Polyglot is a person who speaks many languages.
At least a person should speak three languages to be called a Polyglot.
At least a person should speak three languages to be called a Polyglot.
Speaking at National Level seminar on French and German Classic litt. |
లక్షలాది కి స్ఫూర్తి గా నిలిచిన లక్ష్య సాధకుడు
.
జాతీయ స్థాయిలో తెలుగోడి ప్రతిభ.
.
పాలీగ్లాట్ అవ్వడం ఎలా ? ఫ్రమ్ ది డైరీ అఫ్ పూలబాల.
పోలీగ్లాట్ జీవితం ఎలా ఉంటుంది ?
ఫ్రెంచ్ మరియు జర్మన్ క్లాసిక్ సాహిత్యంపై జాతీయ స్థాయి సెమినార్ 2012లో ఎర్నాకులంలో సెప్టెంబర్ 14 మరియు 15 తేదీలలో జరిగింది.
ఫ్రెంచ్ మరియు జర్మన్ క్లాసిక్ లిటరేచర్ గురించి మాట్లాడేందుకు నన్ను ఎర్నాకులం ఆహ్వానించారు. నేను కేరళలోని అలువాలో జరిగిన జాతీయ స్థాయి సెమినార్ లో రిసోర్స్ పర్సన్‌గా పాల్గొన్నాను.
జాతీయ స్థాయి సెమినార్‌లో మాట్లాడేందుకు నాకు ఆహ్వానం అందిన తర్వాత నేను ఒక నెలపాటు బోధనను నిలిపివేసి, ( సంపాదన ఆపేసి ) ఫ్రెంచ్ మరియు జర్మన్ భాషలలోని క్లాసిక్ సాహిత్యాన్ని అధ్యయనం చేయడానికి పూర్తిగా అంకితమయ్యాను.
ఒక గదికి పరిమితమై, కాలం మరిచి
ఫ్రెంచ్ క్లాసిక్ లిటిరేచర్ నుంచి లె మిజరబుల్స్, ది లిటిల్ ప్రిన్స్, ది స్ట్రేంజర్, ది త్రీ మస్కటీర్స్ వంటి క్లాసిక్‌లతో పాటు ఇతర పుస్తకాలను ఎంచుకున్నాను. సాహిత్యానికి నోబుల్ బహుమతిని గెలుచుకున్న కొన్ని జర్మన్ పుస్తకాలను ఎంచుకున్నాను. జర్మన్ భాష నుండి నేను ది సారోస్ ఆఫ్ యంగ్ వెర్థర్, డెత్ ఇన్ వెనిస్ థామస్ మాన్, హర్మన్ హెస్స రాసిన సిద్ధార్థ మరియు హెర్తా ముల్లర్ రచించిన అటెమ్స్ షోకెల్ వంటి నోబెల్ బహుమతి పొందిన పుస్తకాలను ఎంచుకున్నాను. ఎప్పుడైనా అద్దం లో చూసుకుంటే పిచ్చి జుట్టు గెడ్డంతో మరో వ్యక్తి ఎవరో అనిపించేది.
ఎందుకొచ్చినది ఈ అవస్థ అని, ఎంత సంపాదించేస్తావు అని కొంత మంది ఎద్దేవా చేశారు ? మాట్లాడినందుకు గంటకు ఇచ్చేది గంటకు ఐదు వేలు నువ్వు కోల్పోయేది ఒక నెల్లాళ్ళ సంపాదన. అని లెక్కలు వేసి బుద్ధి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు.
కానీ అనుకున్నది సాధించాను. విదేశీ రిపోర్టర్స్ ముందు వారి భాషలో క్లాసిక్ లిటిరేచర్ పై మాట్లాడి వారి అభినందనలు అందుకోడమే కాకుండా ఫ్రెంచ్ కోర్స్కు డైరెక్టర్ గా నియమించబడ్డాను. నాకే కాక నాభార్య కు కూడా టికెట్స్ పంపారు యూనివర్సిటీ వారు. మంచి హోటల్ లో బస కి ఏర్పాటు చేశారు. ఊరంతా తిప్పి చూపారు. ఆ తరువాత అనేక కంపెనీలకు, ప్రభుత్వానికి కూడా ఫ్రెంచ్ అనువాదకుడిగా ఆహ్వానాలు అందుకున్నాను.
పాలీగ్లాట్ అని పిలవడానికి కనీసం ఒక వ్యక్తి మూడు భాషలు మాట్లాడాలి.
చాలా మందికి ఫారిన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనే కోరిక ఉంటుంది. కొంతమంది ఆర్థిక కారణాల వల్ల ప్రారంభించలేరు. కొందరు వ్యక్తులు ప్రారంభిస్తారు కానీ ఆత్మవిశ్వాసం కొరవడి, మరికొందరు కష్టపడలేక , ఇంకొందరు ఇతర జీవిత సమస్యలు చుట్టముట్టడం వల్ల ఆపేస్తారు. నేర్చుకోడం ప్రారంభించినవారిలో 5 నుంచి 10 శాతం విదేశీ భాషను నేర్చుకోగలుగుతారు. అన్నిటికంటే ముఖ్యంగా నేర్చుకోవడానికి జీవితసమస్యలని పక్కకునెట్టి ప్రాక్టీస్ చేయడానికి ప్రతిక్షణం అంకితం ఆయే శక్తి కావాలి.
1. స్ఫూర్తి అనివార్యం
మీకు ఒక రోల్ మోడల్ కూడా కావాలి రోల్ మోడల్ గొప్ప బలం. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మీకు తెలుసు. ఆయనే నాకు స్ఫూర్తి. ప్రధానమంత్రిగా చాలా బిజీగా ఉన్నప్పుడు కూడా ఆయన సాహిత్యాభిమానాన్ని పక్కన పెట్టలేదు. అతను వేయిపడగలు (తెలుగు)ని హిందీలోకి "సహస్త్ర ఫన్"గా అనువదించాడు,
2. పెద్ద గ్రంధం చదివితే అదే చెప్పలేని బలం ఆత్మ విశ్వాసం
నేను చదివిన అతిపెద్ద గ్రంధం వేయిపడగలు అప్పటివరకు 300 నుంచి 400 పేజీల నవలలు మాత్రమే చదివే వాడిని. అంతకన్నా పెద్దపుస్తకాన్ని ముట్టేవాడినికాదు. అది చదివిన తరువాత నా మీద పఠనా శక్తి మీద నమ్మకం పెరిగింది .
3. నేను అదే యేయి పడగలను ఫ్రెంచ్‌లోకి అనువదించాను( కానీ కొన్ని కారణాలవల్ల ముద్రించలేకపోయాను.) అనువాదం కోసం ఆ కథనంతా మూడు సార్లు చదివాను. రివ్యూ వ్రాయడం కూడా అందులో భాగమే.
4. రచనలు జ్ఞానాన్ని పెంచుతాయి
నా ప్రయాణంలో మైలురాళ్లు నా పుస్తకాలు. పుస్తక రచన జ్ఞానాన్ని పది రెట్లు చేస్తుంది. పుస్తకాన్ని రాస్తున్నామంటే నేర్చుకోడానికి మనకి మనం అవకాశం ఇచ్చు కున్నట్టే , దారి చేసుకున్నట్టే. నేను బోధించే అన్ని విదేశీ భాషలపై కనీసం 4 పుస్తకాలు వ్రాసాను.
పోలీ గ్లాట్ అనేది డిగ్రీ కాదు ప్రతిభ. అది నిరాంతక సాధనతో నే సాధ్యం
Now I am able to speak 6 foreign languages; French, German, Spanish, Italian and Japanese. I have started a Foreign languages Institute in Vijayawada to teach foreign languages to interested learners. I never had anybody to guide me in those days. I fought all by myself but today you can access foreign languages more easily . All you need is passion guidance and training are readily available.