కైలాసగిరి పై పరమేశ్వుడు పార్వతిని కూడి కొలువు తీరి చూచుచుండ ఆదిదంపతుల ప్రమోదమంద ఇనుడు చిరునగవులు చిందించుచుండె. నిహారస్నాన మాచరించిన ప్రకృతి కాంత ఆ లోకచక్షు పసిడి మయూఖ రేఖలందు తన అందముల నారబెట్టుకొని నిగనిగలాడు మెరియుచున్నవి. "ఆర్యాణి, కల్యాణి, కాత్యాయణి,నీహారమే, నిహారమై, ప్రకృతికిహారమై, జీవులకు ఆహారమై నొప్పుచున్నదికదా!" అని బసవడు మిద్దె పైనుండి కైలాసగిరి కొండను చూచుచూ ప్రకృతిని వర్ణించ విఫల యత్నము చేయుచున్నఅగస్త్యునికి చెప్పగా అతడి మది పులకించెను. చందన మేడపైకి వచ్చి " అమ్మ పిలుచుచున్నది " అని క్రిందకు వెడలెను.
“అబ్బా! చందన ఎంత పొడవు ఎదిగిపోయెను. కుందనపు బొమ్మవలె యున్నది.” అని రాఘవుడనెను "అవును అదిప్పుడు డిగ్రీ చదువుచున్నది" అని బసవడనెను. క్రిందకు దిగిన అగస్త్య బసవ రాఘవలతో బుచ్చెమ్మగారు " అల్పాహారం సిద్దము గానున్నది స్నానములు ముగించి రావలెన”ని చెప్పగా “ఇంత తొందరగా అల్పాహారమెందులకని అగస్త్యుడనెను. బసవడు "స్నానము ముగియుసరికి ఆలస్యమగును పండ్లు తోముకొని వెంటనే ఉదర పూజ గావించవలెన"ని తొందరపడుచుండగా బుచ్చెమ్మగారు " చూడునాయినా ఎట్లు వేపుకు తినుచున్నాడో రేపు పండ్లు తోముకొనక ముందే తినుటకు పెట్టమనునేమో !" అని తల పట్టుకొనిరి.
ఓరి తిండి బోతా రాత్రి అమ్మచేతి వంట ఇద్దరమూ బాగానే మెక్కితిమిగదరా. “అవునురా నేను తిండి బోతువు నీవు నిద్ర బోతువు కాదన్నదెవరు!” అని ఆగమేగాలమీఁద పండ్లు తోముకొని వచ్చి తిండికి కూర్చొనెను . అగస్త్యుడి కూడా వానికి తోడుగా కూర్చుని తినసాగెను బుచ్చమ్మగారు ఇడ్లీలు చేసి కొబ్బరి చెట్నీ కూడా చేసినారు. "రాత్రి చేసిన రవ్వపులుసు లేదా?" అని బసవడు ఆగం చేయుచుండగా చందన నవ్వు చుండెను. “ఎట్లు భరించుచున్నావమ్మా ఈ బిడ్డని?” అని అగస్త్యుడు అనగా “నాకేమినాయనా పడ్డంతకాలము పడక్కరలేదు ఆ వచ్చునది వీడితో ఎట్లు వేగునో అన్నదే నా విచారము” అని బుచ్చెమ్మగారు అనగా అగస్త్యుడు బసవడి కళ్ళలోకి బుచ్చెమ్మగారి కళ్ళలోకి మార్చి మార్చి చూచి అడగలేక నసుగుచుండగా " పార్వతి గురించి వారికి తెలియును" అని బసవడు అగస్త్యునితో మెల్లగా అనెను. అట్లు మెల్లగా అను టే ల గట్టిగానే చెప్పరాదూ అని బుచ్చమ్మగారు “తల్లి తండ్రుల అంగీకారము కావలెనని అరుణతారగారు అనుకున్న మా మాసన్నాసి అక్కడే తాళి కట్టి ఇదిగో నీకోడలని ఆపిల్లని ఇంటికి తెచ్చెడివాడే, ఆయన (సర్రాజుగారు) ఎప్పుడూ ఊహించలేదు ఇట్లు జరుగునని తల్లడిల్లిపోయినారు.
“మెల్లగా మాట్లాడమ్మా నాన్నఇప్పుడే నిద్ర లేచినట్లున్నది అని చందన అనుచుండగా సర్రాజుగారు. బయటకువచ్చి "మాకు దగ్గర సమ్మందములున్ననూ కాదని వీడికొరకు ఆ పిల్ల ఇంటికి పోయినాము. బల్లిపాడు పోయిన తరువాత ఆ చంద్రమ్మ పిల్లని ఇచ్చుటకు వీలు పడదని చెప్పినది ఛీ ఛీ వీడివల్ల మరల కాళ్ళీడ్చు కొని వచ్చినాము.” చందన " చంద్రమ్మ కాదు నాన్నగారు చంద్రమతి" అని కిసకిస నవ్వ సాగెను. బుచ్చెమ్మగారు చందన పళ్ళెములో చెట్నీ వేయుచూ ఆమె నెత్తిన గరిటె తో ఒక్కటి మొట్టినారు అయిననూ ఆమె నవ్వు ఆపకుండెను. నాకిటువంటి కుటుంబముండిన ఎంతబాగుండునని అగస్త్యుడు మనసులో అనుకొనెను.
ఆమె ఇవ్వనన్నా మనమూరుకొందుమా అరుణతారాగారితో మాటలాడించకుందుమా ఈ సారి అగస్త్యుడు కూడా పెట్టున నవ్వెను. అందరూ నవ్వుచుండగా బసవడి మొఖమెర్రబారెను. అల్పాహారం పిదప అగస్త్యుడు బసవడుఫెరారీ నెక్కి కాలనీ దాటి ఘంటా పథమున సాగుచుండిరి. వారు పాత డైరీ ఫారం ప్రదేశమును దాటుచుండగా ఎవరో చేతిని వూపుచుండ అగస్త్యుడు వాహనమును నిలిపెను. రాఘవా, నీవా డైరీఫారము వద్ద ఇచ్చటమిచేయుచున్నావు? “బర్రెలు కాయుచున్నాను!( ముగ్గురూ నవ్వుకొనిరి ) మా ఇల్లు ఇచ్చటనే! నేను సబ్బవరం పోవుచున్నాను. నిన్న సందీపుని కలిసినాను నేడు సందీపునకు మంజూషకు పెళ్లి చూపులు. మీరు తప్పక రావలెను అని జరిగిన విషయమునెఱిగించగా వారు నిర్ఘాంత పోయినారు “సాయింత్రము ఐదు గంటలకు వర్షుని ఇంటికి రావలెనని” తెలిపి రాఘవుడు వెడలెను.
అగస్త్య ఫెరారీ గరిష్ట వేగమెంతో తెలియునా ? "280 కి. మీ . ఐదు గేరులు కలవు."
దీనికొరకు ఇన్ని కోట్లేలపోయవలెను ? ఈ మాదిరి కార్లు వారు మొత్తము 36 మాత్రమే చేసినారు అన్నీ ఇంకనూ అద్భుతముగా తిరుగుచున్నవి. ఫెరారీ గమ్యమును చేరెను.
కలుఉప్పాడ: ఇది ఇల్లా పర్వతమా ఏమీ అందము ఏమీ రాజసము, సర్దారు పటేలు విగ్రహమంత ఎత్తున్నదే. అనుచూ ఆ భవనంపై ఒక ఆసుకవితా శరమును ప్రయోగించెను. "శిరము మబ్బులందు సరము మిద్దెనందు గల రాజగృహము ను కాంచిన ఈ రాజహంస ఏల నేల వాలె నని చూచుచుండ చుట్టె శిశిరము, ఏమో! మన మేనమామ, చందమామ ముక్కొకటి తెగిపడెనేమో! ఏమో! కలేమో!! అని కవితా లతలు జల్లి ముందు అగస్త్యని లోనికి పొమ్మని కొలది సేపాగి బసవడువచ్చెను.
మయ నిర్మితమువలె నున్న ఆ భవంతి ఐదవ అంతస్తు లో అడిగిడి అగస్త్య తండ్రి దక్షిణామూర్తి గారి గదిలోకి ప్రవేశించుచుండగానే బసవడు అగస్త్య ఎదురెళ్లి బసవని కలుసుకొనగా ఆ అంతస్తులోగల నలుగురు పనివారిని నాలుగు అత్యవసరమైన పనులపై బైటికి పంపెను. ఆ గదిలో గల కెమెరాను ఆపుజేసెను. నాన్నగారు , నా బాల్య స్నేహితుడు బసవడని చెప్పుచూ మంచము పైనున్న దక్షిణ మూర్తిని బసవని కి పరిచయం చేయగా బసవడు నమస్కరించెను. "కొద్దినెలలుగా గుండెపోటు వచ్చి ఆరోగ్యము చెడుటవల్ల మంచము పట్టినానని దక్షిణామూర్తి చెప్పుచుండగా, అగస్త్యుడు "గ్రెస్ ఏదని ఆడిగెను. "ఆమె కార్యాలయమునకేగెను, ఆమిప్పుడు భాగస్వామి మరియు డైరెక్టరుకూడా. రేపు వార్షిక జనరల్ బాడీ మీటింగ్ సమావేశముకలదు. ఆ ఏర్పాట్లు చేయుచున్నది” అని దక్షిణ మూర్తి చెప్పెను. ఇంత కాలమూ లేనిది ఇప్పుడు ప్రత్యేకముగా ఈ మీటింగు లేల అని అగస్త్యుడు అడగగా "ఇప్పుడు మన సంస్థ ప్రయివేట్ లిమిటెడ్ కాదు పబ్లిక్ లిమిటెడ్ గా మారినది ,పోయి చూచి రమ్ము రెండు వారములనుండి చెప్పుచున్నాను సంస్థ వంకకు పోలేదు సరికదా కనీసము కన్నెత్తి నామ ఫలకమైననూ చూడలేదు మన సంస్థ కు నలుగురు భాగస్తులు గ్రేస్ , శ్యామ్ , సుందర్ అని చెప్పగా ఇంతకూ ఆ నాల్గవ భాగస్తుడు ఎవరు? అని అగస్త్యుడు అడిగెను. బసవడు "తెలివి తక్కువ సన్నాసి , మీ నాన్నారా అని బసవడు అనెను. అప్పుడు అగస్త్యుడు “నాన్నా! ఏమది సంస్థనే భాగస్తుల పణము చేసినావా! ఎంత చేటు తెచ్చినారు. ఆమె పై మీకెంత నమ్మకము” దక్షిణామూర్తి " పోరా ఇదంతయూ నీ నిర్వాకమే!" అనుచుండగా వారు కర్మాగారమునకు బయలు దేరినారు.
***
"పని వారందరూ మారిపోయినారు గేటు వద్ద రక్షణ సిబ్బంది కి కూడా నేనెవరో చెప్పుకొన వలసి వచ్చెను." "నీవిట్లు ప్రతి విషయమునకు వగచినచో ఇక మన పని అయినట్లే. రక్షణ సిబ్బంది ఎప్పుడూ మారుచునే యుందురు." అగస్త్యుడు ఫెర్రారీను కార్యాలయ భావన ముంగిట ఉన్న వసారాలో ఆపుచుండగా వాహన శాల యజమాని వచ్చి " మీరు వాహనము నిచ్చట నిలపరాదు సిబ్బందికి అధికారులకు వాహన ములు నిలుపుటకు వేర్వేరు గా వాహన శాలలున్నవి." అని చెప్పెను. నేనెన్నడూ వాహనమును అచ్చట నిలపలేదు , నేనెవరో మీకు తెలియదు " అని అగస్త్యుడు అనుచుండగా వాహన శాల యజమాని " ఇచ్చట అమ్మగారు తప్ప మరెవరూ వాహనములు నిలపరాదు . " అని గట్టిగా చెప్పెను. వాదన మొదలవుచుండగా బసవడు " అగస్త్య వాహనమును పోనిమ్ము , వాహనశాలకే పోయెదము " అని మిత్రుని ముందుకి పొమ్మనెను.
వాహనమును నిలిపి కార్యాలయములో అడుగుపెట్టిన అగస్త్యకి తెలిసిన ఒక్క మొఖం కూడా కనిపించక పోవుటచే సంభ్రమము కలిగినది. బసవడికి అన్ని విభాగములు చూపవలెనని అగస్త్యుడు భావించిననూ ప్రతి విభాగము వద్ద నిలిచి చెప్పుకొనుట కష్టముగా నే కాక అవమానముగా కూడా తోచెను. బసవడు " ఓరీ మొద్దూ , నీ కొక గుర్తింపు కార్డు లేకపోయెను ఇచ్ఛట అంతా కొత్తవారివలె నున్నారు . మీ నాన్నని ఇచ్చట నిర్వహణాధికారి ని కలిసి నీ వెవరో తెలుపుము వలసినచో మీనాన్నగారితో మాట్లాడించిన ఈ కష్టములు తొలగును. అగస్త్యుడు విసవిసా నిర్వహణాధికారి గది వైపు దూసుకుపోయెను కానీ అచ్చట కుర్చీ ఖాళీ గా ఉన్నది చివరిగా అగస్త్యుడు తండ్రితో దూరవాణి యందు సంభాషిచుటకు ప్రయత్నించు చుండగా " హలో ఇచ్చట రాకి అచ్చట ఎవరు ?" అని అడగగా అగస్త్యునికి అరికాలిమంట నెట్టి కెక్కెను. " ఏమయ్యా నీ ముద్దుపేర్లు చెప్పక అసలుపేరు చెప్పవయ్యా !" అని అనగా నీ పేరు చెప్పక నన్ను దబాయించుచున్నావు. వలసినచో నీవునూ ముద్దు పేరే చెప్పవు "
ఏవయ్య నాపేరు అగస్త్య నేను మానాన్నతో మాట్లాడవలెను. మానాన్న పేరు దక్షిణామూర్తి, నీవెవరు మాఇంట ఏమిచేయుచున్నావు. నాపేరు రాధాకిష్ణ నేను హృదయాలజిస్ట్ ను మీనాన్నకి డాక్టరును . " తిక్కవాని వలె ఉన్నావే , నేనటువంటి డాక్టరుండునని ఎచ్చట వినలేదే అనుచుండగా సైకాలజిస్ట్ దూరవాణి సాధన మందుకొని చూడుబాబు మీ నాన్నగారికి ఇప్పుడే సూదిమందిచ్చినారు. మరల ఛాతిలో నొప్పి వచ్చినది. ఆయనకు విశ్రాంతి అవసరము ఇప్పుడు మాట్లాడించకున్న మంచిది."
విధిలేక అగస్త్యుడు సంభాషణ ముగించి ప్రక్కకు చూచినంతనే పేకింగ్ విభాగము నుండి గ్రేస్ అధ్యక్షుని గదిలోకి పోయి కూర్చొనెను. అది చూసి అగస్త్యుడు ఖంగు తినెను. బసవడికి ఏమీ అర్ధము కాకుండెను " ఇది మానాన్న గది. నేను మొదటిసారిచ్చటికి వచ్చినప్పుడు అనుమతిలేనిదిదే ఆయన గది లోపలికి ఎవ్వరినీ పోనిచ్చెడివారు కాదు. ఆమెను కూడా ఇప్పుడంతాయో మారి పోయెను. అనుచుండగా సూట్ వేసుకున్న ఒక పొడుగాటి వ్యక్తి లోపలకి పోయెను. అగస్త్యుడు లోపలి వెళ్ళుటకు ప్రయత్నించగా గది బైట నున్న కావలి అడ్డుకొనెను.
బసవడు " ఇప్పుడు ఇచ్ఛట మనము చేయవలసిన పని ముగిసినది పద ఇంటికి పోవలెను. " అని ఇంటికి బయలుదేరినారు. ఇల్లే అనుకొంటిని, సంస్థ మొత్తమూ నీ తల్లి గుప్పిటలో నున్నది ఇదంతయూ నీ సవతి తల్లి ఆడించుచున్న నాటకము. చూచుచుండగా ఆమె గురి నీపైనే ఉన్నది. అని బసవడు అనగా అగస్త్యుడులికి పడెను. "మీ సంస్థలో ఈ మధ్య కాలములో ఎవరైనా ఉన్నతాధికారి తొలగింపబడెనా ?"
"తొలగించబడుటయా మా నాన్నను అడగవలెను" అని అగస్త్యుడు అనుచుండగా బసవడు "అందుకే నిన్ను నిద్రపోతు అన్నది, నిర్వహణాధికారి జాన్ స్థానము ఖాళీ అయ్యెను. అతడి స్థానమందు మొరొక కొత్త అధికారి త్వరలో వచ్చును , అందుకే అతడి కుర్చీ ఖాళీ అయ్యెను. "అతడు చాలా మంచివాడు అతడిని ఎందుకు తొలగించవలసి వచ్చెనో!" అది కూడా చెప్పవలెనా యజమానికి ఎవరు విస్వాస పాత్రుడో వాడు వీరికి శత్రువు. కనుక జాన్ ని కలుసుకొనుట మన తదుపరి కర్తవ్యము అని బసవడనగా " మరి మన తక్షణ కర్తవ్యము అని అగస్త్యుడనెను "మార్గమధ్యమములో ఆగి రెండట్లు తిని పోవుట , మీ ఇంటివద్ద (భోజనమునకు ) ఎట్లుండునో యని బసవడు అనగా అగస్త్యుడు ఏడవలేక నవ్వెను. బసవడు ఒక దోస కట్టించుకొన్న తరువాత ఇరువురు ఇంటికి బయలుదేరిరి.
ఫెర్రారీ ఆకాశహర్మ్యము ముందాగెను. బసవడు దిగి అచ్చట మరొక ఫోక్స్ వాగన్ ఆగియుండుట గమనించి అగస్త్యుని దగ్గరకి పిలిచి " ఇప్పుడు చిన్న తమాషా చేసెదను చూడుమని ఆ వాహనమువద్ద వేచి యున్నసారధి తో " మీ యజమాని సుందర్ గారు నిన్ను పైకి తీసుకురమ్మని చెప్పినారు " అనెను " అందుకు ఆ వాహన సారధి " సుందరు గారు ఎవరండీ , మా యజమాని శ్యాం గారు అనెను. అగస్త్యుడు బసవడు ఇద్దరూ భవనము ఐదవ అంతస్తు చేరుచుండగా బసవడు పిల్లివలె నడుచుచు దక్షిణామూర్తి గదివద్దకుచేరి నక్క వలే నక్కి గోడకు చెవులు ఆయనించి వినుచుండెను. అగస్త్యుడు " ఏమిరా ఇట్లు గూఢ చారివలె ప్రవర్తించుచూ పోలీసు అధికారివలె చాకచక్యము చూపుచున్నావు." అనెను. ఉష్ .. నిశ్శబ్దము.... ఈ చిన్న చిన్న కిటుకులతో పెద్ద ఫలితములు సాధించవచ్చు. వారేమి మాట్లాడుకొను చున్నారో వినవలెను.
నీకొడుకు వచ్చునప్పుడల్లా లక్షలు లక్షలు దోచిపెట్టి ఆ డబ్బుతో వాడేమి చేయుచున్నాడో ఎన్నడైనా అడిగినారా ? నేడు నేను ... పై సంతకములు పెట్టమన్నచో .. చేయుచున్నారు. ఈ సంస్థ 1000 కోట్ల సంస్థగా ఎదుగుటకు గ్రేస్ గారి కృషి మీరెరుగనిది కాదు. దక్షిణామూర్తి ఏదో మెల్లగా మాట్లాడు చున్నాడు ఓవర్ సబ్ స్క్రిప్షన్ మొత్తమును మూడు నెలలలో తిప్పి ఇవ్వనిచో న్యాయపరమైన చిక్కులలో...
కొత్త పేక్టరీ కోరకెందుకు తొందర పడుచున్నావు , జిలేబీ నేనాడిటరుతో మాట్లాడవలెను.
"హు! నన్ను నమ్మలేనివాడు మంచము మీదనుంచి దిగలేనివాడు నన్ను జిలేబీ అనుచున్నాడు."
ఆడిటరుతో మాట్లాడి మీరు చేసెడిది ఏమియునూ లేదు , ఆడిటర్ మీకు లెక్కలు వివరించిననూ మామ్మాపలేడు మేము డైరక్టర్స్ అని తెలుసుకొనిన్న మంచిది .
శ్యామ్ నాకే మంచి చెడ్డలు చెప్పుచున్నావా! అదియునూ చూచెదను, నేను సి ఈ ఓ మరియు బోర్డు ఆఫ్ డైరక్టర్స్ కు చైర్మన్ అని మరిచినారా? నేను రోగినైననూ నాకొక కొడుకున్నాడు వాడిక్కడే యుండి ఈ వ్యవహారము చెక్కబెట్టి యే పోవును. అని దక్షిణామూర్తి గది దద్దరిల్లునట్లు అరిచెను. గ్రేస్ ఇద్దరూ పగలబడి నవ్వి బయలు దేరినారు. బసవడు అగస్త్యుడు వారు లిఫ్ట్ లో ప్రవేశించు వరకూ నక్కి వారి కారు బయలుదేరుట మెడపైనుండి చూచి లోపలకి ప్రవేశించారు. దక్షిణామూర్తికి మరల ఛాతిలో నొప్పి పెరిగెను. బసవడు వెంటనే ఆంబులెన్స్ ను రప్పించి ఆసుపత్రికి తరలించగా అచ్చట హృదయాలజిస్ట్ దక్షిణామూర్తికి వైద్యము చేసి. అతడు విశ్రాంతి తీసుకొనుచుండగా బయటకు వచ్చి బసవడిని చూచి వీణావాయించు న్నట్లు గాలిలో చేతులు మీటుచూ మదన గోపాలా యని పాడుచూ పార్వతివలె నటించుచుండగా బసవడు అగస్త్యు లకు వేయి ఏనుగుల బలము వచ్చెను. దామినితో సహా అందరూ కలసి వర్షుని ఇంటికి మంజూష పెళ్లి చూపులకు బయలుదేరిరి.
No comments:
Post a Comment