Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Saturday, March 6, 2021

Bharatavarsha 139

 కాలం స్తంబించిన ఎంత బాగుండును. ఎట్టి దుర్వార్త వినవలసి వచ్చెను! సుందరి ఎంత  గుణవతి! ఆమెకు ఇట్లు జరగవలసినది కాదు.  ఈ విషయం మీనాకి ఎట్లుచెప్పవలెను?  అంత సాహసమెట్లు చేయవలెను? నేనట్టి సాహసం చేసిననూ  పరిణామములట్లుండునో కదా! కోడలు పై పిచ్చి ప్రేమ పెంచుకొన్న ఈమె ఏమిచెయునో! అట్లని భయపడి ఈ నిజము దాచినచో … జరగరానిదేమైననూ జరిగినచో… రేపు కార్యక్రమములన్నెయూ రద్దు చేయవలెను. యమున లేచి మీనాక్షికి తొలగిన దుప్పటి కప్పి, దూరవాణి వద్దకు పోయి నిద్రించుచున్న మీనాక్షిని చూచి కోటి రాగాలు పలుకు వీణ  స్వరఝరులు సంచిత నిధి. గిజిగాఁడు గూడల్లినట్లు ఎన్ని రాగాలు అల్లినది! రేపు రికార్డింగ్ జరగవలెను. ఈమె ఖ్యాతి ఆచంద్ర తారార్కము నిలవవలెను. అయినచో నేనేమి చెయవలెను? ఈ రాత్రి ఏమిచేయుటకూ పాలుపొకున్నది. యమున కనులు వాలుచుండగా నిద్ర లోకి జారెను. 


 సన్నని వెలుగు రేఖలు పడకగది కిటికీ నుండి తొంగి చూచుచున్నవి యమున లేచి చూడగా పక్కపై మీనాక్షి కనిపించ కుండెను. స్త్నానముచేసి మల్లె పూవు వలె తెల్లని చీర లో ప్రక్కగదిలో  కొత్తస్వరములు కూర్చుచుచుండ యమున స్త్నానము చేసివచ్చి తెల్ల చీర ధరించి  వచ్చి మీనాక్షి వంక చూసెను.  నల్లంబి చల్లగా కూయుచుండెను. దురాయి పెట్టినా నల్లంబి ఆగునా ! జరగవలసినది ఆపుట ఎవరి తరము అని తలచి యమున బుచ్చమ్మగారు చెప్పినదంత యూ వప్పగించెను. 

అయ్యూ బిడ్డకు ఎంత ఖర్మ పట్టెను , ఎండ్లల్లోద్విచక్రికపై తిప్పుచున్నాడా! పట్టెడు అన్నము పెట్టుచున్నడో లేదో యని కడుపు పై బాదుకొనుచూ ఏడ్చుచుండెను. వెంటనే యమునతో బయలుదేరి విమానాశ్రయమునకు పోయెను. విమాన ము లేవియూ సిద్దముగా లేకుండుటచే ఒక పైవేట్ జెట్  చార్టర్  విమానమును తీసు కొని విశాఖ కెగిరిపోయెను. 

విమానము దిగగానే మీనాక్షి  హుటాహుటిన అగస్త్యుని ఇంటికి పోయెను. అచ్చట పసుపు తాడు ధరించిన సుందరి గృహకృత్యములు లందు మునిగి యుండగా అగస్త్యుడు వివేకునితో సొఫాలో కూర్చొని చర్చించుండెను. వారి ముందు న్న చిన్న బల్లపై వారతాపత్రిక లో మీనాక్షి సన్మానము చిత్రము వార్త ప్రచురించబడి ప్రస్పుటముగా కనిపించు చుండెను. వివేకుడు న్యాయవాదిని కలవవలెననిబయలుదేరెను. సుందరి అత్తయ్యా ఎప్పుడు వచ్చినారు, మీరాకతో మా కనులు నిండినవి  అని కూర్చొనబెట్టి మంచినీళ్ళు ఇచ్చి “ అయ్యూమీకు కాఫీ ఇచ్చుటకు నా ఇంట పాలైననూ లేవు” అను చుండగామీనాక్షి ఎరుపెక్కినవిక్రోదావేశములు కట్టలు తెంచుకొనివచ్చ నవి. 

ఆమె సివంగివలె అగస్త్యునిపై పడి రక్కి , మా ఇంటి మహాలక్ష్మికి ఏ గతి పట్టించితివి అనుచూ  రెండు చెంపలూ వాయించుచూ కాకితో కబురు పంపినచో వలసినంత ధనమిచ్చెడి దానను. నాకోడలు ఇంకొక్క క్షణము  ఇక్కడుండు టకు వీలు లేదు. అని మీనాక్షి అనుచుండగా సుందరి  చెంపదెబ్బలు తిని శూన్యము లోకి చూచుచూ  చేస్టలుడిగి  కూర్చొన్న అగస్త్యుని వద్దకు చేరి అతడిని లాలించు చుండ మీనాక్షి తన చేతులు రెండు చూచుకొనుచూ తల బాదుకొని విలపించుచుండెను. యమున " అమ్మా అమ్మా” అని మీనాక్షి చేతులు పట్టుకొనెను. 

మీనాక్షి లేచి యమున జబ్బలు  పట్టుకొని కుదుపు చుండగా యమునకి మెలుకువవచ్చి కనులు తెరిచి చూసి ఇదంతయూ కలా అని అనుకొనెను. మీనాక్షి యమునచే మంచినీరు త్రాగించి కొలది సేపు లాలించి మరల పడుకొనెను. 

తెల్లవారినది యమున ముందుగదిలొకి పోయి  బల్లపైనున్న ఇంగ్లిష్ వార్తా పత్రికను చూ సెను. కలలో  వార్తాపత్రిక లో చూసిన అదే భంగిమలో మీనాక్షి నవ్వుచూ కనిపించెను. యమున అవాక్కయ్యి  బసవడిని దూరవాణి నందు సంప్రదించగా వివేకుడు అచ్చటనే ఉన్నట్లు తెలిసెను. యమున మ్రాన్పడెను. “నాడు వర్షుడు ఏమి చెసినాడు? ఒంటరి పోరాటము సలుపుటకు అగస్త్యుని ప్రేరేపించినాడు. ఒంటరి పోరాటమందు సుందరిని ఎట్లు చేజిక్కించుకొనెనో అట్లే అగస్త్యుడు చేయు ధర్మ పోరాటమందు అతడే నెగ్గవలెను.  తన ఆస్తిని తాను దక్కించుకొనవలెను.”  ఇప్పుడు ఎవరికి ఫొను చేయవలెనో యమునకి  అర్దమైనది.

                                                                         ***

విశాఖపట్నం: జిల్లా న్యాయమూర్తి గారి కచేరి
దక్షిణమూర్తి బోను వద్ద ఒక కుర్చీ లో కూర్చొ నెను.  సుందరి అతని ప్రక్కన కూర్చొని త్రాగు నీరు సీసాతో అందించుచుండెను. ఆమె ప్రక్కన అగస్త్యుడు, బసవడు పార్వతి లకుమ వివేకులు కూర్చొని యుండగా మరొక కోణమందు శ్యామ్, గ్రేస్, సుందర్, సంస్థ ఆడిటరు కూర్చొని యుండిరి. న్యాయమూర్తిగారు లోనికి వచ్చిన పిదప  అందరూ లేచి నిలచినారు.  న్యాయమూర్తిగారు న్యాయ పీఠము నధిష్టించి కూర్చొనిరి అందరినీ కూర్చొన వలసినదిగా సైగ చేయగా అందరూ కూర్చొనిరి. 

                                          
వాది (ప్రోసెక్యూటర్): యువరానర్  దక్షిణామూర్తి అను ఈ ముద్దాయి మీనాక్షీ ఫిషరీస్  లిమిటెడ్  వ్యవస్తాపకుడు,  డైరెక్టర్స్ బోర్డ్ చైర్మన్, సెక్యూరిటీస్ కుంభకోణలో అరస్టయిన నిందుతుడు.  400 కోట్ల  సంస్థ  నిధులను  సొంతానికి వాడుకొని పెట్టుబడి దారులను మోసం చేయడమే కాకుండా  కుట్ర పూరితమైన ఆలోచనలతో  డైరక్టర్లు, సంస్థ సిబ్బిందిని ఇరికించాలని చూస్తున్న ఈ నేరస్తుణ్ణి 2013 కంపెనీ చట్టం  సెక్షన్ 447  ననుసరించి కఠినంగా శిక్షించాలని కోర్టు వారిని కోరుకుంటున్నాను.   
అబ్జెక్షన్ యువరానర్ మొదట నిందుతుడని తరువాత నేరస్తుడని  ప్రోసెక్యూటర్ (వాది) విచారణ మొదలవ్వకముందే నిర్ణయించేసారు. న్యాయమూర్తి “అబ్జక్షన్ సస్టైండ్!”
వాది : సారీ యువరానర్, కుట్ర పూరితమైన దురాలోచనలు కలిగిన పచ్చి మొసగాడని అతడి  మొహం చూసిచెప్పొచ్చు. 
ప్రతివాది: ప్రోసెక్యూటర్ గారికి ఫేస్ రీడింగ్ వచ్చినట్లైతే కోర్ట్ వచ్చే బదులు రామకృష్ణా  బీచ్కి వెళ్ళీతే మంచిది.  విచారించకుండా ఇంత తీవ్రాఅరోపణలు ఎలాచేస్తున్నారో నాకర్ధంకావటం లేదు ! మీకేమైనా అర్ధమవుతొందా యువరానర్?
న్యాయమూర్తి: మీరు మీరు చూసుకోండి నన్ను లాక్కండి
వాది: తాళి కట్టిన భార్యనే మోసగించి రోడ్డు మీద కొదిలే సాడు యువరానర్. ఈ దక్షిణ మూర్తి మోసగాడని చెప్పడానికి ఇంతకంటే ఏంకావాలి యువరానర్?  గ్రేస్ , శ్యామ్ , సుందర్ అనే ఈ అమయాకులని, నిజాయతీ పరులని  ఇరికించి తప్పించుకొవాలనే  ఇతడు ముమ్మాటికీ కుట్ర దారుదడే యువరానర్.
ప్రతివాది:  గ్రేస్ , శ్యామ్ , సుందర్ లని అమాయకులని , నిజాయతీపరులని, ఒక వెర్రి లేదా పిచ్చివాడు మాత్రమే అను కుంటాడు యువరానర్. సర్క్యూట్ హౌస్ దగ్గర  గ్రేస్ విల్లా అనే 30 కోట్లు ఖరీదు చేసే విలాసవంతమైన భవనం, ఇంకా డాబాగార్డెన్స్ లో  50 గదుల 3 నక్షత్రాల హోటల్  నిజాయతీ పరురాలైన గ్రేస్ కి ఎక్కడి నుంచి వచ్చయో వాది కోర్ట్ వారికి చెప్పాలి. ఆవిడకి అంత ఆదాయం ఎక్కడినుంచి వచ్చింది? 
వాది: మిలార్డ్ పది కోట్లు కూడా చేయని ఈ రెండు ఆస్తుల విలువ వందకోట్లు చేస్తుందన్నట్టు మట్లాడుతున్నారు. లేర్నెడ్డిఫెన్స్ లాయర్  కేసుని ప్రక్క త్రోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కేసు, కంపెనీ చట్టాలని అతిక్రమించి పెట్టుబడిదార్లను మోసగించి వారి డబ్బును అక్రమంగా మింగేసిన ఆర్దిక నేరం. డిఫెన్స్ లాయర్  డిస్ప్రపోషనేట్ ఏసట్స్ అంశాన్ని లేవనెత్తి కోర్ట్ వారి సమయాన్ని వృధా చేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులకి ఈ కేసుకి ఏంటి సమ్మందం యువరానర్?
ప్రతివాది:  సమ్మందం  ఉంది యువరానర్. డైరక్టర్లు  గ్రేస్ , శ్యామ్, సుందర్ డబ్బును దోచుకొని నమ్మక ద్రోహానికి పాల్పడ్డారు.  డిస్ప్రపోషనేట్ ఏసట్స్ అని నేను అన్నట్టు ప్రోసెక్యూటర్ నక్క తెలివితేటలు చూపిస్తునారు.
ఏ రాజకుమార్ హొల్ద్ యువర్ టంగ్ నక్క గిక్క అంటే నేను కూడా కుక్క తొక్క అనాల్సి ఉంటుంది. 
న్యాయమూర్తి : ఆడర్ ఆడర్ ( సుత్తితో బల్లపై కొడుతూ)
వాది: డిఫెన్స్ లాయర్ ని  గమర్యాద గా కోర్టు భాష మాట్లాడమనండి యువరానర్
ప్రతివాది:  నక్క విన యం, అన్నట్టుగా నక్క తెలివితేటలు అనేది తెలుగులో సామాన్యంగా వాడేమాటే. కి మార్ద్రకవణిజో వహిత్రచిన్తయా? అంటే  అల్లపువ్యాపారికి పడవల విచారణ ఎందులకు? అని అనిపించవచ్చు కానీ అల్లపు వ్యాపారానికి కూడా రవాణా కావాలి యువరానర్
న్యాయమూర్తి : మీరు చెప్పదలుచుకున్నది సూటిగా చెప్పండి
ప్రతివాది:  డిస్ప్రపోషనేట్ ఏసట్స్ అని ముసుగువే సినా ఇది మనీ లాండరింగ్ కేసు. పదికోట్లు విలువ చేసే ఆస్తి అని చెపుతునే పొసెక్యూటర్ గారు నోరుజారి ఆస్తి యొక్క అసలు విలువ  వంద కోట్లని  చెప్పేసారు. నిజం దాచాలన్నా దాగదు యువరానర్. ఏ భై గదులున్న త్రీ స్టార్ హోటల్ కనీసవిలువ ఇండియాలో ఎక్కడైనా 50 కోట్లు పైమాటే అన్న విషయం తెలియకుండా కోర్ట్ వారిని ఏమార్చాలని చూస్తున్నారు వాది. 
వాది: ఏయ్ రాజ్ కుమార్, మనీ లాండరింగ్  అంటే ఎంటో  తెలుసుకుని మాట్లాడవయ్యా, విదేశాల్లో ఖాతాదార్ల వివరాలడగని బేంకుల్లో డబ్బు దాచి , లేని కంపెనీలు సృష్టించి నల్ల ధనాన్ని తెల్లధ నంగా చూపించడం.
ప్రతివాది:  అయ్యా గుప్తా గారు, తాతకి దగ్గులు నేర్పడానికి  ప్రయత్నించొద్దు. ప్లేస్ మెంట్ , మాస్కింగ్ , ఇంటిగ్రేషన్  అనేవి మనీ లాండరింగ్  లో మూడు దశలు.  హై వేల్యూ ఆస్తులని తక్కువధరకి చూపడంకూడా మనీ లాండరింగే.  యువరానర్… అర్దిక నేరగాళ్ళు సీ బీ ఐ ఈడీ లకంటే  ఎప్పుడూ  మూడడుగులు ముందే ఉంటారు. ఈ కేసు లో  అంతకంటే ఎక్కువగా 30 అడుగుల ముందున్నారు. లండన్ లో గత 8 నెలల క్రితం 1962 ఫెరారి కారు 400 కోట్లకి వేలం వేయబడింది. నెల తిరక్కుండా ఆ కారు దొంగిలించ బడింది. ఆకారుకొనుక్కున్న హగ్ డాంసీ ఇచ్చిన పొలీస్ రిపోర్ట్ కాపీ ఇదిగో పరిశీలించండి, యువరానర్. 
అబ్జక్షన్ యువరానర్ , కారు దొంగతనము నకు ఈ కేసు ను ముడిపెట్టు ట సరికాదు
ముడి  పెట్టుటకాదుయువరానర్ ముడి విప్పుచు న్నాను. ఈ దొంగిలించబడిన కారును  10 కోట్లకు కొని మొత్తాన్ని  400 కోట్లు పెట్టి దక్షిణమూర్తి కొన్నట్లు చూపి  ఓవర్ సబ్స్ క్రి ప్షన్ మొత్తమును పెట్టుబడిదార్లకు తిరిగి ఇవ్వకుండా చైర్మన్ వాడుకున్నట్టు ఈ నేరమును అతడి మెడకి చుట్టినది , అమాయకురాయలయిన గ్రేస్ అతడి భార్య. యువరానర్ దక్షిణమూర్తి భార్య నుండి విడాకులు తీసుకొని ఈమెను(గ్రేస్) చేసుకొనుట మోసమయనచో భర్త ఉంటుండగా ఇద్దరితో అని చెప్పుచూ ముగ్గురితో అక్రమసమ్మందము నెరుపు ఈమె ఎంత మోసగత్తె!
గ్రేస్ కన్నీళ్ళ తో ఇచ్చటేమి జరుగుచున్నది పెద్దగా ఆక్రోశించుచూ శీలపరీక్ష చేయుచున్నారా అని రాజ్ కుమార్ తో వాదనకు దిగగా, అగస్త్యుడు కూడా లేచి గొంతు పెంచుటతో   న్యాయస్తానమందు పెద్ద గలాభా మెదల యినది. వివేకుడు సుందరి ఎంత వెనుకను లాగుచు న్ననూ అగస్త్యుడు శాంతించకుండుటచే వాగ్యుద్దముల వల్ల  పెద్ద గోల నెలకొనెను.
న్యాయమూర్తిగారు ; ఆడర్ ఆడర్ అని పలుమార్లు సుత్తితో కొట్తి కమ్ టు ద పొయింట్ అండ్ స్టిక్ టు ద కేస్ అని ప్రతివాది (డిఫెన్స్ లాయర్) ని మందలించినారు. 
ప్రతివాది : సారీ! యువరానర్
వాది : లండన్ పోలీసుల కళ్ళు కప్పి  దొంగిలించబడిన కారుని తీసుకెళ్ళడం అసంభవం అది కారు అగ్గిపెట్టి కాదు జేబులొ పెట్టి తీసుకెళ్ళడానికి.
ప్రతివాది : ప్రతి యేడు లండన్ నుంచి వందలాది కార్లు దొంగిలించబడి షిప్ కంటైనర్ లలో  ఫ్రాన్స్,  దక్షిణ ఆఫ్రికా- ఉగండా వంటి దేశాలు చేరుకుంటాయి. ఈ సంవత్సరం ఇంతవరకు లండన్ నుంచి మొత్తం 34 హై వేల్యూ కార్లు దొంగిలించబడ్డ ట్టు స్కాట్లాండ్ యార్డ్  రెపోర్ట్ పరిసీలించవలసింది గా కొరుతున్నాను.  8 దేశముల మీదుగా ఈ కారు భారత దేశము చేరుకొన్నది.  
వాది : ఇది యొక కట్టుకథ వలెనున్నది పూర్తివివరములున్నచో ఆధారములు చూపవలెను. 
ప్రతివాది :  ఆధారములను పరిశీలించండి  ఈ మొత్తము ప్రయాణ జాడను కనుగొన్నది భారత దేశపు  ప్రఖ్యాత డిటెక్టివ్. అతడు ఇక్కడే ఉన్నాడు.
వాది : అతడిని ప్రశ్నించుటకు అనుమతి ఇవ్వవలెను. అనుమతి ఇవ్వబడెను.
వివేక్ బోను ఎక్కి న్యాయమూర్తికి నమస్కరించెను. 
వాది : మీపేరు  -  వివేక్ పండిత్ - ఏ శాస్త్ర పండితులు మీరు
మా పూర్వీకులు సంస్కృత జ్యోతిష శాస్త్రములందు పండితులు
మీరు కూడా జ్యోతిష శాస్త్రములందు పండితులు వలెనున్నారే  జాతకములు చెప్పుచుందురా?
వివేకుడు లకుమవైపు చూసెను లకుమ ముఖము ఎర్రబారెను. వివేకుడు అవునండీ మీరు సరిగా పట్టేసినారు నేను మీవంటి ప్రాసిక్యూటర్ల జాతకములు చెప్పుచుందును. ప్రతి శనివారము మీరు గుడికి పొవుచున్నా నని మీ భార్యకు చెప్పి యల్లమ్మ తోట మూడవ వీధిలోగల రెండవ మేడ ఇంటికి పోవుచుందురు. ఇంక ఆదివారము మీరు... అని వివేకుడనుచుండగా” ఆపవయ్యా జాతకముల గూర్చి ఇప్పుడేల
లండన్ నుండి దొంగిలించబడిన ఒక  కారుని తీసుకొ ని పొవుట అంత సులభమా!
నిజమేనండీ ఒక్క కారుని తీసుకొని పోవుట కష్టమే అందుకే 4 కార్లను తీసుకు పోయినారు
ఈ ఫెరారి కారు తో పాటుగా మరొమూడు కార్లు ఒకే కంటైనర్ లో  ఫ్రాన్స్ చేరినవి. నేషనల్ క్రైమ్ ఏజెన్సీ ప్రకారం ఇది వ్యవ స్తీకృత నేరము. ఈ ముఠా అవినీతిపరులైన పోర్ట్ అధికారుల ఆసరాతో కార్లను  ఖండాతరము తరలించుకు పోవుచూ వివిధ దేశాలలో ఏకరీతిగాలేని బలహీనమైన చట్టములను ఉపయోగించుకొనుచుండును. కన్యాలో దొంగిలించబడిన కారు కొనుక్కున్న వారే పత్రములను సరిచూచుకొనవలెను ప్రభుత్వము అచ్చట ఈ భాద్యతను తీసుకొనదు. అందుచే ఈ ఫెరారీ కారు ఉగండా వరకు సిమెంట్ మిక్సర్, హొటల్ టేబుళ్ళు గోనిసంచీ లు వంటి సాధారణ సరుకులతో కొనిపోయి, మొంబాసా పోర్ట్ చేర్చినారు. 
ఇది నీ ఊక దంపుడేనా లేక నీవేపోయి ఆధారారాలు సాధించి తెచ్చినావా?
మీరు సరిగ్గా పట్టేసారు. నేనే పొయి అన్నిపొర్టులనుండి ద్రువ పత్ర ములను తెచ్చికోర్టు వారికి సమర్పించినాను. 
పోర్ట్ బాండ్ గిడ్డంగిలలో నిల్వ చేసినచో  గిడ్డంగి సుంకము చెల్లించి యజమాని వచ్చి విడిపించవలెను కదా వారి వివరములు అక్కడనమోదు చేయబడి యుండును. లండన్ పోలీసులూరకుందురా? 
మీరు సరిగ్గా పట్టేసారు. కారులో ట్రాకింగ్ దివైజ్ ఆధారముగా లండన్ పోలీసులు బాండ్ గిడ్డంగుల వద్ద కాపు కాయగా, గిడ్డంగి సుంకము చెల్లించునప్పుడు కారు యజమాని కాక కొనుగోలు చేసిన వారు  వచ్చి విడిపించుకొనెడివారు. అట్లయినచో వారినే పట్టుకొని నాలుగు తగిలించిన నిజము బయటకు వచ్చును కదా? 
వివేకుడు: లండన్ పోలీసులకు తగిలించు ఆచారము లేకుండుటవల్ల అయ్యి ఉండవచ్చు లేదా వారికి విదేశములలో శిక్షించు అధికారము లేకుండుటచే కావచ్చు. 
వాది : ఇదంతయూ వట్టి కట్టుకథ 
ప్రతివాది : మరి ఆ ద్రువ పత్రములు రసీదులు?
వాది : అంత అవినీతి దేశములందు రశీదులు పుట్టించుట కష్టమా రూపాయికొకటి.
న్యాయమూర్తి: దిస్ కేస్ ఈజ్ అజర్న్డ్

Thursday, March 4, 2021

Bharatavarsha 138

తూరుపు కనుమలలో బాలభానుడు  ధవళ కాంతులు గుప్పించుచుం డెను. బడిపిల్లల బస్సులు కళాశాలలకు కార్యాలయములకుపోవువారి వాహనములు రహదారులపై పరుగులు తీయుచుండ, వాహనముల జోరు యంత్రఘూష హోరుతో నగరమంతయూ సందడి నెలకొనెను. 

మేడపైనుండి ఆ దృశ్యమును పార్వతికి చూపుచూ  “ఓ బల్లిపాడుబాలా మీ ఊరినందెన్నడైననూ ఇట్టి సుందర దృశ్య ము చూచితివా?” అని ఆమె భుజముపై చేయిడ, పార్వతి అతడి చేతిని భుజముపై నుండి తీసివేసి “ఉదక మండలమందు ముద్దు ముచ్చట్లన్నియూ చెల్లించిననూ దొరగారి ఆత్రమింకనూ తగ్గలేదే!  అని దూరముగా తొలగి

“ఆర్యా! మా బల్లిపాడునందు కనులు తెరచిన సస్యకేదారముల విమల శోభలు కనిపించుచుండును, కోవెల గంటలు వినిపించుచుండును, కనులు మూసిన, వేణుగోపాల స్వామి సుందరరూపము కనిపించుచుండును, వేల చందముల  వేణుస్వానంబు వినిపించుచుండును. ఇట్టి దృశ్యము చూచు అదృష్టము మాకింకనూ పట్టలేదు! అని పార్వతి అనగా  “బేలవనుకొంటిని జాణవేసుమీ!” అని బసవడు తన తెలివి తక్కువ తనమునకు సిగ్గు పడుచుండెను. 

పార్వతి  వాలిన బసవని చుబుకము క్రింద, చేతినుంచి “నాజాణ తానమంతయూ నీ పరము జేసి, నా కన్నెతనమును కూడా నీకు బహుమతిగా నొసగితిని కదా!” అని లాలన చేసెను.  బసవడు పార్వతి కళ్ళలోకి చూచుచూ “ఊటీ చలి రాత్రులన్నియూ నిప్పులకుంపటి జెసిన వొప్పులకుప్పకు నేనే బహుమతి ఇవ్వగలను?”

The scenery of Ooty


పార్వతి: నీవు ఇవ్వదలచినచో వీణ బల్లిపాడు పోయి వీణ తెచ్చుకొనుటకు అనుమతినిమ్ము 

బసవడు: వీణకొరకు బల్లిపాడు పొనేల.  నేడే నీకొక వీణ ను కొనిచ్చెదనే,  ఓ వీణా నెఱజాణ. 

 పార్వతి: సౌభాగ్యమన్న ఇదియే కదా!” ప్రేమతో ఆదరించు అత్తమామలు,  అరచేతిలో నడిపించు అన్న ఉన్న  నేనెంత అదృష్టవంతురాలిని! అని పార్వతి అనుచుండగా బసవడి

ముఖము చిన్నబోయెను “ఒహో అయినచో నీ సౌభాగ్యమందు నేను లేనా!” వ్యాకుల చిత్తుడు డాయెను. అప్పుడు పార్వతి “ఓ వెర్రి స్వామీ నీవే నా అసలు సౌభాగ్యము. కానీ ఈ సౌభాగ్యమునకు కారణమైన వారిని ముందు తలవ వలెను కదా! నాడు నీకు కవిత వ్రాసిచ్చినంత సులభముగాపెళ్ళి కానుకగా మా అన్న యాబది లక్షలకుచెక్కు వ్రాసి ఇచ్చెను. మా  అన్న వర్షుడు అంగీకారము సహకారము తోనే నీవు నా చేయి అందుకొంటివి. అనుచుండగా” నాన్నా ఎంత పని చేసితివి నాకు తెలియకుండా కట్నము స్వీకరించితివికదా” అని బసవడు నిర్వేదము పొందుచుండగా,  పార్వతి “ మావగారి మనసు అర్థముచేసుకొని వర్షుడే డబ్బిచ్చినాడు. ఈ విషయము ఇకపై చర్చించరాదు అట్లు మాట ఇవ్వవలెను.” అని పార్వతి ప్రాధేయ పడుచుండగా “నేనెంత అద్రుష్టవంతుడినో కదా! అట్లే మాట ఇచ్చెను. బసవడు మాట ఇచ్చిన పిదప పార్వతి” ఆడిన మాట తప్పవుకదూ అని బెదురు కళ్ళ జింక వలె బసవడి కళ్ళలోకి చూచుచుండగా బసడి కళ్ళలో కనీరు నిండినది. ఆ కన్నీటి పొరలనుండి అస్పష్టముగా ఇంటి గేటు వద్ద ఒక జంట కనిపించెను. సుందరి అగస్త్యులు వచ్చినారు అనుచూ పార్వతి గేటు తీయుటకువడి వడిగా మేడ దిగెను. బసవడు కూడా క్రిందకు దిగి “అత్యంత ఖరీదైన కారు గల ఆసామి ద్విచక్రికపై తిరుగుటయా అని ఆశ్చర్యపడుచుండగా సుందరి నవ్వుచూ “భర్తతో ఇట్లు తిరుగుట ఒక అద్రుష్టమ”నెను. బసవడు “ఓహ్ అర్ధమైనది ద్విచక్రిక  పై భర్తనల్లుకొని కూర్చొన్నచో వలపు రాపిడే కదా!”

                                                                           ***

పులిహోర, పాలతాలికలు  తెచ్చి బుచ్చమ్మగారు  సుందరి అగస్త్య , బసవ పార్వతి లకు అందించగా చందన గ్లాసులతో మంచినీరు అందించుచూ “సందీపు అన్న వచ్చినాడు” అని గట్టిగా అరిచెను.  అప్పుడే గేటు తీసుకొని వచ్చుచున్న సందీపునివైపు చూచి బుచ్చమ్మగారు పలహారము తెచ్చుటకు వంటగదిలోకి వెళ్ళినారు. “ఇప్పుడేనా వచ్చుచున్నావు” అని సందీపుని  బసవడు ఆహ్వానించెను. విమానము దిగి నేరుగా ఇచ్చటికే వచ్చుచు చున్నాను అని సందీపుడు వచ్చి వారి మధ్య కూర్చొనెను. 

బసవ ఎట్లు గడిచినదిరా నీ శృంగారయాత్ర.? ఉదకమండలమంతయూతెగలబడిపోయినదా! అని సందీపుడు అడుగగా,  అగస్త్యుడు  “మేము వచ్చుసరికి చక్రవాకము  వలె మేడపై విహరించుచున్నారు. బసవడు రసికుడే సుమీ” అనెను.

సుందరి పార్వతి ప్రక్కన కూర్చొని  “పార్వతికి ఊటీ విహారము చాలకున్నది. అగస్త్యునితో అని “నీకు కొత్త మిల మిలలు అబ్బినవి, అంతా ఊటీ మహిమే  సందేహము లేదు." అని సుందరి పార్వతిని మెచ్చుకొనెను.

బుచ్చెమ్మరగారు పలహారములు పట్టుకువచ్చి సందీపునికి ఇచ్చి, సుందరితో “సుందరీ ! వైవాహిక ఆనందము నీ కనులలో తొణికిసలాడుచున్నది, మీరందరూ జంటలుగా ఉండగా పాపము సందీపుడే వంటరి వాడయ్యెను.” అని అనగా సందీపుడు “మీరు పాపము తలుచుచున్నారు కానీ మంజూష కుండవలెనుకదా!” అని అనగా బుచ్చమ్మగారి మనసు పిండినటయ్యి “పిల్లలని పెంచు రీతి ఇదా? చూడవయ్యా ఆ మాలిని పిల్లను ఎట్లు పెంచినదో. దానికి తగిన బుద్ధి చెప్పక ఇట్లు దిగులు పడినచో ఏమిలాభము?” బసవడు “అమ్మా అట్లు మట్లాడవలదు  నీకునూ ఒక ఆడపిల్ల కలదు. అని తల్లిని తగ్గమనెను.  పార్వతి " ముందు ఆ దామినిని అనవలెను ముంజూషను ఇంకనూ అతిగారాభము చేయుచున్నది. సందీపుడు తినుట ముగించి “ఎవ్వరినీ అనవలసిన పనిలేదు వర్షుడు నా చేతులు పట్టుకొని నా చెల్లిపై దయచూపుము అని అన్నమాటలను నేనెట్లు మరువగలను. దానికి మొగుడు పై లేకున్ననూ నాకుస్నేహితునిపై ప్రేమాభిమానములు ఉన్నవి. పలహారములు ముగిసినవి.

సందీపుడు “అత్యవసర పరిస్థితి ఉన్నది రావలెనని కోరగా ఉన్నపళముగా బయలదేరి వచ్చితిని, ఏమిజరిగెను?” అని అగస్త్యునడిగెను. బసవడు కూడా అదే ప్రశ్న అడిగెను. మనము బయటకు పొయి మాట్లాడుకొందుమనుచూ అగస్త్యుడు బసవడు సందీపునితో గేటు బయటకు పోయెను 

అగస్త్యుడు “మీ ఇద్దరి సహాయము తప్పనిసరిగా కావలెను. వకీలు వద్దకు పోయి షూరిటీ సంతకములు చేయవలెను.”  చెప్పగా సుందరి “మావగారికి హై కొర్టు లో రెండు లక్షల పూచి కత్తు పై బైల్ మంజూరు అనయినది. ఇద్దరు పూచీదార్లు అంతే మొత్తము  చెల్లించి షూరిటి సంతకములు చేయవలెను." అని చెప్పగా అగస్త్యుడు "డబ్బుమీరు కట్టవలసిన పనిలేదు సంతకము పెట్టిన చాలును." అని వారిద్దరిని చెంతనే ఉన్న లాసంస్ బే కాలనీలో ఉన్న వకీలు వద్దకు తీసుకుపొయెను.  అడ్వకేట్ రాజ్ కుమార్ గారు  అగస్త్యునితో “డబ్బు తెచ్చినారా, ఈ రొజు కొర్టులో చెల్లించవలెను.” అగస్త్యుడు” నాలుగు లక్షలు సిద్ధము గానున్నది.”   అడ్వకేట్” బైలు నిబందనలు గుర్తు ఉన్నవి కదా, మీ నాన్న గారి పాస్పోర్ట్ కోర్ట్ కి సబ్మిట్ చేయవలెను ప్రతి శనివారము పోలీస్ స్టేషన్ కి పొయి సంతకము పెట్టవ లెను. కోర్టు అనుమతి లేనిదే దేశము విడిచి పోరాదు.” 

అగస్త్యుడు సుందరి అన్నిటికీ అట్లే అని తలవూపిగా బసవడు సందీపుడు సంతకములు చేసినారు. అగస్త్యుడు వకీ లుతో వ్యక్తిగతముగా మట్లాడవలెనని అనగా సందీపుడు పార్వతి బసవడు బయట వేచి యుండిరి. బసవడు సందీపుడు మాటలలో మునిగి యుండిననూ పార్వతికి ఎందుకో సందేహము కలిగి తలుపు వద్దకు పోయి వినసాగెను. అగస్త్యుడు చెప్పు మాటలు వినుచున్న ఆమెకు హృదయమందు అగ్గి రాజుకొనెను. బసవడు మంజుషను కలుసుటకు ఇష్టపడక బెంగళూరు వెడలి పోయెను. పార్వతి ద్విచక్రికపై పోవుచున్న అగస్త్యుని సుందరిని అనుసరించెను. ద్విచక్రిక ద్వారకానగర్ మంచుకొండ నగల దుకాణము ముందు నిలిపి సుందరి అగస్త్యుడు లొపలికి పోయినారు. సుందరి బైటకు వచ్చిన పిదప  బసవడు పార్వతి దుకాణములొనికి పోయి వర్తకులను అడగగా “ఆ దంపతులు గత కొద్దికాలముగావారి నగలను ఒక్కటిగా ఇచ్చట అమ్ముచున్నారు, నేడు మంగళ సూత్రము తో సమేతముగా ఉన్ననగల న్నీ అమ్మి లక్ష రూపాయలు తీసుకెళ్ళినారు.” అని చెప్పినారు. 

                                                                          ***

రాత్రి పది గంటలు: కబ్బన్ రహదారి మీదుగా ఇన్నోవా ఇందిరానగర్ కేసి సాగుచున్నది మీనాక్షి నిద్రకు జోగుతూ యమున పై వాలి చటుక్కున కళ్ళుతెరచి సర్దుకుని కూర్చొని అంతలోనే మరల ఆమెపైవాలి నిద్రించుచుండెను. బెంగుళూరు ప్రెస్స్ క్లబ్లో ముఖ్యమంత్రి చేతిమీదుగా మీనాక్షికి జరిగిన సన్మానము యమున మదిలొ చిత్రమువలే తిరుగుచుండెను.  ఇన్నోవా  చెనుస్వామి క్రీడాప్రాంగణము  దాటుచున్నది. మీనాక్షి కళ్ళు తెరచి “విమానము వాలి నదా!” అని మత్తుగా అడిగెను. యమున తలపై చేయి వేసుకొని “తమిళ్ చిత్ర నిర్మాతల మండలి నిన్న చెన్నై లో చేసిన సన్మానము, మొన్న ముంబై లో రికార్దింగ్ ఇట్లు విమానములలో, కార్లలో  తిరుగుచూ ఎచ్చటున్నదో తల్లి. ఇన్నోవా ఇల్లు చేరెను. యమున మీనాక్షిని పక్కపైకి చేర్చెను. మీనాక్షి నిద్రలోకి జారుకొనెను.  

దూరవాణి మ్రోగుచుండెను యమున సాధనమునందుకొనెను.  బుచ్చమ్మగారి స్వరము. యమున ఆమెతో “అమ్మా మీనాక్షి లేదా?”  "ఇప్పుడే సన్మాన కార్యక్రమము నుండి ఇంటికి  చేరి నిద్రించుచుండెను." 

చాలా కాలము నుండి అగస్త్యుని అనుసరించి బసవడు చాలా విషయములను తెలుసుకొనెను కానీ మా బసవడు చెప్పుటకు సందేహించుచున్నాడు. ఇంత రాత్రి చేసినందుకు ఏమీ అనుకొనరాదు. అగస్త్యుని ఆర్ధిక పరిస్తితి దయనీయముగాను న్నది. ఆత్మాభిమానముతో ఆదంపతులు వారి కష్టములను ఎవ్వరికీ తెలపక డబ్బు సాయము చేయగా తీసుకొనక ఇబ్బందులు పడుచున్ననూ నవ్వుతూ గడుపుచున్నారు.  భర్తకు అనుకూలవతియగు ఆ సుందరి అతిడికి చేదొడువాదోడుగా ఉన్నది. కానీ ఆమె గర్భవతి. యమున మనసు స్తంబించెను.

Wednesday, March 3, 2021

Bharatavarsha 137

 బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ : సందర్శకుల గదిలో కూర్చొన్న మంజూష ను చూచి సందీపుడు “ఎప్పుడు వచ్చితివి ? " “ఎవరు అని అడగనందు కు సంతోషము. పెళ్ళాము  నీకు ఇంకనూ గుర్తు ఉన్నదా?” అని మంజూష దెప్పుచుండగ  మంచినీరు అందించుచూ సేవకుడు సందీపునితో “అమ్మగారు వచ్చి చాలా సేపు అయ్యిందండి” 

సందీపుడు : అమ్మగారిని నాగదిలో కూర్చొండబెట్టవల్సినది 

సేవకుడు : ఇదే మొదటిసారి రావడం కదా బాబు తెలీలేదు 

సందీపుడు :  నాశీతల మందిరములో విశ్రాంతి తీసుకొనుము.  (పనివానితో) చిన్నబాబు  పోయి పండ్ల రసము తీసుకొని రమ్ము.   మంజూష :   నేనిచ్చటే కూర్చొందును. 

సందీపుడు : నీకు నెలలు నిండుచున్నవి వట్టి మనిషివి కాదు , మన ప్రేమ ఫలము నీలో పెరుగుచున్నది , నేను సమావేశములో  ఉండుటచే నీకు అసౌకర్యము  కలిగినది, 

మంజూష : అయ్యో! ప్రేమ కారిపోవుచున్నది , ఎప్పుడు చూసినా వ్యాపార సమావేశములు , వ్యాపార నిర్వహణ. అని మంజూష గొంతు పెంచెను.  

సందీపుడు : నాగదిలోకి పోయి మాట్లాడుము, ఇచ్చట చుట్టూ సిబ్బంది కలరు. రెసెప్షనిస్ట్ మననే చూచుచున్నది.   గొంతు పెంచిన నా కప్రతిష్ఠ అగును.  అయిననూ నీవు ఆఫీసుకి రావలసిన పని ఏమి కలదు?

మంజూష : బెంగుళూరు వచ్చి రెండు నెలలు దాటెను. ఎన్నడైననూ నన్ను పట్టించుకొంటివా?   ఎచ్చటికైననూ తీసుకు  పొమ్మన్నచో  ఇట్లే తప్పించుకొనుచున్నావు.  లకుమ భర్తతో   శృంగార యాత్రకి (హానీమూన్కి) శ్రీలంక పోయినది. సందీపుడు ఇంక ఓర్చుకొనలేక మంజూషను చేయిపట్టి  తన గదిలోకి తీసుకొని పోయెను. ఆమెను సోఫాలో కూర్చొండబెట్టి  పళ్లరసము నోటికందించగా మంజూష మొఖం తిప్పుకొనెను. ఎల్లప్పుడూ గంభీరముగా నుండెడి సందీపుడు భార్య తో అవస్థలు పడుట చూసి  రెసెప్షనిస్ట్  అతడి తలుపు వద్ద చెవానించి వినుచుండెను. 

సందీపుడు: ఆ డిటెక్టివ్ ని నమ్ము చున్నావా వాడుత్త  మాయలమారి లేనిచో శృంగారయాత్రకి ఎవరైనా శ్రీలంక పోవుట వింటిమా ! వాడికి శ్రీలంకలో అపరాధ పరిశోధన ఉండుటచే లకుమను అచ్చటకు తీసుకుపోయినాడు. వాడు బుర్రలు తీసి బుర్రలు మార్చు రకము. లండన్ లో దొంగిలించిన కారు పరిశోధన విషయమై  శ్రీలంక పోయినాడు. 

మంజూష: బుర్రలు తీసి బుర్రలు మార్చు రకము నీవు. అతడు కాదు. లండన్ లో కారు దొంగిలించుటకు శ్రీలంకకు సంబంధమేమి ? మోకాటికి  బట్టతలకు ముడి పెట్టుచున్నావు! 

సందీపుడు: అయ్యో! పిచ్చిదానా,  లండన్ లో దొంగిలించ బడిన  ఫెరారీ  కారు అనేక దేశముల మీదుగా  శ్రీలంక లోకి ప్రవేశించి  చివరకు భారత దేశము చేరుకొన్నదట.   అగస్త్యని సవతి తల్లి ఆ కారుని నాలుగు వందల కోట్లు పోసి భర్త పేరిట కొన్నదట.  అట్లు సంస్థ  నిధుల దుర్వినియోగము కేసులో అతడిని ఇరికించి  జైలులో పెట్టించెనన్న విషయము తెలియును కదా ! అతడి పరిశోధన పూర్తి చేసుకొని వెనుకకు మరులుచున్నాడు ఇది ఎక్కడి హానీమూన్?

మంజూష: ఆ విషయములన్నీ నాకు తెలియవు బసవడు పార్వతిని ఊటీ తీసుకు పోయినాడు. జంట అన్నచో అట్లుండవలెను. 

బసవడు ఉద్యోగస్తుడు వాడి సెలవు పెట్టి ఎచ్చటికైనా పోగలడు మరి అగస్త్యుడట్లు పోలేదు కదా. వ్యాపారస్తులకు అట్లు కుదురునా ?  సుందరి అగస్త్యుడు  విశాఖపట్నమందే ఉండి ఆనందించుచున్నారుకదా !

ఇంతలో ఇద్దరు వ్యక్తులు తలుపు తోసుకొని లోపలకి ప్రవేశించిరి మంజూష వారినిచూసి  మంజూష: దాసు మామయ్య , ఆది బాబాయి, మీరు ఎట్లవచ్చినారు “మావిక్కడే ఉంటాన్నాం తల్లే , అయినోల్లు ఉంటే ఆడికి ఇదిగా ఉంటాదని ఒటుకొచ్చినాడు.”   

సందీపుడు: వారిరువరునూ ఇచ్చట పనిచేయుచున్నారు, ఇచ్చటనే యుందురు.  

మంజూష:  వారికున్న అవకాశము కూడా నాకు లేకుండెను. నేను నీకొరకు ఎదురుచూచుచూ ఇంటివద్ద కుక్కవలె పడి యుండవలెను అని ఏడవసాగెను. 

సందీపుడు: ఎవరింటివద్ద వారున్నచో కుక్కలా! నీవునూ ఇచ్చట పని చేయుము  నీవునూ ఇచ్చటనే ఉండ వచ్చు 

మంజూష:  పెళ్లామన్నచో నీకు కట్టు బానిసవలెనున్నది.  ఇచ్చట పనిలో పెట్టి పనిదానివలె ఉండమందువా ? అని పెట్టున ఏడ్చుచుండగా సందీపునకు మతిపోయి  ఛీ ఛీ ఈ పెళ్లి నాకు శాపమాయెను. అని వగచుచుండగా, ఆది , దాసు ఇరువురూ అతడిని బైటకు కొనిపోయి ఊరడించినారు. 

దాసు : తొందర పడకురా సందీ,  ఆడదాయి తో ఎలాగుండాలో తెల్దేట్రా! 

సందీపుడు : అయితేటి  సేయ్యమంటావై , కాళ్ళొట్టు కోమంటావేటి?

ఆది : ఓస్ ! కాళ్ళొట్టుకొంతే మాటినేత్తాదేటి , అంత వీజీ అనుకొన్నావేటి?  పెల్లానికి అనుకున్నదయిపోవాలంతే

                                                                       ***

న్యూ ఢిల్లీ : కృష్ణమీనన్ మార్గ్ : అరుణతార : హలో ! 
మేడం  సందీప్ జీ కాలింగ్ ఫ్రమ్ బెంగుళూరు , కన్  ఐ కనెక్ట్ 
అరుణ : ఎస్ , మాలిని నీ అల్లుడు మాట్లాడుచున్నాడు త్వరగా రమ్ము 
మాలిని : బాబూ అమ్మాయి నువ్వు క్షేమముగా ఉన్నారా?
సందీపుడు : మీ అమ్మాయి క్షేమము. నేను సరిగా చూసుకొనుటలేదని అలిగి విశాఖపట్నము పోవుచున్నది. 
మాలిని : ఒక్కసారి దూరవాణి దానికిమ్ము నాయినా!
మంజూష : అమ్మా ఈ నరకమునందు నేనుండజాలను. కాపలా  కుక్కవలె ఇంటివద్ద ఉండుట యే నాజీవితమయిపోయినది. గాను గెద్దువలె యితడు ఆఫిసుకి ఇంటికి తిరుగుట తప్ప నన్ను ఎచ్చటికి తీసుకుపోడు , రెండునెలలుగా ఎదురు చూచి విసిగినాను. తార మాలిని చేతినుండి సాధనమును తీసుకొనెను
తార : అమ్మా  మంజూ నేను తారను, మీరు ఇచ్చటికి రండి నేను మీకు  యూరోప్ సందర్శనము చేయుటకు ఏర్పాట్లు చేసెదను. ముందు నీకు కాన్పు అవ్వవలెను కదా!  అలుడుగారు మంచివారు తల్లి,  గొడవ పడరాదు.   
మంజూష : ఇదేమి మంచి? మంచి అన్న నీ అల్లుడువలె నుండవలెను, లకుమను కొనిపోయి అన్నీ చూపుచున్నాడు 
తార : అయ్యూ పిచ్చిదానా చూచుటకు అచ్చటేమి కలవమ్మా? వారు రేపు తిరుగు ప్రయాణ మగుచున్నారు.  లకుమను రెండు రోజులలో నీవద్దకు పంపెదను. 
మంజూష: వాణినుత్తరించెను.

                                                                     ***

బెంగళూరు: యమున :(దూరవాణి యందు)  అరుణమ్మా నువ్వా , ఎట్లున్నావు ? 
అరుణ : నేను బాగున్నాను మీ అమ్మ ఎచ్చటున్నదే ? 
యమున : రికార్డింగ్ జరుగుచున్నది. ఇరువరమూ స్టూడియో లో ఉన్నాము.
 అరుణ : అహోరాత్రములూ అట్లు సంగీత కచేరీలు చేసుకొనుటయే కదా !
యమున: మాకు గడవవలెను కదమ్మా , ఇచ్చట మాకు మీ వలె పదవులేమున్నవి ? 
అరుణ : నీకు దూకు డెక్కువయినదే, మగడు వచ్చినగానీ నీకుదూకుడు అణగదు   
యమున: రెండు నిమిషములలోకచేరి ముగియనున్నది, అంతవరకూ ఏదైననూ మాట్లాడు 
 అరుణ :  ఏమి మాట్లాడవలెను , నీవు చిన్న పిల్లవు 
యమున : నేను చిన్న పిల్లనా, లంగావోణీ మానేసి చీరలు ధరించుచున్నాను.  మీ ఆయన ఎట్లు చూచుకొనుచున్నాడో చెప్పుము. 
అరుణ :  ఈ సరి కనిపించినచో చెవులు పిండి చేతికి ఇత్తును 
మీనాక్షి : అరుణ ఎట్లున్నావు ? 
అరుణ : మీనా, ఒక ముఖ్యమైన విషయము చెప్పవలెను నేను బెంకాక్ సమావేశములకు పోయి ఉండుటచే నీ స్టూడియో ప్రారంభోత్సవమునకు రాలేకపోతిని 
అందుకు బాధపడుచున్నాను.  మాలిని చెప్పినది పెళ్లి కంటే ఘనముగా చేసినావని .
మీనాక్షి : ఇది చెప్పుటకా దూరవాణి చేసినావు 
అరుణ ; మంజూష  అలిగి  విశాఖ పోవుచున్నది. నీవు పెద్ద దిక్కు  అచ్చట ఉన్నావని మేమంతా ధీమాగా ఉన్నామే. ఫోనులో ప్రయత్నించిననూ అది మాట వినకున్నది.  
మీనాక్షి : ఇట్టివిషయములు తీగలపై ఫలించవు నేనిప్పుడే పోవుచున్నాను .
సమయము సాయంత్రము 6 . 00 గంటలు. ఇన్నోవా  వైట్ ఫీల్డ్స్ వైపు పోవుచుండెను 
యమున: పెంపకము మహిమ కాకున్న, మంజూష ఎందుకిట్లు ప్రవర్తించుచున్నది?
గర్భవతి గాఉన్నప్పుడు హిస్టీరియా వంటి వ్యాదులు, స్త్రీలకు చికాకు పెరుగుట సహజము. పెద్దవారము మనమున్నది దేనికి ఇట్లాడిపోసు సుకొనుటకా?
 ఆహా ఏమి సర్దుబాటుచేయుచున్నావే! రాజకీయములలో చేరినచో తారకంటే బాగుగా రాణించెదవు. నిన్ను విదేశాంగ మంత్రిగా పెట్టుకొ న్నచో భారత పాకిస్తాన్ సమస్యను వారిని ఏమార్చి పరిష్కరించెదవు.  ఆ సందీపుడి గొంతు కోసినారు. సందీపుడు  ఎంతకాలమిట్లు బాధ పడవలెనో?
మీనాక్షి : మంజూష కు పరిపక్వత వచ్చువరకు “మంజుషకు పరిపక్వత ఎప్పుడు వచ్చును?” 
“సమస్యలను అధిగమించినప్పుడు”  “సమస్యలను ఎప్పుడు అధిగమించును”  
“అవి వచ్చినప్పుడు”  “వచ్చినవి కదా”  “వచ్చినచో మంచిదే కదా!”

                                                                        ***

విశాఖ పట్నం : ఆసీలు మెట్ట: దామిని : మంజు ఆటో పై వచ్చినావా, సందీపుడు ఏడి? గర్భవతిని ఇట్లు పంపునా! 
మంజూష :  దామినీ ! అని పెద్దరాగము తీయుచూ  ఆమె భుజముపై వాలి రోదించి,  మీ ఆయన నిన్ను ఎట్లు చూచుచున్నాడే అని అడగగా దామిని  ఖంగు తినెను 
దామిని : మునుపటి కంటే ఎంతో బాగా చూచుకొనుచున్నాడు ,అయినా ఏ మైనదే !
మంజూష : నా రాత ఇట్లాయెను , ఆ సందీపుని వలన నా బ్రతుకు కుక్క బ్రతుకాయెను
అయ్యో లోపలకి రమ్ము ఆయన సమావేశమునకు  వెడలినారు. వచ్చుటకు ఆలస్యమగును. నాకు నిన్ను తోడుగా  ఆ దేముడే పంపినాడు. రమణ అమ్మగారి పెట్టి తెమ్ము అని పనివానికి చెప్పి మంజూషను తన పడక గదిలోనికి తీసుకు పోయెను 
మంజూష స్నానము చేసివచ్చిన తరువాత రమణ భోజనము వడ్డించెను ఇరువురూ భోజనము ముగించి శయ్యపై కూర్చొనగా రమణ సీమరేగు పళ్ళు , ద్రాక్ష పళ్ళు  తెచ్చి ఇచ్చెను . దామిని మంజూష ను దగ్గరకు తీసుకొని, మంజూష  ఆమె పై  చారబడగా నోటికి పళ్ళు  అందించుచూ “మంజూష బంగారు బొమ్మ” అనుచూ ముద్దులాడు చుండెను.  
ఇంతలో గంట మ్రోగెను. మంజూష తలుపు తీసెను హృదయాలజి ష్ట్ వచ్చెను, అతడి వెనుకనే నందిని ఉన్నది. హృదయాలజి ష్ట్ చిరునవ్వు నవ్వి మంజుష ఎప్పుడు వచ్చెను అనుచూ లోపలకి పోయెను. 
మంజూష : నేను ఇచ్చ టకి వచ్చినట్టు నీ కెట్లు తెలియును?
నందిని: పెద్దవారు తల్లడిల్లుచున్నారు. నాకు కాక ఎవరికి ఫోను చేసెదరు? అందుచే ఇంత రాత్రి రావలసి వచ్చెను. మీ అన్నకి తెలిపినచో అతడి శిక్షణ పాడగును. 
దామిని : మీ అన్నకి చెప్పి ఏమి ప్రయోజనము? అతడు డెహ్రాడున్ లో శిక్షణ లో నుండగా ఎట్లు వచ్చును?  ఇంకనూ రెండు నెలలు శిక్షణ గలదు. 
మంజూష: ఐ ఏ ఎస్ లకు శిక్షణ  నాలుగు నెలలేలనో?! నాలుగు వారములున్న చాలదా! 
నందిని: చాలులేవమ్మా నీకు కాపురంచేయుట చేతకాక అన్నపై పడి ఏడ్చుటెందుకు?
నీ పెళ్ళి కొరకు ఎంత శ్రమ ఎంత ధనము వెచ్చించెను 
దామిని : పుస్తకములు వ్రాయుచూ సులభముగా కోట్లు గడించుచున్నాడు. చెల్లి కొరకు ఖర్చు చేసినచో తప్పేమి కలదు? ఈ మధ్యన విడుదలైన పుస్తకము “సూపర్ వుమన్” కూడా ఇంటర్నేషనల్  బెస్ట్ సెల్లర్ జాబితాలొ చేరినది. 
నందిని: పుస్తకములు వ్రాయుట అంతసులభమా! కాపురము చెయుట కష్టమా! దామినమ్మా నీవు మాలిని స్నెహితురాలివి, ఆమె వయసు ఉన్న నీవు పెద్దదాని వలె ఆలోచించవలెను కానీ గుడ్డి ప్రేమతో ఇట్లు మంజూష జీవితమును నాశనము చేయరాదు. 

మంజూష: దామినే నన్ను తల్లి వలె చూచుచూ ప్రేమించుచున్నది మీరందరూ మారిపొయినారు  రా.కి. ఇదివరకు ఎంత సరదాగా ఉండెడివారు? నందినీ , నీవు ఎంత ప్రేమగా చిలిపి సలహాలు ఇచ్చెడి దానవు! కుట్రలు పన్నెడిదానవు! అవన్నీ గతించినవి!
రమణ : అమ్మగారు మా అయ్యగారు పిల్లలు లేరన్న బాధను హాస్యముతో కప్పియుంచి హాస్యప్రియుడివలె కనిపించెడివారు. నేడు అమ్మగారు తళ్ళి కాబోవుచున్నారని తెలిసి ఎంతో ప్రశాంతతను పొందినారు. నాడు ఆయన హాస్యములో దుఖము దాగియుండగా నేడు ఆయన ప్రశాంతతలో ఆయన సంతోషము దాగి యున్నది. నన్ను రావణా అని పిలవక రమణ అని పిలుచుచున్నారు. 

                                                                            ***

Monday, March 1, 2021

Bharatavarsha -136

తూరుపు సిందూరపు వన్నెలతో ఉదయరాగము పాడుచుండెను. నగములు మేలిముసుగు దాల్చిన ముత్తయిదువులవలె నిలిచి యున్నవి. అగములు (వృక్షములు) మంచు మాలలు ధరించిన వధూవరులవలె నగుపించుచున్నవి. తూరుపు ఎర్రబారుచూ సిగ్గిల్లిన నవవధువు వదనము వలె నున్నది.

 కారు లో ఆనందనిలయమునకు పోవుచూ నాదము నంది  వందితమగు  నంద నందుని  వందనము జేసి నందము నందుచు నందిని “అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళ భూలోక సువర్లోక , యక్షలోక, గంధర్వ లోక ములందు ఎందున్నావయ్యా, నంద నందనా, దేవభాషయందు నిన్ను నుతించి  పాదాభివందనము చెయుచున్నాను,  నా మనోవాంచ నీడేర్చ వయ్యా గోపకిశోర!”  అని గోపాలుని గానము చేయుచూ ఆనందనిలయమును చేరి మరువపు ద్వారము ముందు కారును నిలిపెను. ఎర్రని  పరికిణీ పై తెల్లని పైట దాల్చి  చరణ కింకిణిలు కణకణ మ్రోగుచుండ కారు దిగి మరువపు ద్వారము దాటి రాధామనోహర పుషములల్లిన  ప్రవేశ ద్వారమును దాటుచున్న ఆమె ఆ పుష్పములందొక పుష్పము వలే కనిపించుచుండెను.

 ఆనందనిలయములోనికి అడుగు పెట్టి నందిని చుట్టూ కలయజూ డగా అప్పటికే నేలపై పరిచిన ఎఱాతివాచీలను తొలగించబడినవి. కొందరు పనివారు గుడారములను విప్పి ఒక్కొక్కటిగా వాహనమెక్కించుచుండిరి.  ఏడు గంటలగుచున్నది ఇంకనూ ఆనంద నిలయము నిద్ర మత్తులో జోగుచున్నది అనుకొనుచూ నందిని మండువా గదిలోకి ప్రవేశించెను. 

మండువాగదిలో అలంకరణలు అట్లే ఉన్నవి.  వర్షుడొక్కడే సోఫాలో నిద్రించుచున్నాడు. నందిని మాలిని గారి గది తలుపు నెట్టగా తలుపు తెరుచుకొనెను. నిత్యమూ 6 గంటలకు వాకిలిలో కళ్ళాపి జల్లి ముగ్గులు పెట్టవలెనని ప్రవచించు అత్త కూడా ఇంకనూ మేలుకొనలేదు. ఇంక శోభనపు పెండ్లి కూతురులు లేతురా అనుకొనుచూ భిన్న  పుష్పాలంకృత సుందర శయన మందిరముల ను చూచి అబ్బురపడి స్వర్గ తుల్యమగు వారి సంసర్గమునూ హించుకొనుచూ ద్వారములవద్దకు పోయి సుమపరిమళములను మూర్కొని తలుపులు నెట్టి చూచి గడియలు పెట్టియుండెనని గ్రహించెను.

 “అబ్బో జాగ్రత్త గలవారే!” అనుకొని మందగమనమున మండువాగది  దాటి వాకిలి లో అడుగిడి ఎర్రని పరికిణీ ని పైకి దోపి వాకిలి ఊడ్చసాగెను. గుడ్డ గుడారములన్నియూ తొలగించబడి ఆనందనిలయము పై నీలాకాశము కనిపించుచుడెను. చూచు చుండగానే  షామియానాలును మోసుకొని వేనుకదిలిపోయెను.  

నందిని కళ్ళాపి చల్లి ముగ్గు వేసి నలుదిక్కులా పరికించగా విరుల పలకరింత పులకరింతను కలుగజేయుచుండెను. రాత్రంతయూ  తుషారముతో అంటకాగిన  విరులు తమ రాసక్రీడ లకు గురుతుగా  రజోలిప్త దళముల ను చూపుచున్నవి. ఒక్కసారిగా నందినికి సుందరి లకుమలు గుర్తుకొచ్చి ఏమిచేయుచున్నారో చూడవలెనని ఆశక్తి కలిగెను. నందిని మండువాగదిలోకి ప్రవేశించెను. తలుపులకు తాళము దూరు రంధ్రము లున్నవి. నందిని వంగి రంధ్రము గుండా  చూచుచుండగా మాలినిగారు మేలుకొని పైకి వచ్చి నందినివెనుకనే నిలచి అట్లే చూచుచుండిరి. 

నందిని లోపల దృశ్యము గాంచి  పరిసరముల స్పృహ మరచి  ఊపిరి నిలిపి తన్మయత్వముతో అట్లే చూచుచుండెను. కొంత సేపు  చూచిన పిదప  వెనుకకు తిరిగి చూడక అట్లే మరియొక ద్వారము వద్దకు పోయి తలుపు రంధ్రము గుండా లోపలకు చూచుచుండగా మాలినిగారు ఆపిల్ల తెంపరితనమును  చూచి అచ్చెరువందిరి. ఇంతలో మీనాక్షి మేలుకొని తలుపు తీసి నందినిని చూచి పిదప మాలినిని చూచెను. ఒకరినొకరు చూచుకొని పెద్ద వారిరువురూ నోళ్లు నొక్కుకొనిరి. 

ఇంతలో వర్షుడు లేచి పరిస్థితిని గమనించి పరుగు పరుగున పోయి నందినిని జెబ్బ పట్టుకుని లాగుచు న్ననూ ఆమెకు చీమ కుట్టినట్టైననూ లేకుండెను. మాలిని మీనాక్షి ఆమె వద్దకు పోయి “ఏమి చేయుచున్నావే!” అని గద్దించిరి.  మీనాక్షి ఆమె  చెవి పట్టుకొని " ఏమే ఈ తుంటరి  పనులు ?  నాకొడుకు శోభనం గదిలోకి తొంగిచూచుటకు సిగ్గులేదూ ?" అని అడగగా నందిని   మా సబ్బవరమందు గదిలోకి ఇట్లే చూచెదరు. సలహాలు కూడా ఇచ్చెదరు. ఇది మన సంప్రదాయమే కదా!  మాలినిగారు “ఛీఛీ ఎట్లు చూతురో , ఏమి సలహాలు  చెప్పెదరో!”  అనుచుండగా అరుణ బయటకు వచ్చి ఈ ప్రాచీన సంప్రదాయము గూర్చి నేను వినియుంటిని. మా ఆడపడుచు నడిగినచో ఇట్టి విషయములను అనర్గళముగా చెప్పును. ఇంతకూ లోపలకు చూచినది ఎవరు ? అని మీనాక్షి మాలినిలను అడుగగా “ మేము కాదమ్మా ఈ నందినే ఇద్దరి గదులలోకి తొంగి చూచెను.” అని వారు చెప్పినారు. అప్పుడు అరుణ నందినితో" ఏమి చూసినావే ?" అని అడుగగా నందిని ఇట్లు చెప్పెను

ముందు లకుమ గదిలోకి చూచితిని వారిరువరూ అలసి ఒకే ఆకుపై విశ్రాంతి నొందుచున్న సీతాకోకచిలుకలవలె 

అరుణీకృత కుచగండ మండలావృత అకీర్ణ కేశ కలాపి జాల మున్

 ప్రపత  పటవాసమున్ సయనాస్త్రాణ న్యాస్త ముక్త   భూషణాదులన్

 ప్రోస్థిత తిలకమున్  గంబూర శుక్ర గన్ధావర్తన  సయనావాసమున్

 చూచితి శ్రాంత  చిత్రపతంగికల భంగిమల్ ద్వారద్రక పరివేక్షణన్

అరుణీకృత = ఎర్రబారిన (ముద్దులాడుటవలన కావచ్చు); కుచగండ మండలావృత  = స్తనములు  బుగ్గల నావరించిన; అకీర్ణ కేశ కలాపి జాల మున్ = చెల్లాచెదురు గా పడిన కేశములు; ప్రపత  పటవాసమున్ = జారిన లంగా ; సయనాస్త్రాణ న్యాస్త  = పక్క దుప్పటి పై పడియున్న ; ముక్త   భూషణాదులన్ = సడలిన ఆభరణములు; ప్రోస్థిత తిలకమున్  = చెదిరిన తిలకము; గంబూర శుక్ర గన్ధావర్తన  సయనావాసమున్ = శుక్ర  కర్పూర మిళిత గంధమలిమిన శయన గృహము; చూచితి శ్రాంత  చిత్రపతంగికల భంగిమల్ ద్వారద్రక పరివేక్షణన్ = అలసిన ఆకుపై వాలిన రెండు సీతాకోక చిలుకలు చూచితిని. తరువాత అగస్త్యుని గదిలోకి చూడగా:

 భ్రంశిత సిత చేలము న్ విగలిత పరిచేలమున్

 చలిత కుచ కుంభ నితంబ విలోలమున్

 మదన కుతూహల తురగ  విహారమున్

 అభంగ శృంగారాంబర నిరంబర సంసర్గమున్

భ్రంశిత సిత చేలమున్ = కదలిన తెల్లని చీర ; విగలిత పరిచేలమున్ = జారిన పైట

చలిత కుచ కుంభ = కదులుఘన స్తనములు ;  నితంబ విలోలమున్ ఊగు పిరుదులు

మదన కుతూహల = కాంక్ష తో;   తురగ  విహారమున్ =గుర్రపు స్వారీ; శృంగారాంబర =

శృంగారాకాశ మందు ; నిరంబర =నగ్న;  అభంగ సంసర్గమున్= అడ్డులేని సంయోగము  

అరుణతార "నీవిట్టి జటిల సంస్కృతమునందు పద్య రూపమున చెప్పినచో నాకెట్లు అర్ధమగును అనగా "నందిని  చిరు కోపము నటించుచూ  "ఉన్నాడు కదా నీ ముద్దుల కొడుకునడిగి తెలుసుకొనుము.” అనెను.  వర్షుడు  నీళ్లు నములు చుండగా నందిని మాలినితో “అత్తా నీవే చూచినావు కదా నీకొడుకు  నిన్న సంస్కృత శ్లోకములు చెప్పి  అర్థము వివరించినచో  బంగారు గాజులు బహుమతినిత్తునని ప్రకటించెను. మరి  ఇప్పుడు నేనేమి  ప్రకటించవలెను?” అనెను.

“ఊ!జిత్తులమారి వి కూడా అయినావన్నమాట. అమ్మతో నేనెట్లు చెప్పగలను” అని వర్షుడు అచ్చట నుండి నిష్క్రమించెను. “దెబ్బకి దెబ్బ చెల్లు, వాడు వెడలినాడు ఇక నీవు అర్థమును వివరింపుము అని ప్రౌఢలు ముగ్గురూ పడుచుని బుగ్గలు పొడిచినారు.  నందిని ఆ ముగ్గురి భామల చెవులలో తాను చూచిన విషయములను గుసగుసలాడెను. 

సమయము 9 గంటలు:  అంగయార్ కన్నె యమున ఇడ్లీలు వడలు చేసి  కమ్మటి సాంబారు కాచి మీనాక్షి, మాలిని, తార  నందిని, లకుమ, సుందరి, వర్షుడు సోఫాలలొ కూర్చొనగా వారికి అందించు చున్నారు. ఆహా సాంబారన్నచో మద్రాసు వారిదే సుమీ! అని వర్షుడు అనగా, అందుకే వారిని ఇడ్లీ సాంబారు అందురు అని అగస్త్యుడు అనెను. 

తమిళులను వేళాకొళమాడుచున్నావా! మీ అమ్మ కూడా ఇడ్లీ సాంబారే నాయినా, అనగా అందరూ మీనాక్షి వైపు చూసి నవ్వినారు.  మీనాక్షి " మీ ఆయన ఎచ్చటికి పోయెను?”  “ఆయన వ్యాపార  పని మీద  శ్రీలంక పోయెను.”  అటు ఇటు తిరుగుట ఎందులకు మీరిరువరూ ఒక హోటల్ ప్రారం బించినచో అద్భుతముగా నుండును కదా! అని అగస్త్యుడు అనగా అందరూ అగస్త్యుని వైపు చూచి శోభనపు పెళ్ళికొడుకు మంచి హుషారు గా ఉన్నడే! అనగా ఈ కుర్రవాడు నాకు మద్రాసులో నుండి పరిచయము అని కన్నె వారికి పాత రోజులు గుర్తుచేసెను.

 క్రిష్నన్ గారు అప్పుడే నిద్రలేచి బయటకు వచ్చుచూ పిల్లలు తనకంటే ముందే నిద్రలేచి స్నానా దులు గావించినారని చూచి “లకుమ, సుందరి మీరిరువురూ అప్పుడే లేచి  స్నానములు కూడా పూర్తి చేసినవారే! నాదే ఆలస్యము” అనెను అంగయారు కన్నె “అలంకరణలు కూడా పూర్తి అయినవి.” అనెను.

అప్పుడే మేలుకొని బయటకు వచ్చుట కు సిగ్గుపడుచు చున్న వివేకుని చూచి  మీనాక్షి “మీ అల్లుడు ఇప్పుడే లేచి.  కొత్త పెండ్లి కుమారుడు కంటే మీరు కొద్ది క్షణములు ముందే లేచినారు” అని హాస్యమాగడగా, యమున అప్పుడే ఇడ్లీలలో సాంబారు వడ్దించుచూ “ పాత పెళ్ళికొడుకు కదా కొంచెము ముందుగా లేచెను!” అని చమత్కరించెను.  

కృష్ణన్ నవ్వుచూ “నాకంతయూ కొత్తగానే యున్నది” అని బదులుపలకగా మండువాగదిలో పెద్ద కలకలమురేగెనుమీనాక్షి మాలిని యమున కన్నె అరుణ వైపు చూచినవ్వుచూ అరుణ కెట్లున్నదో? ఆమెకి కూడా కొత్తగానే ఉన్నదేమో పాపము! అనుచుండగా అరుణ ఒక్క ఉదుటున లేచి మొగుడి జబ్బపై గట్టిగా గిచ్చి “ ఛీఛీ!! సిగ్గులేని మనిషి” అని అచ్చటినుండి వర్షుని గదిలోకి పరుగు పరుగున పోయెను. అందరూ నవ్వుచుండగా కూడా కృష్ణన్స్త్నానమునకు పోయెను. వర్షుడు పోయి అమ్మను బుజ్జగించి మరల మండువా గదిలోకి తీసుకువచ్చెను. పెద్దవారే ఇంత తెగించి కూర్చొనగా మీకెందులకయ్యా సిగ్గు అని జంకుతున్న కొత్త పెళ్ళి కొడుకును వర్షుడు బైటకు రప్పించెను. 

పిదప స్త్నానములు చేసి వచ్చి వివేకుడు అల్పాహారము తినుచూ " నేనీరోజు కంపనీలా క్షుణ్ణముగా తెలిసిన న్యాయవాదిని కలువవలెను” అనగా అగస్త్యుడు” నేనుకూడా మీ వెంట వచ్చెదను.” అట్లు మొదలయిన సంభాషణ షేర్ల కొనుగోలు ద్రువ పత్రము ఆనందనిలయము నుండి దొంగిలించబడుట, జే మరణము చర్చకు వచ్చుటతో తీవ్ర గంభీరతను సంతరించుకొనెను. వివాహ ముచ్చట్లలోవిషాద స్వరము ప్రవేశించెను. 

మాలిని గారు భయము కోపము ముప్పిరిగొన వివాహము ముందురొజు జరిగినచో మాకు చెప్పవలెను కదా అని వర్షుని మందలించి “మా ముక్కు క్రింద ఏమి జరిగిననూ తెలుపక ఇట్లు మోసము చేతురా అని శోకించ సాగెను. వర్షుడు తలపెట్టుకొని  కూర్చొనెను.

 అగస్త్యుడు “నాటి రాత్రి నిద్ర పట్టక తిరుగుచుండగా అత్త (అంగయార్ కన్నె)వచ్చు సమయమునకు ఒక కారు మన ఇంటివద్ద నిలిచియుండెను ఆ కారు లో వచ్చినవాడి మనుషులు మన ఇంటనే అథిదులవలె నిద్రించిరి. అగస్త్యుడు చెప్పుచుండగా మాలినిగారికి వొళ్ళు జలదరించెను. వారే ఆ పత్రమును దొంగిలించిరి. 

“దొంగలైనచో వారిసంగతి పొలీసులు చూచుకొందురు. ఆ సంగతి నేను చూచుకొందును. పోలీసు అధికారులను పిలిపించి మాటలాడెదను.” అని అరుణతార ఆవేశపడుచుండగా వివేకుడు ఇది ఒక్క దొంగతనము మాత్రమే కాదు, చట్టబద్ధముగా  సాగించిన దోపిడీ కంపెనీ చట్టమును అనుసరించి సాగించుచున్న ఒక పెద్ద కుట్ర అగస్త్యుని మొత్తము చెప్పనిమ్ము అత్తా” అనెను

అగస్త్యుడు “నేను అత్తను విడిది గృహమునకు తీసుకొని పోవుచుండగా వర్షుడు నన్ననుసరించెను. అదే సమమ్యములో ఆ దొంగలు ద్రువపత్రమున పహరించిరి. జే వారిని రహస్యముగా అనుసరిం చుచుండగా  అదే రాత్రి అతడిని హతమార్చిరి. …. ఒక విరామము అంతా నిశ్శబ్దం.  విస్పష్టముగా అందరి మొఖములలో భయము తొంగి చూచెను. 

అగస్త్యుడు విరామము తరువాత మెల్లగా “శ్యామ్ ..బుడగనుండి గాలి తీసినంత సులభముగా ప్రాణములను తీయును అని అగస్త్యుడు  ముగించెను. వివేకుడు కోపముతో రగులుచూ " వాడి ఆట ఎట్లు కట్టించవలెనో నాకు తెలియును, కానీ మన వద్దనే ఒక చిన్న సమస్య కలదు అదియునూ చేదించెదను. ఇంతకంటే పెద్ద నేరగాళ్లనే పట్టించితిని అని చాలా వ్యక్తిగతముగా తీసుకొని రేగుచుండగా అగస్త్యుడు “అవును మా అమ్మ పేరున ఉన్న సంస్థను ఎట్లైననూ నిలపవలెను. ఆ సంస్థను మా అమ్మకు బహుమతిగా ఇవ్వవలెను” అనుచుండగా మీనాక్షి భీతిల్లి “  తన కోడలు దగ్గరకి తీసుకొని అయ్యో ప్రాణములకు ముప్పు కలదా?! అని తల్లడిల్లుచూ  నాబిడ్డలిరువరినీ నేను నాతో పాటుగా బెంగళూరు కొనిపోయి నావద్దనే ఉంచుకొందును. నాకు సంస్థలు ఆస్తులు ఏవియునూ  వలదు మీ ఇద్దరూ కలిసి నాకొక బిడ్డని బహుమతిగా ఇవ్వవలెను. నాకు కావలసిన బహుమతి అదియే.  అని మీనాక్షి అనగా  “మీ నాన్న ఆస్తి ఎవరికీ కావలెనయ్యా మీ అమ్మ కోరిక తీర్చవలెను తీర్చెదవా ?” అని యమున అగస్త్యుని ప్రశ్నించెను అగస్త్యుడు “ఆ ఆస్తి లో ప్రతి పైసా మా అమ్మది  ఆ సంస్థ మొత్తము మా అమ్మ ఆస్తి. అది సాధించవలెను” మీనాక్షి తల పట్టుకొనెను. 

చెళ్ళిళ్ళ కళ్ళలో ఆనందముచూడవలె ననుకొన్న వర్షుడి ఆశ నిరాస కాగా అతడు అచ్చట నుండి నిష్క్ర మించెను. “ఇంతకూ మనవద్ద ఒక సమస్య కలదని అన్నారు కదా అది ఏమి?” అని అగస్త్యుడు వివేకుని అడిగెను. అదే సమయమునకు బసవడు పార్వతి ప్రవేశించిరి. బసవడు ఈ రోజు ఇడ్లీలు సాంబారు చేసినట్లు అనిపించుచున్నది అనెను. “రామాయణములో పిడకలవేటవలె మధ్యలో తిండి గోల ఎందులకు? ఆ సమస్య ఏమో చెప్పవలెనని అరుణ అడగగా ఆ సమస్య వర్షుడే వర్షునకు శ్యామ్ కు సంబంధము కలదు. జిలేబిని కూడా వర్షుడు పలు మార్లు బార్లలో కలిసెను అని  వివేకుడు చెప్పుచుండగా  జిలేబి ఎవరు అని మీనాక్షి అడిగి తెలుసుకొని నివ్వెరపోయెను. "నా జీవితమును ఇట్లు చేసిన వ్యక్తి నీలి నీడలు నాబిడ్డలను కూడా వెంటాడుచున్నవి." అని మీనాక్షి దుఖించుచుండగా, ఈ వార్త మాలిని, అరుణలను విస్మయమునకు గురిచేసెను. 

"ఇది నేను నమ్మ జాలను వర్షుని పై ఇట్తి అభాండములు" అని నందిని ముగించక ముందే వివేకుడు తన వద్ద ఉన్న ఫొటోలను ఎదురుగానున్న  చిన్న గాజు బల్లపై నుంచెను “ సముద్రకన్య చేలమందు అర్ధ నగ్నముగా నున్న జిలేబీతో వర్షుడు బారులో నున్న ఫొటో క్షణ క్షణమునకూ పెరుగుచున్నట్లు వారికి కనిపించసాగెను. 

Saturday, February 27, 2021

కొత్త రంగులు

 మీనాక్షి అరుణతార పాత్రలు ఇంత  ఉన్నతమైన పాత్రలవుతాయని మొదట తెలియదు. 1 నుండి 20 ఎపిసోడ్స్ లో మీనాక్షి అరుణ తార పాత్రల ప్రారంభ దశ ఇమిడి ఉంది. మన ఇద్దరికే తెలిసిన విషయాలు ఇక బాహ్య ప్రపంచంలోకి వెళ్ళబోతున్నాయి.  ఇంత  ఉన్నత పాత్రల ఔచిత్యం  దెబ్బతినకుండా   ఈ 20 ఎపిసోడ్స్ లో పాత్రల కు చిన్నచిన్న మౌలిక మార్పులతో   ఔన్నత్యం  పెంచి భారత వర్షను ముద్రణకు సిద్ధం చేస్తున్నాను. అప్పుడే అది కలకాలం నిలిచే కావ్యం గా నిలిచిపోతుంది 

నిన్నరాత్రి 20 ఎపిసోడ్స్ కి రంగులద్ది 12 పాటలు వ్రాసాను.  మెదడు హ్రదయంలోకి  గళం కలలోకి ఇంకిన రాత్రి,  నిన్నరాత్రి. సహృదయులైన పాఠకులు చదవగానే ఈ ఎపిసోడ్, 20 ఎపిసోడ్స్ లో పేరా గ్రాఫ్స్ కి  ఉన్న  రంగులు మాయమవుతాయి.

భారత వర్ష ఒక వీణ  నీవొక ఒక తీగ నేనొక తీగ 

నీవొక రాగం నేనొక రాగం రెండు తీగల తీయనిరాగం , కుసుమ పరాగం 

భారత వర్ష ఒక తీగ నీవొక కుసుమం  నేనొక భ్రమరం 

తేనెలు చిలికే అమృత కుసుమం అలుపే ఎరగని తుంటరి భ్రమరం 

వంటరి పయనం  ఎగసిన కెరటం ఇరుహృదయాల సాహిత్య మథనం 

అతిథి కిచ్చే ఫలమైనా అంకితమిచ్చే కావ్యమైనా ప్రక్షాళన చేసే కదా ఇస్తాము  - రచయిత   


Thursday, February 25, 2021

Bharatavarsha -135

ఆనందనిలయమునకు చేరువలో నున్న "అపూర్వ" కల్యాణ మండపమందు పుష్పమాలాలంకృతమై ధగధగకాంతులీను ఉన్నత వివాహ మండపముపై  గోపురములవలె నాలుగు చిన్నమంట పములలో నలుగురు పురోహితులు, పదిమంది  వేదపండితుల మధ్య నాలుగు కుటుంబముల వారు నిలిచి యుండిరి. పవిత్ర మాఘ మాసమున మాంగళ్య బంధముతో ఒక్కటైన జంటలు తలంబ్రాలు , అక్షింతలు, మంచి గంధము కర్పూర  సువాసనలు వెదజల్లుచుండగా బంతి చామంతులవలె ప్రక్క ప్రక్కన నిలిచిరి. 

రాత్రి 8.00 గంటలగుసరికి పెళ్లిళ్లు ముగిసినవి. రాత్రి భోజనములు సమయమ గుచుండుటతో  పెక్కు మంది ఆహ్వాని తులు వివాహ విందుకు పోయినారు.  కొలదిమంది ఆహ్వానితులు పెద్దలు మాత్రమే ఉండుటతో మండపం గది అంత యూ ఖాళీగా కనిపించుచుండెను. సంగీత కచేరివారు కూడా తమ తమ సాధనములను తీసుకొని వెడలుచుండిరి కేశవుడు వారిని భోజనములు హాలు లోకి తీసుకు పోవుచుండెను. 

 సందీపుడు మంజూషను తీసుకొని తన తల్లి తండ్రులతో సబ్బవరం పోవలెనని యోచించుచుండగా  మాలినిగారు " పిల్ల ఇంటనే శోభనం వేడుక జరిపించవలెను. అది ఆనవాయితీ"  అని ఎంత చెప్పిననూ సందీపుడు శోభన వేడుకలకు అంగీ కరించకపోవుటచే వర్షుడు కూడా సందీపుని అభ్యర్ధించగా సందీపుడు వర్షునితో " నేను నేరుగా బెంగళూరు పోవలెను నా సంస్థ చూచుకొనుటకు ఇప్పుడు అచ్చట నా అనువారు ఎవ్వరునూ లేరు , నన్నర్ధము చేసుకొనవలెన"ని వర్షుని చేతిలో చేయి వేసి చెప్పెను. 

పెంచలయ్యగారు వర్షునితో "త్వరలో మాఇంట మానందిని కి పెండ్లి చూపులకు వత్తురు ఇప్పటికి పోనివ్వవలెన"ని అనగా నందిని " అవును మానాన్నకు పెండ్లిచూపులు జరుగును మీ రందరూ రావలెన"ని చమత్కరించెను. మాలిని గారు మంజూషను  వియ్యపురాలి చేతిలో పెట్టుచూ  మాటలు కరువయ్యి   ఏమి చెప్పుటకూ తోచక గుండెలు బరువ య్యి  కొద్ది క్షణములు అట్లే  నిలిచి ఎట్టకేలకు మంజూష తో  " నీకు తల్లి గురువు ఈమే , అల్లుడు నీ   అమ్మవలె  వలె నీవాడమన్నట్లు ఆడువాడు కాదు,  అన్న వలె మృదువుగా నుండకున్ననూ ,దెబ్బలాడిననూ అణుకువతో ప్రేమతో నుండవలెను. పుట్టింట సాగినట్లు  అత్తింట  అలకలు సాగవని గుర్తుంచుకొనుము. భర్తవద్ద  బెంగుళూరులో  ఎట్లుందువో అని వ్యాకులతతో సాందీపుని చేయందుకొని మంజూష చేతిని అతడికి అందించుచుండగా మీనాక్షి" బెంగుళూరులో నేను ఉండగా నీవు ఇంత  విచారపడవలదు.” అని మాలినిని  ఓదార్చెను. 

సందీపుడు మంజూషలు మాలినిగారికి ప్రణామము చేసిన పిదప సందీపుడు మంజూషను వర్షునివద్దకు కొనిపోయెను. వర్షుడు  ఆశీర్వదించి సందీపుని గుండెలకు హత్తుకొనెను. పిదప అతడి రెండు చేతులు పట్టుకొని చిన్ననాటి స్నేహితు లమన్న దయ ఉంచుము. అని వర్షుడు అనుచుండగా సందీపుని కన్నులు తడిఅయ్యెను. ఆడపిల్ల నేకపోతే ఇల్లంతా ఎలితి , ఏటి సేత్తాము పల్లకో నాయినా  అని పైడమ్మ గారు  వర్షునికి ఓదార్పుచెప్పుచుండగా "  నందిని " ఓలి పైడి! నువ్వు పల్లకోయే , మంజూస ఎల్లిపోతే , నాను లేనేటి ?! వర్సని నా నొగ్గుతాననుకొంతన్నావేటి !" అని గ్రామీణ భాషలో మాట్లాడుటతో  అందరూ చకితులయ్యి మనసారా నవ్వుకొనిరి. ఆది, దాసు, మరీదు పెంచలయ్య పైడమ్మ లను కూడి నందిని మంజూష సందీపుడు చిన్న బస్సులో సబ్బవరం బయలుదేరినారు. 

చంద్రమతి  పార్వతిని బుచ్చెమ్మగారికి  అప్ప గింతలు పెట్టుచూ  పార్వతి తల్లి చారుమతి  పేరు  తలఁచి కన్నీరు పెట్టి  కేశవుని పై వాలి “నీ డబ్బు నేను  అన్యాయముగా అట్టే బెట్టుకొంటినని” విలపించి రెండు దస్తావేజు కాగితములను తన  సంచిలోనుంచి తీసి ఒకటి కేశవునకి మరొకటి పార్వతికి ఇచ్చి బుచ్చెమ్మ గారితో “కేశవునకు తన తల్లి ఆస్తి  పది ఎకర ముల పొలము అప్పగించితిని. పార్వతికి నాఆస్తిలో నా పిల్లలతో సమముగా వాటా ఇచ్చితిని జాగ్రత్తగా చూడవలెను. అని చీర కొంగుతో కళ్ళు త్తుకొనుచూ అరుణ తారవైపు చూచుచూ “మా కుటుంబమునకు పెద్ద దిక్కు నీవే, అరుణా  అంతా చూచుచున్నావు కదా!” అని సుకన్యను తీసుకొని బయలుదేరెను. “ఈమె  పెండ్లికూతురిని  అప్పగింతలు   పెట్టినదా లేక ఆస్తి అప్పగింతలు  పెట్టినదా?” అని బుచ్చెమ్మ తుచ్చ ప్రశ్నను సంధించగా  అందరూ ఘొల్లుమనిరి. పార్వతి చేయందుకొని బసవడు కేశవుని రంజిని గారిని తీసుకొని  బయలుదేరెను.     

తక్కిన రెండు  జంటలకు శోభనములు మా  ఇంట జరుపవలెనని అనుకొనుచున్నాము అని మాలిని మీనాక్షితో అనుచుండగా యమున మీనాక్షి చెవులో  ఎదో గుసగుసలాడుచుండెను విదిష ఆమెను   జబ్బ పట్టి వెనుకకు లాగి ఏమా గుసగుసలు రహస్యములు అని కసిరి ఏమనుచున్నది ఈ బుడత అని అడుగగా మీనాక్షి నవ్వుచూ “సుందరిని  బెంగుళూరు తీసుకొని పోవలెనని కార్యము అచ్చట  జరపవలెనని అను చున్నది.” అని చెప్పెను. ఈ రాత్రికి ఇచ్చట  నిద్ర చేయవలసినదే  పిల్లలు ఆడి ఆడి అలసినారు. అని మాలిని గారు  అనుచుండగా అగస్త్యుడు తల్లి  చెవి కొరుకు చుండెను. ఏమో నాకేమియో తెలియదు కోడలు ఎట్లు కోరుకొనునో అనుచుండగా అరుణ “ఏమి కావలెనయ్యా కొత్త పెళ్లికొడకా!” అని బుజ్జగించగా అగస్త్యుడు సిగ్గుపడుచుండెను.  “ఫైవ్ స్టార్  హోటల్ లో కావలెనట” అని సుందరి అరుణ చెవిలో చెప్పెను. అరుణ నిట్టూర్చెను. “నీ కోరిక?” అని సుందరి వైపు చూసెను    “అన్నయ్య ఇంటికి పోయెదము” అని మెత్తని స్వరమున తెలిపెను. ఆమె సుందరిని బుగ్గలు నిమిరి మెచ్చుకొనెను. లకుమ కూడా అన్నయ్య ఇంటికి పోవలెనని  చెప్పగా వర్షుడి మనసు సంతోషము తో ఉప్పొంగెను.

 లకుమ  సుందరి ఏక స్వరమున  అన్నయ్య అల్ప సంతోషి, మా సుఖమును చూచి సంతొషించు మనసుగల అన్నయ్య మమ్ము ఆశీర్వదించి పంపువరకు మేము అన్నయ్య ఇంటనే ఉందుము, అని పలుకగా అది విని వర్షుడు ఉబ్బి తబ్బిబ్బయ్యెను. అది చూచి క్రిష్ణన్ “అరుణా నేను ఏమి కోల్పోయినానో ఇప్పుడు తెలిసినది అని కన్నీళ్ళ పర్యంత మయ్యెను. మీనాక్షి అగస్త్యునికి లకుమ సుందరి లను చూపి “ఆడపిల్లల ప్రేమ అట్లుండును అన్నయ్యకు ఎంత అనురాగము పంచుచున్నారో!”  జానకి రఘువరన్ కూడా కళ్ళు వత్తుకొని “మీరెంతకాలమున్ననూ మీ ఇష్టము మేము మాత్రము రేపు కొచ్చిన్ పొవలెను.” అనుచుండగా వివేకుడు “మేడం రేపు నేను కూడా  ఒక  ఇన్వెస్టిగేషన్ పై శ్రీలంక పోవలెను”  అని అరుణతారతో చెప్పగా  ఇంకా అదే పాత పిలుపు ఎందుకు నాయినా అత్త గారు అని పిలువుము, నాకూతురిని సుఖపెట్టి కేసులు తరువాత చూచుకొనుము అని లకుమవైపు ప్రేమ నిండిన కనులతో చూచెను.   

ల్యాండ్  రోవర్  ఆలలపై పడవవలె కదులుచుండెను.  విదిష నడుపుచుండగా మీనాక్షి  ప్రక్కన కూర్చొనెను. సుందరి అగస్త్యుడు  వెనుక కూర్చొనిరి. అరుణ భర్త  అల్లుడు కూతురు ఒక కారులో విదిష కారుని అనుసరించుచుండిరి. అంగ యారు కన్నె, శేషాచలముగారు, తులసి, మాలిని , నరేంద్ర పండిత్ మధుబాల మున్నగు వారిని వర్షుడు వేనెక్కించు కొని తార కారుని అనుసరించుచుండెను.  ముందు మీనాక్షి కొడుకు కోడలు , పిదప అరుణ, కూతురు, అల్లుడు పిదప వర్షుడు, తల్లి ఆనందనిలయము కేసి సాగుచుండిరి. 

సుందరి  సిగ్గుతో మొఖం ప్రక్కకి త్రిప్పుకొని ఎడమవైపు దూరముగా కూర్చొనెను  అగస్త్యుడు ఆమె  చిటికన వేలు అందుకొన ప్రయత్నించుడగా విదిష అద్దమందు చూచి మీనాక్షి చెవిలో వేసెను. మీనాక్షి తన కళ్ళ కొలికిల నుండి వెనుకకు చూచి విదిషవైపు చూసి ముసిముసి నవ్వులు నవ్వుచుండెను. 

లకుమ వివేకులు ఒకరినొకరు చూచుకొని  మైమరచి పరిశరములను మరిచి కొన్నిలిప్తలు ఇనుము సూదంటు రాయి వలె ఒకరినొకరు అతుకుకొని విడిపోవుట చూసి క్రిష్ణ గారు అరుణతార చేతిని గిల్లగా అది వివేకుడి కంట పడెను. వర్షుడు మనసంతయూ  బాల్యజ్ఞాపకాలు చుట్టినవి. అతడు తల్లి వొడిలో తలపెట్టుకొని అమ్మా అని పిలిచెను మాలినిగారు కొడుకు తలలోకి వేళ్ళు పొనిచ్చి నిమురుచూ  “బరువులు భాధలు భాద్యతలు అన్ని బ కారములు ముగిసినవి  అని అనుచుండగా “బాల్యము కూడా ముగిసినదికానీ భవిష్యత్ మాత్రము మిగిలి యున్నది. అనెను. 

                                              ***

హిమకరుడు చంద్రికలను పరచి ఆనందనిలయమును అలరించుచుండెను. తెరచిన భోషాణము వలె  పై కప్పు ఆచ్చాదనలేని మండువా గదిలో నేలంతయూ   వెండిపూత పూసినట్లున్నది. చల్లగాలికి చలించుచున్న చెట్టుకొమ్మ   లుచంద్రికల కవరోధము కలిగించుచూ చాయలు ఏర్పరచు చుండెను. మండువాగదిలో చలించు వాటి ఛాయలు  చూచువారికి చెవుల పిల్లు లాడుచున్నట్లు నయనానందమును కలిగించు చుండెను. గడప గడపకూ వ్రేళ్ళాడు బంతిపూదండల పరిమళములు నాసికలు తాకి మత్తెక్కించుచుండెను. వివాహ మేళతాళములింకనూ  అందరి చెవులయందు మారుమ్రోగుచున్నవి. 

 స్త్నానములు చేసి నూతనవస్త్రములు దాల్చి వచ్చిన నూతన వధూవరులు సైకత శిల్పములవలె నిలచి యుండి ఆనందపారవశ్యమునందుచుండగా, తార మీన తులసి మధుబాలల కళ్ళు మెరియుచుండెను. చుట్టూ ఉన్న ఆరు గదులు ఒక్కొక్క గది ఒక్కొక్క జాతి పుష్పములతో అలంకరించబడెను.  రెండు జంటలే కదా ఆరుగదులకు అలంకరణ ఏలనో అని తార  మీనాక్షిలు భావించిననూ  మాలిని గారు తలుపు తీసి చూపుచుండగా   పుష్ప పరిమళ సొభితమై పానుపులు శృంగారభావములను మోల్కొలుపుచున్నవి. లకుమ వివేకులు సుందరి అగస్త్యులు ఆనందపు అంచులలో విహరించిరి.  కాముడు ఆ రాత్రి పిల్లలనూ పెద్దలనూ ఒక్కవిధముగా అలరించెను. 

Tuesday, February 23, 2021

Bharatavarsha 134

తూరుపు తెల్లవారు చుండెను. వెలుగురేడు ఎల్ల లోకములనూ ప్రకాశింపజేయుచుండెను. నేడే మంజూష , లకుమ, సుందరి , పార్వతుల  వివాహము. తల్లుల కన్నులు కాయలు కాయ ఎన్నాళ్ళో వేచిన దినము.  

మంగళ స్నానమాచరించిన రుచిర, దృఢ దుర్నిరీక్ష్య తేజోమయ దేహములు గల యువకులు ధవళ వస్త్ర ధారులై ఆనందనిలయ ప్రాంగణ మందు మెదులుచుండ   పర్వతము లపై సంచరించెడి శ్వేతపర్జన్య సమూహము నేల వాలినట్లున్నది. ప్రౌఢల అలంకరణలు ముగిసిననూ పడతుల అలంకరణలు ప్రౌఢలే చేయుచుండుటచే కాలయాపన జరుగుచున్నది. మీనాక్షి యమున నిమ్మపండు రంగు చీరలు రవికలు దాల్చి జంట కవులవలె ప్రక్క ప్రక్కనే నిలిచిరి. అరుణ నీలాకాశవర్ణపు పట్టు చీర ధరించి  లకుమకు చీర కట్టుట నేర్పుచుండెను.  ఎంతకీ అది కుదరక పోవుటచే లకుమ విసిగి " అందరివలె నేను లంగా వోణీ ధరింతును రాత్రి వివాహమునకు చీర ధరింతును అని చీర పీకి పక్కన తల్పముపై  పారవేసి   లంగా వోణీ ధరించి పడతుల సమూహమును చేరెను. సుందరి అలంకరణ జరుగుచుండగా అగస్త్యుడు తొంగి చూచి పట్టుబడుటచే అరుణతార యువకులను  బైటకు నెట్టి వేయుటతో  వర్షుడు, కేశవుడు అగస్త్యుడు, బసవడు, వివేకుడు, సందీపుడు చెలిమి చలువము పూసుకొని చెట్టాపట్టాలేసుకొని ప్రాంగణ మందు విహరించుచుండిరి.

ఆనందనిలయ మందు రంగు రంగుల గుడారముల తోరణములు గాలికి బిరబిరా కదలాడుచూ నయనానందము కలిగించుచుండెను. ప్రాంగణమంతయూ ఎర్రని తివాచీలు పరువబడినవి. తెల్లని పాదముల జంటలు యెర్రని తివాచీపై నడయాడుచూ ప్రవేశ ద్వారమును చేరినవి. ప్రవేశ ద్వారమువద్ద సువాసన వెదజల్లు మరువపు ద్వారము నిర్మించ బడెను. వివేకుడు కోటేరువంటి ముక్కును మరువపు మాలలకానించి ఆహా ఏమి సువాసన అనెను కేశవవుడు నాసిక ను దట్టమైన సుమమాలల పై నుంచి అబ్బా ఎంత చక్కటి పుష్ప ద్వారము అనెను బసవడు ఆహ ఎంత కమ్మని పెస రట్ల వాసన విడిదింట అల్పాహారము మొదలాయెను.  అందరూ మరువపు సువాసన మూర్కొనగా బసవడు  పెస రట్ల వాసన నాఘ్రాణించుటతో అగస్త్యుడు "తిండి వాసన పసిగట్టు ట యందు పోలీసు జాగిలాములు కూడా వీడి ముందు దిగదుడుపేకదా!" అనగా అందరూ నవ్వుకొనిరి.  

“విడిది భవనమందు అల్పాహారం సిద్దమయినది మనము పోయి ఆరగించవలెను.” అని బసవడు అనుచుండగా వర్షుడు " వరులు ఉపవాసముండవలెను, పలహారములు నాబోటి వారికి మాత్రమే. అమ్మల అలంకరణలు పూర్తి అయిన పిదప వారితో కలసి పోయి వారికి " నేనే స్వయముగా వడ్డించవలెను.” అనెను. బసవడి మొఖము జేగురించెను. అదిచూచి   అగస్త్యుడు “అయ్యూ  ఎంత పని అయినది పెసరట్లు  తినుటకు అదృష్టముండవలెను” అని అగస్త్యుడు బసవని ఆట పట్టించుచుండెను. “అయ్యూ మా బావగారిని ఇట్లు ఆట పట్టించ దగునా!” అని కేశవుడు వ్యంగ్య మును చూపగా అది నిజమని భ్రమసి బసవడు మహానందము నొందుచుండ అలక పానుపు పై అల్పాహారము అడుగు అల్పజీవి వలె తోచి " నిన్ను చూచిన జాలి కలుగుచున్నది” అని వర్షుడనెను.  బసవడు అదియునూ అర్ధము చేసు కొనక “చందనను పిలచి రహస్యముగా రెండు పెసరట్లు తెప్పించుకొందును… అని మాట తడబడగా …అందరికీ తెప్పింతును.”అనెను.  వర్షుడు "ఇట్లు మాటలాడుటకు సిగ్గుండవలెను, అగస్త్యుని కారణముగా బైటకు గెంటివేసినారు అది గ్రహింపుము"అనగా హాస్యము వెల్లి విరిసెను. ద్వారము నుండి అందరూ వెనుకకు మరలినారు. వర్షుడు కబురు చేయుటతో పెద్ద వస్త్ర వ్యాపారులు , నగల వర్తకులుతమ తమ నాణ్యమైన సరుకులను ఆనందానిలయమందు తివాచీలపై పరుచుచుండిరి. కొలది సేపటిలో ఆనందనిలయము పెద్ద అంగడిని తలపించుచుండెను. స్త్రీల అలంకరణ పూర్తి అయినది కానీ వారు బయలుదేరునంతలో ఛాయాచిత్ర గ్రాహకుడు తన బృందంతో ప్రవేశించుటతో స్త్రీలు తమ అలంకరణలను అందాలనుచిత్రములందు స్థిరపరుచుకొనుటకు ఉవ్విళ్ళూరుచుండిరి. యువకులకు లోపల కి  పిలుపు వచ్చెను.

అరుణ తార,  అంగయారు కన్నె,  మీనాక్షి , తులసి , యమున, మాలిని , దామిని మధుబాల, జానకి, చంద్రమతి బుచ్చమ్మ గార్లు ఒక వరుసలో నిలవగా  రంజని , మంజూష , లకుమ , సుందరి, విదిష ,నందిని ,  చందన  పార్వతులు  ఒక వరుసలో నిలిచి యుండిరి.  గ్రాహకుడు వారిని బృంద చిత్రమందు బందించి, పిదప జంటలు జంటలుగా  విభజించి వివిధ భంగిమలందు వారి రూపవిలాసములను స్థిర,చలన భంగిమలందు సంస్థాపన మొనరించు చుండెను . 

మొదట కన్నె మీనాక్షి , పిదప మీనాక్షి సుందరి , పిదప యమున మీనాక్షిలు ఇట్లు ఒకరి  హత్తుకొని అనురాగములను చూపుకొనుచూ చిత్రములందినారు. అనురాగమతిశయించ మీనాక్షి సుందరిని ముద్దాడగా, యమున  మీనాక్షిని ముద్దాడెను. లకుమ తల్లి తండ్రులతో అనురాగము ప్రస్ఫుటమగు చిత్రమొకటి గొనెను.  రంజని కేశవులు చెంతకు చేరి కలసి ఛాయా చిత్రమందుటకు బిడియ పడుచుండగా వారిని అరుణ దగ్గరికి తీసుకొని లకుమ వివేకులతో కలిపి చిత్రములందెను. కేశవుడు అరుణ మొఖములోనికి చూచెను  తల్లి స్థానములో కూర్చొన్న జగన్మాత వలే ఆమె కనిపించెను. ఆమె కనులలో భరోసా , పెదవులపై చిరునవ్వు చూచి కేశవుడి కనులు వాలినవి. కేశవుడి  మొఖము  చిన్నబోయెను “నా కథ నీకు చెప్ప లేక పోతిని” అను అపరాధభావన కేశవుని కళ్ళలో  కనిపించుచుండ అరుణ

“చిత్రములడగవు కథలు చిత్రముగా కదిలించు మనుషులను 

రాగమాలికలై రంజన చేయును మనసులను మాలిమి 

చేయును మూలికలై, ఏలికలై ఏలుచుండు భాషా పేదల 

మనసుల  తేలుచుండును కథలై  కావ్యములై, తరతరముల

 మనుషుల కలుపుచుండు తరగని సిరులై నిలిచి యుండు. 

“అని ముగించినపిద చందన "అమ్మ ఎంత చక్కటి కవిత అల్లినదో" అనెను. తార " నేను నీవలె కవిని కాను ఛందస్సు లేని  పద్యమునెట్లు గణింతురో కదా!" అనగా కేశవుడికి దుఃఖము తన్నుకువచ్చి ఆసువుగా ఒక ఉత్పలమాల పద్యమునల్లి  తల్లి మెడలో అలంకరించెను. 

 ఉ.    చందము   చూడగా      జనని      చందురు      డేతల      వాల్చున  మ్మ నీ      

        బంధము    చూడగా     కొడుకు    బాష్పము    లందును     రాగమొ ల్లయూ             

        కందము     వోలివ       ర్షమయి    కుర్వగ        మాటలు     మంత్రము  లై నా 

         డెందము   తాకగా       వలదు      డాబుగ      చందము     మాటచా    లులే

  

         నీ  చందము( శైలి -style)  చూడగా   జనని  అందగాడని  విర్రవీగు     చంద్రుడే తల          

          వాల్చునమ్మ ,  నీ  బంధము చూడగా  కొడుకు  బాష్పము  లందును  (అను )  

          రాగమొ ల్లయూ కందము ( మేఘము ) వోలి వర్షమయి  కుర్వగ  నీ  మాటలు     

          మంత్రములై నా డెందము  తాకగా  డాబు చందము నాకెందులకు నీ మాటచా లులే


బావగారు ఉత్పలమాల  పద్యమును హృద్యముగా సంధించి స్పందించినారు మనమంతవరకూ పోము వృత్తపద్యములకు మనకూ చుక్కెదురు అనుచూ బసవడు కేశవుని దుఃఖిత వదనమును చూచి అయ్యో బావగారు మీ నేత్రములేల ఆర్ద్రములాయెను ?! అని  అనెను. పార్వతి ఉదుటున పోయి కేశవుని కౌగిలించుకొనబోవఁగా లకుమ వారిద్దరినీ కౌగిలించుకొని ఓదార్చుచుండెను , ఆమె కనుల కొలికి లందు తడి చూచిన మాలిని "అరుణ వారెంత ఎదిగిననూ నీ ముందు ఒదుగు పసిబిడ్డలేనే,  వారిని ఏడిపించవలదే" అని మందలించుచుండగా వర్షుడు " మా చెల్లి కి కూడా వెన్నవంటి మనసున్నదే " అని లకుమలో వచ్చిన మార్పు కు గర్వించుచుండగా " వివేకుడు మందహాసము చేయుచూ  “ చెయ్యి లేవకున్నచో అదియే పదివేలు " అనగా అందరూ  ఘొల్లుమనిరి.   

మాలిని లకుమ, మంజూష సందీపులను, వర్ష విదిషలను వద్దకు తీసుకొని చిత్రములు గ్రహించెను.  చిత్ర మాలిక చివరకు విదిష నందినిలను చేరెను. నందిని విదిషను కొరకొరా చూచెను మాలినిగారి గుండెలలో రైళ్లు పరిగెత్తుచుండగా నందిని కోపము చిరునవ్వు గా మారెను. నందిని విదిషను హత్తుకొని ప్రేమ నిండిన కళ్ళతో ఆమెను చూచుచుండ అందరూ అచ్చెరువంది నోళ్లు నొక్కుకొనుచుండ చిత్రగ్రాహిణి క్లిక్ మనెను. 

మత్తకాసినులగు ప్రౌఢ స్త్రీల పొంకము పూర్ణకుంభమును తలపించుచుండ పడతుల అందము పాల మీగడ చందము చూపుచుండ వారు మండువా గది వీడి ప్రాంగణము లోకి అడుగిడిరి. యువకులు తురగములవలె ప్రాంగణ ములో నడయాడుచుండ వొళ్ళంతా కళ్ళు చేసుకొని వనితలు వారిని చూచుచుం డిరి.  లోకచక్షువు అప్పుడే అంబరమును ఎగబ్రాకుచుండెను. బసవడు పరిసరములను చూచుచూ ఆసు కవితాస్త్రమును సంధించెను. 

వెలుగు ఱేడుకళ్యాణ కాంతులను విరజిమ్ముచుండ

ప్రభంజనుడి శీతల స్పర్శకు మేను పులకించుచుండ, 

చూచుచుండ విరులు మరులు గొల్పు నాట్యమాడుచుండ

పంచవన్నెల చిలకలు కిలకిలా రావములు చేయుచుండ  

సర్వాలంకృత కళ్యాణ గృహము కైలాసమువలె నొప్పుచుండ.  

ఇట్లు అచ్చతెలుగున పాడుచుండ యువతుల సమూహమునుండి ఎవరో  ఒక గులకరాయిని గురిచూసి బసవడిపై  విసరగా అది అతడి మోచేతికి తగిలి క్రింద పడెను “ఎవరది నా  ఆశుకవితా గానమునకవరోధము కలిగించుచూ .. అని బసవడు రంగు రంగుల పట్టు లంగాలలో కొండపల్లి బొమ్మల వలే యవ్వన శోభల కాంతులీను యువతులపై … ఎగిసి పడుచుండగా 

“పండు కొని వండుతుండ కుండ పై బండ పడ నా వొళ్ళు మండ” అని మంజూష వేళాకోళము చేసెను.  బసవడి కవితలనే ఆక్షేపించువారా మీ టుమ్రీలు అని అగస్త్యుడు నందినిని విస్మరించి విమర్శించెను.  ఇంతలో నందిని గానమునందుకొనెను , స్త్రీలందరూ ఆసక్తిగా చూచుచుండిరి.

పురుషా సమూహే సుందర రూపే చలతి వనే సంభూయే

భువనో త్తారే,   సుధా  సమూహే   దివ్య మనోహర జాతే

యశోద తప్తే , కవితా దీప్తే,   యశోధన ఘన వన మాలె. 

అనుచూ ధీర సమీరే యమునా తీరే వసతి వనే వనమాలి చందమున గంభీర గీర్వాణమున నందిని గానము చేయగా చందన “పురుషులందెవరైననూ దీనికి సరియగు గానము చేయగలరా? అని సవాలు విసిరెను. అప్పుడు వర్షుడు అదే  చందములో దేవభాషలో శ్లోకములను గానముచేసి   

రాధా  ప్రభవే  ప్రాతః కాలే  జవతే  ప్రక్రుతి  అధికం 

తరుణీ  విభవే వివాహ ప్రభవే  రజతి వరే సులభం

రాధా  ప్రభవే (అందానికి ఆరంభం అయిన) ప్రాతః కాలే  (వేకువ జామున) జవతే ప్రక్రుతి అధికం (ప్రక్రుతి స్ఫూర్తి నిచ్చును).  తరుణీ  విభవే (యువతి అందము); వివాహ ప్రభవే  (వివాహ సందర్భములో)  రజతి వరే సులభం (పెండ్లి కుమారులు ను రంజింపజేయును)

వివాహ సమయే ఆనందనిలయే కలహే న సంప్రతి  యుజ్యతే

సంవేసన సమయే రాసక్రీడే వర్ధతే తవ శుక వైరే వర్ధతే తవ నిశ్యపినే.

వివాహ సమయే ( వివాహ సమయంలో ) ఆనందనిలయే ( ఆనందనిలయంలో) కలహే న సంప్రతి  యుజ్యతే ( జగడమిప్పుడు ఒప్పదు) సంవేసన సమయే ( శోభనం గదిలో ) రాస క్రీడే ( శృంగార  క్రీడలలో)  వర్ధతే తవ శుక వైరే  (కవితా శక్తి వర్ధిల్లును)  వర్ధతే తవ నిశ్యపినే (నీ శృంగార శక్తి వర్ధిల్లును) కనుక నీ సామర్ధ్యము అచ్చట చూపవలెను.  

వీటికి అర్థము వివరించినచో బంగారు గాజులు  కొనిఇత్తునని ప్రకటించెను  నందినిని యువతులందరూ వత్తిడి చేసిననూ సిగ్గుపడి ముడుచుకు పోవుటయే గానీ పలుకు పైకి రాకుండెను, అప్పుడు మీనాక్షి నందినివద్దకు పోయి నీకు సిగ్గయినచో నా చెవులో చెప్పుము అని చెవి అందించగా నందిని ఆ శ్లోకములకు అర్థమును ఆమె చెవిలో చెప్పెను. మీనాక్షి బుగ్గలు ఎరుపెక్కినవి. పిదప ప్రౌఢలందరూ చెవులుకొరుక్కొని  నవ్వుకొనుచూ అల్పాహారం కొరకు విడిదింటి కేగినారు.  ఆ పిదప ఆనందనిలయము చేరి అరుణతార , మీనాక్షి , రంజిని  రత్నములు , నగలు  విరివిగా కొనుగోలు చేసిరి. మీనాక్షి తులసీగారికి సుందరికి పలు వస్త్రములు నగలు బహూకరించెను.   మాలిని కూడా వారితో సమముగా వస్త్రములు నగలు సందీపునికి పైడమ్మగారికి తీసుకొనెను, దామిని గాజులు కొని మంజూషకు బహూకరించెను. అందరూ బహుమతులతో ఒకరినొకరు సత్కరించుకొనిరి. 

సాయంత్రము వరకూ ఆట పాటలతో సాగిన సమయము వివాహ ముహూర్తమునకు గంభీరంగా మారెను. ఒకే కళ్యాణమండపమున, ఒకే శుభ ముహూర్తానికి  వధువులందరికీ మాంగళ్య ధారణ జరిగెను. మధు పర్కములలో నాలుగు జంటలనూ  తల్లులందరూ తనివి తీరా చూచుకొని ముచ్చటలుచెప్పుకొని , చిత్రములు బహుమతులు  ఇచ్చి పుచ్చుకొనిరి.