అక్టోబర్ 17, 2023. శుక్రవారం సాయంకాలం 6.00 గంటలకు విజయవాడ ఠాగూర్ గ్రంధాలయంలో ఎక్స్ రే సాహిత్య అకాడమీ వారు "నా విజయంలో నా భాగస్వామి పాత్ర" అనే కార్యక్రమానికి కవి, పండితులు, సమాజ సేవకులను జంటలుగా పిలిచి సన్మానించారు.
కృష్ణాజిల్లా గ్రంధాలయ సంస్థ చైర్పర్సన్ పూర్ణమ్మ గారు గౌరవ అతిథి గా పౌరగ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రసన్నకుమార్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఎక్సరే సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ ప్రధాన కార్య దర్శి ఆంజనేయ రాజుగారు సభాధ్యక్షత వహించారు.
ఎంతో ఆహ్లాదంగా సాగిన ఈ సమావేశకార్యక్రమంలో నేను నా అర్థాంగి వరలక్ష్మి తో పాల్గొన్నాను. ఎక్సరే సాహిత్య అకాడమీ వారు సన్మానితులను " నా విజయంలో నా భాగస్వామి పాత్ర" అనే విషయం పై మాట్లాడవలసిందిగా కోరి అవకాశం ఇచ్చారు. రంగ వైభోగంగా కన్నులపండుగగా జరిగిన ఈ సన్మాన కార్యక్రమం నాకే కాక పాల్గొన్న లబ్ధ ప్రతిస్థులందరికీ గగనతలంలో వెన్నెల విహారాన్ని తలపించింది, మాజీవితాలని మేమే చూసుకొనే అవకాశం కలిపించి మా మనసులను కరిగించింది. కరిగి పోయిన కాలంలో యవ్వనం ఎలా కారిపోయిందో తలుచుకుంటుందే మనసులను ఆర్ద్రమైపోయాయి.
సాయంత్ర సమయం సాహితీమూరుల సమక్షంలో గడపడం ఒక అదృష్టం.