పొత్తు కాపురములో పొత్తుగుడుప,
గుత్తపు కాపురాన కొత్త గిత్త బోయి
పుత్తడి అందాలు వాడంత వెలుగు
నిదుర లేపగ కోవెల గంట ,
మేలుకు లేచెను కొత్త జంట
చెంత నున్న చింతపల్లెలో
సంతకు పోయే ముచ్చట్లో
వాలికి చిమ్మే వేళ వేళా కోయిలేల
కొంగులో నువ్వు దాచిన సిగ్గులు
గాజుల సవ్వడే గుండెలో గీతలు
మాటలకందని మమతల ముత్యాలు
పద్యంలో గ్రామీణ తెలుగు పదాలైన "గిత్త", "పొత్తు", "గుత్తపు కాపురం" వంటి పదాలు కొత్త దాంపత్య జీవితం యొక్క ఆప్యాయతను చక్కగా ప్రతిబింబిస్తున్నాయి. కొత్త వధువు తన భర్తతో కలిసి కొత్త ఇంటిలో అడుగుపెడుతుంది. కొత్త కాపురం ప్రారంభమవుతుంది. భార్యాభర్తల మధ్య ఏర్పడిన సాన్నిహిత్యం, అనురాగం, పరస్పర అవగాహన ఆ ఇంటిని ఆప్యాయతతో నింపుతాయి. "పొత్తుగుడుప" అనే పదం ఇక్కడ శారీరక సమీపతకన్నా ఎక్కువగా హృదయాల కలయిక, దాంపత్య సఖ్యతను సూచిస్తోంది. "గుత్తపు కాపురం" అంటే కొత్తగా ఏర్పడిన చిన్న కుటుంబం. ఆ కొత్త ఇంటిలో వధువు తన పుత్తడి వంటి అందం, మృదుత్వం, ప్రేమతో ఇంటినంతా వెలిగిస్తుంది.
అరటి
తోట గెలలతో గుత్తంగా నిండేను మొత్తం
వరటి
లా వచ్చిన
నా నవ వధువు చేతిలో అత్తం
తరగలా పై
టెగిర పైర గాలిలో నీ నా భిలో
వృత్తం
సరగ మరిగేను కనులలో కి చేరి
నా చిత్తం
నీ కాను మధ్యలో కలువలు విచ్చి విరియగా
నా కనులలో వర్ణంబులొలికి మనసు అరయగా
నా కలలలో
శృంగార పుంజములు చెలరవా
మది
మందిరము లో మధుర రాగాలు
నిండవా
అన్ను
కొన్న తామర
శోభ లు తటాక మంత
నిండగా
దున్నల
బండి నాపితి దుక్కి దున్ని దారికి వారగా
మిన్నుల
మించిన కన్నులలో
కలువల రంగులు చేరవా
అన్ను కొనదా నా మనసు నీ ఎన్నుల వన్నెలు ఎసలారగా
ఆకుమడిలో
నీ తలపులతోనే నాకు పరాకు
మరో మడిలో నువ్వు మామిడేసిన మారాకు
మేకులాడి సోకు నా చికాకులనేకు
ఆకుల్లో ఆకు నీ సోకు
తమలపాకు
భావవ్యాఖ్య
ఆకుమడిలో నీ తలపులతోనే నాకు పరాకు - వరి నారు పెరిగిన పచ్చని ఆకుమడిని చూస్తే అతనికి తన భార్య జ్ఞాపకాలు వస్తున్నాయి. ఆ తలపులతో అతని మనసు పరాకుగా (పరధ్యానంగా) మారుతోంది. పని మీద ఏకాగ్రత నిలవడం లేదు.
మరో మడిలో నువ్వు మామిడేసిన మారాకు- మరో చోట కనిపించిన లేత చిగురాకు (మారాకు) కూడా అతనికి తన భార్యనే గుర్తుచేస్తోంది. ఆ చిగురులోని సుకుమార త్వం, తాజాదనం, నవ వధువు యౌవనాన్ని అతనికి గుర్తు చేస్తున్నా యి. మేకులాడి సోకు నా చికాకులనేకు నీ అందం, నీ జ్ఞాపకం నా మనసును తాకి ప్రేమవేదనను, కలవరాన్ని మరింత పెంచుతున్నాయి. ఆకుల్లో ఆకు నీ సోకు తమలపాకుప్రకృతిలో ఎన్నో ఆకులు ఉన్నా, తమలపాకు ఎలా ప్రత్యేకమో, నీవు కూడా స్త్రీలందరిలో అంతే ప్రత్యేకమైనదానివి. నేను చూసే ప్రతి ఆకు నీ రూపాన్నే గుర్తు చేస్తున్నా, వాటన్నిటిలోనూ నీవే శ్రేష్ఠమైన రూపం.
అంతర్లీన
భావం
ఇక్కడ
రైతు కొత్తగా
పెళ్లైన అతను తన పొలాల్లో
పనిచేస్తున్నా, అతని మనసంతా కొత్త
వధువు తలపులతో నిండి ఉంది. అందుకే ప్రకృతిలో కనిపించే ప్రతి పచ్చదనంలోనూ ఆమెనే చూస్తున్నాడు.
మండుటెండలో మామిడి నీడ,
మల్లె పరిమళం ఇంటి వీధి.
చేతిలో చేయి వేసి నడిచే,
కొత్త దంపతుల నవ్వుల జాడ.
కొలనునిండా తామర పూలు,
కొమ్మల నిండా కోయిల పాటలు.
పొలాల నిండా సీతాకోకలు,
పక్కనే రెపరెప కొత్తకోకలు.
కొత్తకోకల వైపు మనసు పోయి
అరతంగి ఉన్నద ని మరచిపోయి
భర్త శిలలాగా బిగిసిపోగా
చూపు కొరడాతో చాచి కొట్టే
నీటి
ముత్యాలు బారు జుట్టంతా
కారగా
కోటి
రత్నాల వాలు కళ్ళల్లో
పారగా
అత్తరు
మత్తుగొని కొత్తదంపతులు
కొత్తరాగాలు
పాడి కోలాటమాడరా
స్నానం అనంతరం సుగంధ పరిమళాలతో అలంకరించుకున్న కొత్త దంపతుల కళ్లలో ప్రేమ వెలుగులు మెరిసిపోతున్నాయి. వారి హృదయాల్లోని ఆనందం సంగీతంలా ఉప్పొంగి, వారు పరస్పర సాన్నిహిత్యాన్ని ఉత్సవంలా ఆస్వాదిస్తున్నారు. ఇక్కడ "కొత్త రాగములు" అనేది కొత్త దాంపత్య జీవితంలోని కొత్త అనుభూతులకు, "కోలాటమాడిరి" అనేది వారి ఉల్లాసభరితమైన ప్రేమానురాగానికి ప్రతీక. మొత్తానికి, ఇది కొత్త దంపతుల ఆనందం, సౌందర్యం, ప్రేమ, మరియు దాంపత్య మాధుర్యాన్ని సున్నితమైన రూపకాలతో చిత్రించిన శృంగారరస ప్రధాన పద్యం.
వెండి కంచములో బంగారు చేయి
దండిగా గాజులలో సవ్వడి చేయ,
ఎంత మొండైనను మొగుడు వెయ్యి
మోహాలు పారి రాహుగ్రహణము వీడు॥
వెండి పళ్లెంలో భోజనం వడ్డిస్తూ, బంగారు వర్ణంలా మెరిసే తన చేతులతో భార్య ప్రేమగా సేవ చేస్తుంది. ఆమె చేతులలోని గాజుల గలగల సవ్వడి ఇంటంతా మధుర సంగీతంలా వినిపిస్తుంది. ఎంత మొండితనం, కోపం కలిగిన భర్త అయినా ఆ ప్రేమాభిమానాలకు కరిగిపోతాడు. అతని మనసును ఆవరించిన కోపం అనే రాహుగ్రహణం తొలగిపోతుంది. వెయ్యి మోహాలు, ప్రేమ భావాలు అతని హృదయంలో మళ్లీ వెల్లివిరుస్తాయి.
ఇక్కడ "రాహుగ్రహణము" అనేది కోపం, అలకలకు రూపకం. గాజుల సవ్వడి భార్య ప్రేమకు, సౌమ్యతకు ప్రతీక. కవి చెప్పదలచుకున్నది ఏమిటంటే, దాంపత్య జీవితంలో ప్రేమతో కూడిన చిన్న చిన్న ఆప్యాయతలు కూడా పెద్ద కోపాలను కరిగించగలవు.
దంచుచు
నిలచుని వాకిట వనిత
మంచము నేయు మగని చూచి
కొంచెము నవ్వగ వాలుకనుల
కుంచము మల్లెలు రాలెను
ఇంటి వాకిట్లో నిలబడి ఏదో పనిలో (ధాన్యం దంచుతూ) ఉన్న యువతి, తన భర్త మంచం నేస్తూ (అల్లుతూ) ఉండటాన్ని చూసింది. అతనిని చూడగానే ఆమె ముఖంపై చిరునవ్వు వికసించింది. ఆ నవ్వుతో పాటు ఆమె వాలుకన్నులు ప్రేమగా అతనివైపు వాలాయి. ఆ నవ్వులోని మాధుర్యం, ఆమె చూపులోని ప్రేమ, ఆమె కన్నులలోని ఆహ్వానం అతనికి"కుంచెడు మల్లెలు దొరికినంత ఆనందాన్ని" ఇచ్చాయి. ఆ నవ్వు అతని మనసును పరవశింపజేసింది. ఈ సందర్భంలో "మల్లెలు రాలును" అనేది ఒక ఉత్ప్రేక్ష గా చూడవచ్చు. నిజంగా పూలు రాలలేదు; ఆమె నవ్వు నుంచే మల్లెపూలు జాలువారినట్లుగా కవి ఊహించాడు.
మాసి
వచ్చిన మగడు మాపటి వేళకు
చూసి చేసెను సైగ తగని సిగ్గుల
బాలకు
వాలు కన్నుల వెన్నెల వాకిట నిండగా
ఆలుమగల మనసులు మల్లెలై పూచెను
రోజంతా
పనులు ముగించుకొని సాయంకాలం ఇంటికి వచ్చిన భర్త, సిగ్గుతో నిండి న తన భార్యను చూసి
ప్రేమతో ఒక సైగ చేశాడు.
ఆమె వాలుకన్నుల నుంచి వెన్నెలలాంటి ప్రేమ కాంతి వాకిటంతా నింపింది. ఆ ప్రేమానురాగ వాతావర ణంలో
భార్యాభర్తల మనసులు మల్లెపూలవలె వికసించి పరిమళించాయి.
కాంతుని
గాంచిన కాంత చెక్కిళ్లు అద్దాలు
అద్దాల్లో
నెఱియు కాంతుని కాంచి
కాంతుడు
కోరె కాంతాతో సరసాలు
దొరకునా
సరసాలు అద్దంపు బిళ్ళపై॥
ఆవాలు
చేతిలో పట్టుకోవాలంటే జారిపోతూ చెల్లాచెదురైపోతాయి. అలాగే భర్త చేరువ కావాలని
ప్రయత్నించగానే, సిగ్గుతో మునిగిపోయిన భార్య అతని చేతికి చిక్కకుండా
తప్పించుకుంటూ ఉంటుంది.
దొరయు
సరసాలు జూసి సిగ్గు జుట్టి
దొరకైనా
దొరక జాణ
జవరాలు జార
మెరిసేటి
నీడలే వరుని మురిపిం
చు
అందని
వలపులే అందెలై మో గు
చేతికి చిక్కినట్లు కనిపించే ఆవాలు జారిపోయినట్లే, సిగ్గుతో నిండిన యువతి భర్తకు అందినట్లే కనిపించి మళ్లీ తప్పించుకుంటుంది. ఆమె రూపపు నీడలే వరుణ్ణి (భర్తను) మురిపిస్తున్నాయి. ఇంకా పొందని ప్రేమలే అతని హృదయంలో అందెల మోగుల్లా మ్రోగుతున్నాయి. అందని కోరికలే గజ్జెల మనసులో మోగుతున్నాయ
పూలలో దాగిన పుప్పొడి
రాగాలు
నీ బుగ్గల్లో చేరెనా అరుణ
రాగాలు
చేలల్లో
దాగినా పసిడి
రాగాలు
నీ మేని ఛాయలో నీలిరాగాలు
పూలు
కనిపిస్తే చాలు
నీ మనసు వికసించు
పూలల్లో
నిను చూడ నామనసు పులకించు
పూలన్నీ
పాడేను పుప్పొడి
రాగాలు
పూలల్లో
దాగె మన
వలపు రాగాలు
నీలం ఆకాశం లేదా సముద్రం యొక్క అనంతమైన లోతును, ప్రశాంతతను పోలి ఉండే మనోహరమైన సంగీతాన్ని ఇది సూచిస్తుంది.
పాశ్చాత్య సంగీతంలో ప్రసిద్ధి చెందిన 'బ్లూస్' తరహాలో, జీవనంలోని బాధను లేదా విరహాన్ని ప్రతిబింబించే గీతాలను నీలిరాగంగా అభివర్ణించడం కద్దు.
బయటకు కనిపించకపోయినా, హృదయపు లోతుల్లో స్థిరంగా వినిపించే ఒక అనిర్వచనీయమైన రాగంగా కూడా కవులు దీన్ని వర్ణిస్తారు.
అలమగా చక్కటి గుమ్మఒక్కటి చిక్కటి కాఫీ నిచ్చి
చిటికవేయంగా పమ్ముకొను కోర్కెలు కెలికి కేరింతలు
పెట్ట గతి తప్పిన పతిని వారించ తరమే వారజాక్షిన్
వర్ణింప చింతలేని జీవిత మాధుర్యము
చిదాత్మ జేర్చె కారుణ్య భావమున్
నిండు చందమామని నూతులోపారేయకు
సిగలో పెట్టుకుంటాను అంటే విన్నావు కావ్
రేపటికి పెరుగన్నంలోకని ఫ్రిడ్జ్ లో పెట్టేశావ్
పాలకోవాలాంటి నన్ను పక్కన పడేసావ్
పెళ్ళాం తో పేచీ పెట్టుకుంటే గోచీ ఊడిపోతుంది
తర్వాత తూచ్ అంటే తుఫాన్ ఆగుతుందా
రాజీ పడకపోతే పీజీ చేసావని చూడను
పేజీ చింపేస్తాను , మావిడి పండు కావాలని
మీ ఆవిడను పీడించక , మావిడతాండ్ర తిను
లేదా తాట తీసి తాంబూలమిస్తా
సాహిత్యం అనేది ఒక కళ, ఇది అందరికి చేతకాదు. ఈ రోజుల్లో మనుషులకి ఇలాంటివి ఉన్నాయని కూడా సరిగ్గా తెలవటం లేదు. మీరు ఈలాంటి సాహిత్యాలు మరెన్నో చేస్తూ ఈ కళ చనిపోకుండా కాపాడతారని కోరుకుంటున్నాం గురువు గారు.
ReplyDeleteSuper sir marala na padava tharagathi Telugu mastaru gurthuku vachharu
ReplyDeleteNice sir. Sahithyam chaalaa bagundhi.
ReplyDelete