Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Friday, November 24, 2017

The most suitable personality to Indian politics

సెక్రటరీ గా చేరి మిస్ట్రెస్ గా మారి భర్త ఉండగానే వేరొకరితో పిల్లలని కని అతనితోనే సెటిల్ అయిపోయి అక్రమ సంపాదనతో, అడ్డగోలు చదువుతో, పీ. హెచ్ . డీ  కొట్టేసి, వేరొక స్త్రీ తల పగల గొట్టి కోర్టు కేసు ని మాఫీ చేయించుకున్న  గ్రేస్.


Grace Ntombizodwa was born in Benoni, South Africa to migrant parents as the fourth of five children in the family. She married air force pilot Stanley Goreraza and they had a son, Russell Goreraza, born 1984.

While working as secretary to the president, Robert Mugabe, she became his mistress while still married to Stanley Goreraza – and had two children, Bona, named after Mugabe's mother, and Robert Peter, Jr.

After the death of Mugabe's first wife, Sally Hayfron, the couple were married in an extravagant Catholic Mass, titled the "Wedding of the Century" by the Zimbabwe press. At the time of their marriage Grace Mugabe was 31 and Robert Mugabe was 72 years old. In 1997, she gave birth to the couple's third child, Chatunga Berlamine Mugabe.

Grace Mugabe is known for her lavish lifestyle, and Western media has nicknamed her "Gucci Grace". The Daily Telegraph called her "notorious at home for her profligacy" in coverage of a 2003 trip to Paris, during which she was reported as spending US$120,000) in a short shopping spree.

Grace acquired property holdings in Hong Kong, including a diamond cutting business and a property . Her name was herd  along with high-ranking Zimbabwean government officials and well-connected elites among those  generating millions of dollars in personal income by hiring teams of diggers to hand-extract diamonds from the Chiadzwa mine in eastern Zimbabwe.

Controversy ensued when Grace Mugabe was given a doctoral degree in sociology in September 2014 from the University of Zimbabwe two months after entering the programme. She was awarded the degree by her husband and University Chancellor Robert Mugabe. Her doctoral thesis is not available in the university archive and she has faced calls to return her PhD.

Grace is said to have assaulted a 20-year-old model at a hotel in Johannesburg. Grace hit the women and her sons, with an extension rod causing various injuries including one on forehead. After charges were laid by Engels for "assault with intent to cause grievous bodily harm", Grace was due to appear at a Johannesburg court on 15 August 2017, but did not. she was subsequently granted diplomatic immunity.

Sunday, August 20, 2017

My Visits to Schools - Colleges - Universities

నిరుద్యోగం, పేదరికం, ఉగ్రవాదం నేటి నిజమైన సమస్యలు కావు. సచ్చీలత ప్రతిభావంతులైన నాయకులు లేక పోవడమే నేటి సమస్య. అదే నేటి అవసరం. అందుకు అందరూ మంచి సాహిత్యం, చరిత్ర తప్పక చదవాలి. కాలేజీలు అందుకు విద్యార్థులను ప్రోత్సహించాలి లేకుంటే కాశ్మీర్లో మద్రసాలకీ ఆంధ్రప్రదేశ్ లో కాలేజీలకు తేడా ఉండదు . 

Numerous educational institutions have invited me to interact with their students in my career.  I have never missed any of these invitations as they are great opportunities to illuminate the students. 

Recently I have visited


Vignan University - Guntur

Govt. HighSchool - Chilakaluripeta

Prabhas Degree College - Vijayawada


పుస్తక పఠనం ఆలోచనా  శక్తిని పరిశీలనా శక్తి ని పెంచుతుంది, వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుందివ్యక్తిత్వం లేని వాడు దేశానికి ప్రమాదం, సమాజానికి చీడపురుఫు. భాష బాగా నేర్చుకోపోతే, సాహిత్యం, చరిత్ర  చదవకపోతే ప్రమాదమేమీలేదు, సాంకేతిక విద్య నేర్చుకుంటే  ఉద్యోగం వస్తుంది అనుకుంటే నీ అంత మూర్ఖుడు ఇంకొకడుండడు. కవిత్వంలో సున్నితత్వాన్ని నింపి మనసులను రంజింపజేసి, ప్రపంచాన్ని  పరవశింపజేసి  ఎందరో సుకవులు  దేశ బావుటాను గగన వీధుల్లో రెపరెప లాడించారు. సున్నితత్వం లేకపోతే కవిత్వం ఉండదు,  మానవత్వం ఉండదు. 

సాహిత్యం చదవకపోతే జాబ్స్ రావా అని వాదించే మూర్ఖపు గాడిదలు ఈ దేశంలో ఎక్కువయిపోవడం మనదురదృష్టం.  ఇదెలా ఉందంటే జాతీయగీతం పాడుతున్నప్పుడు లేచి నిలబడితేనే గౌరవంఉన్నట్లా? అనిఅడిగినట్లుంది.  సాహిత్యం లేక పోతే సమాజం కాదు స్మశానం ఉంటుంది.  అతి తెలివిపరులు అవకాశవాదులు దేశాన్ని నాశనం చేస్తుంటే భాష రాక ఏమీ చదువుకోలేక, ఆలోచనా జ్ఞానం లేక ఇంగితజ్ఞానం నశించి విద్యార్థులు వాళ్ళని వాళ్ళు నాశనం చేసుకుంటు న్నారు. విదేశాలు ఎందుకు అభివృద్ధి చెందాయో, ఎలా ఉంటాయో కూడా మనం తెలుసుకోవాలి.  కేవలం టెక్నాలజీతోనే దేశం అభివృధి చెందిపోతుందని ఒక బుద్ధి హీనుడు మాత్రమే నమ్ముతాడు. మంచి నాయకులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు  పౌరులు కూడా అవసరం.  

మంచి నాయకులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు  పౌరులు  ప్రతి దేశానికి  అవసరం.    జర్మనీలో పల్లెటూర్లలో రోడ్లు మన ఇంట్లో మార్బల్ ఫ్లోరింగ్ మాదిరిగా ఉంటాయి. రోడ్డు మీద మజ్జిగ అన్నం తినవచ్చు.  జర్మన్స్ ఫ్రెంచ్ వాళ్ళు,  వాళ్ళ భాష తప్ప ఇంకొక భాష కి స్పందించరు. ఫ్రెంచ్ జర్మన్స్ లాగా మనం కూడా తెలుగుని గౌరవించుకుంటే మం తెలుగు కూడా వెలుగుతుంది.  అమెరికా లో  టీచర్స్ ,  సైన్టిస్ట్స్  వి ఐ పీ లు.  ఇండియా లో రాజకీయ నాయకులు , రౌడీలు , సినిమా హీరోలు వి ఐ పీ లు.  కొడుకులకు మంత్రి పదవులు కట్టపెట్టడం , వాళ్ళకి  రోడ్ల మీదే రేప్స్ చేసుకునేంత స్వచ్ఛ ఇవ్వడం ఇదే వీరు చేసే సేవ.  కాలు పట్టుకునే మంత్రి ఒకడు, జుట్టు పట్టుకునే మంత్రి ఒకడు . ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా అనే సామెత ఉంది. 

 అన్నం బొట్లవారి పాలెం లో సన్మానం అందుకుంటున్న దృశ్యం


 భాష రాని వ్యక్తి ఏ రంగంలోనూ రాణించలేదు. ఇది తెలిసి కూడా బద్ధకంతో  ఏమీ చదవక, భోగలాలస తో సమయాన్ని  పోర్న్,  ఫిలిమ్స్, పిచ్చి మ్యూజిక్ , పిచ్చి  ఎంటర్టైన్మెంట్ కి అంకితం చేస్తూ వ్యక్తిత్వాన్ని నాశనం చేసుకుని, మంచి ఉద్యోగ అవకాశాలను జారవిడుచుకుంటున్నారు.  పుస్తకం చదువొకోలేని నిర్భాగ్యులు సినిమాని ఆశ్రయిస్తారు. సినిమా డైలాగులతో కాలం గడుపుతూ,  చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని  సినిమా పాటలని వింటూ , కాలేజీ ఫంక్షన్స్ లో కూడా రెకార్డ్ డాన్స్ లాటి ప్రోగ్రామ్స్ పెట్టుకుని, (It happened in Prabhas college in my presence) అమ్మాయిలు అబ్బాయిలు  నృత్యాలు చేస్తూ తమ అభిరుచిని చాటుకుంటున్నారు.   సినిమా అనే గజ్జి  మన వాళ్లందరికీ , ముఖ్యంగా యువతకి ఈ గజ్జి అంటింది అందుకే  మన దేశానికీ సాహిత్యం లో నోబెల్ ప్రైజ్ 1913 లో ఒకే ఒక్క  సారి వచ్చింది.

కాగా ఫ్రాన్స్ , జర్మనీ దేశాలు  చక్కటి సాహిత్యాన్ని సృష్టించి నేటికీ అనేక నోబెల్ ప్రైజెస్ అందుకుంటున్నాయి. సున్నిత మైన ఆలోచనలవైపు మనిషి ఆకర్షితుడు కావాలి, చక్కటి సాహిత్యం వల్ల ప్రభావితుడు కావాలి.  సినిమా సాహిత్యాన్ని విడిచిపెట్టాలి ఎందుకంటే   సినిమాలలు చక్కటి సాహిత్యాన్ని సృష్టించడం లేదు.  చెత్త పాటలు, చెత్త మాటలు.  వాటినే అనుకరిస్తూ చెత్త ప్రవర్తనని మన యువత సొంతం చేసుకుంటోంది. 

ఈ మధ్య జరిగిన అధ్యనం లో మంచి సాహిత్యం చేత ప్రభావితమైన సమాజం ప్రశాంతంగా ఉంటుంది అని తేలింది. జర్మనీ , డెన్మార్క్ , పోలాండ్ దేశాలను  ఇందుకు  ఉదాహరణలు గా చెప్పవచ్చు. మాతృభాషని మరిచిన జాతికి , ఏ భాష పైన పట్టు సాధించని వ్యక్తి కి పతనం తప్పదు.  దేశ చరిత్రని సొంతగా ఎలాగూ చదవలేరు, ఎవరైనా చెపితే వినే ఆసక్తి కూడా లేదు.   చరిత్ర, సాహిత్యం చదువుతూ పరిశీలనాత్మకంగా అర్ధం చేసుకుంటే , చక్కటి సాహిత్యం ద్వారా స్ఫూర్తి పొందితే  చక్కటి నాయకులు తయారవుతారు. 

నిరుద్యోగం, పేదరికం, ఉగ్రవాదం నేటి నిజమైన సమస్యలు కావు.  ప్రతిభావంతులైన నాయకులు లేక పోవడమే నేటి సమస్య.  సచ్చీలత కల ప్రతిభావంతులైన నాయకు లు కావాలి అదే నేటి అవసరం. అందుకు అందరూ మంచి సాహిత్యం, చరిత్ర తప్పక చదవాలి. అందుకు విద్యార్థులను ప్రోత్సహించాలి లేకుంటే కాశ్మీర్  లో మద్రసాలకీ ఆంధ్రప్రదేశ్ లో కాలేజీలకు తేడా ఉండదు . 


ఇంగ్లీయిష్ భాషతోపాటు మరొక ఫారిన్ లాంగ్వేజ్ నేరుకోవడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపక శక్తీ పెరగడమే కాక మెరుగైన  ఉద్యోగావకాశాలు లభిస్తాయి.  ఫ్రెంచ్ , జర్మన్ , స్పానిష్  ఇటాలియన్ ల లో మాట్లాడే వారికి బహుళజాతి సంస్థల్లో ఉద్యోగాలు సులభంగా దొరుకుతున్నాయి. ఫ్రెంచ్, జర్మన్, లేదా  స్పానిష్ మాట్లాడుతూ సర్టిఫికెట్ కలిగి ఉంటె ఎవ్వరూ ఒక్క నెల కూడా ఖాళీగా ఉండక్కరలేదు. సాధారణ సంస్థల నుంచి మొదలుకుని బహుళజాతి సంస్థలు , ఎంబసీల దాకా ఉద్యోగావకాశాలు విస్తరించిన ఫారిన్ లాంగ్వేజెస్ నేర్చుకోవడం, నీ అమ్ములపొదిలోకి మరో అస్త్రాన్ని చేర్చుకోవడమే.
  

 ప్రభాస్ డిగ్రీ కాలేజీ లో విద్యార్థులతో 19th Aug,2017 
మంచిమాట అంటే  వ్యక్తికీ  సమాజానికి మేలు చేసే మాట చెప్పడం రోజుల్లో చాలా కష్టం. కాలేజీల్లో మరీ కష్టం. అలా చేయాలంటే విద్యార్థులను చేరుకోవాలి,  అంతకంటే ముందు విద్యాసంస్థలను చేరుకోవాలి. అది అంత సులభం కాదు.  ప్రభాస్ కాలేజ్ లో నా ప్రసంగం  విని ఉపయోగకరంగా ఉందని భావించి ప్రిన్స్పల్ గారుమరొకసారి రావలసిందిగా కోరారు.  భాషల పట్ల ఆయనకీ గల గౌరవం, ఆయన చూపిన ఆదరణ  మరువలేనివి. కానీ కార్యక్రమాన్ని జరగడానికి గీతా ఫౌండేషన్ అధినేత శ్రీ సుబ్బారావు గారు. వారి శ్రమ ని మాటల్లో చెప్పలేను . మాటల్లో చెప్పనలవి కానీ శ్రమ వారిది. వారికి బ్లాగ్ పోస్ట్ ద్వారా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను
Friday, June 30, 2017

Children's Radio program on French and German in Vijayawada

 Radio Programs on Foreign Languages by Children

It was really a proud moment for me when the station direction told me that this is the first time in the history of All India Radio Vijayawada that we have aired a Foreign languages program. It is a perfect radio program on Foreign languages by the young students of  Eazy Foreign Languages,Vijayawada broadcast on the 25th June 2017 at 2.30 P.M.


The students have participated in Three Radio programs in one month. The first program was on All India Radio vijayawada and the two programs were on Radio Vishnu  a private F.M channel.

The radio program is  uploaded in the Youtube  for the readers so that they can enjoy listening to the actual performance of Children in Foreign languages.  The fourth Radio program is in the air. It is likely to take place next week. This program is on Radio Mirchi.
All the best for the Children who are learning French, Spanish, Japanese, Italian and German. Eazy Foreign Languages  Institution Vijayawada takes this opportunity to invite children interested in Foreign Languages.Eazy Foreign Languages, Beside Modern super market, Kanna nagar, Vijayawada. Ph: 9700877409

Spanish Language Specialist

In this world Everything Changes. There is nothing that doesn't change. If you want to name something that doesn't change  you find only the phenomenon of change. Change is inevitable.
Some people struggle with the same old job whatever torture it is. If you want to change your life there are plenty of opportunities. Here is one for you.

 Have you ever seen Language specialist jobs?
just type "Spanish language specialist" in google                              Mr. Jayasai, Mr.  Saisravan ( center) with Mr. Poolabala.

Mr. Jaya saikrishna is the aspirant of a  Spanish language career ( in the left) is learning Spanish in Eazy Foreign languages,Vijayawada. His brother Mr.Saisravan is currently working as a Spanish language expert in Mumbai. A few among us know about such jobs. Fewer still can really meet Language Specialists. That is why this brief interview assumes greater importance.

Mr. Tirumalasetty Saisravan is hardly 27 has got two elevations in Spanish specialist job. He is right now working for his third company. He has a chance to go abroad. A beautiful white-collar job , the rosy dream of many young people. 

Sravan kumar did his B.tech in I.T stream.  He has learnt Spanish  not very seriously but just as a hobby. His hobby has been a career. He joined E-Clerx Mumbai as a Spanish Specialist in 2012. He applied for the job through google search engine and Naukari and was selected in the interview. In 2103 he got a better chance in Chennai in CEEQUENCE. Communicating with clients from Brazil, Peru and Mexico. Now he is working for HCL at Mumbai with a good hike in the salary. 

I wish Mr. Sravan Kumar every success. May the dream of Jaysaikrishna his brother who is currently learning Spanish in Eazy Foreign Languages a good career as a Spanish specialist. 

May his tribe increase!!!

Thursday, March 23, 2017

జానపదం మన పల్లెల జీవన విధానం
J'ai traduit 71 chansons. La traduction des chansons folkloriques est tres complexe. Certaines chansons m'ont donné des larmes et d'autres les sourires. Mais certainement chaque chanson m'a donné des crampes musculaires. Finalement, c'est un grand succès et une joie. J'ai fait cela pour mon apprentissage et ma joie.  ces chansons donneront également à chacun la même joie. J'enverrai ces chansons à ceux qui me demandent. Je veux apporter ces chansons sous la forme d'un livre.

ప్రసార భారతి అధికారులు ఎంతో  శ్రమదమాదులకోర్చి అనేక జిల్లాలలో పల్లెలను సందర్శించి , జానపదాలు తమలో నిక్షిప్తం చేసుకున్న అనేక వృద్ధులను , స్త్రీలను , రైతులను కలిసి వారి వద్దనుంచి సేకరించిన (పాడించి ఆడియో గ్రహించారు)  విలువైన జానపద గీతాలను సీడీ రూపంలో నాకు అందజేశారు. ఈ పాటలు పల్లె చరిత్రను , ప్రజల జీవన విధానాన్ని, వారి జీవితాల లో ప్రేమ,పెళ్లి , శృంగారం, విషాదం వంటి అనేక  విషయాలను హృద్యంగా వెల్లడిస్తున్నాయి. కొంత మంది స్త్రీలు రామాయణం లో ఘట్టాలను జానపదాలలో అద్భుతంగా పాడారు . ఈ పాటలు ఆరు నుంచి పది పేజీల నిడివి కలిగి ఉన్నాయి . ఎంతో సునాయాసంగా ఈపాటలను వారు నిత్యం పాడుకుంటారు . వాళ్ళ జ్ఞాపక శక్తి కి నా జోహార్లు.  కామందు కొంచం దయ చూపితే మురిసిపోయే పల్లె పడచు పాడిన పాట , కామందు వెంట పడితే హెచ్చరించే పల్లె పడుచు పాడిన పాట, మనకు చక్కిలిగింతలు పెడితే  ఒక మహా వృక్షాన్ని కొట్టేసే టప్పుడు పల్లె పడిన బాధ మన మనసులని మెలిపెడుతుంది   71 పాటలను నేను అనువదించాను. జానపద పాటల అనువాదం చాలా క్లిష్టమైనది. కొన్ని పాటలు నన్ను కన్నీళ్లు మరియు ఇతరులు నవ్వి ఇచ్చాయి. కానీ ఖచ్చితంగా ప్రతి పాట నా నరాలను మీటింది.  నేను నా ఆనందం కోసం దీన్ని చేసాను. ఈ  ఆనందాన్ని మీతో పంచుకోడానికి నేను ఈ బ్లాగ్ రాస్తున్నాను.  ఎవరైనా కోరితే  ఈ పాటలను పంపుతాను. త్వరలో నేను ఈ పాటలను ఒక పుస్తకం రూపంలో తీసుకురావాలనుకుంటున్నాను.
ఇంగ్లిష్ లోకి అనువదించిన జానపద గీతాలను రేడియో స్టేషన్ లో అందజేస్తున్న ఫోటో 

 రియల్ హీరో లని  గుర్తించడం ఆరాధించడం ఒక సామాజిక అవసరం.  మనం రీల్ హీరోల వెంట పడి  రియల్ హీరోలని మర్చి పోయినట్టుగా సినీ గాయకులే గాయకులని అనుకుంటే పొరపాటే. జానపదం మన పల్లెల జీవన విధానం. జానపదగీతాలు జీవితం లోంచి పుట్టుకొచ్చినవి. పెట్టుడు గీతాలు కాదు.  అరువు తెచ్చుకున్న గోతుతో పాడుతున్న నకిలీ గీతాలు కావు. శ్రమని మరిపింపజేసి పనిని ముందుకు తీసుకెళ్లే జీవన గీతాలు. ఇవి నిత్యం చదువుతూ , వింటూ రాస్తున్నందుకు ఆనందంగా ఉంది. నా ఆనందం లో మీకు భాగం ఉంది.1. అందగాడా వన్నెకాడ మస్తానా నీ ఉంగరాల చెయ్యి జూసి మస్తానా  నీ పైన మోజైనది మస్తానా
ఓరందగాడ వన్నెకాడ మస్తానా .. నే కడవ మీద కడవ పెట్టి మస్తానా ...
2.చిక్కెఓయమ్మా చెరువు గట్టుమీద చిక్కేఓయమ్మా అరెరే చిక్కెఓయమ్మా..

3. ఏడెకరాల పాలమిస్తా ఎర్రెద్దుల బండిస్తా రమ్మని చెప్పారో లంబాడోళ్ళ రాందాసా
ఏడెకరాల పొలమోద్దు ఎర్రెద్దుల బండొద్దు రానని చెప్పారా లంబాడోళ్ళ రాందాసా ...

4. ఎంకత్తా నీకొడుకు ఎంతోడయ్యాడే ...

ప్రజలచే ప్రజలకొరకు రచించబడి  ప్రజలచే పాడుకొనబడే గీతాలు జానపదాలు మీకొరకు అందజేస్తున్నవారు            - మీ మిత్రుడు పూలబాల 

Saturday, February 11, 2017

మా తెలుగు తల్లికి మల్లెపూదండ - Floral Tributes


మా తెలుగు తల్లికి మల్లెపూదండ
floral tributes to our mother
మా కన్నతల్లికి మంగళారతులు,
encomiums to our mother
కడుపులో బంగారు కనుచూపులో కరుణ,
resourceful and compassionate
చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి. 

blesses children with treasure of smile
గలగలా గోదారి కదలిపోతుంటేను 

 in the meandering course of Godavari
బిరాబిరా క్రిష్ణమ్మ పరుగులిడుతుంటేను

 in the dashing sprint of Krishna
బంగారు పంటలే పండుతాయీ

 the lands yield golden harvest
మురిపాల ముత్యాలు దొరులుతాయి.

 and the lasting prosperity thrives
అమరావతి నగర అపురూప శిల్పాలు 

the amazing sclupture of Amaravathi
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు 

 the melodious strain of tyagayya
తిక్కయ్య కలములొ తియ్యందనాలు. 

the honeyed charm of tikkanna
నిత్యమై నిఖిలమై నిలచి వుండేదాకా 

so long as they last
రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి 

The strength of Rudramma
and devotion of Mallamma
తిమ్మరసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి
The jurisprudence of Timmarus,
the grandeur of Krishnaraya
మా చెవులు రింగుమని మారుమ్రోగేదాక
Until our ears hear the echos of
నీపాటలే పాడుతాం, నీ ఆటలే ఆడుతాం
we sing the praises of you
జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి.
victory!! victory!! victory to the mother.
written by Sundaracharya
Translated by Poolabala

Sunday, February 5, 2017

ఫ్రెంచ్ లో నవల రాసిన తొలి తెలుగు రచయిత

వెంకట్ పూలబాల ఫ్రెంచ్ నవల notre école


 21 శతాబ్దపు  తొలి ఫ్రెంచ్ నవల NOTRE ÉCOLE. 
బహుభాషా కోవిదుడు వెంకట్ పూలబాలరచించిన  ద్వి భాషా నవలఅవర్ స్కూల్ (ఆంగ్లం), నోత్క్ ఏకోల్ (ఫ్రెంచ్జనవరి 30  తేదీన విజయవాడ మాలక్ష్మి చాంబర్స్ లో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో విడుదల చేయబడింది.  

Poolabala presenting his Novel.to Sri Prabhakarareddy IAS 

జనవరి 30 తేదీన విజయవాడ మాలక్ష్మి చాంబర్స్ లో జరిగిన పుస్తకావిష్కరణకార్యక్రమంలో ముఖ్య అతిధి గా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్  ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్  వీ. వీ ఆర్ . కృష్ణం రాజు గారి  చేతులమీదుగా ఫ్రెంచ్ నవల విడుదల చేయబడింది. 1879 లో తోరు దత్  రచించిన  Le Journal de Mademoiselle d’Arvers మొట్టమొదటి సారిగా భారతదేశంలో ప్రచురించబడిన ఫ్రెంచ్ నవల. 138 సంవత్సరాల తరువాతప్రచురించబడిన ఫ్రెంచ్ నవల notre école. రాసినది వెంకట్  పూలబాల  తెలుగువాడుకావడం గమనార్హం అని కృష్ణం రాజు అన్నారు.అమరావతి కల్చరల్ సెంటర్ సీఈ  డాక్టర్ నాగి రెడ్డి  మాట్లాడుతూ ఒక తెలుగు వ్యక్తిఫ్రెంచ్నవల రాయడం తెలుగు జాతికే గర్వ కారణం అన్నారుకె ఎల్ యూనివర్సిటీ ఇంగ్లిష్ప్రొఫెసర్ కె సురేంద్ర అవర్ స్కూల్ నవల ఎంతో హృద్యమైన రచనా శైలిని కలిగి ఉందనిఓపల్లెటూరిలో చిన్న పిల్లలు  తమ స్కూల్ ను తామే నిర్మించుకునే దశలో తమలో ఉన్నటాలెంట్స్ వెలికి తీసి యావత్ ప్రపంచ ద్రుష్టి  ని  ఆకర్షించడం,  తరువాత తమ అంతిమలక్ష్యమైన  స్కూల్ ని నిర్మించుకోవడం చాలా స్ఫూర్తి దాయకమని అన్నారు కార్యక్రమంలో  ఆంద్ర ఆర్ట్స్ అకాడమీ కార్యదర్శి శ్రీ గొల్ల నారాయణ , కెరీర్ మెంటార్స్అధ్యక్షుడు శ్రీ ఆనంద్ , వరలక్ష్మి  తదితరులు పాల్గొన్నారు.

పుస్తక రచయత పూలబాల తెలుగు మరియు విదేశీ భాషలలో రచయిత. ఫ్రెంచ్, జర్మన్ , స్పానిష్, ఇటాలియన్ , ఇంగ్లిష్ జాపనీస్ భాషల బోధకులు. వీరు ఆచార్య నాగార్జునా విశ్వవిద్యాలయము లో " ఇంటర్నేషనల్  స్టూడెంట్ సెంటర్ " లో విదేశీ విద్యార్థులకు బోధించి ఉన్నారు. జాతీయ స్థాయి లో UGC చే నిర్వహించబడిన సమావేశాలలో ఫ్రెంచ్ జర్మన్ బాషల పై ప్రసంగించి యున్నారు. హైదరాబాదు లో హైటెక్ సిటీ వద్ద ఎందేవర్ టెక్నాలజీస్ అనే బహుళ జాతి  సంస్థ లో ఫ్రెంచ్ అనువాదాలుగా పని చేశారు. ఫ్రెంచ్ , జర్మన్, స్పానిష్ ఇటాలియన్ మరియు ఇంగ్లిష్  నేర్చుకొనేవారికి అనేక పుస్త్తములను వ్రాసి ఉన్నారు. పుస్తకములు ఆంద్రదేశమంతటా పెద్ద పుస్తకముల షాపులలో లభించును


ఈ నవల చదివి దేశ విదేశాల నుండి అనేకులు,  విద్యాధికులు ఆచార్యుల, వైద్యులు  తమతమ అమూల్య అభిప్రాయాలను వెల్లడించారు. కొన్ని అభిప్యాయాలను మీకొరకు ఇక్కడ :                                     Sir Prabhakarareddy IAS going through the Novel


 Dr. Sivakumar. Professor of English. Prince Abdul Aziz University. KSA

The novel Our School is an academic novel.  It is quite fascinating.  Narration is mesmerizing.  The author displayed encyclopedic knowledge. It motivates the reader to do something out of the box, like the characters in the novel.  Students can improve their vocabulary.  The author made proper use of contemporary situation of the locality.   I think, he identified himself in the character of Durga.  The author is nowhere compromised in portraying Meena’s romantic, heinous and titiallting (suggestive) angles in the novel to bring out the originality in the plot to the readers.

Dr. Srinivasarao. Ex faculty, CIEFL

“The School” is a passionate attempt to depict a village school. The writer Venkat Poolabala is a multi linguist, researcher, and writer. Needless to say, the writer has repertoire of linguistic knowledge and the imagery he employed in this novel is strikingly rich. The singularity of purpose and commitment to the cause of languages are evident in his work. The novel takes the reader to an enchanting world of different cultures. It is amazing to see the vast exposure of the writer to many languages. I hope that the novel would be instrumental in motivating the readers.