శ్రీ కాళ హస్తీశ్వర శతకం -అలౌకికానందం - పూలబాల.
.వేద ఘోషలాటి ఆధ్యాత్మిక స్రవంతి .
.బహుభాషా కోవిదుడు పూలబాల రచయిత గా, కవిగా ఆంధ్ర లోకానికి సుపరిచితులు.ఫ్రెంచ్ , జర్మన్ , జాపనీస్ వంటి విదేశీ భాషలలో రచనలు, సైన్స్ ఫిక్షన్ , వండర్ కిడ్స్ , మూన్ లైట్ స్టోరీస్ వంటి పిల్లల కథలు , భారతవర్ష, వనశృంగారం వంటి శృంగార రచనలు, మహాకవి వంటి విప్లవ కవితలు, మన జానపదాలు వంటి జానపద గీతాలు ఇలా పూలబాల వ్రాసిన అన్ని రచనలూ లౌకికమే కానీ శ్రీ కాళ హస్తీశ్వర శతకం వీటన్నిటికీ పూర్తిగా భిన్నం వైరాగ్య ఆధ్యాత్మికం అలౌకికానందం.
శ్రీ కాళ హస్తి వెళ్లాలని శివుని సందర్శించాలని ఎన్నిసార్లు అనుకున్నా కుదరలేదు. ఒక సారి తిరుపతి శ్రీ కాళ హస్తి రెండూ చూడాలని బయలుదేరి తిరుపతి మాత్రమే చూసి వెనక్కి వచ్చేయాల్సి వచ్చింది. అందుకే శివుని మీద భక్తితో వ్రాసిన ఈ శతకానికి శ్రీ కాళ హస్తీశ్వర శతకం ని పేరు పెట్టుకున్నారు. శార్ధూల ఛందస్సు లో ఒక్క పద్యం వ్రాయడమే కష్టం అటువంటిది ఒక శతకం వ్రాయడం అంటే మాటలు కాదు.
ఈ శతకంలో మనుషులు కలియుగంలో ఇతరులను వంచిస్తూ ఎలా దిగజారి ఆత్మా నాశనాన్ని కొనితెచ్చుకుంటున్నారో చెబుతూ, క్షుద్రానందాల వేటాపి, సాత్వికానందాలతో సరిపుచ్చుకుని యోగులందరికీ తొలియోగి అయిన శివుని ప్రార్థించమని శివుని శక్తి మహిమలను శివునికి గల అనేక నామాలతో పద్యాలలో వ్రాసారు.
క్షుద్రానందాల కొరకు అంటే తగని విలాసాలకొరకు వంచన ఆత్మ నాశనం చేసుకోవద్దని, నిత్య శివ నామ జపంతో లోభం అంతం అయ్యి బుద్ధిబలం మనో నిగ్రహం పెరుగుతాయని చెప్పే పద్యం.
శా. క్షుద్రానం దములం దగోరి పురుషుల్ క్షోభించి యార్జించు చూ
బద్రంబు క్షయమ వ్వతాగి జనులం వంచించి జీవించు చుండ్రు
రుద్రానీ కృపకో రినిన్ను దినము ప్రార్ధించ లోభంబు అంతంబ గున్
నిద్రాణం బుగను న్నబుద్ధి బలమం తవృద్దౌ నీకృపన్ నిక్కంబు గన్
జనులను పదవి వేషం చూపి హంగామా చేసి దోచుకుంటే కాలుడు ( యముడు)కుంభీ పాకంతో సంభావిస్తాడని ( సత్కరిస్తాడని) చెప్పే పద్యం.
శా. గంభీరం బుగవే షమేసి జనులన్ గాండ్రించి ఏమార్చినన్
రంభారా విడిజే సిపెంచ సిరులన్ యాశూలి కాగ్రహ మొచ్చు
కుంభీపా కములో కినెట్టి నరులన్ కుంపట్లో దుర్మార్గు లన్
సంభావిం చునుకా లుడంచు తెలిపెన్ శాస్త్రంబు స్పష్ఠంబు గాన్
.
శివుడిమీద మనసు లగ్నం చేస్తే చావు కూడా దరి చేరదు అని చెప్పే పద్యం.
శా. చావేలే దుగదా స్మరింప శివునా చారంబు గానిత్య మున్
త్రోవేదా అరుణా త్మజు డై నను బో తోడుండ నీనామ మే
పోవేళ స్మరణం బుమోక్ష మొసగున్ భూతాత్ము గానంబు నన్
చావేజే రదుఖా యమింక నరుడా చచ్చేది కాయమ్ము రా
.
స్త్రీ వ్యామోహంతో వామాచారపు పద్ధతులను పాశ్చాత్య నాగరికతను వెనకేసుకు రావడానికి స్త్రీ లోలతే కారణంఅని తెలియజేసే పద్యం
శా. వ్యామోహం బునకా మకౌతు కపువా మాచార నుష్టాన మంత
ఆమోదం బనిప ల్కుచూ,శి వశివా ఆలోచ లేమార్చు చుండ్రు
ప్రమోదం బునుగో రినిత్య మదన ప్రభావ చిత్తంబు నన్
స్త్రీ మోహం బునఇ చ్ఛయంత పెరగ స్త్రీలోలు లీరీతి గన్
శా. దీపాలే వెలిగిం చనే ర్చి సిరిరా దీవించ మంచు మృ క్ష
పాపాలే క్షయమొం దగోరి ఇలలో పాపత్ము లాశంక రున్
కాపాడం చుతలొం చివేడ ఎటులా కాపాలి మొరాల కించు
శాపాల న్నియుజు ట్టుముట్టి కరిచే సర్పాలై బంధించ గన్
శా. చీరేగ ట్టినితం బిదారి నటబో చిత్రంబు చూపించ గన్
వీరోల్లా సమునొం దివీధి శునకా వేశంబు జూపించు చుండ్రు
చోరాధ ములని త్యమిట్లు విరలిన్ శూన్యాత్ము లైక్రుంగు చుండ్రు
పారాణిం పరెకుం కుమద్ది నొసటన్ పాపాత్మ శోభిల్ల గన్
శా. ధనాశా అడిమో హమంట మనుజుల్ ధాసోహ మైబ్రాంతి చే
అన్యాయ మ్మనిదె ల్సిజేతు రుకదా అన్యాత్తు లైజచ్చు చూ
విన్యాస మ్ములుజే యశూన్య మునటె వ్రేళ్ళాడి రోదించు చుండ్రు
అన్యాక్రాం తముజే యనాత్మ లకటా ఆక్రంద ముల్జేయ గన్
శా. ప్రలాపిం చెడిఊ రమూక లనిషా ప్రచార సంఘాల నమ్మి
ప్రలోభా లకులొం గిఆత్మ నొదిలా బ్రాంతుల్లొ జీవించు చూ
విలాపిం చుఅనా ధజీవు లమనో వేదనా మూలమ్ము లన్ని
కాలాత్మ కృపచే సవిత్తు మొఱచే కాలేను నిశ్శేష మై
శా. సారాయం గడివ ద్దజేరి దళముల్ జామంత వెచ్చించు చుండ్రు
బారాది ద్రవిణం బుజేర పురుషుల్ వారాంగ నల్గూడు చుండ్రు
పారాపా రపు సొ మ్ములున్న జనులే పక్షాలు పెట్టింక నెగ్గి
నేరాలె న్నియొజే సి భూగృ హముల న్వేసారు చుండ్రీ శ్వరా
10. శా.చోరాధ మునిఏ రికోరి తమలో చోరోత్త ముండీత డంచు
చోరాగ్రే సునికా సనంబు నొసగన్ చోరుండు ధీరుఁడ గున్
ధారాళం బుగ ఓ టువేయు జనులం తాచోరు లైయొప్ప గన్
చూరాడ శ్ర మయే దిరా శి వశివా చోరుండు రాజేగ దా
11. శా. కాషాయం బనఏ వగించి కడకే గాల్చేవు దేశాన్ని వి
ద్వేషజ్వా లలకా హుతిచ్చి ఒరిగే దేహాన్ని మోహించ చూ
పాషాణ హ్రదయం బుతోబ్ర తకగన్ పాడెక్క కాలంబు నీ
ఘోషప్ర మథనా థుకెగ్గు కలగన్ ఘోరా తి ఘోరంబగు
12. శా. శంభోశం కరపా హిమాంశు భకరా సర్వాంగ కైలాస వాస
గంభీరం బుగజూ సినీచ తలపుల్ గాల్చుము కేదార నాథ
సాంబాసం భవమా పరార్థ పథమున్ సాహిత్య సావాస మన్
సంభారిం పగసా ద్యమానొ సగుమా చంద్రధ రానీకృ పన్
13. శా. పింజారీ నటనా లిజూప పురుషుల్ వింజామ రల్దెచ్చి ధాత్రి
రంజిల్లె ననిమొ క్కపెక్కు మగువల్ లాస్యాల కామాత్రు లన్
భంజించా నరజా లమంద చటనే బంధింప భస్మాంగు నమ్మి
పూజింపన్ దయతో డిమోక్ష మొసగున్ భోగార్తి భంజించు చున్
14. శా. యంత్రాలే లుజగం బులన్ని కలికా లంబున్ యంత్రాల నమ్మి
మంత్రాలే లనిఈ శ్వరాయ నుటకే మాత్రంబు నిచ్చేక ల్గక
తంత్రాలన్ నెరన మ్మినాశ నమనం దాతంత్ర ముల్ వీగ
మంత్రాలే మెరుగం చుజేరి జనులా భస్మాంగు పూజించ రే
15. శా. వానాకా లపువి ద్య నేర్చి జనులా పాలాక్షు శోధింప మాని
జ్ఞానాన్వే షులమం చుమూఢ మతితో సాంకేతి కప్రజ్ఞ బట్టి
సూన్యా కా శమునం దురిత్త జగముల్ శోధించి జీవాత్మ నొడ్డి
విన్యాస మ్ములుజే యనిల్పి గొనియా విశ్వాత్మ శోధింప రే
16. శా. వాతఃవే గమునం దిపారు మెకమే వ్యాఘ్రంబు చేజిక్కి జచ్చు
కాంతామో హమునం దుబడ్డ పురుషుల్ కాలాంత కుల్వీరు లైన
కాంతారం బునకం దకంబు నబడ్డ కాళింగ మున్ బోలి ఆయు
వంతాచి క్కగశం కరాత మనుతా వంచించు కొంచుండ్రు
17. శా. సారాధా రలుపో సికోట్ల ధనమే సంకోచ మేలేక జల్లి
బేరాలా టలగ ద్దెనెక్కి కొలిచే వీరాభి మానుల్ మొల్వ
తారాజు వ్వనుపో లినింగి కెగసి ధాత్రంత పాలింతు నంచు
కారాగా రమునం దుకూలి అచటన్ కాలాత్ము యోచింప రే
18. శా . మందార మ్ము గమ బ్బు పట్ట నభమున్ పాణింద మంబట్టు
బంధాల న్నియుజు ట్టుముట్ట మనసున్ మాయంత కమ్మేయ దే
బృందార మ్ము గజిం కతాల్పు దయజూ పంగవై రాగ్యంబు సోకు
బంధాల న్నియువీ డుకోర్కె లడుగున్ పంథాలు మారింకపోవు
19. శా. వేళాకో ళముజే సిపెద్ద నివయో బేధమ్ము జూడక వాగి
జైళ్లంబ డ్డవినీ తిమంతు నిలలో జైజైని నాదమ్ము జేయు
క్రుళ్ళిపో యినపా డుజాతి మదిలో క్రూరమృ గావేశ మున్
వేళాకో ళపుబు ద్ధిదిద్ద గ మహా పింగాక్ష నిన్ వేడె దన్
20. శా . సంపత్తే నిఖిల మ్మనెంచి పురుషుల్ సంసార మేసత్య మంచు
వెంపర్లా డచుకూ డబెట్టి సిరులన్ వేలాది రొక్కంబు పా
రంపర్య మ్ముగని వ్వకాంక్ష పెరుగున్ రాదింక వైరాగ్య ము
వెంపర్లా డచుసం పాదించు చుసుతుల్ వేసారు చుండ్రీశ్వ రా
21. శా. రూపాయా టలవి శ్వసించి జనులే లోపంబు లంజూడ రెట్టి
వ్యాపారమై ననుజే యుచుందు రటులే భద్రేసు నమ్మింక యా
రూపంబున్ మనమున్ తలంచు టకుయే లోపంబు అడ్డొచ్చు నో
కాపాలీ నినుచి త్తమందు నిలపనీ కటాక్ష మేకావ లెనయ్య
22. శా.సామాన్య ప్రతిభా విశేష ములనే చాలించి వాదంబు లా, ప
సామాన్య ప్రమథ గణశ క్తులనే శాసించు ఫాలాక్షు దక్ష
జామాతన్ పరమే శుపాద ములనా శ్రయింతు జ్ఞానార్థి యై
కామాక్షీ పతి కా టిభూడి దనిచ్చి కారుణ్య మున్ జూప వయ్య
23. పొంగేను త్రిపురా రిశీర్ష మునయా పొంగేటి గంగను జూడ
వంగేను జగమం తచూడ మనసే వాలేను పాదాల చెంత
ఊగాడే జటలొం కచూడ మదిలో ఉన్మత్త రూపముం నిల్ప
భోగాలే లయవీ తరాగ సిరులన్ పూర్ణవై రాగ్యము నిమ్మ
24. లెక్కింపొ క్కడువీ తరాగ మునుకో రిశ్రీక రున్వేడు కో
ట్లొక్కండే తపమా చరించు నిలలో డోలాయ మానంబు వీడం
దొక్కండే అనుభూ తిచెందు తాలును తూర్పాఱ బట్టి
చొక్కించా త్మలలా టలోచ నునియా జోటింగు
25. సౌఖ్యాలే పరమా ర్థమంచు కలలన్ సాకార ముంజేయ ఘోర
సంఖ్యాక మగుపా పకార్య ములజే సామ్లేచ్ఛ సౌజన్య మంది
విఖ్యాత మ్మగుయో గసిద్ధి యుతపో మోక్షంబు లన్వీడి నీచ
లక్ష్యాలం బడిపో యికాన రికకా లాత్మప్ర భావంబు నే
26. కాలక్షే పముకో రిలాల పరమే గావించి భోగవి లాసమ్ము లం
దేలక్షే పముజే యచిత్త మునుమ త్తేగమ్మ ధనార్జ నం
బేలక్ష్య మ్మనిన మ్మి నెటుగం భీరంబు
27. తెల్సేదే హమశా శ్వతమ్ము నినరుల్ తేజమ్ము మక్కిల్లు దాఁక
జల్సాలే మియువీ డలేక తమతే జమ్మా రు అంత్యక్ష ణాన
తెల్సేకో ర్కెలకొ క్కిరాల కెరగా దేహమ్ము నర్పించి జచ్చి
కల్సేరా నివివే కమత్త మిల్లగన్ కాట్రేనొ డిన్వాలు చుండ్రు
ఈ శరీరం నేను కాదు అని తెలిసిన మనిషి నిస్సహాయుడై కోర్కెల కొక్కిరాయిలకు తన దేహాన్ని అప్పగించి జీవిత అస్తమించిన పిదప వల్లకాడుచేరి కాట్రేని ఒడిలో దీర్ఘ నిద్రలో కి జారుకుంటారు. శరీరముతో అంటకాగకూడదు శరీరం మనం కాదు శరీరంలో లో ఉన్న చైతన్యం మాత్రమే మనం.
28. వేరేదే మియుకా దుదేహ మనగా వెంటాడి పీడించు చీడ
పారేఏ రువలే యుగాల పడిజీ వాత్మప్ర వాహంబు సాగు
వేరేరూ పముయ బ్బవాస నలతో వేటాడు దేహంబు దాట
దారేదీ మరియా త్మయోగ ధనభూ తాత్మకృ పాక్షంబు లేక
అనేక శరీరాలగుండా మన ఆత్మ యుగయుగాలుగా ప్రవహించే నది. కానీ శరీరమే మనం అనే బ్రాంతి లో నే మనం జీవిస్తాము. ఒక పీడలా మనని పట్టుకు పీడిస్తున్నది మన శరీరం మాత్రమే. శరీరం ఒక చీడ. యోగధనుడు ప్రథమ యోగి అయిన ఈశ్వరుని కృపలేనిదే ఈ శరీరాన్ని దాటలేము.
ఈ శరీరం నేను కాదు అని మనసుని నమ్మించడం చాలా కష్టం దానికి దైవప్రార్ధన తోపాటు వైరాగ్యం కూడాకావాలి .
కష్టాలు శివుడిమెడలో వెళ్ళాడు సర్పాలు లా భీతిగొల్పుతాయి
కష్టాలనుంచి తప్పించుకుని సుఖాలకోసం ప్రాకులాడితే వచ్చే ప్రయోజనం ఏంటి . సుఖాల తర్వాత మల్లె కష్టాలు వస్తాయి.
4. కష్టాలని స్ఫూర్తి గాతీసుకుని వైరాగ్యాన్ని వెతుక్కోవాలి వేమన, ధూర్జటి లాంటి ఎంతోమంది కవులు వైరాగ్యాన్ని పొందారు
5. ఎక్కువకాలం బ్రతకడం కోసం నానాబాధలు పడి ఆరోగ్యం సంపాదించినా ప్రమాదంజరిగి మనిషి ఆయువు తీరిపోతుంది
ఆరోగ్యం కోసం కాక వైరాగ్యం కోసం తపించాలి
6. తెగింపు ధైర్యాన్నిస్తుంది. చావంటే భయంలేదని డంబాలు చెప్పడం మనసుని బండబార్చడం వైరాగ్యం చావుని సులభం చేస్తుంది. చావుకోసం ఎదురుచూసేలాచేస్తుంది. ఎక్కువ కాలామ్ బ్రతికి ఉండడం కూడా ఏమీ ప్రయోజనం లేదు
7. మండూకం నేలమీద నీటిలోను ఉన్నట్టుగా మనిషి భౌతిక ఆధ్యాత్మిక ప్రపంచాల్లో ఉండాలి. భౌతిక ప్రపంచంలో మనిషి తక్కువ ఉంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో అంట ఎక్కువ ఉంటాడు.
8. బరువు హెచ్చు ఉన్న పెద్ద నౌక , కనిపించకుండా సముద్రం లో పైభాగం ఎంత ఉంటుందో నీటికింద కూడా అంటే ఉంటుంది. జ్ఞానం బాగా ఉన్న పండితుడు కూడా అలాగే ఆధ్యాత్మిక సముద్రంలో మునిగి ఉంటాడు.
9. మనిషి అందం కోసం ఆరాటపడుతున్నప్పుడు ఇతరులను మెప్పించడానికి తాపత్రయ పడుతున్నాడని గ్రహించాలి . అంతరాత్మను పమెప్పించే పనులు చేయడం లేదని కూడా గ్రహించాలి. అందుకు కారణం వైరాగ్యం లేకపోడమే
10. వైరాగ్యం ఎందుకుండాలి వైరాగ్యంతో భయం నశించి స్వేచ్ఛ వస్తుంది. నిజమైన ఆనందం లభిస్తుంది
11. నిజమైన లోతైన వైరాగ్యం ఆత్మానుభూతిని క్షణకాలమైనా కలుగజేస్తుంది.
ఆత్మానుభవం కలిగినవాడు నీచమనుషుల మెప్పుకోసం తపించడు
12. ఈ లోకంలో పేరు సంపాదించుకోడం కూడా ఇక్కడ వరకే పనిచేస్తుంది, కీర్తి జ్ఞానం రాదు , జ్ఞానం వాళ్ళ కీర్తి వస్తుంది. జ్ఞానంలేని కీర్తి దండగ.
13. అనేక రకాల విషయాలు వాటి జ్ఞానాలు, భౌతిక ప్రపంచంలో వాటి విలువ వేరువేరుగా ఉంటాయి. ఏ జ్ఞానం సంపాదించినా సేవచేసి డబ్బు సంపా దించడంకోసమే. ఆత్మజ్ఞానంతో డబ్బు సంపాదించరు. అందుకే ఆత్మ జ్ఞానంకంటే గొప్పది ఏదీ లేదు.
14. భౌతిక మానసిక అనుభవాలద్వారా సుఖం జ్ఞానం సంపాదించవచ్చు.
తినడం తాగడం , ప్రయాణించడం అన్నీ సుఖాన్నిస్తాయి. చదవడం , వినడం , ఆలోచించడం అన్నీ జ్ఞానంతో పాటు హాయినిస్తాయి
15. సుఖం కంటే ఆనందాన్ని మనసు ఆలింగనం చేసుకుంటే మనిషికి సూక్ష్మం లో మొఖం ప్రాప్తిస్తుంది. ఎందుకంటే మనిషి సుఖంకోసం పడరాని పాట్లు పడుతుంటాడు.
16. సుఖం రెండూ కోరుకుని కష్టాలు కొనితెచ్చుకోడం ఎవరికీ ఇష్టం ఉండదు ఆనందం సుఖం కంటే గొప్పది అని వదిలేయాలని ఉన్నా సుఖాలని త్యజించే దైర్యం లేక కష్టాలు పడుతుంటారు
17. ఎక్కడికీ కదలకుండా కూర్చోడం శరీరానికి ఎంత కష్టమో మనసుకు కూడా ఓయీ విషయం మీద ఉండడం అంతే కష్టం.
18. అభౌతిక మైన ఆత్మని భౌతిక మైన శరీరంతో అనుభూతి చెందడం కష్టమే ఆత్మని అనుభూతిచెందడం చీకటిలో చూడడానికి ప్రయత్నించడం కంటే కష్టం.
19. ఆత్మని అనుభూతి పొందినవారు తమ ఉనికిని బాహ్య స్పృహను మరిచిపోతారు. మరి ఆత్మని అనుభూతి చెందినది ఎవరు?
20. అహం అనేది , సూర్యునిలా భౌతిక ప్రపంచం లో అస్తమించినప్పుడు ఆత్మజ్ఞానం ఉదయించి భూమి కి ఉన్న మరో తలంలో ప్రకాశిస్తుంది
నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః!
ఉభయోరపి దృష్టోఽన్తఃత్వనయో స్తత్త్వదర్శిభిః!!
తాః అసత్యమైనది లేనేలేదు. సత్యం అనేది ఉండకపోదు. తత్వవేత్తలు ఈ రెండింటి తత్వమును శ్రద్థగా అధ్యయనము చేసి విషయమును ధృవీకరించిరి.