వేయి పడగలు మీద
విమర్శా, రివ్యూ కూడా ఎవరూ సమగ్రంగా రాయలెదు. పాత్రలగురించి టూకీ గా రాసారు. కొన్ని రివ్యూ లు చదివాను . అరా కొర గా వ్రాసారు . పేరున్నవాళ్ళని పొగడ్డానికి అందరూ సిద్దమే అన్నట్టు రివ్యూ లు వ్రాసారు తప్ప వాళ్ళు కథ కూడా పూర్తిగా చదివినట్టు అనిపించదు . ఒక విమర్శ కూడా లేదు. వేయి పడగలు లో అభినందించా దగ్గ విషయాలు
చాలా వున్నాయి, విమర్శించ దగ్గ విషయాలు కూడా వున్నాయి.
విమర్శను విస్మరిస్తే సమగ్రతను కోల్పోతుంది.
విశ్వనాథ సత్యనారాయణ
శాస్త్రి మహత్తర రచన వేయిపడగలు, వేయి పుటలలో నిక్షిప్తం చేసిన కళాత్మక , వాంగ్మయము. ప్రపంచ సాహిత్యంలో అతిపెద్ద గ్రంధాల
సరసన చేర్చదగ్గ అద్బుత కావ్యం. రష్యా రచయిత
లియో టాల్ స్టాయ్ రాసిన " వార్ ఎండ్ పీస్ " (1225 పుటలు ) తో పొల్చగలిగిన వేయిపడగలు విశేష సాహిత్య
వాహిని. వేయిపడగలు చదివితే గతం లోకి ప్రయాణించిన అనుభూతి
కలుగుతుంది అనేక సంవత్సరాల పూర్వం నాగరికత,
పరిస్తితులు తెలుసుకోవచ్చు అనడంలో ఏ మాత్రమూ సందేహం లెదు.
అయితే ఈ పుస్తకంలో శృంగారం సున్నా , ఒక ప్రకృతి వర్ణన గానీ, స్త్రీ వర్ణన గానీ మరి ఏ ఇతర వర్ణన గానీ లేదు. ఒక ప్రెస్ రిపోర్ట్ వ్రాసినట్టు , జరిగిన విషయాన్ని , ఒక చరిత్ర చెపుతున్నట్టు రాశారు రచయిత.
ఈ పుస్తకాన్ని ప్రస్తుత తరం
వారు ముఖ్యంగా విద్యార్ధులు చదివి తీరాలి కాని ఈ బట్టీయం పధ్ధతి చదువులలో పుస్తకాలు చదవడమే గగనం మరి ఈ పరిస్థితులలో 999 పుటల పుస్తకాన్ని
చదవడం చాల కష్టం. అందునా ప్రాచీన తెలుగు భాషా ప్రయోగం , ఖటిన పదజాలం నేటి
తరానికి పెను సవాళ్లు. వీటిని అధిగమించే దిశలో ఒక ప్రయత్నం చేసి అసలు కధ, కధనం దెబ్బ తినకుండా,
వర్ణనలు, కవితా దోరిణులు కొంచం తగ్గించి కుదించి రాస్తే బాగుంటుంది.
ముందుగా ప్రస్తుతించా
దగ్గది కధాంశం. వేయి పడగలు జరిగిన కధ అని పాఠకులు
సులభంగానే గ్రహించగలరు, కానీ సత్యన్నర్రాయణ
గారి సొంత కధ అని గ్రహించడం కొంచం కష్టమే. అప్పటి సమాజాన్ని కళ్ళకి కట్టినట్టు చూపడమే
కాకుండా , మనుషుల స్వభావాలను, స్త్రీల వ్యక్తిత్వం, ఆలోచనలు, ఆనాటి విద్యావిధానాన్ని,
కాలేజీ రాజకీయాలని, అప్పటి నాగరికత జీవన స్థితి గతులు గురించి తెలుసుకోవచ్చు. భారతీయ సాహిత్యాన్ని ప్రపంచ సాహిత్యం తో పోల్చి
చెప్పిన సత్యన్నారాయ శాస్త్రిగారు నిజంగా కవి సామ్రాట్. అనేక ఫ్రెంచ్ గ్రందాలు మరియు
రచయితల పేర్లు సరియైన
ఉచ్చారణతో రాయడం ఎంత కష్టమో ఫ్రెంచ్ , జర్మన్ , స్పానిష్ , ఇటాలియన్ , ఇంగ్లిష్ భోదించే నాకు బాగా తెలుసు. గ్రీక్ సాహిత్యాని, ఆంగ్ల సాహిత్యాన్ని
తులనాత్మకంగా విమర్శనాత్మకంగా, పాత్రల సంభాషణల ద్వారా
విశ్లేషనాత్మకంగా వివరించడం సాహిత్యభిలాశులని అబ్బుర పరుస్తుంది.
వేయిపడగలు అనేది అనేక
కథల సమాహారం. ముఖ్య కథ మూడు కుటుంబాలకు
సంబందించినది. ఒక జమిందారు వంశం, బ్రాహ్మణ వంశం, అదే వూరిలో ఉండే ఒక పేద కాపు వంశం. కధ, పాలమ్ముకొని జీవించే ఒక పేద కాపు సుబ్రమణ్య స్వామీ రూపమైన నాలుగు తలల
దివ్య సర్పాన్ని చూడడం తో ప్రారంభమవుతుంది. సుబ్రమణ్య స్వామి కాపు కలలో కనబడి తనకు
గుడి కట్టించమని చెప్తాడు నాగేశ్వర శాస్త్రి
అనే బ్రాహ్మణుడు జ్యోతిష వాస్తు లయందు అఖండ ప్రజ్ఞాశాలి. అతడు తనకున్న కొద్ది పాటి ఆస్తితో సుబ్బన్నపేట అనే కుగ్రామం
వలస వచ్చి సుబ్రమణ్య స్వామికి ఆలయం నిర్మించ దలిచినప్పుడు వీరన్న అనే విశేష భాగ్యవంతుడు
(ఎడ్లను బాడుగకు ఇచ్చి జీవించు వీరన్న టిప్పు సుల్తాను మీదకు దండయాత్ర కు పోవుచున్న
ఆంగ్లేయులకు తన ఎడ్లను
బాడుగ కిచ్చి, ప్రతిఫలమదిగినప్పుడు, అందులో ఎమున్నవో తెలియక ఒక కొట్టును చూపారు ఆంగ్లేయులు. ఆ కొట్టులో నిండా బంగారం ఉండుటవల్ల అతడు విశేష భాగ్యవంతుడు అయ్యాడు
) కోట నిర్మించ తలపెట్టి కోట ఎక్కడ కడితే మంచిదని
అడుగుతాడు. తానున్న స్తలమే బహు యోగ్యమైన దని, అది ఒక దివ్య క్షేత్రము
కాబోతున్నదని చెప్పి అంగీకరిమ్పజేస్తాడు నాగేశ్వర శాస్త్రి. కోట , సుబ్రమణ్య స్యామి
ఆలయం నిర్మించిన వీరన్న సుబ్బన్న పేట జమీందారు. అతడు విష్ణు భక్తి చేత వేణుగోపాలస్వామి
ఆలయం కూడా నిర్మించాడు.
వీరన్నాయుడు వంశము
వారు స్వామికి ప్రతినిధులు, బ్రాహ్మణ వంశం వారు ప్రచారకులు, కాపు వంశం వారు వ్యాఖ్యాతలు.
పేద కాపు కూతురు గణాచారి గామారి జుట్టు విరబోసుకుని
రోడ్లమీద తిరుగుతూ జరగబోవు విషయాలను పాడుతూ తెలియజే స్తూ ఉంటుంది. నాగేశ్వర శాస్త్రికి
ఐదవ తరం వాడు రామేశ్వర శాస్త్రి. రామేశ్వర
శాస్త్రి చాలా ఆస్తిపరుడు. రామేశ్వర శాస్త్రి కొడుకు ధర్మారావు. ధర్మారావు భార్య అరుంధతి. కధ
లో వీరివి ముఖ్య పాత్రలు. రామేశ్వర శాస్తి
గొప్ప మానవత్వం , దానగుణం
కలిగిన వితరణ శీలి అని చూపుతూనే కవిసామ్రాట్
అతనిపట్ల కోట అసంతృప్తిని కూడా వ్యక్త పరుస్తాడు . జమిందారు వంశీకులు, కృష్ణమ నాయుడు, రంగారావు, రంగారావు భార్య, రాణి రుక్మణ మ్మారావు. హరప్పనాయుడు.
కృష్ణమ నాయుడు కొడుకు రంగారావు. రంగారావు కొడుకు హరప్ప నాయుడు. వీరి చుటూ సగం కధ తిరుగుతుంది. మరొక అర్ధ భాగం ధర్మారావు చదువు, ఆర్ధిక ఇబ్బందులు, అతడి కళాశాల జీవితము, మిత్రులు రాఘవరావు, సూర్యపతి, కిరీటి తో అతడు చేసిన
అల్లరి మేనమామ కూతురితో కిరీటి ప్రేమ, ధర్మారావు కిరీటికి సాయపడిన విధము, కిరీటి పెళ్లి చుట్టూ
తిరుగుతుంది.
ధర్మారావు రుక్మనమ్మారావు
( రాణి) గారి దయతో చదువు పూర్తి చేసి, తెలుగు ఉపన్యాసకుడుగా
చేరుట, ఆత్మాభిమానముతో ఉద్యోగమూ వదులుకొనుట, పుత్రోదయం , మళ్ళీ ఆర్ధిక కస్టాలు, అరుంధతి మరణం, హరప్పకు చదువు చెప్పడం
కధాగమనం లో ముఖ్య ఘట్టాలు కాగా , ధర్మారావు పునర్హరప్ప వివాహం, నాయుడు వేణుగోపాల స్వామి కల్యాణాన్ని జరిపించడం
కధకి చివరి ఘట్టాలు. అనే క ఇతర పాత్రలలో రంగారావ్
జమిందారు మనిషి రామేశ్వరం అతడి తో అక్రమ సంబంధం
పెట్టుకొన్న మంగమ్మ అది తెలిసి పిచ్చివాడయిన
ఆమె భర్త జ్యోసులు అతనిని చీకటిలో కొట్టి చంపినా చలపతి, ధర్మారావు శిష్యుడు
కుమారస్వామి అతడి ప్రేయసి తదుపరి భార్య అయిన
శ్యామల , స్త్రీలోలుడు, మోసగాడు అయిన రాధపతి, అతడి దగ్గర హిజ్రలా
నటించిన నయవంచకుడు మంగమ్మ హంతకుడు చెంగాల్రావు ముఖ్యమయినవి కధను అనేక మలుపు తిప్పడం
లోనూ చతుర సంభాషణలను అందించడం లోనూ మిక్కిలి తోడ్పడతాయి.
వేయిపడగలు పుస్తకం
చదివితే ప్రస్తుత సినిమా సంభాషణలను ఏవగించుకుంటారు. ఒక వేశ్య మాట్లాడే మాటలు కూడా ఏంటో
విజ్ఞాన వంతంగా ఉంటాయి. మంగమ్మ జార్జ్ బెర్నార్డ్ షా గురించి అమెరికన్ జడ్జి లిండ్సే
కథల గురించి, పురుషుల ద్వితీయ వివాహాల
సమస్య గురించి చర్చించడం, స్త్రీజాతి స్వేచ్చ గురించి రంగమ్మ మాట్లాడి నప్పుడు, ఎవరో చెప్పిన మాటలు
ముక్కున పట్టుకొని, పదాలకు అర్ధాలు కూడా తెలియకుండా మాట్లాడరాదని హెచ్చరించడం
అప్పటి సమాజం లో స్త్రీల ఆలోచనా శక్తిని తెలియ జేస్తుంది. (ప్రస్తుతకాలంలో పోస్టు గాడ్యు ఏషను చదువుతున్న
విద్యార్ధులు తమ తల్లి తండ్రుల గురించి రెండు నిమిషాలు మాత్రు భాష లో మాట్లాడ లేరంటే
అతిశయోక్తి కాదు). కుమారస్వామి, ధర్మారావు మధ్య సంభాషణలలో
ప్రపంచసాహిత్య విశేషాలను, ధర్మారావు తన మిత్రులతో చేసిన సంభాషణలలో నృత్యము, నృత్తము, నాట్యము లకు గల అంతరాలను
వివరించడం ఎంతో విజ్ఞాన దాయకంగా ఉన్తాయి. సంగీతము , నాటకము పతనానికి కారణాలను
ఈ పుస్తకము చదివిన ఎవరైనా సులభంగా అవగాహన చేసుకోవచ్చు.
పాత కాలం గురించి
గొప్పగా చెప్పుకోవాలనుకోడం ప్రతికాలలోనూ పరిపాటి కావచ్చు కాని గొప్పగా చెప్పుకున్నవి అనీ వాస్తవాలు కాదు. పాత
అంతా బంగారం అనుకునే వారు ఈ పుస్తకం చదివి తెలుసుకోవలసినవి విస్లేశిన్చుకోవలసినివి చాలాఉన్నాయి.
స్వాతంత్రానికి పూర్వము కూడా ఉపాద్యాయులు అవమానాలు, ఆర్ధిక అవస్థలు, డబ్బు ఉన్నవాడి చేతిలో
కీలు బొమ్మలా ఉండడం, యాజమాన్యాలు కి వంటపాడితే రోజుగుడుస్తుంది, బండి నడుస్తుంది ఏమాత్రం
స్వతతంత్ర భావాలు ఉన్నా ధర్మారావు లా వుద్యోగం వదులుకోవాల్సిందే, లేక పొతే గెంటివేత
తప్పదు. అప్పటికీ ఇప్పటకీ ఉపాద్యాయుల పరిస్తితి
లో పెద్దగా మార్పులేదు . అప్పట్లో కూడా మనము డబ్బుకున్నవిలువ చదువుకి ఇవ్వలేదు. డబ్బుకి ఆశపడే మంగమ్మ రామేశ్వరానికి లొంగుతుంది అప్పటిలో నలుగురు భార్యలు ఉన్నా సమాజంలో మనుషులు
ఆ కారణంగా గౌరవాన్ని కొల్పొలెదు. రామేశ్వర శాస్త్రి ఇందుకు ఉదాహరణ.
రామేశ్వర శాస్త్రి
: రామేశ్వర శాస్త్రి పాత్ర అత్యంత ఉదాత్తమైన పాత్రగా చిత్రీకరించ బడింది.
కానీ పాఠకులు అందరూ అలా అనుకోలేరు. రామేశ్వర
శాస్త్రి, నాగేశ్వర శాస్త్రి కి ఐదవ తరానికి చెందిన పండితుడు, కృష్ణమనాయుడు జమిందార్
గా ఉన్నప్పుడు ఆయన వద్ద దివాన్ గా ఉన్నాడు. గొప్ప దానగుణం కలిగిన వ్యక్తి. ఇతడికి నలుగురు భార్యలు. అతడు 18 సంవత్సరాల వయసులో
3 యేండ్ల సావిత్రి ని పెళ్లి చేసుకొంటాడు. వారిద్దరి సంతానమే ధర్మారావు. ధర్మారావు కి వేదవిద్య చెప్పించాలని రామేశ్వర శాస్త్రి
తలపోస్తాడు కాని ఆరోజుల్లోనే సావిత్రమ్మ గారు వేదవిద్య వద్దని ఆంగ్లవిద్య చెప్పిస్తారు.
అప్పటికే ఆంగ్లమొజు, ఆవశ్యకత వేదపతనం చురుకుగా జరిగాయి. వివిధ కులాలనుండి
కన్యలను వివాహమాడాలని ఇతడి కొరిక. అతడు 21 సంవత్సరాల వయసులో రంగారాజమ్మ అనే క్షత్రియ కన్యను లేవదీసికొని పోయి వివాహమాడతాడు.
ఆమెకు కలిగిన సంతానం రామచంద్ర రాజు. రామేశ్వర శాస్త్రి 25 సంవత్సరాల వయసులో తీర్ధయాత్రలకు వెళ్లి మహరాష్ట
కుచెందిన 14 యేండ్ల వైశ్య కన్య హైమవతి వివాహమాడతాడు. హైమవతి ప్రమాదవసాత్తు
నదిలో పడిపోయినప్పుడు రక్షించినచో ఆమెను ఇచ్చి వివాహం చేస్తానని హైమవతి తండ్రి రామకృష్ణ
రావు అంటాడు. రామేశ్వర శాస్త్రి హైమవతిని
రక్షిస్తాడు. ఆ రాత్రి రంగారాజమ్మ పథకం ప్రకారం
తల్లితండ్రులతో నిద్రిస్తున్న హైమవతి రామేశ్వర శాస్త్రితో నిద్రిస్తున్ది. హైమవతి తల్లి
" తన భార్యని తను తీసుకువెళ్ళాడు" అంటుంది. హైమవతి కి రామేశ్వర శాస్త్రి
వల్ల ముగ్గురు సంతానం కూడా కలుగుతున్ది. ఇద్దరు అమ్మాయిలూ ఒక కొడుకు. పేద కాపు కూతురు మంగ ఆమెను దుష్టులు వేదిస్తున్నప్పుడు"
నన్ను పెళ్లి చేసుకుని కాపాడ" మని అడుగుతుంది. ఆమె కోరికపై వివాహం చేసుకుంటాడు. మంగ కొడుకు పసిరిక. యితడు పాముని పోలి ఉండి, జంతువులతో , పాములతో , పక్షులతో పొలాలలో
తిరుగుతుంటాడు. ధర్మారావు ని అన్న అని పిలుస్తుంటాడు. ఊరివారందరూ పసిరిక ని చూసి నవ్వినా , ధర్మారావు కి పసిరిక
అంటే ప్రాణం. ఈ నలుగురు భార్యలే కాక రామేశ్వర శాస్త్రి రత్నగిరి అనే ఒక భోగం మేళం నాయకురాలు
రత్నగిరి అనే స్త్రీ ని ఉంచుకుంటాడు. రాతన్గిరి కుమార్తె దేవదాసి గిరిక. భోగం వారు
కూడా అప్పట్లో చాలా గౌరవిమ్పబడ్డారు. దేవదాసిని రాణిగారు ఎంతో గౌరవంగా చూస్తారు. అప్పటిలో బహుభార్యత్వం కూడా బాగానే ఉండేది అని చెప్పవచ్చు.
స్త్రీలు కూడా బాగానే సర్దుకుని ఉండేవారు. రామేశ్వర శాస్త్రి గారి భార్యలు
పరస్పరం ప్రేమానురాగాలు గౌరవం కలిగి ఉండేవారు. అందరి భార్యలకూ రామేశ్వర శాస్త్రి
గారు పొలాలు స్తాలాలు సమకూర్చి వారి పోషణకు లోతుల్కుండా చూడడమే కాకుండా అడిగినవాడికి
లేదనకుండా దానాలు చెసారు. ఇంట్లో ప్రతినిత్యం అన్నదానం జరుగుతుండేది. అందుకొరకు అతని
ఆస్తి హారతి కర్పూరంలా కరిగిపొయిన్ది. అయినా ఆస్తులు అమ్మి అప్పులు చేసి మరీ ఆయన తన దార్మికతను కొనసాగిస్తాడు.
చివరకు ఇల్లు గడవక బావమరిది ఇంటికి భార్యని
పంపుతాడు. తానూ కూడా వెళ్లి అవమాన భారం తో తిరిగి వచ్చి కట్టు బట్టలతో ఆలయంలో మరణిస్తాడు. తండ్రి దానగుణం ఆర్ధిక తెలివి లేమికి ఫలితంగా ధర్మారావు
బ్రతుకు భారమై, చదువు కష్టమై, ఆత్మాభిమానం తో ఎవ్వరినీ
యాచించలేక దుర్భర దారిద్ర్యాన్ని అనుభవిస్తాడు. " ఆయన పోడంతోతే ఆ దరిద్రం అంతా
పోయినట్లయ్యింది" అంటాడు ధర్మారావు .ఈ మాటల్లో కవి హృదం, వేదన పాఠకు డికి అర్ధం
అవుతుంది.
ధర్మారావు: ధర్మారావు
రామేశ్వర శాస్త్రి కొడుకు. కధలో అతిముఖ్య పాత్ర. కధ ధర్మారావు చుట్టూ తిరుగుతుంది అని
చెప్పవచ్చు. ధర్మ బుద్ధి కలిగిన పండితుడు. చిన్నతనంలోనే యితడు తండ్రిని కోల్పోతాడు.
ఇతని భార్య అరుంధతి. తండ్రి మరణా నంతరమూ అనేక
అవమానాలు, ఇబ్బందులకు గురి అవుతాడు. తండ్రికర్మ కాండలకు కూడా డబ్బులేక
ఒకరిని యాచించలేక వేదనకు గురి అవుతాడు. కృష్ణమనాయుడు
సహాయం తో చదువుకున్న చదువు ఆగి పోతుంది. రాణి రుకమనమ్మా రావు గారి దయతో గుంటూరు లో
చదువుకుంటాడు. సుబ్బన్నపేట కళాశాలలో తెలుగు ఉపన్యాసకుడిగా పనిచేసి, పరిస్తితులతో రాజీ
పడలేక, ఆత్మాభిమానమూ వదులుకోలేక వుద్యోగం వదులుకుంటాడు.
గుంటూరు లో మిత్రులతో కలిసి చదువుకున్నపుడు , ఒక్క సారి కూడా భార్య గుర్తుకురాకపోడం, కోపవస్తే భార్యని
లెక్క చేయకపోడం, వైద్యడు పూర్తి విశ్రాంతి
అవసరం అని చెప్పినప్పుడు అది కుదరదని చెప్పడం అతడిలో నిర్లఖ్స్య దోరినిని సూచిస్తుంది
చాగంటి సోమయాజులు రాసిన " ద వయొలిన్ " ఆలుమగల అనుబంధాన్ని హృదయానికి హత్తుకునేలా
చూపుతుంది. రాజ్యలక్ష్మి , వెంకటప్పయ్య ల అన్యోన్యత చదివిన పాఠకు డికి , ధర్మారావు అరుంధతి
ల ప్రేలో సున్నితత్వం కనిపించదు. అరుంధతి చావుకు ధర్మారావు పాక్షికంగా కారణం. దారిద్ర్యాన్ని అదిగా మిన్న్చడానికి ప్రయత్నం చేయకుండా
ధర్మోపన్యాసాలతో పోద్దికగా కాలం గడిపుతూ, భార్యకి దరిద్రాన్ని
రుచి చూపుతాడు. హరప్పకి విద్య గరపడం లో, వూరి సంప్రదాయము నిలపడం లో చూపిన శ్రద్ధ భార్య మీద చూపడు. భార్య చనిపోయినప్పుడు మరొక అరుంధతిని ( అయిష్టంగా
నే ) వివాహమాడతాడు. భార్య చనిపోయిన భర్త పెళ్లి
చేసుకుని హాయిగా ఉన్నట్టు చూపిన సినిమాలు, రాసిన రచయితలూ ఉన్నారు, భర్త చనిపోయిన తరువాత
పెళ్లి చేసుకుని హాయిగా ఉన్న స్త్రీ లను అటు సినిమాలలోనూ ఇటు గ్రంధాలలోనూ చూడము. ఇతడి తో పోలిస్తే కాసా గోపడి పాత్ర , కుమారస్వామి పాత్ర
ఎంతో ఉన్నతంగా ఉంటాయి.
కాసా గోపన్న: యితడు
కోటలో పనివాడు. కృతజ్ఞత కు మారు పెరు. ధర్మారావు
కు ఉపకారం చేయడానికి జమిందారు చెవిలో ఇల్లు
కట్టుకుని పోరుతారు. ధర్మారావు కు సహాయపడేలా జమిందారు మనసును కరిగిస్తాడు. ధర్మారావు
అతడు చేసిన సాయానికి కృతజ్ఞత తెలిపినప్పుడు వద్దని వేడుకుంటూ అది తన ధర్మం కాదా అని
అంటాడు. ధర్మారావు పాడే " నల్లని వాడు , పద్మ నయనంబుల వాడు"
అనే పాట అంటే చాలా ఇష్టం. యుక్త వయస్సులో యితడు
యితడు కోట విడిచి వెళ్ళిపోతాడు, కానీ ముసలి వాడయి కథ చివరి భాగంలో ఎవరూ ఊహించని విధముగా సుబ్బన్నపేట
లో కనిపిస్తాడు. కోటలో ఒక సారి భోజనం చేసి
తనివితీరా కోటను చూసి ధర్మారావు పాడే పద్యం విని ప్రాణాలు విడుస్తాడు. అతడి చితి మంట
మండుతున్నంతసేపు ధర్మారావు " నల్లని వాడు , పద్మ నయనంబుల వాడు"
అనే పాట పాడుతూనే ఉంటాడు. మానవత్వ పరిమళం ఉన్న పాత్ర గోపన్న పాత్ర.
అరుంధతి: ధర్మారావు
భార్య, అమాయకపు స్త్రీ. పెల్లిఅయిన కొత్తలో తల్లి తండ్రుల భొదలు నమ్మి
భర్తకు కొత్త ఇబ్బంది కలుగాజేసినా తరువాత భర్తే లోకమని జీవితాన్ని భర్త కె అంకితం చేసిన
మహిళ. ఈమె మరణం పాఠకుదిని కంట తడి పెట్టిస్తుంది. ఈమె అవసాన దశ చాల విషాద భరితంగా కళ్ళ ముందు జరుగుతున్నత్తు ఉంటుంది. ఉత్తమ ఇల్లాలుగా ఈమె పాఠకుల మదిలో నిలిచిపోతుంది.
రంగారావు: కృష్ణమనాయుడు
కుమారుడు, సుబ్బన్నపేట జమిందారు
. ధర్మారావు తో నిష్కారణంగా విరోధం పెంచుకుని అతనికి సహాయపడడానికి ఇష్ట పడడు. యితడు
గ్రందసాంగుడు. ఇతడకి దుష్టుల సావాసం స్త్రీ
లోలత్వం జాస్తి. భార్య చనిపోయినప్పుడు సుసాన్ అనే ఆంగ్ల స్త్రీని ఇంగ్లాండ్ లో పెళ్ళాడి
కోటకి తెసుకొచ్చి రాణిని చేస్తాడు. అధికారుల
మెప్పుకోసం డబ్బును మంచినేల్లలా ఖర్చు చేస్తాడు. రంగారావు జబ్బు పడినప్పుడు సుసాన్
డబ్బు, బంగారం తీసుకుని ఇంగ్లాండ్ వెళ్ళిపోతుంది. హరప్పనాయుడు కొంత
డబ్బు బంగారాన్ని ఆమె తీసుకు పోకుండా కాపాడతాడు.
రంగారావు సుసాన్ లేనప్పుడు శ్రీలంక నుంచి వేరొక స్త్రీ ని తనకు పెళ్లి కాలేదు అని తెచ్చి
ఉంచుకుంటాడు. సుసాన్ అది గ్రహించడంతో ఆమెను డబ్బు ఇచ్చి వదిలిన్చుకుంటాడు. హరప్పనాయుడు
తండ్రివలె రంగారావును కాపాడతాడు. అందుకు ధర్మారావు సాంగత్యమే కారణం. ధర్మారావు తో చదువు
చెప్పించడానికి వోప్పుకోడమే రంగారావు తన జీవితములో చేసిన సుకృతం. అని అతడుకూడా గ్రహిస్తాడు.
హరప్ప నాయుడు : రంగారావు
కుమారుడు. గురు భక్తి, పితృ భక్తి కలిగిన
వాడు. సంప్రదాయాల లో నమ్మకము ఉన్నవాడు. తల్లిగారి
కర్మ బాగా జరిపించాలని, వూరిలో దైవ కార్యము జరిపించాలని భావించి వేణుగోపాల స్వామీ కల్యాణం
జరిపించడం తన భాద్యతగా భావించి కల్యాణం జరపించగానే చనిపోతాడు. హరప్పనాయుడు పాత్ర ను
మలచడం రచయిత సృజనాత్మకతను చూపుతుంది. ధర్మారావు హరప్పనాయుడు బంధం గురు శిష్యుల బంధం
కంటే గొప్పగా ఏదో ఆద్యాత్మిక కోణాన్ని స్ప్రుసిస్తుంది. హప్ప నాయుడు కారణ జన్ముడు అనిపిస్తుంది.
గిరిక :
ధర్మారావు చెల్లి గిరిక. భోగం మేళం నాయకురాలు రత్నగిరి కుమార్తె గిరిక. ఈమె దెవదాసి.
ఈమె తన వేణు గోపాలస్వామికి అర్పించుకున్నది.
ధర్మారావు కి గిరిక అంటే ఎంత ప్ర్రేమో అంత గౌరవము. రాణి గారుకూడా ఈమె భక్తికి
ముగ్దురాలు అయ్యి ఎంతో వాత్సల్యం చూపిస్తారు..
రామేశ్వరం గిరిక వెంటబడి నప్పుడు " దేవునికి నైవేద్యం పెట్టిన ప్రసాదం
ముట్టకూడదని కుక్కకేం తెలుసు" అని చెప్పడం ఆమె దృఢ చిత్తాన్ని, భాగవతుని పై తనకున్న
అచంచల విశ్వాసాన్ని తెలియజెస్తున్ది. బురద
అంటని బురదలో వికసించి కలువలా, భోగం కులం లో జన్మించి భక్తి
అనే పుష్పంలా వికసించి ముక్తి ని పొందిన గిరిక పాత్ర చాలా ఆసక్తిని ప్రేరణను కలుగజేస్తుంది.
రామేశ్వరం: రామేశ్వరం ఒక దుష్టుడు. రంగారావు హయాం లో అక్రమాలకు ఇతడే కారణం. తన దారికి రాని ఉపాద్యాయులని హింసించి, ఉద్యోగాలు వూడగోట్టించడం, పర స్త్రీలను మోహించడం, వెంటపడడం ఇతనకి అలవాటు.
ధర్మారావు మీద యితడు కక్ష పెంచుకుని అతన్ని
సాధిస్తాడు. జోస్యులు అనే వుపాద్యాయుని భార్య మంగమ్మ ని డబ్బుతో లోబరుచుకొని, మతిచేడ్డ జోస్యులని
చంపించి ఆ పాపం కూడా మూట కట్టుకుంటాడు. చిట్టచివరకు
దొంగనోట్ల ముద్రణలో దొరికి కటకటాల పాలవుతాడు.
మంగమ్మ; జోస్యులు అనే ఉపాధ్యాయుని
భార్య. రామేశ్వరం ఈము డబ్బాస చూపి లొంగదీసు కుంటాడు. ఈ విషయం తెలుసుకున్న జ్యోస్యులు
జీవితం మీద విరక్తి పెంచుకుంటాడు. ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. జ్యోస్యులు మతి చెడుతుంది. మతి చెడ్డ జోస్యులని చంపించి ఆ పాపం కూడా మూట కట్టుకుంటాడు
రామేశ్వరం. అదేసమయంలో మంగమ్మ రామేశ్వరం నుచి దండుకున్న డబ్బు అంతా పట్టుకుని వుడాయిస్తుంది.
మంగమ్మ రామేశ్వరం సినిమా హాలు సొంతం చేసుకుని
ధనికురాలు అవుతుంది. రాదాపతితో కలిసి ఉంటుంది. తను చేసిన పని తన మనసుకు తెలుసు కనుక
డబ్బు మీద వ్యామోహం పెంచుకోక, గర్విష్టి గా
నుండక మంగమ్మ
మంచితనం, మానవత్వం కలిగి ఉంటుంది.
అందువల్ల ధర్మారావు ,కుమారస్వామి సాంగత్యం దొరకడం, ధర్మారావు నుంచి మంచిని
స్వీకరిచడం జరిగి మంగమ్మ పరివర్తన చెంది మంచి
మనిషిగా మారుతున్ది. తన ఆస్తిని కుమారస్వామి పేర రాసేస్తుంది. చేసిన పాపానికి
ఫలితం గా ఆడంగిలా పైకి నటించే చెంగాల్రావు
కత్తిపోట్లకు బలియ్యి భయంకరమైన చావు చస్తుంది.
పాము : సుబ్రమణ్య
స్వామీ అవతారం , ధర్మానికి ప్రతిరూపమైన పాము వేయి పడగలను కలిగి ఉంటుంది. కథ మొదటిలో
కాపుకు పాము కనిపిస్తుంది. అప్పుడు పాముకు నాలుగు తలలు ఉంటాయి. ఒక్క ధర్మారావు
మాత్రమె పాముని చూడగలుగుతాడు, రంగారావుకి పాము కలలోనే కనిపిస్తుంది.
ధర్మం నసించినప్పుడు పాము ఒక పడగను కోల్పోతుంది. కధ చివరిలో పాము రెండు తలలను కలిగి ఉంటుంది. ఆరెండు తలలు ధర్మరాను
అరుందతి కి ప్రతి రూపం .
కుమారస్వామి: కుమారస్వామి
ధర్మారవు శిష్యుడు. ధర్మారావు గుణ గణాలను పుణికి పుచ్చుకున్నాడు. విశాల భావాలు, స్వతంత్ర భావాలు ముక్కుసూటిగా
మాట్లాడడం ఇతని వ్యక్తిత్వానికి నిదర్శనాలు. యితడు శ్యామలను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు.
వీరిది చక్కటి జంట. ధర్మారావు కుమారస్వామి సంభాషణలు ఏంటో ఉత్తేజపూరితంగా, విజ్ఞాన దాయకంగా ఉంటాయి.
నేటి సినిమా రచయితలూ ఈ సంభాషణలు చదివితే వారు రాస్తున్న రాతలకు సిగ్గుతో చస్తారు. స్వతంత్ర
భావాలు గల ఉపాద్యాయుల మెడలు విరవడం అప్పటినుంచి మన కు ఆనవాయతీ. ఉపాద్యాయులని గౌరవించడం
స్త్రీని గౌరవించడం అనేది నాడు నేడు ఉత్త మాట.
స్వతంత్ర భావాలు ముక్కుసూటిగా మాట్లాడడం వల్ల కుమారస్వామి తన ఉద్యోగాన్ని కోల్పోతాడు.
పత్రికాలో చేరిన కుమారస్వామికి పత్రికా స్వేచ్చ అంటే పత్రికాధిపతికి ఉండే స్వేచ్చ మాత్రమె
అని అర్ధం అవుతుంది. మంగమ్మ మరణాంతరము మంగమ్మ ఆస్తికి వారసుడవుతాడు. హరప్పా మరణానంతరం
రంగారావు ఒక అబ్బాయిని దత్తత తీసుకుని అతడికి
హరప్పా అని నామకరణం చేసి అతడికి కుమారస్వామిని ఉపాధ్యాయుడిగా నియమిస్తాడు. కుమారస్వామిది
ఆదర్శ వ్యక్తిత్వం వివాహం అతడి హాస్యం ఆరోగ్యకరమైన
హాస్యం.
సుసాన్: సుసాన్ ఇంగ్లీష్
వనిత. రంగారావు ఆమెను తన కోరిక కోసం వివాహమాడతాడు. ఆమె తన తల్లి తండ్రులకోసం రంగారావు
ను వివాహం చేసుకుంటుంది. ఇంగ్లిష్ పాత్రలు సృష్టించడమే కాకుండా ఇంగ్లడ్ లో కొంతభాగం కధను నడుపుతాడు సుసాన్
పాత్రలో ఇంగ్లాండ్ లో పేదరికాన్ని తెలియజేయటమే కాకుండా, తల్లితండ్రులపట్ల
ఆడపల్లలకు గల మమకారాన్ని సుసాన్ పాత్రలో చూపిస్తాడు రచయిత. ఆమె తల్లి తండ్రులు పేద
రైతులు. వారు కొడులుల చదువుకోసం తమకున్నదంతా ఖర్చు చేసి రోజు గడవని స్తితికి చెరుకున్తారు.
ఆ కొడుకులు వారిని పట్టించుకోరు అప్పుడు సుసాన్ తల్లితండ్రుల భాద్యతను తలకి ఎత్తుకుంటుంది. తల్లిదండ్రుల కోసం సుసాన్ ఎంతటి కష్టాన్ని అయినా పడడానికి
వెరవదు కానీ ఒక హోటల్ యజమాని వ్యభిచారించమంటే నిరాకరిస్తుంది. ఇంగ్లాడ్ లో అయినా భారతదేశం లో అయినా ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ, పిల్లలు తల్లిదండ్రుల
పట్ల చూబించే మమకారం ఒక్కటే. కాకపొతే మనకున్న ప్రేమాభిమానాలు ఇంకెక్కడా ఉండవని మన అపోహ.
(ఉన్నవూర్లోనే పిల్లలను హాస్టళ్ళలో వేసి చదివిచే తల్లి దండ్రులు, హాస్టల్ లో పరిస్తితులు, విద్యలో వత్తిడి తట్టుకోలేక
పారిపోయిన విద్యార్ధులని మళ్ళీ బలవంతాన తెచ్చి చదివించడం ఇంగ్లాండ్ లోనే కాదు ఏ దేశం లోను ఉండదు.)
రాదాపతి - బిజిలి
- పద్మావతి : యితడు కుజ్ఞాని, అందరికీ సంపాదకుడు గా పరిచయం. యితడు స్త్రీలోలుడు. బిజిలి అనే
మహరాష్ట గాయని కోసం ఎనభై ఎకరాల పొలం అమ్మి తనచుట్టూ తిరుగుతాడు. బిజిలి తండ్రి చాలా
తెలివైన వాడు. బిజిలి ని పెళ్లాడ డానికి రాదాపతి ఆస్తి గురుంచి చెప్పిన మాటలు అబద్దాలు
అని తెలిసి రౌడీలను పమ్పుతాదు. రాదాపతి తప్పించుకుని హైదరాబాదు చేరుకుంటాడు. అక్కడ
పద్మావతిని కలుసుకుని ఆమెను ఆకట్టుకుంటాడు. ఆమె చదువుకు డబ్బు ఖర్చు పెడతాడు. ఆమెను గర్భవతిని చేసి పెళ్లి చేసుకోవాలని చూస్తాడు. ఆమె
పెళ్ళికి అంగీకరించదు. ఆమె చెన్నై లో బిడ్డని కానీ, కన్నా బిడ్డని అమ్మేసి తన దారి తను చూసుకుంటుంది.
చెంగాల్రావు అనే ఒక విషపూరితమైన వ్యక్తిని
ఆదరిస్తాడు. చెంగాల్రావు రాదాపతి సేవకుడు గా ఉంటూ పైకి ఆడన్గిలా నటిస్తూ ఉంటాడు.
చెంగాల్రావు మంగమ్మను కత్తి తో పొడిచి హతమారుస్తాడు.
మంగమ్మ పాత్ర సహా అనేక పాత్రలు
భయానకము ఉత్సుకత కలగలుపు. రాజశేఖర్ రెడ్డి
అనే వైద్యుని కథ రాజయినా విద్యను గౌరవిచి తీరాల్సిందే అని ఒక సందేశాన్ని అందిస్తుంది.
ఇలా అనేక పిట్ట కథలు, ఉపకథలతొ ఆద్యంతమూ
ఆసక్తికరగా సాగే వేయిపడగలు లోరచయిత వాడిన భాష,
భావం రెండు పదునయినవి, ఆలోచన రెకెత్తించెవె. చెప్పవలయును , అనవలయును, బీ ఏ పరీక్ష ఇచ్చి, గెలుపొందాడు. ఇలాంటి అనేక మాటలు తెలుగు భాషాభిమానుల హృదయాలలో ఉండిపోతాయి. కాకుండా యూరోపే ప్రపంచము కాదు అంటూ మన సాహిత్యం
గొప్పతనాన్ని చెప్తాడు షేక్స్ పియర్ సాహిత్యాన్ని
విమర్సానాత్మకంగా వివరించి సాహిత్యాభిమానుల గుండెలను కొల్లగొడతాడు.
- వెంకట్ పూలబాల