2023 దీపావళి చాలా ప్రత్యేకం. ఈ ఏడాది బాహ్యకాంతుల కంటే అంతః కాంతి రెట్టింపయ్యింది. బాహ్యంలో నూనె దీపాలు కాంతులు, అంతరంగంలో కొత్తగా నేర్చుకున్న భాషల కాంతులు. రష్యన్ లిపి నేర్చుకుని, వర్ణ మాల రాసి వీడియో పోస్ట్ చేసాను. వారం క్రితమే చైనీస్, జపనీస్. గ్రీక్ వర్ణ మాలలు నేర్చుకున్నాను.
విజయవాడ పట్నం నుంచి పల్లెకు మకాం మార్చి ఆరేళ్ళయింది. స్వగృహప్రవేశమ తరువాత జరుపుకున్నమొదటి పండుగ దీపావళి. కొత్త ఇంటినిండా దీపాల కాంతులు. మనసులో నిండిపోయాయి. ప్రతిసంవత్సరం పండుగ అంటే సంఘ సేవ చేయడం, దీపావళికి ఎదో కొనడం పరిపాటి గా సాగింది. ఈ సంవత్సరం ఫోమ్ బెడ్ కొనుక్కుని పాత బెడ్, సోఫా మిత్రులకి బహుమతిగా ఇచ్చి ఆనందం పొందాను. ఇంట్లో దీపాలంకరణ మామూలే.
నేను నా ఆనందంకోసం, కాలం సద్వినియోగం చేసుకోడం కోసం 100 భాషల వర్ణమాలలు రాయడం లక్ష్యంగా పెట్టుకున్నాను. హిందీ , తెలుగు , తమిళ్, మలయాళం , కన్నడం, బెంగాలీ, గుజరాతీ , అస్సామీ, మరాఠీ , పంజాబీ - 10 దేశీ భాషలతో పాటు
మరో 10 విదేశీ భాషలు ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, ఇటాలియన్, ఇంగ్లీష్, జపనీస్, చైనీస్ , అరబిక్, ఉర్దూ - ఇరవై భాషల వర్ణ మాల నేర్చుకోవాలని సంకల్పించాను. డిసెంబర్ అంతానికి 20 వర్ణ మాలలు రాస్తాను. అరబిక్, ఉర్దూ ఇంకా నేర్చుకుంటున్నాను. రష్యన్ , గ్రీక్ , లాటిన్ వర్ణమాల ఇప్పటికే నేర్చుకున్నాను. నేను 100 వర్ణ మాలలు రాసిన తరువాత పొందే ఆనందం మాటల్లో చెప్పలేను. దీనికి అకుంఠిత దీక్ష కావాలి.
All the best ... మీ ప్రయత్నం తప్పక సిద్దయిస్తుంది .. అయితే మాట్లాడడం .. బాషాని అర్ధం చేసుకోవడం కూడా నేర్చుకోండి
ReplyDeleteఅందరూ సాధించలేని విద్య మీ సొంతమైంది. మీ ఇంటితో పాటు దేశానికీ కూడా వెలుగులు నింపే ప్రయత్నం సఫలం కావాలని ఆకాంక్షిస్తున్నాను. 🎉
ReplyDelete