C.M GAME
ఒరేయ్ ఆడుకుందామా ?
అలాగే, మనమిద్దరమే ఉన్నాం, బాల్ తేనా?
లేదురా, మనోళ్ళంతా వస్తున్నారు.
అదుగో మాటల్లోనే అంతా వచ్చేస్సారు
ఎం ఆడదాం? క్రికెట్ ?
ఛా, ఎప్పుడూ క్రికేటేనా! క్రికెట్ కంటే గొప్ప ఆట ఒక టుంది.
ఏమిటి?
ఏమిటి?
CM game.
అంటే?
కొత్త గెమ్. ఇందులో ఎక్కువ మంది ఆడవచ్చు.
ఎలా?
మనం 15 మంది ఉన్నాం కదా, ఒరేయ్ మీరంతా ఇలా రండ్రా.
వచ్చాం .
ఒకే. వచ్చారు కదా. మీరంతా వోటర్లు, ఫస్ట్, ఎన్నికలు జరుగుతాయి అన్నమాట
అప్పుడు మీము మీ దగ్గరకి వచ్చి వోట్లు వేయమని అడుగుతాము అన్నమాట.
ఒకే బాగుంది.
బాగోడం కాదు, సమంగా వినండి. మేము మా స్కూల్ బాక్స్లతో వస్తాము.
ఎందుకు?
డబ్బులు పంచడానికి. ఇదిగో ఈ న్యూస్ పేపర్
ముక్కలు గా కత్తిరించి కట్టలు కట్టండి.
ఓకే అదే డబ్బు అనమాట.
ఒరేయ్ డబ్బు ఒక్క తీ ఉంటె సరిపోదురా.
ఇంకేంటి, పామప్లేట్ లా?
కాదురా. ఇలా రా ( చెవులో చెప్పాడు)
ఓ అవును అవును అని ఒక కుర్రాడు పరిగెత్తుకుంటూ
వెళ్లి వాటర్ పేకట్స్ తో తిరిగి వచ్చాడు.
ఒరేయ్ ఇదుగోరా సారా. అన్నాడు.
ముందు ఎనికలు, డబ్బు సారా పంచడం, వోట్లు కొనడం ఘట్టాలు పూర్తీ అయ్యాయి.
ఇప్పుడు ఎంటిరా
అసెంబ్లీ.
అంటే ఏంచెయ్యాలి?
గోల చెయ్యాలి, తిట్టుకోవాలి, కొట్టుకోవాలి.
అద్యక్షా... మొదలు పెట్టారు. కాస్సేపు
గోల, తిట్టుకోడం తరువాత , కుర్చీలు ఉంటె బాగుండేది అన్నాడు ఒకడు.
ఒరేయ్ మీ ఇల్లు దగ్గరే కదరా, శివ మీ ఇంటికి వెళ్లి రెండు కుర్చీలు తేరా!
అమ్మో మా నాన్న వీపు చీరేస్తాడు, ఉతికి ఆరేస్తాడు. అన్నాడు.
సరే రా నెక్స్ట్ సీన్ ఏంటి ..
భూములు, అమ్మడం కాంట్రాక్టర్ల తో కుమ్మక్కు అవ్వడం. డబ్బు నొక్కేయడం.
ఒరేయ్ డబ్బులు లేవురా, నువ్వు ఇందాక ఇచ్చేవు కదా వోతర్లకి నోటులు అవి వీడు పారేసాడురా
?
ఎరా పిచ్చ నా..
ఒరేయ్ తిడితే నేను ఆడను అంతే.
సారీ రా ఇందాక అసెంబ్లీ లో తిట్టుకున్నం కదా, ఆ అలవాటు మీద వచ్చేసినది.
నేను ఊరుకోను రా , ఎంటిరా మరీను.. అంత దారుణంగా ..
ఒరేయ్ గొడవలాపి ఆట ఆడండి. అరిచాడు ఒకడు. తరువాత ఏంటి అన్నాడు ఇంకొకడు.
తరువాత కోర్టు కేసు.
ఆ తరువాత, అడిగాడు మరొకడు.
తరువాతా జైలు కి వెళ్ళడం...
అబ్బ బలే గుందిరా ఆట అన్నాడు ఒకడు .
చాలా నేచురల్ గా ఉందిరా , అన్నారు మిగితా వారు.