Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Thursday, December 31, 2020

Bharatavarsha 104

హస్తినాపురి నందు వ్యోమమునకెగసిన గాలి ఓడ  మేఘ మండలముపై తేలాడుచూ ప్రచంఢఘోషా ప్రకంపములతో వ్యోమమెల్ల అదురుచుండ ఏకబిగిన రెండు గంటలలో రెండువేల రెండువందల కిలోమీటర్లు ఆగ్నేయముగా ఎగురుచూ హర్యానా , ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ , ఛత్తీస్గఢ్ గగనతలను అవలీలగా దాటి ఒడిషా కలహంది, కోరాపుట్ మీదుగా ఆంధ్ర గగనతలంలో ప్రవేశించి ఆరుకు లోయ   మీదుగా జారుచూ నదీ నదములను కొండ  కోనలను క్రీగంట చూచుచూ వీరాంజనేయునివలె ఉత్తర భారతము నుండి దక్షిణ భారతమునకు కుప్పించి లంఘించి జటాయువు వలే విశాఖలో వాలిన పిదప అత్తగారి భుజముపైవాలి నిద్రించిన విదిషకు మెలుకువ వచ్చెను. ప్రయాణీకులందరూ మెల్లగా దిగుచుండగా  ఓడ ఖాళీ అగుచుండెను.  “అయ్యో ఇంతసేపూ నన్ను భుజముపై ఇట్లే మోసినారా! మీ భజములు నొప్పి చేయునేమో!” “రేపు నీబిడ్డలనూ  ఇట్లే మోసెదను.” అని మాలిని నవ్వుచుండ విదిషకామె తల్లివలె నగుపించెను.

“రెండుగంటల ఇరవది నిమిషములలో కాలాతీతము చేయక ప్రయాణీకులను క్షేమముగా గమ్యము  చేర్చిన ఇండిగోలో మరల ప్రయాణము చేయవలెను” అని ప్రకటన వినిపించుచుండెను. విదిష చేతి గడియారం చూచి “రాత్రి 9. 35 నిమిషము లయ్యెను. చలనచిత్రము చూచు సమయము కంటే తక్కువ వ్యవధిలో వచ్చి చేరినాము.” అనగా మాలినిగారికి ఆశ్చర్యముగా తోచెను. గొంతు సుందరి గొంతు వలెనున్నదే  అనుచుండగా సుందరి తమ వెనుక నుండి చెవిలో మరల అదే ప్రకటన అదే స్వరమున వినిపించెను. ఈ సారి విదిష  మాలిని ఇరువురూ ఆశ్చర్యపోయినారు. “సుందరి విశాఖపట్నము నందు..? అని మాలిని గారు అనుచుండగా “మీ ఇంటికే వచ్చుచున్నాను.” అని సుందరి అనగా మాలిని గారు” పో అమ్మా! రాత్రి పూట  పెద్దదానితో సరసములు,  వలసినచో పిల్లలు పిల్లలు సరసము లాడుకొనుడు” నిజమత్తా! జబ్బుచేసి  సెలవుపై వచ్చుచున్నాను, అదియునూ వర్షుని చలువే   ” అని సుందరి అనుచుండగా విదిష  మాలిని ఇరువురూ అయోమయములో పడిరి. “అత్తా కోడలు నన్ను నమ్మకున్న వెనుకకు పోయెదను.” అని వెనుతిరుగుచున్న సుందరి చేతిని పట్టుకుని " ఎచ్చటికి పోయెదవు , పద మన ఇంటికి పోయెదము నాకే ఇంకొక కొడుకు ఉన్నచో నిన్ను నా ఇంటి కోడలిని చేసుకొనేదిదానను. అని దగ్గరకు లాగెను . ముగ్గురూ విమానము దిగి బయటకు పోవు ద్వారమువద్ద నున్న శేషాచలమును చూచినారు   

శేషాచలం గారు వాహనంతో సిద్ధముగా నుండి వారి మువ్వురినీ ఎక్కించుకొని సాగుచూ అమ్మా మాలినిగారు ఇప్పటికైనా నా కూతురిని నాకిత్తురా అని హాస్యమాడగా “ఆనందనిలయము నల్లుకొన్న రాధా మనోహరమును చూచినారా  ఆతీగె ఈ తీగ” అని మాలిని ప్రేమాతిశయమున పల్కెను.  వాహనము ఆనందనిలయము చేరెను. వాహనంలో  విదిష చేతినూపు చుండగా శేషాచలము వాహనమునుమళ్లించి సబ్బవరం కేసి సాగెను. విరబూసిన రాధామనోహరములను చూచుచున్న సుందరి దృష్టి ముంగిట నిలచిన మెర్సిడెస్ బెంజ్పై పడెను. “నా చెలిమి మెర్సిడెస్ రాణి ఇచ్చటనున్నదే! ఆట పట్టించవలెను.”  అనుచుండగా నందిని నీ నేస్తమా ఇక ఈ రాత్రి శివరాత్రే  మాలిని అనెను. సుందరి మాలిని లోనికి అడుగిడిరి. మాలినిగారు బట్టలు మార్చుకొనుటకు తన గదిలోకి వెడలిరి. సుందరి పక్క గదిలోనున్న నందినిపై కి లంఘించెను. 

ముగ్గురతివలు  కీరముల వలె కిలకిలలాడి  మయూరములవలె ఆటలాడుట మాలినిగారి చెవిన బడుచుండెను. ఇంతలో చప్పున కలకలము సద్దుమణిగి నిశ్శబ్దమావరించెను.   మంజూష  ఏడుపు వినిపించ సాగెను. పరుగు పరుగున పిల్లలున్న గదిలోకి వచ్చిన మాలిని  ఒకే మంచముపై కూర్చొని యున్న ముగ్గురినీ చూచెను. నందినిని చూచుచూ “ఏమాయె ? మొఖమును  దాచుకొని మంజూష ఎందు కేడ్చుచున్నది?” అని అడిగెను.     


మా అన్న సందీపుడి నిర్వాకమట్లున్నది, ఒక సారి వచ్చి చూడమని ఎంత కోరిననూ పట్టించుకొనక ఏ రాచకార్యములు వెలగ బెట్టుచున్నాడో !?" అని నందిని చెప్పెను. మాలిని గారికి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయ్యెను. మంజూషపై మిక్కిలి ఆగ్రహము కలిగిననూ నిగ్రహించుకొని “మంజు! ఇంట అతిథి ఉన్నప్పుడు ఇవేమిచేష్టలమ్మా , అయిననూ బెంగుళూరు విశాఖపట్నమునకు  ప్రక్కనే ఉన్నదా? అల్లుడు అచ్చట ఎన్ని అవస్థలు పడుచుండెనో!” “నా సమస్య ఎవరికీ పట్టదు సందీపునకే కాక  కన్నతల్లికి కూడా వెగటయితిని” అని మంజూష ఏడవ సాగెను. “

పెళ్లి కుదిరిన  నట్టింట ఏడ్చిన ఎంత అశుభము, ఇప్పుడేమి కొంప మునిగెను . అని చెప్పిననూ మంజూష  ఇంకనూ పుల్లవిరుపు మాటలాడుచునే యుండెను.   వారి దృష్టి మరల్చుటకు మాలినిగారు మాట మార్చి  "సుందరి నీ అనారోగ్యమేమి? నీ అనారోగ్యమునకు వర్షుడేమిచేసెనమ్మా?" అని అడిగెను. ఆమె ముఖములో ఆందోళన చూసి సుందరి కిల కిలా నవ్వెను . మంజూష నందిని కూడా చకితులయ్యిరి. వారిముఖములు పాలిపోయెను.

"మీరు అట్లు అర్ధము చేసుకొనినారా? పార్వతి అపహరణము గూర్చి వినియుంటిరా?" "అయ్యో పార్వతిని అపహరించినారా?ఈ ఘాతుకామెవ్వరు చేసిననూ వారి తల వ్రక్కలగుగాక "అమ్మమ్మ  అంత  మాట అనవలదు , పార్వతిని నేనే అపహరించితిని. అని సుందరి అనెను. ఆ మాట వినినంతనే నందిని, మంజూషతో సహా మాలినిగారి మొహము పాలిపోయెను. మంజూష అలక ఎగిరిపోయెను.

“వర్షుడే  అట్లు చేయమని చెప్పెను." అని సుందరి కొనసాగించుచుండగా మాలిని గారి ఆందోళన మరింత హెచ్చెను  "నాబిడ్డ అటువంటివాడు కాడమ్మా  నీవే ఏదో పొరపాటు పడి  యుండవచ్చు" అని చెప్పుచున్న మాలిని గారిని చూసి నందిని “అత్తయ్య మీరు కలత పడవలదు నేను మాటలాడెదను.”  అని నందిని  సుందరిపై బడెను " ఏదీ కానీ వేళ గేదె ఈనె నన్నట్లు, ఏమే అర్ధరాత్రి ఈ పరాచకములు నా వర్షుని ఇందు ఇరికించ చూచున్నావా! నిజము తెలుపుము లేనిచో  బసవము వలే మీద పడి  కుమ్మెదను.  అనుచూ సుందరి పై బడెను. 

వారి మిత్రోత్సాహము వారికి మల్లికలు కురిసి నట్టు  సీమ పన్నీరము చల్లినట్టు  చంద్రికా సోలము తాకినట్టు ఉన్ననూ  మాలినిగారు వారి జగడము నిజమేమో అని తికమక పడిరి. ఒక నిమిషము పిదప వారు సిగపట్లు వీడి కూర్చొనిరి . సుందరి ఇదంతయూ బసవని కోసము చేయవలసి వచ్చెను. అని జరిగిన కథను పూసగుచ్చసాగెను.

                                                   ***

శేషాచలముగారు లేండ్ రోవర్ ను నిదానముగా పోనిచ్చుచున్నారు. విదిష “నాన్నా మన పాతవాహనము ఏది ? ఇది కొత్త  వాహనము వలే నున్నదే!” ఇది లేండ్ రోవర్ నీవు హస్తినకు పోయిన పిదప హైదరాబాదు పోయి తెచ్చితిని. విశాఖ నందు ఈ వాహన అమ్మకాల కేంద్రము ఇంకనూ లేదు. “ఇది చాలా గమ్మత్తైన సుఖమునిచ్చుచున్నది. దీని ధర  ఎంతుండును ?

“దీని ఎనిమిది ఇంచీల  సమున్నత నిర్మాణమే అందులకు కారణము . ఇందులో కూర్చున్న ఎవ్వరైననూ ఉన్నత అనుభూతిని పొందుదురు. దీని ధర నాలుగు కోట్లు” “మన పాత ఇన్నోవా వాహనము కూడా బాగానే యుండెడిది కదా!”

పాత వస్తువులు ఏవియూ మన వద్ద లేవు. వాహనములు భవంతులు అనీ సరికొత్తవే నున్నవి. నీవిప్పుడు బాగుండుట వరకే ఆలోచించరాదు, శ్రేష్టమైన ప్రతిష్టాత్మకమైన వస్తువులన్నియూ మన  వద్ద యుండవలెను. అనగా మన మాతా  ట్రస్ట్ వద్ద ఉండవలెను.

మాతా ట్రస్ట్ అనగా ? మన ఆశ్రమమును ట్రస్ట్ గా తీర్చి దిద్దినాను తల్లీ.   నీవే  మాతవు ఆ ట్రస్ట్ నీదే తల్లీ , నేను నిమిత్త మాత్రుడిని. నాన్న ఇటువంటివి మనము చేయదగ్గపనులేనా ? నాకీ ట్రస్ట్ నందు ఏమాత్రము ఆసక్తిలేదు , ఇల్లు మాతానిలయముగా , మాతా నిలయము ఆశ్రమముగా, ఆశ్రమము ట్రస్ట్ గా మారిపోయినది. నేను ఇల్లాలిగా మారవలెనని కోరుకొనుచున్నాను. మాత వలె నుండుట నాకు అప్రియముగా నుండును. “ప్రియాప్రియములెట్లున్ననూ ధర్మాధర్మములుండవలెనుకదా  ఇల్లాలైననూ, మాతైననూ  పదిమందిని ఆదరించవలెను కదా. మనమిప్పుడు  అదే చేయుచున్నాము. అనేక సాధు సత్పురుషులకు మునిజనోత్తములకు ఆశ్రయము కల్పించుచున్నాము అదియే ట్రస్ట్ అంతరార్ధము. నీవు దేవి వలే అచ్ఛటుండిన చాలును.” 

నాన్నా ఈ పెంచలయ్య పతాకములు  తాటిచెట్టు ఎత్తున కనిపించుచున్నవి! అని విదిష అనుచుండగా శేషాచలముగారు వాహనమును పతాకం ముందు నిలిపిరి.  విదిష " ఎం ఎల్ ఏ గా గెలుపొందిన పెంచెలయ్య గారికి శుభాకాంక్షలు " అని చదివి “ఎట్టకేలకు మంజూష మామగారు ఎం ఎల్ ఏ అయ్యెను.” అనెను. అంత  సంతోషముగా  ఎట్లు చెప్పుచున్నావమ్మా నీవు కోరుకున్నచో ఆ స్థానమునందు నీవు ఉండెదిదానవు. ఆ స్థానము నీది. అని శేషాచలముగారు గద్గద స్వరమున ఆవేదన చెందుచుండగా నేను కోరుకున్న  స్థానము  నాకు దక్కినది , హస్తినాపురమునందు హ్లాదము, మాలిని గారి మాలిమి చెప్పనలవి కాదు అరుణతారగారు కేంద్రమంత్రి అయిననూ ఇంత పదవీకాంక్షనెప్పుడునూ చూపలేదు, ఉన్నతురాలయిన  ఆమె నా తల్లి స్థానమునలంకరించి నాకు తల్లి లేని లోటు తీర్చుచుచున్నది. నా వర్షుడు ఉన్నతుడై  నేనే  లోకమై బ్రతుకుచున్నాడు. నేను హస్తినకు పోయి పొందినది మాటలలో చెప్పలేనిది అనుచుండగా వాహనము మాత  ఆశ్రమము ముందు నిలిచెను. 

నీవిట్లు పార్వతి పార్వతి యని మెలికలు తిరుగుచున్నచో ఈ ఆగంతకుడు కూడా తప్పించుకొనును . త్వరగా ఆ వాహనము ను అనుసరించుము. బసవడు వేగమును పెంచెను. ద్విచక్రిక 120 కి. మీ వేగమును అందుకొనెను  విద్యుత్ కోస ( బ్యాటరీ ) వాహనము ఇంత వేగము పుంజుకొనుట నమ్మశక్యముకాకున్నది. వలసినచో  ఈ ద్విచక్రిక  ఆ వాహనమును మించి గలదు . అదియే మన సందీపుని విజ్ఞానమునకిదియే సంకేతము.    మిత్రులిద్దరూ ఆ వాహనమును అనుసరించి పోవుచుండగా ఆ వాహనము ఆశీలుమెట్ట వద్ద నున్న ఒక ఆసుపత్రి ముందు నిలిచెను. ఆ వాహనము నుండి దిగిన వ్యక్తి ని వెలుతురులో చూచి మిత్రులిద్దరూ ఖంగు  తిని "యితడు మన సైకాలజిస్ట్ సత్యమూర్తి గారు  అనుచు ఆయనను అనుసరించి లోపలి పోయిరి.   

పరిచయములయ్యిన పిదప సత్యమూర్తి గారు " దక్షిణ మూర్తి గారి సమస్య గుండెపోటువలె కనిపించిననూ దానికి మూలము మానసిక సమస్య , దానికి మూలము మీ సవితి తల్లి  గ్రేసీ అందుకు కారణము ఆమె అబద్రతాభావము అందుకు మూలము నీ భాద్యతా రాహిత్యము " అని తన తండ్రి ఆరోగ్య  పరిస్థితి విచారించుచున్న అగస్త్యునికి చెప్పెను బసవడు " అనగా కొడుకే తండ్రి అనారోగ్యమునకు కారణమనుచున్నారా?” "ఖచ్చితముగా" అని బదులు పలికి అగస్త్యునితో "వలసినప్పుడు వచ్చి వలసినంత ధనము తీసుకొనిపోవుట  నీ భాద్యతారాహిత్యము , కొడుకును కాదనక అడిగినంత ఇచ్చుట మీ నాన్నగారి బలహీనత నిన్ను భావి అధ్యక్షుని చేసిన తన గతి యేమగునని నీ సవతి తల్లి భయము అభద్రతా భావము."  ఈ విషయమై వారు తరుచు గొడవలు పడుచుండెడివారు సత్యమూర్తి గారు చెప్పు చుండగా బసవడికి జాన్ కూడా ఇవే మాటలు చెప్పుట గుర్తుకొచ్చేను. "ఆ గొడవలు కారణముగా పొడచూపిన విభేదములు సమసిపోక ఇంకనూ వారిని వెంటాడుచున్నవా ?" అని బసవడు అడిగెను.  

వయసులో ఉన్న స్త్రీ కి కోరిక  స్వాభావికము అది సమస్య ఎట్లగును?  శారీరక ధృఢత్వము సన్నగిల్లి  ఇటువంటి రోజొకటి వచ్చునని దక్షిణామూర్తి  గారు కలలోనైనా అనుకొనియుండరు. కానీ ఆ రోజు రానే  వచ్చెను.   ముప్పై లో ఉన్న గ్రేసీ  అరయై లోనున్న ఆయనతో  తృప్తి   లేక మరొకరితో సంభందం పెట్టుకొనటయే కాక , ఇల్లువిడిచి వెళ్లి పోయెను. దక్షిణామూర్తి గారు అనేక సార్లు ఫోను చేసిననూ స్పందించని  గ్రేస్ నెలరోజుల తరువాత  ఒకరోజు మాటలాడెను.   వారు మరల కలుసుకొనినారు. మీ అమ్మ ఎందుకో పరివర్తన చెందినట్టు కనిపించెను కానీ పరివర్తన చెందలేదు.  మీ నాన్నగారు కూడా  ఆమెను పూర్తిగా నమ్మక ఒక కొత్త చరవాణి కొని ఇచ్చి ఆమె వద్దనున్న పాత ఫోను తీసుకొనెను. గ్రేస్ తన ఫోనులో గల చిత్రములను సంఖ్యలను  తీసివేసి  ఇచ్చెను.   కానీ మీనాన్నగారు పాతఫోనులో ఉన్న తీసివేసిన ఫోటోలను వెనుకకు రప్పించి  ఆమెను ప్రశ్నించగా ఆమె బుకాయించెన.  ఆమె వేరొక వ్యక్తితో  తీసుకొన్న  నగ్న చిత్రములను  ఆమెకు చూపగా , ఏడ్చుచూ క్షమించమని  వేడుకొనెను. 

ఆమె కోర్కెలు  తీరచలేకున్ననూ  బంధించియుంచి,  అసమంజసమని గ్రహించక, విశ్వాసము చూపవలెనని   కోరుకొనెను.  ఆమె  తిరిగి వచ్చినదని డబ్బుకొరకు మాత్రమే, అది  తెలుసు కొనని నీ తండ్రి  కొంత కాలము ఆమె విశ్వాసముగా నుండగా సంతసించి ఆమె మాట ప్రకారము పబ్లిక్ లిమిటెడ్ సంస్థ చేసి ఆమెను కూడా అందు వాటాదారుని చేసి డైరక్టరుగాచేసెను. ఒక రోజామె స్నానములగదిలో తలుపు  మూసి ఫోను ప్రియునితో మాట్లాడుచున్నది. దక్షిణ మూర్తి అది ఎవరని అడుగగా గ్రేస్  సమాధానమివ్వలేదు. దక్షిణామూర్తి  ఫోను  తీసుకొని చివరిసారి మాట్లాడిన సంఖ్యను తిప్పగా ఫోను మ్రోగుచుండెను కానీ  ఆమె ప్రియుడు మాట్లాడక మిన్నకుండెను. అట్లు పలు మార్లు ప్రయత్నమూ చేసి విసిగిన ఆ మీ నాన్నగారు కడకు అతడి  చిరునామా తెలుసుకొని కలిసినారు. అతడే శ్యామ్. అప్పటికే  పరిస్థితి మీనాన్నగారి చేయి దాటిపోయెను.  

ఆవిడ కుతంత్రముల యందు ఆరి తేరెను. అవి తెలుసు కొనుటకు మీ నాన్నగారు ఒక పరిశోధకుని నియమించినారు. అవన్నియూ  ఆ గూఢ పరిశోధకునకు తెలియును అతడు ఎలప్పుడూ ఆమెను నీడవలె అనుసరించుచు మీ నాన్నగారికి సమాచారమును చేరవేయుచుండును. "అట్లయిన అతడిని వెదకి  పట్టుకొనవలెను". అని బసవడనెను.  అతడిని వెదక వలసిన పనిలేదు అతడి చరవాణి  సంఖ్య  నావద్ద కలదు  అతని రప్పింతును. అని సత్య మూర్తి అతడికి ఫోను చేయసాగెను.                                                              


Tuesday, December 29, 2020

Bharatavarsha -103

న్యూ ఢిల్లీ కొనాట్  ప్లేస్ : ఢిల్లీ వాసులందరికీ సుపరిచితమగు కొనాట్ ప్లేస్ ఆ పేరు ఎట్లు వచ్చెనో  బహుకొద్దిమందికి మాత్రమే తెలియును. భారత దేశ ప్రధాన ఆర్థిక, వాణిజ్య మరియు వ్యాపార కేంద్రాలలో ఒక టైన ఈ ప్రదేశము న్యూ ఢిల్లీ నడిబొడ్డున అనేక ప్రసిద్ధ భారతీయ సంస్థల ప్రధాన కార్యాలయాలకాలవాలమై  సిపిగా సంక్షిప్తీకరించబడిది. సిపి ఒక ప్రధాన షాపింగ్, విలాస (నైట్ లైఫ్) మరియు పర్యాటక కేంద్రం. భారత రాజధాని భవనములు వైస్రాయ్ హౌస్ , సెకెటేరియట్ ,పార్లమెంట్ వంటివి కొనాట్ ప్లేస్ (సిపి) చుట్టూ కేంద్రీకృతమై ఉన్నవి. స్వాతంత్రమునకు పూర్వము 1921 లో భారతదేశాన్ని సందర్శించిన  ఐదవ కింగ్ జార్జ్   యొక్క మామ అయిన డ్యూక్ ఆఫ్ కొనాట్ పేరు దీనికి పెట్టిరి. ప్రపంచములో తొమ్మిదవ స్థానములో నున్న అతి ఖరీదైన భవనములు గల ప్రదేశమిదియే. 

అత్యంత ఆహ్లాదముగానుండు ఈ ఉద్యానవనమునందు రెండువందల ఏడు అడుగుల ఎత్తుగల త్రివర్ణపతాకము మేఘ మండలమును ముద్దాడుచుండును. అదే ఉద్యానవనమున వర్తులాకార సోపానములతో నిర్మించిన రంగ భూమి, ఆ పక్కనే నీటిని ఎగజిమ్ము జల యంత్ర ము, నీటి కొలను , ఆ కొలను పక్కన సొరంగమార మొకటి భూగృహ రైలు(మెట్రో) మార్గమునకు దారితీయుచూ రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ కు కొనిపోవును. ఢిల్లీ నడిబొడ్డున గల అతిపెద్ద మెట్రో స్టేషన్ ఆ ఉద్యానవనముక్రింద దాగియుండెను అన్నవిషయము ఆశ్చర్యము కలిగించుచుండును.ఆ ఉద్యానవనమున అచ్చటనే పచ్చిక నందు పొదల మాటున అచ్చిక బుచ్చిక లాడు జంటలు చూడ కనులు చెదురు చుండును.  

తిరిగి తిరిగి అలసి సొలసి ఆ ఉద్యానవన పచ్చిక నందు  సేద తీరు జంటలలో  కేశవుడు రంజని కూడా ఉండిరి. రంజిని " నాడు ఈ వర్షుడు దొడ్డమనిషి అని చెప్పినావు ?" " నేడునూ అదియే చెప్పుచున్నాను , మాగురువుగారు మహా దొడ్డ మనిషి ." " బాగు బాగు పిల్లికి  సాక్ష్య మన్నట్టు న్నది , అవ్వ విదిషతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుచున్నాడు , కుతుబ్ మినారు , పాలికా బజారు చాందిని చౌక్  ఎచ్చట చూచిననూ నువ్వు గింజలవలె వీరే కనిపించిరి." " హహ్హ హ్హ హ్హ  ఏమి  చెప్పుచున్నావు  నీవు నూ అదేపని చేయుచున్నావు కదా" అని కేశవుడు  అనగా రంజిని " మన సంగతి వేరు , మనము వారివలె ఒకరిపై ఒకరు పడి  తిరుగుచున్నామా?"  కేశవుడు నవ్వుచూ తలతిప్పి, వర్షుడు విదిష  ఒకరి కొకరు తాకుచూ  పక్కనే ఉన్న ఒక పొదల మట్టున కూర్చొని యుండుట  చూచి  గుండె మందగించి ఊపిరి నిలిచి నిలువు గుడ్లు పడెను."   

 అట్లే స్తంభించిన కేశవుని చెంతకు తీసుకొని తన వొడిలో పడుకొనమని చెవిలో గుసగుసలాడెను." కేశవుడు " ఇది బహిరంగ ప్రదేశము అట్లు చేసిన ..." అను చుండగా

చుట్టూ చూడుము ఎన్ని రంగు రంగుల జంటలు అట్లు పడుకొని యున్నవో , చీకటి పడుచున్నది కదా భయము వీడుము" అని ప్రోత్సహించెను. వలదు వలదు చుట్టూ చూడవలదు అట్లు చూచిన మనకి ఇబ్బంది కలగవచ్చు " అని కేశవుడు అనుచుండగా రంజిని పక్కనే ఉన్న విదిష జంటను చూడనే చూచెను. పద ఇచ్చటినుండి పోవలెను అని చటుక్కున లేచి కేశవుని తల్లి  పిల్లి తన కూనను నోటకరుచుకు పోయినట్టు కేశవుని కొనిపోయెను. “అయ్యో! చిన్న కోరిక తీర్చలేక పోతిని అని కేశవుడను చుండగావారిరువురు క్రింద చూచుకొనక పచ్చిక పై కూర్చొన్న, కాలికడ్డుపడ్డ ఒక జంటను , తన్నుకొని వారిపై పడిరి.  పొరపాటుజరిగినది ఏమీ అనుకొనవలదని రంజని చెప్పుచుండగా కేశవుడు వా రిని దామిని - రాకి జంటగా గుర్తించి సిగ్గుపడి రంజిని చేతినందుకొని పరుగువంటి నడకతో అచ్చటనుంచి జారుకుని రంగప్రదేశమున జరుగు సంగీత కచేరీ వినుటకు వచ్చిన శ్రోతలమధ్య సోపానములపై కూర్చొనిరి. 

 ఒకామె కొనుగోలు చేసిన వస్త్రముల సంచులను పక్కన పెట్టుకొని కూర్చొని  మరొకామెతో మాట్లాడు చుండెను.  కేశవునకు అది చూసి వొళ్ళు మండెను. కేశవుడు ఆ మహిళతో " ఏవమ్మా ఇచ్చట స్థలము కొరతగానుండగా , మహారాణివలే వస్తువులన్నీ పరిచి కూర్చొంటివే ? కొంచమే జరగరాదు " అని నిష్టూరమాడెను. ఆమె మొఖం త్రిప్పి చూడగా కేశవునకు పై ప్రాణములు పైకి పోయి గొంతు తడారెను. ఆ తల త్రిప్పి చూచిన  మహిళ మాలిని గారు , ఆప్రక్కనఉన్నది అరుణతారగారు. కేశవుడు ఏమియునూ చెప్పలేక తత్తరపడుచుండగా రంజిని  దూరములో సోపానములపై కూర్చొన్న విదిష వర్షుని గాంచి ఆవిషయమును మాలిని గారి కెఱింగించెను.కొలది నిమిషములపిదప అందరూ  కారులో నార్త్ ఎవెన్యూ అరుణతార నివాసము చేరిరి. 

అందరి కంటే ముందు  దిగి వర్షుడు చకచకా మేడపైకి పోయినాడు. విదిష మెల్లగా పిల్లివలె వర్షుని అనుసరించుచుండగా , మాలినిగారు ప్రవేశించి " విదిషా ఇటురామ్మా , అని పిలచి  ప్రదేశములు తిరిగినారా, వర్షునితో ఢిల్లీ  ఎట్లున్నది? అని ప్రేమగా అడుగుచుండగా విదిష కళ్ళు  చెమర్చెను. జీవితంలో ఇరువురూ ఎన్నోకష్టములు పడి స్వర్ణకాలమందడుగిడిరి , ఇప్పుడు కన్నీళ్ళెందుకమ్మా అని కోడలిని అక్కున జేర్చుకొనెను. " నాజీవితము నందు  అమృతతుల్యమగు క్షణములు ఇవి ఆనందబాష్పములు. దక్కవనుకొన్న అవకాశములు "  " వేచి చూచిన అందరి కలలూ పండునమ్మా , మా కనుల వెలుగు , కలలు మీరే అని చెప్పుచూ అప్పుడే ప్రవేశించిన అరుణతారను చూచి  " అరుణా నీ కూతురికి గట్టిగా చెప్పుట నీకు చేతకాకున్న పరిస్థితి ఇంకనూ శృతి మించును " అని మాలిని అను చుండగా అరుణ తార " మగవాడి బుద్ది ఏమాయెను? నాకూతురు అమాయకురాలు , ముందు నీకొడుకు సంగతి  చూడవలెను " అని తార మీద మీదకి పోవుచుండగా విదిష " అమ్మా , ఆయన తప్పులేదు , నేను కోరగా  .." అని విదిష అరుణను బ్రతిమాలెను. " నీకేమీ తెలియదు తల్లి నిన్నుఅల్లుడు నిన్ను  మాయచేసి కొని పోయెను " అని మేడపైకి పోయెను.

"ఇంకనూ కొద్దిసేపటిలో అమెరికాపోవు విమానము కలదని తెలిసి ఇట్లు చేయుచున్నావా? , పిల్లను అట్లు తిప్పుట మంచిపనా ?" అని అడుగు చుండగా విదిష తారవెనుక నిలబడి వర్షుని వైపే చూచుచూ సైగలు చేయుచుండెను." నావైపు చూచి మాట్లాడక పిల్లమొఖంలోకి చూచెదవేమి అని గద్దించెను"  నా పాస్  పోర్ట్ కనిపించుటలేదు అని వర్షుడు అంతయూ వెతుకు  చుండగా  అరుణతార ముసిముసినవ్వులు నవ్వుచూ మేడమెట్లు దిగి క్రిందకు వచ్చెను. పిదప విదిషా నీవచ్చటమి చేయుచున్నావు ?" అని కేక వేసెను . " ఆయనకు సహాయము చేయుచున్నాను ." అని సమాధానము వచ్చెను . అప్పుడు తార మాలిని వైపు చూచి " అట్లున్నదమ్మ నీ కొడుకు వ్యవహారము , ఎంత గడుగ్గాయిని కంటివమ్మా " అని యెద్దేవాచేసెను. 

  పిదప సోఫాలో కూర్చొన్న కేశవుని  “రంజినితో నీ స్నేహము మీరు చున్నది. కానీ నేను మీ మాట మీరు వాడను కాను  అందుకే  అడుగుచుంటిని  సుందరిని నీకు అనుకొనుచున్నాము. నేను తులశమ్మగారికి మాట ఇచ్చితిని. మీమాట నిలపమని కోరినచో నా ప్రాణమంతయూ నిత్తును. నాలో అర్ధ భాగము రంజినిను కోల్పోవుటకు సిద్ధముగానున్నాను. మరి అందులకు ఆమె ఒప్పుకొనునా? అరుణమ్మ వద్దన్నచో ఒప్పించు భాద్యత నీదే అని రంజనితో  మొదటే చెప్పినాను. తార రంజిని వైపు చూసెను.    మాలిని రంజిని వైపు ఉత్కంఠ తో చూచుచుండెను. మెడపైనుండి విదిష వర్షలు కూడా వచ్చి మాలినిగారి ప్రక్కన నిలిచిరి. 

మీరు  సుందరిని ఇచ్చి చేయుటకు నిశ్చయించిన నేను ఆక్షేపించు దానను అడ్డు కొను దానను కాను. కేశవుడు మిమ్మల్ని ఎంత ప్రేమించుచున్నాడో , నేను కేశవుని అంతే  ప్రేమించుచున్నాను. మీరు కోరిన కేశవుడు కాదనడు అట్లే కేశవుడు కోరినచో  నేను కాదనను. అని రంజిని విషణ్ణ వదనమున తెలిపి మా ప్రేమ నీతి  మాలినదని అనుకొనవలదని,  గుడ్ల నీరు క్రక్కుకొనుచుండగా మాలిని తారవైపు చూచుచూ నిలిచెను. కొంత సేపు నిశ్శబ్దము రాజ్యమేలెను. ఆ నిశ్శబ్దమును చీల్చుచూ " మీ  ఆత్మ నిగ్రహము గొప్పది , మీ పరస్పర ప్రేమానురాగము లిట్లే కలకాలమూ  నిలువవలెను."      అనుచుండగా కేశవు డు  అరుణ కాళ్లపైపడెను , రంజిని  అతడిని అనుసరించెను. అరుణ ఇరువురిని లేవనెత్తి చేరువైపులా వారిని పొదివి పట్టు కొనెను. భర్త తో విడి వంటిరి జీవితమును గడుపుచున్న నీకు,  అవివాహితుడైన కేశవునకు కుదిరినచో, ఇందులో మోసము అవినీతి లేదు.  ఇది నీతిమాలిన పని ఎట్లగును ?

మరి సుందరి సంగతి ఏమి చేయవలెను? అని మాలిని గారు అడుగగా " సుందరితో నిన్ననే మాటలాడితిని, ఆమె కేశవుని చేసుకొనుటకు నిరాకరించెను. అందరూ కలసి అల్పాహారమును భుజించిన పిదప వర్షునకు  వీడ్కోలు  పలుకుటకు ఇందిరాగాంధీ విమానాశ్రయము పోయిరి.   పిదప వారు విశాఖపట్నమునకు, రంజిని కేశవులు హైదరాబాదునకు  ఎగిరిపోయిరి 

Bharatavarsha 102

బెంగళూరు:  ఎలక్ట్రానిక్స్ సిటీ. రాఘవ ఎలెక్ట్రానిక్స్ ప్రయివేట్ లిమిటెడ్ కళకళ లాడుచుండెను.

సందీపుడు వాహనం దిగి గిడ్డంగి తనిఖీ నిర్వహించి కార్యాలయము లోనకు ప్రవేశించెను.

రాఘవుని గదిలో యమున రాఘవులు కంప్యూటర్లో  సంస్థ  వెబ్సైట్ ని పరిశీలించుచున్నారు.

రాఘవ: చెన్నపట్నము నుండి విమానము ఇప్పుడేమి కలదు? ఏ విమానమునకు వచ్చినావు? పేటెంట్ కార్యాలయమందు పని పూర్తి అయినదా?

సందీపుడు: విమాన మెందులకు రైలులో వచ్చినాను?

యమున: రైలులో వచ్చినా వా! ఒక ప్రతిష్టాత్మక  సంస్థ డైరెక్టర్ వని  మరచినావా?

సందీపుడు: అద్దె భవనములో నున్న చిన్నస్థాయి పరిశ్రమ అని మరువకుంటిని.

యమున: అట్లయిన స్థానిక పేటెంట్ కార్యాలయమునకు పోయిన బాగుండెడిది, పేటెంట్  కొరకు చెన్నపట్నము దాకా పోవుటెందులకో?

సందీపుడు: భారతదేశంలో చెన్నై, ముంబై, ఢిల్లీ  మరియు కోల్కతా నందు మాత్రమే పేటెంట్ కార్యాలయాలు కలవు. బెంగుళూరునందు పేటెంట్ కార్యాలయము ఇంకనూ పెట్టలేదు.

రాఘవ: యమున మాటలు పట్టించుకొనవలదు వచ్చిన  రోజులలో సంస్థ నందు  చాలా మార్పులు తెచ్చినావు.

సందీపుడు: నేను ములిగినచో పూర్తిగా ములిగెదను యమున వలె సగము ములుగువాడను కాను. పక్కింటామె వద్ద  కార్యదర్శి , ఇచ్చట అర్ధ డైరెక్టరు. యమున మొఖమొఱ్ఱ బారెను.

యమున: ఇంతకీ పేటెంట్ లభించెనా? నగర సందర్శనము చేసి వచ్చినావా ? 

సందీపుడు: పేటెంట్ కార్యాలయమునందు పని పూర్తి అయినది. పేటెంట్ వచ్చుటకు పట్టు  కనీస కాలము నాలుగు సంవత్సరములు. మనకు లభించినది దరఖాస్తు సంఖ్య మాత్రమే. సంస్థ వెబ్సైట్ చూచుచున్నారు కదా ఎట్లున్నది ?

యమున: రాఘవ ఎలక్ట్రానిక్స్  వెబ్సైట్ అద్భుతముగానున్నది,  సంస్థ చిత్రములు, ఉత్పత్తులు,  డైరెక్టర్లు , సంప్రదించ వలసిన చిరునామా అన్నియూ చక్కగా పొందు పరచబడి సంస్థ ప్రతిష్ట ఇనుమడించునట్లు వెబ్సైట్ ఎంతో ఘనముగా యున్నది.

రాఘవ: అదియునూ సందీపుడే చేయించెను. యమున మూతి మూడు వంకరలు తిప్పెను.

రాఘవ: కొద్దీ రోజులలోనే మంచి మిత్రులైన మీ ఇరువురిని చూచుచున్న నాకు ఈసు కలుగుచున్నది. పేటెంట్ పొందుటకు ఎంత ఖర్చు అయినది?

సందీపుడు: ఖర్చు స్వల్పమే ఎనిమిది వేలు. ఉత్పత్తి ప్రక్కన పేటెంట్ (దరఖాస్తు) సంఖ్యను పొందుపరచినచో సంస్థ పై నమ్మకము పెరుగును.

ఇంతలో తలుపు  తట్టి  ఒకామె వచ్చి మార్కెటింగ్ మేనేజర్ ఇంటర్వ్యూ కొరకు పది మంది అభ్యర్థులు వచ్చినారు. అని తెలపగా సందీపుడు “యమునా నీవు ఇంటర్వ్యూ నిర్వహించుము, ఒక గంటలో ముగించిన మనకు నిపుణులతో సమావేశము కలదు. అని యమునను పంపెను.

రాఘవ: పేటెంట్ (దరఖాస్తు) సంఖ్యను వెబ్సైటు నందు పొందుపరచినాను. అన్నట్టు చెప్పుట మరచితిని నీ కాబోవు అర్ధాంగి ఫోనుచేసెను. మరల చేసెదనని చెప్పినది.

సందీపుడు: నవ్వి ఆ యమున ఉన్నప్పుడు ఈ మాట చెప్పినచో నన్ను ఆట పట్టించెడిది. ఇరువురూ నవ్వు కొనుచుండగా ఫోను మ్రోగినది.

మంజూష : మా అమ్మ విశాఖపట్నము వచ్చుటకు ఇంకనూ రెండు రోజులే సమయము కలదు.   రాఘవుడు విష యము అర్థమయ్యి  బైటకు వెడలుచుండగా సందీపుడు వలదని వారించి మంజూషతో వచ్చుటకు వీలుపడదని సంభాషణను ముగించెను.

సందీపుడు: మన సంస్థ నందు  మధ్య స్థాయి, పైస్థాయి వారందరూ, ఈ సమావేశమునకు హాజరు కావలెను. వారి పేర్లు వివరములు నీవద్ద ఉన్నావా ?

రాఘవ: పుస్తకము చూచి చెప్పవలెను , పుస్తకము తెప్పించమందువా ?

సందీపుడు: అవసరము లేదు మధ్య , ఉన్నత  స్థాయి సిబ్బంది కలిపి 59 మంది కలరు అందు ఉన్నత స్థాయి వారు 21 మంది ఈ సమావేశమునకు హాజరు కావలెను , మధ్య స్థాయి వారితో రేపు సమావేశము జరుపవలెను.

రాఘవ , సందీప యమునలు కొత్తగా చేరిన మార్కెటింగ్ మేనేజర్ మరియు ఇరువది యొక్క మంది ఉన్నత స్థాయి సిబ్బంది, మొత్తము25మంది, తో సమావేశము మొదలయ్యెను. 

సందీపుడు : రాఘవ ఎలక్ట్రానిక్స్ ఎదుగుదల స్థంబింబించిన సంస్థ అన్నచో మీరు కలవర  పడుదురెమో! ఎదుగుదల నిలచిన సంస్థ  మనుగడ కోల్పోవుటకు  ఎంత కాలము పట్టును? గుట్టలుగా పడియున్న పీ సి బీ, స్పీకర్స్, హెడ్ ఫోన్స్  సరుకు నిల్వలు పరిశీలించగామనము డిమాండ్ తో సంబంధము లేని ఉత్పత్తి చేయుచ్చున్నాము. తెలియుచున్నది

ఇన్వెంటరీ మేనేజర్: మార్కెటింగ్ మేనేజర్ కావలెనని ఎప్పటి నుండో అనుకొనుచున్నాము   డైరెక్టరు (రాఘవ) గారు ఎందుకో మార్కెటింగ్ మేనేజర్  అవసరమును పట్టించుకొనలేదు.

సరఫరా మేనేజర్: ఇన్వెంటరీ  మేనేజర్ గారు ఇన్వెంటరీ పేరుకొనుట గమనించుచున్నారుకదా మీరు ఉత్పత్తి తగ్గించమని ఎందుకు చెప్ప కున్నారు?

ఇన్వెంటరీ మేనేజర్ : సరఫరా మేనేజర్ గారు, అది నాపని కాదు డిమాండ్ ను బట్టి ఉత్పత్తి  చేసి నిలవ చేసు కొందురు. ఆ డిమాండ్ లెక్కించుట నా పని కాదు. సరఫరా మేనేజర్ గా నిన్ను అమ్మకాల గూర్చి ప్రశ్నించిన ఎట్లుండును ?

సరఫరా మేనేజర్: నాపని వచ్చిన ఆర్డర్లు సరఫరా చేయుట. అమ్మకాలు నాపని ఎట్లగును?

ఇది పరస్పర నిందారోపణములు చేసుకోను సమావేశము కాదు ఇప్పుడు మార్కెటింగ్ మేనేజర్ గారు వచ్చినారు నేటి నుండి వారు అమ్మకాలు పెంచుటకు కృషి చేసెదరు. 

 యమునా మార్కెటింగ్ మేనేజర్ ఆచారి గారిని అందరికీ పరిచయము చేసెను. అందరూ ఆయన అనుభవమును విని కరతాళ ధ్వనులు చేసిరి.      

 

మన సంస్థ వార్షిక అమ్మకాలు ప్రస్తుతకు రెండు కోట్లు , రాబోవు రెండు సంవత్సరములలో 5 కోట్లు అమ్మకాలు సాధించుట మన లక్ష్యము అందుకేమి చేయవలెను అన్నదే నేటి చర్చ.

నిపుణులు, వివిధ శాఖలవారు పాల్గొనుటచే చర్చలు సుదీర్ఘ  మగుచుండెను, సమయము 4 గంటలు అయినది.తినుటకు బూందీ త్రాగుటకు తేనీరు  సరఫరా చేయబడినవి సమావేశ మందిరమంతయూ మాటలు నవ్వులతో కొలది సమయము గడిచెను.  కొలది విరామము తరువాత నిపుణుల యందు పెద్ద యగు నారాయణ: సాంకేతిక పరిజ్ఞానంలో మార్పులు చేసి స్పీకర్స్ కి బ్లూటూత్ అమర్చుట మంచిదని సూచించగా రాఘవుడు అంగీకరించెను. 

సందీపుడు అందుకగు ఖర్చు వినియోగ దారునిపై భారమును పెంచునని ధర పెరిగిన యెడల వినియోగ దారులు  బోస్ , జె బి ఎల్ వంటి స్పీకర్స్ కొనుటకుమొగ్గు చూపినచో సంస్థ నష్టములు మరింత పెరుగునని  వలదనెను

ఇట్లు చర్చలు సాగు చుండగా గడియారం 6 గంటలు చూపుచుండెను. సమావేశమునకు వచ్చిన వారు తమకు తోచిన  అభిప్రాయములు మరింత చెప్పుచున్నారు

వినియోగదారుల అభిరుచులు మరియు ప్రాధాన్యతలు కూడా ఎప్పటికప్పుడు మారుచుండుటచే ఎలక్ట్రానిక్  ఉత్పత్తి దార్లు సేవాదార్లు  కొత్త ఉత్పత్తు లకు రూపకల్పన చేయవలెను . 

కస్టమర్ అభిరుచులు మారినట్లే, డిమాండ్లో కూడా అనిశ్చితి ఉండును.  డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తి నుంచుటకు సమర్థవంతమైన పరిశీలన అవసరము

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్ తయారీ సేవా పరిశ్రమలో చాలా పోటీ ఉన్నది. వ్యాపారం కొరకు  ధరలను ఎల్లప్పుడూ తక్కువగా ఉంచాలి.  ధరల యుద్ధం  చాలా సంస్థలకు తట్టుకోలేని  నష్టాన్ని కలిగించుచున్నది. 


ప్రతి ఒక్కరూ ఈ రోజు నాణ్యతనాశించుచున్నారు. నాణ్యతపై ఎక్కువ దృష్టి  నిలపవలెను. ఉత్పత్తులు మరియు సేవల నాణ్యతకు హామీ ఇవ్వ వలెను.

త్వరలో  సిసిటివి  మార్కెట్ 20,000 కోట్లకు చేరుకుంటుందని పరిశ్రమ వర్గాల అంచనా. సిసిటివి కెమెరాలను ఉత్పత్తి చేయవలెను 

మొబైల్ ఫోన్ చరవాణిని  ఉంగరము మాదిరిగా వేలికి  ధరించుట  కొత్త పంథా కానున్నది. మల్టిఫంక్షనల్ స్మార్ట్ రింగ్ గా వీటిని వ్యవహరించుచున్నారు జాక్కామ్ R3  స్మార్ట్ రింగ్  జనాదరణను పొందినది కావునా మనము స్మార్ట్ రింగ్ ల ను ఉత్పత్తి చేయవలెను   

సందీపుడు  శ్రోతగా మారెను. యమున రాఘవులు ముగించమని సాందీపుని వైపు చూచుచుండిరి ఇంతలో ఫోను మ్రోగెను. మంజూష : సమావేశము ముగిసెనా ! నన్ను పట్టించుకొనుట మానివేసినావా , లేక నను పూర్తిగా మరి చినావా ?

 సందీపుడు: సమావేశము ఇంకనూ కొనసాగుచున్నది. తరువాత మాట్లాడుకొన వచ్చును అని సంభాషణ నిలిపి వేసెను. సమావేశము ముగిసి అందరూ వెడలిన పిదప సమావేశ మందిరమున రాఘవ, సందీప యమునలు మాత్రము మిగిలిరి.

రాఘవ: అందరమూ అలసిపోయినాము. నేటి  సమావేశము  చారిత్రాత్మకము. చాలా విషయములు వెలుగులోకి వచ్చుటయే కాక సంస్థ భవిష్యత్తుకు మార్గదర్శకముగా నుండును.    

యమున: మార్కెటింగ్ మేనేజర్ గారిపై నాకు నమ్మకము కలిగినది , అపారమైన అనభవం కలిగినవారు, నిపుణులు సలహా పాటించినచో  రాఘవ ఎలక్ట్రానిక్స్  తప్పక వృద్ధిలోకి వచ్చును. 

 

సందీపుడు:  మార్కెటింగ్ మేనేజర్ అనుభవజ్ఞులే  అయిననూ  సెల్లింగ్  ఈజ్ నాట్ టెల్లింగ్. ఆయన పనితనము  చూపి నిరూపించుకొనవలెనుకదా. ఎంత తక్కువ లాభమునకైనా పాత సరుకు అమ్మివేయ వలెను. కొత్త అన్వేషణలు ప్రారంభించుటకు మనవద్ద నిధులెచ్చటున్నవి?  సి సి కెమెరాలు  ఉత్పత్తి చేయవలెనన్న మన సంస్థకున్న నిధులు సరిపడునా?  సెల్ఫోన్స్  ఉత్పత్తి చేయవలెనన్న అంబానీ వంటి వారు సిద్ధముగా లేరు అందుచేతనే వారు నెట్వర్క్ సేవలు అందించుచున్నారు. మనము కలలు కనుట మానవలెను.  

రాఘవ: అదియునూ నిజమే, నీవు వచ్చిన తరువాత 10 మందిని కొత్తగా సంస్థ లోకి  తీసుకొనినాము. ఒక్క వారములో సంస్థ అభివృద్ధి పనులకు నాలుగు లక్షలు ఖర్చు అయ్యెను. మీనాక్షి 50 లక్షలు ఇచ్చుటచే పరిస్థితి మెరుగానే యున్నది. 

యమున:  విశేష ప్రతిభావంతురాలు, నీకంటే పెద్దామెను ఇట్లు మీనాక్షి అని ఏకవచనమున సంభోదిం తువా? “త్వరలో ఆ అందాలరాశి చేతిని అందుకొందును , ఇంకనూ ఆమెను మీనాక్షిగారు అని పిలవవలెనా, అట్లు పిలిచిన బాగుండునా?”

సందీపుడు:  నీ ప్రేమికురాలి పేరు మీనాక్షి అన్న మాట. మరి ఆమెకు నీ ప్రేమను తెలిపినావా ?ఆమె అంగీకరించెనా ?

రాఘవ: ప్రేమించుకున్న ఇంత  ధనసాయము చేయునా ? కానీ ఎందుకో గత కొద్దీ రోజుల నుండి ఆమెను కలుసుకొనుటకు  ఇంటికిపోయిననూ , ఆమె ఇంటివద్ద నుండుటలేదు!

యమున: నిజమే నిన్ను ప్రేమించుచున్నది , ఒక కొడుకు వలే ప్రేమించుచున్నది. ముంబై సంగీత కార్యక్రమమునందు చూచి ఆమె  ప్రతిభకబ్బురపడి ఒక కన్నడ చిత్రమునకు సంగీతము సమ కూర్చమని ఒక దర్శకుడు ఆమెను ఆహ్వానించెను.  ఒక హిందీ దర్శకుడు  కూడా ఆమెను  ఒక చిత్రమునకు సంగీతము సమ కూర్చమని ఆహ్వానించెను. గత కొద్దీ రోజులగా చిత్ర సంగీతము సమకూకూర్చుచు చూ తలమునకలుగా నుండెను. ఆమె నిన్ను ఆదృష్టితో చూచుటలేదు.

 రాఘవ: ఆమె నన్ను ఏ దృష్టితో చూచుచున్నదో  నీకు చెప్పెనా ? నీవామె వద్ద చేరి నా ప్రేమను చెడగొట్టు చున్నావు.

సందీపుడు:  మీరిరువురూ వాదులాటలాపిన మనము జయనగర్ పోవలెను. జయ నగర్లో  ఒక పరిశ్రమల సలహాదారుడు కలడు అతడి సలహా పాటించి అనేక పరిశ్రమలు వృద్ధిలోకి వచ్చినవి, నేటి మన చర్చల సారాంశమును మరియు  నా నిర్ణయమును అతడి ముందుంచి అతడి సలహా తీసుకొని రేపటినుంచి కొత్త మార్గమున సంస్థను నడపవలెను. 

రాఘవ: నీ నిర్ణమా ? నీవేమి నిర్ణయించుకొంటివి ?

సందీపుడు:  మీరు మీ గొడవ  ఆపిన అదియునూ చెప్పెదను. ఈ ఉత్పత్తులను అన్నీ రేపటినుంచే  ఆపివేయవలెనని నేను నిర్ణయించుకొంటిని. 

ఉత్పత్తి నిలిపివేసిన మరి మనమేమి చేయవలెను ?

సందీపుడు: అది తెలుసుకొనుటకే  మనము సలహాదారు వద్దకు పోవుచున్నాము . అమ్మకాలు లేని ఉత్పత్తులు చేయు టెందులకు? నష్టములు పెంచుకొనుట ఎందులకు ? 

రాఘవ: ఇప్పుడు ఇంకనూ పని చేయవలెనా! నాజీవితము హరించుకు పోవుచున్నది, నేను మీనాక్షిని చూడవలెను . నాజీవితమును ఆమెకు అర్పించవలెను. నిత్యమూ ఆమెతో తీపి కలలు కనుచున్నాను 

యమున: రాఘవ నీవు సంస్థను వృద్ధిలోకి తీసుకు వచ్చెదవని  నేను పగటి కలలు కంటిని. 

నీవు సంస్థను వృద్ధిలోకి తీసుకువచ్చువాడవు కాదని  తేలిపోయెను. సంస్థను ఎప్పుడు వీడిపోవలెనన్న ఆటంకపరచనని మాట ఇచ్చితివి గుర్తున్నదా "ఆ గుర్తున్నది" అని రాఘవుడనెను 

యమున: అయినచో నేను చెప్పవలసిన ఆఖరిమాట ఒకటున్నది, నేను సంస్థ ను వీడు చున్నాను. రేపటినుండి నేను రాలేను. మన దారులు వేరు     

సందీపుడు: యమున నీవు రాఘవుని నమ్మి భంగ పడితివి. నేను ఎవ్వరిని నమ్ముకొనక నన్ను నమ్ముకొని  కలలు కనక, వాస్తవ ప్రపంచము లో సాగుచున్నాను. మీఇద్దరు మీ మీ దారులు చూచుకొనుడు , సంస్థను నేను చూచు కొందును. సలహాదారు వద్దకు నేను ఒక్కడినే పోవుచున్నాను అంటూ సందీపుడు వంటరిగానే బయలుదేరెను.  

Saturday, December 26, 2020

Bharatavarsha -101

 అగస్త్యుడు తండ్రితో మాట్లాడి క్రిందకి వచ్చి చూడగా బసవడు చిందులు త్రొక్కుచుండెను." ఆ చీకటి మనిషి వెడలెనా?" అని అడిగెను."అయ్యవారు వచ్చువరకు అమావాస్య ఆగునా ?"   

వాడిని  పోయినచో  పోనిమ్ము,  నీవేల చిందులు త్రొక్కుచున్నావు ?

ఇందాక మీ అమ్మ ఉన్నది అనగా నీవు చిందులు త్రొక్కినావు , ఇప్పుడు పార్వతి లేదు అని తెలిసి నేను చిందులు త్రొక్కుచున్నాను. 

పార్వతి లేదు అనగా ఆమెకు ఏమయ్యెను ? ఆత్మా హత్య చేసుకొనెనా ? చనిపోయెనా?!

పాపాత్ముడా , పాపం పార్వతి కేమాయెను అని అడుగుట  మాని ఇట్లడుగుచున్నావు , నీకొక తోబుట్టువుండిన  తెలిసి వచ్చెడిది

 బాల్యమెట్లు గడిచెనో గడిచిపోయెను , ఊహ తెలిసిన వయసుకి తల్లి తండ్రుల మధ్య చీలిక , విద్యార్థి దశ సత్రాల పాలాయెను. తోబుట్టువుండిన ఎంత బాగుండెడిది! నేటి నుండి  పార్వతి యే నా తోబుట్టువు , పార్వతికేమైనది చెప్పుము ?

పార్వతి అపహరింపబడినది అని సందేశము వచ్చెను అని  బసవడు అనుచుండగా అగస్త్యుడు చకితుడయ్యెను. " ఆ సందేశము నమ్మవలసిన పనిలేదు ఇది ఏ పన్నాగామో తెలుసుకొనుము "

చెప్పవచ్చినాడయ్యా చాణక్యుడు ! ఆ సందేశము పంపినది వర్షుడు 

ఎవరు ఎచ్చటున్నారో నన్నుఁడుగుము నేను చెప్పెదను.  ఇంకనూ వర్షుడు ఢిల్లీలో యుండెను, అతడికేట్లు తెలిసెను అతడెక్కడున్నాడో కనిపెట్టవలెను.  

నీకు అమ్మ ఎచ్చటున్నదో  తప్ప నీకు అన్నితెలియును.  వర్షుడు నేడు ఢిల్లీలో యుండి  రేపు అమెరికా పోవును సందీపుడు బెంగుళూరు నందు మంజూష విశాఖ నందు, ఈ విషయములందరికీ తెలియును.  వీటితో పాటుగా నాకు  మీ అమ్మఎచ్చటున్నదో కూడా తెలియును.  మీ నాన్న ఏమనెను ?     

నేను  చేయగలిగినది ఏమియూ  లేదట , అక్కరలేని విషయములందు దూరి  ప్రాణముల మీదకు తెచ్చుకొందునట. కొడుకు మీద నమ్మకము లేని తండ్రి ఎట్లుండునో చెప్పవలెనన్న అత్యుత్తమ ఉదాహరణ గా  నా  తండ్రిని చూపిన చాలు.    

వాజెమ్మ వలే తండ్రిని నిందింతువెందులకు నిన్ను నమ్మి  నా సమస్యలను ప్రక్కనుంచి వచ్చిన  నన్ను నమ్మి నాకు  నిజమెక్కడ చెప్పినావు ?

నిన్ను నమ్మకున్న  స్నేహమను పదము అర్ధరహితము జీవితము  వ్యర్ధము. 

అయినచో విదిష నీపై తాడెత్తున ఎందుకు లేచెనో  నాడు అడిగినప్పుడు తరువాత చెప్పెదనని వాయిదా వేసినావు , నేడు నీ తండ్రి నిన్ను నమ్మని పరిస్థి దాపురించెను. ఇకనైనా నిజము తెలుపుము 

అది ఒక పెద్ద కథ, ఇప్పుడు ఆ చీకటి మనిషిని వేటాడుట మాని ఈ కథ వినుట ముఖ్యమా ?  

ఓరీ దురాత్ముడా నన్నింకనూ మభ్యబెట్ట ప్రయత్నించుచున్నావా ? వాడెప్పుడో పోయినాడు , నేటికి వాడు చిక్కుట  కల్ల.  

అయిననూ నా తండ్రికి లేని బాధ నాకేల, నీకేల ఈ సంస్ధ ను భూస్థాపితము చేయుచున్నది దాని స్థాపకుడే అయినచో మనమేల ఉద్దరించవలె?

అట్లని తప్పించుకొనుచున్నావా? నిరాశ చెందుచున్నావా? వాడిని పట్టుకొను మార్గము నావద్ద  కలదు. 

"అయినచో ఆది యెట్లో తెలుపుము.” " ముందు నీ కథ చెప్పుము " 

నా  పట్ల తప్పు జరిగినది. అది చెప్పిన పిదప నాకు సాయము చేయకున్ననూ, నా ముఖము చూడకున్ననూ బాధ లేదు. నన్నసహ్యించు కొనవలదు.

తప్పు జరిగెనని చెప్పుచున్నావు కదా, దిద్దుకొనుటకు అవకాశము ఉన్నచో దిద్దుకొనచ్చు  ముందు విషయం వివరింపుము.  ఇద్దరూ భవనము పైకి పోయి నిలచినారు

భాగ్యనగరమున  సుందరి పరిచయమైన నాటినుండి ఆమె అందము నన్ను ఆకట్టుకున్నది. ఆమె అరుణతారావలె అద్భుతముగా నర్తించును. చిత్రములందు అవకాశములు కొరకు ప్రయత్నించు రోజులలో  ఆమె నృత్యమును ఒక చిన్న వీడియోగా రూపొందించెను. ఆమె నృత్యము నిత్యమూ చూచు నన్ను ఆమె నృత్య భంగిమలు ఆమె అంగ సౌందర్యము సమ్మోహన పరిచెను. ఆమె పైనున్న ఆకర్షణ క్రమముగా మోహముగా మారెను. ఆమెతో స్నేహము చేయవలెనని , మాట్లాడవలెనని అను కొన్ననూ నాకు లకుమకు గల ఆకర్షణ అప్పుడే మొగ్గ దశలో నుండుటచే నా ధ్యాస అంతయూ లకుమమీద ఉండెడిది. లకుమ ప్రమాదంలో పడి  జాడలేకున్నప్పుడు ఆకర్షణ బలపడెనని పొరపడి ప్రేమ మొగ్గతొడిగెనని భ్రమపడి లకుమ కొరకు సుందరి ఇంటికి పోయితిని.

 అప్పటికి   సుందరి తండ్రికి చివరి క్షణములలో నుండెను. అతడిని ఆసుపత్రిలో చేర్చుటకు నేను చేసిన చిరు సాయమును సుందరి మనసులో ఉంచుకొని నన్ను గొప్పవ్యక్తి అని ఆరాధించెడిది .   ఆమెను వెంట పడి  పొందవలెనని , పొందగలనని కలనైనా అనుకొనలేదు. ఆమె దృష్టిలో ఉన్నతుడివలే నుండవలెనని అనుకొంటిని.  కానీ అనుకోనిది జరిగెను ఆమె దృష్టిలో నేను నీచుడి నైతిని. 
సుందరిది ఉక్కుగుండె అని అందరూ అనుచుందురు ధైర్య సాహసములకు మారు పేరైన  ఆమెను నీవెట్లు బలవంతము చేసినావు ?
 బల్లిపాడులో అరుణతార గారి పాదములకు నమస్కరించుట ఏడ్చుట  నీవునూ చూచినావు కదా! అవును ఆమెకు కృతజ్ఞతాభావము మెండుగా నుండెను. ఆపై చెప్పుటకు అగస్త్యుడు సిగ్గుపడ  సాగెను. 
బసవడు: ఇప్పుడు సిగ్గు పడి లాభమేమున్నది ఏమి జరిగినదో చెప్పుము.   

 లకుమ తార అయినది. అవకాశములు కొరకు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లుతో గడుపుట తో మొదలైన లకుమ పతనము  నాకళ్ళముందే కశ్యప్ అను డైరెక్టర్ తో తిరుగుచూ నన్ను తూలనాడుటతో పరాకాష్టకు చేరినది. నేను వంటరినైతిని. మరల సుందరి నా డెందమందు మెదిలినది. సుందరి పోవు ప్రతి విమానమందు నేను పోవుచూ, నీడ వలె అనుసరించుచూ ఆమె  కొరకు ప్రయత్నములు మొదలు పెట్టి ఒక నాడు బెంగుళూరు నందు ఆమె బసచేయు హోటల్ కు పోయితిని. అదే హోటల్లో వేరొక గది తీసుకొని ఆమె గది తలుపు తట్టితిని. సుందరి తలుపు తీసి ఆశ్చర్య పోయినది 

సుందరి : అగస్త్యుడా!  ఆశ్చర్యము  నేనిక్కడ బస  చేసినట్టు నీకెట్లు  తెలిసెను?
అగస్త్య: ఇష్టమున్నచో  అన్ని తెలుసుకొనవచ్చును. నేను   బసచేయుచున్నాను.
సుందరి :  నీవిట్లు నాకొరకు తిరిగి సమయము ధనము వృధా చేసుకొనుచున్నావు. 
అగస్త్య: నీవు నాకు పొదుపు భోదించవలసిన పని లేదు, ఇంతకీ లోనికి  రానిత్తువా? 
సుందరి : లోనికి రమ్ము , అరుణతార గారు మీ అమ్మ గూర్చి గొప్పగా చెప్పినారు.  ఆమె అన్న నాకు గౌరవము.   చాలా కాలము నుండి నీవు నన్నెందుకు అనుసరించుచున్నావు?
అగస్త్య:  నీకు నాపై దురభిప్రాయము కలదా? అరుణగారికి నేను నిన్ను అనుసరించుచున్నట్లు చెప్పితివా ?
సుందరి : నాకు నీపై దురభిప్రాయము లేదు   ఉన్నచో  ఆమెకు చెప్పవలసిన పని లేదు. 
అగస్త్య:  నీవెంత మంచి దానవో నాకు తెలియును. నీవు  అంత  బేల కావు  తెలియును. 
సుందరి: నీవు చేసిన ఉపకారము నేను మరువ జాలను. హైద్రాబాద్ వదిలి బెంగుళూరు ఏదైనా పని పై వచ్చినావా ? నేను నేటి రాత్రి కిచ్చటండి రేపు హైద్రాబాద్ పోవుచున్నాను . 
ఎల్లుండి 6E 288 నందు  చెన్నై పోవుచున్నావు, అది కూడా తెలియును.  నేను కూడా నీతో  వచ్చుచున్నాను. నీతో తిరిగిన ప్రతిసారి లకుమ నన్నెట్లు మోసగించుచున్నదో  వివరించితిని.  నేను మోసపోతిని నాకు నీ తోడు కావలెను. అని అగస్త్య ఆమె చేయినందుకొనెను.  సుందరి:   అగస్త్య నీవు తాగి యున్నావు బైటకు పొమ్ము! 
అగస్త్య:  నీ అందము నన్ను పిచ్చి వాడిని   చేసినది.  బల్లిపాడులో కూడా నిన్ను పొందవలెనని చూచితిని అప్పుడు అందరూ ఉండుటచే..  
సుందరి: అప్పుడు కుదరలేదని  ఇట్లు చేసెదవా ! నేను పిర్యాదు చేయకముందే బైటకు పొమ్ము 
అగస్త్య: చూచితివా మంచితనమునకు లోకము కాదని నిరూపించినావు,  మా అమ్మను ప్రేమించుట అరుణతారను గౌరవించుట అంతాబూటకము. ఒక ఆడది మోసగించినది మరొక ఆడది తన్ని అవమానించినది. నీవు దక్కకున్న నేనీ లోకమునే వీడి పోయెదను.  ఈ విషయము అందరికీ చెప్పిన నాకు ఆత్మ శాంతి లేకుండా చేయవలదు
                                            


 ఆమె తన చీరను విప్పి సోఫాపై పడవేసి  నీవు చేసిన సాయము వెల కట్టలేనిది  సుందరి లోవస్త్రములతో  నిలిచి నీకు కావలసినది తీసుకొనవచ్చును అని నాముందు నిలిచెను. అదివిన్న  బసవడు  హతాశుడయ్యెను. 
అగస్త్యుడు: అప్పుడు శిక్ష తప్పించుకొన్ననూ ఇప్పుడు నీకు   దొరికితిని  ఏమి చేసిననూ నీ ఇష్టము, ఆ సంఘటన  పిదప నాకు జీవితము పై ఏవగింపు కలిగినది, అనుచూ భవనము పై నుండి దూకుటకు పోవుచుండగా బసవడు నివారించి " చచ్చినంత మాత్రమున కళంకము తీరిపోవునా, అప్పులు చేసి తీర్చలేక  ఆత్మహత్య  చేసుకొన్నట్లు న్నది. అంతయూ మనమంచికే, పార్వతి నీకు తోబుట్టువయిన  సుందరి నాకు తోబుట్టువు, ఆమెకు న్యాయము జరగవలె నన్న నీవు బ్రతికుండుటయే కాక అభివృద్ధిలోకి రావలెను. అని  బసవడు అనుచుండగా   ఒక వాహనము క్రిందనుండి బయలుదేరుచుండెను.  వచ్చి పోవుచున్నాడు వీడెవడు. వీడెప్పుడు వచ్చినాడో మనము చూడలేదు అనుసరించ వలెను అని బసవడు చకచకా  క్రిందకు దిగి ద్విచక్రిక నెక్కి ఆతడి వాహనమును అనుసరించ సాగెను. అగస్త్యుడు వెనుక కూర్చొనెను.     

Friday, December 25, 2020

Bharatavarsha 100

 బసవడి యంత్ర ద్విచక్రిక విస్ఫులింగములు కక్కుచూ తూర్పు కనుమల వెంబడి  లఘాటము  వలే సాగుచుడెను.  చల్లగాలి రివ్వరి కత్తివలె మొఖమును చెండు చుండెను. “నీవు చొరుకొన్నచో గడ్డివాములోసూది నైననూ సాధింతువు కానీ భూమిచుట్టూ చంద్రుని వలే నీవు పార్వతి చుట్టూ తిరుగుచున్నావు. ఏమైననూసాధించినావా?”  “నిన్ననే పోయి వచ్చితిని. అచ్చట గౌడసోదరులు తిమింగలములవలె నుండగా పార్వతిని ఆ వూరు నుండి తీసుకు వచ్చుట అసాధ్యమని  తెలుసు కొంటిని.”  “పోలీసులనాశ్రయించిన  నీ పని పూర్తి అగును " “పోలీసుల నాశ్రయించిన నా పని ముగియును ,  అత్తిలి పోలీసులకు పిర్యాదు చేయగా,  కోటీశ్వరుల పిల్లలకి ప్రేమ అని ఎరవేయుట మానుకొనవలెనని  వారు కోటీశ్వరులని,   ఆపిల్ల జోలికి పోయినచో చెరసాలలోకి పోవలసి యుండునని హెచ్చరించి పంపినారు.” 


యంత్ర ద్విచక్రిక మధురవాడ సాంకేతికోద్యానవనమును (ఐ టీ పార్కు) దాటి  వంద అడుగుల రహదారి పై కొండల  నడుమ చిత్రకము( చిరుత) వలె  సాగుచుండెను.  “అత్యంత సమీపములో చుట్టూ కొండలు మధ్య ఈ సువిశాలమైన సుందర ప్రదేశము.  ఇచ్చట నివసించవలెనన్న  పెట్టి పుట్టవలెను " అని బసవడనెను.  ఈ ప్రదేశమంతయూ అందమైన ఉద్యానవనములు కలవు, తన్వి పార్క్ , శ్రీరామ్ పార్క్ , కూరగాయల వనములు. అని అగస్త్యుడు అనగా " పగలు వచ్చి వీటి వగలు చూడవలెను. ' అని బసవడు అనెను. “పార్క్ 94 , ఫిబ్రవరి 24 పార్క్  అని వాటి పేర్లు విన్ననూ  వయ్యారమొలుకుచుండును. అంతే కాక ఇచ్చట హరిత టౌన్ షిప్ , నార్త స్టార్ టౌన్ షిప్ అని అనేక సుందర గృహకూటములు  కలవు. ఇచ్చటకు సమీపములోనే రామానాయుడు స్టూడియో కూడా కలదు అదియునూ ఒకసారి చూచెదము. నిన్ను కొనిపోయెదను " అని అగస్త్యుడు అనగా బసవడు “ఇప్పుడు అర్ధమైనదిరా లకుముకి పిట్ట నీకెందుకు దక్కకున్నదో.”   “లకుముకి  పిట్ట అనగా నా లకుమ!  నాకెందుకు దక్కకున్నది? నాకు అంతు చిక్క కున్నది.  నీకు అర్థమైనచో తెలుపుము.”  అనగా బసవడు “ఓరీ చచ్చు మొఖమా ! నీవు నన్ను రామానాయుడు స్టూడియోకి కొనిపోయెదవా అనుచూ అందుకొనెను…


నీవు పోవుటయే  తప్పు , నన్ను కొనిపోవుట తప్పున్నర తప్పు!

తొర్రయందు బుర్రను దాచి బఱ్ఱె వలె పోవుచుండ కుర్ర దెట్లు నీ వెంటపడును!!

తప్పు  తప్పూ ఓరి సుద్ద  పప్పూ నీ మెదడుకి పట్టెను తుప్పు!!!


“ఓరి నరాధమా ! నీ ఇంటిముందు రామానాయుని స్టూడియో దిష్టిబొమ్మ వలే నుండును. ఆ స్టూడియో కంటే ఖరీదు చేయు కారు నీవద్ద యున్నదిరా గార్దభా. వాహన యంత్ర నిస్వనము తప్ప  ఆ నిర్మానుష్య నిశీధియందు  వేరు ధ్వని లేకుండెను.  యంత్ర ద్విచక్రిక  ఈ “వాహనము ఎప్పుడు కొంటివి ?  చదువు కొను  చున్నప్పుడు  వాహనము  కొరకు నీవెంత  యాగీ చేసెడి వాడవో గుర్తున్నదా!” ఇది సందీపుని  వాహనము, వాడు బెంగుళూరుకు వాహనము కొనిపోకుండుటచే  నేను నందిని నడిగి తెచ్చితిని. సబ్బవరం పోయి తెచ్చితివా?  “నందిని కొరకు సబ్బవరం పోనేల  కొమ్మాది మధురవాడ  కదా చెంతనే యున్నది కదా!   చెప్పవలెనన్న మన మనందరమూ చెంతనే యున్నాము.   మువ్వవాని పాళెమందే వర్షుడు, నీవు  జూ పార్క్ తోవలో  డైరీ ఫారం వద్ద  రాఘవుడు  కొలది దూరమందు  కొమ్మాదిలో  నందిని, కలుఉప్పాడలో నీవు” సామీప్యత యున్ననూ సారూప్యత లేకుండెను , మన బృందమందు అందరూ ధనికులే  నేనొక్కడినే పేదను పనివాడను. లకుమ పెద్ద నటి అయ్యెను, కేశవునకు రంజినిగారు , సుందరికి అరుణతార   సందీపునకు  నందినికి నీకున్నట్లే  కోటీశ్వరుడైన తండ్రి ఉన్నారు.  వర్షుడు పేదరికములో   నాకుతోడుగా నుండెడివాడు , వాడు కూడా నేడు కోటీశ్వరుడయ్యెను.  అని బసవడు అనుచుండగా  బండి ఆగెను.  

ఆ నిశ్శబ్దమందు అగస్త్యుని సన్నని రోదన వినిపించుచుండెను. నీవట్లు అనుచున్న పేగు మెలిపెట్టు బాధ కలుగు చున్నది , రాజుకు  దేహమున్నది  ప్రాణమే  లేదన్నట్లు మానాన్న కోటీశ్వరుడని నేను కలనైనా అనుకొన లేదు. మా అమ్మ ఉన్నప్పుడు  నేను కోటీశ్వరుని కాకున్ననూ నేనట్లే ఉండెడివాడను. "నేడు  నా తల్లి ఎట్లున్నదో, ఎంత పేదరికంలో ఉన్నదో !  ఉన్నదో లేదో ! " అగస్త్యుడు మరల ఏడవ నారింభించెను. "అగస్త్య ఆగుము, నీ తల్లి  బ్రతికే యున్నది , ఆమె ఇప్పుడు చెన్నపట్నమున మురికివాడలలో లేదు ఒక ఉత్తముడామెను సురక్షితమైన చోటకు చేర్చెను. ఇప్పుడామె  ధనికు రాలే కాక ఐశ్వర్యవంతురాలు, కుటుంబసభ్యులవలె ఆమెను  అభిమానించుచు ఆమె బాగోగులు  చూచువారు కలరు. ఆమె  గూర్చి నీకు తెలపవద్దని చెప్పిననూ నీ వేదన, రోదన చూడలేక   విషయమును చెప్పితిని. త్వరలో నీవు నీ తల్లిని కలిసెదవు. విచారించవలద"ని బసవడు చెప్పి దిక్కులు చూచుచుండెను. “నాకిప్పుడు మహానందముగా నున్నది” అని అగస్త్యుడు గెంతులు వేయ సాగెను. బసవడు చుట్టూ పరికించుచుండెను కానీ చీకటినందు ఎవ్వరూ కాన రాకుండిరి.   

“కూర్చొనుము పోయెదము  “యంత్రమును ప్రారంభించము” ఇది ద్వంద్వయంత్ర గామిని ( twin engine hybrid) అనగా ఇంధనం అయిపోయిన పిదప అంతర్దహన యంత్రము నుండి    విద్యుత్కోశ(బాటరీ)యంత్రముకు మారి ప్రయాణము కోన సాగించవచ్చు. ఐదు వేగములతో బహుదూరం పోవు ఈ వాహనము సందీపుని రూపకల్పన. అని బసవడు అనగా అగస్త్యుడు " వాడు రాఘవునకు పెద్ద దిక్కగున' ని సంతోషించెను.

వారి వెనుకనుండి ఒక ద్విచక్ర వాహనము దూసుకు పోయెను. వీడి కొరకే నేను మన వాహనమును చాలా సేపు నిలిపి వెతికితిని . వీడు మనని అనుసరించుచున్నాడని నా కనిపించుచున్నది. " అనుసరించువాడు ముందుకెందుకు పోవును , "మన ము బాటరీ యంత్రమునకు మారిన పిదప వాడి యంత్ర శబ్దమును దాచలేక " అని బసవడు అనెను.

కలుఉప్పాడ గ్రామీణక్షేత్రమందు   ద్విచక్రిక  అగస్త్యుని హార్మ్యము చేరినది గ్రేస్ ఫెరారీ లో బయలుదేరుచున్నది. అచ్చట వాడు నక్కియుండి ఆమెను అనుసరించుచున్నాడు. " ఓహో యితడు గ్రేస్ స్నేహితుడు. వారెచ్చటికి పోవుచున్నారో చూడవలెను అని బసవడు వాహనమును తిప్పుచుండగా అగస్త్యుడు " మా నాన్నని చూచి పోయెదము " అనెను ఇంతలో " పార్వతి కిడ్నాప్డ్ " అని బసవడికి సందేశము వచ్చెను.




Thursday, December 24, 2020

Bharatavarsha 99

 మధురవాడ : ఆరు గంటలు   కావచ్చుచున్నది. సూర్యుడు అస్తమించుచుండెను.  చీకట్లు అలుముకొనుచుండెను. మధురవాడ ఎంత పెరిగి పోయెను. బసవడు మోటార్ సైకిల్ ఆపి “మధురవాడ శివారు చేరుకొంటిమి ఇచ్చటతో మధురవాడ అంతమగును. ఎదురుగానున్నవి కొండలే ఇంకనూ పోవలెనన్నచో బండి దిగి కొండఎక్కుట తప్ప వేరు మార్గము లేదు.”  మధురవాడ నాలు మూలలా  గాలించితిమి ఎంత వెదికిననూ జాన్ ని కనుగొనలేకపోతిమి. ఇంక వెనుతిరుగుట గాక మనమేమి చేయగలము” అని అగస్త్యుడు అనుచుండగా బసవడుఅందుకొనెను  (ఇదియే వీడితో వచ్చిన చిక్కు) 

“గాలించి గాలించి చాలించి నాడు 

వేడిలేని కాలాన  వాడిలేనివాడు  

ఓడిపోయి వీడు  మధుర వాడ వీడు  

శోధించి జానును సాధించుకున్న

వేదించు ప్రశ్నలు బాధించు మనసును 

బసవా నీ ఆసు కవిత కొరడాలవలె నా మనసును తాకినది జాను జాడలే నిచో మనకి కీడు తప్పదు. జాన్ పేరుగల వారెవ్వరూ కానరాకుండిరి. ఇప్పుడేమి చేయవలెను అని అగస్త్యుడు అనుచుండగా బసవడ “ఇందాక మనము పోయిన ఇంటికి మరల పోయెదము ఆ లిల్లీ అను పిల్ల ఇది రాజుగారి ఇల్లు అని చెప్పుటకు తొట్రు పడినది. నాకెందుకో అనుమానంగా యున్నది. నీవు అతడిని చూచినా గుర్తు పట్టగలవా?” అని బసవడు అడగగా  గుర్తుపట్టగలనని అగస్త్యుడు చెప్పెను.  

కొండ కోనలను చీకటి అలిమినట్లు  నిస్పృహ  మనసునలుము కొన్నది. బసవడు అగస్త్యుని ఆఇంటివద్ద వదిలి " ఈ ఇంటినుండి ఎవరైనా పోవుచున్నచో గమనించుచుండుము " అని వేగముగా పోయి ఒక కొరియర్ కుర్రవాడిని వెంట బెట్టుకొని వచ్చెను ఆ కుర్రవాడు ఆ ఇంటి ద్వారము వద్ద నిలిచి తన సంచిలో నుండి ఒక పొట్లము తీసి “రాజు గారికి కొరియర్ వచ్చినది. సంత కము చేసి తీసికొనవలెను.” లిల్లీ వచ్చి రాజు గారు ఇచ్చట ఎవరూ లేరని చెప్పుచుండగా అగస్త్యుడు బసవ ప్రవేశించిరి. వారిని చూడగానే , ఆమె ' ఇప్పుడే బైటకు పోయినారని చెప్పుచుండగా అగస్త్యుడు " చాలా సేపటినుంచి  నేనిచ్చటనే యున్నాను. ఈ ఇంటి నుండి ఎవ్వరూ బైటకు పోలేదు , నావల్ల మీకొచ్చిన ఇబ్బంది , ప్రమాదం లేదు నేను ఆయన తో  మాటలాడుటకు వచ్చితిని , మీరు పిలవకున్నచో పోలీసులని పిలుచుకొచ్చెదను. అను చుండగా అగస్త్యుని గొంతు విని జాన్ బైటకు బైటకు వచ్చి అగస్త్యను బసవడిని లోపలకి తీసుకుపోయెను.  

కొత్త సంస్థ పేరుతో జరుగు చున్న మోసములన్నియూ ఆడిటర్కు తెలియునా ?

అతడి దర్శకత్వమునే ఈ వ్యవహారమంతయూ జరుగుచున్నది.  

మానాన్నకీ విషయములన్నియూ  చెప్పుటకెందుకు సందేహించుచున్నారు  ?

మీరు ఇచ్చటికి అతిధి వలే వచ్చి పోవుచున్నారు. మీకిచ్చటి  విషయములేవియూ తెలియవు  రెండు మాసముల క్రింద 70 లక్షల పిగ్మెంట్ చోరీ కేసు నాపై బనాయించి మీ అమ్మ  నన్ను జైలుకి పమ్పవలెనని చూచెను. 

పిగ్మెంట్ అనగా ?  మత్య పరిశ్రమకు పిగ్మెంట్ తో పని ఏమి కలదు ?

చేపలకు రంగు వేయుటకు పిగ్మెంట్ అవసరము కలదు. 

చేపలకు రంగు వేయుటకు మనకేమిపని ?

మీ అమ్మగారు ప్రారంభించుచున్న కొత్త వ్యాపారము అదియే. 

మీ అమ్మ అనునప్పుడు నాకు మా అమ్మ మీనాక్షి గుర్తుకు వచ్చును , మా అమ్మ ఇటువంటి స్త్రీ కాదు , కావున ఆమెను మా అమ్మ అని సంబోధించ వలదు.  మీ మీద  నమ్మకంతో వచ్చితిని, కొంచెము వివరముగా తెలిపిన గానీ నేను అర్ధము చేసుకొని జాలను 

మీ అమ్మ గారు అదే డైరక్టరుగారు మాతృ సంస్థను మోసపుచ్చి అందునుండి నిధులు కాజేయుటకు కొత్త సంస్థను ప్రారంభించుచున్నారు. మీనాన్నగారికి ఇది ఎంత మాత్రము ఇష్టమే లేకుండెను, అయిననూ ఆయన ఇప్పుడు భార్య చేతిలో  ఒక కీలు బొమ్మే మాత్రమే. ప్రయివేట్ లిమిటెడ్ ను పబ్లిక్ లిమిటెడ్ చేయుట తో ఆమె ఈ మొత్తము నాటకము నకు తెర లేపెను. పబ్లిక్ ఇస్యూ కు పోయిన పిదప పెద్ద ఎత్తున మూలధనం సమ కూరిననూ అన్ని   రకములుగా సంస్థకు చేటు కలిగెను. 

“ఎట్లు కలిగెను?” “పబ్లిక్ లిమిటెడ్ అనగా వాటాదారులకు భాద్యత వహించుట , సంస్థ  లాభ నష్టములను, వారికి చూపుట, ఏన్యువల్ జనరల్ మీటింగ్ నిర్వహించుట , విధాన నిర్ణయముల లో వారిని భాగస్తులను చేయుట, ఇంతే కాక  పబ్లిక్ లిమిటెడ్ సంస్థ లన్నిటిపై  మినిస్ట్రీ ఆఫ్ కొర్పోరేట్ అఫైర్స్ పూర్తి నియంత్రణ కలిగి యుండును.  ఇంతే కాక డైరక్టర్లు కూడా సంస్థపై కొంత నియంత్రణ కలిగి యుందురు. వీరు మంచి వారైన కొంత మెరుగు  కానీ  వీరి కుట్రలకు సంస్థను బలిచేయుచున్నారు      

డైరక్టరుగారు మాతృ సంస్థను మోసపుచ్చి అందునుండి నిధులు కాజేయుటకు కొత్త సంస్థను ఎందుకు ప్రారంభించవలెను?

సంస్థలలో నిధులు స్వాహాచేయుటకు డైరక్టర్లు ఎంచుకొను ఒక రహస్య మార్గము కొత్త సంస్థను ప్రారంభించుట, నిజమునకు ఏ కొత్త సంస్థ నూ ప్రారంభించకుండా కేవలము కాగితములపై  సంస్థ ను చూపి నిధులు స్వాహా చేయువారు కూడా కలరు. కానీ గ్రెస్ మీ నాన్నగారు పర్యవేక్షణ ఉండుటచే పూర్తిగా కళ్ళు కప్పుట అసాధ్యమని గ్రహించి ఇట్లు రంగు చేపల విభాగమును ప్రారంభించి అందు నన్ను ఇరికించారు. నేను పోలీసులకు చిక్కక దాగి యుంటిని. నిజము చెప్పవలెనన్న మీ పై నాకు నమ్మకము లేకున్ననూ కొంత ఆశ యున్నది , మీరొక్కరే గ్రెస్ మోసమును బైట పెట్టగలరు.  

నాపై మీకు నమ్మ కము లేదు అనుట బాధ కలిగించిననూ నిజమును ఒప్పవలెను కదా!

మీకు ఆ శక్తి ఉన్నచో మరొక విషయమును కూడా తెలిపెదను  మీ నాన్నగారికి కూడా మీ పై నమ్మకము లేదు. ఆయన మీకు  చాలా విషయములను తెలుపుటలేదు.

డోన్ట్ బీ సిల్లీ మిస్టర్ జాన్ , మా నాన్న గురించి నాకే చెప్పుచున్నావు , మా నాన్న నన్ను నమ్మి నాతొ అన్ని విషయములనూ చెప్పుట లేదని నీ కెట్లు తెలియును?

హ హ్హా హ జాన్ మెల్లగా నవ్వి " మీరు వచ్చి ఎంత కాలమైనది ?"  " నెల అయినది "

నెల కాలమందు ఎప్పుడైననూ నా సంగతి మీకు చెప్పెనా? "లేదు" "కానీ ఆయనకీ విషయములన్నియూ తెలియును.”  అగస్త్యుని మొఖము పాలిపోయెను.

బసవడు "ఇంతకీ  రంగు చేపలు వ్యాపారము మొదలయ్యేనా? పిగ్మెంట్ దొంగిలించుట గూర్చి చెప్పినారు కదా  అసలు రంగు చేపల వ్యాపారమునకు పిగ్మెంట్కు సమ్మందమేమున్నది ?

చేపలకు రంగు వేయుటను  అలంకరణ చేపల వ్యాపారము లేదా ఆర్నమెంటల్ ఫిష్ బిజినెస్ అందురు . ఈ వ్యాపారము ప్రపంచవ్యాప్తముగా 120 దేశాలలో కోట్లుపైబడి  జరుగుచున్నది.

చేపలకు ఇంజక్షన్ ద్వారా లేదా ఇతరపద్ధతులద్వారా రంగు తెప్పించవచ్చు, అన్నిటికంటే ఉత్తమమైనది పిగ్మెంట్ విధానము. పిగ్మెంట్ ను ఆహారములో కలిపి చేపలకు పెట్టుటవల్ల రంగు మార్చవచ్చు, కానీ పిగ్మెంట్ చాలా ఖరీదైనది  1. 4 కోట్లు విలువచేయు  38 మెట్రిక్  టన్నుల  నీలి  పిగ్మెంట్ కొన్నట్టు చూపుచున్నారు. అదెంత నిజమో  ఆ ప్రభువుకే తెలియవలెను. అందు 70 లక్షల విలువజేయు  19 మెట్రిక్  టన్నుల పిగ్మెంట్ నేను కాజేసినానని నాపై పిర్యాదు చేసినారు.

బసవడు “మీరేమి చదువు కొన్నారండీ ? మీకు గ్రెస్ ఏమగును ? 

“ ఎం ఎస్ సీ  ఫిషరీస్, గ్రెస్ నా మేనకోడలు”

బసవడు “ఇంతకూ మీ మేనకోడలుకు తన భర్తనే మోసము చేయపనేమున్నది ఆ ఆస్తి అంతయూ తనదే కదా?” 

అది నాకు తెలియదు , వారిమధ్య చాలా గొడవలే జరిగినవి. అవన్నియూ నాకు తెలియవు.

 మీకు మావల్ల వచ్చిన భయము ఏమియూ లేదు, మేము పోలీసులకు తెలుపువారము కాదు  



Bharatavarsha 98

రజొరీ గార్డెన్స్  నందు మహా సంద్రము వలెనుండు విశాల  వస్త్ర గృహోపకరణ  విపణి శ్రేణులు  ,ఇంద్రభవనపు మెరుపు లందిపుచ్చుకొని  దేవశిల్పి నిర్మితమా అనునట్లు   అలంకరణయందు అంతిమతీరము చేరి సందర్శకులకు మనో రంజన ముగావించుచుండెను.  విదిష వర్షలు ఢిల్లీ మెట్రోనందు రాజొరీ గార్డెన్స్ వద్ద దిగి అచ్చటకు అతి సమీపములోనున్న పర్వతముల వలెనున్న పెను విపణులను గాంచి అబ్బురపడి పసిఫిక్ మాల్ లోనికి ప్రవేశించిరి. 

వారి వెనుకనే మగనితో  ప్రవేశించిన దామిని వారిని చూచి " వర్షుడు ఇప్పుడు శ్రీమంతుడయ్యెను ఎంత ఠీవి ఉట్టిపడుచున్నదో  చూడవలెను. విదిషను చూచినచో మహారాణి వలె నగుపించుచున్నది.”  అదివిన్న రాకి  “విదిష వెనుకకు తిరుగుచున్నది ఇటురమ్ము” అనుచూ దామినిని చెయ్యిపట్టుకొని వస్త్రములు వ్రేళ్ళాడదీసిన ఒక  ఒక చట్రము  వెనుకకు కొనిపోయెను. "  సాబ్ ఇదర్ కొనే కోనేమే  సి సి కెమెరాస్ లాగా హువాహై " అని అచ్చట పర్య వేక్షకుడు  వారికి చెప్పగా ఖంగు తిని  రాకి " మేము చోరులవలె కనిపించుచున్నామా ?" అని అడుగగా అతడు అచ్చటనుండి వెడలిపోయెను. “విదిష వర్షుడు చెట్టాపట్టాలేసుకుని తిరుగుచున్నారు అని మరల దామిని చెప్పుచుండగా” " మంద మతి వలే నున్నావే  మనము విశాఖ పట్నము పోవుచున్నామని మొన్ననే చెప్పినాము కదా , ఇప్పుడు వారు చూచినా మాట పోవును, వారు మనను చూచినా చూడవచ్చును , రమ్ము ఇంకొక చోటకు పోయెదము " అని రాకీ దామినిని  లాగు చుండగా వర్షుడు చూచి విదిష చెవి కొరికెను. " విదిష ఉలిక్కి పడి వెనుకకు తిరగకనే క్రీగంట వారిని చూచి అమ్మ ఎంతకు తెగించినారు , ఈ వయసులో అసత్యములాడుటకు సిగ్గుండవలెను." విదిష  తెగుడుచుండగా  వర్షుడు "ఆ దామిని మాఅమ్మ మంచి స్నేహితులు,  మా అమ్మకి ఈవిషయము చెప్పిననూ చెప్పవచ్చు.”  “అయినచో మనము పై అంతస్తునకు పోయెదము” వారట్లు పై అంతస్తు పోవుటకు గాజు తలుపులుగల  లిఫ్ట్ వద్దకు పోవుచుండగా అద్దములనుండి కేశవుడు రంజిని కనిపించిరి.  వర్షుడు వచ్చినంత వేగముగా విదిష చేతినందుకొని  వెనుకకుపోయి "భ్రమణ సోపానముల పై నిలిచి పోయెదము" అని  మార్గము  మార్చి   రెండవ  అంతస్తుకు పోయెను. “అదృష్టము బాగుండెను ఆ గదికి గాజు తలుపులుండెను లేనిచో…” అను చుండగా  ఆ గది నుంచి బైటకు వచ్చిన కేశవుడు రంజినితో " తృటిలో ప్రమాదం తప్పెను , గురువు గారు  చూచుకొనక   లోనికి ప్రవేశించినచో మొఖమెట్లు చూపగలము." అదివిన్న రంజిని “ మీ గురువేమైననూ వంటరిగా వచ్చెనా  లేక తల్లితో వచ్చెనా! అయ్యూ  క్రిందకు ఎందుకు వచ్చినామో మరిచినాము. మూడవ అంతస్థులో మగవారి బట్టలు కలవు నీకు వలసినవి నీవు ఎంచుకొనుము, పిదప నేను ఎంచినవి కూడా ..” అ  హ్హ హ్హ హ్హ  సరికొత్త నాగరిక ఉడుపు లందు చూడవలెననున్నదిఅంటివి కదా  అవి ధరించి నిన్ను ఆనందింపజేసెదను.”   కేశవుడు అనెను. మరల వారు లిఫ్ట్ నెక్కి మూడవ అంతస్తు కు పోయిరి.   

విదిషా నీవు  నలుపు చేతుల పై వస్త్ర ము ఎరుపు లంగా తీసుకొనినచో బాగుండును " ఛీ ఇట్టి నవనాగరిక వస్త్రములు ఇంటివద్ద  ఎట్లు ధరింతును " ఆ సంగతి నేను చూచుకొందును, ఢిల్లీలో ఒక్క సారి ధరించి చూపుము చాలును" అనగా ఢిల్లీ  దాటిన పిదప పారవేయమందువా?"  వర్షుడు అలక నటించెను. విదిషకు వర్షుని అలక కొత్తగా నున్నది  “నీవింత మారాము చేసినచో సరే అటులనే ధరింతును.” “ఆ వస్త్రములు  ధరించి ఒక సారి చూచుకొనుము , అచ్చట వస్త్రములు ధరించి చూచుకొనుటకొక గది  కలదు.” పిదప శ్వేత వస్త్రములు, సాగర కన్య చేలము , ఈతకొలను వస్త్రములు  విదిశకు కొనిపెట్ట గా   పిదప విదిష వర్షునకు  వస్త్రములను ఎంపిక చేసెను.   నీలి రంగు సూట్  ముక్కుపొడుం రంగు చొక్కా , గోధుమ రంగు పంటలాము , ఆకాశము రంగు పంటలాము  తెలుపు రంగు చొక్కా ఇట్లు    తనకు నచ్చిన వస్త్రములను వర్షునకు ఎంపిక చేసెను.   ఆ పిదప వర్షుడు  విదిశకు అధునాతన లోదుస్తులను కూడా  కొని ఇచ్చెను.

  కేశవుడు డబ్బు చెల్లింపుల వద్దకు చేరి చుట్టూ  చూచుచుండెను రాకి  దామిని కూడా వలసిన వస్త్రములను తీసుకొని అచ్చటకు చేరుచుండిరి కేశవుడు రాకి  ఒకరినొకరు చూచుకొనిరి. కేశవుడు రంజిని చెవులో గుసగుసలాడెను.   రంజిని " అటువర్షుడు సాహిత్యమును  ఇటు రాకీ రోగులను వదిలి ఊర్లపైబడి ఎట్లు తిరుగుచున్నారో చూడుము.” వెంటనే రాకి  వస్త్రముల చట్రము వెనుకకు పోయి దాగెను. దామిని అతడివెనుక పోవుటకు బదులుగా మరొక కోణమందు నక్కెను. " ఏయ్ మిస్టర్ ఇది ఆట స్థలము కాదు ఇచ్చట  దాగుడు మూతలు ఆడుట తగదు " అని పర్యవేక్షకుడు రాకిని మందలించగా రాకి అతడిని మిర్రి మిర్రి చూచెను." నేను హృదయాలజిస్ట్ ను తెలుసా!" అని రాకి  అతడితో చెప్పుచుండగా దామిని వచ్చి కొన్న వస్త్రముల సంచులు పర్యవేక్షకు ని కిచ్చి చెల్లింపులవద్ద ఆగక మగని బైటకు తోలుకొని పోయెను.   " ఈ కేశవుడు  మద్దెలు వాయించుకొనక  ఇట్లు నన్ను వాయించుచున్నాడు , ప్రక్కనే ఉన్న వెస్ట్ గేట్ మాల్ కి పోయి వలసిన వస్త్రములు తీసుకొని పిమ్మట మెహరోలీ పోయి  కుతుబ్మినారు చూచెదము." " కేశవుడు రంజిని అచ్చటికి వచ్చినచో? వీరు కూడా నగర  సందర్శనము చేయకుందురా !  " అని దామిని ప్రశ్నించెను.  రాకీ కొద్ది  క్షణములు  ఆలోచించి  "వద్దు మనము కుతుబ్ మినారు పోవలదు లోటస్ టెంపుల్ కు పోయెదము, అది అద్భుత అంతర్జాతీయ కట్టడము ఈ కేశవుడు బుర్ర అంతవరకూ సాగదు వీడు కుతుబ్ మీనారు లేదా అక్షరధామ్ వంటి ప్రదేశములను చూచును ." 


దామిని వెడలిన పిదప కేశవుడు ఊపిరి తీసుకొనెను. తదుపరి కేశవుడు చెల్లింపు పూర్తిచేసి పోయినపిదప ఒక బట్టల గుట్ట వెనుక దాగిన వర్షుడు విదిషలు ఊపిరి తీసుకొనిరి. " ఈ రోజు దక్షిణాది వారికి ఆట దినము వలే నుఉన్నది, అయినచో  అందరూ ఇచ్చటికి వచ్చి ఏల ఆటలాడవలె. మైదాన్ మే క్యోన్ నహీ ఖేల్తే !? " అని అని పర్యవేక్షకుడు వర్షుని ప్రశ్నించగా వర్షుడు తొణకక " బిల్ కుల్  సాహి సవాల్ హై భాయ్ సాబ్,  మగర్  ఆంద్ర లోగ్  మైదాన్ నహీ ఖేల్తే, నయే  కప డోన్ కే సాత్ కుచ్ ఉచల్, ఉచల్  కరనా హమారా రివాజ్ ( సంప్రదాయము) హై !”  “ఓహ్ ఐసా బోలోసాబ్!”  డెబ్బది వేలు కార్డు  చెల్లింపు గావించి వర్షుడు విదిషను తీసుకొని లీలామహల్ పేలస్ కి పోయి గది  తీసుకొని పిదప ఎచ్చటికి పోవలెనో ఆలోచించెదము అని టొయోటా వాహనమును రప్పించి విదిష తో లీలామహల్ పేలస్ కు చేరెను.

                                                                                ***  

                     

కల్కాజి ప్రాంతమందు ఇరవయ్యవ శతాబ్దపు తాజమహల్ గా పేరుగాంచిన , ప్రపంచ ప్రసిద్ధి కెక్కిన పాలరాతి పుష్పము బహాయ్ టెంపుల్. పద్మాకారంలో నుండు టచే దీనిని లోటస్ టెంపుల్ అని కూడా అందురు. పర్షియా  దేశపు శిల్పి సభా బహుళ మతముల వారి విస్వాసములను చూరగొనుచు దీనిని సృజించెను. గిన్నీస్ పుస్తకమందు స్థానము సంపాదించుకొన్న అతిపెద్ద దేముడు లేని దేవాలయము బహాయ్ టెంపుల్. “మనసును శాంతపరుచు ఈ పచ్చిక , ఈ పచ్చదనము వేరెచ్చటనూ కానరాదు” అని కేశవుడు అనగా “లోపలి పోవలెనని లేదు ఇచ్చటనే ఈ ప్రకృతియందు పరవసించెదము” అని రంజిని అనెను. వారు కొంత సేపు పచ్చికలో మరి కొంత సేపు సోపానముల మీద కూర్చొనిరి.  అనేక మంది పిన్నలు పెద్దలు వివిధ రాష్ట్రములు నుండి వచ్చిన సందర్శకులు సేదతీరు చున్నారు. విదేశీ సందర్శకులనేకులు అబ్బురపడి ఛాయాచిత్రములను గ్రహించుచున్నారు. “ప్రపంచమందు ఏడు  బహాయి దేవాలయములు కలవు . ఢిల్లీలో ఒకటి, మిగిలిన ఆరుగురు ఆస్ట్రేలియాలోని సిడ్నీ, పనామాలోని పనామా సిటీ, వెస్ట్రన్ సమోవాలోని అపియా, ఉగాండాలోని కంపాలా, జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ మరియు  అమెరికా లో విల్మెట్ వద్ద ఉన్నాయి.” ఎవరో  ప్రపంచమును చుట్టివచ్చిన విదేశీ జంట మాట్లాడుకొనుట సోపానములపై కూర్చొనిన రంజిని చెవులపడినది“హైదరాబాదీయుడు ఈ పద్మమందిర మునకు వలసిన స్థలమును సమకూర్చెనని ఎంత మందికి తెలియును అతడు తన జీవిత కాలమందు సంపాదించిన దంతయూ ఈ మందిరము  ధారబోసెను. అని రాకి అనగా "  తెలుగువారి దొడ్డ మనసు ఆ చంద్ర తారార్కమూ నిలిచెను కదా!  ఇది  వినినచో తెలుగు వారి  ఆణువణువూ పులకరించ కుండునా!” అని దామిని అనెను . వారిరువురూ సోపానముల పై నుండి లేచి లోపలికి ప్రవేశించిరి.

 కేశవుడు రంజిని కూడా సోపానముల పై నుండి లేచి లోపలికి  లోపలి పోయిరి. లోపల మహా సంద్రము వంటి ఖాళీ గది . వందలాది సౌకర్యం వంతమైన కూర్చొను చెక్క బల్లలు ఆ మహార్ణ మంతయూ కనిపించుచున్నవి. కేశవుడు రజిని ప్రక్క ప్రక్కనే కూర్చొని  ఆ నిశ్శబ్ద వాతావర్ణమును ఆస్వాదించు చుండిరి.  మనసును దోచు శిల్పమయ పద్మదళముల వలే నొప్పు పైకప్పు. ఇచ్ఛటంత యూ మౌనసాగరమువలె నున్నది. గుండె చప్పుడు వినిపించుచున్నది  కేశవుడు తల త్రిప్పి చూడగా  కొద్దీ దూరములోరాకి కనిపించెను. 

 అట్లు ఒక గంట గడిచిన పిదప బాహ్య స్పృహలోకి వచ్చిన రంజిని కేశవులు మందిరము బైటకు వచ్చిరి " నాలో ఈ వాతావరణము నవ చైతన్యమును నింపెను . మనమిప్పుడు పేలస్ కి పోయెదము " అని రంజిని అనగా కేశవుడు " సరే " అనెను. వారి వాహనము లీలామహల్ పేలస్ కు బయలు దేరెను

                                                                ***  

ఇంటివద్ద ఇవన్నీ కట్టి చూచుకొన వలెనన్న  సంవత్సరమాగవలెను. అందుచే ఈ లీలా గృహమునకు వచ్చినాము.  నా బుర్ర లో వేరు కుతంత్రములేమియూ లేవు.   పెళ్లి అయిన పిదప  గయ్యాళిలిరువురూ నన్ను ఇటువంటి ఉడుపులు తొడగనిత్తురా?  నా ప్రాణము తీయుచున్నారు !" అని విదిష అనెను. "  వారు నీకు ప్రాణ కంటకముగా యున్నారా, అయినచో నేనానంద నిలయమునకు స్వస్తి చెప్పవలెనా ?" " విదిష నా మనసు తనువూ ఆనంద నిలయమునకు నీకు  అంకితమైనవి, అరుణతార , అహల్య స్థానమును స్వీకరించెను, ఇంక మాలిని మన బిడ్డ ఆమెను బాధ పడనిత్తునా !" అని విదిష  ఉద్విగ్నతతో, ప్రేమాతిశయమున  చెప్పు చుండగా  వర్షుడు "  మరి నన్ను పడనిత్తువా !  ఒక గంట నుండి బతిమాలుచున్నాను ,  ఈ ఎరుపు లంగా,  నలుపు చేతుల పై వస్త్రమును ధరించి చూపిన తరింతును."  విదిష  వర్షుని వంక ఓరగా చూచి అయినచో బతిమాలుము"అనెను.  " బతిమాలుచున్నాను కదా!" అట్లు కాదు చుబుకము చేగొని  బ్రతిమాలవలెను "  అని విదిష అనగా  వర్షుడు కలవర పడి మగవానితో ఇట్లే నడుచుకొందువా?" అని అడుగగా  అప్పుడు విదిష " సత్యభామని రంగ స్థలంపై కాళ్ళు పట్టుకొన్న  మగాడికి గదిలో నా గెడ్డము పుచ్చుకొనుట కష్టముగానున్నదా?  కృష్ణునివలె పాడి అడగవలెను" అని ఆజ్ఞాపించగా ఆజ్ఞానువర్తియై వర్షుడు    నా పాడి తెలిసి పాడి అడుగమనుట పాడి కాదు పాడవలెనన్న పాడు పాటేల దొరకదు కృష్ణ,  కృష్ణ శోభ మాటున దాగె కృష్ణ ఘాటు, నీవది  మనసులో పెట్టుకొన్నచో తప్పునా! అని విదిష చుబుకము క్రింద చేతినుంచి రంగస్థలము పై భామ కొరకు పాడిన  పాటను గుర్తు తెచ్చుకొని హృద్యముగా ఆలపించగా విదిష

 " కొత్త వస్త్రములతో  కొత్త ప్రదేశములు చూడవలెను." అందులకా నీవీ ఆధునిక వస్త్రముల నెంపిక చేసుకొన్నది! ఏమో అనుకుంటిని రసికుడవే! అనుచూ మూతి మూడు వంకలు తిప్పి  ఓరకంట చూపు విసిరి ఆ వస్త్రములను ధరించి  తెరలచాటున నిలిచి తన అందమును చూపెను. " మబ్బుల  చాటున దాగిన అందాల జాబిలి  నీ సోయగ రేఖలు తాకగా వికసించే నా హృదయ కమలము  "  అని మైమరచి పాడుచున్న వర్షుని స్వరము విని వారి గదిని దాటి పోవుచున్న కేశవుడు " ఇది  స్వరము వలే నున్నదే యని  తలుపు తాళపు చెవి కన్నము నుండి వర్షుని చూచి చకితుడయ్యెను . 

రంజిని  కేశవుడు గది బైట నిలిచి యుండిరి గదిలోపల “   నీలిమేఘ కాంతి  నెలవైన నెరజాణ కురులు జారవిడిచి  కులుకుచుండ నీలోత్పలమేల పాలమీగడ మునిగె చూచు వారి కనులు మురియుచుండె” అని పాట  వినిపించెను. గది బైట కేశవుడు రంజినితో  “ఏమీ   కవితా మాలినీ ప్రవాహము!  ఆహా! సుస్వరమున సాగు అధిపుని    కవితా గాన మాధుర్యము వీణా నాదము వలె  నుండి హృదయము పులకరించుచున్నది.” గాన మాధుర్యము బాగుగానే యున్నది కానీ  గదిలో జరుగుచున్నదంతయూ కళ్ళకు కట్టుచున్నది మన మిచ్చటుండి  వినుట తగదు , లోటస్ టెంపుల్  ప్రశాంత  వాతావరణము   నా నాడులందింకనూ ప్రవహించుచున్నది. మనమూ గదిలోకి పోయి ముచ్చట లాడుకొని పరవసించవలెను అని కేశవుని లోనికి కొనిపోయెను. మాలిని ప్రవాహము అనుచున్నావు అతడి తల్లి గూర్చి చెప్పుచున్నావా ? " మాలిని అనునది  గంగకు మరో పేరు"

అన్ని వస్త్రములు ధరించి చూపితిని కదా ఇంక పోయెదమా " ఇంకనూ ఇంకొక్కటి మిగిలి యున్నది" అని వర్షుడు విదిష చేతికి ఒక అట్ట  పెట్టెను అందించగా " విదిష దిగ్భ్రాంతి నొంది "  వర్షుడు కొన్న లోదుస్తులను ధరించి ద్రాష్టిగ కేశములు నడుముపై పారాడుచుండ, వక్ష,నాభి, ఊరువు లందము ఊరించుచుండ  విదిష తెరల చాటుగా  రతీదేవివలె నిలిచెను" కాంక్షాపూరిత నేత్రములతో ఆమెను చూచుచున్న వర్షుడు "అట్లు సిగ్గు   పడి తెరల చాటున దాగినచో నేనేమి చూచెదను? ఆధునిక యుగమున యువతులెట్లున్నారో చూచితివా?  "ఇప్పుడు ఇంతకన్న నేనేమీ చూపలేను,"  అట్లు చూపు యువతి యున్నచో దానితో ఊరేగుమ." ని క్షణములలో చీర కట్టి ప్రత్యక్షమయ్యెను. 


Tuesday, December 22, 2020

Bharatavarsha 97

న్యూఢిల్లీ  చాణక్యపురి : శిశిరము తుషారమును  జల్లు చుండెను. నగరమును పొగమంచు అల్లుచుండెను.  ఢిల్లీ దారులు  మసక బారినవి.   దూరమునున్న వా రెల్లరూ  తెల్లని  వస్త్రము మాటున దాగి నట్టు  మసక మసకగానగు పించుచున్నారు.  ఆకాశమున మబ్బులలిమినవి.  లీలామహల్ పేలస్ 5 వ అంతస్తు మేడపై నిలిచి చూచుచున్న కేశవునకు బాల భానుని రేఖలు ఆ పొరలను చీల్చుకొని నీటి ధారలవలె ఎగయుచు కనిపించుచుండెను. భవంతులు ఉల్లిపొర కాగితము నందు చుట్టబడిన బహుమతులు వలే కనిపించుచుండెను. భారత రాజధాని యందు రాయభార కార్యాలయముల కాలవాలమై రాచఠీవిని వొలకబోయు చాణక్యపురి నందు ఇండియా గేట్, అక్షర్ధామ్  కన్నాట్ ప్లేస్ మరియు  లోధి ఉద్యానవనముల సమీపంలో, సౌందర్య వ్యాయామ శాలలుతో పాటుగా మిద్దెపై ఈతకొలను గల ఏకైక విలాసవంతమైన హోటల్ లీలామహల్ పేలస్.  మేడదిగి తన గదిలోకి పోవుచూ ప్రక్కనే వున్న  రంజిని గదివైపు చూసేను. ఆమె గది తలుపు వేసి యున్నది.  కొలది సేపు చూసి తలుపు కొట్టగా రంజిని తలుపు తీసెను. కేశవుడు లోనికి పోక తలుపు వద్దనే యుండెను. 

“ఇచ్చట విదేశీ రాయబారులు, ఇతర దేశ ఉన్నతాధికారులు కేంద్రమంత్రులు బసచేయుదురు, మనమున్నచో డబ్బు మంచినీటి ప్రాయముగా ఖర్చుచేయవలెను అని చెప్పిననూ వినక మీరు దినమునకు పన్నెండు వేలు అద్దె చెల్లించు చూ  వేర్వేరు గదిలో మన బస ఏర్పాటు చేసినారు.” అని కేశవుడనగా “ఒకే గదిలో ఇరువరము యుండుట నీకు అసౌ కర్యముగా నున్నది కదా! నీ సౌకర్యముకొరకు  డబ్బు లెక్క చేసెదనా!”

 “ఇచ్చట ప్రెసిడెంట్ స్వీట్ యను ఒక రాచ గృహము ఒక రాత్రికి  మామూలు ధరలో ఏడున్నర లక్షలు, తగ్గింపు ధరలో ఐదు లక్షలు ఖరీదు చేయును. నాకు వలసినచో అదియునూ తీసుకొందురా?” అని కేశవుడు అడగగా “వేర్వేరు గదిలో  బసచేయుచున్నాము పైగా మీరు అనుచున్నావు ఇంకా ఇచ్చట ఉండుట ఏల? నేడే హైద్రాబాద్ పోయెదము రెండు మనసులతో ఇచ్ఛటుండిన  లాభమేమి?  అని రంజిని తలుపు వేసెను. కానీ కేశవుడు తన గదికి పోక ఆ తలుపు వద్దే నిలిచి యుండెను . ఒక అరగంట గడిచిన  పిదప కోపము చల్లారిన రంజిని తలుపు తీసి చూడగా జాలి గొలుపు మోహ ముతో కేశవుడు రంజిని వంక చూచుచుండెను. రంజిని లోపలకి రమ్మని చేయిపట్టుకుని కొనిపోయి సోఫాపై కూర్చొండ బెట్టెను. కొంత సేపు మౌనము వహించెను. వివర్ణమైన రంజిని వదనమును ఆమె మనోవ్యధను గమనించు చుండెను. గది అంతయూ నిశ్శబ్దమలుముకొనెను. 

నేను లేమినుండి వచ్చితిని , నా కుటుంబ నేపద్యము తెలియదు తార , మాలిని మరియు మీ వంటి  అమ్మలు ఆదరించుటచే కళ యందు జీవితము లభించెను. నాకు మీవంటి వారిని చూచిన భయము సహజమే కదా! 

మీరు కోరినచో శ్రీమంతులెందరో మీ చేయి అందుకొనుటకు సిద్ధముగా నుందురు. " నన్ను విడిచి పోయిన వాడు కూడా శ్రీమంతుడే , నాకు శ్రీమంతుడు కంటే గుణవంతుడే ముఖ్యము. మన వయో భేదములనెఱిఁగిన పెద్దలెవరైననూ  మన బంధమును అంగీకరింతురా?  ప్రేమ విషయమున ఒప్పు మెప్పులు  గణింప పని ఏమున్నది ?    చేయు ప్రతిపనిని ఇతరులు  ఒప్పుకొనుట మెచ్చుకొనుట ఆశించిన మనను మనము కించ పరుచుకొనుటయే. నేను మీనాక్షి వలె  పాతివ్రత్యమునాచరించలేను.  అరుణతార వలే వంటిరి  జీవితమును గడుపజాలను.  మీనాక్షి సంగతి నీకెట్లు తెలియును. మీనాక్షి సంగతి అప్రస్తుతము , ముందు నీ సంగతి తెలుపుము.  

  నేను మాలిని తారలవలె అమ్మ అనిపించినచో నీ గదికి పొమ్ము లేనిచో .. రంజిని  మాట పూర్తి చేయక మునుపే కేశవుడు ఆమె చేతిని పరిగ్రహించెను . " ఒకసారి అందుకొన్నచో చేతిని విడువజాలను " అని చెప్పుచుండగా " నువ్వు విడిచిననూ నేను విడవనిత్తునా ?" అని రంజిని అనుచుండగా కేశవుడు కొంటెతనమును గ్రహించి ఆమె పిరుదుల క్రింద తన రెండు బాహువులను   బిగించి  పైకి ఎత్తిగిరగిరా త్రిప్పసాగెను. రంజిని శరీరము గిరగిరా గాలిలో తిరుగుచుండగా ఆమె కురులు నీటి యందలలవలె విస్తరించి అల్లాడుచుండెను. రంజిని కిలకిలా రావములతో గది  అంతయూ నిండిపోయెను.  ఆమె కురులయందు దాగిన కుసుమ సువాసన కేశవుని నాసికా పుటములను తాకి మరులు గొలుపుచుడెను. ఆ మత్తునందు వివశుడైన కేశవుడు క్రమముగా ఆమె  ఘన నితంబములొత్తుకొన క్రిందకు జార్చెను.  

కేశవుడామెను మెల్లగా జార్చుచుండగా పట్టువలె మెత్తని ఆమె ఆమె దేహమంతయూ అతడి దేహమునకు రాసుకొనెను. చెకుముకిరాళ్లు రాపాడ నిప్పు కణికలు పుట్టవా! వారి దేహములు మోహ హవనమందు కాగి వేడెక్కినవి. ఆమె కాళ్ళు నేలను తాకిననూ కేశవుడు ఆమెనింకనూ కౌగిట బంధించి వదలలేకుండెను. ఆమె పయోధరములు అతడి ఛాతీని అదుముకొనగా అతడి పెదవులు ఆమె పెదవులనందుకొన్నవి. అట్లు ఒండొరులు , కౌగిలించుకొని , చుంబించుకొని మైకముగొని అట్లే నిలిచి యుండిరి. 

కేశవుడు తన గది ఖాళీ చేసి రంజిని గదిలోకి ప్రవేశించెను. పిదప ఇద్దరూ మిద్దెపైగల కొలనులో ఈదులాడి క్రిందకు వచ్చిరి. రంజిని అద్దము ముందు నిలబడి  చీర ధరించి " కేశవా ఈ రవిక ముడి వేయుము  , అని కేశవుని పిలవగా కేశవుడు వెనుకనుండి రవిక ముడివేసెను. నేడు మనము రాజొరీ గార్డెన్స్ నందు గల లైఫ్ స్టైల్ మాల్కి పోయి షాపింగ్ చేసెదము.    

BBC – Welcome to Literary India. A no holds barred discussion on the influence literature on the Indian society. I am Ben Brown.   One of the top literary personalities from India recipient of Sahitya akademy award Bharatavarsha is with us to talk about the influence literature on the Indian society.

అరుణతార మాలిని పక్క పక్కనే కూర్చొని కార్యక్రమమును  చూచుచుండిరి, విదిష రతీదేవి వలే వచ్చి వారిరువురికి కాఫీ ఇచ్చి మేడపైకి పోవలెనని యోచించుచుండగా, మాలిని "అట్లు తేరిపార చూడక నీవునూ మాతో కూర్చొని కార్యక్రమమును చూచి ఆనందింపుము" అనెను. విదిష వారిని అట్లే చూచుచుండెను, అరుణతార ముసిముసి నవ్వులు నవ్వుచూ “పాపము మేడపైకి పోయి కాఫీ ఇచ్చి రావలెననున్నదేమో!” అనగా మాలిని “ఏవమ్మా నాకొడుకుని కాళ్ళరుగునట్లు గిరా గిరా త్రిప్పుచున్నావు , ఇంటి పట్టునుండుట తక్కువ తిరుగుడు  ఎక్కువ అగుచున్నది. మూడు దినములు తెగ  తిరిగినారు కావున నేడైననూ ఇంటివద్ద ఉండనిచ్చెదవా?” “నాదేమున్నదత్తా మీ అబ్బాయి ఇష్టము” ఆహా హాహా ఎంత నంగనాచివే  మొన్న బొంబాయి పోయి వచ్చి ఇచ్చట గుడికిపోయినామని చెప్ప మని  వాడికి మప్పి తెచ్చినావు. అవ్వ ! ఎంత విడ్డూరమమ్మా  అచ్చట కార్యక్రమము జరుగుచుండగా అందరి ముందూ ముద్దులిచ్చుట , అది పత్రికలలో వచ్చుట  తల కొట్టేసినట్లయినది.

అరుణతార "ఏవమ్మోయ్! పెండ్లి కాకముందే కాబోవు కోడలిని ఇంత రాచిరంపాన పెట్టుచున్నావు , పెండ్లి అయిన పిదప వారిని కాపురము చేయనిత్తువా?" అని మాలినితో అనెను , పిదప విదిష వైపు తిరిగి " నీవు పోయి వర్షునికి కాఫీ ఇచ్చి వెంటనే దిగి రావలెను. మనమందరమూ కలిసి ఈ కార్యక్రమము చూడవలెను "

Why do you think that Bhakti alone triumphs in modern time?
Well, we see people violating law leave alone morals  morals are for preaching, when strict laws are made we also see people protesting against  them. But we all see people following their fundamental religious  beliefs  or say superstitions. Bhakthi is faith, creating Bhakthi is creating faith in the hearts of the people. Hardly there are a few people who don’t leave foot wear outside when they enter the temple. This is the actual faith. That is the idea behind Bhakthi Vijayam. 
Correspondent : Thank you Mr. Bharatavarsha.

విదిష లోపలి పోయి వర్షుడు వ్రాసుకొనుచూ కూర్చొని యున్న వర్షుని చూచి వయ్యారమంతయూ ఒలక బోయుచూ  గాజులు చప్పుడు చేసెను  వర్షుడు  తల ఎత్తకనే  " అచ్చట బల్లపై నుంచిన  త్రాగెదను "  అనెను. విదిష సరే నీకిష్టమైన పీతాంబరములను ధరించి వచ్చితిని, చూచుటకిష్టము లేకున్నచొ పోయెదను, క్రిందనే అత్తగారు ఎదురు చూచుచున్నారు " అని వెనుతిరగగా వర్షుడు పులి వలే దుమికి విదిష నడుము అందుకొని " అయ్యూ ఇష్టము లేక కాదు నిన్న ఒక ప్రమాదం సంభవించెను , నిన్న మా అత్తగారు  అదే అరుణ తార కాఫీ  తెచ్చినారు , అది తెలియును కదా , " అవును తెలియును . "అప్పుడేమయినదో తెలియునా?" " ఏమైనది ?" అని విదిష అడగగా " అయ్యో చెప్పుటకు సిగ్గుగా యున్నది, యధాప్రకారము తలుపుచాటున నక్కి వెనకనుండి నడుము గిల్లి వాటేసుకొన్నతరువాత వచ్చినదెవరో తెలిసెను.  "ఛీ ఛీ అందుకనే నిన్న నన్ను అంత  ఆట పట్టించి నారు" అను చుండగానీ వర్షుడు వెనుకనుండి వాటేసుకొని చెవిలో " కొత్త ప్రదేశమలు చూడవలెనని యున్నది " అనగా " అటులనే  నేడెక్కడికి పోవలెను ?" అని అడిగెను
నేను అనుచున్నది ఢిల్లీ లో కొత్త ప్రదేశములగూర్చి కాదు అని వర్షుడు అనగానే " అయ్యో , నావర్షుడేనా , ఇట్లు మాట్లాడుచున్నది అవ్వ  ఇంక వివాహము  జరుగువరకు నీకు దూరముగా  ఉండవలెను బాబు! నీవద్దకు నేను రాను.  అని విదిష పరుగు లంఘించుకొనెను. " ఏయ్  పిల్లా  రాజొరీ గార్డెన్స్ పోయెదము.  నీకు నూతన వస్త్రములు కొనవలెను." అని వర్షుడు అనగా విదిష ముసిముసి నవ్వుల క్రిందకు సాగెను.


Sunday, December 20, 2020

Bharatavarsha -96

ముంబై లకుమ నివాసము: పండిత్ : నమస్తే మేడమ్

లకుమ: పండిత్ , డైనేజ్ బ్లాక్ అయి నీరు నిలిచి పోయినది ప్లంబర్ వచ్చి చూసి మరల వచ్చెదనని  పోయినాడు,  వీరితో పెద్ద చిక్కయిపోయింది , పదిసార్లు పిలిచిన గాని రారు, వచ్చిన పిదప పని సగము చేసి పోయెదరు 

రోహిత్  "జుహు బీచ్ దగ్గర  అపార్ట్ మెంట్ తీసుకుంటే  ఈ బాధలుండవు కదా , ఈ ఇండివిడ్యు వల్ బిల్డింగ్ తీసుకుంటే ఇలాగే సమస్యలు తప్పవు"

 రోహిత్ నిన్ను ఇంటి మేనేజర్ గా పెట్టుకున్నది ఇవి చూసుకోడానికి కదా , నీ పని చేయడం చేతకాక  నాతప్పులు వెతుకుతున్నావా , ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ ఇంకోక్కసారి ఇలా మాట్లాడితే క్షమించేదిలేదు. ఇదంతయూ విన్న పండి త్ ఇపుడే వచ్చెదనని విసవిసా బైటికి బోయెను. తోటలోనుండి  పొడవాటి రెండు వెదురు బద్దలు తీసుకువచ్చి వాటిని ఒకదానికొకటి కట్టి తూమునందు పొడిచి అడ్డుతొలగించెను. స్నానముల గది  శుభ్రపరిచి  " నేడు మీరు ప్రశాంతముగా ఉండవలెను మీ రెండవ చిత్రము విడుదలగుచున్నది , నేడు మనము ప్రివ్యూ కు పోవలెను. 

పండిట్ ఇదంతయూ నీ పని కాక పోయినా  చక్కగా చిటికల్ చేసావు . ఎలా సాధ్యం ? ప్లంబర్ చేయలేక , అవస్థ పడుచుండగా, ఇంత బాగా ఎలా చేసావు ? 

ఏమీలేదు మేడం దీనికి  నైపుణ్యత కంటే  ఆ పొడవాటి వెదురు బద్దలు ముఖ్యము. అవి చావలా బజారునందు దొరు కును . నేను  ఇటువంటి పరిస్థితిని ఊహించి ఎప్పుడో కొని మన తోట యందు భద్రపరిచితిని. నేడవే అక్కరకు వచ్చి నవి. ప్లంబర్లు కి నైపుణ్యత  ఉన్ననూ నిజాయతీ లేక పోవుటచే  మీకే సమస్యలు పునరుత్పన్నమగుచున్నవి.   

 నీ ముందుచూపు ప్రశంసనీయము, అదే నీ ముందు చూపును మెచ్చుకుంటున్నాను అసలు ఇంతవరకూ నీమీద కోపము రాడానికి అవకాశం కూడా ఇవ్వలేదు నువ్వు. పండిత్ నవ్వుచుండగా దూరవాణి  మ్రోగినది  “మేడం షూటింగ్ పే చలేగయి, మేడం బహుత్ బిజీ రహతే ముజ్ సే బాత్  కీజియే అని పండిత్ దూరవాణి యందు ఒక కాబోవు దర్శకుని నిలువరించుచుండెను.  “పండిత్ నాకివ్వచ్చు కదా నేను మాట్లాడతాను.” మీరు మాటాడదగ్గ మనిషైనచో మీకు వెంటనే ఇచ్చెదను, ఇటులందరితోనూ మాట్లాడినచో మీరు అలసిపోవుదురు. అని ఎవరో ఇంటికి వచ్చుట జూచి వారితో మాటలాడుటకు సందర్శకుల గదిలోనికి పోయెను. 

వారిని కూర్చొండబెట్టి మాటలాడుచుండగా  ఆషా కాఫీ లు తీసుకొని పోయి ఇచ్చెను. లకుమ స్నానమునకు పోయెను. రోహిత్ వంటగదిలోకి దూరెను. “ఎరా మబ్బు బ్రేక్ఫాస్ట్ అయ్యిందా” ఇంకా ఇప్పుడే  కదబాబు 8.00 గంటలు అవుతోంది, అయినా ఎప్పుడు మబ్బు మబ్బు అంటారు ఏంటండీ ? ఏహ్ ఊరుకోరా నాకు నోరు తిరగదు. మఖ్బుల్ అనే చక్కటి పేరుని ఖూనీ చేసేస్తున్నారు కదండీ. అప్పుడే ఆష  వంటగదిలోకి వచ్చి “మళ్లీ  మొదలెట్టారు మీగోల,” ఛీ ఛీ వీడితో నాకు గొడవేంటి  అని రోహిత్ అతిథులవద్దకు పోయెను. ఆష “మఖ్బుల్ ఎందుకు  రోహిత్ తో గొడవ నువ్వు తెలుగంతా నేర్చుకుని మాట్లాడుతున్నా రోహిత్ నీ పేరు ఒక్కటీ పలక లేకపోతున్నాడంటే అర్ధం ఏంటి? నిన్ను సమంగా పిలవడం అతడికి ఇష్టం లేదు. అలాటప్పుడు నువ్వు కూడా అతడి పేరుని ఖూనీ చేస్తే సరి.” బాగా చెప్పేవాషా  అని ఆనందపడి, రోహిత్ అటు రాగానే మఖ్బుల్ " రోతబాబు  టిఫిన్ రెడీ " అనగా “అర్ధమయ్యిందిరా నిన్ను ఎవరు ఇలా చెడ  గొడు తున్నారో! నీకు తగిన విధంగా  బుద్ధి చెప్తాను అప్పుడు నీకు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్లకి బుద్ధి వస్తుంది.” అని తయారై బయటకు వెలువుటకు సిద్ధంగా ఉన్న లకుమకు ఏంచెప్పాడో పదినిమిషాల తరువాత మఖ్బల్కి మూడు  నెలల  జీతమిచ్చి " రేపటినుంచి పనికి రావలిసింది అవసరం లేదు " అని చెప్పేసింది . 

లకుమ అల్పాహారం  తీసుకొంటూ  " పండిత్ , నువ్వు రా నువ్వు కూడా మాతో  టిఫిన్ చెయ్యి " అనెను . " నేనింటివద్ద  తీసుకొని వచ్చాను " అని బయట గదిలో  వేచి  ఉండెను . లకుమ పండిత్ బయలుదేరుచుండగా  వంటగదిలో రోహిత్  ఆషా తో " నిన్ను ఆ పండిత్  గాడిని త్వరలో పంపిస్తాను చూస్తుండు " అని అనెను.   లకుమ బి ఎం డబ్ల్యు తీసెను . పండిత్ " మేడం వాహన చాలకుడేది ? " నేడు సెలవు లో ఉన్నాడు, నీ తెలుగు వినినచో మా పాత మిత్రులు గుర్తుకు వచ్చెదరు.  వారునూ నీవలె అచ్చతెలుగు మాట్లాడెదరు , భారతవర్ష అని ఒక పండితుడు కలదు. అతడు అనేకులకు  స్ఫూర్తి దాయకముగా నిలిచి నాడు.” వాహనము  ముందుకు సాగుచున్నది. పండిత్  భారతవర్ష  నాకు తెలియకేమి ? ఈ మధ్యనే అతడికి సాహితీ అకాడెమీ అవార్డు వచ్చినది. మేడం మీరు కారు నడుపు మంచిది కాదు. మీరు ఇంకనూ నిన్న రాత్రి తీసుకున్న నిషాలో యున్నారు. వాహనము వేగము పెరిగెను   

ముంబాయి లిబర్టీ సినిమా: ఛుం ఛుం ప్రివ్యూ ముగిసినది. సమయం 12.00. కావస్తున్నది. 
లకుమ "పండిట్ లిబర్టీ సినిమా ప్రత్యేకత ఏంటి ? ఎందుకు దీన్ని గొప్పగా చూస్తారు ?"
1200 వందల మంది చూచుటకు  సామర్థ్యం గల లిబర్టీ సినిమా  1947 లో నిర్మితమైన  ఆర్ట్ డెకో సినిమా. 
వినోద్“ఈ పండిత్ నీతో ఎప్పుడూ తోకవలె ఎందుకు ఉండవలెను?” 
లకుమ " పండితుడు కనుకనే ఉండవలెను , బాలీవుడ్ చరిత్ర, బొంబాయి సంస్కృతి తెలిసిన గొప్ప మనో విశ్లేషకుడు.” “ఓహో అందుకేనా అతడిని హేండ్ బేగలాగా , సెల్ఫోన్ లాగ పట్టుకొని తిరుగుతున్నావు.” అని వినోద్ అనగా కశ్యపుడు నవ్వుచు “లంచ్ కి బయలుదేరుదాం  పదండి తింటూ మాట్లాడుకోవచ్చు. అందరూ వాహనముల వద్దకు నడుచు చుండిరి.

కశ్యప్ , వినోద్, వివేక్ పండిత్ తో కలసి లకుమ బయటకు వచ్చుచుండెను.  వర్మ  రమేష్ భట్ కూడా ప్రివ్యూ చూచు టకు వచ్చిరి. భట్ తన కుమార్తెను కూడా తీసుకువచ్చెను    వర్మ , భట్ ఇరువురు లకుమ నటన కంటే లకుమ అంద మును మెచ్చుకొనిరి . భట్ లకుమను కౌగిలించుకొని ముద్దాడెను. వర్మ లకుమ చేతిలో చేయివేసి "నీతో ఒక ఫిలిం ప్లాన్ చేస్తున్నాను , త్వరలో నీ అందము ఎలా ఉంటుందో ప్రజలకు రుచి చూపిస్తాను." "లకుమచెవిలో పండిత్ "అనగా వీడు రుచిచూడవలెనని ఉవ్విళ్ళూరుచున్నాడు " అని చెప్పెను. ఇంతలో "హాయ్ కశ్యప్ జీ!" అంటూ వచ్చి ఒక వయ్యారి అతడిని అల్లుకుపోయేను. ఆజా ప్యారే అనుచూ కశ్యపుడు ఆమెను చుంబించుచుండెను . ప్రివ్యూ కి వచ్చిన వారందరూ అధునాతన వేషధారులై పాశ్చాత్య సంస్కృతికి అసలైన వారసులవలె పడకగది దృశ్యములను చూపుచు న్నారు. ఏ కౌన్ హై పండిత్ జీ పహేలీ కబీ దేఖానాహీ " అని లకుమ అలవాటు చొప్పున్న  హిందీలో అని మరల తెలుగులో అడిగెను.    
పండిత్ " ఆమె చమేలీ, ఒక నర్తకి , తెలుగు చిత్ర సీమయందు ఎల్  విజయలక్ష్మి వలే మంచి నర్తకి , ఆమెకు అవకాశములు తన ప్రతిభ వలన వచ్చిననూ కశ్యపుని చలువ అని నమ్ముచున్న బేల " అని చెప్పెను.  అట్లు నమ్ము వారుందురా, అదే    అలా  నమ్మే అమాయకులున్నారా?" అని లకుమ అడగగా " మీరునూ అటువంటి బేల యని మీకు తెలియకుండుట విచారము, క్షమించవలెను " అందరూ వాహనములు అధిరోహించిరి.

వినోద్ కశ్యప్, ఇద్దరు మిత్రులు టొయోట లో బయలుదేరగా లకుమ బి ఎం డబ్ల్యు లో తన సలహాదారు వివేక్ పండిత్  తో బయలుదేరెను. వాహనమునులన్నియూ బాంబే మరీన్ డ్రైవ్ మీదుగాపోవుచున్నవి. వర్మ తెలుగువాడే  , అతడి చిత్రములు కొన్ని తెలుగు లో హిట్ అయినవి , అంటే అతడు ఈ విశ్వమునంతటినీ సృష్టించినట్టు నటించుచున్నాడు.  ఉత్త చిత్తకార్తి  కుక్క , పిరికి వాడు. " పెళ్ళాన్ని వదిలేసాడటకదా ?"  భార్యే ఇతడిని వదిలేసింది , ఇంత  త్రాష్టుడితో ఏ భార్య వేగలేదు. కూతురినే  అదొక మాదిరిగా చూచు రకము , ఆమె శృంగార చిత్రము  తీసి అంతర్జాలమందు పెట్టెను . " ఇది నాకు తెలియదు , తండ్రులు ఇట్లుందురా ?" రమేష్ భట్ కూడా కూతురుతో అక్రమ సమందమును కలిగి యుండెనని ఇచ్చట అందరికీ తెలిసినదే,  అంతర్జాలమందు అతడి కూతురిని అసభ్యముగా తాకుచున్న చిత్రములు అనేకము గలవు.  వాహనములు  గేట్  వే  ఆఫ్ ఇండియా  ప్రక్కన గల  తాజ్ రెసిడెన్సీ చేరినవి. లకుమ ప్రక్కన వినోద్ కూర్చొనుటకు ప్రయత్నించిననూ పండిత్ ఆమె ప్రక్కన ఉండుటతో  వినోద్ ఆగ్రహమందెను. అది గ్రహించిన పండిత్ లకుమ వైపు చూచి ఆమె కనుల భాష లో అర్థము గ్రహించి బాంక్వెట్ హాలు నుండి పని వున్నదని చెప్పి బయటకు పోయి లాబీలో కూర్చొనివార్తా పత్రిక చదువు చుండెను. లకుమ పోయి వినోద్ ప్రక్కన కూర్చొనగా వినోద్ ఆమె ను మాటి మాటికీ తాకుచూ మాట్లాడు చుండెను. నీ తదుపరి చిత్రము సంజయ్ సాబ్ తో " రాజస్థాన్ కి రాణి  "ఇది కూడా రాణి పద్మావతివలె పెద్ద చిత్రము. కానీ సంజయ్ సాబ్ తో నీవు ఈ నెల  అంతా  మంచిగా మెలగవలెను. అది నీకిష్టమైనచో రేపటికి కాల్షీట్స్ సిద్ధమగును సంతకము చేసి అడ్వాన్స్ తీసుకొనవచ్చును " " పండిత్ ని అడిగి చెప్పెదను " " లకుమా వాడు  చాందస్సు డు నీకెట్లు దొరికినాడు , వాడి పూరీకులు ఆస్ట్రాలజిస్టులు , కాశీ పండితులు ఆ చెత్త గాడికి విషయం జ్ఞానమున్నది గానీ లోక జ్ఞానము లేదు " అని కశ్యపుడు లకుమకి తలంటేను. వినోద్ కలుగజేసుకొని " కశ్యప్ జరా రోకో ,    సంజయ్ సాబ్ కో కుషీ దేనే కో  లకుమా కభీ ఇంకార్ నహీ కియా. ఔర్ బోలో లాకుమా ఛుం ఛుం  ఫిలిం కైసే హాయ్?”

సినిమాలో నాకు చెప్పిన కథకు మీరు చూపిన కథకు చాలా తేడా ఉంది. నా సగం పాత్ర తగ్గిపోయింది, అందుకు సెన్సా ర్ కారణాలు అంటున్నారు , సరే కానీ ఈ సినిమా సిక్కులను అవమానిస్తున్నట్లుంది. ఇది ఒక విధమైన  దేశవ్యతిరేక కార్యక్రమము లా ఉంది. " తుం జ్యాదా  బక్తీ హో లకుమా! ఇండస్ట్రీ  ఐసాహీ  రహేగా, ఇండస్ట్రీ కో బదల్నా తుమ్ సే నహీ హోగా , తుం కామ్ సే కామ్ రకో  జ్యాదా మత్ సోచో, రాత్కో పార్టీ మే  ఆజా  గాడీ  బేజూన్గా "

వారిరువురూ  వెడలిన పిదప పండిత్ లోపలి వచ్చెను . నీవు ప్రొద్దున్న ఈమె తినలేదు ఇప్పుడైనా తినుటకు కుదరలేదు , నాకు చాలా భాధ కలిగింది " హంగర్ ఐస్ నాట్ ఆ ప్రాబ్లెమ్ మేడం , లెట్ మీ టెల్ యు దెయిర్ ప్లాన్ , అండ్ మై స్ట్రేటజీ." " ఆకలి సమస్య కాదా స్ట్రేటజీ చెప్తావా నేనంత కసాయిని కాదు, ముందు తినుము తరువాతే మాటలు ఉపాయములు. లకుమ  వెయిటర్ ని పిలిచి భోజనము కోరగా " కాంటినెంటల్, చైనీస్,  అని  చదువుట ప్రారంభించగానే "చావల్ ఔర్ దహీ ఏ కప్ ఔర్  కుచ్ నహీ మాంగ్తా  " అనగానే వెయిటర్  "థాలీ లావూన్?" అని అడిగెను " చావల్ ఔర్ దహీ ఏ కప్ ఔర్ కుచ్ నహీ మాంగ్తా"   అని పండిత్ గట్టిగా చెప్పెను వైటర్ వెడలెను.  వీడు థాలీ పేరుతొ ఒక్కొక్క కూరకి ధర కట్టి మీకు వెయ్యి రూపాయలకి శఠ  గోపం పెట్టేస్తాడు. అన్నం , పెరుగు వచ్చెను.   లకుమ ఆశ్చర్యంగా చూస్తుండగా పండిత్ తన జేబులోంచి ఒక చిన్న డబ్బా తీసి అందునుండి ఆవకాయ ముక్కలు తీసి పెరుగు అన్నము తినుట పూర్తి చేసెను. " మీరు పెద్ద తార. మాది మధ్య తరగతి కుటుంబమ్  మేడమ్. నా లైఫ్ స్టయిల్ ఇట్లే ఉందును .' అని   వినోద్ , కశ్యప్  , సంజయ్ల   పథకం  చెప్పుట ప్రారంభించెను.

Friday, December 18, 2020

Bharatavarsha 95

నవి ముంబయి పాటిల్ మహా క్రీడా ప్రాంగణము (స్టేడియం): యాబది వేల  మంది కూర్చొని చూచుటకు వీలుగల సమ్పద్వర మహా క్రీడా ప్రాంగణము పాటిల్ స్టేడియం  స్థౌల్యమున క్షీరాబ్ధి  సవాలు చేయుచుండెను. గోళాకారపు హరిత పచ్చిక తలము చూడ ప్రేక్షకుల కన్నులు చెదురు చుండెను. దాని చుట్టూ వర్తులాకారముగా నిర్మించిన ఉన్నత సోపానములుపై ఉచితాసములు అమర్చబడినవి. అంతర్జాతీయ క్రీడల కాశ్రయమిచ్చిన ఆ క్రీడా ప్రాంగణ మందు ఒక ప్రత్యేక  కాంటిలివర్ పైకప్పు  నిర్మాణమునకు జర్మనీ దేశమునుండి ప్రత్యేకమైన గుడ్డనురప్పించినారు. ఈ పై కప్పు  స్తంభముల ఆధారము లేక  ఒక కాడపైననిలిచి   ప్రేక్షకులకు  అన్ని కోణముల నుండి  నిరాటంక  వీక్షణను(unobstructed view) అందించును. పచ్చికతలము(green court) క్రింద పరుచుటకు, టన్నులకొలది జింక మట్టిని దక్షిణాఫ్రికా నుండి నౌకలలో రప్పించిరి. ఆ క్రీడా ప్రాంగణ మందు గల ప్రతి నిర్మాణమూ అత్యున్నత శిల్పకళా చాతుర్యమును ప్రతిబింబించుచుండెను.

Aerial view of the night audience throng

ఐదు వందల కిలోవాట్ల సౌరవిద్యత్ కేంద్రము,   పదహారు అత్యవసర ద్వారములు,  తొమ్మిది  టెన్నిస్ ఆట స్థలములు, నాలుగు  అంతః  బ్యాడ్మింటన్ ఆటస్థలములు , రాచ ఉద్యానవన  పరిమాణమున అలరారు ఈత కొలను మరియు విలాస  శీతల విశ్రాంతి మందిరములు కలవు. అందొక  విలాస విశ్రాంతి భవనమందు మీనాక్షి దుస్తులు ధరించుచున్నది. అద్దము ముందు నిలబడి   పయటను సవరించుకొనుచుండగా  ప్రఫుల్ల ఆమె  గదిలోకి ప్రవేశించి ఆమె వంపుసొంపులు కని తత్తరపాటుచెంది, బయటకు పోవుచూ ద్వారము వద్ద నిలిచి "పొలమారి కుత్తుక సవరించుకొని  "లోనికి రావచ్చునా?" యని అడుగగా మీనాక్షి నవ్వి ఎందుకు బయటకు  పోయినావు?" అని అడుగగా "నీవు చీర సింగారించుకొనుచుండగా వచ్చినాను కదా అని అనుచూ దగ్గు చుండగా మీనాక్షి మంచినీరు అతడి నోటికందించెను. తాగిన పిమ్మట " ఏమయినది ?" అని అడగగా ప్రఫుల్ల " నీ అందము విద్యుత్ ఘాతము వలె  తగిలినది" అనెను. మీనాక్షి "అదటులుండనిమ్ము ఈ క్రీడా భవనము ఎంత విశాలముగా నున్నది. యాబది వేల ప్రేక్షకుల ముందు ప్రదర్శనా?! మనమెపుడూ ఇంత  పెద్దకార్యక్రమము చేయలేదు. నాజీవితం ఆశయము నెరవేరుచున్నది. ఇందుకు నేను నీకు రుణపడి యుండవలెను. ఈ  భవనము కళకళ లాడుచూ ఎంత అందముగా ఉన్నదో కదా!" అని మీనాక్షి అనగా "నీ అందము ముందు ఇదంతయూ దిగదుడుపే.  నీ జీవిత కాల ఆశ నెరవేరుచున్నది, నా జీవితననూ ఒక ఆశ గలదు  అది ఎప్పుడు నెరవేరునో కదా !" అని ప్రఫుల్ల తన్మయత్వమందుచు ఆమె అందమును వర్ణించు చుండగా  ఛాయాగ్రాహకుడు వచ్చుటచే  బయలుదేరమని జెప్పి బయటకు పోయి వేచియుండెను. 

 మీనాక్షి బయలుదేరెను. ఆమె పియానోను ఇద్దరు మోసుకు వచ్చుచున్నారు ప్రఫుల్ల ఆమె ప్రక్కనే నడుచుచుండెను, బృందంలో ఇతర వాద్య కారులు వారిరువురిని అనుసరించుచుండిరి వారు నడుచుట కూడా తెరపై ప్రసారమగుచుండగా వేలాదిమంది చూచుచుండిరి. ప్రఫుల్ల మీనాక్షి చెవిలో “సంగీత కారులు వీనుల విందు చేయుదురు  నీవంటి అందాల రాసి సంగీత కారిణి  అయినచో  ప్రేక్షకులకు కనువిందు కూడా చేయును ” అని అనగా మీనాక్షి అతడి వైపు కోరగా చూసెను "దృశ్య ప్రసారములకు, తెరలకు  ఒక కోటి రూపాయలు ఖర్చు అగుచున్నవి " అని ప్రఫుల్ల మాట మార్చెను.

సూర్యుడు అస్తమించి చీకట్లలుముచుండెను. జ్ఞాన కాంతులందు నింపెసలారు  సనాతని వదనమువలె ఆ క్రీడాప్రాంగణము  సౌర విద్యుత్ దీప కాంతులందు దగ దగా మెరియుచుండెను.  ఆ ప్రాంగణ మధ్య పది ఎకరముల వర్తుల హరితతృణము పైనొక రంగస్థలం నిర్మించబడెను.  దూర ప్రేక్షుకులకు ఆ వేదికపై నున్నబృహత్  సంగీత బృందం కొండపల్లి బొమ్మల వలే కనిపించును.  అందుచే శక్తివంతమైన ఛాయాగ్రాహక యంత్రమును ఒక యంత్ర హస్తముపై రంగస్థలము ముందుంచి వేదికపై జరుగుచున్నదంతయూ  రాక్షస పరిమాణమునున్న పెక్కు తెరలపై నలుమూలలా చూపు ఏర్పాట్లు జేసినారు.  

                                           ***

శా. నీలాకా     సమునం     దుజాబి     లిదియే       నీలాంబ  రీరాగ  మే                                                

ఆలాపిం    చుచుపా      లమబ్బు    లజరీ        హారావ    లీదాటె  నే                                                    

కాలాత్మా   సరసీ          రుహాక్షి      కనులే       కవ్వించు   కేదారి   రా                                                  

గాలస్వా    రసిక          స్వరాల      వీనులన్    గావించు   మాధుర్య మే   


వేదిక నధిరోహించిన మీనాక్షిని మబ్బుల మాలలను దాటి నేలవాలిన జాబిల్లి యని  తన  స్వరార్చన తో ప్రేక్షకులకు వీనుల విందు గావించునని వర్షుడు కవితార్చన చేసెను. ప్రేక్షకులను స్వాగతించుచూ స్వరార్చన మొదలయ్యెను. చిన్మయ  గానలహరి  చిదానందము మొనరించుచుండగా ముందువరసలో కూర్చొన్నవిదిష  తీగవలె  వర్షునల్లుకొని జీవన స్వావశీయమునందు కరుగుచుండెను. తెలుగు మలయాళ  తమిళ కన్నడ గీత చందములు  ఆంగ్ల గీతముల  అందములతో బంధములు  వేసుకొని  హృదయములను అల్లుకొను చుండెను.   విభిన్న విలక్షణ శృంగార  విభావరి యందు "కమాన్ హగ్ మీ టైట్"  అని పాటగాడు వేదికపై పాడుచుండ అతడి స్థానమందు విదిష  వర్షుని రూపమునే కాంచుచుండెను. కమాన్ హగ్ మీ  అని గాయకుడు పాడుచుండగా బృందమందలి సభ్యులందరూ ఏక స్వరమున  " గ్రీట్ మీ  కిస్ మీ , టచ్ మీ , హేట్ మీ కిక్ మీ కట్ మీ ఫైనల్లీ  బైట్ మీ " అనుచూ మంద్రముగా సంగీత తరంగమును సృష్టించగా వేలాది మంది కూర్చొని జాలక నిలిచి , నిలవజాలాక్ ఊగి , ఊగ జాలక సోలుచుండిరి.    విదిషకను లందు వేదికపైన జంటల  శృంగార నృత్య భంగిమలు కదులుచుండెను. ఆమె కనులు అరమోడ్పులై   మత్తెక్కి వాలుచుండగా వర్షుని మెడను మునిపంట కొరికెను. " కెవ్వను వర్షుని కేక ఆ సంగీత తరంగమందు కలిసిపోయెను." వర్షుని జంటను చూచి  మీనాక్షి కనులు కిలకిల నవ్వెను. పాట  ముగిసినూ   మీనాక్షి వాద్యమునాపక సంగీతోత్పాతమును సృష్టించెను వర్షుడు లేచి రెండుచేతులూ ఎత్తి  ఆ సంగీత సరస్వతికి కైమోడ్పుచేయగా  పెల్లుబికిన స్వరములు క్రమముగా  చల్లబడెను.  విదిష కనులు చెమర్చెను.  

గొంతు కొలిమిలో రాత్రిని కరిగించు కంసాలి శృతి లయలను పడుగు, పేకలుగా తీర్చిదిద్ది  రాత్రికి రాగాల రంగులద్ది    కంసాలి నేతశాలిగా మారి శ్రోతలకు పట్టు బట్టలల్లగా,  పాత్రికేయులు విశ్రాంతి మరిచి  పదుల  వర్ణ చిత్రములను,  వందల హస్తములు,  వేల పదములను  తమ తమ పత్రికలలో కూర్చి,  లక్షలాది కాపీలను ముద్రించి,  కోట్లాదిమంది పాఠకులకు పంచుటకు శ్రమించు చుండగా ముంబయి శాంతాక్రజ్  విమానాశ్రయము నుండి ఢిల్లీ పోవు విమానమొకటి నిసీదినెగురు చుండెను. “ఢిల్లీ పోయిన పిదప ఏమని చెప్పవలెను అని విమాన గవాక్షము వద్ద కూర్చొన్న వర్షుని పై వాలుచూ విదిష అడిగెను.   సంగీత విభావరి చూచుటకు  బొంబాయి పోయినామని నిజమునే తెలుపవలెను. అని వర్షుడనగా "   నీ తెలివి చాలించిన సంతోషించెదను,  చిన్నప్పుడు బడిలో  నీ ప్రోత్సాహముతో ఇట్లే నిజము జెప్పి తిట్లు తింటిని, మాకెందుకు తెలపలేదని , మేమునూ వచ్చెడివారమని ఆ ప్రౌఢలిరువురూ  అన్నచో ఎప్పుడేమి చేసెదవు?” అని విదిష ప్రశ్నించెను. వర్షుడు మౌనము వహించెను    “మాజంట సరససల్లాపములకు భంగమగునని చెప్పెదవా?” అని మరల ప్రశ్నించెను. వర్షుడు మౌనము వహించెను. “వారు పెద్దవారు కావున ఏదైనా దేవాలయమునందు పూజలో పాల్గొనినామని  తెలిపిన సంతోషింతురు” “అట్లు చెప్పిన నమ్మెదరా?” అని వర్షుడు అడుగుచుండగా  “చెప్పవలసిన తీరున చెప్పినచో నమ్మెదరు. మొద్దావతారము వలే నున్నావే!   నేనెట్లు చెప్పేదనో గ్రహించి నడుచుకొనవలెను.”  అని తన బ్రియోద్వృత్త కుంభ స్తనములు   వర్షుని ఛాతికానుచుండగా  విదిష ఆతడి కంఠ సీమనల్లుకొనెను.                   

                                                                       ***  

తెల్లవారినది మాలిని , తారలు ఎదురు ఎదురు గా సోఫాలలో  కూర్చొని యుండగా కాఫీ  వచ్చెను. మాలిని " నీ ప్రమాణ స్వీకారోత్సవం రెండు రోజులలో జరుగునని విన్న పిదప మాఇంట  పెళ్లి వలే అని పించుచున్నది. నీ కూతురు కి తెలిసిన ఎంత సంతోషించునొకదా!" " అవును ఫోనులో సంతోషించును, దానికి చలన చిత్రములను మించిన ఉత్సవములేవియునూ లేవు బల్లిపాడు  ఉత్సవమునకు రమ్మని బ్రతిమాలి న గ్రామమునందు హోటల్ లో దిగి గుడికి రాక  ఒక సినిమాతారవలే ప్రవర్తించెను. నాతొ మాట్లాడినపుడు కూడా అది తారవలే మాట్లాడుచుండెను.   ఇక నాకు కూతురెక్క డుండెను? సుందరి యందు కూతురిని చూచుకొనుచున్న నాకు,  నేడు రెండవ  కూతురు దొరికెను. ఇక నాకు కేశవుడు కొడుకు  అని గద్గద స్వరమున పలికెను.  మాలిని అరుణతార కనుల మాటున ప్రేమ రాహిత్య ఒంటరి జీవితమున దాగిన నీలి నీడలను మనసుతో  దర్శించి  “చక్కటి బిడ్డల తల్లివి నువ్వు, నీ అదృష్టమును కొనియాడవలెను అనుచుండగా, విదిష  బంగారు  చేలాంచలము గల శ్వేతాంబరము  ధరించి కాఫీ తీసుకొని మేడమీదకు పోవుచుండెను.   

కాఫీ ఇచ్చుటకు బయలుదేరినాదండీ జాణ అచ్చట ముచ్చట లాడక వెంటనే మేడ దిగి  రావలెను అని అత్తగారి పెత్తనమును చూపగా, అరుణతార " నాకూతురు అమాయకురాలు అది జాణ  ఎట్లయినది, నీకొడుకు  అమాయకుడో ఆమె మెడ  చూచిన ఎవరికైననూ తెలియును అని మాలినితో పోట్లాడి విదిష ను సముదాయించెను. పిదప విదిష మేడ పైకిపోగా వర్షుడు మంచముపై కనిపించలేదు. కాఫీ కప్పు తో  లోపలి అడుగు పెట్టిన విదిష ను తలుపు చాటున నక్కిన వర్షుడు వెనుకనుండి వాటేసుకొనెను. అతడి తాకిడికి కప్పు నేలపై బడి ముక్కలయ్యెను. క్రిందనే కూర్చొని యున్న కాంతలిరువురూ ఆ శబ్దమును విని వీరేమి చేయుచున్నారో అని అచ్చెరువొందుచుండగా " మేడం న్యూస్పేపర్స్ " అని కుర్రవాడు వార్తా పత్రికలను కాఫీ బల్లపై పెట్టి పోయెను. " ప్రఫుల్ల లీవ్స్ ముంబై స్పెల్ బౌండ్ " అని పతాకశీర్షికతో వార్త  రమ్యముగా ప్రచురించబడెను ప్రఫుల్ల బృంద ప్రదర్శనను, రంగస్థల చిత్రములను  మీనాక్షి చిత్రములను వివిధ వార్తాపత్రికలలో పలుభంగిమలలో ముద్రించి నారు. అని అరుణతార చెప్పుచుండగా “ ప్రేక్షకుల చిత్రములను కూడా ముద్రించి నారు. 

అని మాలిని ఒక వార్తాపత్రికానందు విదిష వర్షుని కొరుకుచున్న చిత్రమును చూపెను, ఇదిగోనమ్మ నీ కూతురు అమాయకురాలు అనుచుంటివి  కదా  అప్పుడే క్రిందకు వచ్చిన  విదిష కు విషయము  భోదపడెను ఆమె వెనుతిరిగి పోవుచుండగా మాలిని ఆమె చెవిని దొరకబుచ్చుకొనెను. ఇంతలో ఛాయాగ్రాహకుల బృందమొకటి ప్రవేశించి " We are from BBC India. Mr. Varsha has invited us to record a program at home. Is it his house?” అని అడుగగా అరుణ వారిని కూర్చోండ బెట్టెను. అప్పటికే వర్షుడు తయారయ్యి క్రిందకు దిగుచుండెను.