Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Sunday, August 20, 2017

My Visits to Schools - Colleges - Universities

నిరుద్యోగం, పేదరికం, ఉగ్రవాదం నేటి నిజమైన సమస్యలు కావు. సచ్చీలత ప్రతిభావంతులైన నాయకులు లేక పోవడమే నేటి సమస్య. అదే నేటి అవసరం. అందుకు అందరూ మంచి సాహిత్యం, చరిత్ర తప్పక చదవాలి. కాలేజీలు అందుకు విద్యార్థులను ప్రోత్సహించాలి లేకుంటే కాశ్మీర్లో మద్రసాలకీ ఆంధ్రప్రదేశ్ లో కాలేజీలకు తేడా ఉండదు . 

Numerous educational institutions have invited me to interact with their students in my career.  I have never missed any of these invitations as they are great opportunities to illuminate the students. 

Recently I have visited


Vignan University - Guntur

Govt. HighSchool - Chilakaluripeta

Prabhas Degree College - Vijayawada


పుస్తక పఠనం ఆలోచనా  శక్తిని పరిశీలనా శక్తి ని పెంచుతుంది, వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుందివ్యక్తిత్వం లేని వాడు దేశానికి ప్రమాదం, సమాజానికి చీడపురుఫు. భాష బాగా నేర్చుకోపోతే, సాహిత్యం, చరిత్ర  చదవకపోతే ప్రమాదమేమీలేదు, సాంకేతిక విద్య నేర్చుకుంటే  ఉద్యోగం వస్తుంది అనుకుంటే నీ అంత మూర్ఖుడు ఇంకొకడుండడు. కవిత్వంలో సున్నితత్వాన్ని నింపి మనసులను రంజింపజేసి, ప్రపంచాన్ని  పరవశింపజేసి  ఎందరో సుకవులు  దేశ బావుటాను గగన వీధుల్లో రెపరెప లాడించారు. సున్నితత్వం లేకపోతే కవిత్వం ఉండదు,  మానవత్వం ఉండదు. 

సాహిత్యం చదవకపోతే జాబ్స్ రావా అని వాదించే మూర్ఖపు గాడిదలు ఈ దేశంలో ఎక్కువయిపోవడం మనదురదృష్టం.  ఇదెలా ఉందంటే జాతీయగీతం పాడుతున్నప్పుడు లేచి నిలబడితేనే గౌరవంఉన్నట్లా? అనిఅడిగినట్లుంది.  సాహిత్యం లేక పోతే సమాజం కాదు స్మశానం ఉంటుంది.  అతి తెలివిపరులు అవకాశవాదులు దేశాన్ని నాశనం చేస్తుంటే భాష రాక ఏమీ చదువుకోలేక, ఆలోచనా జ్ఞానం లేక ఇంగితజ్ఞానం నశించి విద్యార్థులు వాళ్ళని వాళ్ళు నాశనం చేసుకుంటు న్నారు. విదేశాలు ఎందుకు అభివృద్ధి చెందాయో, ఎలా ఉంటాయో కూడా మనం తెలుసుకోవాలి.  కేవలం టెక్నాలజీతోనే దేశం అభివృధి చెందిపోతుందని ఒక బుద్ధి హీనుడు మాత్రమే నమ్ముతాడు. మంచి నాయకులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు  పౌరులు కూడా అవసరం.  

మంచి నాయకులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు  పౌరులు  ప్రతి దేశానికి  అవసరం.    జర్మనీలో పల్లెటూర్లలో రోడ్లు మన ఇంట్లో మార్బల్ ఫ్లోరింగ్ మాదిరిగా ఉంటాయి. రోడ్డు మీద మజ్జిగ అన్నం తినవచ్చు.  జర్మన్స్ ఫ్రెంచ్ వాళ్ళు,  వాళ్ళ భాష తప్ప ఇంకొక భాష కి స్పందించరు. ఫ్రెంచ్ జర్మన్స్ లాగా మనం కూడా తెలుగుని గౌరవించుకుంటే మం తెలుగు కూడా వెలుగుతుంది.  అమెరికా లో  టీచర్స్ ,  సైన్టిస్ట్స్  వి ఐ పీ లు.  ఇండియా లో రాజకీయ నాయకులు , రౌడీలు , సినిమా హీరోలు వి ఐ పీ లు.  కొడుకులకు మంత్రి పదవులు కట్టపెట్టడం , వాళ్ళకి  రోడ్ల మీదే రేప్స్ చేసుకునేంత స్వచ్ఛ ఇవ్వడం ఇదే వీరు చేసే సేవ.  కాలు పట్టుకునే మంత్రి ఒకడు, జుట్టు పట్టుకునే మంత్రి ఒకడు . ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా అనే సామెత ఉంది. 

 అన్నం బొట్లవారి పాలెం లో సన్మానం అందుకుంటున్న దృశ్యం


 భాష రాని వ్యక్తి ఏ రంగంలోనూ రాణించలేదు. ఇది తెలిసి కూడా బద్ధకంతో  ఏమీ చదవక, భోగలాలస తో సమయాన్ని  పోర్న్,  ఫిలిమ్స్, పిచ్చి మ్యూజిక్ , పిచ్చి  ఎంటర్టైన్మెంట్ కి అంకితం చేస్తూ వ్యక్తిత్వాన్ని నాశనం చేసుకుని, మంచి ఉద్యోగ అవకాశాలను జారవిడుచుకుంటున్నారు.  పుస్తకం చదువొకోలేని నిర్భాగ్యులు సినిమాని ఆశ్రయిస్తారు. సినిమా డైలాగులతో కాలం గడుపుతూ,  చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని  సినిమా పాటలని వింటూ , కాలేజీ ఫంక్షన్స్ లో కూడా రెకార్డ్ డాన్స్ లాటి ప్రోగ్రామ్స్ పెట్టుకుని, (It happened in Prabhas college in my presence) అమ్మాయిలు అబ్బాయిలు  నృత్యాలు చేస్తూ తమ అభిరుచిని చాటుకుంటున్నారు.   సినిమా అనే గజ్జి  మన వాళ్లందరికీ , ముఖ్యంగా యువతకి ఈ గజ్జి అంటింది అందుకే  మన దేశానికీ సాహిత్యం లో నోబెల్ ప్రైజ్ 1913 లో ఒకే ఒక్క  సారి వచ్చింది.

కాగా ఫ్రాన్స్ , జర్మనీ దేశాలు  చక్కటి సాహిత్యాన్ని సృష్టించి నేటికీ అనేక నోబెల్ ప్రైజెస్ అందుకుంటున్నాయి. సున్నిత మైన ఆలోచనలవైపు మనిషి ఆకర్షితుడు కావాలి, చక్కటి సాహిత్యం వల్ల ప్రభావితుడు కావాలి.  సినిమా సాహిత్యాన్ని విడిచిపెట్టాలి ఎందుకంటే   సినిమాలలు చక్కటి సాహిత్యాన్ని సృష్టించడం లేదు.  చెత్త పాటలు, చెత్త మాటలు.  వాటినే అనుకరిస్తూ చెత్త ప్రవర్తనని మన యువత సొంతం చేసుకుంటోంది. 

ఈ మధ్య జరిగిన అధ్యనం లో మంచి సాహిత్యం చేత ప్రభావితమైన సమాజం ప్రశాంతంగా ఉంటుంది అని తేలింది. జర్మనీ , డెన్మార్క్ , పోలాండ్ దేశాలను  ఇందుకు  ఉదాహరణలు గా చెప్పవచ్చు. మాతృభాషని మరిచిన జాతికి , ఏ భాష పైన పట్టు సాధించని వ్యక్తి కి పతనం తప్పదు.  దేశ చరిత్రని సొంతగా ఎలాగూ చదవలేరు, ఎవరైనా చెపితే వినే ఆసక్తి కూడా లేదు.   చరిత్ర, సాహిత్యం చదువుతూ పరిశీలనాత్మకంగా అర్ధం చేసుకుంటే , చక్కటి సాహిత్యం ద్వారా స్ఫూర్తి పొందితే  చక్కటి నాయకులు తయారవుతారు. 

నిరుద్యోగం, పేదరికం, ఉగ్రవాదం నేటి నిజమైన సమస్యలు కావు.  ప్రతిభావంతులైన నాయకులు లేక పోవడమే నేటి సమస్య.  సచ్చీలత కల ప్రతిభావంతులైన నాయకు లు కావాలి అదే నేటి అవసరం. అందుకు అందరూ మంచి సాహిత్యం, చరిత్ర తప్పక చదవాలి. అందుకు విద్యార్థులను ప్రోత్సహించాలి లేకుంటే కాశ్మీర్  లో మద్రసాలకీ ఆంధ్రప్రదేశ్ లో కాలేజీలకు తేడా ఉండదు . 






ఇంగ్లీయిష్ భాషతోపాటు మరొక ఫారిన్ లాంగ్వేజ్ నేరుకోవడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపక శక్తీ పెరగడమే కాక మెరుగైన  ఉద్యోగావకాశాలు లభిస్తాయి.  ఫ్రెంచ్ , జర్మన్ , స్పానిష్  ఇటాలియన్ ల లో మాట్లాడే వారికి బహుళజాతి సంస్థల్లో ఉద్యోగాలు సులభంగా దొరుకుతున్నాయి. ఫ్రెంచ్, జర్మన్, లేదా  స్పానిష్ మాట్లాడుతూ సర్టిఫికెట్ కలిగి ఉంటె ఎవ్వరూ ఒక్క నెల కూడా ఖాళీగా ఉండక్కరలేదు. సాధారణ సంస్థల నుంచి మొదలుకుని బహుళజాతి సంస్థలు , ఎంబసీల దాకా ఉద్యోగావకాశాలు విస్తరించిన ఫారిన్ లాంగ్వేజెస్ నేర్చుకోవడం, నీ అమ్ములపొదిలోకి మరో అస్త్రాన్ని చేర్చుకోవడమే.
  

 ప్రభాస్ డిగ్రీ కాలేజీ లో విద్యార్థులతో 19th Aug,2017 
మంచిమాట అంటే  వ్యక్తికీ  సమాజానికి మేలు చేసే మాట చెప్పడం రోజుల్లో చాలా కష్టం. కాలేజీల్లో మరీ కష్టం. అలా చేయాలంటే విద్యార్థులను చేరుకోవాలి,  అంతకంటే ముందు విద్యాసంస్థలను చేరుకోవాలి. అది అంత సులభం కాదు.  ప్రభాస్ కాలేజ్ లో నా ప్రసంగం  విని ఉపయోగకరంగా ఉందని భావించి ప్రిన్స్పల్ గారుమరొకసారి రావలసిందిగా కోరారు.  భాషల పట్ల ఆయనకీ గల గౌరవం, ఆయన చూపిన ఆదరణ  మరువలేనివి. కానీ కార్యక్రమాన్ని జరగడానికి గీతా ఫౌండేషన్ అధినేత శ్రీ సుబ్బారావు గారు. వారి శ్రమ ని మాటల్లో చెప్పలేను . మాటల్లో చెప్పనలవి కానీ శ్రమ వారిది. వారికి బ్లాగ్ పోస్ట్ ద్వారా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను