మధురవాడ : ఆరు గంటలు కావచ్చుచున్నది. సూర్యుడు అస్తమించుచుండెను. చీకట్లు అలుముకొనుచుండెను. మధురవాడ ఎంత పెరిగి పోయెను. బసవడు మోటార్ సైకిల్ ఆపి “మధురవాడ శివారు చేరుకొంటిమి ఇచ్చటతో మధురవాడ అంతమగును. ఎదురుగానున్నవి కొండలే ఇంకనూ పోవలెనన్నచో బండి దిగి కొండఎక్కుట తప్ప వేరు మార్గము లేదు.” మధురవాడ నాలు మూలలా గాలించితిమి ఎంత వెదికిననూ జాన్ ని కనుగొనలేకపోతిమి. ఇంక వెనుతిరుగుట గాక మనమేమి చేయగలము” అని అగస్త్యుడు అనుచుండగా బసవడుఅందుకొనెను (ఇదియే వీడితో వచ్చిన చిక్కు)
“గాలించి గాలించి చాలించి నాడు
వేడిలేని కాలాన వాడిలేనివాడు
ఓడిపోయి వీడు మధుర వాడ వీడు
శోధించి జానును సాధించుకున్న
వేదించు ప్రశ్నలు బాధించు మనసును
బసవా నీ ఆసు కవిత కొరడాలవలె నా మనసును తాకినది జాను జాడలే నిచో మనకి కీడు తప్పదు. జాన్ పేరుగల వారెవ్వరూ కానరాకుండిరి. ఇప్పుడేమి చేయవలెను అని అగస్త్యుడు అనుచుండగా బసవడ “ఇందాక మనము పోయిన ఇంటికి మరల పోయెదము ఆ లిల్లీ అను పిల్ల ఇది రాజుగారి ఇల్లు అని చెప్పుటకు తొట్రు పడినది. నాకెందుకో అనుమానంగా యున్నది. నీవు అతడిని చూచినా గుర్తు పట్టగలవా?” అని బసవడు అడగగా గుర్తుపట్టగలనని అగస్త్యుడు చెప్పెను.
కొండ కోనలను చీకటి అలిమినట్లు నిస్పృహ మనసునలుము కొన్నది. బసవడు అగస్త్యుని ఆఇంటివద్ద వదిలి " ఈ ఇంటినుండి ఎవరైనా పోవుచున్నచో గమనించుచుండుము " అని వేగముగా పోయి ఒక కొరియర్ కుర్రవాడిని వెంట బెట్టుకొని వచ్చెను ఆ కుర్రవాడు ఆ ఇంటి ద్వారము వద్ద నిలిచి తన సంచిలో నుండి ఒక పొట్లము తీసి “రాజు గారికి కొరియర్ వచ్చినది. సంత కము చేసి తీసికొనవలెను.” లిల్లీ వచ్చి రాజు గారు ఇచ్చట ఎవరూ లేరని చెప్పుచుండగా అగస్త్యుడు బసవ ప్రవేశించిరి. వారిని చూడగానే , ఆమె ' ఇప్పుడే బైటకు పోయినారని చెప్పుచుండగా అగస్త్యుడు " చాలా సేపటినుంచి నేనిచ్చటనే యున్నాను. ఈ ఇంటి నుండి ఎవ్వరూ బైటకు పోలేదు , నావల్ల మీకొచ్చిన ఇబ్బంది , ప్రమాదం లేదు నేను ఆయన తో మాటలాడుటకు వచ్చితిని , మీరు పిలవకున్నచో పోలీసులని పిలుచుకొచ్చెదను. అను చుండగా అగస్త్యుని గొంతు విని జాన్ బైటకు బైటకు వచ్చి అగస్త్యను బసవడిని లోపలకి తీసుకుపోయెను.
కొత్త సంస్థ పేరుతో జరుగు చున్న మోసములన్నియూ ఆడిటర్కు తెలియునా ?
అతడి దర్శకత్వమునే ఈ వ్యవహారమంతయూ జరుగుచున్నది.
మానాన్నకీ విషయములన్నియూ చెప్పుటకెందుకు సందేహించుచున్నారు ?
మీరు ఇచ్చటికి అతిధి వలే వచ్చి పోవుచున్నారు. మీకిచ్చటి విషయములేవియూ తెలియవు రెండు మాసముల క్రింద 70 లక్షల పిగ్మెంట్ చోరీ కేసు నాపై బనాయించి మీ అమ్మ నన్ను జైలుకి పమ్పవలెనని చూచెను.
పిగ్మెంట్ అనగా ? మత్య పరిశ్రమకు పిగ్మెంట్ తో పని ఏమి కలదు ?
చేపలకు రంగు వేయుటకు పిగ్మెంట్ అవసరము కలదు.
చేపలకు రంగు వేయుటకు మనకేమిపని ?
మీ అమ్మగారు ప్రారంభించుచున్న కొత్త వ్యాపారము అదియే.
మీ అమ్మ అనునప్పుడు నాకు మా అమ్మ మీనాక్షి గుర్తుకు వచ్చును , మా అమ్మ ఇటువంటి స్త్రీ కాదు , కావున ఆమెను మా అమ్మ అని సంబోధించ వలదు. మీ మీద నమ్మకంతో వచ్చితిని, కొంచెము వివరముగా తెలిపిన గానీ నేను అర్ధము చేసుకొని జాలను
మీ అమ్మ గారు అదే డైరక్టరుగారు మాతృ సంస్థను మోసపుచ్చి అందునుండి నిధులు కాజేయుటకు కొత్త సంస్థను ప్రారంభించుచున్నారు. మీనాన్నగారికి ఇది ఎంత మాత్రము ఇష్టమే లేకుండెను, అయిననూ ఆయన ఇప్పుడు భార్య చేతిలో ఒక కీలు బొమ్మే మాత్రమే. ప్రయివేట్ లిమిటెడ్ ను పబ్లిక్ లిమిటెడ్ చేయుట తో ఆమె ఈ మొత్తము నాటకము నకు తెర లేపెను. పబ్లిక్ ఇస్యూ కు పోయిన పిదప పెద్ద ఎత్తున మూలధనం సమ కూరిననూ అన్ని రకములుగా సంస్థకు చేటు కలిగెను.
“ఎట్లు కలిగెను?” “పబ్లిక్ లిమిటెడ్ అనగా వాటాదారులకు భాద్యత వహించుట , సంస్థ లాభ నష్టములను, వారికి చూపుట, ఏన్యువల్ జనరల్ మీటింగ్ నిర్వహించుట , విధాన నిర్ణయముల లో వారిని భాగస్తులను చేయుట, ఇంతే కాక పబ్లిక్ లిమిటెడ్ సంస్థ లన్నిటిపై మినిస్ట్రీ ఆఫ్ కొర్పోరేట్ అఫైర్స్ పూర్తి నియంత్రణ కలిగి యుండును. ఇంతే కాక డైరక్టర్లు కూడా సంస్థపై కొంత నియంత్రణ కలిగి యుందురు. వీరు మంచి వారైన కొంత మెరుగు కానీ వీరి కుట్రలకు సంస్థను బలిచేయుచున్నారు
డైరక్టరుగారు మాతృ సంస్థను మోసపుచ్చి అందునుండి నిధులు కాజేయుటకు కొత్త సంస్థను ఎందుకు ప్రారంభించవలెను?
సంస్థలలో నిధులు స్వాహాచేయుటకు డైరక్టర్లు ఎంచుకొను ఒక రహస్య మార్గము కొత్త సంస్థను ప్రారంభించుట, నిజమునకు ఏ కొత్త సంస్థ నూ ప్రారంభించకుండా కేవలము కాగితములపై సంస్థ ను చూపి నిధులు స్వాహా చేయువారు కూడా కలరు. కానీ గ్రెస్ మీ నాన్నగారు పర్యవేక్షణ ఉండుటచే పూర్తిగా కళ్ళు కప్పుట అసాధ్యమని గ్రహించి ఇట్లు రంగు చేపల విభాగమును ప్రారంభించి అందు నన్ను ఇరికించారు. నేను పోలీసులకు చిక్కక దాగి యుంటిని. నిజము చెప్పవలెనన్న మీ పై నాకు నమ్మకము లేకున్ననూ కొంత ఆశ యున్నది , మీరొక్కరే గ్రెస్ మోసమును బైట పెట్టగలరు.
నాపై మీకు నమ్మ కము లేదు అనుట బాధ కలిగించిననూ నిజమును ఒప్పవలెను కదా!
మీకు ఆ శక్తి ఉన్నచో మరొక విషయమును కూడా తెలిపెదను మీ నాన్నగారికి కూడా మీ పై నమ్మకము లేదు. ఆయన మీకు చాలా విషయములను తెలుపుటలేదు.
డోన్ట్ బీ సిల్లీ మిస్టర్ జాన్ , మా నాన్న గురించి నాకే చెప్పుచున్నావు , మా నాన్న నన్ను నమ్మి నాతొ అన్ని విషయములనూ చెప్పుట లేదని నీ కెట్లు తెలియును?
హ హ్హా హ జాన్ మెల్లగా నవ్వి " మీరు వచ్చి ఎంత కాలమైనది ?" " నెల అయినది "
నెల కాలమందు ఎప్పుడైననూ నా సంగతి మీకు చెప్పెనా? "లేదు" "కానీ ఆయనకీ విషయములన్నియూ తెలియును.” అగస్త్యుని మొఖము పాలిపోయెను.
బసవడు "ఇంతకీ రంగు చేపలు వ్యాపారము మొదలయ్యేనా? పిగ్మెంట్ దొంగిలించుట గూర్చి చెప్పినారు కదా అసలు రంగు చేపల వ్యాపారమునకు పిగ్మెంట్కు సమ్మందమేమున్నది ?
చేపలకు రంగు వేయుటను అలంకరణ చేపల వ్యాపారము లేదా ఆర్నమెంటల్ ఫిష్ బిజినెస్ అందురు . ఈ వ్యాపారము ప్రపంచవ్యాప్తముగా 120 దేశాలలో కోట్లుపైబడి జరుగుచున్నది.
చేపలకు ఇంజక్షన్ ద్వారా లేదా ఇతరపద్ధతులద్వారా రంగు తెప్పించవచ్చు, అన్నిటికంటే ఉత్తమమైనది పిగ్మెంట్ విధానము. పిగ్మెంట్ ను ఆహారములో కలిపి చేపలకు పెట్టుటవల్ల రంగు మార్చవచ్చు, కానీ పిగ్మెంట్ చాలా ఖరీదైనది 1. 4 కోట్లు విలువచేయు 38 మెట్రిక్ టన్నుల నీలి పిగ్మెంట్ కొన్నట్టు చూపుచున్నారు. అదెంత నిజమో ఆ ప్రభువుకే తెలియవలెను. అందు 70 లక్షల విలువజేయు 19 మెట్రిక్ టన్నుల పిగ్మెంట్ నేను కాజేసినానని నాపై పిర్యాదు చేసినారు.
బసవడు “మీరేమి చదువు కొన్నారండీ ? మీకు గ్రెస్ ఏమగును ?
“ ఎం ఎస్ సీ ఫిషరీస్, గ్రెస్ నా మేనకోడలు”
బసవడు “ఇంతకూ మీ మేనకోడలుకు తన భర్తనే మోసము చేయపనేమున్నది ఆ ఆస్తి అంతయూ తనదే కదా?”
అది నాకు తెలియదు , వారిమధ్య చాలా గొడవలే జరిగినవి. అవన్నియూ నాకు తెలియవు.
మీకు మావల్ల వచ్చిన భయము ఏమియూ లేదు, మేము పోలీసులకు తెలుపువారము కాదు
మత్స్య పరిశ్రమకు సంబంధించిన చాలా విషయాలు తెలియచేశారు.ఇప్పుడు దక్షిణా మూర్తి, గ్రేస్ కథ తెలుసుకోవాలన్న ఉత్కంఠ పెరిగింది. బసవడి ఆశుకవిత బాగానే ఉంది.బసవడి ప్రేమ, అగస్త్య తండ్రిని, వ్యాపారమును ఎట్లు కాపాడునో అన్న ఉత్కంఠ పెరిగింది.
ReplyDeleteThank you very much sir, for your feedback is very motivating
ReplyDelete