Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Tuesday, September 26, 2023

The English Conspiracy

ఏదేశాన్నైనా ఎలా నాశనం చేయాలి ?

1190లలో ఆఫ్ఘన్ మిలిటరీ జనరల్ ఖిల్జీ నేతృత్వంలోని ఆక్రమణదారుల దోపిడీ దళం  విశ్వవిద్యాలయాన్ని  ధ్వంసం చేసింది. ఖిల్జీ ఆశ్రమాన్ని పడగొట్టాడు, సన్యాసులను చంపడమేకాక విలువైన లైబ్రరీని తగలబెట్టాడు. నలంద లో చాలా తాళపత్ర గ్రంధాలు ఉన్నాయి. వందల వేల (మరియు బహుశా మిలియన్లు కూడా) విశ్వవిద్యాలయం పూర్తిగా మూడు నెలల పాటు మండింది.   బ్రిటిష్ వాడిది  ఇంకాతెలివైన పధ్ధతి  



డా. మన్మోహన్ ఘోష్ అనే కలకత్తా యూని వర్సిటీ ప్రొఫెసర్  భరతముని వ్రాసిన నాట్య శాస్త్రాని కి  ఆంగ్లానువాదం చేసిన  మేధావి. ఈయన 1925 లో భరతముని నాట్య శాస్త్రాన్ని చదవడం  ప్రారంభించి  చదువుతుండగా 19 సంవత్సరాల తరువాత  1944 లో  ఆ గ్రంధాన్ని  ఆంగ్లానువాదం చేయగలను అనే నమ్మకం వచ్చింది. అలా ఆత్మవిశ్వాసం   వచ్చిన తరువాత  ఆసియాటిక్ సొసైటీ వారికి చెప్పగా వారు అనువాదం చేసే పనిని ఈయనకి అప్పగించారు. 1944 నుండి 1951 వరకు 8 మంది భారతీయ ఆంగ్ల ఆచార్యులు కలిసి (7 సంవత్సరాలు)  శ్రమించి భరతముని నాట్య శాస్త్రాన్ని  భారతదేశానికి , ప్రపంచానికి అందజేశారు. ( 7 March 1835 లో   ఇంగ్లిష్ విద్య పెట్టి  అప్పటికే సంస్కృతాన్ని తొక్కేశారు) మన ప్రాచీన  గ్రంధాలు అనువాదం చేసే శక్తి మనకి లేక చాలా గ్రంధాలు అలాగే ఉండి పోతున్నాయి.

 అంటే ప్రాచీన గ్రంధాలలో ఉండే జ్ఞానం అంతా నాశనమవుతుంది.    

విదేశీ శక్తులకు కావలసింది అదే.  జ్ఞానం అంటే కళ్ళు. కళ్ళు  పీకేసి గుడ్డి  వాళ్ళను చేయడం. తరువాత  ఇంగ్లిష్ నేర్చుకుంటే నే   ఉద్యోగాలు వస్తాయి అని నమ్మించి , ఉద్యోగాలపేరుతో  గింజలు పడేసి వాళ్ళ కాళ్ళ దగ్గర పడేసుకోడం.  తరువాత ఈ గుడ్డివాళ్ళ పిల్లలకి  కళ్ళున్నా తమ సంస్కృతి అంటూ  ఏమీ లేకుండా ఫేషన్ల  పేరుతో మోజు సృష్టించి   సంస్కృతిని కూడా లాగేయడం.  తత్ ఫలితమే  ఇంగ్లిష్ ట్యూన్స్ కి  పొసగని  తెలుగు బూతు మాటలు, ఇంగ్లిష్ పద్ధతిలో పుట్టిన రోజులు, ఇంకా చెప్పాలంటే మన జీవన విధానాన్నే మార్చేశాడు. వాడి తెలివితేటలు అలాంటివి. ఒక్క మాట సృష్టిస్తాడు. ఆ మాట  (గ్లోబలైజేషన్ ) అనగానే  దెబ్బకి నువ్వు గుడ్డలు ఊడదీసుకుని వాడి వెంట పరిగెత్తాల్సిందే.    


ఆఫ్రికన్ కవి "పియానో మరియు డ్రమ్స్" అనే పద్యం లో  ఆఫ్రికన్ సంస్కృతిని  పాశ్చాత్య  సంగీతం  ఎలా దోచేస్తోందో , ప్రపంచీకరణ పేరుతో  ఇంగ్లిష్ వాడు  ఎంత  గందరగోళాన్ని  సృష్టించాడో  స్పష్టంగా వ్రాసాడు . ఇంగ్లిష్ వాడివి మామూలు తెలివి తేటలు కాదురా బాబోయ్  

  

భారతీయ బాషలని సంస్కృతాన్ని తొక్కేసి, తెలుగు, కన్నడ వంటి బాషలని ఎందుకు పనికి రాని బాషలని ప్రచారం చేసి , ఇంగ్లిష్ లో నే చదువుకోవాలని చెప్పేడు. మరి ఇప్పటికీ అదే నమ్ముతు న్నాం కదా ! తెలుగుతల్లి నోరెత్తితే నోటిమీద తంతున్నాం.  మన ఇంగ్లిష్  మీడియం స్కూల్స్ లో తెలుగులో మాట్లాడితే  నోటిమీద తంతారు.   అందుకే అన్నాను ఇంగ్లిష్ వాడివి మామూలు తెలివి తేటలు కాదని.  అవును   పూజకు పనికి రాని  పువ్వుని నమ్మించాడు. వాడిమాట నమ్మి   చదువుకు పనికిరాద ని అవతల పారేసిన ఘనులం  మనం. 


పూర్తిగా చంపకుండా లేటిన్ భాషకు పట్టిన గతే  మన భారతీయ భాషలకీ పట్టించారు బ్రిటిష్ వాళ్ళు. ప్రస్తుతం లాటిన్ మాట్లాడేవాళ్ళు ఎవరూ  లేరు కనుక అది మృత భాషే. కానీ ఎక్సటింక్ట్ అంటే కనుమరుగైపోయిన  బాష కాదు. ఎందుకంటే ఇంగ్లీష్ వాళ్ళు మెడిసన్ , సైన్స్ , న్యాయ శాస్త్రాలలో గ్రీక్ లాటిన్ పదాలు ఇప్పటికీ కోకొల్లలు. అంటే మనభాషలు  ఉంటాయి కానీ ఇంగ్లిష్ వాడికి పనికొచ్చేలా ఉంటాయి.


Monday, September 25, 2023

మన పిల్లలకు ఇది చాలా అవసరం.

 మాటలు  తూటాలకంటే అణు బాంబులకంటే చాలా శక్తివంతమైనవి. భాష మన జాతి శ్వాస , మన ఉనికి  ఆత్మ నిగ్రహం , ఇంద్రియ నిగ్రహం , సత్యవాకుపాలన , తపోబలం బ్రహ్మచర్యం ఇలాటి మాటలకి నేడు కాలం చెల్లిపోయింది.  ఇంద్రియ నిగ్రహం   బ్రహ్మచర్యం బూతుమాటలు.  ఇప్పుడు అలాటి మాటలు మాట్లాడితే  ఛి ఛీ   అంటారు.

మంచి ఫిగర్ , కెవ్వు కేక , ఫుల్ ఎంజాయ్  ఆన్ లిమిటెడ్ ఫన్ ,   ఇలాటిమాటలే సినిమా  వ్యాపార ప్రపంచం  పుట్టిస్తున్నది.  మాటలు    విలువలని నిలబెడతాయి, మన సంస్కృతిని   

పాత మాటలు , పాత పాటలు మనకెందుకనుకుంటున్నాము.  మనం డవలప్ అయిపోయాము అనుకుంటున్నాము.  సెల్ ఫోన్ , కంప్యూటర్,  కారు  రూపంలో మన డవలెప్ మెంట్ కనిపిస్తున్నాయి.    కానీ ఇది మన ఫిజికల్  డవలెప్ మెంట్ మాత్రమే.  నోరిప్పితే తెలుస్తుంది మన మెంటల్ డవలెప్ మెంట్ ,  మన ప్రవర్తనలో మన సాంస్కృతిక  కార్యక్రమాల్లో మోరల్ డవలెప్ మెంట్  కనిపిస్తాయి. కానీ మన సాంస్కృతిక కార్యక్రమాలు కాలక్రమేణా బ్రష్టు పట్టిపోయాయి



 


ఒక్క మంచి పాటతో  మొదలు పెడతారు , తరువాత అసలు స్వరూపం బయటపెడతారు.  వల్గర్ ఇంగ్లిష్ మాటలు భావజాలం గల పాటలు ,  హెవీ డ్రమ్స్ , ఫాస్ట్ బీట్ , సినిమా స్టెప్స్ మొదలెట్టే స్తారు . ఆధునిక సినిమా పాటలు మోజు తో  అచ్చతెలుగు   మరియు సంస్కారం చచ్చిపోతున్నాయి  మంచి మాటలు మంచి సాహిత్యం నేడు చాలా అవసరం  మంచి సాహిత్యం జాతికి పోషకాహారం , మంచి కవులు జాతికి వెన్నెముక.

 

భారతాన్ని తెలుగులో రచించిన  నన్నయ్య గొప్ప సాహిత్య విలువలున్న కవిపండితుడు.  వేదాధ్యాయ సంపన్నుడు, శబ్దశాసనుడు,  సంహితాభ్యాసుడు. నానాపురాణ విజ్ఞాన నిలయుడు; అవిరళ జపహోమ తత్పరుడు, వయ్యాకరణి, వాగనుశాసనుడు.  ఆయన బిరుదులకి అర్థం చెప్పడానికి నాలాటి అల్పకవికి సాధ్యం కాదు. ఆదిపర్వం సభా పర్వం , అరణ్య పర్వం - రాసి నన్నయ్య 11 శతబ్దం లో చనిపోతే ఎర్రన అనువదించే వరకు తెలుగు ప్రజలు ఒక శతాబ్దానికి పైగా చివరి అనువాదం లేకుండానే ఉన్నారు.

డాక్టర్ మన్మోహన్ ఘోష్ అనే   కలకత్తా యూనివర్సిటీ ప్రొఫెసర్  భరతముని వ్రాసిన నాట్య శాస్త్రాన్ని    ఆంగ్లానువాదం చేసిన  మేధావి .  ఈయన 1925 లో భరతముని నాట్య శాస్త్రాన్ని చదవడం  ప్రారంభించి  చదువుతుండగా 19 సంవత్సరాల తరువాత  1944 లో  గ్రంధాన్ని  ఆంగ్లానువాదం చేయగలను అనే నమ్మకం వచ్చింది. అలా ఆత్మవిశ్వాసం   వచ్చిన తరువాత  ఆసియాటిక్ సొసైటీ వారికి చెప్పగా వారు అనువాదం చేసే పనిని ఈయనకి అప్పగించారు. 1944 నుండి 1951 వరకు 8 మంది భారతీయ ఆంగ్ల ఆచార్యులు కలిసి (7 సంవత్సరాలు)  శ్రమించి భరతముని నాట్య శాస్త్రాన్ని  భారతదేశానికి, ప్రపంచానికి అందజేశారు. నేటికీ కూడా భారతదేశంలో అనేక ప్రాచీన గ్రంధాలు అనువాదం చేయగల వారు లేక అలా ఉండిపోయాయి.

 నేను  భారతవర్ష అనే విలువలతో కూడిన అచ్చ తెలుగు లో అతిపెద్ద  గ్రంధాన్ని వ్రాసిన అనుభవంతో ఒక్క మాట చెపుతున్నాను.  మన పిల్లలకి  ఆధునిక సినిమాగీతాలతో వచ్చే ఆధునికత కంటే  పాతగీతాలతో స్వచ్ఛమైన తెలుగుతో వచ్చే సంస్కారం చాలా విలువైనది. 

Monday, September 11, 2023

10 Reasons why Hindus are down in India

1. BC - CC - Brain Captured by Cinema and Caste 

2. BC BC - Begging Class bought by Business Class

3. MM - PM - Money minded Political Media

4. DD - FR  -  Dead Democracy ; Family Rule

5. HP -FS  Hindu Phobia - Freedom of Speech  







6. J C F F  - Jourlanism Communisim ; Foreign Funds

7. B L - P M - Biased Laws - Poverty and Minorities

8.CD - SD -  ID -  Celibrity Dogs ; Secular Dogs ; Intellectual Dogs

9. SE - SE : Slave Education ; Slave Employment

10. HIndus want to survive without fighting at the cost of slave life