Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Friday, April 23, 2021

మండుతున్న గదిలో

21. కరోనా 

మమకారంతో మాతృ భాషని మట్టుబెట్టి 

ఉన్నత విలువలతో వోట్లమ్ముకుని

ఉచితాలకి ఎగబడి అవినీతిలో దిగబడి 

ఆక్సిజన్ కావాలని రంకెలేస్తున్నావు 

న్యాయం కావాలని ఎందుకు అడిగవు?

నీ గోడమీద చూసుకో నాన్న 

నాలుగు లైక్స్ వచ్చేలా నువ్వు రాసిన 

వెకిలి మాటలు నిన్ను వెక్కిరిస్తున్నాయి 

నువ్వు చెప్పి చెప్పి ఆచరించని  ధర్మం 

నువ్వు చెప్పకుండా ఆచరించే అధర్మం  

నువ్వు రాస్తున్న శుష్క  నీతి వాక్యాలు 

నిప్పులా నీమీద కురుస్తున్నాయి 

కరోనా వేరియంట్ల రూపంలో కరుస్తున్నాయి


20. చీకట్లో చెమ్మచెక్క

చదువు మనకొద్దు

మన రాజకీయాలకి  లేదు హద్దు  

ఏడీ  నేడేం చదివేవనడిగే  పెద్ద ?

పాలిటిక్స్ తో పళ్ళు తోంకుని 

సినిమాతో స్నానం చేసుకుని 

రాజకీయబురద జల్లుకుని 

అమ్మానాన్న అత్తమావా 

కొడుకు కోడలు కథలు అల్లుకుని 

చీకట్లో చెమ్మచెక్క  లాడుకునే  పెద్దలు 

నిష్ప్రయోజకులను తయారుచేసే గెద్దలు 


19.  గమ్యం 

సృజనాత్మక ప్రపంచంలో ఎక్కడోయ్ నీ చోటు?

రసాస్వాదనలో నీకు ఎందుకోయ్ అంతలోటు?

కవిప్రపంచం కైలాసవాసం  రసజ్ఞులకాలవాలం

విమలమయూక రేఖా చుంబితం రసప్రపంచం

 జ్ఞాన ప్రపంచం తలుపులు తెరిచే ఉన్నాయి

ప్రవేశించు అభియుక్తుడవై  అనువక్తుడవై 

 సంజ్ఞాన, విజ్ఞాన, ప్రజ్ఞానాలు పలకరిస్తాయి

మానవాళి గమ్యం కారాదు విద్వేష పూరితం 

 జ్ఞాన రాగ విరాగ భరితం కావాలి నీ జీవితం 


18. నువ్వెవడివి ?

నీ బ్రతుకే విద్వేషాగ్ని గుండం.  ద్వేషాగ్ని దగ్దం!

జగన్ మోదీ  లేదా మరోడు 

ఎవడో ఒకడిపై  నిత్యం ఎందుకు కక్కుతావు విషం?


ఎందుకీ విద్వేష విష వ్యాపారం? ఎందుకీ బానిసత్వం?

నిత్యం కోడై కూస్తావు 

నీలాటి లక్ష కోళ్ళుకూడా, తోడేళ్ళకు కావు సవాళ్ళు

నీలాటి లక్షకోళ్ళు కూసినా లక్ష్యపెట్టవు తోడేళ్ళు 


మందతో చేరి ఎందుకు నిత్యం రువ్వుతావు రాళ్ళు?

రువ్వుడు కూలివా?

ఎక్కడుంది కాశ్మీరీ రాళ్ళ రువ్వుడు కూలికీ 

ఆంధ్రా రాళ్ళ రువ్వుడు కూలీకి రవ్వంత భేదం?


17.కనిపించని స్మశానం

సంపాదనకే పదవులు 

పదవులలో వెధవలు 

ప్రజాతంత్రమున  ప్రజలు ప్రథములు

వారేన్ద్రీ  వృక్ష భక్షకులు

వారే అధములు పరాన్న భుక్కులు 

వోట్లమ్ముకునే వెధవన్నర వెధవలు 

మన సమాజం సుష్కించిన వనం

కనిపించని స్మశానం


16.  యువకులు

లక్ష్యషుప్త  సంస్కారవర్జిత

జీవులు జీవన్మృతులు  

జ్ఞాన సూన్యులు నటకులు వీరికి మాన్యులు  

నటులను కొలుచు యువకులు 

ఆత్మ వినాశన కారులు  


సకటాసురులు లోక సంచారులు 

దుర్భల మానసులు భోగాను రక్తులు 

 కామ పీడితులు మధ్య ప్రియులు

విద్యావిరక్తులు అబల బంధకులు 

చీకటి గుయ్యారాలు నేటి యువత 

అంధకార బంధురము యువత భవిత 


15. యుగాస్టార్ 

ఎవడిచ్చాడు  మెగాస్టార్?

ఎవడిచ్చాడు మహాత్మా? 

ఎలావచ్చింది మహాకవి?

ఎక్కడివీ  భుజకీర్తులు?  

ఎవరిచ్చారీ  బిరుదులు?

 అన్నీ తగిలింపులే గా !

నిజమేగా  నెహ్రూ కూడా అంతేగా !

 తగిలించుకుంటే తప్పులేదుగా!

అందుకే శక్తి కొద్ది నువ్వు  మెగా స్టార్

యుక్తి కొద్దీ  నేను యుగాస్టార్ 


1. యతి ప్రాసలతో ప్రయాసపడి రాస్తే మిగిలేది 

ఆయాసమే తప్ప ఆనందం కాదు.  రాస్తే నీకోసం 

రాసుకో ఎవరికోసమో రాస్తే గుండెకోతే . ఛాతీపై వాతే  

నీకు రక్తం కారుతున్నా ఎవరికీ అశ్రువులు కూడా 

కారవు. అందుకే ఎవరికోసమో రాయకు. రాసినా 

ఎవడో చదవాలని చూడకు . చదివినా వాళ్ళ మనసు 

విప్పాలని కోరకు . ఎవరికీ ఏమీ చెప్పకు , గుండె గుట్టు

విప్పకు. ఎవరో ఆనందిస్తే నీకేమొస్తుంది ?

 మండుతున్న గదిలో  మరణ యాతన 

పారుతున్న నదిలో  ఎదురీత యాతన 

నీ స్పందనకు ఎదురుచూపు యాతన 

రచయిత రక్త నాళ్ళల్లో  రక్త పీడన  

 చల్లని మదిలో  మరుగుతున్న రక్తాన్ని 

తాగు కడుపునిండేలా , నల్ల సూర్యుడు మండేలా 

గుర్తొస్తాడు ఏడవరా నీ గుండె మండేలా వాడి కళ్ళు నిండేలా. 

 పక్కోడు చచ్చిపోతే పండుగ చేసుకునే దండుగ నాయాళ్లు 

మీరేంటిరా నాకేసేది దండ, నాకుందిరా సనాతని  అండదండ.  

2. ఎర్రకవులు ఎక్కడరా ?

ఎక్కడ రా ఎక్కడ రా  ఎర్రకవులు ఎక్కడరా ?

పాతదంతా పాచి  పాచని కొత్తదంతా రాసి రాసి 

అని కూసికూసి ఉన్నదంతా కూలదోసి 

తుర్రుమన్న ఎర్రకవులు  లెక్కడ రా లెక్కడ రా 

ఎర్రకవులు లెక్కడరా ?

సంప్రదాయం చట్టుబండలు ఎర్ర జెండా పట్టుకోమని

వేపవద్దని కరివేపవద్దని  కర్పూరమొద్దని  

 జట్లు కట్టి చెట్లు కొట్టి  పొగ గొట్టాలలో ప్రగతి ఉందని

ఉన్నదంతా కూలదోసి  తుర్రుమన్న ఎర్రకవులు 

 లెక్కడ రా ఎక్కడ రా  ఎర్రకవులు లెక్కడరా ?

వేద మొద్దని పూజలొద్దని పువ్వులొద్దని గాజులొద్దని

రాముడొద్దని కృష్ణుడొద్దని గోమాత వద్దని

గొబ్బెమ్మలొద్దని ఉన్నదంతా కూలదోసి  

తుర్రుమన్న ఎర్రకవులు లెక్కడ రా లెక్కడ రా  

ఎర్రకవులు లెక్కడరా ?

కేకలో కవితలో తెలియని బొగ్గుబండి కవితలు 

అభ్యుదయమని నమ్మించి  అడవిబాట పట్టించి , 

నరజాతికి  నవమార్గమని నరనరాలలో నింపేసి

అడవిలో దింపేసి  యెర్ర జెండా చేతికిచ్చి 

తుర్రుమన్న ఎర్రకవులు లెక్కడ రా లెక్కడ రా  

ఎర్రకవులు లెక్కడరా ?

కాశ్మీర్లో ఉగ్రమూకలు దేశంలో ఊరకుక్కల 

ఒరిగిపోతున్న గుళ్ళు  పెరిగిపోతున్న మతమార్పిళ్లు

సమానత్వం పేరుతో  స్మశాననృత్యం చేయించి 

కాషాయాన్ని ఎద్దేవా చేసిన ఎద్దులెక్కడరా

ఎక్కడరా ఎర్రకవు లెక్కడరా  

చైనా లో చీమ కాలు విరిగితే గగ్గోలు పెట్టి 

రష్యాలో వానపడితే ఇక్కడ తుమ్మి                    

ఇక్కడ  జాతి  జనుల నడ్డి విరిగితే 

ఎరుపు మొహం వేలేసుకు చూసే  

ఎర్రకవులు  లెక్కడ రా ఎక్కడరా 

ఎర్రకవులు లెక్కడరా ?


3. ఎర్రబాబుకి ఎంత కష్టం 

ఎంత కష్టం ఎంత కష్టం 

చైనాకి నష్టమొస్తే ఎంత కష్టం 

నక్స లైట్లే  లేక పొతే ఎంత కష్టం 

కూలి నాలి చేయలేని కష్టపడి 

పని చేయలేని ఎర్రబాబుకి ఎంత కష్టం  


సనాతన ధర్మం పుంజుకుంటే 

కాషాయకేతనం రెపరెప లాడితే 

సెక్కులరిజం సన్నగిల్లితే 

ధర్మ ధ్వజునికి ఎంత కష్టం ఎంత కష్టం


దేశ సేన ప్రవర్ధిల్లితే  దేశభక్తే పరిఢవిల్లితే 

ఐకమత్యతే ప్రబలి పొతే టెర్రరిస్టుకి భయంవేస్తే

 ఎంతకష్టం ఎంతకష్టం  ఎర్రబాబుకి ఎంత నష్టం

స్వావలంబన  పొదలుకొంటే 

సాంకేతికతే  ఉన్నతిల్లితే 

పరిశ్రమలే వృద్ధి చెందితే 

చైనా వాడే పల్లటిల్లితే ఎంతకష్టం ఎంతకష్టం

ఎర్రబాబుకి ఎంత నష్టం


4. వంచితులు

చితికిన బ్రతుకులు కోరేదేమిటి? 

దక్కని వారము చిక్కని స్వాంతము 

పరాజిత ప్రాణుల గమ్యమేమిటి ?

ధిషణ వృద్ధి   లక్ష్య సిద్ధి 

పీడిత ప్రజల గమ్యము ఏది  ?

నిర్వేశము నిర్వేదము


5. పేదలు  పేదలు పేదలు 

విద్య లేని నిరుపేదలు

బుర్రలేని గొర్రెలు 

బరిలో నిలిచే బర్రెలు 

మనచేతికి చిక్కిన పావులు

తెరపై ఆడే బొమ్మలు  చూసి 

దాసోహమనే వాజెమ్మలు

నక్కలని నాయకులని 

ప్రచారం చేసే కుక్కలు


పేదలు  పేదలు పేదలు 

విద్య లేని నిరుపేదలు

పుర్రెలు తప్ప బుర్రలేని 

చదవలేని దద్దమ్మలు 

రూకలు ఇస్తే కర్రలు పట్టుకు 

బరిలో నిలిచే బర్రెలు


పేదలు  పేదలు పేదలు 

విద్య లేని నిరుపేదలు

ఆత్మాభిమాన మెరుగని నిర్భాగ్యులు 

దేశమాతపై రాళ్లు రువ్వే దౌర్భాగ్యులు 

తల్లిని  మార్చే త్రాష్టులు 

పేదలే మన ధనం పేదలే మనకు వరం   

అందుకే భారతాన పేదలు అజరామరం


6.పోరా బోకా నీకొక తోకా 

నువ్వే ఒక వాడికో తోక 

వాడికి నువ్వొక  ఈక 

ఎంగిలి మెతుకులు రాలిస్తే 

వంగి వంగి దండాలు పెట్టే 

వెన్నెముకలేని కుక్కా 

చదువుకుని కాళ్ళు మొక్కే ఖర్మమేమిరా 

గురువు కాళ్ళకి మొక్కవేమిరా  

చదవలేక చదువుకొన్న నక్కా ​  

కులపేరుతో ముష్టెత్తుకునే ఖర్మమేమిరా 

కరములుండగా ఈ మర్మమేమిరా 

నాట్యరాణి మయూరి సుధను 

పరుగులరాణి హిమాదాసును చూడవేమిరా  

కులపేరుతో ముష్టెత్తుకునే ఖర్మమేమిరా 

పరధర్మానికి ప్రాకులాడే కుక్క 

నీకు ఉచితాలిస్తే దేశానికి బొక్క

దేశానికి వేళ్లూడదీస్తావురా 

నిన్ను వేళ్ళాడదీసే రోజు వచ్చిందిరా 


7. నేను 

నిశిరాత్రి నేస్తాన్ని భృంగారి గీతాన్ని

నైస్పృహ్య వనవహ్ని రిపుఘాతినీ

భవభూతి  గీతాన్ని చక్రవాతాన్ని 

అనిల ప్రతాపాన్ని  త్రేతాగ్ని రూపాన్ని 

చండ  ప్రచండాన్నిడమరుకా నాదాన్ని  

త్రిపురారి ఫాలనేత్రాన్ని  వేద తురాగాన్ని

కల్కి ఖడ్గాన్ని  పరమాణు అస్త్రాన్ని 

నేనే బహుభాషా విశ్వరూపాన్ని 

నాపదాలు  ప్రళయ పర్జన్య నస్వనాలు 

నాపద్యాలు విఘటిత ఝట విఘన ఘన విన్యాసాలు 

నా భావ  ఉత్సేక  ప్రాగ్భావాలు అభబ్బాగమన  ప్రేరకాలు

నా గీతాలు  నిర్నిద్ర  రుద్ర  విప్లవ  రావాలు


8.   ప్రేరణ 

నీలి నింగి నిప్పు కురుస్తుందని 

మేఘాలు పెళ పెళ లాడే దాకా తెలియదు

మెరుపులు తళ తళ లాడే దాకా తెలియదు

ధరిణిని దట్టి  భగ భగ మండే దాకా తెలియదు


మేఘాలలో విధ్యుత్ ఉందని   రాపాడే దాకా  

నీ మాటల్లో  విధ్యుత్ ఉందని  మాటాడే దాకా

నా మాటల్ని అవి రాపాడే  దాకా తెలియదు

ఎర్రని మంటలు రేపే దాకా తెలియదు


నీ మనసు తెలుపని కోపం ఎరుపని 

నీ మాట కఱుకని అదే ముడిసరుకని

నా కవిత ఎరుపని  రాసేదాకా తెలియదు


నీ గంభీర సంభాషణలు గర్జించు గడేరాలని

గాండ్రించు వ్యాఘ్రాలని బుసకొట్టు భుజంగాలని

ప్రవర కవితార్ఘ్యాలని ప్రవరించు మహార్ఘ్యాలని 

ప్రజ్ఞాన ప్రవరణాలని  రచనా ప్రేరకాలని తెలియనే  తెలియదు


సాహిత్య నీలాకాశంలో నువ్వో మబ్బు నేనో మబ్బు

అందుకే  ముద్దుగ ముద్దరేసి మరొక్క గుద్దు గుద్దు


9. అవివక్షితము

పని పని పని నీకెంతసేపూ 

పని ఎంతచేసినా తరగని పని 

అది కనిపెట్టి జీవించడమే నీ పని 

లేకుంటే  నీ పని పట్టడమే నా పని. 


పనికి మాలిన పనిలో పడితే శని 

నా  కవితా శరత్ చంద్రికలు కని

సుకుమార సుందర బందుర  

కుందుర పదములు పారాడు ధుని 

యని విని, పని పని అనడమే శని 


మొరటోడికి మొగలి పువ్వు ఇచ్చినా 

సగటు జీవికి కవితా పుష్పం  ఇచ్చినా 

చేసేదొకటే . . .. అవివక్షితము


10. గద్దఱి, గరాసు దుర్జనులారా 

ఘోటక కర్కోటక దుర్మతులారా 

మైకు ప్రార్ధనల ఫేరవులారా 

ఇసుకాసురులారా విన్నారా

కరములు సాచి కరోనా పిలుస్తోంది  

భూబకాసురులారా కన్నారా 

గజ్జె కట్టి  కరాళ నృత్యం చేస్తోంది 

మహిషము పై లోహపు గంటల మోత

ఎంత  ఏడ్చినా తప్పదు బ్రహ్మ రాత 


విలువలుకు వలువలు ఎంత ఊడ్చావో  

నీతి  నీవలన నెంత  వల వలా  ఏడ్చిందో 

ధరలోని  ధర్మమెంత నెత్తు రోడ్చొందో 

నీ ముష్టి నీతి కి ఆడదెంత ఏడ్చిందో


 ఇతిహాసాల ఇనప గొలుసులతో  

సారసాక్షి స్వారసిక సరసాభిలాషను  

సారస్వత  జాలంలో బందించి 

మత  గ్రంధాల గండ్ర గొడ్డళ్లతో నురివి 


విద్యను చెరచే నీతి ఏలారా 

నీతిని పాతే జాతి ఏలరా   

జాతిలేని నీతి  ఏలరా

అర్థములేని స్వార్థమేలరా 

జ్ఞానము లేని విద్యయేలరా 

ధర్మములేని భోగమేలరా 

భూమికి  చెదలు పట్టనేలరా


 అశ్శ రభ  శరభ ఆడుకుంటోది 

 అశ్శరభ  అశ్శరభ సరభసిల్లండి  

కొక్కొకొ కొక్కొకొ పరుగులెత్తండి 

మరుజన్మలోనైన మంచిగా బతకండి 


11. విప్లవం 

ఎవడ్రా  ఎవడ్రా ఎర్ర జెండా  

అంటే  విప్లవమన్నది? 

ఎవడ్రా  ఎవడ్రా విప్లవమంటే 

తిరుగుబాటన్నది ?


విప్లవమంటే జెండా కాదురా  అజెండా  

అజ్ఞానాన్ని చెండాడే తెల్లజెండా 

విజ్ఞానాన్ని పంచడమేరా  విప్లవం 

పట్టుమని పది పుస్తకాలు చదవని 

పుండాకోర్ ముండాకొడుకులకి 

విప్లవమంటే డబ్బున్నవాడి మీద 

తిరగబడడమే అని చెప్పే సన్నాసులకి 

సలాం చేసే గులాము అవ్వకు 


ఎవడ్రా  ఎవడ్రా ఎర్ర జెండా  

అంటే  విప్లవమన్నది? 

ఎవడ్రా  ఎవడ్రా విప్లవమంటే 

ఎర్ర రంగన్నది? 


రంగు లేనిదే విప్లవం

రాసి ఉన్నది కోసు లేనిది విప్లవం 

జ్ఞామార్గమే విప్లవం 

తన్ని లాకునేది కాదురా విప్లవం 

చదివి సాధించుకునేది విప్లవం 

జ్ఞానం లేని విప్లవం శవం 


12. బానిసత్వం

చేపకి ఎర - మనిషికి మతం

ఆపై తెలియదు పుణ్యం పాపం

వంట పడితే మతతత్వం 

తెలియనిదల్లా తన బానిసత్వం  

ఫీజు లేని లాయర్లులా తయారయ్యి 

వాదిస్తారు అర్ధ జ్ఞానంతో 

తీర్పులిచ్చేస్తారు జడ్జీల్లా


అయ్యో అయ్యో యతి ప్రాసలేవి 

 అందమేది  నీ కవిత్వంలో

యతి ప్రాసాలా బొచ్చా 

పద్దతిగా చెపితే ఎవడు విన్నాడు గనుక 

అందం గా రాస్తే ఎవడికి అర్ధం అయ్యింది గనుక 

మనిషి మనిషులా ఎప్పుడు బతికేడు గనుక 


పడకలేయడం తప్పు అయితే 

పాతివ్రత్యం ఒప్పు అయితే 

పరాయంగనల పొందు కోసం పరితపించే

వాసమెందుకు స్వర్గమయ్యెను 

భూలోకంలో బ్రోతల్ అంటాం 

దేవగురుడు ఇంద్రుడు అంటాం 

బలం ఉంటే కాళ్ళు మొక్కుతాం 


కుంతి వివాహేతర సంతానం 

అంతా దివ్య పురుషులేకదా 

ఫలంలా స్త్రీని పంచుకోవడం 

అ రణ్య వాసాలు అగ్ని ప్రవేశాలు  

అన్నీ అద్భుత సన్నివేశాలే కదా 


13. చీకటి - వెలుగులు 

ఋషులు చేసినది, సురులు చేసినది 

శృంగారము, నరులుచేస్తే పెద్ద వ్యభిచారము.

అగ్ని దేవుడు చెరిచె అంగీరసుని భార్యని

పుత్రునే కన్నది శ్రద్ద - అతడే బృహస్పతి.

బృహస్పతి పెండ్లాడే అందాల తారను   

ఇంద్రుడు వంచించే గౌతముని భార్యని 

రావణుడు రేపు జేసె కాబోయే  కోడల్ని


ఆ  తార మోహించె మగని శిష్యుడిని  

ఆ శిష్యుడే చంద్రుడు -భలే వన్నెకాడు 

లేపు కెళ్ళి  గురుపత్ని తారని కడుపుచేసే   

బిడ్డని కన్నది తార ఆ బిడ్డ పేరే బుధ గ్రహము. 

బృహస్పతి అన్న ఉతథ్యుడు - ధర్మబద్ధుడు

అతని భార్య మమత  అందాల రాసి 

మరిది బృహస్పతికి  మమత పై కన్ను పడెను  

వారిద్దరూ పక్క పంచుకొనగా ఆమె 

భరద్వాజుడను కొడుకును కనెను. 


బృహస్పతి కొడుకు కుశధ్వజుడు 

అతడి కూతురు వేదవతి గొప్ప అందగత్తె

 శంబురాజు ఆమెను పెండ్లియాడ 

 ఆమె తల్లి తండ్రులనడగ వారు వలదన

మంట రేగి శంబుడు వారిని చంపివేసె

రావణుడు వేదవతిని రేపు జేసె  


అనసూయ మొగుడు అత్రి మహర్షి 

అవివాహితైన అనసూయ ఒక నాడు 

స్నానమాడుచుండగా అత్రి ముని చూసే 

కంటి చూపు తోనే కడుపు చేయ ఆమె 

పండంటి బిడ్డను ప్రసవించెను , అతడే 

మన దత్తాత్రేయ స్వామి. 


 కామము పాలించె మునులనైనా 

దేవతలనైనా.  విశ్వామిత్రుడైన మేనకకి 

తలఒగ్గ లేదా ? 

చదవలేని వారలకు నా కవిత వెలుగు 

నిజము తెలుసుకొన్న జగతి వెలుగు 

Brahma Saraswati relation 

https://360faithstory.blogspot.com/2017/06/is-lord-brahmas-incestuous-relationship.html


14. XXX

సంస్కారవంతమైన కవిత 

XXX కొడుక్కి కారుంది ఇల్లుంది 

తెల్ల రేషన్ కార్డుంది 

మతాన్ని తన్ని పార XXX  

కులాన్ని అట్టేపెట్టుకున్నాడు

కులం మీద రిజర్వేషన్లు XXX

కుటుంబం అంతా మంచి జాబులు XXX

ఓట్లన్నీ అమ్ముకు XXX

ఉచితాలన్నీ XXX  మరిగి 

పాతమతం మీద XX కక్కుతుంటాడు 

వీడి నడ్డి విరగ  XXX   డానికి 

వస్తోంది ఒక నవసమాజం 

చదువు సంజా , సిగ్గు లజ్జ 

చీము నెత్తురు ఉన్న సమాజం 

అందాకా మనకి సంస్కారమే శరణ్యం 


Thursday, April 22, 2021

Eternal - poolabala

10. Second Prime

Oh!  lovely newborn rose

your tender petals froze

in winter snow, who knows 

How  the snow bite felt 
Silently you bore the brunt

Of your sickly conjugal stunt

for long you clung to the cactus bush

And lived like a lifeless bush


You have seen many a season 

Now came your love season

But the cactus called it treason


Love is a blithesome spring

no matter how old or young

all flowers in meadows sing 


your beauty shines supreme

in verdant lawns by the stream

you enjoy your second  prime

merrily singing nature's rhyme


God from heaven kissed your petals

He lifted you with his own hands

your rare  virtues and true desires shine

His golden dew falls on your golden hue

That's made you youthful primrose new


9. Delicate mirth

How many bonds thou art set around my heart

No lady in my life is as cherished as though art

How many spells thine  eyes have cast 

How many hopes thy words have brought

They shake my heart  in loneliness apart


Thou art angel to whom my hopes belong

Thine image rich n splendid my life prolong

To make thou art my bride is my pride

For which though dost cried like a child


Thy moon light promises in my mind linger

oh!  the moonlight increases my hunger

Thou art  the form of delicate mirth  

Thy company makes my life worth


8. If it deserves

I loved. Yes, It's you I loved 

I am sorry  I can’t say it aloud

you too loved me. I am proud

but sorry people are so crude

their mouths are hunter’s bows

their words are poisonous arrows


When two people love, all are judges

they come up with all sorts of hedges

holding in mind persistent grudges

you can't question their mind


Once I the people questioned

they shot at me arrows thousand 

They shot arrows and arrows  

until they brought us sorrows


Later I questioned the God

The clouds soared heavens roared

Arrows of lightning struck me down

A thunderous peal of laughter 

the storm bared its teeth thereafter

God is not the guarantor 

Give your heart your shoulder

if it is precious if it deserves 


8. Hitler's Heaven
Hitler told Himmler 

Jews must not die simply 

they must die in agony. 

Load them in freight cars

Coat the floors with quicklime

which gives excruciating burns. 

said Himmler to Hitler. 

Freight cars came onto tracks 


They called freight cars final solution

but disguised it as mass deportation 

to the east. Deportation means death.

A top secret known to Hitler and a few.

The rest think that it is resettlement


The windowless cattle wagons 

the freight cars are frightening cars

were awaiting  the innocent jews

who knew not it was their last journey


Mass shootings , sending to ghettos

Forcing to concentration camps

All are synonymous to slow death 

The fastest being slowest freight train


No windows, they  move  slowly 

No food and no water literally 

Suffocation and body burns kill

It is a slow journey into hell 

when the train arrived at the camp

everyone was  already dead. 


7.  Eternal Hatred

No one knows why he hated jews 

No one knows the origin of his views

Historians too seldom have clues

But like venom he hated the jews

As an artist in his early life

He had drawn many a beautiful picture 

But turned himself into a gristly butcher

He was committed to anti-Semitism 

More  horrendous than Vampirism 


When he was soldier Germany lost the war

It’s believed one lac Jews were false in war

They fought for their father land – Poland

He later got into politics in Deutschland


He never promoted violence against jews

He rather created anti Semitism in mind

With his oratory skills he spread it like fire

He was as crooked as general Dyer


When he came to power  he did his best

Most Jews were banished at his behest

In the Second World War he realized his dream

of exterminating Jews with his holocaust scheme 
6. Whore - Housewife

The public called me public woman

they publicly blame me to defame

but privately covet my body and fame


I am the wife of the bastard who lost 

his beautiful daughter in drunken bet 

He is the inheritor of the stupid  king

who betted and lost his wife in dice 


I am the mother so helpless and dumb  

could not save the girl child in womb

I am the failed mother who killed son

without giving him timely medicine 


I am the woman who never weeps for the stars

I might have slept with a man who deals in stars

for my husband who wants a chance in films

not enough love and sleep, I cry in master's bed.


I am the woman who could not offer 

on the alter for the vindictive gods but suffer

They call me with names whore bore and more

They have love for sex and hatred for women


They can not call me Kunti or Draupati

Can not treat me like Anasuya or Ahalya

They cry for nonexistent chastity

They call themselves rationalist 

and free thinkers but call me whore.


People take me for swan but I am a pan

In the game of man, when people learn 

to call a spade a spade  I might be called 

not a whore but a housewife.


5. Enlightened 

Hindu Christians 

Christian Hindus

Indian Muslims

Friendly enemies


They live closely apart

They are partly together

wholly exist in their holes

and try to prove others fools


Each want others to be enlightened

They can't their own mind understand

Alas! mother tongue and mother land

don't appeal to them but they appeal

 to each other to love and learn

what they neither learned nor loved.

They can't themselves at least change

but  hope the entire world to change


4. The Tigress and the rain drop

At the break of the day the hunter party 

began with drums and snares to catch

birds , boars  rabbits and weasels

They usually travel in labyrinthine paths


In the equatorial evergreen forest 

They move like ants in narrow paths

playing  the mystic rhythm of drums


The hunter party reached the riverside

The most crafty of all  laid the jaw trap 

with a hunk of bleeding flesh with strap


A naive tigress  the jungle resident

Unsuspecting of dangerous precedent

stepped  on the jaw trap and caught 


The tigress grasped her folly

The hunter caught her jolly

The party netted the tigress


It was neither a boar nor a rabbit

Catching a tigress is not their habit

The tigress was bleeding in the trap


But she has not lost all her hope

The played violent. the drums blared

The tigress is confused and stared


They poked her with sharp spikes 

Chocked her in net until sun set 

The clouds moved over head

The first rain drop fell on her head

The tigress  at once her fears shed


She growled with all her strength

And struggled her way out, at length

The hunters have lost their strength

The tigress escaped into the green forest   

But she still has the trap in the leg


Prodigious injuries austere tragedies 

villainous captivity and nasty calamity

Is all over. The hunter party has gone!!!


The tigress has the clear hope

One day she can throw the trap

She fondly remembers the rain drop


3.  Fairies hunt 

Since long my senses insist

to find if fairies really exist

I set out on the witch hunt 

On dark and frightening nightThe serpentine belt squealed

The lusterless olive jeep moved

The tyres are young and strong 

The yellow lights cut through fog


I have neither permission nor privilege

Perhaps searching for fairy is sacrilege 

I passed the brook, drove towards east 

The jeep was cutting through thick mist


There is neither house nor farmland 

 I reached wilderness, it is a waste land

The  veil of woods afar seems grand

In the headlights appears like a fairyland 


 I drove straight in the freakish weather

Of the frightening night I saw the crooked 

Wooden house with a rocky fountain in front

In fraction of second a creepy feeling crossed 

my mind that many a time I avoided the castle

I dreaded to enter when I visited last winter


Something eerie glows in the dreary castle

A mellifluous soprano voice! is it a throstle!

Is it my beloved friend Farrago Francesca ?

Pity!  I couldn’t my lips open and ask her!


Why Fernando do you deserve a fairy?

 My questioning conscience looked scary 

I kicked open the creaking wooden doors 

I wandered fearlessly in the empty rooms


Sweet Francesca my heart your hand woos

I have n't found fairies but vanquished fears

If you ask me to wait for you I say cheers

I have the eternal hope I can wait for years


2.Her memories

I was walking  the vista

remembering the fiesta 

amid the charming blue hills

watching the nature's thrillsI was climbing uphill 

Down there I see a windmill 

The foot paths are winding

The trees are spellbinding


Slowly the sun lowered 

The heavens rumbled 

The clouds gently poured

The rain I always adored


Up in the sky the clouds brewed

Her sweet  memories rained 

Her memories are sweet first time 

They are sweeter every time

Her touch still feels and fills thrills


1. Eternal


I close my eyes and wonder

What if my eyes close for ever

And  never see the dawn

What if I am forever gone

My bones turn into dust

That flies in the air falls in the river

On the peepal tree under people’s feet

Where is my presence what is the essence

Of my verses do you give me curses

Who am I ? a crumpled picture of shattered dreams?

How long can I stick to your fading memory?

How long can you my verses admire

when your dreams drown in quagmire

 you and I strolled in the cool amber

full moon night in yellow splendor

There the wind my songs chant

 the stars your memories haunt

I am monumental, verbal and eternal

In the blowing air and flowing river

Far away from the loathsome world 

Monday, April 19, 2021

john Keats Vs poolabala

చిన్నప్పుడు  జాన్ కీట్స్ వ్రాసిన   "లాబెల్ దాం సాం మెర్సీ "  అనే  24 లైన్ల ఇంగ్లిష్ పద్యాన్నిచాలా మంది చదివే ఉంటారు  ఇది ఒక కథ చెప్పే పద్యం. ఈ పద్యం చదివి  కీట్స్ ని చాలా గొప్పగా ఊహించుకునేవాడిని.  అబ్బ! కీట్స్ ఇంగ్లిష్ కవి అయినా  ఫ్రెంచ్ లో పద్యం పేరు వ్రాసాడు అని అద్భుతం గా ఉండేది. కీట్స్ కి ఫ్రెంచ్ ఎంత వచ్చో నాకు తెలియదు.  ఇప్పుడు నేను ఫ్రెంచ్ లో పూర్తిగా మాట్లాడగలను.  భారత దేశం నుండి తొలి  ఫ్రెంచ్ నవలా రచయితని కూడా.   

 నేను "లాబెల్ దాం అవేక్  మెర్సీ " అనే 66 లైన్లు గల ఫ్రెంచ్ పద్యాన్ని వ్రాసాను. ఇది కూడా ఒక కథ చెప్పే పద్యం.    కీట్స్ శీర్షిక "లాబెల్ దాం సాం మెర్సీ "  అంటే  "దయలేని అందాలరాశి" . పూలబాల వ్రాసిన "లాబెల్ దాం అవేక్  మెర్సీ"  అంటే " దయగల అందాల రాశి "  "లాబెల్ దాం అవేక్  మెర్సీ"  కి  ఇంగ్లిష్ తర్జుమా కూడా ఇచ్చాను.  

ఇలాటివి మన పాత్రికేయులకు వార్తలు గా కనిపించవు  జూ. ఎం టీ ఆర్ బైక్ లో తిరుగుతుంటే సాక్షి కి వార్తగా కనిపిం చింది. ఈరోజే  FB లో చూసాను . అతడు ఫలానా పెళ్ళిలో  వేసుకొన్న కోటు ఖరీదు ఎంతో తెలుసా?  ఇప్పుడు జర్నలిస్ట్ లు ఎలాటి వార్తలు వ్రాస్తున్నారో నేను చెప్పక్కరలేదు. 

చదివి ఆనందిస్తారు కదా.  Read the poem " La belle dame avec merci in the following link.

https://poolabala.blogspot.com/2021/03/my-heart-breaks-collection.html

Tuesday, April 13, 2021

వన శృంగారం - రెండవ భాగం

వన శృంగారం మొదటిభాగంలో ఉపవనంలో (కలియుగ)రాధ మాధవులు కలిసి వెన్నెల విహారం చేస్తారు. నిండు పున్నమి పండు వెన్నెల లో వనమంతా వెన్నలలో వెలుగు తుంటుంది. మన్మథతాపము కలిగిన జంట చకోరపక్షులు వెన్నెల లో విహరించినట్లు , వనవిహారం చేసి ద్రుమసుమాల (పారిజాత కుసుమాల) నెత్తావుల(పరిమళాల)ను గ్రోలి రాసక్రీడలాడతారు. చెట్లచుట్టూ భ్రమరి పారుతుండగా రాధను పిరుదుకొని గోపాలుడామె పిరుదులమీద చరుస్తాడు. రాధ అందెల  రవళులతో వనమంతా మారు మ్రోగుతుంది, రాయంచలు రాధ మిత్రులే కానీ రాధ పరిచేలము ( పయిట) ను ముక్కుతో పట్టి లాగుతూ గోపాలునికి మేలు చేస్తున్నట్టు కనిపిస్తాయి. కానీ గోపాలుడు ముందుకి పోబోతే అతడిని అడ్డుకుంటాయి . అలా రాయంచలు  గోడమీద పిల్లివాటంగా అనిపించినా వారిరువురికీ మిత్రులుగా ఉండి రాసక్రీడను రక్తి కట్టిస్తాయి. చివరకు ప్రేమజంట కొలను చేరుకొంటుంది. రాధ వీణా వాదనముతో గోపాలునలరిస్తుంది. అంతటితో వారు వనమునుండి నిష్క్రమిస్తారు.     


రెండవ భాగంలో : సాయంసంధ్యలో ఏకాంతవేళ ఒక కోవెలలోనున్న ఒక కట్టడము మిద్దెపై గోపాలుడు రాధను  కలుస్తాడు. రాధ  మాధావళి (పీతాంబర-పరికిణీ వోణి)దాల్చి వాలుజడతో, గులాబి పెదవులతో, మదించిన ఊరువులతో, సైకత నితంబములతో తిరుగుతుంటుంది. గోపాలుడు ఆ గుబ్బెత్త  అందము చూసి పరవశించి ఆమెకు అందెలు బహుమతిగా ఇచ్చి నాట్యమాడమని కోరతాడు.  రాధ గడుసుపిల్ల.  గోపాలుడు ఎందుకు నాట్యమాడమనుచున్నాడో తెలుసుకోలేని బేల కాదు.  ఇక చదవండి ....35.క.మనకో  రికమన  సదరము 

మనరా  గమునీ   లిరాగ  మతిసయ మేలా   

వనసం సర్గమె  స్వర్గము 

మనపా లిటవర  ముకాదె  మరిచెద  వేలా

మన కోరిక మన  సదరము ( స్నేహము ) మన రాగము  నీలిరాగ ( ప్రేమ) అతిశయ మేలా! వన సంసర్గమె ( కలయిక) స్వర్గము మనపాలిట వరము కాదె  మరిచెద  వేలా. (తనకోపమె  తన శత్రువు తన శాంతమె తనకు రక్ష - అదేగణాలతో లిఖించబడిన కందము. నచ్చితే ఏ స్టైల్ లో నైనా వ్రాసుకోవచ్చు ) మన కోరికల్లా మన చెలిమే.  చెలిమి ఉంటే చాలు అని కృష్ణుడు రాధతో అంటూ , ఆమెను కలవడమే స్వర్గమని అదే వరంగా భావించాలని వివరిస్తాడు   


 36.క. వెచ్చని మరదలు పిల్లా 

మెచ్చిన  శుభసర  సమాడ  వెచ్చని పానుపు లేలా 

తెచ్చితి  సిరిసిరి మువ్వలు

నచ్చిన కొమరా  లుగావ నర్తము జేయా  

మరదలు పిల్లా అని సంబోధించాలనిపించి  గోపాలుడు రాధను "వెచ్చని మరదలు పిల్లా" అంటూ సరసమాడడానికి పడకగది పానుపు అవసరం లేదని  "మెచ్చిన  శుభసర  సమాడ  వెచ్చని పానుపు లేలా?"  అంటాడు. చేతిలో ఉన్న మువ్వలు రాధకు  చూపుతూ  "తెచ్చితి  సిరిసిరి మువ్వలు నచ్చిన కొమరా లుగావ నర్తము జేయా"  అని  ఆమెను నాట్యము చేయమని కోరతాడు. అయితే రాధ బేల కాదు జాణ. రుక్మిణి తనని లేపుకు పోవాలని కృష్ణుడికి వర్తమానం పంపింది. రుక్మిణి బేల. రుక్మిణి స్థానంలో రాధ ఉంటే ?  రాధ గడసరి కనుకే  భర్తని , సమాజాన్ని పక్కన పెట్టి  వెన్నదొంగ మనసునే దొంగిలించి తనకోసం తపించేలా చేసింది.  


 37క.గడుసరి  మరదల జూపవె     

పడుచం  దాలుపొ  డచూపు పరికిణి లోనే      

వడకే  నాట్యము  లాడవె  

జడకు  చ్చులుపిరు దులపై జాలు వ్రాలా  

గడుసరి  మరదల జూపవె పడుచందాలు పొడచూపు (కనిపించు)  పరికిణి లోనే. వడకే  నాట్యము  లాడవె  ( శరీరము కంపించు విధముగా నాట్యము చేయమ)ని "జడకు  చ్చులుపిరు దులపై జాలు వ్రాలా " అంటాడు అంటే రాధని చూడా  లనుతీవ్ర కాంక్షను తెలియజేస్తున్నాడు.  పూర్వము రాధనుకలిసినా మరదలా అని సంభోదించడం చేత కాలేదు.  పాపం!  Poor Krishna!


 38.క. రాధా రమణా తెలుసుర

బాధా హరణా  మకార  వాంఛలు ఊపే  

సోదా  లందుకె  గదరా

మాదా వళ మే  నుగట్ట   మనసిక చిక్కే

రాధా రమణా తెలుసుర బాధా హరణా  మకార  వాంఛలు ఊపే. సోదా  లందుకె గదరా(అనగా అన్వేషణ, అందాల కొరకు అన్వేషణ అందుకే కదా ) రాధ ఎంత గడుసుదో కదా! నేరుగా అడిగేసింది.  మాదావళమేను ( మాదావళము + నేను = మాదావళమేను) గట్ట మనసిక చిక్కే.  అనగా కృష్ణుడి మనసు రాధ పరిచేలమందు చిక్కిందని అర్థం.  

 39.క. నలుగురు చూచిన నవ్వర 

కులుకులు చూపే టివేళ కూతలు ఏలా 

ఉలుకుడు కొత్తురు జనులు 

బులుపులు చెల్లిం తునొంటి పురమే దక్కా    

నలుగురు చూచిన నవ్వర కులుకులు(శృంగార కుదుపులు) చూపే టివేళ కూతలు ( సవ్వడి ) ఏలా ! ఉలుకుడు ( చిన్న శబ్దం ) కొత్తురు జనులు . బులుపులు  ( కోరికలు ) చెల్లిం తునొంటి పురమే ( పురము = గృహము ) దక్కా. రాధ నిజంగా జాణ . ఎంత చక్కగా మాట మార్చింది. నా నాట్యము చూడాలని కాదు నీకు వేరే ఏవో  చూడాలని ఉంది అని ఆట పట్టించి, ఇప్పుడు "నలుగురు చూస్తే బాగుండదు, ఏకాంతము దొరికినప్పుడు చూపిస్తానని అంది రాధ. ఏకాంతయినా ఏకాంతం లేకుండా  అనుకోవచ్చు మనం. కానీ మాట మార్చడం తిప్పించడం కూడా క్రీడలో భాగమే.  అదే శృంగారంలో తియ్యదనం. ఆవిషయం రాధకి తెలుసు, కృష్ణుడికి తెలియద్దూ!  ఎలా అడుగుతున్నాడో చూడండి. 


40.క. నటనము నకేల  సంశయ       

మటజని  పరికిం  చపంచ పటములు మూసే  

పటవా  సముపరి చేలము 

కటకట  పెట్టుచు  సలాక కానును చూపెన్ 

1. రావి, 2. మారేడు, 3. మఱ్ఱి, 4. మేడి, 5. అశోకము.  ఈవృక్షములు పంచ పటములు. 

నటనము నకేల  సంశయ  మటజని (ఆటుపోయి ) పరికించ పంచ పటములు  (ఐదు మహావృక్షములు) మూసే.(ఈ దేవళమును మూయుచున్నవి) పటవాసము (లంగా) పరిచేలము ( పయిట )కటకట పెట్టెను(భాదించుచున్నవి) సలాక కానును చూపెన్ ( సన్నని నడుము చూపెను). పాపం కష్టపడి మంచి పద్యమే చెప్పేడు. లంగా వోణీ లో రాధ చక్కదనమంతా చిక్కగా కనిపిస్తోంది. చిక్కిన ఆమె నడుము మత్తెక్కిస్తోంది అని చెప్పేసాడు  గానీ రాధ కళ్ళతోనే నవ్వి ఊరుకొంది.   

41.క.మగువా నీకిది తగునా

మగవా  నిపైన పవాదు పలుకుట మేలా

సెగరే  పదగున   మగువా

వగలెం  తదాపె  డతావు వయసే పొదలా

మగువా నీకిది తగునా మగవానిపై నపవాదు పలుకుట మేలా? సెగరే  పదగున   మగువా?  వగలెంత  దాపెడతావు వయసే పొదలా! పాపం ఏంచేస్తాడు వెనకటి కెవడో  అటునుంచి నరుక్కు రమ్మన్నాడుట. అలాగ కృష్ణుడు మరో వైపు నుండి ప్రయత్నిస్తున్నాడు. వగలెంత  దాపెడతావు వయసే పొదలా! మాయగాడే కానీ రాధ దగ్గర అవేమి చెల్లవు. హహ్హహ్హ హ  అని నవ్వింది కానీ పూర్ కృష్ణ అని అనలేదు . కృష్ణుడుని గౌరవంగా కవికుల తిలకా అని సంభోదించి

  42.క. కవికుల తిలకా రాధా

మవితః సివమె త్తునర్త  మాడుచు తీర్చే

నువరుని   వలకా  క నెరిగి

అవరో  ధముమా  న తీర్తు  నలక నిపుడే

కవికుల తిలకా రాధా మవితః  ( రాధకు బద్దుడు) సివమె త్తునర్త మాడుచు ( చెలరేగి నాట్యమాడుచూ) తీర్చే నువరుని   వలకాక ( మన్మథ తాపము ) నెరిగి.  అవరోధము  బోవ ( అడ్డంకులు తొలగువిధముగా )  తీర్తునలక నిపుడే  అలక ఇపుడే తీరుస్తానుండని  రాధ ఏంచేసిందంటే..  

 43.క. చుంబిం  చెనుచెలి  అధరా

లందిం  చిసఖు నినోట రతికే  ళాడెన్

కంపిం    చెతనువు   చమ్మగ   

స్తంబిం   చెజగము లుచూడ  శుక్లము  ఒలికే   

చుంబించెను చెలి  అధరాలందించి   అంటే   bouche à bouche  (మౌత్ ఇన్ మౌత్ అని ఆంగ్లములో, నోట్లో నోరు అని తెలుగులో చెప్పుకోవచ్చు) ఇచ్చేసింది. (అంటే ఫ్రెంచ్ కిస్ ఇచ్చేసింది).  చూడాలని, తాకాలని పాతకాలం విప్రనారాయణ పథకాలు వేస్తుంటాడు కృష్ణుడు. పూర్ ఫెలో!  రాధ ఏంచేసిందంటే " సఖు నినోట రతికేళాడెన్" అంటే langue à langue. వివరించడం కంటే ఊహించుకుంటే తియ్యగా ఉంటుంది. తప్పులేదండీ సుమతీ శతకంలో బద్దెన (ఎఱ్ఱన కుమారుడు) ఉన్ననిజం చెప్పేసాడు.  

"వీడెము సేయని నోరును

 జేడెల యధరామృతంబుఁ  జేయని నోరును

బాడంగ రాని నోరును 

బూడిద కిరవైన పాడు బొందర సుమతీ!

అధరామృతము గ్రోలని  నోరు బూడిద గొయ్యి అని తేల్చి చెప్పేసాక ..తియ్యగా ఊహించుకోండి . ఊహాప్రపంచములో కూడా బానిసత్వం ఎందుకు ? "కంపించె తనువు చమ్మగ." కృష్ణుడి శరీరములో వెచ్చని సుఖము వ్యాపిస్తున్నాది. స్తంబించె జగములు ( ప్రపంచము అంతా నిలిచి పోయింది ) చూడ శుక్లము ఒలికే.  This is the Climax.


44.క.సర్పము బుసగొ  ట్టినిలుపు 

దర్పము మదిరా క్షికాద  దర్పము చూపే 

సర్పము  తర్పణ  చేయుచు 

నర్పణ  గావిం  చిరాజు నామే ఏలున్     

సర్పము బుస గొట్టి నిలుపు దర్పము.  మదిరాక్షి (మత్తుకళ్ళ ఆడది) కాద  దర్పము చూపే సర్పము? (స్త్రీ కూడా దర్పము చూపించునపుడు సర్పము వంటిదే)  తర్పణ (తృప్తి ) చేయుచు  అర్పణ గావించి  రాజు (భర్త) నేలు నామే.   సుఖపెడుతూ భర్తని ఏలేది స్త్రీ మాత్రమే! కనిపించే  మగడు రాజు. కనిపించని రాజు భార్య. ఇది నాభావన. అనుచూ కృష్ణుడు” ఏమందువు రాధా?” అని అడుగగా ఆ మిద్దె పై నున్న ఎత్తైన మెట్టు పై నిలిచి ప్రకృతిని చూచుచున్న రాధ కృష్ణుని వైపు తిరిగి  "ఊ బాగున్నది వేదాంత ప్రకర్షణ

45.క.తలచిన పలుకును పావకి

కలిపి శృంగా రవేద కాదం బరీ

తెలిపిన సులువుగ నాకె టు 

తెలియు  సంసర్గ మలేక తేలిక గాదే    

నీవు శృంగారమునకు వేదాంత మద్దు సమర్ధుడవే!  కానీ నేను శృంగార ప్రకర్షితను కాను నాకెట్లు తెలియును నీ శృంగార వేదాంతము అని మూతి విరిచి రాధ వెనుకకు తిరిగి నిలిచెను. "నీముద్దు మోము చూచు అవకాశము నాకు దక్కకున్ననూ  వెనుకనున్నది కూడా అందమే కదా ఆహా ఎటుచూచినా అందమే" అని గోపాలుడనుచుండగా కృష్ణుడు ఏమిచూచుచున్నాడో స్ఫురించి తోకతొక్కిన తాచువలె వెనుతిరిగి రాధ మెట్టుపై నుండి కాలుజారి పడుచున్న రాధను కృష్ణుడు తన బాహువులతో పొదివి పట్టు కొనెను.   

46.క. పొందా మరమకిల తటాక 

మందా రుచుకాం తులీను మాణిక్య రీతిన్ 

అందాల రాధమం దారము 

చిందాడె నగధా రియుక్కు  చేతుల జూడన్

మకిల జలమున  పొందామర(బంగరు కలువ)వలె,   శ్యామల దళముల(నల్లని పత్రముల) దాగిన  పింజర కుసుమ పరాగము (పసిడి పుప్పొడి)  వలె రాధ నల్లదేవర చేతిలో ఇమిడెను. గోవర్ధనమునెత్తిన  నగధరునకు రాధ ఒక లెక్కా , కానీ రాధ  ఊరువుల క్రింద అతడు తన చేతులను నిలపజాలకుండెను. " అతడి చేతులు ఆమె జఘన సీమ వైపు ప్రాకుచుండగా రాధ అతడిని ఉరిమి చూసెను 

 47.క.తూనిక యంత్రము  నుమింగి  

 పూనిక రాధను మోహము  చేత  మోసి 

  దానిమ్మ సొగసుల  చవిగొని 

 దేనికి మురిసిప  డతావు  ధీరసు రూపా   

బరువు కొంచెము పెరిగినదే  అనుచూ రాధను క్రిందకి దించెను  " బావా  తూనిక యంత్రమును మింగినావా?  రాతి మెడపై నాతిని నిలిపి రాసలీలలాడుట పాడిగాదు అనగా కృష్ణుడు అవునవును ఈ సిద్ధాంత  గోష్ఠి కట్టిపెట్టి వనవిహారమునకు పోయెదము . కానీ  వీణావాదనము తో సరిపుచ్చక నీవు అచ్చట నాట్యము చేయవలెను. అని కృష్ణుడు కోరగా, రాధ మందహాసము చేయుచూ  "నాట్యమాడిననూ , సరసమాడిననూ ఏకాంతమునందే కదా !" అనెను. వారు రాతి మిద్దె దిగి నడవసాగిరి.

48.క.అరుణా  ర్చి లంబ కిరణా 

లరుదా  రల్లెగు డివాకి లంతసు మములే 

కురిసే సంధ్యా శోభలే 

చూచుచు బిగిసికొ నరాధ చూలిక  లూగెన్  

అరుణార్చి(ఎర్రని కాంతులీను సూర్యుడు) లంబ కిరణా  లరుదారల్లె ( అరుదారి + అల్లె )అరుదారి - చక్కగా; అల్లెను;   గుడివాకిలంత  సుమములే  కురిసే ;   శోభలే  చూచుచు బిగిసికొన  రాధ   చూలిక (ముంగురులు ) లూగెన్. 

ఎర్రని కాంతులీను సూర్యుని  లంబ కిరణాలు చక్కగా ఆకాశమంతా అలుముకొనెను. గుడివాకిలంత  నేలరాలిన సుమములు  కనువిందు చేయుచున్నవి.     ఆ సంధ్య   శోభలను చూచుచు  ముగ్డురాలయిన   రాధ   ప్రతిమ వలే బిగిసికొని  ముంగురు లూగుచున్నవి.      

 కుసుమ వ్యాకీర్ణ కోవెల ప్రాంగణము లో  రాధాకృష్ణుల జంట మందహాసములతో మందగమనమున సాగుచుండెను.  "కృష్ణా! దినదిన ప్రవర్ధమానమగుచున్న నీకోరికలకు కళ్లెము వేయవలెను" వివాహమైన పిదప తప్పక వేయవలెను.  "వివాహపూర్వమే ఇట్లున్నచో  వివాహమైన పిదప  ఇంక నిన్ను వదిలిపెట్టెదవా?"  అని రాధ అనుచుండగా కృష్ణుని ముఖము  వివర్ణమయ్యెను. రాధ మందహాసము చేసి  "కృష్ణా! వివాహము కొరకు బంధములను తెంచుకొంటిని. అనెను.  అప్పుడు కృష్ణుడు "ఇంకనూ గట్టి బంధమొకటి మిగిలియున్నది."  కదా. అనెను. అదివిని  రాధ   

49.క.గట్టిగ బట్టెను చట్టము  

  పట్టిమె డనుచ  ట్రమందు బంధిం చంగా  

  మట్టము  నకుమ  ట్టబడితి 

  చివరకు అందరు తొలగగ శివమే మిగిలే

"అది గట్టి బంధము కాదు కృష్ణా చట్ట బంధము, కాదందువా?"  "ఇంత  గడసరి మరదలుని కాదన్న ఊరుకొనునా!"  అనుచూ   గోపాలుడు నవ్వి  "సరే రాధ అంతా  మంచే జరిగిందనుచున్నావు, శుభ సూచకంగా ఆకాశము కూడా జల పుష్పములను కురిపించుటకు సిద్ధముగా నున్నది." 

   

  50.క. జీబుకొ  నెనుజీ  మూతము

    డాబుస రిగపె  ళ్లుమంచు  ఠాణము  పగలం  

    గాబిల  బిలనడచి  జేరెను   

    కాబిల  కాముని తలెత్తి   కాంచిన భమున్   

జీమూతములు జీబుకొనె నంబరమున  పెళ్ళుమని  పగలె   ఇంద్రాగ్ని, విభ్రాంత కాంత రాధ పెదవులు కంపించె పల్లవ ములై .  పరుగిడి  చేరి రాధ గోపాలు నల్లుకొనెను.కారు మబ్బులు కమ్ము చున్నవి ఇప్పుడు వన విహారమునకు ఎట్లు పోయెదము. అని రాధ కృష్ణుని అడుగు చుండగా  రాధకు ఒక సుందర దృశ్యము కనిపించెను

51.క. పర్జ  న్యుప్రేం  ఖణగనె  

నిర్జన దేవళ  మునందు నింగివ డశితున్   

గర్జిం చెడిమే ఘనిగనె            

అర్జున  మంతా  తూనీ గలగని మురిసే      

పర్జన్యు (మేఘ)   ప్రేంఖణ  (నృత్యము)  గనె (చూచెను);  నిర్జన దేవళ  మునందు నింగివడు (అస్తమించు)  అశితున్  (సూర్యుని);  గర్జించెడి మేఘుని గనె , అర్జునము (పచ్చిక ) మందున   తూనీ గలగని (చూసి ) మురిసే .  

52.క. తూనీ   గలంత  టముసిరె           

వానీ  కరము  పైపారు  పసిడ ప్సరల్       

కానీ చిక్కవు  చేతికి 

తూనీ గలుకన గవాన దూతలు భువిలో

 తూనీ గలంతట ముసిరె.  వానీకరముపై  ( పచ్చికపై ) పారు ( ఎగురు) పసిడ ప్సరల్ (పసిడి + అప్సరలు)బంగారు అప్సర కన్యలు.  తూనీగలు అందమైన అప్సరసలట . అప్సరస లతో సరసాలాడాలని ఎవరికుండదు? కానీ చిక్కవు  చేతికి. అయ్యో ! తూనీ గలుకన ( తూనీగలు చూడగా ) వాన దూతలు భువిలో. వానరాకను తూనీగలు ముందుగా సూచిస్తాయి 

అట్లు తూనీగలతో  ఆడి ఆడి  అలసిన రాధ కృష్ణుని జేరి " బావా ఇచ్చటనే ఈ ప్రాంగణమందునే  రెండు మందిరములు  కలవు. ఒకటి శివ మందిరము  రెండవది శ్రీకృష్ణ మందిరము. మనము పోయి దర్శనము చేసుకొనవలెను. " నేను రథములో నీకొరకు వేచి యుండును నీవు పోయిరమ్ము " అని కృష్ణుడు తన రథములో కి పోయెను. రాధ శివుని దర్శించి రధము కడకు వచ్చి ముందు భాగమున కూర్చొన్న గోపాలునివద్దకు వచ్చి " నేను గోపాలునివద్దకు పోవుచున్నాను నీకెంతో ప్రియమగు దైవము , స్వామి వద్దకు రమ్ము జంటగా దర్శించెదము " అనగా  రథములో నున్న కృష్ణుడు నవ్వి " 

నేపద్యగానం

 53..పంకిం చడుతల వేడిన  

అంకిత మిచ్చితి నకావ్య మంకడు  అకటా    

మంకిల ముచుట్ట చూడడు     

శంకిం  చకవె  ళ్ళవమ్మ   శ్రమనా  కేలా  

 అతడి పై ఒక కావ్యమును వ్రాసి అతడికే  అంకితమిచ్చి  అన్న సంతర్పణ గావించిననూ అతడు నాకొనర్చి న దేమియునూ లేదు " అనెను.  స్వామి నీ పేరుతొ గాక స్వామిపేరుతో పిలిపించుకొని రేయింబవళ్లు ఆయన ధ్యాసలో గడిపిన నీవేనా ఇట్లు మాట్లాడుచున్నది. నీకు నమ్మకము లేనిచో నాకున్నది నేను పోయి దర్శించుకొందును. ఆఖరి సారి అడుగుచున్నాను వచ్చెదవా? "ఆ గొల్లవానివద్దకు నేనేల పొవలేనమ్మా !" కృష్ణుడు ఎన్నడూ  అట్లు మాట్లాడలేదు.  రాధకు పట్టరాని ఆవేశమావహించెను ఆమె కరము  గోపాలుని చెంపను తాకెను. గోపాలుని దర్శనానంతరం  బయటకు వచ్చురాధ మదిలో బాధ అలుము కొనెను. 

నా ముద్దు గోపాల కోపాలేలా! గోవిందుని వేడ విసిగితివేలా!నావద్దకు రారా  నాముద్దుల కృష్ణా!  అయ్యో చెయ్యెత్తితినే అలగకు  కృష్ణా అనుకొనుచూ రాధ  దూరముగా నున్న రధము లోనుండి చూచుచున్న గోపాలుని చూచి అయ్యో అనవసరముగా చెంపపై కొట్టితిని అని అనుకొనుచూ మందహాసము చేసెను . గోపాలుడు కూడా మందహాసము చేసెను. కృష్ణునికి కోపమురానందుకు రాధ సంతోషించెను. చినుకులు మొదలయినవి.  రాధ రధము కేసి పరుగు ప్రారంభించెను. రధము చేరనంతలో  రాయి తన్నుకొని తూలిపడి గోపాలుని భుజములపై వాలెను గోపాలుడు రాధ చేయిపట్టి రధమెక్కించెను  

54.. చిటపట చినుకులు కురిసే 

అటుఇటు చూడగ జనులిక హాహా యంచూ 

మొటమొట  మొగములు  చూపగ 

పిటపిట మనుగు బ్బలూగ  వెలదియు పారే  

అదిచూచి వనవిహారము చేయుటెట్లు సాధ్యము అని రాధ చింతించుచుండగా  కృష్ణుడు "ఇప్పుడు   వన విహారమునకు పోవుట దుర్లభము  కావున వాన విహారమునకు పోయెదము. అని పరిహాసమాడుచూ రాధని  రథమునందు నందు ఎక్కించుకొనిసాగుచుండెను.  మొదట చిటపట చినుకులతో మొదలయిన వాన అంతకంతకూ పెరిగి ఉదృత రూపమును దాల్చెను.  వానహోరు  జూచి రాధ భీతిల్లెను. " ఏమీ  కుంభ వృష్టి!   ఇదేదో  ఉపద్రవమును  సూచించుచున్నది.  రధము త్రిప్పుము గోపాలా" అని రాధ గోపాలుని వేడెను.   

 55.క. పెళపెళ మని పగిలి నింగి  

గళగళ మని దిక్కులోడ ఘనముగ కురిసే 

తళతళ మెరుపులు మెరిసే   

భళిర భళి అమరాధిప వళావళికిన్

పెళపెళమని పగిలి నింగి గళగళమని దిక్కులోడ (ఓడ - భయపడ ) ఘనముగ కురిసే. తళతళ మెరుపులు మెరిసె  భళిర భళి (శభాష్ )  అమరాధిప (మహేంద్ర  ) వళావళికిన్.:: గోపాలుడు " మారాకను చూచి  అమరేంద్రుడు వళావళి (merry uproar)చేయుచున్నాడు.  నల్లని రహదారిపై రబ్బరు చక్రముల  రధము తొణకక సాగుచుండెను.  కృష్ణునకు ఏమీ కచ్చు అని రాధ మ్రాన్పడి రధము తోలుచున్న గోపాలుని చూచుచుండ గోపాలునకు ఆమె మనోగతము అర్ధమయినట్టు చిరునవ్వు నవ్వెను. కొద్దీ క్షణములలో వాన నిలిచిపోయెను. మేఘములు తొలగి తొగరాజు నిండుగా నవ్వుచుండెను. చల్లని వెన్నెల చేతులు చాచి ఆహ్వానించుచున్నట్టు న్నది ఇచ్చట కొలదీసేపు సంచరించెదము అని రాధ కోరగా గోపాలుడు రధము నిలిపెను. ఇరువురూ రథము దిగి నడుచుచుండిరి. నవయవ్వనము తొణికిసలాడు ప్రకృతి కన్య స్నానము చేసి శశికిరణములలో అందములారబెట్టుకొనుచున్నది. శాఖముల ను చీల్చుకొని నేలను తాను శశికిరణములు సమ్మోహనముగాఉన్నవి.       

*      కాదనకుతూహల రాగం ఆది తాళం 


నృత్యము ముగిసిన పిదప రాధ  విరహాగ్నిలో కాగుచుండ. సుందర శృంగారాలోకమున వారిరువురు విహారం  చేయుచూ చాలా దూరము సాగిపోయిరి. అక్కడక్కడా రధమును నిలిపి  వెన్నెల వన్నెలను  చూసి  శీతల కుడుము(ice cream)లారగించి  వెనుకకు మరలిరి.  వూరు సమీపించుచుండగా  ఒక వన  ప్రదేశమున గోపాలుడు  రధమును నిలిపేను 


*   మాధ్యమావతి రూపకతాళం 

 వానవెలసిననూనేల  అంతయూ పంకిలముతో నిండియున్నది చంద్రుడు మబ్బుల చూటుకి పోయెను ,   చీకటి అలిమెన. కొలది దూరములో స్మశానము సమాధులు కనపడుచున్నవి.  విగతజీవులు భూమిలో నిద్రించుచున్నారు   మిణుగురు పురుగులు చీకటిలో ఎగురుచుండగా రాధ కాళ్ళకి గోపాలుడు గజ్జెలు కట్టెను. మాధవా " నీకెందుకయ్యా ఈపని " అని రాధ నొచ్చుకొనెను. గోపాలుడు నువ్వెను.  ఈ ప్రదేశము ఊరికి దగ్గర ఊరివారు వచ్చిన రావచ్చును , గోపాలుడు మరల నువ్వెను. 

 స్వరజతి

 తథాధిత్తి తై  ధాధాధిత్తి తై   తథాధిత్తి తై  ధాధాధిత్తి తై 

తథాధిత్తి థడాంగ్  తక తై   ధాధాధిత్తి  థడాంగ్  తక తై

 థకథక దిత్తి తై          -           ధాధాధిత్తి  తై

ధాధాధిత్తి  థడాంగ్  తక తై    ధాధాధిత్తి  థడాంగ్  తక తై 

థాకు జేకుథకు తడాన్గ్ థకథోం   థాకు జేకుథకు తడాన్గ్ థకథోం

థకడ  థకడ  ధిథోం  -  థకడ  థకడ  ధిథోం  - థకడ  థకడ  ధిథోం 

థకడ  థకడ థకడ  థకడ  ధిత్తథోం  - థకడ  థకడ థకడ  థకడ - ధిత్తథోం  ధిత్తథోం

ధాధాధాధా థకడ  థకడ  ధిథోం  -   ధాధాధాధా థకడ  థకడ  ధిథోం

థాకు జేకుథకు తడాన్గ్  థడాంగ్  తక తై - థాకు జేకుథకు తడాన్గ్  థడాంగ్  తక తై

 తథాధిత్తి థడాంగ్  తక తై  -  ధాధాధిత్తి  థడాంగ్  తక తై

థకడ  థకడ థ థ త్ -  ధికట థకట  థోం 

 థకట ధికట  ధికట  థకట  - ధిత్తథోం  ధిత్తథోం  ధిత్తథోం  ( composed by poolabala)

బిలబిల మనుచూ   జనసమూహము రథమువద్దకు వచ్చి నిలిచింది.  ఇది ఆ కృష్ణుడి రథమే అంటూ  అందరూ కొలది దూరంలో నర్తిస్తున్న రాధని  చుట్టుముట్టేరు.  వాడిని కొట్టండి రాధతో తిరుగుతున్నాడు.  ఎంత ధైర్యం అంటూ కొందరు  రాధని ప్రక్కకి లాగేసారు. ఇలాటి తప్పుడు పనులు చేస్తే మనఊరిలో శిక్ష ఏంటో తెలుసా? గద్దించాడు ఊరిపెద్ద. "తప్పుడు పనులు చేస్తే కదా, ఆ  రాధా కృష్ణుడు ఎంతవరకూ ఉన్నారో  ఈ రాధ కృష్ణుడు  కూడా అంతవరకే ఉన్నారు." అన్నాడు కృష్ణుడు. "నోర్ముయ్ పెళ్లి అయినా పిల్లతో తిరుగుతూ ఇంకా మాట్లాడుతున్నావా?"  చాలాగొంతులు లేచాయి. "ఆ పిల్లకి ఇష్టం లేని మనువు ,  అతడు ఎంత అయోగ్యుడో నాచేత చెప్పించకండి. రాధకి అతడు ఇష్టం లేదు. ఆమె కృష్ణుడిని కోరుకుంటోది."   "ఇష్టం ఉన్నా లేక పోయినా తాళి కట్టేడు తెలుసా?" అన్నాడు ఒకడు. "తాళి కట్టేడా తాడు కట్టేడా?"   అన్నాడు కృష్ణుడు.  "అయినా పెళ్లయిన స్త్రీ తో  తిరగడం తప్పు" అన్నాడు ఊరిపెద్ద.  అలా అయితే  కృష్ణుడు చేసింది అదేగా  కృష్ణ మందిరం ఎందుకు కట్టేరు మీ వూరిలో? అడిగేడు కృష్ణుడు.    


 అది అడడగడానికి  నువ్వెవడివిరా. ఆ కృష్ణుడిని నేనే  అన్నాడు గోపాలుడు.  అందరూ పెద్దగా నవ్వారు. నవ్వనిది ఒక్కరే, అతడే  నిజమైన కృష్ణ భక్తుడు, పూజారి, వేదపండితుడు  కృష్ణ చైనులు.  వీడితో మాటలు అనవసరం ఎవరిదో స్వరం ఉరిమింది కృష్ణుడిని కొట్టడానికి జనులందరూ పరిగెత్తారు. మురారి ఇంతింతై వటుడింతై విధంగా అనూహ్యాయఁగాపెరిగి పోయెను. అతడి  తల మేఘమండలము తాకుచుండ  మెరుపులలో మెరుపువలె ముకుందుడు   వెలుగుచుండెను. జనులంతా  అతడి పాదములవద్ద పిపీలకములవలె చూపడుచుండిరి.

    ఉ.అంబుజు   డంబరా      నకనె     అంకము     వంటిము   కుందరూ పమున్          

       అంబక     చండము    నకనె     ర్కుని        తేజము    సారస   ద్యుతే   

       అంబర     కప్పుర     మువలె    అంతము     కాగధ       రాతలం  బునన్

       జంబర     విగ్రహ       చరణ      ఛాయల      దాగిరి       లోకులం  దరూ    

అంబుజుడంబ రానకనె ( చంద్రుడు ఆకాశములో  చూసెను); అంకము (పర్వతము) వంటి;  ముకుంద  రూపమున్; అంబక (కంటి )చండమున (వెలుగులో) కనె ; అర్కుని(సూర్యుని) తేజము; సారస(చంద్రుని)  ద్యుతే (కాంతే);   అంబర కప్పురము (ఆకాశ కర్పూరము) వలె ; అంతము కాగ  ధరాతలం  బునన్, జంబర విగ్రహ(గంభీర మూర్తి) చరణ ఛాయల(పాదాల నీడలలో) దాగిరి లోకులందరూ.  

 ముకుందుడు పర్వతము వలె పెరిగి అంబరమును తాకు  చుండగా  చంద్రుడు అతడి కన్నుల వెలుగులో  సూర్యుని తేజమును కనెను. చంద్రుని వెన్నెల కర్పూరముతో పోల్చబడినది.    గాలిలో కర్పూరము హరించుకు పోయినట్లు,సూర్యుని వెలుగులో వెన్నెల హరించుకు పోయినది. అప్పుడు భూమి మీద జనులు ముకుందుని పాదముల నీడలో దాగి ఆ కాంతి నుండి రక్షణ పొందిరి.   

 అనిలము చెలరేగుచుండెను, చెట్లన్నియూ ఊగుచుండెను . ప్రక్రుతి ఉన్మత్త రూపము ముకుందుకి కోపమును చూపుచుండెను  ఆకాశము పెళపెళమని ఉరుముచుండగా ఆ మేఘజ్యోతిలో పరమాత్ముని లీల అగుపడుచుండెను.    ఇంతలో ఒక విద్యుల్లత ఆప్రదేశమందు వాలుచుండెను. పరమాత్ముని పరిమాణము ముందు పిడుగు కూడా మిణుగురు పురుగు వలె నుండెను.  పరమాత్ముడు తన నోరు తెరచి విద్యుల్లతను మింగివేసెను. ఆ కరాళ దృశ్యాన్ని చూసి భీతిల్లిన ఊరిజనులందరూ పరుగులు  తీయుచుండిరి. రాధ మూర్ఛిల్లెను. చైనులు పొరపాటున వారికడ్డుపడి వారి పాదములచే మట్టివేయబడి  పంకిలంలోకి దిగబడెను. మురారి ఉరిమి చూడగా నింగిలోకి ఉరుములు మెరుపులు అంతరించి నిశ్శబ్ద అలుముకొనెను.    

  . అంతట       రాధనే       త్రముల   నార్పక    చూచుచు    చీకనే   కనెన్  

అంతయు    స్ఫురణే     గలిగి      నాత్రము      గాచని       లేడివే    గమున్ 

చెంతన        కారునం    దుకన     సేమము  యానము   ఏమిలీ  లలో               

 వింతగ         చూపెనీ      లమణి   మింటిన     విశ్వరూ    పమున్   

అంతట  రాధ  నేత్రముల   నార్పక    చూచుచు    చీకనే   కనెన్ ;  అంతయు   స్ఫురణే   గలిగి   ఆత్రముగా చని,   లేడి వేగమున్ చెంతన  కారు (అడవి)నందు, కన ( చూడగా ) సేమము (భద్రము)  యానము  (రథము )  ఏమిలీ  లలో ; వింతగ  చూపె నీలమణి  ( కృష్ణుడు)  మింటిన విశ్వరూపమున్.  

కొంతసేపటికి రాధకి స్పృహ వచ్చి చూడగా చుట్టూ చిమ్మ చీకటి కానవచ్చెను. మెల్లగా జరిగినది స్ఫురణకు రాగా రాధ తనువెల్ల పులకించెను.  ముకుందా! మురారీ !! గోవిందా!!!  నీదర్శన భాగ్యం కలిగించేవా అనుచూ  పెద్దపెట్టున రోదించుచుండెను. రాధకు ముకుందుని అడిచిన వైనము కళ్ళముందు కదలాడెను. అయ్యూ ముకుందా భక్త మందారా నాచే చెంపదెబ్బతిన్నావా అని వెక్కి వెక్కి ఏడ్చుచూ అకస్మాత్తుగా మత్తు దిగినట్టు ఇంతకీ నాకృష్ణుడు  ఎచ్చటకి పోయెను. 

రాధ దూరముగా ఉన్న రథమును చూచెను  మెల్లగా నేలపై నుండి లేచి రధము వైపు నడవసాగెను. రథము వెనుక భాగములో స్పృహలేక పడియున్న తనకృష్ణుని తాకి చూసెను. కృష్ణుడు ఉలిక్కి పడి లేచి రాధ ను చూచి కంగారు పడి  "కునుకు పట్టినది ఏమియూ అనుకొనరాదు, అని చెంగుమని లేడివలె దుమికి ముందుకుబోయి చక్రమునందుకొనెను. రాధ కూడా ముందుకిపోయి కూర్చొనెను. యంత్రము చలించెను. రథాంతరము ప్రకాశించెను. కృష్ణుని చెంప పై రాధ చేయి ముద్రను చూచి నిన్ను కొట్టిన చెంప దెబ్బ  నాకృష్ణునికి ఇచ్చినావా  అని మనసులో అనుకొనుచూ రాధ ముకుందా , గోవిందా, తండ్రీ  ఉన్నావయ్యా అని ఉర్రూతలూగుచుండ 

ఇప్పుడేకదే  భగవంతుని దర్శనము చేసుకొని వచ్చినావు ఇంతలో ఏమాయెనే అని కృష్ణుడు  అనగా  నీకెట్లు తెలియుననుచూ రాధ నిర్ఘాంత  పోయెను. రధము పరిగెడుచుండెను మెల్లగా గొంతు పెగుల్చుకుని మరల  "నీకెట్లు తెలియును ?" అనెను అదేమి పిచ్చి ప్రశ్న మందిరమునకు పోయి  వచ్చెదనని చెప్పి  పోయినావుకదా , మరచితివా? " ఓహో ఇంకనూ నా వెర్రి విభుడు అచ్చటనే ఉన్నాడన్నమాట.  ఎంతమాయగాడివయ్యా ముకుందా నీవు సారధ్యము చేయుచున్నప్పుడు ఒక్కసారికూడా తలతిప్పి వెనుకకు చూడలేదు. చూచినచో  కృష్ణుడు వెనుకనే పడుకున్నాడని తెలిసెడిది. నీ మాయ ముందు నేననగా ఎంత ఇచ్చటికెట్లు వచ్చినాము మనము గుడివద్దనుండి ఇంటికి పోవు మార్గమిది కాదే. నీవే నడిపి తీసుకువచ్చినావు అని రాధ అనెను. (అనేక తప్పలేదు). అమరదేశమున  అమరగాయకుడు మైకేయుడు  ( మైకేల్ జాక్సన్ ) అను ఒకడుండెడివాడు.  అతడు ప్రమాభరితమగుపిల్ల  గీతము నాలపించెను మొదటిలో   "పెళ్ళను దర్పణ విస్పోట స్వనమును" సృజించెను.  రాధ కృష్ణునికి కేదో సంభవించినది అనుకొను  చుండగా.   నాహృదయము అట్లు పగిలినది  అనెను.  కృష్ణునికి పిచ్చి కోపము వచ్చెను " పిచ్చి పిచ్చిగా యున్నదా అని కృష్ణుడు రధమును నిలిపి వేసెను. రాధకు నవ్వు వచ్చిననూ అదిమిపట్టి " అయ్యా పిచ్చి మారాజా మరదలు నీతో ఆపాటి సరసమాడిన తప్పగునా ! అని అడిగెను. కృష్ణుడు నవ్వుచూ రధమును ఉరికించెను                

  

పూర్ణిమరేయి! అఖండ చంద్రుడు అంబరము నేలుచుండెను. కృష్ణుడు మిద్దెపై నిలిచి పున్నమి చంద్రుని చూచి "ఇందుమతి ప్రద్యోత కోమలాంగి, శుభాంగి రాధ తేజము కౌముది తలపించుచున్నది. ఇప్పుడు ఆమె చట్టబద్దముగా స్వతంత్రుతరాలు. ఈరేయి రాధ నర్తనము చూసి  పరవసించవలెను." కృష్ణుని  కనులలో రాధ, శిరమున స్వర్గము, నరములలో అమృతము  తెలియుచుండెను. కృష్ణుడి ఉల్లము నర్తించుచుండెను.  కానీ మొదటి రేయి ఎట్లు అడగవలెనని అనుకొనుచూ శోభన గృహమున  ప్రవేశించి ఎదురు చూచుచుండెను.  ఇంతలో గదిలో అడుగుగిడి రాధ తలుపు మూసెను.  మల్లె గులాబి దండలు దోబూచులాడుచున్నవి. రాధ చేతిలో గజ్జెలున్నవి. నామనోగతము ఈమెకేట్లు తెలిసినది అనుకొనుచుండగా  రాధ గజ్జెలు కాళ్ళకి కట్టుకొనుచుండెను.   కృష్ణుడు నేలపై కూర్చొని రాధ పాదములను తన తొడపై నుంచుకొని గజ్జెలు కట్టెను.  మొదటి రేయి  వృధా అగునేమో  అని కృష్ణుడు అనుచుండగా  రాధ " మొదటి రేయి అని ఏమున్నది అన్ని రాత్రులు మనవే కదా ." అనెను.  రాధ తన అణువణువూ పులకించుచుండ కృష్ణుడు కోరిన వణుకు నృత్యమును చేసెను. ఆ కృష్ణుని కృపచే వారి శృంగార హేల  జీవనవాహినివలె  అప్రతిహతమై సాగెను.