చదువు ఎందుకురా అంటే జ్ఞానం కోసం అంటాడు పైకి. అంతా అంతా కపటం. బట్టి పట్టయినా, కాపీ కొట్టినా పైరవీలు చేసైనా ధ్రువీకరణ పత్రాల మీదే దృష్టి అంతా. కాకి కళ్ళు ఎప్పుడూ ఎండికలమీదే ముష్టివాడి కళ్ళు ఎప్పుడూ ముద్దమీదే తెలుగువాడి కళ్ళు కెప్పుడూ ఉద్యోగం మీదే .
క. ముష్టికి వచ్చిన మనిషి
కిష్టము ఏమ ను నుముద్ద కేడ్చును గానీ
ఇష్టము లేనిది జ్ఞానము
స్పష్టము మార్కుల ఏడ్తురు చదువరు లిట్లే
నువ్వు తినడానికి ఉండి చదువుకుంటూ లేదా కులవృత్తి ఉండి చదువుకుంటుంటే అప్పుడు చెప్పు చదువు జ్ఞానం కోసం అని, పొట్టతిప్పలని జ్ఞానం కోసం అని చెప్పినా ఎవరు నమ్ముతారు ?
డబ్బులకోసం చెత్త సినిమాలు తీస్తూ సినిమా కళ అని చెపితే నమ్ముతారా?
చెత్త సినిమాలు తీయడం కంటే పిల్లలని చెత్త వెధవల్లా తయారు చేయడం ఇంకా తప్పు.
చెడ్డ తల్లి తండ్రులు చెత్త చదువు వెరసి చెత్త వెధవలను తయారు చేసే చదువు తయారు చేస్తున్నారు .
ఇంగ్లీష్ తెలుగు కంటే గొప్ప బాష అని చెప్పడం ఏంటి ?
ఇంగ్లిష్ చదువుకోకపోతే ఉద్యాగాలు రావని బెదిరింపు ఏంటి ?
అసలే మిచదువుకున్న ఉద్యాగాలు రాడంలేదంటూ ఏడుస్తూ
ఇంగ్లిష్ మీడియంలో చదువుకోవాలి అని చంపడం ఎందుకు ?