Saturday, December 17, 2022

సమస్య - చిన్న కథ

 ఏడు చేపల కథ లాంటి కథ


ఏం నాయినా ఇంగ్లీష్ ఎందుకు రాదు అంటే టీచర్ చెప్పలేదు. ఏం టీచర్ భాష బాగా ఎందుకు చెప్పలేదు అంటే .. మేనేజిమెంట్ భాషలు బాగా చెప్పనివ్వలేదు .. ఏం మేనేజిమెంట్ టీచర్ని ఎందుకు చెప్పనివ్వలేదు అంటే..


ఇంటర్వ్యూయర్:   భాషాజ్ఞానం ఎందుకు రాలేదు?

Gen Z : నేను సినిమాలు చూడగలను. పుస్తకాలు చదవలేను 

ఇంటర్వ్యూయర్: :  పుస్తకాలు ఎందుకు చదవలేవు ?

Gen Z : చదివేటంత   భాష లేదు, ఆత్మవిశ్వాసం లేదు,

ఇంటర్వ్యూయర్:  భాష ఎందుకులేదు స్కూల్ కి వెళ్ళేవుకదా ?

Gen Z : టీచర్ అంత  భాష చెప్పలేదు 

ఇంటర్వ్యూర్ : టీచర్, టీచర్ అంత భాష  ఎందుకు చెప్పలేదు ?

తీర్చని స్కూల్ ని నిందిస్తున్నావా ?  మీ టీచర్ నంబర్ ఇయ్యి ఒక్కసారి మాట్లాడతాను.  

ఇంటర్వ్యూర్ :  హలొ టీచర్ !  మీ స్టూడెంట్ జాబ్ ఇంటర్వ్యూ కి వచ్చాడు .

టీచర్ :  అతని లాంగ్వేజ్ ఎలా ఉందో చెప్పాలనుకుంటున్నారు అంతేనా ! 

జెన్ జీ స్టూడెంట్స్ గురించి మీకు తెల్సిందేకదా!

ఇంటర్వ్యూర్  :  ప్లుయంట్ గా మాట్లాడే అంత  భాష  టీచర్  చెప్పలేదు అంటున్నాడు 

 జెన్ జీ అంతా  స్మార్ట్ వర్క్ చేస్తారండి . ఎగ్జామ్స్ కి రెండురోజులముండు చదివి పాసైపోతారు .

ఇంటర్వ్యూర్ :  అతడికి  కనీసం ఆంగ్ల భాషాజ్ఞానం కూడా లేదండి. 

టీచర్:  మేము తోవమన్నవే తోమావండీ  

ఇంటర్వ్యూర్ :  నాకు అర్థం కాలేదు తోమడవేంటండీ ?!

టీచర్:  ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ తోవమన్నారు.   అవే  తోవాము  ఆంటే  మేనేజ్మెంట్   చెప్పనివ్వలేదు. అని అర్థం చేసుకోవాలి కదా !

 ఇంటర్వ్యూయర్:  మేనేజ్మెంట్,  మేనేజ్మెంట్, మీ స్టూడెంట్ కి  మాతృబాష కూడా రాదండీ   

మేనేజ్మెంట్:   అవును రాదండీ. రాకూడదనే   ఇంగ్లిష్ మీడియంలో చేర్చారు 

 ఇంటర్వ్యూయర్:  మరి ఇంగ్లిష్ బాగా చెప్పకపోయారా ?

మేనేజ్మెంట్:   తల్లితండ్రులు మార్కులకోసం పీకమీద కూర్చుంటే , మాదా  తప్పు.




6 comments:

  1. A small story with a strong message

    ReplyDelete
  2. Thoughtful content because every action is linking to present society education system. Parents have marks, management have money finally students haven't clarity about knowledge.

    ReplyDelete

Philosophical - verse

 దేహమంటే దాహము — దాహము వలెనే దేహము తనివితీరని దాహము — తనువుల కొరకే మోహము దేహమంటే దాహము — కవ్వించు కామోత్సాహము  కన్నీటితో సహవాసము కనిపించని ద...