Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Monday, July 31, 2023

మాతృత్వానికి జీన్స్ పేంట్

 ఇంకా కొనసాగుతున్న బానిసత్వం  ఇంగ్లిష్ మీడియం చదువు. 

భారత ప్రధాని మాతృభాష లో నే  విద్య  నేర్చుకోవాలని అనడం చూసి ఆనందంతో ఈ పోస్ట్ వ్రాస్తున్నాను.  నేను జర్మన్, ఫ్రెంచ్, స్పానిష్ వంటి విదేశీభాషలు నేర్పే ఉపాధ్యాయుడిని.  నాదగ్గర ఈ భాషలు నేర్చుకునే వారు  చదువుకోడానికి , ఉద్యోగాలు చేయడానికి జర్మనీ , ఫ్రాన్స్ , స్పెయిన్  దేశాలు వెళుతున్నారు. వాళ్ళు ఫ్రెంచ్ మీడియంలో, జర్మన్ మీడియంలో  లేదా స్పానిష్ మీడియంలో చదువుకోడం లేదు కదా!  కోద్దినెలలు ఆ భాషలు నేర్చుకుని మాట్లాడగలుగుతున్నప్పుడు,  విదేశాలు కూడా వెళ్లగలుగుతున్నప్పుడు,  మన పిల్లలు  ఇంగ్లిష్ మీడియం లో ఎందుకు చదువుకోవాలి.? ఇంగ్లిష్ ని ఒక భాషగా నేర్చుకుని బాగామాట్లాడి ఉద్యోగాలు సంపాదించు కోవచ్చు. 



ఇంకా కొనసాగుతున్న బానిసత్వం  ఇంగ్లిష్ మీడియం చదువు. 

ఇంగ్లిష్ వాడిలో మరియు  వాడి సంస్కృతి లో ఎన్ని  తప్పులున్నా వాడి ముడ్డి   నాకే  విధంగా ఉంటుంది మన  ఇంగ్లిష్ మీడియం  విద్య. వాడి సంస్కృతిని నరనరాన జీర్ణించుకున్నాం.  పిల్లలకు పెట్టే పేర్లు, కట్టే బట్టలులలో  వాడి వేష బాషలు   ప్రదర్శించే వాళ్ళు మనకి చుటూ కనిపిస్తారు.  మాతృత్వానికి కూడా జీన్స్ పేంట్ తొడుగుతాం. మనసంప్రదాయాల, (మన అల్ట్రా  సైన్స్) ను వాడి అల్ప సైన్స్  జ్ఞానంతో  ఓడించి వెనక్కి నెట్టేయ డమే అనాదిగా ఇక్కడజరుగుతోంది. ఇంగ్లిష్ వాడిని వాడి జ్ఞానాన్ని ప్రశ్నించే శక్తి మన వాళ్ళకి ఎక్కడొస్తుంది ? 

రవి అస్తమించని బ్రిటిష్ స్వామ్రాజ్యం అనే మాటను మన భారతీయులు గొప్పగా చెపున్నారు అంటే మన ఇంగ్లిష్ మీడియం విద్య ఎలాటిదో అర్థం చేసుకోవచ్చు. ఇదే  (సూర్యుడు అస్తమించని బ్రిటిష్ స్వామ్రాజ్యం ) మాటకు శశిథరూర్ కేరళ ఎం పి ( అద్భుత భాషాజ్ఞానం గల నిజమైన విద్యాధికుడు  గొప్ప రచయిత , ఇంగ్లిష్ వార్తాపత్రికల్లో కాలమిస్ట్)  ఏమన్నాడో తెలుసా?  

"దేవుడుకూడా చీకటిలో  బ్రిటిషువాడిని నమ్మలేదు అందుకే అతడికి రాత్రిని ఇవ్వలేదు" అన్నాడు.  ఇంగ్లీషుమీడియంలో చదువుకుంటే గానీ ఉద్యోగాలు రావు అంటున్నారు మన పెద్దలు   అలా  అనడానికి మనం ఇంకా బ్రిటిష్ దొరల కొలువులో లేం కదా?    

విదేశీయులు ఎప్పుడూ మనదేశాన్ని యుద్ధంతోనే కాక , మతంతో , విద్యతో వాళ్ళ ఫేషన్స్ తో   మనని  మన సంస్కృతిని వశపరుచుకొని  మనం దేశాన్ని బలహీనపరచి వశపరుచుకోడానికి ప్రయత్నిస్తుంటారు.    

బెర్లిన్ గోడ గురించి వినే  ఉంటారు    జర్మనీ రాజధాని బెర్లిన్లో ప్రసిద్ధిగాంచిన గోడ. ఇది రెండవ ప్రపంచ యుద్ధం తరువాత తూర్పు, పశ్చిమ జర్మనీలను వేరుచేస్తూ నిర్మించబడింది. దీనిని ఐరన్ కర్టన్ అని కూడా పిలుస్తారు. యుద్ధంలో జర్మనీ ఓడిపోయిన తర్వాత అమెరికా, రష్యాలు దాన్ని రెండు భాగాలు చేశాయి. 1989  నవంబర్  9 వాతారీకున అది కూల్చి వేయబడించి. రష్యన్ ప్రసిడెంట్ గోర్బచెవ్ దీనిమీద ఒక వ్యాసం వ్రాసాడు " మార్గరెట్ థాచర్ ఈ గోడకూల్చకూడదని ఎంతో ప్రయత్నించించిందని , వేడుకుంది."    ఈ గోడకూలిస్తే ఆమెకెంటి నష్టం ? ఉంటే ఆమె కేంటి లాభం ?  అనుకుంటున్నారా ! బెర్లిన్ గోడ ఉంటే జర్మనీ రెండు దేశాలుగా విభజించబడి ఉంటుంది అంటే బలహీనంగా ఉంటుంది.  అప్పుడు వారి ప్రపంచ  పెత్తనానికి ఏ ఢోకా ఉండదు  

 చంద్రయాన్ 3 కి వ్యతిరేకంగా చైనా కుట్ర బైటకు వస్తోంది చూస్తున్నారా ?  

" చంద్రయాన్ 3  చంద్రుడిని చేరకుండా చూడమని , చేరితే చైనా శాస్త్రవేత్తల చంపేస్తానని"  జింపింగ్ చైనా శాస్త్రవేత్తలకు ఇచ్చిన వార్నింగ్ తెలుసా ? 

మన వేదాలు, ఉపనిషత్తుల గురించి అందులో జ్ఞానం గురించి కొంచెమైనా తెలుసుకుంటే కదా మన పూర్వీకుల వేద  జ్ఞానం ( సైన్స్ ) ఎంత గొప్పదో   ఇంగ్లిష్ వాడి సైన్స్ ఎంత అల్పమో  మనకి తెలుస్తుంది.  ఆసీనో దూరం వ్రజతి, శయానో యాతి సర్వతః".... అంటే ఆత్మ  'కదలకుండానే'  సుదూరాలకు, 'పడుకొనే' అన్నిచోట్లకూ పోతుంది!" అని  అర్థం. 

బానిసభావం విడనాడి ఏ జాతి బతుకునో అదే జాతి అని సినిమా పాట లో ఎంత సత్యం ఉందో  తెలుసుకోవాలి. వాడి భాషనేకాదు  బానిస వేషం కూడా వదల్లేకపోతున్నాము.  

ఇంగ్లీష్ మీడియం లో చదువుకుంటే నమస్కారం అని కూడా అనలేము. గుడ్ మార్నింగ్ తో మొదలెట్టాలి.  వాళ్ళ బట్టలు వేసుకుని స్కూల్ కి వెళ్లి వాళ్ళ భాష చదువుకుంటూ  వాళ్ళే  గొప్పఅని నమ్మాలి.   నమ్ముతాం.  యజమాని దొంగైనా కుక్క అతడిని చూసి మొరగదు , తోకఊపుతుంది. 

ఇంగ్లిష్ వాడు ఎంత క్రూరుడు దోపిడీదారుడు  అయినా  మనం వాడి భాష సంస్కృతి కోసం అంగలారుస్తూ, వాడి భాష రాకపోయినా వచ్చినట్టు నటిస్తూ  బతుకుతున్నాము.  ఇంగ్లిష్ మీడియం స్కూల్స్ కి ఆదాయం ఇంగ్లిష్ భాషే కనుక వాళ్ళు ఇలాటి  విషయాలు  పిల్లకి చెప్పరు. డబ్బుకోసం జరుగుతున్న జాతి ద్రోహం ఇంగ్లిష్ మీడియం విద్య. 



Wednesday, July 12, 2023

జీవితం ఎలా ఉంటుంది ?

 జీవితం ఎలా ఉంటుంది ?

చదరంగా ఉంటుందా ? కోలగా  ఉంటుందా? 

ఎర్రగా ఉంటుందా ? నల్లగా ఉంటుందా ?

పుల్లగా ఉంటుందా ? ఉప్పగా ఉంటుందా?

వేడిగా ఉంటుందా? చల్లగా ఉంటుందా?

వదులుగా ఉంటుందా ? బిగుతుగా ఉంటుందా ?

లోతుగా ఉంటుందా ? మిట్ట గా ఉంటుందా?

మితంగా ఉంటుందా ? అమితంగా ఉంటుందా ?

చిరంగా ఉంటుందా ? అచిరంగా ఉంటుందా ?

సారవంతంగా ఉంటుందా ? నిస్సారంగా ఉంటుందా?

సీమంగా ఉంటుందా? ఆసీమంగా ఉంటుందా?

ఏటవాలుగా ఉంటుందా ? నిటారుగా ఉంటుందా?

సమంగా ఉంటుందా ? అసమంగా ఉంటుందా ?

(ఇలా అనంతంగా సమాధానాలు వ్రాయవచ్చు) 

కానీ అవేవీ సమాధానాలు కావు. ఎందుకు ?

 ఈ ప్రశ్న వదిలిపెట్టి వేరే ప్రశ్న చూడు  

నీ మనసు ఎలా ఉంటుంది ?

మబ్బుగా వుంటుందా ? తేటగా ఉంటుందా ?

తేలికగా ఉంటుందా ? బరువుగా ఉంటుందా?

తెలివిగా ఉంటుందా ? మూర్ఖంగా ఉంటుందా?

కఠినంగా ఉంటుందా ? సరళంగా ఉంటుందా?

సంతోషంగా ఉంటుందా ? విచారంగా ఉంటుందా?

సున్నితంగా ఉంటుందా ? బండగా ఉంటుందా?

గంభీరంగా ఉంటుందా ? బీరంగా ఉంటుందా ?

పదునుగా ఉంటుందా ? మొద్దుగా ఉంటుందా ?

నీలో ఉంటుందా ? నీ బైట ఉంటుందా ?

పక్కనే ఉంటుందా ? దూరంగా ఉంటుందా 

చేతికి దొరుకుతుందా దొరకకుంటుందా 

నిన్ను వెంటనడుస్తుందా ? వెంటాడుతుందా ?

దీనికి సమాధానాలు  అసంఖ్యాకంగా వ్రాయవచ్చు చిట్టచివరకు  

స్థిరంగా ఉంటుందా అస్థిరంగా ఉంటుందా 

నీ మనసు ఎలా ఉంటే నీజీవితం అలా ఉంటుంది ?


నీ మనసు  ఎలా ఉంటుంది ?

గాజు కాయలా ఉంటుందా ? రబ్బరు బంతి లా ఉంటుందా?

గోలుగావాగుతుందా , డోలులా వాగుతుందా? 

జీడిలా సాగుతుందా? కర్రలా విరుగుతుందా? 

ఇనుములా అతుకుతుందా , లక్కలా కరుగుతుందా ?

నీ మనసు నీకు లొంగుతుందా ?

లొంగుతుందని ఒక్కనాటికి అనుకోకు ?

మనసు అనిర్వచనీయమైనది  

అంటే మనసు  పెళ్ళాం లాంటిది 

జీవితం ఏం కోరుతుంది?   

 కళ్ళకు అద్భుతాలు చూపమంటుంది 

కళ్ళు చూసినవి అన్నీ కావాలి అంటుంది 

అందానికి దాసోహమంటుంది 

అందనివల్లా కావాలంటుంది ?

అందకపోతే అలిగి కూర్చుంటుంది.  

అసలు జీవితం  అంటే ఏమిటి?

జీవితం అంటే ప్రతి ఒక్కరికి  ప్రేమ అపారం 

కానీ  జీవితం అంటే  వ్యాపారం

వ్యాపారం అంటే వ్యవహారం  

ఆహారం కోసం చేసే వ్యవహారం 

సమంగా చూస్తే ప్రతి వ్యవహారం

 ఒక హారం జీవితం అనేక వ్యవహారాల సమాహారం






Saturday, July 8, 2023

అమూల్యభావ పరంపర - అమూల్య

రమ్మని పిలువగ వత్తురా రమణులు 

ఇమ్ముగ వ్రాసిన గ్రంధము చూపిన 

ఇమ్మనువారెందరు గలరిచ్చట.  

కమ్మని తెలుగు గ్రంధమును జూచి  


ముచ్చట పడక, పడక వేయగ స్థైర్యము  

రిచ్ఛపాటు  చూపి  రెండు పుటలు చదివి 

ముచ్చెమటలు పట్టగ స్వచ్ఛమైన  సంతోషము

నచ్చటె విడుతురు.  ఎచ్చట భాషాభిమానులు  











ఎచ్చట  నేటి విద్యాధికు లెచ్చట?

విచ్చిన భావాల మెచ్చెడి చదువరు 

లెచ్చట? అచ్చెరువందక అచ్చ తెలుగును 

లచ్చించు తెలుగువారెచ్చట?  పూల

గుచ్ఛమంటి పొత్తము జదువఁ సమయము 

వెచ్చించు వారెచ్చట?



 విజ్ఞులెచ్చట సజ్జనులెచ్చట ?

అభిజ్ఞులు లెచ్చట ?  రసజ్ఞులెచ్చట?

అచ్చుపోసిన  పసిడి పలుకులను 

అచ్చువేసిన అచ్చ తెలుగును 

పచ్చటివెలుగుల పదబంధాల

సుగంధాలను మూర్కొను  వారెచ్చట?


మృదు మనస్కులెచ్చట?కవితా 

స్పృహ గల్గినవారెచ్చట? కవితా 

బృందావన విహారులెచ్చట ?

వెచ్చటి హాయినిచ్చు వేవేల పద 

కవితల హారతి  గొను వారెచ్చట?

పద ముత్యాలను నిత్య సత్యాల

హారాలను ధరించి తరించు వారెచ్చట?

వేయితంత్రుల వీణియను మ్రోగించు 


 

క. అమ్మకు దయకలి గినచో

  కమ్మని   తేనెల  తలంపు   కలమున  బట్టున్ 

  నెమ్మిక  కలిగిన   మదిలో  

  అమ్మయె  కొలువ  గయుండు  అన్నియు తానై