గిన్నిస్ సంస్థ కి సాష్టాంగ పడతారు. 

హిందూ ధర్మ పరిరక్షకులమని చెప్పుకునే వారు ఎవ్వరూ భారతవర్ష అనే గ్రంధాన్ని ఎన్నడూ చదవి మెచ్చుకోలేదు. దానికి కూడా కారణం ఉంది వారు యాత్రికంగా హిందుత్వాన్ని పొగుడుతూ క్రిష్టియన్స్ ని తిడుతూ , వారిని వారు మోసగించుకుంటూ బ్రతుకుతున్నారు.   కోట్లాదిమంది తెలుగు భాషాభిమానులున్న మన తెలుగురాష్ట్రాలలో ఒక యాభైమంది  మాత్రం భారతవర్షకి ఎడంచేత్తో ఒక లైక్ కొట్టి పడేసారు. అదీ ప్రపంచ రికార్డ్ వచ్చిన తరువాత. భారతవర్ష నేడు ప్రపంచ ఖ్యాతిని పొందిందని తెలిసి  ఒక వ్యక్తి బాగా ఈర్ష్యపడి విమర్శించడమే కాక  నా వెనుక అనవసరమైన మాటలు అంటున్నాడు. మీరు ఈర్ష్య పడడంలో అర్ధం ఉండాలి. మీరు అంత  కృషిచేసి , పెద్ద రచన చేసి గుర్తింపు రాకపోతే బాధపడాలి. 

రెండు వందలు సొనెట్స్ ఆరు నెలలలో వ్రాస్తే ఒకే ఒక వ్యక్తి మెచ్చుకున్నారు ఆయన పేరు ఆర్ ఎస్  ( ఆర్ శ్రీనివిసరావు గారు ) ఆయన భారతవర్ష కి ప్రపంచ గుర్తింపురాకముందు కూడా చదివి మంచి  స్పందన ఇచ్చారు. అటువంటి వారు వర్ధిల్లుగాక! భారతావని వెలుగు గాక!! 

No comments:

Post a Comment