టెంగ్లీష్ - పిచ్చ కామిడీ గురూ - పూలబాల
"ఆవిడ ఇన్స్పిరేషన్ తోనే ఒక స్కిల్ ని స్టార్ట్ చేయాలనే థాట్ వచ్చింది నాకు.....బికాజ్ ఒక ఫస్ట్ హౌస్ అవ్వచ్చు ఒక సెకెండ్ హౌస్ అవ్వచ్చు .....అలా అంటారు కాని వుమన్ ఎన్ని పనులు చేస్తున్నా మెన్ ఈక్వల్ గా అంత పనులూ చేస్తుంటారు. " వీడియో వినండి తెలుస్తుంది. ఇది నేటి తెలుగు వారి భాష .
అటు గాడిద కాదు ఇటు గుర్రం కాదు. అటు ఇంగ్లిష్ కాదు, ఇటు తెలుగు కాదు. ప్రస్తుతం తెలుగు వారు ( అత్యధికులు) మాట్లాడే భాష. నమ్మలేకపోతున్నారా? క్రింద ఇవ్వబడిన వీడియో చూడండి లేదా మీచుట్టూ ఉన్న మనుషులను గమనించండి. బట్, ఇఫ్, బికాజ్ లాంటి ఇంగ్లిష్ పదాలను తెలుగు సంభాష ణ లో వాడుతూ ఇంగ్లిష్ మాట్లాడుతున్నట్టు, ఇంగ్లిష్ కి అలవాటు పడి పోయినట్టు చూబిస్తూ ఉంటారు. వీళ్ళకి ఇంగ్లిష్ రాదని చెప్పను కాని సమంగా రాదనీ ఖచ్చితంగా చెప్పగలను. వీరి భాష చాలా చికాకుగా ఉంటుంది. కంపరం పుట్టించే ఈ భాష ప్రయోగం మీద సంధించిన వ్యంగ్యాస్త్రమే టెంగ్లీష్.
నాటిక ప్రారంభం- అతిథి రాక
మద్యానం సమయం లో వచ్చిన అతిథి తో పిల్లల సంభాషణ.
తేజ: ఎవరో డోర్ నాక్ చేస్తున్నారు, ఓపెన్ చెయ్యి.
శ్రుతి: నేను బిజి రా, నువ్వే ఒక్కసారి కొంచం స్ట్రెచ్ అయి జస్ట్ పుల్ చెయ్యరా. (తేజ తలుపు తీస్తాడు )
తేజ: ఓ, అంకులా, డాడి కోసం వచ్చారా?
శ్రుతి: సిట్ చెయ్యండి అంకుల్. కాఫీ డ్రింక్ చేస్తారా? వాటర్ డ్రింక్ చేస్తారా?
తేజ: వెదర్ హాట్ గా ఉందికదా, కూల్ డ్రింక్ ఐతే బెటర్.
అంకుల్: జస్ట్ కూల్ వాటర్ చాలు బేబి. మీ డాడితో టాక్ చేద్దామని వచ్చాను.
తేజ: ఇంకా ఆఫీసు నుంచి రిటర్న్ కాలేదు. మమ్మీ ఉంది కాల్ చెయ్యమంటారా ?
శ్రుతి: కాల్ చేయ్యడ మేమిటి రా? కాల్ చెయ్యడమంటే ఫోను చెయ్యడము కదా?
తేజ: అబ్బ నీకేంతెలీదు. మా స్కూల్ లో ఇలాగే మాట్లాడతారు.
అంకుల్: మమ్మీ ని డిస్టర్బ్ చేయ్యకండి. వర్క్ చేసి బాగా టయర్ ఐపోయి ఉంటారు. స్లీప్ చేస్తున్నారు. నెక్ స్ట్ టైం కాల్ చేసి వస్తాను.
ఇంటికి వచ్చిన తండ్రితో పిల్లల సంభాషణ....
తండ్రి: సన్నీ, బన్ని డోర్ నాక్ చేస్తుంటే మైండ్ చేయరేంటి?
సారీ డాడి TV వాచ్ చేస్తున్నాము.
తండ్రి: అమ్మ ఏది?
పిల్లలు : ఢిల్లీ పిన్ని అమ్మ ఇద్దరూ వంట గది లో ఉన్నారు.
వంటగదిలో అమ్మ ( మామ్ ) ఢిల్లీ నుంచి వచ్చిన తన చెల్లితో
.
పిన్ని : అక్కా బావగారు వచ్చే సమయం అయ్యిందికదా?
మమ్మీ : అబ్బా అక్క ఏంటి సిస్ అని పిలవమని చెప్పెను కదా.
పిన్ని : నేను అలా పిలవలేను బాబూ , అక్కా అనే పిలుస్తాను
మమ్మీ: నువ్వు మారాలి సిస్ చాలా మారాలి . మావాళ్లని చూసి నేర్చుకో. మా వాళ్ళు ఇంగ్లిష్ అదరగొట్టేస్తారు. చూసావు గా మమ్మీ డాడీ అని ఎంత చక్కగా పిలుస్తున్నారో డీల్లీ లో కూడా ఇలాంటి ఇంగ్లిష్ విని ఉండవు.
కొత్తగా వచ్చే వని నీతో ఎక్కువ మాట్లాడలేదు కానీ ఇకపై చూస్తావుగా. అదిగో ఆయన వచ్చినట్టున్నారు అంటూ చెల్లితో ముందర గదిలో కి వెళుతుంది.
.
ముందరగదిలో తండ్రి (డాడీ) పిల్లలతో
డాడీ: హోమ వర్క్ ఫినిష్ చేసారా?
పిల్లలు : లేదు డాడీ
డాడీ : హోమ్ వర్క్ ఫినిష్ చెయ్యకుండా టీవీ వాచ్ చేయద్దని ఎన్ని సార్లు చెప్పాను?
మమ్మీ: ఎలా ఉంది మా వాళ్ళ ఇంగ్లిష్?
పిన్ని : వాళ్ళు తెలుగే కదా మాట్లాడుతున్నారు!
శృతి: ఓకే డాడీ. నాకు నోట్ బుక్ పర్చేస్ చేసారా?
శృతి: మన రత్నం గారి షాప్ క్లోస్ చేసేసి ఉందమ్మా. టుమారో షూర్గా పర్చేస్ చేస్తాను.
శృతి: ఓకే డాడి ఫర్గెట్ చేయకండి.
మామ్ : సిస్ , అండర్ స్టాండ్ చేసుకుంటున్నావా ?
పిన్ని : ఫర్గెట్ చేయకండా? (వీళ్ళ ఇంగ్లిష్ వింటుంటే నాకు పిచ్చి పట్టేట్టుంది, మనసులో) తెల్లమొఖం వేస్తుంది
మామ్: ఇప్పటికి అర్ధం అయినట్టుంది (మనసులో).
డాడీ: సర్టిన్లీ తల్లీ , గో గో రీడ్ చేస్కో నాన్న.
శృతి: డాడీ హోంవర్క్ చేయాలి, హెల్ప్ చేయి డాడి.
డాడీ: నేను బాగా టయర్ ఐపోయాను, రిలాక్స్ కావద్దూ?
శృతి: ఈ హోమ్ వర్క్ చాలా ఇంపార్టెంట్ , మస్ట్ గా చేయాలిఅని మా టీచర్ చెప్పింది.లేకపోతె బీట్ చేస్తుంది.
డాడీ: ఆ! చిల్రన్ ని బీట్ చేయడమా?
శృతి:అవును డాడీ నిజంగా బీట్ చేస్తుంది
డాడీ: చిల్రన్ ని బీట్ చేయడమా? చిల్రన్ ని బీట్ చేయకూడదమ్మా. నేను మీ టీచర్ తో టాక్ చేస్తాను.
శృతి:వద్దు డాడీ టాక్ చేయద్దు డాడీ . హెల్ప్ చేయమంటే టాక్ చేస్తానంటా వేంటి డాడీ ?
మమ్మీ : శృతి, డాడీ ని అండర్ స్టేండ్ చేసుకోవాలమ్మా ! తేజ చూడు ఎప్పుడు సెల్ఫ్ గా చేసుకుంటాడు.
మమ్మీ : కాస్సేపు రెస్ట్ తీసుకున్నాక నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తారులే.
కాస్సేపు తరువాత ....
శృతి: మీకు హాట్ వాటర్ రెడీ అయ్యింది. బాత్ చెయ్యండి.
డాడి :ఓకే తల్లీ నువ్వు కాస్సేపు ప్లే చేస్కో ఈలోగా నేను బాత్ చేసి వస్తాను . శృతి:అలాగే డాడీ
తండ్రి స్త్నానం చేసి వచ్చిన తరువాత తండ్రి టీ వీ చూస్తుంటాడు
శృతి: డాడీ, మమ్మీ కుక్కింగ్ ఫినిష్ చేసింది. కం చెయ్యి డాడీ.
డాడీ: ఓకే
మమ్మీ: శృతి, తేజ, హాండ్స్ వాష్ చేసుకోండి.
మేము చేసుకోమని పిల్లలు పేచి పెడతారు. ఇంతలో నాయనమ్మ వస్తుంది
నాయనమ్మ: పిల్లలూ చేతులు కడుక్కోకపోతే అనారోగ్యం. జబ్బులు వస్తాయి (పిల్లలు నవ్వుతారు)
నాయనమ్మ: అల్లా నవ్వుతారేవిట్రా , వెర్రి మొఖాలేసుకుని.
మమ్మీ: మీరు మాట్లాడేది వాళ్లకు ఏమీ అర్ధం కాలేదు అత్తయ్యగారు.
నాయనమ్మ: తెలుగులోనే కదా చెప్పాను, మరి ఎలా చెప్పాలి?
మమ్మీ: వాళ్లకి ఇంగ్లిష్లో చెప్పాలి
నాయనమ్మ: నాకు రాదే తల్లీ ఆ ఇంగ్లిషు.
మమ్మీ: అదిగో, వాళ్ళ డాడీ వచ్చారు కదా , ఆయనే చెప్తారు.
డాడీ: ఏంటి తేజ, శృతి, హాండ్స్ వాష్ చేసుకోమంటు న్నారా? తప్పు కదా?
డిసీజెస్ వస్తాయి , సిక్ అయిపోతారమ్మా, వెర్రి వెర్రి డేంజర్ గో , గో ...
పిల్లలు: ఓకే డాడీ
నాయనమ్మ: మావాళ్ళు ఇంగ్లిష్ ఎంత చక్కగా మాట్లాడతారో .
పిన్ని : అక్క రేపు నేను బయలుదేరదామనుకుంటున్నాను.
అయ్యో అప్పుడేనా ? వచ్చి రెండురోజులు కాలేదు.
కొద్దిరోజుల తరువాత ఆఫీస్ నుంచి వచ్చిన భర్తతో మమ్మీ .
మమ్మీ: ఏవండీ కేక్ అడ్డర్ చేశారా?
డాడీ : మౌనం
మమ్మీ : అట్ లీస్ట్... చిల్డ్రన్స్ బర్త్ డే అయినా రెమెంబెర్ చేసుకోరా ?
డాడీ : హ హ్హ హ్హ స్వీట్స్ బ్రాట్ చేసా , కేక్ ఆడ్డర్ చేశా , టుమారో కమింగ్
నాయనమ్మ : పిల్లల విషయాలు ఎప్పుడూ ఫర్గెట్ చెయ్యడు
అతిథి: ఈవిడ కూడా మొదలెట్టేసింది(మనసులో)
మమ్మీ: పిల్లలూ ఈ స్వీట్స్ రేపటికి టచ్ చేయకండి. (పిల్లలు ఇప్పుడే తినాలి అని అల్లరి చేస్తారు)
వన్ టైం టెల్, టూ టైమ్స్ టెల్ నాట్ లిస్నింగ్ మీన్స్ బీటింగ్ ఓన్లీ.
పిన్ని : అంటే ఏంటక్కా?
నాయనమ్మ: పిచ్చిపిల్ల! నీకు వాళ్ళ ఇంగ్లిష్ విని షాక్ తగిలినట్లుంది.
పిన్ని :షాక్ కాదు పిచ్చిపట్టేటట్లుంది.
నాయనమ్మ: మొదట్లో నాకు అంతే. నీకు త్వరలోనే వచ్చేస్తుందిలే.
పిన్ని : నాకొద్దు బాబోయ్ ఈ పిచ్చిఇంగ్లిష్ ( సూటుకేసి పట్టుకుని పరుగు.)
డాడీ: అందరూ ఇంగ్లిష్ నేర్చుకోవాలని చూస్తారు నువ్వు ఏంటమ్మా