మెక్సికో నుండి వచ్చిన వ్యవసాయరంగ శాస్త్రవేత్తల కు రాష్ట్ర ప్రభుత్వ సంస్థ RYSS తరుపున స్పానిష్ అనువాదకుడిగా పని చేశారు విజయవాడకు చెందిన బహుభాషా కోవిదుడు పూలబాల. తిరుపతిలో జరిగిన అంతర్జాతీయ సమావేశంలో పాల్గొనడమే కాక వ్యవసాయ క్షేత్రాలలో వారితో తిరుగుతూ తెలుగు రైతులు అవలంబిస్తున్న సహజ వ్యవసాయ పద్దతులను వారి కష్టనష్టాలను స్పానిష్ భాషలో వారికి వివరించారు.
పనంతా ఏ సీ రూముల్లో అనుకుంటే పొరపాటే 90 శాతం పని మండే ఎండలో పొలాల్లో ఉంటుంది.
ఒక చేతిలో మైకు మరో చేతిలో మంచినీరు .. మండే సూరీడు కింద మరో మండే సూరీడు లా ఎడతెగని పని ఉదయం 9. 00 నుంచి రాత్రి 9. 00 దాకా పని ఉంటుందని హోటల్ కి చేరేసరికి రాత్రి 10. 00 అయ్యేదని చెప్పారు. ఒకప్పుడు ఫ్రెంచ్ అనువాదకుడిగా ఫ్రెంచ్ సమావేశాల్లో పాల్గొని సేవలందించిన పూలబాల నేడు స్పానిష్ శాస్త్రవేత్తలు వచ్చినప్పుడు కూడా అవేసేవలు అందించారు. పనంతా శీతల సమావేశ మందిరాల్లోనే కాదు సూరీడు కింద కూడా ఉంటుంది. పొల్లాల్లో అనేక తెలుగు రైతులు మహిళలు అధికారులు చెప్పిన విషయాలను స్పానిష్ అతిదులకి వారి భాషలో చెప్పడం గొప్ప అనుభూతి ని కలిగించిందని అన్నారు పూలబాల.
No comments:
Post a Comment