సినిమావాళ్లకే సినిమా చూపించిన కె - రిడ్జ్ చిన్నారులు
విదేశీ భాషల్లో విరగ దీసిన విద్యార్థులు అంటే అతిశయోక్తికాదు
సుమతీ శతక పద్యాన్ని విదేశీ భాషల్లో వినిపించారు
వేగం రిథమ్ లో మైకేల్ జాక్సన్ కే బీ పీ వచ్చేలా ...
అతడి పాటతో ఆటలాడి విదేశీ భాషల్లో విరగ దీసిన విద్యార్థులు.
ముప్పై ఏళ్ల వయసులో మూడు భాషలు వాళ్ళని మనం చూస్తుంటాం . నరసారావు పేట కె - రిడ్జ్ స్కూల్ లో ఆడుగు పెడితే మూడోక్లాసులో ఆరు భాషలు నేర్చుకునే వాళ్ళను చూస్తాం.
ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, ఇటాలియన్, ఇంగ్లీష్ జాపనీస్ లో
కె రిడ్జ్ విద్యార్థులు ప్రతిభ పూసి వికసించింది. ఈ భాషల్లో బేసిక్స్ అంటే వర్ణమాలలు , గ్రీటింగ్స్, నెంబర్స్ , వారాలపేర్లు , నెలల పేర్లు, గడగడా చెప్పడమే కాక పాటలో మంచి రిథమ్ తో పాడారు
ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, ఇటాలియన్, ఇంగ్లీష్ జాపనీస్ లో పుట్టిన రోజు గీతాలు లయ బద్దంగా పాడి మైమరిపించారు .
అతా మ కత హిస ఆషి ఆషి అంటూ జాపనీస్ బాడీ పార్ట్స్ గీతాన్నిఫాస్ట్ బీట్ లో ఆలపించి భాష నేర్చుకోడం ఇంత సులభమా అని మై మరిపించారు.
మగాళ్లు పచ్చి మోసగాళ్ళే అనే తెలుగు పాటకు ఆధారం అయిన లాషాతె మీ కాంతారె అనే ఇటాలియన్ పాట ను ఆరవ తరగతి పిల్లలు పాడగా
ఐ యాం ఆ వెరీ గుడ్ గర్ల్ అనే తెలుగు పాటను ఫ్రెంచ్ లో పాడారు మూడవ తరగతి పిల్లలు.
తెలుగు పాటల ఫ్రెంచ్ లో , ఫ్రెంచ్ పాటలను తెలుగులో పాడడమే కాక వారు నేర్చుకున్న విదేశీభాషలలో ఇలాటి ప్రక్రియను కొనసాగించారు. అన్ని భాషల్లో పుట్టిన రోజు గీతాలను, పాప్యులర్ పాటలను శ్రావ్యంగా ఆలపించారు.
పాటలతో సరిపెట్టకుండా విదేశీభాషలతో పాటు ఆదేశ సంస్కృతి సంప్రదాయాలను వారి సాహిత్యం ( రచనలు ) తెలియజేసారు.
ఇంగ్లాండ్ కల్చర్ , స్పానిష్ కల్చర్ , ఇటాలియన్ కల్చర్ , జాపనీస్ కల్చర్ పై షార్ట్ టాక్స్ ( చిన్న సంభాషణలు ) ద్వారా చాలా ఆశక్తి కరమైన విషయాలు తెలియజేసి లోతైన జ్ఞానాన్ని కూడా రుచి చూపించారు.
సుమతీ శతకం లో " వినదగు నెవ్వరు చెప్పిన " అనే పద్యాన్ని విదేశీ భాషల్లో వినిపించారు. 28 నిమిషాలు సాగిన కార్యక్రమంలో 68 ఐటమ్స్ సోలోగా జతగా చేసినా చివరిగా అందరూ కలిసి మైఖేల్ జాక్సన్ పాటల్లో అత్యంత వేగవంతమైన పాట "అనీ ఆర్ యు ఒకే ఆర్ యు ఒకే అనీ (ఈ పాటలో వేగం రిథమ్ సామాన్యమైనది కాదు సులభమైనది అంతకంటే కాదు.) అనే పాటను తమ స్కూల్ పేరుతొ
"వుయ్ ఆర్ ద లిటిల్ పోలీ గ్లాట్స్ " అంటూ దుమ్ము రేపుతూ పాడి
సినిమావాళ్లకే సినిమా చూపించారు
No comments:
Post a Comment