Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Tuesday, September 24, 2024

కథల ద్వారా ఇంగ్లిష్ కానీ ఫ్రెంచ్ కానీ బలే నేర్చుకోవచ్చు

 ఏనిమల్స్ అండ్ బర్డ్స్ ఫ్రెంచ్ ఇంగ్లీష్ కథల పుస్తకం .

పూర్తి బొమ్మలతో చిన్న పిల్లలని పెద్దలని అలరించే పుస్తకం



కథల ద్వారా భాషలోకి ప్రయాణం - పూలబాల ప్రయోగం

వందల గంటలు శ్రమించి రాసిన పుస్తకం - అందరికీ ఉచితం టెక్స్ట్ పుస్తకాలు మొక్కుబడిగా చదువుతాం. అదే కథల పుస్తకాలైతే ఆసక్తి గా చదువుతాం. పూలబాల గారి పుస్తకం లో అన్నీ ఆశ్చర్యాలే మనకు పిల్లి కుక్కల గురించి కూడా ఏమీ తెలీదు అనిపిస్తుంది. చదువుతున్నంతసేపూ ఆశ్చర్యం
.
నా పేరు ఖుషి గుజ్రాల్. మాది విజయవాడ. నేను ఇప్పుడు కెనడాలో నివసిస్తున్నాను. పూలబాల గారివద్ద గత నాలుగు నెలలుగా ఫ్రెంచ్ నేర్చుకుంటున్నాను. విద్యార్థులకి బాష నేర్పడానికి గ్రామర్, పాఠాలే కాక అనేక ఆడియోలు వీడియోలు పంపిస్తుంటారు. టెక్స్ట్ పుస్తకంలో ఉన్న ప్రతి పాఠానికీ రెండు ఆడియోలు ఇచ్చారు. ఎన్ని వందల సార్లు బోధపరిచినా, మాట్లాడించినా వీడియోలు ఇచ్చినా ఫ్రెంచ్ నేర్చుకోడం అంత సులభం కాదు. ఇది నా అనుభవం తో చెపుతున్నాను. నాలుగు నెలలు నేర్చుకున్న తరువాత ఫ్రెంచ్ లో ఒక్క వాక్యం చెపితే తిరిగి చెప్పడం కూడా చాలా కష్టం.
.
విద్యార్థులని ఆసక్తి పరిచే కథల పుస్తకాల ద్వారా భాషలోకి ప్రయాణం సులభం అవుతుందని జంతువు లు పక్షులు అనే పుస్తకం వ్రాసారు పూల బాల. జంతు పక్షి ప్రపంచంలో అన్నే వింతలే. ఈ పుస్తక రచయిత పూల బాల వెంకట్ నేర్చుకునే వారికి సులభంగా అత్యంత ఆకర్షణీయంగా మలిచారు.
.
పూలబాల అందరికీ సుపరిచితమైన పేరు. ఆయన నా ఫ్రెంచ్ టీచర్ నేను ఆయన నుండి ఫ్రెంచ్ నేర్చుకుంటున్నాను. నేను కెనడాలో నివసిస్తున్నాను. ఆయన జంతువులు మరియు పక్షులు అనే ఫ్రెంచ్ పుస్తకాన్ని నాకు పంపారు . ఇది ఫ్రెంచ్ మరియు ఆంగ్లంలో వ్రాయబడిన ద్విభాషా పుస్తకం. తన పుస్తకంపై సమీక్ష ఇవ్వమని అడిగారు.
.
నేను పుస్తకాన్ని చదివాను, ఈ పుస్తకం ఫ్రెంచ్ అభ్యాసకులకు చాలా ఆసక్తికరంగా మరియు ఉపయోగ కరంగా ఉంది. అయితే రచయిత పూలబాల గురించి కొన్ని మాటలు చెప్పాలి. ఆయన ప్రతి విద్యార్థి కోసం ఒక పుస్తకాన్ని వ్రాయగల సామర్థ్యం ఉన్న రచయిత. సామర్థ్యం ఉండడమే కాదు వ్రాసి ఇచ్చారు కూడా.
.
విద్యార్థులకు ఫ్రెంచ్ స్పానిష్, జర్మన్ వంటి కోర్సు పుస్తకాలతో పాటు బొమ్మలతో వొకాబులరీ ఇడియమ్స్ ప్రొవెర్బ్స్ వంటి పుస్తకాలు వ్రాసారు విద్యార్థుల కోసం వివిధ విదేశీ భాషలలో పుస్తకాలు .రాస్తుంటారు. స్పానిష్ విద్యార్థులకి స్పానిష్ కల్చర్ హిస్టరీ గురించి కూడా పుస్తకాలు వ్రాసి పంపుతారు. విద్యార్థులకే కాదు ఎవరికైనా తెలియని వ్యక్తులకు కూడా ఉచితంగా పుస్తకాలు పంపుతారు .
.
అడ్వాన్స్డ్ విసువల్ వొకాబులరీ అనే పుస్తకాన్ని అడిగిన 1000 మందికి పంపారు . ఈ పుస్తకంలో కార్టూన్ చిత్రాలతో కూడిన కఠినమైన ఆంగ్ల పదాలు మరియు ఆ పదాలతో చిత్రం చుట్టూ అల్లిన కథలు ఉన్నాయి. ఇది అతని ఒక సంవత్సరం పరిశ్రమ. ఇవ్వడం తెలిసిన మనీషి పూలబాల.


భారతవర్ష - వార్ అండ్ పీస్ -వేయిపడగలు లా

దూరదర్శన్ H. O. P. అరుణకుమారి గారు భారతవర్ష చదివి వార్ అండ్ పీస్ -వేయిపడగలు లా ఉందని చెప్పారు.  అలా   ఎందుకనిపించిందంటే


లియో టాల్ స్టాయ్ వార అండ్ పీస్, విశ్వనాథ సత్యనారాయణ గారి లాగానే పూలబాల కూడా సమాజాన్ని ప్రజల జీవితాలను సునిశితంగా పరిశీలించి ఎన్నో సూక్ష్మమైన సమస్యలను తన మానస పుత్రిక భారతవర్ష గ్రంధం లొ వర్ణించారు. నేటి సామాజిక పరిస్థితులను, చారిత్రిక , సాహిత్య అంశాలను చాలా విపులంగా విశ్లేషణాత్మకంగా వ్రాసారు. ఆసక్తి కరమైన కథ అనేక పాత్రలు సృష్టించి ప్రతి పాత్రకు సముచితమైన స్థానాన్ని అర్థాన్ని కలిపించారు. అష్టాదశ వర్ణనలు వర్ణనలు అతికినట్టు కాక సహజంగా ఉన్నాయి. అనే క సంస్కృత తెలుగు పద్యాలు సందర్భోచితం గా హృద్యంగా చదువరులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. భారతవర్ష ఏ గ్రంధానికి తీసిపోని విధంగా సమున్నతంగా నిలిచింది అనడం అతిశయోక్తి కాదు. అన్నారు అరుణ కుమారిగారు.

మెక్సికో ఇండిపెండెన్స్ డే తిరుపతిలో

ఎందుకు జరుపుకున్నారు?


మెక్సికో జాతీయగీతం ఎలా ఉంటుందో తెలుసా?
.
మెక్సికన్ స్వాతంత్ర్య దినోత్సవం ఎప్పుడు? మెక్సికన్ స్వాతంత్ర్య దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16 న జరుపుకుంటారు మరియు హిస్పానిక్ హెరిటేజ్ నెల ప్రారంభంలో వస్తుంది, ఇది సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 15 వరకు నడుస్తుంది. ఈ నెల మొత్తం, అనేక లాటిన్ అమెరికన్ దేశాలు తమ తమ స్వాతంత్ర్య దినాలను జరుపుకుంటాయి.
.


మెక్సికన్ స్వాతంత్ర్య యుద్ధం 16 సెప్టెంబర్ 1810 అనేది సాయుధ పోరాటం మరియు రాజకీయ ప్రక్రియ ఫలితంగా స్పానిష్ సామ్రాజ్యం నుండి మెక్సికో స్వాతంత్ర్యం పొందింది. ఇది ఒకే, పొందికైన సంఘటన కాదు, అదే కాలంలో స్థానిక మరియు ప్రాంతీయ పోరాటాలు జరిగాయి, దీనిని విప్లవాత్మక అంతర్యుద్ధంగా పరిగణించవచ్చు.
.
11 సంవత్సరాల ( 16 సెప్టెంబర్ 18110 నుంచి 27 సెప్టెంబర్ 1821 వరకు) సుదీర్ఘ పోరాటం తర్వాత మెక్సికో స్పెయిన్ నుంచి స్వాతంత్రాన్ని పొందింది కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన రెండు విషయాలు ఏంటంటే.
.
16 సెప్టెంబర్ అనేది వారికి స్వాతంత్రం వచ్చిన రోజు కాదు వారి యుద్ధం ప్రారంభమైన రోజు .
.
రెండు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎంతో ప్రయాసపడి రక్త తరపునతో సంపాదించుకున్న స్వాతంత్రానంతరము మెక్సికో లో ఇంకా ఆ స్పానిష్ భాష మాట్లాడతారు.
.
పరాయి పాలకులు వెళ్లిపోతారు కానీ వారి ద్వారా పుట్టిన భాష మాత్రం ఆ నేలపై సజీవంగా కలకాలం ఉంటుంది ఇందుకు మంచి ఉదాహరణ భారతదేశం కూడా.
.
ఐఏఎస్ ( రిటైర్డ్) విజయ్ కుమార్ గారి సారథ్యంలో నడపబడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ సంస్థ బంజర భూముల్లో కూడా బంగారం పండించే పరిశోధనాత్మక వ్యవసాయ పద్ధతులను అభ్యసించ డానికి వివిధ దేశాల నుంచి వ్యవసాయ పరిశోధనలో నిమగ్నమైన శాస్త్రవేత్తలు ఈ విప్లవాత్మక వ్యవసాయ పద్ధతులను తెలుసుకోవడానికి ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టారు విజయవాడకు చెందిన పూలబాల వారికి అనువాదకుడిగా వ్యవహరిస్తున్నారు.

పుట్టింది ఫ్రాన్స్ లో పెరిగింది కెనడాలో కానీ

పుట్టింది ఫ్రాన్స్ లో పెరిగింది కెనడాలో మాట్లాడేది ఆంగ్లం లేని పూర్తి తెలుగు.

ఆశ్చర్యపోవడమే కాదు అవాక్కవుతారు కూడా!

.

రీసెర్చ్ చేస్తున్న రీసెర్చ్ అనే మాట వాడడు పరిశోధన అంటాడు. సెల్ఫోన్ వాడుతున్న సెల్ఫోన్ అనడు చర్వాణి అంటాడు నెంబర్ ఎంత అని అడిగడు. సంఖ్య ఎంత అని అడుగుతాడు. స్పానిష్ బృందంతో పాటు తిరుపతి విచ్చేసిన ఈయన వ్యవసాయ పరిశోధన చేస్తున్న ఒక విద్యార్థి. ఈయన పేరు జూలియన్. ఈయన తెలుగు ప్రేమ చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే అవాక్కవ్వాల్సిందే. ఈయన ఆంగ్ల మిళితము కాని స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడడమే కాకుండా తెలుగు లిపి కూడా నేర్చుకుని ఏది చెప్పినా సరే తెలుగులోనే రాస్తాడు. తెలుగు మాట్లాడడంలో ఈయన ముందు తెలుగు వారు కూడా దిగదుడుపే ఈయనతో తెలుగు మాట్లాడుతున్న తెలుగువారు ఓడిపోతారు ఓడిపోతారు కాదు ఓడిపోయారు.


తెలుగు మాట్లాడుతున్నప్పుడు రూమ్ , సెల్ఫోన్ నెంబర్, కాన్ఫరెన్స్ లాంటి అనేక మాటలు వాడొద్దని వాటికి పర్యాయపదాలు ఉన్నాయని తెలుగు వారికి గుర్తు చేసిన స్వచ్ఛమైన తెలుగు భాషా ప్రేమికుడు. రూమ్ కి బదులుగా గది, కీ - కి బదులుగా తాళం , కాన్ఫరెన్స్ అనే మాటకు బదులుగా సమావేశం అనే మాటలను సూచించినప్పుడు ఆయనతో మాట్లాడుతున్న ఇద్దరు తెలుగు వారుతికమక పడ్డప్పటికీ తక్కిన వారు పకపక నవ్వుతూఅలా మాట్లాడితే అది తెలుగని పించుకోదు అని చెప్పారు.

తెలుగువారికి ఆంగ్లేయుడి లేఖ

 సూటిగా అమాయకంగా ప్రశ్నలు...

.


తెలుగు లో చిన్న చిన్న సులభమైన పదాలను కూడా వాడలేక పోతున్నారు? ఎదురు చూడడం అనరు వెయిట్ అంటారు ఎందుకు? సమయం అనరు టైం అంటారు ? ఎందుకు అని పూలబాలని ప్రశ్నించారు కెనడావాసి జులియన్. ఎదో అలా అలవాటైపోయింది అని పూలబాల సర్ది చెప్పబోతే "ఒక్క వాక్య కూడా తెలుగులో మాట్లాడలేక తికమక పడుతున్నారు. తెలుగు భాషను కూడా ఇబ్బందికి గురిచేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే తెలుగు ని తక్కువచేసి చూపిస్తున్నారు. నేను మీదేశం వచ్చినప్పుడు మీ భాషే మాట్లాడు తున్నాను. తెలుగువారితో తెలుగే మాట్లాడుతున్నాను. మీరు మాదేశం వచ్చినప్పుడు లేదా మావారితో మాట్లాడు తున్నప్పుడు ఆంగ్లం మాటాడవచ్చు. కానీ తెలుగు వారితో ఆంగ్లంలో ఎందుకు మాటాడడం ? తెలుగు బాష గౌరవించబడాలి కదా ? వద్దా ?
.
తెలుగువారికి తెలుగు మాట్లాడడంలో ఆనందం లేదా?
.
మీ బాష ఎంత అందంగా ఉందో కదా నాకు నేర్పించండి అన్నారు జూలియన్.
.
బానిస భావం విడనాడి ఏ జాతి బ్రతుకునో అది జాతి అని పూలబాల డీప్ గా ఎమోషనల్ అయ్యి తన థాట్ ని ఎక్స్ప్రెస్ చేశారు . మీరు కూడా రీడ్ చేసిన తరువాత మీకు ఏమైనా ఫీలింగ్స్ కలిగితే ఇంగ్లిష్ లోనే రెస్పాండ్ అవ్వండి.

స్పానిష్ పాటతో గురువుకి సన్మానం

గురు శిష్య బంధాల గురించి స్పానిష్ గీతం వింటే మీకే తెలుస్తుంది




గురు శిష్య బంధాలు ఒకప్పుడుఉన్నతంగా ఉండేవి
కానీ నేడుఅవి పలచబడిపోతున్నాయి మనందరికీ తెలుసు
.
యథారాజ తథా ప్రజా అన్నట్లు, యథా గురు తథా శిష్య!
ఉన్నతమైన గురువులు ఉన్నతమైన శిష్యులనే తయారుచేస్తారు
కొంత మంది గురువులు శిష్యులకు ప్రేమతో బోధిస్తారు
అందుకు ఉదాహరణగా ఇలాటి శిష్యులు కనిపిస్తారు.
అలాటి గురువుల్లో పూలబాల ముందు వరసలో కనిపిస్తారు.
.
స్పానిష్ బాగానేర్పి తన జీవితంలోకి మార్పు తీసుకు
వచ్చి తన జీవితంలో భాగం అయ్యాడని పూలబాలని
తన పాటతో అలంకరించిన గొప్పశిష్యుడు
మీలో గొప్ప భావనలను రేకెత్తిస్తుంది.

స్పానిష్ అనువాదకుడిగా పూలబాల

మెక్సికో నుండి వచ్చిన  వ్యవసాయరంగ  శాస్త్రవేత్తల కు  రాష్ట్ర ప్రభుత్వ సంస్థ RYSS తరుపున  స్పానిష్ అనువాదకుడిగా పని చేశారు విజయవాడకు చెందిన బహుభాషా కోవిదుడు పూలబాల.  తిరుపతిలో జరిగిన అంతర్జాతీయ సమావేశంలో పాల్గొనడమే కాక వ్యవసాయ క్షేత్రాలలో వారితో తిరుగుతూ తెలుగు రైతులు అవలంబిస్తున్న సహజ వ్యవసాయ పద్దతులను వారి కష్టనష్టాలను స్పానిష్ భాషలో వారికి వివరించారు.  



పనంతా ఏ సీ రూముల్లో అనుకుంటే పొరపాటే 90 శాతం పని మండే ఎండలో పొలాల్లో ఉంటుంది.

ఒక చేతిలో మైకు మరో చేతిలో మంచినీరు .. మండే సూరీడు కింద మరో మండే సూరీడు లా ఎడతెగని పని ఉదయం 9. 00 నుంచి రాత్రి 9. 00 దాకా పని ఉంటుందని హోటల్ కి చేరేసరికి రాత్రి 10. 00 అయ్యేదని చెప్పారు.  ఒకప్పుడు ఫ్రెంచ్ అనువాదకుడిగా ఫ్రెంచ్ సమావేశాల్లో పాల్గొని సేవలందించిన పూలబాల నేడు స్పానిష్ శాస్త్రవేత్తలు వచ్చినప్పుడు కూడా అవేసేవలు అందించారు. పనంతా శీతల సమావేశ మందిరాల్లోనే కాదు సూరీడు కింద కూడా ఉంటుంది.  పొల్లాల్లో అనేక తెలుగు రైతులు మహిళలు అధికారులు చెప్పిన విషయాలను స్పానిష్ అతిదులకి వారి భాషలో చెప్పడం గొప్ప అనుభూతి ని కలిగించిందని అన్నారు పూలబాల.

అంతవారు రావడం అదృష్టం కాదా !

నేను వారి అభిమానిని అని చెప్పుకోడమే కాక పూలబాల ఆమె పై ఆశువుగా అద్భుతమైన కవిత కూడా చెప్పారు (చివరిలో కవిత ఉంది. ) భారతవర్ష గ్రంథ ఆవిష్కరణ లక్ష్మీ పార్వతి గారి చేతుల మీదుగా కలలో కూడా ఊహించనిది.

కేవలం తెలుగు మీద ప్రేమతో తప్ప వచ్చారు కానీ వేరే రకంగా అయితే నాలాంటి వాళ్ళకి ఆమె గేటు వద్దకు కూడా పోలేని పరిస్థితి. భారతవర్ష ఆవిష్కరణ సభకు ఆవిడ వస్తారు అని ఎదురుచూసే వేళలో నా మనసులో ఒక నిస్పృహ అంతవారు నేను అల్పుడి ని నా చిన్న సభకు వస్తారా అనుకుంటుండగా రైయ్ మంటూ దూసుకొచ్చింది ఒక కారు. అందులోంచి మహాలక్ష్మిలా దిగారు తెలుగు అకాడెమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి గారు.
.
లక్ష్మీ పార్వతి ఈ పేరువింటే ఒక సాహితీ వేత్త నాకు గుర్తొస్తారు. ఆవిడ ఐతిహాసిక రచన శ్రమణకం మనందరికీ గుర్తుంది ఉంటుంది. కానీ దానిని నేను ఆంగ్లంలోకి అనువదిం చానని నేను చెప్పేదాకా ఆమెకు కూడా తెలియదు. ఒక రకంగా చెప్పాలంటే నేను వారి అభిమానిని అన్నారు పూలబాల. అలా అనడమే కాకుండా ఎందరిమీదో ఆశువుగా కవితలుచెప్పే పూలబాల లక్ష్మీ పార్వతిగారిపై కవితకూడా చెప్పారు
.
శ్రీకృష్ణుడంటి పతికి ఉత్కృష్టమైన సతి
జిలుగు చీరలు కట్టని తెలుగు బిడ్డ
నిను చూసి మురిసేను తెలుగు గడ్డ అంటూ
సాగే కవిత లో ఆమె నిరాడంబరతను సాహితీ
ప్రతిభను కొనియాడారు.
.
నేను ఆరు విదేశీ భాషలలో రాస్తున్నందుకు నన్ను అభినందించారు. అని సంతోషంగా గతాన్ని గుర్తు చేసుకుని మురిసిపోయారు బహుభాషాకోవిదుడు పూలబాల.

Sunday, September 1, 2024

బంగారం లాంటి స్వరమే కాదు - మనసు కూడా.

అయినా నాకు మిగిలింది కన్నీరే - రచయిత పూలబాల

భారతవర్ష కు మొదటి గాయనీ మణి లక్ష్మి శ్రీవల్లి. పరిచయం అవసరం లేని ఆంధ్రుల అభిమానాన్ని ఆంధ్రుల అభిమాన గాయకుడు శ్రీ బాలసుబ్రమణ్యం గారి ఆశీస్సులను పొందిన లక్ష్మి శ్రీవల్లి గారిని ఒక్క సారిగా కలవలేకపోయినా అంచలంచలుగా తెలుసుకుని వారి తల్లి తండ్రుల దయతో చివరకు భీమవరం లో వారి ఇంట్లో కలవగలిగాను.
.
భారతవర్ష పాటలు కీర్తనలు పాడించడానికి నెలల అన్వేషణ వెదుకుతూ వెళ్లిన నాకు పాటకు , 50 వేలు లక్ష అడిగేవాళ్ళే దొరికేరు. పాటకి 25 వేలు ఇద్దామని తయారయ్యాను. ఒకావిడ చక్కగా పాడేరు. నేను మా తోడి కోడలు కలిసి పాడతాము. ఇద్దరికీ చెరో పాతిక వేలు ఇవ్వాలి అన్నారు. కొంత మందికి స్వరం బాగుందనే మాటే గానీ పాడే పద్దతి బాగాలేదు. నేను కట్టిన బాణీలు సహజంగా రాస్తున్నప్పడు పుట్టినవి. నేను పాట బాణీతో సహా రాస్తాను. ఎవరైనా అంటే అనుకుంటాను. పాడే వాళ్లు బాణీ కట్టించమని అడిగారు.


.
దాంతో సంగీత గురువుల చుటూ పరిగెత్తాను. వారు బేక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఉండాలన్నారు. స్థూడియోల చుట్టూ పరిగెత్తాను. నా సాహిత్యానికి ఆరెండూ జతపరచిన తరువాత వింటే ... దారుణంగా ఉన్నాయి. నేను రాసిన గీతాలలా లేవు. వాళ్ళిచ్చిన శాంపిల్స్ ఇంకా నాదగ్గర ఉన్నాయి. వింటే బాధే కలిగేది. బాగా పాడే వాళ్ళుంటే బాగుండునని అనేక మందిని కలుస్తూ అనేక ఊర్లు తిరుగుతూ ఉండగా విజయవాడకు చెందిన బుచ్చయ్యాచారి అపాయింట్ మెంట్ దొరికింది.
.
నాగీతాలు బాగున్నాయని మెచ్చుకోడమే కాకుండా నాబాణీలు విన సొంపుగా ఉన్నాయని చెప్పారు. అప్పటికి మూడు నెలలు గడిచిపోయాయి. బాణీలు ఒకే అయితే పాడేవాళ్లు దొరకద్దూ. అన్వేషణ కొనసాగిస్తుండగా ఎట్టకేలకు లక్ష్మి శ్రీవల్లి గారి నాన్న గారి ఫోన్ నెంబర్ దొరికింది. ఆయన భారతవర్ష గురించి విని తెలుగు భాషా సంస్కృతుల గురించి శాస్తీయ సాహిత్యం గురించి నే పడే శ్రమను గుర్తించి వాళ్ళ అమ్మాయికి భారతవర్ష పాటలు పాడమని అనుమతిచ్చేరు.


భీమవరంలో వారి ఇంటికి అనుకున్నరోజున వెళ్లి పాటలు చూబించి. నేననుకున్న బాణీల లో పాడి విని పించాను. ఆ బాణీకి దగ్గర రాగం ఎంచుకుని చిన్న చిన్న మార్పులు చేసి పాడి వినిపించించారు శ్రీ వల్లి గారు. కొద్దీ రోజుల తరువాత భీమవరం విష్ణు రేడియోస్టేషన్ రికార్డింగ్ స్టూడియో లో రికార్డింగ్ చేసాము. రికార్డింగ్ జరుగుతున్నప్పుడు వాళ్ళమ్మగారు కూడా ఉన్నారు. ఆ పాటలు వింటుంటే మనసు గాల్లో తేలిపోయింది. పాటల కోసం స్వరాన్వేషణ ముగిసింది. స్వరరాణి దొరికింది. రికార్డింగ్ ముగిసిన తర్వాత శ్రీ వల్లి గారికి కృతఙ్ఞతలు చెప్పి చేతులో ఒక చెక్కు పెట్టాను. ఇంత వరకూ ఆమె ఆ చెక్కు మార్చుకోలేదు.
.
అంత ప్రతిభ ఉండి కూడా, ఇంత చేసి కూడా నాకు తన ఓదార్యం తో కన్నీరే మిగిల్చింది - ఆ కన్నీటికి మరో పేరు ఆనంద భాష్పాలు.

రచయిత పూలబాల

భాషకి అలంకారం అక్షరమా శబ్దమా ?

 చంపక మాలలో  పద్యాన్ని మొదట  ఇలా రాసాను  

చంపకమాల పద్యంలో నజ భజ జ జ ర అనే గణాలు ఉండాలి. 1వ అక్షరానికి 11 వ అక్షరానికి యతి మైత్రి కుదరాలి అనే నియమాలు ఉన్నాయి. క్రింది చంపకమాల 2వ పద్యంలో  అన్ని నియమాలు సరిగానే ఉన్నాయి  కానీ  మొదటి పద్యంలో 2వ పాదంలో యతి మైత్రి  క-కు  హల్లుల వరకూ సరిపోతుంది.  అచ్చు లకు సరిపోదు.  ఇది చాలా సూక్షమైన లోపం.   

 (మొదటి అక్షరంగా   కి వచ్చి నపుడు 11 వ అక్షరం  కె  కానీ గె కానీ రావచ్చు.)  

కినుక మువీడి నిచ్చెను కుశాగ్ర రసజ్ఞ నవచై  తన్యమున్  -  ఈ పాదం లో "కుశాగ్ర రసజ్ఞ నవచై  తన్యమున్ మార్చేస్తే పద్యం అందం పోతుంది. కు అనే అక్షరం ఒక్కటి ముట్టుకుంటే ఆ తరువాత వచ్చే అన్ని పదాలు మార్చాలి.   మొదటి పద్యం చూడండి. ఇలా ఉంటుంది.   



చ . అనువు గవేడ భారతి  అహార్య మహత్వ కవిత్వ శక్తతన్ 

  కినుక మువీడి నిచ్చెను కుశాగ్ర రసజ్ఞ నవచై  తన్యమున్

 కనక మునీకృ ప  భృగువు గాదె సనాతని దివ్య బాసటన్ 

మనమున బుట్టు పద్యముల నిత్తు తల్లికి నివాళి నిత్యమున్


 రెండవపాదంలో మొదటి అక్షరాన్ని సరిచేసి రాసాను . రెండవ సారి పద్యం ఇలా ఉంటుంది.


చ . అనువు గవేడ భారతి  అహార్య మహత్వ కవిత్వ శక్తతన్  

 గొనబ  గుభాష  యునిచ్చె    కుశాగ్ర రసచై     తన్యమున్   

కనక మునీకృ ప  భృగువు గాదె సనాతని దివ్య బాసటన్  

మనము  న బుట్టు పద్యముల నిత్తు తల్లికి నివాళి నిత్యమున్


కానీ మొదటిసారి రాసిన పద్యమే బాగుంటుంది. కారణం శబ్దం ముందు ఆ సూక్ష్మ లోపం ఒడిపోతుంది.  పోతన భాగవతం లో కూడా అక్కడక్కడా ఛందస్సు లో కాంప్రమైజ్ అయ్యాడు. మహాను భావుడు ఆయన ముందు నేనెంత ? 


(అంటే మనోజ్ఞమైన భాష అని అర్థం)