డబ్బు చేసుకున్న ఒక నటుడి కి అతడి వారసులకు, జబ్బబు చేసిన మీడియా చేసే నిత్య పూజలే మనకి న్యూస్. వాళ్లు వాళ్ళ కుటుంబం అంతా హీరోలే వయసుమళ్లినా యువకులే ఎక్కడికెళ్లినా ఏం తిన్న ఏం , కొన్న అంతా సెన్సేషన్. ఈ హీరో కొడుకును చూడండి ఆచొక్కా ఖరీదెంతో తెలుసా? తెలిస్తే షాక్ ! బూటు ఖరీదెంతో తెలుసా ? తెలిస్తే గూండాగిపోతుంది. ఆ హీరో కూతురు చూడండి , ఆమెకు ఇది ఎన్నో పెళ్ళో తెలుసా? మొదటి మొగుడు ఏంచేస్తున్నాడో తెలుసా? రెండోమొగుడు ఎందుకొదిలేశాడో తెలుసా ? అంతే కాదండీ ఒక నటి లేదా నటుడి కూతురు కొత్త చెడ్డి కొనుక్కున్న , చిరిగిపోయిన, చెడ్డి జారిపోయిన ఆదెవడితోనో పారిపోయినా , పెళ్లి చేసుకున్నా , విడాకులు తీసుకున్నా అంతా సెన్సేషన్. అంతా మనం తెలుసుకుతీరాల్సిందే, గుర్తుంచుకు తీరాల్సిందే న్యూస్. మన బ్రెయిన్స్లో కూరేస్తారు. మన బ్రైన్స్ చెత్తకుప్పలు కదా!
మన పిల్లలకి బ్రెయిన్ ఖాళీ ఉండటంలేదు. అందుకే వాళ్ళ బుర్రలకి ఏం ఎక్కడం లేదు. పదేళ్లు చదువుకున్నా ఇంగ్లీషులో ఒక్క వాక్యం తిన్నగా రాయలేరు. చిన్న స్పెల్లింగ్ కూడా గుర్తుండదు. మాతృ బాషా రాకపో యినా దానిమీద చిన్న చూపు. వీళ్ళ దృష్టిలో, ఉపాధ్యాయులు పండితులు , శాస్త్రవేత్తలకంటే కంటే సినిమా నటులే గొప్ప. దేశభక్తి కంటే కుల గజ్జి గొప్పదని వీళ్ళభావన. దేవుణ్ణి కూడా ఓట్లేసి నిలబెట్టినట్టు పోజు.
ప్రపంచం గురించి నాకెందుకు ? దేశచరిత్ర నాకెందుకు ? అంటారు మాతృ బాష నాకెందుకు. దేశభక్తి నాకెందుకు ? నా కులాన్ని నేను ప్రేమిస్తాను. నా టెక్నికల్ స్కిల్స్ , సాంకేతిక నైపుణ్యం నాకు చాలు , భాషా నైపుణ్యం నాకెందుకు ? భాషా జ్ఞానం లేకపోయినా పర్వాలేదు, విదేశాలు వెళ్లి డబ్బు సంపాదిస్తాను. ఇదే ప్రస్థాతుం చదువు కుంటున్న(కొంటున్న) వాళ్ళ అజెండా . నువ్వు మనిషిగా బ్రతకడానికి పుట్టేవు డబ్బు సంపాదించే యంత్రంగా పుట్టలేదు.
భాషాజ్ఞానం లేకపోతే గుమ్మం దాటలేవు, దాటినా నిత్య నరకమే.
No comments:
Post a Comment