Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Saturday, June 18, 2016

Tell the truth straight - English Playlet

The Characters:  Ramya, Varsha  and Mother ( a middle aged house wife)

Ramya and varsha are firneds studying in different colleges .  They live in the same city.

Ramya visits Varsha's house to invite her to her brother's marriage. Varsha is studying for her supplymentary exams.  the play begins with Ramya entering Varsha's house.


Mother:  what a surprise!  Ramya,  come in, sit down
Ramya: How are you aunty? where is varsha ?
She has gone to watch a film?
You must be joking.
Ha..ha,,ha  she is studying seriously for her exams
I know how can she leave books during exams
Go into her room. 

(She enters Varsha’s room.)

 
               
Hai Ramya!
Hai, varsha, sorry for the disturbance. How are you?
Hai Ramya, come on sit down, don’t say that. Your visit is not a disturbance it is a pleasure
You must be working hard.  Is it not?
Stop talking about studies always. 
what happening?  what is new?
I came here to invite you for my brother’s marriage.
 When is the marriage?
Next week . I think that  by then, your exams will be finished
Yes,  I have not done well in  two subjects.   In fact I have not written the exams.
Study well. It is a shame on you to go for supplies.
No,  I cannot study well because studies are boring.
what is your brother doing?
He is a business man.
Is he a business man?
 How lovely!  You like business.
Yes. I love business much. 
That is nice. You can do it after your studies. Actually I want to stop studies but my father.
 If you stop studies how can you get knowledge? We can earn money by doing business or something else, but we don’t get knowledge by doing business.
Who wants knowledge? I want money.
You are crazy. If you don’t believe knowledge why are you studying?
My father says " Study and get B. Tech. Then you can get a job." He says business is risky. 
Why do you think that business is risky?
We invest money in business.
You think you are not investing money in studies?
of course we do, but we don’t invest money at a time.
You may not invest money at a time but certainly you invest huge amount in 16 years. What about time? Time means nothing to you? In business you lose 6 months or one year. In education you spend 16 years, the important part of your life.  Yet there is no guarantee to get a job. There are millions spending life in unemployment and despair. When you have no value for studies tell you parents straight away. Don’t think business is dangerous. Education is more dangerous than business

Friday, June 3, 2016

మనిషీ నీకు భాష్పాంజలి

ఆధునిక జీవితం బాగుందా? పురాతన కాలం లో జీవితం బాగుందా?  అప్పట్లో చాలా దూరాలు కాలినడకన పోయేవారు. ఇప్పుడు పక్కనే ఉన్న బజారుకి  , బడికి కూడా కారు లో వెళుతున్నారు. అప్పుడు ఎడ్ల బండ్లమీద ఎండలో మాడుతూ ప్రయాణం చేసి టూరింగ్ టాకీస్ లో  లవకకుస సినిమా చూస్తే, ఇప్పుడు ఆన్లైన్ లో బుక్ చేసుకుని ఐనాక్స్ లో అనిమేషన్ తో తయారైన అపూర్వ అద్బుతాలను చూస్తున్నాము. సెల్ ఫోన్ జేబులో వేసుకుని దాంతో పాటు ప్రపంచాన్ని వెంట తీసుకెళుతున్నాము.

నాజీవితం లో కూడా ఇదే జరిగింది. నలభై ఏళ్ళ క్రితం ఈ రంగులు హంగులు  రాకముందు బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో పుట్టినవాడిని,  కాలినడకన తిరిగినవాడిని, చిన్నప్పుడు ఏ సి అంటే ఎరగనివాడిని, కరంట్ పొతే విసనికర్రని , దీపం బుడ్డిని నమ్ముకున్నవాడిని  ఇప్పుడు ఇన్వర్టర్  ఇంట్లో ఉన్నవాడిని, బ్యాంకు కు కూడా పోకుండా  ఫోన్లో బ్యాంకు పనులు చేసుకున్తున్నవాడిని, బైటికి వెళ్ళితే ఏ సి కారు , ఇంటికివస్తే ఏ సి. ఇవి చాలామందికి దొరికే సుఖాలే , ఇంతకన్నా అద్భుత  సుఖాలు , అనవసర సుఖాలు అనుభవించే వారు చాలా మంది ఉన్నారు. అయితే  ఆధునిక జీవితం బాగుందా? పురాతన కాలం లో జీవితం బాగుందా?   ఆలోచనా జ్ఞానం లేనివాడికి ఎడారి  కూడా  పచ్చగా కళకళ లాడుతున్నట్లు ఉంటుంది .  మూర్ఖుడికి వాపు బలం లా కనిపిస్తుంది.  ఒకవైపునుంచే  చూసేసి , ఒకవైపు వాదనే వినేసి తీర్పు ఇచ్చేసి నట్లు నిర్ణయించకూడదు అని విజ్ఞులు అందరూ అంగీకరిస్తారు.


మనిషికి శరీర సుఖాలు  పెరిగాయి నిజమే, ప్రకృతి ఎంత నాశనం అయ్యింది? యంత్రాల వల్ల పని వేగం అయ్యింది  సులభం పెరిగింది, పని ఎన్ని రేట్లు పెరిగింది, టైం కి తిండి, నిద్ర ఎంతమంది కి దక్కుతుంది? మానసిక వత్తిడి ఎంత పెరిగింది?  బాహ్య ప్రపంచ మెరుగులు అందుకోడంలో పడి అంతరంగాన్ని అందుకోలేకపోతున్నాడు. ప్రేమ స్నేహాన్నిఅవగాహన కుటుంబసభ్యులనుంచి పొందడము కూడా ఒక అద్భుతంమే. స్త్రీ పురుషలమధ్య  ప్రేమ ఆకర్షణ సహజం వాటిని వ్యక్తపరచడం సాహసం గా పరిణమించింది  తక్కువ కులమని ప్రేమికుల ప్రాణాలు తీసేస్తున్నారు , ప్రేమించాక పోతే ప్రణాలు తీసేస్తున్నారు.  ప్రేమ ప్రాణాంతకం గా మారింది  .  సవ్యంగా ఒకే కులం నుంచి పెద్దలు కుదిర్చిన పెళ్లిలతో సుఖపడిపోతున్నారా అంటే అదీ లేదు, ఈగో , పురుషాహంకారం , ఇంకంపేటబిలిటీ ఇలా చాలా సమస్యలు వీటన్నిటికీ కారణం ఆలోచన, ఆటిట్యూడ్ , కల్చర్  వీటిని టెక్నాలజీ ఎప్పటికీ సవరించలేదు విజ్ఞత, కల్చర్ మాత్రమే సరిదిద్దగలవు. కానీ అందుకు చదువు ఉండాలి కదా ! మనకు లేనిది అదే కదా ! చదువు , కల్చర్ మనకి ఇవేలేవు. అక్కర్లేదు కూడా.

పక్కవాడితో మాట్లాడడం అనవసరం  ఇరుగు పొరుగు అనేది సరదా కబుర్లు చెప్పుకోడం తగ్గిపోయి కాలక్షపానికి కూడా( టీ వీ, రేడియో ) యంత్రాలమీద ఆధారపడుతున్నాము  మరి  మానవ సంబదాలు మాటేమిటి?
పసిపిల్లల్ని రేప్ చేసి చంపే క్రూరులు పెరిగిపోతున్నారు  భార్య నగ్న చిత్రాలని ఇంటర్నెట్ లో పెట్టే భర్తలని చూస్తున్నాము. హద్దులు దాటిన క్రూరత్వం మానవత్వాన్ని అపహాస్యం చేస్తుంటే ,  మానవ సంబంధాలపై నమ్మకం పోతున్నాది. సాంఘిక బద్రత ఎంత ఉంది ? బైటకు స్వేచ్చగా వెళ్ళడం దేముడెరుగు,ఇంట్లో కూడా నిర్భీతిగా ఉండలేని స్థితి నలుగురు కళ్ళముందే పట్టపగలే మాన ప్రాణాలను దోచుకున్నా నస్తపరిహారమే తప్ప న్యాయం దొరకని సమాజంలో  మనిషికి  ఆధునిక సౌకర్యాలు   పెరిగాయి అని  మురిసిపోతూ  మానవత్వమా నీ అడ్రెస్స్ ఎక్కడ  అని  వెతుక్కుంటూ ఎంత దీనగా బ్రతుకుతున్నాడు మనిషి. వోటేసిన ప్రభుత్వాలే కాటే సేస్తుంటే, నమ్ముకున్న వాడే కడ తేర్చేస్తుంటే మనషి కంటే యంత్రాలే నయమని బతుకీడుస్తున్నా మనిషీ నీకు భాస్పాంజలి.