Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Friday, April 9, 2021

పచ్చతోరణం

           ప్లవనామసంవత్సరఉగాదికి సాహిత్య ప్రియుల కొరకు కట్టిన సీసపద్య తోరణం ఈ పచ్చతోరణం. 





 క. ఆని రాకకు  చూపడు 

శ్యాల కోకిల నుచూచి ఫరాక్షి  నవ్వెన్

ని కోకిల  చాటెను 

తాని  మాపవ లెనంచు ధాటిగ చాటెన్

వసంతఋతువు రాకతో చూపడు (కనబడు) కోకిలను చూసి ఫరాక్షి(చేప వంటి కన్నులు గలది.) నవ్వెను . కోకిల కూతలు ఏమని చాటెను ? తామ ( రోగము/ నష్టము)ని మాపమువలెనని ధాటిగ చాటెను. అనగా  మానవ శ్రేయోభిలాషి యగు  కోకిల కూతలలో  కరోనాను  రూపుమాపవలెనను సందేశము వ్యక్తమగుచున్నది.  


  సీ. ఋతువుల  న్నిటజూడ  ఏఋతు వందరి మనముల మురిపించు మాల  తిచలు 

     వనుపోలి  ఋతువంద మంతయు నేత్రము లలరించు రసకవు  లకునొ  సగుచు

    నూతము జగముల నూయల  లూపును అదియె వసంతము  అజితు డుమరి      

     సృష్టిని  తుష్టిగ   సంపూర్ణ  మొనరించె  గానేడె   మనకుయు  గాది హేల    

ఋతువులన్నిట జూడ  ఏఋతువందరి మనముల మురిపించు? మాలతి చలువ(వెన్నెల చల్లదనము)ను పోలి ఋతువందమంత నేత్ర ములలరించు? రసకవులకు నొసగుచు నూతము జగముల నూయల లూపును? అదియె వసంతము. అజితుడు మరి సృష్టిని తుష్టిగ సంపూర్ణ మొనరించెగా నేడె  మనయుగాది  హేల .   


సీ. వానలు కురియును బాగుగ పంటలు   పండును  ప్లవము పంచు ఫలము     

అన్నిరా  సులకందు ఆయము లాభము  పొందుకొ నెల్లడ  పొలము నందు  

వృత్తులం దుపెరుగు  ఫలము ఈశ్వర  కృపచే తొలగును  క్షామమ  డుగుక  రోన

కళకళ  లాడుచు కాంతులీ నిసకల   భారత  దేశము  వాసి  నొందు.

వానలు కురియును మెండుగ , పంటలు పండును, ఫల మిచ్చు ప్లవము, అన్నిరాసులకందు ఆయము (ఆదాయము ) లాభము పొందుకొనును(పెరుగును) పనులందు, వాణిజ్య వృత్తులం దుక్షేమము కలుగు.  ఈశ్వర కృపచే తొలగు కీడు.  అంతరించు కరోన, కళకళ  లాడుచు కాంతులీని సకల భారత  దేశము వాసి  (  ఆధిక్యత ) నొందు.

సీ. బలహీన ముగురుడు బలవంతు డసితుడు  భావము చూడగ  భార తమున   

మితముగ ఆర్థిక వృద్ధిద  శదిశల  మనకీర్తి  ముదముగ   మారు మోగు 

ధరలు  క్రమముగ తగ్గుస కలరాసు  లడరురా  హుకేతువు లదృ ష్టిపడి   

శ్రమక లుగుపరి శ్రమలకు తప్పవు  శత్రుబా ధలుమిత్ర జగడ ములిక.

బలహీనము గురుడు, బలవంతు డసితుడు (శని) భావము చూడ,  భారతదేశమున పుట్టు మితముగ ఆర్థిక వృద్ధి.  దశదిశల  మారు మోగు మనకీర్తి.  ధరలు కొలదిగ తగ్గు. సకలరాసులు వెలుగు.రాహుకే తువుల రాపిడి కలిగి శ్రమ కలుగు పరిశ్రమలకు.  తప్పవు శత్రుబాధలుమిత్ర జగడములిక.

సీ. కూలిన కూలును కుప్పగ కూలును   పోవల సినదంత  పోయి నాక   

ధర్మము ఒక్కటి ధరణిన  మిగులును  స్వాంతము పొందుచు స్వార్ధ  మడచి 

నడచిన నరులకు నరహరి   నెరవుగ  నొసగును నెమ్మది  నెనరు గొనును     

ప్రకృతి మాతసం పదయన్న ప్రకృతి,  తెలుపగ వచ్చెను   తెలుగు యుగాది  

కూలిన కూలును కుప్ప గ కూలును పోవల సినది పోయిన పిదప ధర్మ ము ఒక్కటి ధరణిన  మిగులును.స్వాంతము కలగి స్వార్ధము నడచి (ఆడచి /అదిమి)  నడచిన నరులకు నరహరి నెరవుగ నెమ్మి నొసగును నయము చూపు  ప్రకృతి మాత సంపదయన్న ప్రకృతి యని తెలుపుచు యుగాది వచ్చెను.


2 comments:

  1. స్వచ్ఛమైన మనసు కల విద్వాంసులు తమరు.మీ వాక్కు బ్రహ్మ వాక్కు.మీరు చెప్పినట్టు కరోనా తగ్గుముఖం పట్టి, ధరలు తగ్గి, ఆర్థిక వృద్ధి చెంది దేశం సుభిక్షంగా ఉంటుందని ఆశిస్తున్నాను. శతృభాదలు, మిత్ర జగడములే కొంచెం బాధగా ఉంది.మొత్తానికి సీస పద్యములు ద్వారా చాలా బాగా వివరించారు.

    ReplyDelete
  2. After reading several websites that offer astrological predictions I have written these poems taking their forecast. They wrote that Jupiter is week and Saturn is strong. Due to Rahu Ketu influence there will be economic recession. Floods earthquake and war with China are also predicted.

    ReplyDelete