Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Monday, August 28, 2023

మా ప్రిన్సిపల్ గారి ప్రశంస

విజయవాడలో పేరెన్నిక గల   స్కాట్స్ పైన్  అంతర్జాతీయ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రతిమ గారు  ఇండియన్ సోనెటీర్ అనే ఆంగ్ల పద్య కావ్యానికి నాకు రెండవ ప్రపంచ రికార్డు వచ్చినందుకు  పాఠశాల సమావేశంలో నన్ను అభినందించి నాకు పాఠశాల జ్ఞాపికను మొక్కను బహూకరించారు. ఈ సందర్భంగా పాఠశాలలో కనీసం ఒక్కవిద్యార్థి అయినా ప్రపంచ రికార్డ్ సాధించేలా కృషిచేస్తామని నేను తెలియజేశాను.  స్కాట్స్ పైన్  అంతర్జాతీయ పాఠశాల భాషాబో ధనకు ఇచ్చే ప్రాధాన్యత ఎనలేనిది,  స్కాట్స్ పైన్ విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశిస్తున్నాను. 


Scotspine International School in Vijayawada  is renowned among the international schools in the state for the most practical and stressfree education. Scotspine International School's emphasis on  language skills is unparalleled. We don't  see such schools as Scotspine International  these days.  The  Principal of the  School  Mrs. Pratima  congratulated me on getting the second world record for my English poetry compilation  "Indian Sonneter" and presented me with a school memento and a plant. On this occasion, I promised to  train at least one student of the school to achieve the world record. 

Sunday, August 13, 2023

శ్రీ కాళ హస్తీశ్వర శతకం - పూలబాల

     UUU         IIU            IUI       IIU            UUI          UUI       U

శా. క్షుద్రానం  దములం  దగోరి పురుషుల్  క్షోభించి యార్జించు చూ  

ద్రంబు    క్షయమ     వ్వతాగి  జనులం   వంచించి జీవించు చుండ్రు   

రుద్రానీ  కృపకో   రినిన్ను  దినము   ప్రార్ధించ లోభంబు అంతంబ గున్  

నిద్రాణం   బుగను న్నబుద్ధి  బలమం  తవృద్దౌ   నీకృపన్ నిక్కంబు గన్  


శా. గంభీరం   బుగవే   షమేసి  జనులన్ గాండ్రించి  ఏమార్చినన్

రంభారా    విడిజే   సిపెంచ సిరులన్  యాశూలి  కాగ్రహ  మొచ్చు  

కుంభీపా    కములో కినెట్టి  నరులన్ కుంపట్లో దుర్మార్గు లన్   

సంభావిం చునుకా  లుడంచు తెలిపెన్ శాస్త్రంబు స్పష్ఠంబు  గాన్  


శా.  చావేలే  దుగదా  స్మరింప  శివునా చారంబు   గానిత్య మున్

    త్రోవేదా  అరుణా త్మజు డై  నను బో తోడుండ  నీనామ మే

    పోవేళ    స్మరణం  బుమోక్ష  మొసగున్  భూతాత్ము గానంబు నన్

   చావేజే    రదుఖా  యమింక  నరుడా చచ్చేది   కాయమ్ము  రా


శా.  వ్యామోహం  బునకా   మకౌతు కపువా  మాచార  నుష్టాన  మంత  

ఆమోదం  బనిప  ల్కుచూ,శి   వశివా   ఆలోచ లేమార్చు చుండ్రు      

ప్రమోదం  బునుగో   రినిత్య  మదన ప్రభావ చిత్తంబు నన్  

స్త్రీ మోహం  బునఇ   చ్ఛయంత పెరగ  స్త్రీలోలు లీరీతి  గన్

   

శా. దీపాలే  వెలిగిం  చనే ర్చి సిరిరా  దీవించ మంచు మృ క్ష  

పాపాలే    క్షయమొం   దగోరి   ఇలలో   పాపత్ము  లాశంక  రున్ 

కాపాడం  చుతలొం   చివేడ   ఎటులా  కాపాలి  మొరాల కించు

శాపాల  న్నియుజు   ట్టుముట్టి   కరిచే  సర్పాలై  బంధించ గన్ 


శా. చీరేగ  ట్టినితం  బిదారి    నటబో     చిత్రంబు  చూపించ గన్

వీరోల్లా సమునొం   దివీధి   శునకా   వేశంబు జూపించు చుండ్రు

చోరాధ  ములని  త్యమిట్లు   విరలిన్ శూన్యాత్ము  లైక్రుంగు చుండ్రు

పారాణిం  పరెకుం  కుమద్ది     నొసటన్  పాపాత్మ   శోభిల్ల  గన్


శా. ధనాశా    అడిమో  హమంట  మనుజుల్   ధాసోహ   మైబ్రాంతి చే   

అన్యాయ  మ్మనిదె   ల్సిజేతు  రుకదా    అన్యాత్తు లైజచ్చు  చూ

విన్యాస  మ్ములుజే  యశూన్య మునటె  వ్రేళ్ళాడి  రోదించు  చుండ్రు       

అన్యాక్రాం  తముజే     యనాత్మ    లకటా  ఆక్రంద ముల్జేయ గన్      

                                     

 శా.  ప్రలాపిం  చెడిఊ  రమూక  లనిషా   ప్రచార సంఘాల నమ్మి 

ప్రలోభా   లకులొం    గిఆత్మ నొదిలా  బ్రాంతుల్లొ జీవించు చూ 

విలాపిం   చుఅనా ధజీవు    లమనో   వేదనా మూలమ్ము లన్ని  

కాలాత్మ కృపచే  సవిత్తు  మొఱచే    కాలేను  నిశ్శేష   మై 


 శా. సారాయం  గడివ  ద్దజేరి   దళముల్  జామంత  వెచ్చించు చుండ్రు 

బారాది      ద్రవిణం   బుజేర    పురుషుల్  వారాంగ   నల్గూడు చుండ్రు 

పారాపా    రపు సొ     మ్ములున్న  జనులే    పక్షాలు  పెట్టింక   నెగ్గి   

నేరాలె  న్నియొజే    సి భూగృ      హముల   న్వేసారు చుండ్రీ శ్వరా    

      


10. శా.చోరాధ  మునిఏ     రికోరి      తమలో     చోరోత్త    ముండీత డంచు    

చోరాగ్రే   సునికా   సనంబు   నొసగన్      చోరుండు  ధీరుఁడ   గున్

ధారాళం  బుగ ఓ   టువేయు    జనులం  తాచోరు లైయొప్ప గన్         

చూరాడ   శ్ర మయే   దిరా శి      వశివా         చోరుండు  రాజేగ   దా                       

                                                                        

11. శా.   కాషాయం బనఏ    వగించి      కడకే   గాల్చేవు    దేశాన్ని వి  

ద్వేషజ్వా  లలకా  హుతిచ్చి  ఒరిగే    దేహాన్ని  మోహించ చూ         

పాషాణ హ్రదయం బుతోబ్ర     తకగన్    పాడెక్క   కాలంబు  నీ    

ఘోషప్ర      మథనా  థుకెగ్గు   కలగన్   ఘోరా తి ఘోరంబగు  


12. శా. శంభోశం   కరపా    హిమాంశు  భకరా   సర్వాంగ  కైలాస వాస 

గంభీరం  బుగజూ  సినీచ   తలపుల్    గాల్చుము  కేదార  నాథ

సాంబాసం  భవమా   పరార్థ   పథమున్  సాహిత్య సావాస మన్

సంభారిం   పగసా   ద్యమానొ  సగుమా  చంద్రధ  రానీకృ  పన్ 

                                        

13. శా. పింజారీ   నటనా   లిజూప   పురుషుల్     వింజామ  రల్దెచ్చి  ధాత్రి  

రంజిల్లె    ననిమొ   క్కపెక్కు   మగువల్     లాస్యాల  కామాత్రు  లన్  

భంజించా    నరజా   లమంద     చటనే      బంధింప భస్మాంగు నమ్మి   

పూజింపన్   దయతో    డిమోక్ష    మొసగున్     భోగార్తి  భంజించు చున్                                                                  


14. శా. యంత్రాలే   లుజగం   బులన్ని   కలికా   లంబున్  యంత్రాల నమ్మి  

మంత్రాలే   లనిఈ      శ్వరాయ    నుటకే  మాత్రంబు  నిచ్చేక  ల్గక                  

తంత్రాలన్ నెరన        మ్మినాశ    నమనం   దాతంత్ర  ముల్ వీగ                                                        

మంత్రాలే  మెరుగం     చుజేరి    జనులా     భస్మాంగు   పూజించ రే  


15. శా.  వానాకా  లపువి   ద్య నేర్చి  జనులా    పాలాక్షు    శోధింప మాని    

జ్ఞానాన్వే  షులమం  చుమూఢ  మతితో  సాంకేతి   కప్రజ్ఞ  బట్టి                       

సూన్యా కా  శమునం  దురిత్త    జగముల్    శోధించి  జీవాత్మ నొడ్డి   

విన్యాస   మ్ములుజే    యనిల్పి    గొనియా    విశ్వాత్మ    శోధింప రే


16. శా. వాతఃవే  గమునం  దిపారు మెకమే  వ్యాఘ్రంబు  చేజిక్కి జచ్చు   

కాంతామో  హమునం  దుబడ్డ పురుషుల్   కాలాంత  కుల్వీరు  లైన    

కాంతారం  బునకం   దకంబు  నబడ్డ    కాళింగ  మున్ బోలి ఆయు     

వంతాచి   క్కగశం      కరాత   మనుతా    వంచించు  కొంచుండ్రు   


 17. శా. సారాధా  రలుపో  సికోట్ల  ధనమే సంకోచ  మేలేక  జల్లి         

బేరాలా   టలగ   ద్దెనెక్కి     కొలిచే     వీరాభి   మానుల్ మొల్వ    

తారాజు  వ్వనుపో  లినింగి  కెగసి     ధాత్రంత  పాలింతు  నంచు      

కారాగా  రమునం  దుకూలి  అచటన్   కాలాత్ము   యోచింప రే  


18. శా . మందార మ్ము గమ   బ్బు పట్ట  నభమున్    పాణింద  మంబట్టు 

    బంధాల  న్నియుజు  ట్టుముట్ట మనసున్   మాయంత కమ్మేయ దే 

    బృందార మ్ము గజిం  కతాల్పు  దయజూ  పంగవై   రాగ్యంబు సోకు  

    బంధాల  న్నియువీ  డుకోర్కె లడుగున్     పంథాలు మారింకపోవు 

       


19. శా. వేళాకో    ళముజే  సిపెద్ద    నివయో    బేధమ్ము  జూడక   వాగి    

             జైళ్లంబ   డ్డవినీ  తిమంతు  నిలలో    జైజైని    నాదమ్ము జేయు 

             క్రుళ్ళిపో  యినపా  డుజాతి   మదిలో   క్రూరమృ  గావేశ  మున్     

            వేళాకో    ళపుబు     ద్ధిదిద్ద      గ మహా     పింగాక్ష   నిన్  వేడె దన్                                         



  20. శా . సంపత్తే     నిఖిల   మ్మనెంచి  పురుషుల్  సంసార మేసత్య  మంచు

             వెంపర్లా  డచుకూ     డబెట్టి      సిరులన్     వేలాది  రొక్కంబు  పా 

             రంపర్య   మ్ముగని  వ్వకాంక్ష   పెరుగున్      రాదింక వైరాగ్య ము 

             వెంపర్లా   డచుసం   పాదించు చుసుతుల్  వేసారు  చుండ్రీశ్వ రా  


21. శా. రూపాయా  టలవి   శ్వసించి  జనులే   లోపంబు  లంజూడ  రెట్టి           

            వ్యాపారమై  ననుజే  యుచుందు రటులే   భద్రేసు   నమ్మింక యా                           

           రూపంబున్  మనమున్  తలంచు టకుయే   లోపంబు అడ్డొచ్చు నో                   

            కాపాలీ      నినుచి    త్తమందు   నిలపనీ   కటాక్ష  మేకావ  లెనయ్య     


22. శా.సామాన్య  ప్రతిభా  విశేష ములనే  చాలించి  వాదంబు లా, ప 

సామాన్య  ప్రమథ   గణశ    క్తులనే    శాసించు   ఫాలాక్షు దక్ష      

జామాతన్   పరమే   శుపాద  ములనా   శ్రయింతు   జ్ఞానార్థి యై  

కామాక్షీ   పతి కా  టిభూడి  దనిచ్చి  కారుణ్య  మున్ జూప వయ్య


23. పొంగేను  త్రిపురా  రిశీర్ష  మునయా పొంగేటి  గంగను జూడ 

వంగేను     జగమం  తచూడ మనసే వాలేను పాదాల చెంత                                                      

ఊగాడే      జటలొం   కచూడ   మదిలో ఉన్మత్త  రూపముం నిల్ప     

భోగాలే    లయవీ   తరాగ  సిరులన్   పూర్ణవై   రాగ్యము నిమ్మ

 

24. లెక్కింపొ  క్కడువీ  తరాగ       మునుకో     రిశ్రీక  రున్వేడు  కో            

ట్లొక్కండే   తపమా  చరించు  నిలలో   డోలాయ మానంబు వీడం 

దొక్కండే   అనుభూ  తిచెందు      తాలును   తూర్పాఱ   బట్టి 

చొక్కించా త్మలలా  టలోచ  నునియా  జోటింగు  


25. సౌఖ్యాలే  పరమా        ర్థమంచు   కలలన్  సాకార ముంజేయ ఘోర     

సంఖ్యాక  మగుపా      పకార్య    ములజే   సామ్లేచ్ఛ  సౌజన్య  మంది    

విఖ్యాత    మ్మగుయో    గసిద్ధి    యుతపో    మోక్షంబు   లన్వీడి  నీచ 

లక్ష్యాలం   బడిపో        యికాన    రికకా       లాత్మప్ర     భావంబు నే   


26. కాలక్షే    పముకో    రిలాల  పరమే    గావించి భోగవి  లాసమ్ము లం 

      దేలక్షే    పముజే   యచిత్త    మునుమ   త్తేగమ్మ  ధనార్జ   నం                          

       బేలక్ష్య మ్మనిన   మ్మి              నెటుగం  భీరంబు     


27. తెల్సేదే   హమశా    శ్వతమ్ము  నినరుల్  తేజమ్ము   మక్కిల్లు దాఁక    

జల్సాలే  మియువీ   డలేక       తమతే    జమ్మా రు  అంత్యక్ష ణాన          

తెల్సేకో   ర్కెలకొ     క్కిరాల    కెరగా       దేహమ్ము   నర్పించి జచ్చి  

కల్సేరా    నివివే      కమత్త     మిల్లగన్     కాట్రేనొ    డిన్వాలు చుండ్రు


 ఈ శరీరం  నేను కాదు అని తెలిసిన మనిషి నిస్సహాయుడై కోర్కెల కొక్కిరాయిలకు తన దేహాన్ని అప్పగించి జీవిత అస్తమించిన పిదప వల్లకాడుచేరి కాట్రేని ఒడిలో  దీర్ఘ నిద్రలో కి జారుకుంటారు. శరీరముతో అంటకాగకూడదు శరీరం మనం కాదు  శరీరంలో లో ఉన్న చైతన్యం మాత్రమే మనం.


28. వేరేదే    మియుకా   దుదేహ   మనగా   వెంటాడి   పీడించు చీడ   

పారేఏ   రువలే      యుగాల   పడిజీ   వాత్మప్ర     వాహంబు సాగు     

వేరేరూ  పముయ   బ్బవాస    నలతో    వేటాడు   దేహంబు  దాట

దారేదీ   మరియా    త్మయోగ  ధనభూ   తాత్మకృ  పాక్షంబు  లేక

 అనేక శరీరాలగుండా మన ఆత్మ యుగయుగాలుగా ప్రవహించే నది.  కానీ శరీరమే మనం అనే బ్రాంతి లో నే మనం జీవిస్తాము. ఒక పీడలా  మనని పట్టుకు పీడిస్తున్నది మన శరీరం మాత్రమే. శరీరం ఒక చీడ.  యోగధనుడు ప్రథమ యోగి అయిన ఈశ్వరుని కృపలేనిదే ఈ శరీరాన్ని దాటలేము.    


ఈ శరీరం నేను కాదు అని మనసుని నమ్మించడం చాలా కష్టం దానికి దైవప్రార్ధన తోపాటు వైరాగ్యం కూడాకావాలి . 


 కష్టాలు  శివుడిమెడలో వెళ్ళాడు సర్పాలు లా భీతిగొల్పుతాయి 

కష్టాలనుంచి తప్పించుకుని సుఖాలకోసం ప్రాకులాడితే వచ్చే ప్రయోజనం ఏంటి . సుఖాల తర్వాత మల్లె కష్టాలు వస్తాయి. 


4. కష్టాలని స్ఫూర్తి గాతీసుకుని వైరాగ్యాన్ని వెతుక్కోవాలి వేమన, ధూర్జటి  లాంటి ఎంతోమంది కవులు వైరాగ్యాన్ని పొందారు  


5. ఎక్కువకాలం బ్రతకడం కోసం  నానాబాధలు పడి  ఆరోగ్యం సంపాదించినా  ప్రమాదంజరిగి మనిషి ఆయువు తీరిపోతుంది 

ఆరోగ్యం కోసం కాక వైరాగ్యం కోసం తపించాలి 


 6. తెగింపు  ధైర్యాన్నిస్తుంది. చావంటే భయంలేదని డంబాలు చెప్పడం మనసుని బండబార్చడం  వైరాగ్యం చావుని సులభం చేస్తుంది. చావుకోసం  ఎదురుచూసేలాచేస్తుంది. ఎక్కువ కాలామ్ బ్రతికి ఉండడం కూడా ఏమీ ప్రయోజనం లేదు 

  

7. మండూకం నేలమీద నీటిలోను ఉన్నట్టుగా మనిషి భౌతిక ఆధ్యాత్మిక ప్రపంచాల్లో ఉండాలి. భౌతిక ప్రపంచంలో మనిషి తక్కువ ఉంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో అంట ఎక్కువ ఉంటాడు. 


 8. బరువు హెచ్చు ఉన్న పెద్ద నౌక  , కనిపించకుండా సముద్రం లో   పైభాగం ఎంత ఉంటుందో నీటికింద కూడా అంటే ఉంటుంది. జ్ఞానం బాగా ఉన్న పండితుడు  కూడా అలాగే ఆధ్యాత్మిక సముద్రంలో మునిగి ఉంటాడు. 


9. మనిషి అందం కోసం ఆరాటపడుతున్నప్పుడు ఇతరులను మెప్పించడానికి తాపత్రయ పడుతున్నాడని గ్రహించాలి . అంతరాత్మను పమెప్పించే పనులు చేయడం లేదని కూడా గ్రహించాలి.  అందుకు కారణం వైరాగ్యం లేకపోడమే 


10. వైరాగ్యం ఎందుకుండాలి వైరాగ్యంతో భయం నశించి స్వేచ్ఛ వస్తుంది. నిజమైన ఆనందం లభిస్తుంది 


11. నిజమైన  లోతైన వైరాగ్యం ఆత్మానుభూతిని క్షణకాలమైనా కలుగజేస్తుంది. 

ఆత్మానుభవం కలిగినవాడు నీచమనుషుల మెప్పుకోసం తపించడు 


12. ఈ లోకంలో పేరు సంపాదించుకోడం కూడా  ఇక్కడ వరకే పనిచేస్తుంది, కీర్తి  జ్ఞానం రాదు , జ్ఞానం వాళ్ళ కీర్తి వస్తుంది. జ్ఞానంలేని కీర్తి దండగ. 


13. అనేక రకాల విషయాలు వాటి జ్ఞానాలు,  భౌతిక ప్రపంచంలో వాటి విలువ  వేరువేరుగా ఉంటాయి. ఏ జ్ఞానం సంపాదించినా  సేవచేసి డబ్బు సంపా దించడంకోసమే. ఆత్మజ్ఞానంతో డబ్బు సంపాదించరు.  అందుకే ఆత్మ జ్ఞానంకంటే  గొప్పది ఏదీ లేదు.  



 14. భౌతిక మానసిక అనుభవాలద్వారా సుఖం జ్ఞానం సంపాదించవచ్చు. 

తినడం తాగడం , ప్రయాణించడం అన్నీ సుఖాన్నిస్తాయి. చదవడం , వినడం , ఆలోచించడం అన్నీ జ్ఞానంతో పాటు హాయినిస్తాయి 


15. సుఖం కంటే  ఆనందాన్ని మనసు ఆలింగనం చేసుకుంటే మనిషికి సూక్ష్మం లో మొఖం ప్రాప్తిస్తుంది. ఎందుకంటే మనిషి సుఖంకోసం పడరాని పాట్లు పడుతుంటాడు. 

   

16.  సుఖం రెండూ  కోరుకుని  కష్టాలు కొనితెచ్చుకోడం  ఎవరికీ  ఇష్టం ఉండదు ఆనందం  సుఖం కంటే గొప్పది అని  వదిలేయాలని ఉన్నా సుఖాలని త్యజించే  దైర్యం లేక  కష్టాలు పడుతుంటారు


17. ఎక్కడికీ కదలకుండా కూర్చోడం శరీరానికి ఎంత కష్టమో మనసుకు కూడా ఓయీ విషయం మీద ఉండడం  అంతే  కష్టం. 


18. అభౌతిక మైన ఆత్మని భౌతిక మైన  శరీరంతో  అనుభూతి చెందడం కష్టమే ఆత్మని అనుభూతిచెందడం చీకటిలో చూడడానికి ప్రయత్నించడం కంటే కష్టం.  


19.   ఆత్మని అనుభూతి పొందినవారు తమ ఉనికిని బాహ్య స్పృహను మరిచిపోతారు. మరి ఆత్మని అనుభూతి చెందినది ఎవరు?

 

20.  అహం అనేది , సూర్యునిలా భౌతిక ప్రపంచం లో  అస్తమించినప్పుడు   ఆత్మజ్ఞానం ఉదయించి భూమి కి ఉన్న మరో తలంలో ప్రకాశిస్తుంది   


            

నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః!

ఉభయోరపి దృష్టోఽన్తఃత్వనయో స్తత్త్వదర్శిభిః!!


తాః అసత్యమైనది లేనేలేదు. సత్యం అనేది ఉండకపోదు. తత్వవేత్తలు ఈ రెండింటి తత్వమును శ్రద్థగా అధ్యయనము చేసి విషయమును ధృవీకరించిరి.    






                                                             



                 

Tuesday, August 8, 2023

మార్గ దర్శకునకు - మసజసతతగ

 


    UUU         IIU           IUI       IIU       UUI          UUI       U


గోదారీ   తనయున్    విలక్ష   ణపథ   కూలంక   షాశిక్ష కున్  

బోధనా  విషయ  ప్రతాపు  కువిరా    ట్భూరివ్య       వస్థాప  కున్

సుధార్ద్ర  హృదయున్  సుదీప్త  వదనున్  సూక్ష్మవి చారాత్మ  కున్  

మందారం  బుగని    చ్చితిఠీ    విగనే    భాషాప్ర  బంధబునన్   

 

శా. పూదోట్ల    న్దిరుగా  డినాత  లపులం  బ్రోచేవు  యేభాగ్య మో                

పూదేనం  తయున ద్దినాప  దములన్ బుట్టేవు తాళంబు గా

స్వాధీనం  బుగని  మ్ముచంద  మికనే   ౙాల్వార పారాణిగా నీ

పాదాల ద్దెదని  ల్వవమ్మ  నిలునా భావాల వేదంబుగా                                                                                                                                                                                                                                                                                                                                                    

 పూదోట్ల    న్దిరుగా డినాత లపులం  బ్రోచేవు  యేభాగ్య మో

 పూతోటలలో తిరుగుతు నా ఆలోచనలు వృద్దిచేసేవు ఏ అదృష్టమో గానీ 

పూదేనంతయు నద్ది నా పదములన్ బుట్టేవు తాళంబు గా

(నా పదాలకు తేనె పూసి వాటిలో తాళము మై ధ్వనిచేవు)

స్వాధీనంబుగ నిమ్ము చందమిక నే ౙాల్వార పారాణిగా నీ

(ఛందస్సు పై నాకు నియంత్రణ నివ్వు పారాణి కారుతున్నట్టు)

పాదాల ద్దెద నిల్వవమ్మ నిలు నా భావాల వేదంబుగా

(నీ పాదాలకు ఆద్దుతాను నా భావాలలో వేదమై నిల్వ వమ్మ)


శా. శ్యామానా  తరమా  సుధాహృ  దయనీ  సన్మార్గ  మున్మెచ్చ  గన్      

సామాన్య కృతుల  ల్లిదెచ్చి   తినివే    సన్నాయి  మేళాలు    గన్  

సౌమ్యతన్ గొనుమా వరేణ్య   కనగా    సౌభాగ్య    మింతేక   దా 

పూమాలన్ గళమున్  ధరించు  దయతో  భామాస  మేతుండ  వై 


Saturday, August 5, 2023

ప్రణయ రాగ మంజరి

ఆకాశం అందాన్ని చూసి ఆనందించనివాడు ఉండదు,  ప్రకృతిని చూసి పరవసించని వాడు ఉండదు.  పూలతోటలో పడుకుని, పూల పరిమళాలను ఆస్వాదిస్తూ,  ఆకాశంలో చంద్రుడిని  చూస్తూ  వెన్నెలలో చుక్కలని లెక్కిస్తూ ఉంటే స్వర్గానికి సమీపంలో ఉన్నట్టే , అదే పక్కనే చుక్క ఉంటే... వెన్నెలలో ప్రణయ సాగర మథనం చేస్తూ ఉంటే .. వెన్నెల్లో మనుషులే కాదు సకల చరాచర ప్రాణువులు ఆనందిస్తాయి. ఆకాశం అందాలను  వర్ణించే ఈ కావ్యంలో చంద్రుడి వెన్నెల లో సకల చరాచర ప్రాణులు ఎలా ఆనందిస్తాయో వర్ణించబడింది. 



మొదటి 20 పద్యాలు  తొలిరాత్రి నూతన వధూవరుల ప్రణయాన్ని వర్ణిస్తాయి.  ప్రాచీన లోగిలి ఇంట్లో ఉద్యానవనాన్ని ఆనుకొని ఉన్న  ఉన్న శోభన గృహంలో వరుడు వధువు కోసం ప్రణయాత్రతో ఎదురు చూస్తూ ఉంటాడు. పెద్దలు సంతోషంతో  విశ్రాంతి పొందు తుంటారు.


వధువును ఆటపట్టించి ఆలస్యంగా పంపడం వల్ల శయన గృహంలో ఆస్తిమితుడై ఉన్న  ప్రణయిడు (వరుడు ) కిటికీ తెరచి ఆకాశాన్ని చంద్రుడిని  చూస్తాడు.  




1. ప్రణయిడు, దెరిచి గవాక్షమున్, కాంచె నబ్రపథమునన్

హసిత రజతోజ్వల మేఘోపరి చంద్రబింబమున్

ప్రణయ ప్రయోక్త హిమకర గగన సాగర మధనమున్

పొందె శృంగార యుక్త  హరిచందన చర్చన ప్రణయతాపమున్ 

ప్రణయిడు( వరుడు) దెరిచి గవాక్షమున్, కాంచెను = చూచెను  అబ్రపథమునన్ = ఆకాశములో ; హసిత = నవ్వుతున్న;  రజతోజ్వల = వెండిలా ధగధగలాడు; మేఘోపరి = మేఘాలపైనున్న; చంద్రబింబమున్ = పూర్ణ చంద్రుణ్ణి ;  ప్రణయ, ప్రయోక్త  = ప్రణయ మును ప్రయోగించువాడు ;  హిమకర = చంద్రుని ; గగన సాగర = ఆకాశ సముద్ర;  మధనమున్ = చిలకడాన్ని; పొందె = అలా చూసిన వరుడు పొందెను; శృంగార యుక్త  = మోహము పుట్టించు;  హరిచందన చర్చన = వెన్నెల తాపడము,  మరియు  ప్రణయతాపమున్  = వలపు బాధను.   


The bride groom  opened window and saw in the sky 

The smiling moon above the clouds dazzling with sliver light

The romance spiller moon  was churning the sea of sky

That inspires and gives all life on earth a full romantic charge


2. గగనమునేలె  శశాంక ప్రసరిత మనోఙ్ఞ మయూఖముల్

నిశ నేలె నిశంక ప్రభవ నిశ్శబ్ద విమల సౌందర్యముల్

ప్రభవించె వధూవరుల  మనముల ప్రణయరాగముల్  

నర్తించె నరముల ప్రణయ మయూర సంభోగ  భావముల్ 


గగనమునేలె = ఆకాశమునేలె; శశాంక ప్రసరిత = చంద్రుడు పుట్టించిన  మనోఙ్ఞ = అందమైన  మయూఖముల్ = చంద్ర కిరణాలు;  నిశ నేలె = రాత్రినేలె ;  నిశంక =  నిశ్శబ్ద రాజు ( వ్యక్తీకరణ)    ప్రభవ = జనిత ; నిశ్శబ్ద  విమల సౌందర్యముల్ = నిర్మల నిశ్శబ్దత  యొక్క అందము;    ప్రభవించె = పుట్టించె  వధూవరుల  మనముల ప్రణయరాగముల్ = ప్రేమ;  నర్తించె నరముల= వారి నరములో నాట్యమాడెను ;  ప్రణయ మయూర = వలపు నెమళ్ళు ;  సంభోగ భావముల్. 


At night the moonlight reigns the heavens 

The beauty of silence reigns the earth 

They soothe  the couple and stimulates

Desire, that  dances like peacock in their nerves


3. వారిద వాణినీ  గణరవ రంజిత సురపథమంబునన్ 

 ఉజ్వల తారాలంకృత బృహత్ రంగమండపంబునన్

 కేళీ విలసిత శశాంకుని గాంచి శోకించ  బహుత్ర  నృపుల్

 మదోర్జితుఁడై యుబ్బడే  శశాంకుడుపర్యూపరి హాసంబునన్


వారిద వాణినీ = మబ్బు నర్తకిల;  గణ  = సమూహము యొక్క ;  రవ = మువ్వల సవ్వడుల చే ;  రంజిత = రంజించబడిన; సురపథమంబునన్ = ఆకాశములో; ఉజ్వల తారాలంకృత = ప్రకాశవంతమైన నక్షత్రాల ;  బృహత్ = పెద్ద రంగమండపంబునన్ = కళావేదిక పైన ; కేళీ విలసిత = వేడుకలో మునిగిన   శశాంకుని గాంచి = చంద్రుణ్ణి చూచి  శోకించ = ఏడవగా ; బహుత్ర = అనేక ప్రదేశాల్లో ఉన్న;  నృపుల్ = రాజులు ; మదోర్జితుఁడై = గర్వాతిశయముతో యుబ్బడే  = పెరిగి పోడా;   శశాంకుడు = చంద్రుడు ;  పర్యూపరి హాసంబునన్ = పడీపడీ నవ్వుచూ 


Surrounded by cloud dancers and sound of anklets

Seated  in the vast sky auditorium  embellished by stars

the moon is entertained.  As kings on earth are jealous of him

the moon is swollen with pride and continuous laughter.

 

4. ధాత్రి నిమనోన్నతముల్ గాంచి దగదగలాడుచు

రజిత కాంతులన్ జిమ్ముచు చంద్రమబ్రమందలరార

నిగనిగలాడు వధువు నిమ్నోన్నతముల్ గాంచి

కుహకుహ పెరిగి పురుషులు తహతహలాడిరి కుహతోన్


Seeing the great peaks and deep valleys of the earth 

the moon shines blissfully, his glint reflects his ecstasy 

Seeing the peaks and curvaceous bodies of their ladies 

the new grooms reel under the flames of carnal desire

 

5. లఘాట ఘట్టనన్ కందముల్ స్పోటన చెందగన్

ఊర్ధ్వాభివీత మేఘమాల ఇందుని నిఘూడపరచగన్

మేఘతిమిరాంబరము వసుధను అసిత పరచగన్

యామిని శోభను తారలు విశిదపరచగన్


with a sudden gust of wind the clouds scatter

They rise higher like a garland  hiding the moon

the cloud covered sky has darkened the earth

Thus the beauty of the star lit sky is revealed. 

 



6. ప్రసుప్త తటాకమున్ బోలిన తమవృత రాత్రిన్ 

ప్రదీప్త  పారమేష్ట్య సభామంటప గృహమున్ కాంచ

తలపించెను నీలిజల పూరిత సరోవరమునన్ దేలు

ధవళ పుండరీకమున్ వెలిగించె వీక్షకుల మనములన్


7. ప్రణయమునకు ప్రేరణ,  ఆరంభము  ఆకాశము 
ప్రాణమునకు మూలము ఆలంబనయు జలజనేత్రి  
వివాహముల కాలవాల మాకశము, వినోదముల కుదాత్రి
ఆది  ప్రణవత్  శుభములకు  ఆరంభము శోభన రాత్రి.      


8. స్వర్ణ విలసిత రత్నమాలాలంకృత  యామిని 
పూర్ణ  బిమ్బవదన కంఠహార ధారిణి  కామిని
ద్యుసిత నాసాభరణ ధారిణి   మానసహారిణి
అరుదెంచె చిరుదీపాలంకృత గృహంబునన్


9. చూచిన తెలియున్  కేశిని యని

నవ్విన తెలియున్ సుదతి యని

బిమ్బాధారి రమ్భేయది దరిజేరి

చేకొందు ఇంతి పూబంతి 


10. ఇష్టుడు నిష్టాభికుఁడు గాంచె  అపాంగ దృష్టిన్

సయ్యోపవిష్ట డై   సూర్య స్వీదిత  కిసలయ దేహమున్ 

తత్ దృష్టిన్ గాంచి నిలిచె వధువు ద్వారముఖమునన్  

అవరోపిత నేత్ర  స్పందిత బిమ్బోష్ట  లజ్జావేష్టితంబునన్ 


11. కాంచ కాంతుని కాంక్షాపూరిత  నయనముల్

  చూపె  విహస్త  లలిత లులిత  నయనముల్

 కాంచె  వరుడు ప్రచీర్ణ హిరణ నయనముల్

 వ్రజ వధు సంకీర్ణ వలగ్న వేణి బంధంబునన్

 

12. సాగె  గజగామిని మందగమనంబునన్

మృదుమధుర  నూపురస్వనంబునన్

నిలిచె నితంబి  చేకొని తల్ప స్తంభంబున్

పుష్పాలంకృత శయన మందిరంబునన్


13.  రత్న విభూషిత దర్పణ సమీపంబునన్ 

నాసాభరణ  తుల్య నాగాభరణంబున్  

కాంచి చేరె  కాంతా కర్షిత  సమ్మోహనంబునన్   

దీపాకర్షిత సలభ సద్రశతన్  


 14. క్రీగంట కాంచె ఆర్య పుత్రుని ఆసన్నతన్

చూపుచు నిలిచె అంగన పృష్ఠ భూషణంబులన్

 స్పీత నితంబులన్,  భుజగేశ ప్రతిభాస నిబిడ

 ద్రాష్టిగ కేసంబులన్ తత్ ప్రతిన శీలతన్ 

మనోధినాథుఁడు  పొందె మధుర భావంబులన్


15.నింగి కి జలజుని  వోలె నారికి శిరోజములు

తరువుకు కొమ్మలవోలె తరుణికి కేశములు

సముత్తేజిక  శృంగార సజీవ  హారంబులు

అవిరళ అసమాన  సౌందర్య  వారంబులు


16. కంఠహార అతిశయ ఘన జఘన హారంబు

ఊర్మిమత ద్రాష్టిగ కేశములుపహారంబు

నితంబి నెఱజాణ వేణి నేత్ర పాసంబు

నేత్రుడు గాంచె దళ కోమల నేత్రి విగ్రహంబు


17. కాంచె మకరంద నియుత్త కోమల  అధరముల్ 

  సితాసితక దలనయనముల్  స్పీత నితంబముల్ ,

  మృగయాక్షి  సితద్రాపి గుప్త సౌందర్యముల్

  స్వర్ణ కటిబంధ  గుప్త నిమ్న నాభీ  సౌందర్యముల్ 




18. మౌఖిక రతి చుంబన,  ఘటన వర్ణన  

 పృష్ఠ ప్రతివర్తిత   తరుణి  లజ్జా విముఖంబునన్   
చూపె ఘన శ్రోణి  బింబమున్ కాంచె కమ్మలుబ్ధ 
 విభడు వధువు మనోహర శ్రోణి యుగ్మమున్  
దర్పణ బింబ కంపిత అధర  యుగ్మమున్ 


ఉపగమ్య  విభడు  తాకి చేకొన  మృదు పాణీ  పల్లవముల్
 విశద  కోమల  తామ్రోష్ట ముల్ మంద  ప్రకంపనల్  బొంద 
ప్రగత విభుడు  ఓష్ఠములను బంధించె   ఓష్ఠములన్  




19.   భ్రంశిత సిత చేలము న్ విగలిత పరిచేలమున్

 చలిత కుచ కుంభ నితంబ విలోలమున్

 మదన కుతూహల తురగ  విహారమున్

 అభంగ శృంగారాంబర నిరంబర సంసర్గమున్ 



భ్రంశిత సిత చేలమున్ = కదలిన తెల్లని చీర ; విగలిత పరిచేలమున్ = జారిన పైట ; చలిత కుచ కుంభ = కదులుఘన స్తనములు ;  నితంబ విలోలమున్ =ఊగు పిరుదులు; మదన కుతూహల = కాంక్ష తో;   తురగ  విహారమున్ =గుర్రపు స్వారీ; (వలె నగుపించెను)  శృంగారాంబర = శృంగారాకాశ మందు; నిరంబర =నగ్న; అభంగ సంసర్గమున్= అడ్డులేని సంయోగము.  ఇంతకన్నా భంగిమలు  విడమరచి చెప్పుట భావ్యము కాదు, ఊహఉన్నచో ఊహకందును.  




19.  అరుణీకృత కుచగండ మండలావృత అకీర్ణ కేశ కలాపి జాల మున్
 ప్రపత  పటవాసమున్ సయనాస్త్రాణ న్యాస్త ముక్త   భూషణాదులన్
 ప్రోస్థిత తిలకమున్  గంబూర శుక్ర గన్ధావర్తన  సయనావాసమున్
 చూచితి శ్రాంత  చిత్రపతంగికల భంగిమల్ ద్వారద్రక పరివేక్షణన్. 


అరుణీకృత = ఎర్రబారిన (ముద్దులాడుటవలన కావచ్చు); కుచగండ మండలావృత  = స్తనములు  బుగ్గల నావరించిన; అకీర్ణ కేశ కలాపి జాల మున్ = చెల్లాచెదురు గా పడిన కేశములు; ప్రపత  పటవాసమున్ = జారిన లంగా ; సయనాస్త్రాణ న్యాస్త  = పక్క దుప్పటి పై పడియున్న ; ముక్త   భూషణాదులన్ = సడలిన ఆభరణములు; ప్రోస్థిత తిలకమున్  = చెదిరిన తిలకము; గంబూర శుక్ర గన్ధావర్తన  సయనావాసమున్ = శుక్ర  కర్పూర మిళిత గంధమలిమిన శయన గృహము; చూచితి శ్రాంత  చిత్రపతంగికల భంగిమల్ ద్వారద్రక పరివేక్షణన్ = అలసిన ఆకుపై వాలిన రెండు సీతాకోక చిలుకలు చూచితిని.







  

Friday, August 4, 2023

కొన్ని లిప్తలు మనిషిగా

బ్రతికి ఉన్న ప్రతిక్షణం  మనిషి జీవించడు.  మనిషి 80 ఏళ్ళు బ్రతికితే 80  రోజులు కూడా  జీవించ లేకపోవచ్చు. అప్పుడప్పుడూ మనిషిలా జీవిస్తూ  యంత్రం లా బ్రతికేస్తాడు. 


గోట్ + షీప్ =  గీప్ , లయన్ + టైగర్  = లైగర్  ,  బఫెలో + కౌ  = బీఫలో   వోల్ఫ్ + డాల్ఫిన్ = వోల్ఫిన్ 

మగ సింహం ఆడచిరుత ని కలిస్తే వచ్చేది   లిపార్డ్.    మనిషి హైబ్రీడ్.   మేన్ + మెషీన్   =  మెన్షిన్ 

ఏ  అర్ధ రాత్రో  కొద్ధి  క్షణాలు మనజీవితం గుర్తొచ్చి మనకి నిజమైన దుఃఖం కలుగుతుంది. మన తప్పులను మన మనసుకి చెప్పుకుని , ఒప్పుకుని  జెన్యూన్ గా ఏడుస్తాం. మన జీవితాన్ని నగ్నంగా ముద్దాడతాం. ఆక్షణాలు మనం బ్రతుకుతున్న నిజమైన  క్షణాలు.  మరుక్షణం కళ్ళు తుడుచుకుని అహంకారం  అనే ముసుగు కప్పుకుని మొండిగా  యంత్రంలా బ్రతకడానికి తయారవుతాం.  ఐతే ఈ విషయం అందరికీ అర్థమవ్వాలనిలేదు.  ఒక చిన్న విషయం కనుక్కోడానికి శాస్త్రవేత్తలకి అనేక సంవత్సరాలు పడుతుంది.   కొన్ని సంవత్సరాలు పాటు చూసిన విషయాన్నే చూస్తూ చేసిన ప్రయోగాన్నే చేస్తూ  అనేక పొరపాట్లు దిద్దుకుంటూ ఒక చిన్న విషయాన్ని కనిపెడతారు.  ఒక టన్ను పిచ్ బ్లెండ్ నుంచి గ్రాములో పదవ వంతు రేడియం తీయచ్చని తెలుసు కోడానికి  మేరీక్యూరీ కి  1898 నుంచి 1910 దాకా అంటే 12 సంవత్సరాలు పట్టింది. నువ్వు ఏంటో నీకు కొంత కొంతగా అర్థమవుతూ వచ్చిందని అనుకుంటాను. అయితే అర్ధమైన విషయాలని ఒప్పుకోడానికి అహంకారం అడ్డొస్తుంది. అందరూ బ్రతుకుని కోరుకుంటారు  అందులో తప్పులేదు. ఒప్పుకోవాలని రూలేమీ లేదు. అప్పుడప్పుడూ మనిషిగా జీవిస్తే అదేచాలు.