చదువు ద్వారా జ్ఞానాన్ని పొందగలిగితే జ్ఞానవంతుడు అవుతాడు. జ్ఞానం ద్వారా వ్యక్తిత్వాన్ని పొంది, తన సిద్దాంతాల నీ ఆదర్సాలనీ ఏర్పరుచ్కుంటే ఆదర్శ వంతుడు, భాగ్య వంతుడు అవుతాదు. నమ్మిన సిద్దంతాలకోసం ప్రాణాలర్పించిన వారిలో స్వాతంత్ర సమర యోధులు, రాడికల్స్, నక్సల్స్ కూడా ఉన్నారు. చదువు అంటే ఒక సర్టిఫికేట్ అనుకుని , జైళ్ల లాంటి స్కూళ్ళలో నరక యాతనలనుభవించి, మార్కులకోసం పెనుగులాడి, డిగ్రీ ని బిచ్చ గాని బొచ్చె స్థాయికి తగ్గించిన మనుషులూ ఉన్నారు.
Bildung, Wissen, Ideale und Persönlichkeit
విద్య, జ్ఞానం, ఆదర్శాలు, వ్యక్తిత్వం.
కార్ల్ మార్క్స్ ఈ పేరు వినని వారు అరుదు. ఎకనామిక్స్ విద్యార్హ్తులకు ఈపేరు సుపరిచితం. కార్ల్ మార్క్స్ దాస్ కేపిటల్ రాసాడని చాలామందికి తెలుసు. కానీ అది దాస్ కేపిటల కాదని " డస్ కాపిటల్ " అని చాలామందికి తెలియదు. కార్ల్ మార్క్స్ జర్మన్. జర్మన్ భాషలో డస్ ( Das) అంటే ఇంగ్లిష్ ఆర్టికల్ ది (The) తో సమానం. డస్ ఆటో అంటే ది కార్ అని అర్థం.
బెర్లిన్ యూనివర్సిటి లో, హెగెల్ ఫిలాసఫీ , న్యాసస్త్రం అభ్యసించి తనకంటూ ఒక ఫిలాసఫీ ఏర్పరుచుకున్నాడు. మార్క్స్ బెర్లిన్ యూనివర్సిటి లో నే 1831 దాకా ప్రొఫెసర్ గా పనిచేసాడు.
అదే బెర్లిన్ యూనివర్సిటీ
లో నేడు నా విద్యార్ధులు చదువుతున్నారు. అది వేరే విషయం. కాపిటల్
వాల్యూం 1, కాపిటల్ వాల్యూం 2, కాపిటల్ వాల్యూం 3, డస్ కాపిటల్ తో పాటూ సివిల్ వార్ ఇన్ యునైటెడ్
స్టేట్స్ , సివిల్ వార్ ఇన్ ఫ్రాన్స్ అనే గ్రంధాలను రచించాదు. ఆర్ధిక సాత్రవేత్త అయిన మార్క్స్
ఫిలాసఫీ ని ఎంతో ఆసక్తి తో అధ్యయనం చేయడమే
కాకుండా హెగెల్ ఫిలాసఫీ మీద చక్కటి విమర్శ రాసాడు. G.W.F. Hegel రాసిన ఫిలాసఫీ చదవడమే ఒక గొప్ప అనుభూతి. దాని మీద
విమర్శ రాయడమంటే ఎంత కష్టమో ఊహించుకోగలరు
అనుకుంటాను.
కార్ల్ మార్క్స్ తండ్రి
హైన్రిష్ మార్క్స్ న్యాయవాది. Prussia పుస్సీయా ( ప్రష్య , ప్రుష్య కాదు) లో గల Trier (టీయా) అనే వూరిలో జన్మించి స్కూల్ అని గట్టిగా చెప్పడానికి వీల్లేని ఒక జిమ్ Friedrich-Wilhelm Gymnasium లో చదువుకున్నాదు. చిన్నప్పుడు అతడొక సామాన్య విద్యార్థి. 1835 లో బాన్ యూనివర్సిటీ లో చదువుతున్నప్పుడు కూడా చాలా అల్లరి చిల్లరిగా ఉండేవాడు.
విద్యార్ధి దశలో చాల ఏక్టివ్ గా అన్ని రంగాల్లో ఉండేవాడు. మత రాజకీయ సంస్తలని తీవ్రంగా విమర్శించే రాడికల్ గ్రూపు
లతో తిరిగెవాదు. అప్పుడప్పుడూ అప్పులు చేసి
ఇంటిమీదకి తెచ్చేవాడు. 1836 లో ఎన్ని తో వివాహం కుదిరిన తరువాత కూడా మార్క్స్ ఏమాత్రం
మారకపోవడం చూసి తండ్రి కంగారు పరిపొయాదు. బాన్ యూనివర్సిటీ తో లాభం లేదనుకుని బెర్లిన్
పంపేశాడు తండ్రి మార్క్స్ ని అప్పుడు వెళ్ళాడు
బాన్ నుంచి బెర్లిన్ కి మార్క్స్. అంటే ఇక్కడ
అల్లరి చిల్లర గా తిరిగే విద్యార్ధిని చైతన్య లో జాయిన్ చేసి నట్టు అన్నమాట. క్రియేటివ్
జీనియస్ లాటి ఒక విశ్వ విద్యాలయాన్ని, రుబ్బురోలు పొత్తరం లాంటి ఒక నాసిరకం విద్యా
సంస్థ తో పోల్చడం నా ఉద్దేశం కాదు. తండ్రుల ఆందోళన జర్మనీ లో ఐనా ఆంధ్రలో ఐనా ఒక్కటే. తండ్రి ఎక్కడైనా తండ్రే .
తరువాత యెన యూనివర్సిటీ
నుంచి డాక్టరేట్ పొంది మార్క్స్ కాస్త డాక్టర్ మార్క్స్ అయ్యాడు, కాని రాజకీయాల మీద ఆసక్తితో ప్రొఫెసర్ గా అవకాసం
వచ్చినప్పటికీ , జర్నలిసం వైపు మొగ్గు
చూపాడు.
Cologne లో ఉన్న Rheinische Zeitung( రైనిష సైటుంగ్) అనే న్యూస్ పేపర్ కి ఎడిటర్ గా పనిచేసాడు. మూడు నెలలు చేసాడో లేదో ప్రభుత్వం అ
న్యూస్ పేపర్ ని అణిచి వేసింది. తరువాత జెన్ని
ని వివాహం చేసుకొని ప్యారిస్ వెళ్లి పోయాడు మార్క్స్. ఎంతో ప్రభావ వంతమైన రచనలు చేసిన గొప్ప రచయత, సోషలిస్ట్ భావాలుకలిగిన తత్వవేత్త ఫిలాసఫర్ మార్క్స్. సంచలనాత్మకమైన రచనలు చేయడం మేధావుల లక్షణం, నిజాన్ని, నమ్మిన సిద్దాంతాలను చెప్పాలంటే, తెలివితేటలతో పాటు దమ్ము కూడా ఉండాలి. ఆ రెండూ
ఉన్నాక క్షేమంగా ఉండాలంటే అదృష్టం కూడా ఉండాలి. Friedrich Engels తో కలిసి కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ప్రచురించిన తరువాత అతడు బహిష్కరించబడ్డాడు. అతడి రచనలు చూసి ప్రబుత్వాలు అతడిని
ఫ్రాన్స్ నుచి జెర్మని నుంచి గెంటేసా యి. మార్క్స్ లండన్ మకాం మార్చాడు. బుద్ది మాత్రం మార్చలేదు. అక్కడే అతడు Das Kapital రచనకు శ్రీకారం చుట్టాడు.
-
Amazing Mr. Poola Bala, the way you framed the sentences in telugu was simply superb. Especially some statements made in the last paragraph are much so interesting. The comparison between berlin university and sri chaitanya is so funny... and the starting paragraph is an eye opening truth to each and every one...
ReplyDeleteAny ways you done a good job.......