Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Tuesday, March 30, 2021

వన శృంగారం - మొదటి భాగం

రాధ కృష్ణుల శృంగారం కలియుగంలో అత్యంత ఆదరణ పొందింది.“వనశృంగారం”అనే ఈ కావ్యంలో కలియుగ రాధకృష్ణుల వనశృంగారం హృద్యమైన కందపద్యాలతో, సరళమైన గద్యంతో అత్యంత శృంగారభరితంగా సాగుతుంది. ఇందులో నాయికి నాయకలు రాధా కృష్ణులు.  రాదాకృష్ణులను పోలిన జంటలు ఇంకా ఉన్నాయా? అంటే ప్రేమ ఆధ్యాత్మిక భావాల తో ఒకరికొకరు అంకితమైన జంటలు ఉన్నాయా?  


ఉన్నాయి,  నేను ఒక జంటను చూసాను. మీరు కూడా చూసే ఉంటారు. కృష్ణ స్ఫూర్తి నేటి యువకుల్లో ఎక్కువే.    కానీ రాధ స్ఫూర్తి అంత సులభం కాదు. రాధ అంటే భక్తి, ఆధ్యాత్మిక, శృంగార భావాల సమ్మేళనం. అటువంటి  రాధ  నేటికాలంలో ఉందా?  అసలు రాధ ఎవరు?


అసలు రాధ ఎవరో తెలిస్తే రాధ ఉందో లేదో తెలుస్తుంది.

రాధ లేదా రాధిక శ్రీకృష్ణుని ప్రియురాలు. కొందరు వైష్ణవులు రాధను శక్తి అవతారంగా భావిస్తారు. భారతదేశంలో రాధాకృష్ణులకు చాలా దేవాలయాలు ఉన్నాయి. రాధాకృష్ణులను ప్రేమకు చిహ్నాలుగా ఎంతోమంది కవులు, చిత్రకారులు కొన్నిశతాబ్ధాలుగా వర్ణిస్తూ, చిత్రీకరిస్తూనే వున్నారు.ఈమెకు రాధిక, రాధే, మాధవి, కేశవి, రాధేశ్వరి, కిషోరి,శ్యామా, రాధారాణి అని పేర్లు. ఆమె శ్రీకృష్ణుని శాశ్వత భార్య (అంటారు). శ్రీ కృష్ణుడిని రాధికా పతి అని రాధను యశోదానందన పత్ని అని పాటల్లో కూడా పాడతారు.

 రాధ వివాహం 12 ఏళ్లకు యశోద సోదరుడు ‘రాయన్-తో చేయబడిందని  బ్రహ్మవై వర్తక పురాణంలో చెప్పబడింది. శ్రీకృష్ణుడు యశోద నందనుడు అంటే కొడుకు.  నందనుడు తమ్ముడు ఎలా అవుతాడు? రాయనుడు శ్రీకృష్ణుని అర్ధవతారం అంటారు.  

శ్రీకృష్ణుడి అష్ట భార్యల పేర్లు చూస్తే (రుక్మిణి: శ్రీకృష్ణుడి మొదటి భార్య - విదర్భ యువరాణి, 2. సత్యభామ 3. జమ్వంతి 4. కాళింది 5. నాగ్రాజితి, కోసల యువరాణి 6. మిత్రవింద, ఉజ్జయిని యువరాణి  7. భద్ర, కేకేయ యువరాణి  8. లక్షన.) అందులో రాధ పేరు కనిపించదు.

కొంత మంది స్కాలర్స్ రాధ యోగమాయ చేత తన ఛాయని సృష్టించిందని  రాయనుడు ఆ ఛాయనే పెళ్లి చేసుకున్నాడని తదుపరి  బ్రహ్మదేవుడు బృందావనంలో రాధా కృష్ణుల వివాహం జరిపించాడని చెపుతున్నారు.

ఎక్కువమంది రాధాకృష్ణుల శృంగారం భౌతికమైనది కాదని వాంఛాతీతమైన ఆద్యాత్మికమైనదని చెపుతారు. జయదేవుడు గీత గోవిందంలో రాధను స్వాధీనపతికగా వర్ణించాడు. రాధమాధవుల రతిలో చెదిరిన తన అలంకరణను శ్రీకృష్ణునితో సరిచేయించుకుంటుంది. గీత గోవిందం భక్తి కావ్యం అనుకుంటారు    

గీత గోవిందం రాధా కృష్ణుల శృంగార కావ్యము. జయదేవుని గీతగోవిందంలో మొత్తం 83 గీతాలున్నాయి. ఇవి రాధాకృష్ణుల మధ్య ప్రేమను, విరహ వేదనను వర్ణిస్తాయి.

 అన్నమయ్య వ్రాసిన శ్లోకాల్లో కూడా ఆధ్యాత్మిక  శృంగార కోవలకు చెందిన  శ్లోకాలున్నాయి. అన్నమయ్య తాను పూజించే దేవుడిపై  శృంగారం వ్రాసాడు. జయ దేవుడు కూడా తానూ పూజించే కృష్ణుడిపై శృంగార కావ్యం వ్రాసాడు.

వనశృంగారం కూడా అటువంటిదే. 60 కంద ఉత్పలమాల పద్యాల సమాహారంవనశృంగారం విరహ,శృంగార గీతమాల.  

 భరతముని రచించిన నాట్య శాస్త్రంలో పేర్కొనిన ఎనిమిది రకాల నాయికలను అష్టవిధ నాయికలు అంటారు. వారు 1.స్వాధీనపతిక 2. వాసకసజ్జ.   3. విరహోత్కంఠిత  4. విప్రలబ్ధ,   5. ఖండిత   6. కలహాంతరిత  7.  ప్రోషిత భర్తృక        8. అభిసారిక. ఈ ఎనిమిది రకాల నాయికలు ఎనిమిది వివిధములైన మానసిక అవస్థలను సూచిస్తారు.

 “స్వాధీన పతిక..స్వాధీనుడగు భర్త గల నాయిక" ఈమెలోని ప్రగాఢమైన ప్రేమ, సుగుణాలకు భర్త పూర్తిగా ఆధీనుడౌతాడు. ఈ నాయిక నాయకునితో పాదాలకు పారాణిని గాని లేదా నుదుట తిలకం దిద్దుతున్నట్లుగా చూపిస్తారు. ప్రోషితము అనగా లేకుండుట. భర్త దూరదేశాల ఉన్నస్త్రీ ప్రోషిత భర్తృక. అష్టవిధ నాయికల్లో ఈమె కూడా​ ఒక కథా నాయిక. యశోద తమ్ముడు  అయనునితో వివాహమైన రాధ,  ప్రోషిత భర్తృక ద్వాపరమున కృష్ణునితో నెరిపిన శృంగార విహారములు వన శృంగారమునకాలంబన.

 రాధ వంటి భక్తి ఉన్న ఏ స్త్రీ అయినా రాధే. రాధ ఒక శక్తి , చైతన్య స్వరూపిణి.   ఈ కావ్యానికి స్ఫూర్తి రాధ.  రాధ వంటి ప్రోషిత భర్తృకలు కలియుగంలో చాలామంది ఉన్నారుఅందులో ఒకానొక రాధ కథ ఈ వన శృంగారం.

                                                          

సంధ్యాసమయమగుచుండెను. మలయానిలము తాకి మేను  పులకించుచుడెను. పికము తియ్యగా పాడుచుండెను బృందావనమునొక బంగారు చేలములు ధరించిన రాధ సంచరించుచుండెను.  స్వర్ణ భూషణములతో ఆమె బాహ్య సౌందర్యము వెలుగుచుండ  ఆద్యాత్మిక  సాహిత్య ఙ్ఞాన పరిపక్వతతో ఆమె అంతఃసౌందర్యము వెలుగు చుండెను. 

విరహోత్కంఠిత రాధా చైతన్యము పొంది ఉద్యాన వనమున  తన ప్రియుని కొరకు పొదరింట ఎదురుచూచు చున్నది. నా ప్రియుడు నను చేకొనగలడో లేడో యను ఆలోచనలు ఆమెను తట్టుచుండగా ఆ అలలపై తెప్పవలె తేలుచూ  వసుదేవసుతుడామె  మదిలో మెదిలెను.   

  

1.గోపాలుని  స్మరించుట 

. మదనా   సుందర  వదనా                            

మదకర  కలికిని, వలచిన మగువను  పట్టే         

వదలక  అంటుకు పోయిన   

విదురా  వరవా  సుదేవ  వందన  మిదిగో  

మదనా  (మన్మథా), సుందర  వదనా,  మదకర  కలికిని,  వలచిన మగువను, మత్తెక్కించే  మనోజ్ఞురాలగు,  ప్రేమించిన స్త్రీని,  పట్టే వదలక  అంటుకు పోయిన   ( లేవదీసుకు పోయి ) విదుర (సర్వము తెలిసిన ) వర (శ్రేష్ఠ ) వాసుదేవా , వందనమిదిగో. సుందరాకారా గోపాలా నిను వలచిన రుక్మిణీ దేవి వర్తమానము పంపుటతో నీవు  విక్రమముతో(heroically) ఆమెను అంటుకు (లేవదీసుకు ) పోయినావు.  వసుదేవ కుమార నీకు వందనము.

  2.సంధ్యాకాల వర్ణన 

. చంద్రో దయవే  ళనింగి  

చంద్రిక  లుకళక   ళనవ్వె  జంత్రము మోగే         

మంత్రము  గారమ  ణిరగిలె      

ఇంద్ర  కీలము తగలగ  ఈడే  రగిలే  

చంద్రోదయవేళ నింగిన జాబిలి  కళకళ నవ్వెను.  దూరము నుండి జంత్రము (వాద్యపరికరం) మంద్రము గా మోగేను.  ఇంద్ర  కీలము (మెరుపు )తగలగ నరములంగారము  రగిలి  రమణి   రాజుకొనెను.  మదన బాణము  తగలగ తవ  విరహేయని  రాధ  వేగుచుండెను.  

3.చెలియుడి గుణరూప విశేషములు 

క. వేషము జూడగ మెరుపే   

రోషము తోమే షగతియె  రేగుపొ  టేలే     

పేషణ జేసెను  బాధను

శేషముఁ జేసెద నునేను జీవిత మంతా

తెల్లని వస్త్రములతో మాటిమాటికి మీసము దువ్వు  అతడి వేషము జూడగ మెరుపే అనిపించును. రోషముతో  మేషగతి(అగ్ని)వలే రేగువాడు. పొటేలే  పేషణ (చూర్ణము)జేసెను బాధను. శేషముఁ జేసెద(అర్పణము జేసెద) నునేను నా  శేష ( మిగిలిన )జీవితమంతా. 

4.చెలియుడి గుణరూప విశేషములు 

.ఆజా నుబాహు డుపసిడి 

సాజా  తముక ల్గిసార  సారస మొలికే         

రాజాం  కుడుసా  హసికుడు          

బాజాల తోనను పరిగొను భాసుర ముగన్    

ఆజానుబాహు = పొడుగరి ; పసిడి సాజాతము (పోలిక ) కల్గి  ;  సార (గొప్ప)  సారస మొలికే  (చంద్రకళ తొణికిసలాడు)  రాజాంకుడు (చంద్రుని గుర్తుగాగల శివుడు)  సాహసికుడు; "బాజాల తోనను పరిగొను భాసుర ముగన్." రాధ మనసులో ఆలోచనలు ఆమె అలలులాఎగిసిపడుతున్నాయి 

5.చెలియునితో శృంగార తపన 

 ఆజాను బాహు మానస  

చోరుడు రసికడు సఖుడు, చతురుడు నన్నే 

లుమగఁడు  నావల కాడే ,

ఉక్కుఛా తిననను గొని  ఊపును మరుడే.

మానసచోరుడు -మనసు దోచిన వాడు;  రసికుడు సఖుడు -శృంగారమును గ్రహించు ప్రియుడు ; చతురుడు నన్నేలు మగఁడు- తెలివైన మగడు ; వలకాఁడు = కాముకుఁడు libidinous man; ఉక్కు ఛాతిన, ననుగొని =నన్ను పరుండ బెట్టుకొని;  ఊపును, మరుడే =మన్మథుడే

6.కలికి విశ్వాస సంశయము 

క. ఏమో ఆతడే మురారి

ఏమో నేగో పికనని ఇంపుగ ననగా 

ఏమో యతడిని  నమ్మితి                       

నమో   గురుడత  డిమాట  నాతిచ రామీ

ఏమో ఆతడే మురారి  ఏమో నే  గోపికనని ఇంపుగ (ముద్దుగా) ననగా , ఏమో యతడిని  నమ్మితి , నమో   గురుడు (నమస్కారములచే పెద్దవాడు)   అతడిమాట  "నాతిచ రామీ" నమ్మవలెను. అనగా మనసులో  తనప్రియుని కృష్ణుడే  యని భావించిన రాధకు  ప్రియుని  నాతిచ రామీ  మాటలు స్ఫురణకువచ్చెను. 

 7.చెలియని రూపమును కని తాపము పొందుట  

. చీకటి పడుచుం డపడుచు    

వాకిట  నేనిల చివేచె వచ్చిన వాడే     

మాకిడి చూడగ రమణికి  మానము పొంగే 

ఆకలి చూపుల కుసొబగు లప్పన జేసే  

చీకటి పడుచుండ  పడుచు   వాకిటనే నిలచి వేచెను,  తెల్లని పంచె కట్టులో తన ప్రియుడు రానే వచ్చెను. వచ్చిన వాడే మాకిడి (దిగ్భ్రమ చెంది) చూడగ రమణికి  మానము  (చిత్తౌన్నత్యము, గర్వము) పొంగెను, అతడి ఆకలి చూపులకు  రాధ తన సొబగులు అప్పన చేసెను .  

8. చెలియ విరహతాప  ప్రభావము  

క. చీకటి పడుచుం డపడుచు    

పాకము కారే  టిపాప  పసిడం  దాలే        

 కాకను  పెంచగ  కాగెను  

 వాకయు సలసల, రగిలెను వాయువు జ్వాలై   

 చీకటి పడుచుం డపడుచు పాకము కారే టి పాప  పసిడం  దాలే ; కాక( వేడి)ను  పెంచగ  కాగెను  వాక (ఏరు) యు సలసల, రగిలెను వాయువు జ్వాలై  . అతిశయోక్తి  ప్రయోగము : శృంగార ప్రభావాన  వనము దరినున్న వాక కూడా వేడెక్కి సలసల మరిగినట్టు , వాయువు కూడా రగిలినట్టు వర్ణించబడింది . చీకటి పడుచుండ పడుచు డంబమంతా వెలిగెను  రమణి  కాగెను సలసల భూరి శృంగార గంగ పొంగగ మదిలో 

9.పారవశ్య ఉపసంహరణ 

 క. మోహము  కలిగెను  యవ్వన 

దాహము సహజము గపుట్టె దానిని  చూచే  

రాహితు చేయకు అబలకు   

మోహము సాహస మనకుర  మోజున కొనరా 

 మోహము  కలిగెను  యవ్వన  దాహము సహజముగ పుట్టె దానిని  చూచే  రాహితు, పలుచన లేక చీప్, చేయకు.  అబలకు మోహము సాహస మనకుర. స్త్రీలకు  కోరికలుండుట సాహసము అనక , మోజున కొనరా,  ప్రీతితో చేపట్టు 

10. ప్రణయ కాంత ప్రియునకు ఆహ్వానము  

 క.నీరా కకొరకు వేచితి    

రారా   రాధా మనోహ   రారవి కుంగే      

భారా  క్రాంత  ప్రణయి 

నీరా ధపిలిచె  నురార  నిరుపమ  వీరా 

11. ప్రణయ కాంత ప్రియునకు ఆహ్వానము

 నీరా కకై మ నోహరా 

వేచే నేసంధ్య లోరవి మసక బారే 

నుకనులు  కాయలు కాచెను

 రారా  మధుప   మైనన్ను గ్రోలర  వీరా!

రాధ పుష్పము. తన ప్రియుడు మధుపము. రవి మసక బార ఆమె తన మకరందమును  ప్రియున కర్పించు చున్నది.

12. ప్రియునకు కాంత ఉపదేశము

  క. చారిక  కోరిక తీరదు  

 తీరిక  చాలదు  అనకుర  ధీరుడ రారా

 చారిక సలుపును తీర్చర 

 తీరిక  మారదు రలోక  తీరిక అంతే 

చారిక (చెలి లేదా చెలికత్తె ) యొక్క కోరిక తీరదు , తీరిక  చాలదు  అనకుర  ధీరుడ రారా  చారిక సలుపును తీర్చర,  తీరిక  మారదుర  లోకతీరిక అంతే. లోకం కోసం రిత్తగా సమయ వృధా చేయక చెలి కోరిక తీర్చమని కొమరాలి కోరిక తెలుపుచున్నది  

శృంగార కౌతుకమును తెలియబరుచు  గీతాలు 

చారిక  కోరిక తీర్చగ రారా  తీరిక  చాలదు  అనకుర  ధీరా 

 చొరకొని రారా సరసా, సరసము విరసము చేయకు సూరా 

 హద్దులు మీరక ముద్దులు తీర్చర,  లౌక్యము నేర్చి లోకము

 నోర్చర,  పోరిక ఆపర  అపర సారంగధర వర సుకుమారా !

 హిరణ్య ధరుణ విరహిణి చరణ కింకిణులు నిను పలకరించగా   

 వసంత రాత్రి  రేరాణి పారాణి  నీపై విరితేనియలు చిలకరించగా 

చంద్రికలల్లిన చల్లనివేళ  మల్లె  పొదలలో అల్లరి చేయగ రారా  

మత్త జఘన యుగళాంతరమాద్రమయ్యె రా. మనోహర రారా 

స్వర్ణ వర్ణ శీర్ణ వలగ్నము శీఘ్రము గొన లగ్నమేలరా 

నరజాతికందిన సురసుఖమిది గొనరా ఇహపరమేలరా !!

 అర్థాలు : స్వర్ణ వర్ణ ( బంగారు రంగు ) శీర్ణ ( చిక్కిన) వలగ్నము ( నడుము) 

13.వరుని  శృంగార  చాతుర్యము 

క. వాగువ లెవరుని మాటలు     

సాగెను   రూపునె  లవంక సామజ  ఠీవిన్

సాగెను   డకఘా  టుకనుల     

లాగెను  పయ్యెద తలంత  లాహిరి  గమ్మెన్   

వాగు (సెలయేరు )వలె  వరుని మాటలు సాగెను . అతడి రూపు చూచిన నెలవంక (బాలచంద్రుడు)వలే నగుపించు ను.  సామజ ( ఏనుగు వంటి ) ఠీవితో అతడి నడక సాగెను. అతడి ఘాటుకనుల (ఎప్పుడు నా పయ్యెద పైనే యుం డును) నా పయ్యెదను లాగెను. నా తలంతాలాహిరి ( ప్రేమమైకము) గమ్ముకొనెను. 

14. వధువు సిగ్గిల్లి మోము దాచుకొనుట  (రాస క్రీడా విలాస ప్రారంభము)

  రూపసి యగుపతి నికాంచ 

 బుగ్గలు ఎర్రని గులాబి మొగ్గలు కాగా

 సిగ్గరి దాచెను మోమును  

 ఘాటుగ నాటిడు కనులకు చిక్కక రమణీ.

  ప్రియుని కంక్షా పూరిత నేత్రములు  చూచుచుండగా ఆమె సిగ్గిల్లి తన మోమును దోసిట దాచు కొనెను. 

15.   రాస క్రీడా విలాసము  వరుడు వధువును తాకుట 

క. అల్లన వీచుచు తెమ్మెర

మల్లెల  తావుల  నుతె చ్చి మోహము రేపెన్     

నుల్లము నూపగ రూపసి    

నల్లన  తీండ్ర  తొగాంచి నాభిక  మీటెన్ 

అల్లన వీచుచు తెమ్మెర ( మెల్లగా వీచుచున్న పిల్లగాలి) మల్లెల  తావుల  నుతె చ్చి మోహము రేపెన్  (మల్లెపూల సువాససనను తెచ్చి మోహమును రేపెను ) నుల్లము నూపగ ( మనసును ఊపగా )రూపసి +నల్లన (రూపశినల్లన ) అందగత్తెను మెల్లగా, తీండ్ర  తొగాంచి (కోరికతో చూసి) నాభిక  మీటెన్.  మల్లెల సువాసన మత్తె క్కించు  చుండగా ఆమె వంపుసొంపులను శృంగారేఛ్చతో కాంచి ఆమె నాభిని తాకెను.

16.   రాస క్రీడా విలాసము  వరుడు వధువును తాకుట 

క. అల్లన కురిసెను వెన్నెల 

చల్లగ  తనువం తతాక  జ్వాలలు రేగే       

జిల్లను చల్లని వేళన 

పిల్లను తీండ్ర  తొగాంచి పిరుదులు తాకెన్  

17. రాస క్రీడా విలాసము  వరుడు వధువును తాకుట 

క.నడుమును మీటుచు  నిలచెను

 నిడివిన  వెనుకగ మరుడై  నితంబి  నదిమెన్    

 అడుచుచు  అనుభవ  మందెను      

 కుడుచుచు  భోగము లనంద  కూతలు కూసే                                 

 నడుమును మీటుచు  నిలచెను.  నిడివిన ( నిలువుగా)  వెనుకగ మరుడై  నితంబి (పెద్ద పిరుదులు గల స్త్రీ) నదిమెన్  ( హత్తుకొనెను ) అడుచుచు  అనుభవ  మందెను.   కుడుచుచు  భోగము లనంద  కూతలు (రతికూజములు )కూసే. 

18. రాస క్రీడ పతాక స్థాయికి చేరుట 

 ఊయల  లూగెను అంగన

ఊయల లూగగ సువదన ఉరసిజ  మూగే

ఊపులు చూచిన వేడుక

కూకూ యంచూ సుఖముగ కూసెను పికమే

సైకత జఘనమును చూచి ఘాతమును పొంది ఆకర్షితుడైన ప్రియుడు ఆమెను వెనుకనుండి వాటేసు కొనెను.  అట్లు ఊయలలూగు చున్న రాధ స్తనములు లూగుచుండెను. ఆ ఊపులు చూచిన కోయిల వేడుకతో  కూసెను.  

19. రాస క్రీడ పతాక స్థాయికి చేరుట 

క. ఊయల  లూగగ మగనితొ 

కోయల  తియ్యం గకూసె కాంతుడు రేగే 

ప్రాయము   రతికూ జితములు  

కూయగ  తాపము నజాణ  కోకిల జారే

అట్టి చంద్రిక లలిమిన చల్లిని ఉద్యానవనమున ఒక చెంప పూపరిమళములు  మత్తెకిచుచుండగా మరొక చెంప ప్రేయసి అందములు మరులు గొలుపుచుండగా ప్రియునికి ఉత్తుంగ శృంగచలనము కలిగెను. వారి ఆలింగనములో విస్ఫులింగములు రేగి రతి కూజితములు వెలువడినవి. అదివిని కలతచెందిన  కోకిల  ఎగిరిపోయెను

20. శృంగార క్రీడకు కోకిల స్పందన 

 కోకిల జాణే నేమో

ఇంకను నిలచిన వలువలు  ఏమగు నేమో   

 కోకిల రేపగ  వరుడే

 రేకను కోరుచు  మరుడై రేగును ఏమో 

కోకిల జాణే నేమో? నిస్సందేహముగా కోకిల జాణే, అనగా నేర్పరి  అని అర్థం. ఏకాంతమునున్న ఏకాంతనూ కాంతుడు వీడడు అని సత్యమును గ్రహించి జరగబోవు శృంగారమును ఊహించి మనుజుల వలె మూర్ఖముగా నుండ పని ఏమని కోకిల తన ప్రియునికడకు ఎగిరిపోయెను.  

21.శృంగార క్రీడకు ప్రకృతి  ఆలంబన 

 క. తొలగెను కందము  నింగిన 

 వెలిగెను జాబిలి వరాల వెలుగే పరిచెన్ 

 నిలచెను  నెచ్చెలి చెక్కిట  

 కళకళ  బుగ్గల నుజూడ  కన్నులు  నిండే 

ఆకాశమున కందము అనగా మేఘము తొలగిపోగా జాబిలి  నిండుగా వెలిగెను . ఆ నిడుపున్నమి వెన్నెలలో ప్రేయసి నున్నని చెక్కిలి వెలిగెను. చక్కని చుక్క  అందమును వెన్నెలలో చూచుటనిన  ముఖమల్  గుడ్డపై ముత్యాలు పోసినట్టే  కదా !

22.శృంగార క్రీడలో వరుని కళ్లతో కవ్వించుట 

క. గిలిగిం  తలిడతాకి   సఖుడు   

 చెలిమే  నంతపు  లకించె చెలగకు  చములే 

 పిలిచిమ   దిరాక్షి  జూపెను 

 సలుపం   తకనుల సఖుడు సవరించె కానే  

గిలిగింతలిడెను ( రాధకు)   తాకగ   సఖుడు.    చెలి మేనంత  పులకించె చెలగ (ఉత్సహించు ) కుచములే.  పిలిచి మదిరాక్షి  జూపెను (ప్రియునకు)  సలుపంత కనుల ( కనులలో ).  సఖుడు సవరించె కానే ( కాను - నడుము ) అనగా అతడు నడుము తాకి ఆమె తాపము తీర్చెను.

23.శృంగార క్రీడలో వరునికి చిక్కక  మురిపించుట 

కలిగెను   ఎన్నడు  దెలియని 

గిలిగిం  తచెలువు  డుతాక గెలివిడి  హెచ్చెన్ 

వలపుగొ  నిపరుగు  లిడుచు     

చెలిరం  భోరువు  లుగుద్ద చెదిరే నంచల్  

గిలిగింత పడుచు , పడుచు పరిగెడుచున్నది. ఇట్లు  ప్రియునికి దొరకక పరిగెత్తుట శృంగార క్రీడా విశేషము. అట్లు వలపుగొని మోహముతో పరిగెత్తుచున్న రాధ వెన్నెలలో విహరించుచున్న ఒక రాయంచలను ఊరువులతో గుద్దుకొనగా రాయంచలు చెదిరినవి.   శృంగారమందు వారి దూకుడట్లున్నది  

(నేటి కాలమున యువతీ యువకులు శృంగారమనిన మైధునమనుకొనుచున్నారు. శృంగారము  మైధునము వేరు వేరు. Sex and Romance are different. శృంగారానికి పరాకాష్ఠ గిలిగింత. మైధునమునకు పరాకాష్ఠ  భావప్రాప్తి.   చూబించుట , చుంబించుట , తాకుట,  కౌగిలించుకొనుట ఇట్లు వలపును  తెలుపు చేష్ట లన్నియూ శృంగారమే. శృంగారము లలితము.  మైధునము విశృంఖలము పాశవికము.  స్త్రీ పురుషుల అంగములు వారిని నిలువనీయక పాశవికంగా మార్చును. దానికి పరాకాష్ఠ మైధునము.)

24.కవ్విం  చుకనుల   రాధను

 రాయం చలుచు  ట్టముప్పి  రిగొనిము రారే 

జారిన పయ్యెద గప్పుచు

వాలుగ చూచిన సుజాత ముంగిట నిలిచే" 

 రాధ తన జారిన పైటను కప్పుకొనుచూ వాలుకనులతో ప్రియుని కవ్వించుచున్నది  రాయంచలు ఆమెను చుట్టి  రక్షకవలయము వలే నిలచినవి, ఆదృశ్యము చూచినమురారిముప్పిరి గొనెను. సుజాత-మంచి వంశములో పుట్టిన స్త్రీ 

25.రాయంచల కూడి  వన శృంగార కేళి 

క. ముసిరిన మరాళ ములేకని    

కసిరిన  మురారి నిజూచి కాంతయు జడనే  

విసరుచు ముద్దుగ చూచుచు    

ముసిముసి  నవ్వున మురారి ముఖమును  కనెనే 

26.రాయంచల కూడి  వన శృంగార కేళి 

 ముసిరిన మరాళ ములుము 

 ద్దుగలగ మురారి నుఱుముచు నిలిచే 

మురిసిన మురారి విసిరిన 

వాల్చూ  పులువిరి  సినఎద  వీణను మీటే

ముసిరిన మరాళములు ముద్దుగలగ మురారి నుఱుముచు నిలిచే మురిసిన మురారి విసిరిన  వాల్చూపులు  విరిసిన   (అనఁగా  fully developed) ఎద వీణను మీటే. శబ్దాలంకారములు గ్రహించుటకు యధాతధంగా ప్రస్తుతించబడినది.

26. వన శృంగార చెలగాటము 

క. వనమున  పిట్టా పులుగులు 

మనమున రాధకు సఖులు మదనుని కెరుకే  

గునుపును చూడగ వేడుక  

తనువున   కలిగెత రితీపు తరుణిక నవ్వే 

వనమున  పిట్టా పులుగులు మనమున రాధకు సఖులు (అది)  మదనుని కెరుకే. అయిననూ అతడిని అడ్డగించిన  రాయంచల పై అలుకవహించెను.  అతడి గునుపు ( క్రీడా విలాసము, అలుక నటించుట)ను  చూడగ వేడుక.   అది వేడుక క్రీడే.  అది  చూచిన రాధకు  తనువున  కలిగె తరితీపు ( కోరిక  సలుపు ) తరుణిక నవ్వే అనగా అతడి అలుకను  చూచి  అంగన చక్కటి శరీర సౌష్టవం గల  రాధ  నవ్వుచుండెను. 

29. వన శృంగార చెలగాటము 

అంతట  మురళీ ధరుడా  

మెపిరుదు లపైచ రిచేను మెల్లగ ఊగే 

నుఉల్ల  ముచల్ల గపఱుగి

డెరమణి పిరుదుకొ  నుచుమరు  డామెను తరిమే   

అంతట  మురళీ ధరుడామె పిరుదులపై  చరిచేను.  మెల్లగ ఊగేను ఆమె ఉల్లము. చల్లగపఱుగిడె రమణి పిరుదుకొనుచు ( వెంటబడుచు )మరుడామెను తరిమే.

30.శృంగార చెలగాటమున  ప్రియురాలిని పిరుదుకొనుట 

 క. బ్రమరి పారరి ఇరువురు  

క్రమము గవెలిగె  నువనము  కౌముది హెచ్చే 

ద్రుమము లుగుప్పె   తావులు        

బ్రమర  ములాయి రివారు  బ్రామిక పెరిగే 

31. శృంగార చెలగాట హేలి 

 బ్రమరి పారగ  కొమరా 

లందెల ఘల్లన రవళిలు అంతట పాకే 

తుంటరి తుమ్మెద  తేనే 

కోరుచు  వంటరి రమణిని కొసరుచు సాగే 

బ్రమరి పారగ (చుట్టూ తిరుగగ) కొమరాలందెల ఘల్లన రవళిలు అంతట పాకే. వెన్నెల నిండిన వనమంతా ఆమె అందెల మోత అల్లుకొనెను. తుంటరి తుమ్మెద(రాధ ప్రియుడు, కాబోవు మగడు)తేనే కోరుచువంటరి రమణిని కొసరుచు సాగే.


32.శృంగారము పతాక స్థాయికి చేరి ముద్దుతో ముగియుట 

జవ్వని   చేరెను  కొలనుకు 

 మువ్వల మోతలు ముదముగ మురిపిం చంగా

సవ్వడి చేయక చల్లగ     

నవ్వుచు మురారి పిరుదుకొ నామెను  అందెన్   

33.చివరకు చేరెను  చిలుకలు  

కలువల కొలనును పెదాలు  కలుపగ పిలిచే 

వీణను మీటుచు గోపిక 

విభునకు ముద్దొక టొసగుచు వలపును తెలిపే   

జవ్వని   చేరెను  కొలనుకు మువ్వల మోతలు ముదముగ మురిపించంగా,  సవ్వడి చేయక చల్లగ  నవ్వుచు మురారి పిరుదుకొని  (వెంటపడి ) ఆమెను   అందెన్ ( పట్టుకొనెను) చివరకు  చిలుకలు  కలువల కొలనును చేరినవి   గోపిక వీణను మీటుచు పెదాలు కలుపగ పిలిచి.  విభునకు ముద్దొక టొసగుచు వలపును తెలిపే.  ఇట్లు వలపును తెలుపు చర్యలన్నియు శృంగారమనబడును. రాధాకృష్ణుల తమ వలపును  శృంగారమట్లు  ముగిసిన పిదప  రాధ తన మానసమును విశిదపరిచెను.   


34  సీ.  కోరికి లొలికించు  కన్నులు కన్నులు 

మురిపించి ఇచ్చేటి ముద్దు ముద్దు 

సరసమా డునపుడు  సమయము సమయము 

వలకాని  పలుకుల వలపు వలపు

ప్రేయసి  నిముద్దిడు  పెదవులు పెదవులు 

జతగాడు  చూపించు  జగము జగము 

అభికుని సరసన   హాసము హాసము 

పరిణేత  తోడిదే బతుకు బతుకు

   

                                                            Romance is so delicate. 

Sunday, March 28, 2021

వాల్మీకి రామాయణంలో ఏముందో తెలుసా ?

 నిజం తెలుసుకోడం ఎంతో కష్టం. నిజం మాట్లాడడం అంతకంటే కష్టం.   నిజం తెలుసుకోడానికి చాలా శ్రమ పడాలి.  నిజం మాట్లాడడానికి దమ్ముండాలి.  పక్కవాడిని ద్రుష్టి లో పెట్టుకుని ఆలొచించే వాళ్ళే ,  రిస్క్ ఎందుకు అని నోరెత్తని వాళ్ళే   ఎక్కువగా కనిపిస్తారు. కానీ అది సత్వం అనుకుంటారు .  బానిసత్వం అని తెలుసుకోరు. 

మనకి అబద్దాలే ఎక్కువ ప్రచారంలో ఉంటాయి.  చాలా కష్టపడి మనం నిజం తెలుసుకున్నా , ఆ నిజాన్ని ప్రజలు అంగీకరించలేరు.  ఉదాహరణకి  వాల్మీకి రామాయణం పెద్ద గందరగోళం. సంస్కృతం లో ఉంది కాబట్టి ,  చాలా పెద్దది కాబట్టి  చదవడం కష్టం. ( నేను సంస్కృత వాల్మీకి రామాయణం చదువుతున్నాను)

 ఒకవేళ ఏతా వాతా  చదివేవనుకో  నిజం చెప్పగలవా ? వాల్మీకి గొప్ప కవి అని అంతా  అనుకున్నాక,   రాజుగారి దివ్య వస్త్రాలు కథలో చిన్నపిల్లాడు నాకు బట్టలు కనిపించడం లేదు అని చెప్పినట్టు వాల్మీకి లో నాకు గొప్ప కవి కనిపించడం లేదు అనగలవా ?

 నువ్వు అంటే మాత్రం పక్కన ఉన్నవాళ్లు ఒప్పుకుంటారా ? నిజాన్ని సహిస్తారా? ఆ సహృదయత వారికి ఉంటుందా ?  వారికి ఉందో  లేదో పక్కన పెట్టి,  నీకు సహృదయత ఉంటే నే ఈ ఆర్టికల్  చదువు.  లెకపొతే ఇక్కడే ఆపేయ్.

వాల్మీకి రామాయణం పెద్ద గందరగోళం. నాకు నచ్చలేదు.  కారణం చాలా విషయాలు  అర్ధవంతంగా వ్రాయలేదు. 


లక్ష్మణుడు సూర్పణక ముక్కుచెవులు కోయడం మీకు పెద్ద తప్పు గా అనిపించకపోవచ్చు. అడవికి వెళ్ళమన్న తల్లి అభిప్రాయాన్ని అంగీకరించేముందు భార్య అభిప్రాయాన్ని రాముడు కనుక్కోలేదు. అవసరం లేదేమో. చాకలి అంత  విలువఇచ్చిన రాముడు భార్య అభిప్రాయానికి   కూడా విలువ ఇస్తే బాగుండేది.  సరే  భార్య చచ్చినట్టు భర్త ని  అనుసరించాలని అనుకుందాము, మరి లక్ష్మణు ఎందుకు అంత అతిభక్తి చూపాలి ? సరే చూపాడు , మరి ఊర్మిళ ఎందుకు సీతలా భర్తని అనుసరించలేదు ? 

అగ్నిలో కాలక పోవడానికి శీలానికి సంభందం ?  చాలామందికి అర్ధం కాదు. సీత అగ్ని ప్రవేశం చేసేముందు ఏమందో తెలుసా ? అంతా  అయ్యిన  తర్వాత అడవికి పంపాల్సిన అవసరం లేదే మో ?  పంపేముందు భరణం ఇవ్వాలికదా, వాల్మీకి ఆశ్రమంలో ఉన్నందుకు  ఆయనకీ ఏమీ ఇవ్వలేదు. ఆయన పాలనలో  ఒక రాణి పరిస్థితి ఇంకొకలా పంచన చేరి రాముడికి ధర్మ సూక్షమమ్ తెలుసుకదా ఏవన్నా వాల్మీకికి ఇచ్చి ఉండాల్సింది.  

కొన్ని విషయాలు చిరాకు తెప్పిస్తాయి  ఉదా రావణుడు కౌసల్యని అపహరించడం. దశరథుడి పెళ్లి శాంత ఋష్య శృంగుని మోహపరచడం వంటివి చూస్తే విలువలు మీద మాట్లాడలేము. రంభని రేప్ చేయడం, రంభ శాపం వల్ల  రావణుడు సీతని తాకకపోవడంమనకి తెలుసు. కుబేరుడు కూడా రావణుడికి శాపం పెట్టీసినప్పుడు సీత ఎందుకు పెట్టలేదు? నన్ను కిడ్నప్ చేస్తే నీ తల వ్రక్కలుగును గాకా! అని రాముడు తాకడంతో నీటిలో రాళ్ళు తేలి వారధి కట్టారు. అంటే రాముడు మహిమ ఉపయోగించాడు కదా మరి అదే మహిమ ఉపయోగించి సముద్రంపై నడిచి వెళ్ళొచ్చుకదా!

ఆపై దానిని వక్రీకరించడాలు,  స్వేచ్ఛానువాదాలు,  చొప్పించడాలు తో రామాయణంలో ఏది నిజం ఏది అబద్దం అనేది చెప్పడం చాలా కష్టం . ఇవన్నీ ఒకెత్తైతే సినిమాపైత్యం మరొక ఎత్తు. రామాయణం లో సినిమాపైత్యం ఎంతుందో తెలిస్తే ఆశ్చర్య పోతారు. 

Saturday, March 27, 2021

what google says about Ramayana

 సినిమాలు ఏం చూసారు ?   

నేను పుస్తకాలు చదువుతున్నానండి సినిమా వినోదం కంటే నాకు చదవడం ఇష్టం .

 జగన్ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నాడు. జగన్ మీద మంచి పోస్ట్ పెట్టాను చూసారా ?

చంద్రబాబు అయినా జగన్ అయినా అవినీతి లో కూరుకుపోయినవారే కదా 

ఒక మిత్రుడుతో సంభాషణ ఇలాసాగుతోంది. 

ఉచితాలు , రిజర్వేషన్లు అనుభవిస్తూ  నీతి కోసం  పోరాడుతున్నారు. సినిమాలు వంట పట్టించుకుని  సంస్కృతి  సంప్రదాయాలు కోసం , విలువల కోసం బాగా మాట్లాడుతున్నారు. ఇంతకీ పుస్తకాలు ఏమైనా చదువుతున్నారా లేకా సినిమాలు చూసే మాట్లాడేస్తున్నారా ?  బాగా చదివి  ఆలోచించి మాట్లాడుతున్నారా ? ఎవడో చెప్పినది విని  రెచ్చిపోతున్నారా  ?  నిజాయతీగా మాట్లాడుతున్నారా  నలుగురితో చేరి   కావ్ కావ్ అంటున్నారా ?

పుస్తకాలు చదవడం ఎందుకు గూగుల్ ఉందిగా ఏంకావాలిసినా అప్పటికప్పుడు చెప్పేస్తుంది అన్నాడు 

 కానీ గూగుల్ తప్పులు ఇస్తుంది కదా అన్నాను , "నో ఛాన్స్ ,  గూగుల్ అమ్మ చెప్పినది వేదం." అన్నాడు 

రామాయణంలో సీతని రావణుడు అపహరించినప్పుడు సీతని ఎలా తీసుకెళ్లాడో తెలుసా?  

భూమితో సహా పెకలించి సీతను రావణుడు తీసుకెళ్లాడు. " మీకెలాతెలుసు ?"  అన్నాను .

సినిమాలో అలాగే చూబించారు. చాలాచోట్ల విన్నాను అందరూ అలాగే చెపుతున్నారు

 వాల్మీకి వ్రాసిన  సంస్కృత  రామాయణం నిఘంటువు సాయంతో చదవగలుగుతున్నాను , ఆలోచించ గలుగుతున్నాను 

1.  वामेन सीतां पद्माक्षीं मूर्धजेषु करेण सः।।3.49.17।।

ऊर्वोस्तु दक्षिणेनैव परिजग्राह पाणिना।

सः that Ravana, पद्माक्षीम् lotuseyed, सीताम् Sita, वामेन करेण with his left hand, मूर्धजेषु holding her hair, दक्षिणेन पाणिना with right hand, ऊर्वोः under her thighs, प्रतिजग्राह held her.

అంటే ఎడమ చేతితో సీత జుత్తు పట్టుకుని , కుడిచేతిని తొడల క్రింద వేసి తన రథంలో పెట్టి తీసుకెళ్లాడు  

సీతని రావణుడు తాకలేదు, లక్ష్మణ రేఖ దాటి రాలేక పోయాడు.  ముట్టుకుంటే  మాడిపోతాడు ఆవిడ మహా శక్తి. అన్నాడు. ఆవిషయం వాల్మీకికి తెలియక అమాయకంగా (నిజాయతీగా) వ్రాసేసాడు. అతడిని క్షమించు అన్నాను.

 "లక్ష్మణ రేఖలు అనేవి ఉన్నాయా ?"  ఎందుకు లేవు సినిమాల్లో చూసాం కదా అని నాలిక కరుచు కున్నాడు. లక్ష్మణుడు మూడు మంచి మాటలు చెప్పాడు గీతాలు ఏమీ గీయలేదు . సినిమాలని నమ్మలేములే అని మళ్లీ అతడే  అన్నాడు.  సంతోషం మరి గూగుల్ ని నమ్మొచ్చా? అన్నాను 


నమ్మొచ్చు అన్నాడు ఈ ఇమేజ్ చూబించాను.  

గూగుల్ ఇలా చూపుతోందా , చంపేయాలి వాడిని అన్నాడుమరి వాల్మీకిని ఏం చేయాలి అన్నాను. వాల్మీకి రామాయణంలో అసలు సీతా స్వయంవరమే లేదు  ఇలా చాలా లేనివాటిని రామాయణంలో  చొప్పించారు. కారణం ఏంటి  అన్నాను. అతడి దగ్గర సమాధానం లేదు అతడికి తెలుసు అతడు కావ్ కావ్ అని 

ఎందుకు చొప్పించారో రేపు ఇదే బ్లాగ్ లో చెపుతాను మళ్ళీ చదవండి. 
 చదవకపోయినా మీ ఇష్టం ,  కావ్  కావ్ అంటూ ... కానీ చదివితే కొన్ని సంకెళ్లు తెగిపోతాయి . జ్ఞానం విముక్తి ప్రదాయం.  

 



 రాధా కృష్ణుల బంధం భౌతికం కాదు ఆధ్యాత్మికం అని చెప్తారు. వాళ్ళు ప్రేమించుకున్నారు భౌతికంగానే కలిసి తిరిగారు.  దీన్ని  ఆధ్యాత్మికంగా వర్ణిస్తారు.  మీకేమనిపిస్తోంది? 

Thursday, March 25, 2021

రెండునిమిషాల్లో కందపద్యం

రెండు నిమిషాలలో పద్య రాయచ్చు , ఆనందాన్ని అందుకోవచ్చు 

నేను  రెండు నిమిషాల్లో  రాసిన   కందపద్యము 

                                                             

 కం. తలచిన తడవగ  పుట్టును   

   చలనము మనసున, ఇంపుగ చందము  తోడన్  

   అలలుగ   సాగును  తలపులు     

   అలసట  ఎట్లుండు నొతెలియ దంతము వరకున్   


Tuesday, March 23, 2021

నిజమైన అదృష్టం

మల్లాది అనిల్ కుమార్ గారు , ఈయన మనందరికంటే  చాలా బిజీ  కానీ భారతవర్ష లాంటి వేయి పేజీల గ్రంధాన్ని ఆమూలాగ్రంగా చదవడమే కాకుండా  స్వచ్ఛమైన తెలుగులో అనర్గళంగా విశదీకరించారు. తడుముకోకుండా ఇంత  ధారాళంగా తెలుగు మాట్లాడడం ఒకఎత్తు, ఏమాత్రం ముందుగా అనుకోకుండా, అప్పటికప్పుడు మాట్లాడ్డం మరో ఎత్తు.   

నిజమైన , భాషా ప్రేమికుడు అన్న పదానికి నిలువెత్తు  ఉదాహరణ అనిల్ గారు. పురుషులందు పుణ్యపురుషులువేరయా! అన్నట్టు  స్నేహమందు  స్వచ్ఛస్నేహమువేరయా  చెప్పచ్చు.   స్నేహశీలులయందు  నిస్సహాయ( helpless) స్నేహశీలులు ఎక్కువకనిపిస్తూ ఉంటారు.   క్రియాశీలక ( practical) స్నేహశీలికి  మంచి ఉదాహరణ అనిల్ గారు.   భారతవర్ష చదవమని ఒక్కసారి ఆడిగేను.  అంతే  అనిల్ గారు బ్లాగ్ లింక్స్  అనుసరిస్తూ రోజుకి పది కంటే ఎక్కువ ఎపిసోడ్స్ చదివి నన్ను ఆశ్చర్య పరిచారు. (రోజుకి పదిసార్లు ఫోన్ చేసిన ఒక్క ఎపిసోడ్ చదవనివారు ఉన్నారు. 99 శాతం ఇలాటివాళ్లే ఉన్నారు నేడు) ఇలా చదవగలగడం  చదివినది అంతా , గుర్తుంచుకొని అనర్గళంగా మాట్లాడగలగడం,  ఈర్ష్య లేకుండా  ఉదారంగా ఉండడం అరుదే కాక అద్భుతం . ఇలాంటి వారు ఉండడం  తెలుగు భాష, నేను  చేసుకున్న అదృష్టం.  

అనిల్ గారు ఏం చెప్పారో  ఈ లింక్ చూడండి   https://youtu.be/-P27VvQs6JM 

 ఇంతకంటే ఎక్కువ స్నేహంగా మెలిగే వారు ఉన్నారు. వారంటే అభిమానం కొద్దీ వారు ఈ కావ్యం చదవాలని ఎన్నో సార్లు  బ్రతిమాలెను. కనీసం 20 నుంచి 30 సార్లు  అడిగాను. అయినా ప్రయోజనం లేకపోయింది. వాళ్ళు చెడ్డ వాళ్ళు కాదు , చదవడం  విషయంలో  చేఁతక్కనివాళ్ళు అంతే. ఆవిషయం నేను అనడం లేదు వాళ్లే  అన్నారు. వారి మంచి మనసుకి, వారికి నా నమస్సుమాంజలి. 

నాకు తెలియకుండాచదివినవాళ్ళు కూడా ఉంటారు.   ఈర్ష్యతో వారేమీ చెప్పలేకపోతున్నారు.   కవి చావాలి భాష బ్రతకాలి అంటే ఎలా ?  వృక్షాలులేక ఫలాలు లేవు, కవులు లేక కావ్యాలు లేవు. తెలుగు భాష కి ఏదైనా చేయాలంటే కవికి రచయితకి సాయం చేయాలి. ( అంటే మీరు ఈ లింక్ షేర్ చేసుకుంటే చాలండి )

కొంతమంది అభిమానించేవారు , నాకు ప్రేరణ కలిగించినవారు, జీవితంలో భాగమైన వారు  కూడా  ఉన్నారు.  వారు లింక్ షేర్ చేయక్కరలేదు. అయినా  వారెప్పుడూ అమరులే.     

 నేను కవిని  అంటే చాలామందికి  వినడానికి ఎబ్బెట్టుగా ఉందట.   ఈరోజు ఎబ్బెట్టుగా ఉండచ్చు  కానీ నారచనలు పోనుపోను మీరే చూస్తారు. ఎవరు చూడకున్నా పుష్పం వికసించక మానదు. చిన్న ఉదాహరణ చూడండి 

 245 పేజీల మొల్ల రామాయణం పూర్తిగా చదివాను. 218 తెలుగు పద్యాల ఇతిహాసం (రాముని కథని) రచించారు కవ యిత్రి మొల్ల. ఆవిడ వ్రాసిన కావ్యం  సీసం కందం , తేటగీతి  ఆట వెలది,   ఉత్పలమాల చంపకమాల పద్యాల మిశ్రమం.  ఈ పద్యాలన్నీభారతవర్షలో నేను వ్రాసినవే. మొల్లకంటే ఎక్కువ పద్యాలతో నేను రామాయణం రెండు వారాల్లో రచిం చగలను. నేను రోజుకి రాయగలిగిన వృత్తపద్యాల సంఖ్య 20.  సనాతని దయ ఉంటే ఏదైనా సాద్యమే!

Saturday, March 20, 2021

సర్వాలంకార భూషిత

 సర్వాలంకార భూషిత కావ్య కన్య - భారతవర్ష 

Language work in Bharatavarsha

కన్నెపిల్లకి బంగారు ఆభరణాలు వన్నెతెస్తాయి, అలాగే కావ్యకన్యకి అలంకారాలు వన్నెతెస్తా యి. ఇవి నగల దుకా ణంలో ఉండే బంగారు ఆభరణాలు కాదు పదాలు పదబంధాలతో కావ్య కన్య కి  చేసే భావాలంకరణ.   మెరుగు తగ్గక  తరతరాలకీ నిలిచి తళ తళ లాడు భాషాభూషణాలు.  

                                             అలంకారములు మూడు రకములు. అవి:

1.శబ్దాలంకారములు: శబ్దం  ప్రధానముగా కవితకు బాహ్యసౌందర్యమును కలిగించేవి శబ్దాలంకారములు.

2.అర్థాలంకారములు: అర్థము వలన కవితకు అంతఃసౌదర్యమును కలిగించేవి అర్థాలంకారములు.

3. ఉభయాలంకారములు: శభ్దార్థాల రెంటి వలన కవితకు అందమును సమకూర్చేవి. 

 శబ్దాలంకారములు: ఇవి యారు. నాలుగు అనుప్రాసములు, ఒక యమకముఒక ముక్తపదగ్రస్తము.  

అనుప్రాసము: వర్ణవిన్యాసమును అనుప్రాసమందురుఇవి నాలుగు.

1. వృత్యనుప్రాసము: ఒక హల్లు (వర్ణము) మరల మరల వచ్చుటను వృత్యనుప్రాసమందురు.

సాధారణ ఉదాహరణ చెప్పాలంటే : కాకీక కాకికి కాక కేకికా?

సినిమా ఉదా:  ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ  ఎక్కడ దాక్కున్నావే లక్కును తెచ్చే చుక్కా,

ఎక్కువ చిక్కులు పెట్టక చిక్కవె చప్పున చక్కగ,  టక్కున టక్కరి పిట్టా, నిన్ను పట్టేదెట్టా? ఎట్టా?

భారతవర్ష  నుండి నాదము నంది నందిని  నంద నందుని  వందనము జేసి నందము నందుచు…

 కావ్య ఉదాహరణ 

 భారతవర్ష నుండి: పల్లె అందాన్ని వర్ణించు చంపకమాల పద్యము 

   చంపచ్చటి  చేలుము  చ్చటగ    పట్టము    గట్టిన   పల్లెజూ  చినన్

  నచ్చటె  వెచ్చగ  మనము  నాట్యము జేయును పట్టుబ  ట్టపై      

  ముచ్చట  గొల్పుచు  ముత్యపు  మిద్దెలు,   వీధులు   పైడిచే రులే               

   మెచ్చుచు బల్లిపా    డిదని   బల్కిన   చాలదు   చూచిరా వలెన్

2.ఛేకానుప్రాసము: రెండు కాని అంతకంటె ఎక్కువ కాని అక్షరాలు  అర్థభేదముతో వెంటవెంటనే మరల మరల వచ్చుట

సాధారణ ఉదా: గుడిలో పూజ పూజ చేస్తున్నది.

 సినిమా ఉదా:   కాళింది మడుగున కాళీయుని పడగల ఆబాలగోపాలం బాలగోపాలుని

అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ

భారతవర్ష నుండి :ఈ ఎరుపు లంగా,  నలుపు చేతుల పై వస్త్రమును ధరించి చూపిన తరింతును." అని వర్షుడు కోరగా, విదిష  వర్షుని వంక ఓరగా చూచి "అయినచో బతిమాలుము"అనెను."బతిమాలుచున్నాను కదా!" "అట్లు కాదు చుబుకము చేగొని  బ్రతిమాలవలెను" అని విదిష అనగా వర్షుడు కలవర పడి మగవానితో ఇట్లే నడుచుకొందువా?" అని అడుగగా  అప్పుడు విదిష " సత్యభామని రంగ స్థలంపై కాళ్ళు పట్టుకొన్న  మగవానికి గదిలో నా గెడ్డము పుచ్చుకొనుట కష్టముగానున్నదా?  కృష్ణునివలె పాడి అడగవలెను" అని ఆజ్ఞాపించగా ఆజ్ఞానువర్తియై వర్షుడు   నా పాడి తెలిసి పాడి అడుగమనుట పాడి కాదు పాడవలెనన్న పాడు పాటేల దొరకదు కృష్ణ,  కృష్ణ శోభ మాటున దాగె కృష్ణ ఘాటు, నీవది  మనసులో పెట్టుకొన్నచో తప్పునా! అని విదిష చుబుకము క్రింద చేతినుంచి రంగస్థలము పై భామ కొరకు పాడిన  పాటను గుర్తు తెచ్చుకొని హృద్యముగా ఆలపించెను.

సరస కవిరాజ రసిక సురరాజ ఘనరాజ రాజరాజ

దోష  రాహిత్య, నిత్య సాహిత్య భోజ, మహిత సాహితీ మనో వల్లభా

కీర్తి దుర్లభా, భక్తివిజయ జ్యేష్ఠ, విదిష శృంఖలిత శృంగార శ్రేష్ఠః

కృష్ణ క్రీడల దృష్టి ఘన కృష్టి మదన గోపాల కావ్య సృష్టి

కలుగు భక్తి పుష్టి కురియు నీదు నీలాల మీద క్రిష్ణనీలాల వృష్టి.

సూచన 1: వెంట వెంటనేరావాలి.   సూచన 2: అర్థబేధం ఉండాలి.

3. లాటానుప్రాసము: ఒకే అర్థము ఉన్న పదములను తాత్పర్యభేదముతోమరల మరల చెప్పుట

పోతన భాగవతము నుండి ఉదా:    కమలాక్షునర్చించు కరములు కరములు, శ్రీనాధు  వర్ణించు జిహ్వ జిహ్వ

భరతవర్ష నుండి " ప్రేమతో నిండారు రాగము రాగము...నిస్వార్థ నిర్యాణమున జనియించు వెలుగు వెలుగు. నిండు మనసుతో జీవించు జీవి జీవి." (  అరుణతారకు క్రిష్ణన్ ను  అప్పగించు నపుడు యమున అంతరంగములో)

సూచనపదాలు రెండు వెంటవెంటనె రావాలి.

(అక్షరసమూహాలు కాక పదాలు అయి ఉండాలిఅర్థభేదము గాని శబ్దభేదము గాని ఉండారాదు.)

4. అంత్యానుప్రాసము: పద్యములోని పాదాలకు కాని, వాక్యములకు కాని చివరిభాగములో ప్రాస కలుగునట్లు అవే అక్షరములు మరల మరల చెప్పుటను అంత్యానుప్రాసము అని అంటారు.

ఒక  సాధారణ ఉదాహరణ:   అగ్గిపుల్ల   కుక్కపిల్ల,  సబ్బుబిళ్ళ, కాదేది కవితకనర్హం

సినిమా ఉదా: అరటి చెట్టుకు గెల,  నువ్వు విసరకు వల

భారతవర్ష నుండి : అమీవ, కైటవ కాళిందివ లోకం తస్మిన్ లోకే సుక తాండవకృష్ణం.  

భారత వర్షం తాండవ కృష్ణం తాండవ కృష్ణం కవితా తృష్ణం

యాస్యతి నందిని నందనందనం, నందనందనం మమ అదృష్టం.


5.యమకము: రెండు లేక, అంతకంటే ఎక్కువ అక్షరాలున్న పదాలు అర్థభేదముతో మరల మరల చెప్పుట .

సాధారణ  ఉదా:  మనసుభద్రకు మనసు భద్రమాయె  (మన సుభద్రకు మనసు భద్రమాయె)

సినిమా ఉదా:  నీ జడకుచ్చులు నా మెడకుచ్చులు!

భారతవర్షనుండి: ఆర్యాణికల్యాణికాత్యాయణి,నీహారమేనిహారమైప్రకృతికిహారమైజీవులకు ఆహారమై నొప్పుచున్నదికదా!" (బసవడు మిద్దె పైనుండి కైలాసగిరి కొండను చూచుచూ)

సాధారణముగా ధారణము దప్ప రణము దెలియని సూరి బరిలో దూకిన ఓడుటయే కాక నెత్తురోడును. ఇది తధ్యమని తలచి మాలిని వర్షుని వారించి నివారించ లేకున్ననూ  రోదించి నిరోధించుట తక్షణ కర్తవ్యమని, పోరు వలదని పోరుచూ,  కన్నీటి కంట వాటముగ కవాటముకడ నిలిచెను.  వర్షుని లో అధిపుడంతరించి వీరజవాను అవతరించెను

కల్పము సంభవించునని వికల్పము చెందుట వీరపత్నిచేయదగునా!  నీ సంక్రాందనా క్రందనలునను  నను నిలువరించజాలవు విజయము వరించకున్ననూ రణము  అనివార్యము, సూర రణసూరి కాకున్ననూ, అధిపుడు  అధిపురుషుడు కాకున్ననూ  పురుషుడని గ్రహించుము. అని తల్లిని తొలగించుకొని కదనరంగమునకు సాగిపోయెను

భారతవర్షం తారంగం పద తారంగం, భారతవర్షం చదగరంగం పద చదరంగం

సూచన : పదాలు వెంట వెంటనె రానక్కరలేదు.

6.ముక్తపదగ్రస్తము : ఒక పాదములోచివరి పదాన్ని తరువాతి పాదములో మొదటి పదముగా ఉపయోగించదాన్ని ముక్తపదగ్రసతము అని అంటారు. ముక్తపదగ్రస్తము అని అంటారు.

సాధారణ  ఉదా:     సుదతీ నూతన మదనా

మదనాగతురంగపూర్ణ  మణిమయ సదనా!

భారతవర్ష నుండి :  భువనైక సుందర మాంగళ్య తోరణం భారత వర్షం సర్వతీ పుత్రం

సర్వతీ పుత్రం బహుజన మిత్రం సర్వతీ పుత్రం బహుజన మిత్రం

అర్థాలంకారములు: అర్థము వలన కవితకు అందాన్ని ఇచ్చేవి. ఇవి వందకుపైగా ఉన్నాయి

భారతవర్ష నుండి ఒక చక్కటి చిక్కటి ప్రాస (ప్రాసాలంకారము)                               

1.వెచ్చగ వచ్చిన విచ్చని మొగ్గను

మెచ్చని కాంతలు, కాంతుడు కాంచిన

ఓర్చని భామల కొచ్చెను పొచ్చము

పైయెద మాటున నవ్విన, సవ్వడి చేసిన చాలును

2. వేడిలేని కాలాన  వాడిలేనివాడు 

ఓడి  నేడు  మధుర వాడ వీడ

వేదించు ప్రశ్నలు బాధించు మనసును

శోధించి జానును సాధించుకున్న

భారతవర్ష నుండి రగడ ప్రాస: (భక్తకనప్ప చిత్రం లో కిరాతర్జనీయం కూడా ఇదే ప్రాసలో వ్రాయబడినది)


భగభగ లాడే రేడే గడ బిడ గడ అడుగుల పడ 

జడి వడి వడి వడిగా సుడిలా కదిలెను తల్లే 

తడబడి జగడమాడు వాడటుబడి ఇటుబడి

కుడి ఎడమలగా ఆప జూడగా

సడి జూడక, మడ గడి  దాటెను రగడ మాడగ

రంకెలు వేయుచు అరినే పిలిచెను బరిలో దూకెను.

జల జల జల మని చమూచరులు ఆయుధీయులై దూకిరిగా

నిరాయుధయోధునిముట్టిరిగా ప్రాణములే మరి తీతురుగా

తత్తడి రయమున రేగి వర్షుడు పక్కటెముకలోజీరినంతనే

ఒక్కదెబ్బకే కుప్ప కూలెను పెంచలుడే నేలనంటెనూ!


అతడే అతడే వర్షుడురా  విలక్షణ అక్షర యోధుడురా!

కార్గిల్ పోరున అశువులు బాసిన వీర జవానుకి పుత్రుడురా

సాహిత్య ప్రియ ధీరుడురా వీరుడురా రణ సూరుడురా!

*గీతము లో కొంత భాగమే ఇవ్వబడినది

కొన్ని ముఖ్యమైన నిర్వచనములు :

ఉపమేయము     : వర్ణించదలచిన విషయము (దేని గురించి చెప్పదలుకున్నామో అది)

ఉపమానము    : పోల్చడానికి ఎంచుకున్న విషయము (దేనితో పోలుస్తున్నామో అది)

సమానధర్మము : ఉపమేయ, ఉపమానములో సమానముగా ఉన్న లక్షణము 

ఉపమావాచకము : ఉపమాన ఉపమేయమునకున్న పోలిక తెలుపుతూ అన్వయము  కుదిర్చే పదము

సాధారణముగా ఉపయోగించే కొన్ని అర్థాలంకారములు.

ఉపమాలంకారము : ఒక వస్తువును మరొక వస్తువుతో పోల్చి అందంగాచెప్పుట

దీనిలో సాధారణముగ ఉపమేయోపమానములు, సమానధర్మము, ఉపమావాచకము   నాలుగు  ఉంటాయి.

ఒక సాధారణ ఉదాహరణ  : ఆమె ముఖము చంద్రబింబము వలె అందముగా ఉన్నది.

భారతవర్ష నుండి : తూరుపు సిందూరపు వన్నెలతో ఉదయరాగము పాడుచుండెను. నగములు మేలిముసుగు

దాల్చిన ముత్తయిదువులవలె నిలిచి యున్నవి. అగములు (వృక్షములు) మంచు మాలలు ధరించిన వధూవరులవలె నగుపించుచున్నవి. తూరుపు ఎర్రబారుచూ సిగ్గిల్లిన నవవధువు వదనము వలె నున్నది.

సూచన: ‘లాగ', ‘వలె‘, ‘లాంటి', ‘వలెనె' పదాలు కనిపిస్తే అది సాధారణముగ ఉపమాలం కారము అవుతుంది.

రూపకాలంకారము : ఉపమేయమునకు, ఉపమానమునకు రెంటికిని భేదము ఉన్నా కూడ లేనట్లే చెప్పుటను రూపకాలంకారము అని అంటారు. అనగా,  ఉపపేయమునందు ఉపమాన రూపమును ఆరోపించుట.

ఉదా:      రాజు మూడవకన్ను లేని ఈశ్వరుడు.

పురుషా సమూహే సుందర రూపే చలతి వనే సంభూయే (అందమైన పురుషుల సమూహము)

భువనో త్తారే,   సుధా  సమూహే   దివ్య మనోహర జాతే(భూమిపైకి దిగిన విదుల్లతా సమూహము)

యశోద తప్తే , కవితా దీప్తే,   యశోధన ఘన వన మాలె. (కవితా తేజము,  మండుతున్న భాస్వరము)

ఉత్ప్రేక్షాలంకారము : ఉత్ప్రేక్ష అనగా ఊహ లేక భావన అని అర్థము. అర్థము. సమానధర్మాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానముగాఊహించిచెప్పటాన్ని ఉత్ప్రేక్షాలంకారము అని అంటారు.

భారతవర్ష నుండి  ఉదా:  మీనాక్షి  నవ్వు ముత్యాలు దొర్లినట్టు ఉంది.

నిగనిగ లాడు పసిమి దేహము, నవనవ లాడు పూరేకుల పెదవులు, దంతములు మిలమిల మెరియు ముత్యాల సరులు, గలగల పారు సెలయేరు నగవులు, మిరపపండు రవిక, కుంభస్తనద్వయము, చూచుకములును దాచలేని జాలువారు పారదర్శక రజత శ్వేత చేలము, చిత్తిని చిట్టిచేఁతలు మేని మెరుపులు చూడ నీలాకాశము నేల వాలినట్లున్నది. (ఎర్రని అక్షరములు ఉపమాలంకారం)

సూచన: ఇందులో సమానధర్మము ఉండదు.

దృష్టాంతాలంకారము :  రెండు వాక్యాల వేరు వేరు ధర్మాలను బింబప్రతిబింబభావముతో వర్ణించి చెబితే

(Two sentences presented as reflections of each other)

ఉదా:     ఉప్పుకప్పురంబుపద్యము  , యాతమేసి తోడినా ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు.  

భారతవర్ష నుండి:  పురుషా సమూహే సుందర రూపే చలతి వనే సంభూయే (అందమైన పురుషుల సమూహము)

భువనో త్తారే,   సుధా  సమూహే   దివ్య మనోహర జాతే(భూమిపైకి దిగిన విదుల్లతా సమూహము)

*యశోద తప్తే , కవితా దీప్తే,   యశోధన ఘన వన మాలె. (కవితా తేజము,  మండుతున్న భాస్వరము)

*కవి పండితుల ముఖములలో పాండిత్య తేజము, మండుతున్న భాస్వర తేజమే  కావున ఎర్ర అక్షరముల ఆఖరి పాదము దృష్టాంతాలంకారము.

భారతవర్షలో బసవడు అగస్త్యుడు మధురవాడ వెతుకులాటలో

కొండ కోనలను చీకటి అలిమినట్లు  నిస్పృహ  మనసునలుము కొన్నది.

భారతవర్ష నుండి అరుణతార కేశవునితో చెప్పిన కవిత

చిత్రములడగవు కథలు చిత్రముగా కదిలించు మనుషులను

రాగమాలికలై రంజన చేయును మనసులను మాలిమి

చేయును మూలికలై, ఏలికలై ఏలుచుండు భాషా పేదల

మనసుల  తేలుచుండును కథలై  కావ్యములై, తరతరముల

 మనుషుల కలుపుచుండు తరగని సిరులై నిలిచి యుండు

సినిమా నుంచి: అన్నానికి అరిటాకు - సున్నానికి తంబాకు - పుణ్యానికి స్వామిపాదం తాకు

అతిశయోక్తి అలంకారం : గోరింతలు కొండంతలుగా చేసి చెప్పడాన్ని అతిశయోక్తి అలంకారము అని అంటారు.

ఉదా:  కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.

భారతవర్షలో అలంకారాలు లెక్కకు మిక్కిలిగా అణువణువునానిండి యున్నవి. ఇది కావ్యము కాదు మహాకావ్యము  బహుళ అలంకార భూషిత కావ్య కన్య.   (ఇది అతిశయోక్తి అలంకారము) మరికొన్ని అతిశయోక్తి అలంకారాలు. 

విశాఖపట్నంలో ఉన్న కైలాసగిరి వర్ణన

కైలాసగిరి పై పరమేశ్వుడు పార్వతిని కూడి కొలువు తీరి చూచుచుండ ఆదిదంపతుల ప్రమోదమంద ఇనుడు చిరునగవులు చిందించుచుండె. నిహారస్నాన మాచరించిన ప్రకృతి  కాంత  లోకచక్షు పసిడి మయూఖ రేఖలందు తన అందముల నారబెట్టుకొని  నిగనిగలాడు మెరియుచున్నవి.

ఢిల్లీలో సాహిత్య అకాడమీ భవన  వర్ణన

శిల్ప నిర్మాణ  సౌష్టవమును కలిగి  సాహిత్య సంగీత కళా హారముల కాంతులీను యోష,   త్రివేణీ సంగమ ఘోషను ముహుర్భాషా శ్వాస లో నిలిపి భారత రాజధాని యందు సాహిత్య జ్ఞాన జిజ్ఞాసులకు  సోపానములవలె  జిగజిగ లాడు జియ్య వలె, సనాతని విశ్వరూపమువలె   వెలుగుచు భూరి నగరు యొకటి కోపర్నికస్ మార్గమందు కళాదేవళ ధ్వజ

స్తంభమువలె నిలిచియుండెను. లలిత్ కళ అకాడమీ, సాహిత్య కళ  అకాడమీ మరియు సంగీత నాటక్ అకాడమీ అను  మూడు జాతీయ అకాడమీల ను కలిగి యుండు Y- ఆకారపు భవనమదియె.

హైదరాబాదు మణికొండ వర్ణన

బహుళ అంతస్తుల నగరులుతో మాదాపురమును తలదన్నునట్లుండు మణికొండ కాశ్మీరు  కంబళి పై నుంచిన  గజ దంష్ట్ర నిర్మిత రత్నమ   కళాఖండ ము మనిన అతిశయోక్తి కాదు. మణికొండ నందు పది సంవత్సములు కు పైగా నిర్మించిన ద్వాదశ హార్మ్యముల  లాంకో హిల్స్  యను ఒక సుందర పట్టణము మణికొండ  శిరమున బంగారు  కిరీటము వలె నొప్పు చుండును.  నిశీధిని విద్యుత్ దీపకాంతులీనుచూ  ద్వాదశావతారము వలె అగుపించు. ద్వాద ఆకాశ హార్మ్యముల నడుమ  సిగ్నేచర్ టవర్స్ యను భూమండ లోత్తుంగ ధామము మహాపర్వతమును పోలి గగ నాంతర రాళము లోనికి  చొచ్చుకొనిపోయి  చూచువారి శ్రీ మహా విష్ణువు సాక్షాత్కరించినట్లగుపించును.

పదునాఱవ జాతీయ రహదారి వర్ణన  తేటగీతి పద్యంలో

తేదునారు వర్షము లనక  బెండ్లి జేయ   

   మిళ నాట వధువు  దారిచూ చువెడలె         

   ఆంధ్ర  గడప  దాటి  డిసాను ముద్దిడి 

   కొత్త   కోడలు చేరె లకత్త  పురికి

 

పదునారు సంవత్సరముల పిన్న వయసులో తండ్రి పెండ్లి జేయగా  చెన్నపట్టణము  నుండి బయలు దేరిన వధువు  మధ్యలో నున్న  ఆంధ్ర  ఒడిస్సాలను దాటి  కలకత్తా లో నున్న తన అత్తవారింటికి బోవుచున్నట్లు అగుపించునుఆంధ్ర దేశము తన గడప, గడపదాటి, ఒడిస్సాయను  ముద్దాడి  సుదూర ప్రయాణము జెసి తన అత్తవారింటికి చేరిన వదువువలె (పదునాఱవ జాతీయ రహదారికనిపించునుఅనగా  

 

"సొగసు చూడ  వలెనన్న కనులున్న  చాలదన్న 

కనులకు దొరకని అందము కవితకు దొరుకునన్న

కవితా హృదయ మున్న  తిన్న పెంపారునన్న     

అన్నన్న! అన్నుకు  పొన్ను కూరునన్న!     

 

 

చమత్కారం ; చమత్కారం కూడా అలంకారమే , దీన్ని ఆంగ్లమందు రిపార్టీ అందురు

కేశవుడు అనాధ,   మార్దంగికుడు అంటే మృదంగం వాయించుకునేవాడు. అతడు భాషా పండితుడు కూడా అతడు భారతవర్ష  అనే  పండితుడి ఇంట విశాఖలో ఉంటూ తన చెల్లి కొరకు  (తనను పెంచిన  తల్లి కూతురు)   తన స్వగ్రామం బల్లిపాడు వెళతాడు. తిరిగి విశాఖ పోడానికి బయలుదేరి చెల్లి పార్వతి తో కలిసి  బల్లిపాడులో నడుస్తుండగా 

కేశవుడు: జక్కనవల్ల  కైదల , క్షేత్రయ్య వల్ల  మొవ్వ , సిద్ధేంద్రయోగి వల్ల  కూచిపూడి , అన్నమయ్య వల్ల  తాళ్ళపాక, ఆదిభట్ల వల్ల  అజ్జాడ అటు చరిత్ర లో  ఇటు జన హృదయములలో  శాశ్వత కీర్తిని పొందలేదా? పల్లె ఒకనాటికి దివ్యకాంతులీనవలెను.

 అట్లు బోవుచున్న వారికొక యువకుడు ఎదురు వచ్చుచూ కేశవుని జూచి నవ్వి " మొన్న ఉత్సవ కార్యక్రమములో నీ మృదంగవాదమదిరెను కానీ ఎప్పుడూ డోలు మేడలో ఉండవలెనా ? ఏమిచేతువోయి నిత్యమీ డోలుతో ? యని వేళాకోళము జేసెను.

 పార్వతికరికాలి మంట నెత్తికెక్క " దొమ్మీ రేడా , నీవేల అంత  పెద్ద  చరవాణి చేతపుచ్చుకుని తిరుగుచున్నావు ?     అది నిత్యమీ నీ చేతనుండవెలనా ?"  యని అడిగెను.

"దిస్  స్ ఫర్ కమ్యూనికేషన్ విత్ ఫ్రెండ్స్ యు నో"  యనాంగ్లమున బింకముగా పల్కినాతడికి

కేశవుడు   దిస్  స్ ఫర్ కమ్యూనికేషన్ విత్ గాడ్ యు నో   యని  చెప్పెను.

అట్టి ఘాతమునూహించని బుడతడి తేజమడికి వత్తి కాలెను. (Fuse blown out)

శబ్ద ప్రాస : పాల్కురికి సోమనాధుడు వ్రాసిన అక్షరాంక పద్య ప్రాస                                    

టటకిట, టట్టకిట్ట, టటకిట్ట, టటట్ట,     టకిట్ట, టట్టకిట్ట, టకిట

టట్టకిట్ట, టకిటట్ట,  టటోన్ముఖ, టంకృతి స్ఫుటోత్కట, పటహాదినిస్వన,

 వియత్తల దిక్తటతాటితార్భటో ద్భటపటుతాండవాటన,

""కారనుతా! బసవేశ పాహిమాం!

సోమనాధుని  మించిన  ప్రాసతో  శబ్ద ప్రాసను శిఖరాగ్రము పై నిలిపిన  భారతవర్ష ఉత్కృష్ట శబ్ద ప్రాస 

రైలుగోదావరి వంతెన మీద పోవుచుండగా రైలు ధ్వని,లయరెండునూ మారినవి. కేశవుడు ధ్వనిని ఆలకించి

"షడగ్డ్ గ్ణడగ్డ్ షడగ్డ్  గ్ణడగ్డ్  డని ఈడ్చుచు,

గ్ణడగ్ణడగ్డ్ట్గగ్ణ గ్ణడగ్డ్  ట్గగ్ణగ్డ్ డని లాగుచు

 ట్గగ్ణగ్డ్ ట్గగ్ణగ్డ్ ట్గగ్ణగ్డ్ ట్గగ్ణగ్డ్ డను లోహానిస్వ

నమ్మున గిర గిర దిరుగు అరుగు చక్రముల్

 క్రిక్చ్కక్ క్రక్చ్కక్ యని పెక్కు స్ఫులింగముల్ 

 కక్కుచు షడట్గగ్ణ టడగ్డ్షడగ్డ్  అంచు లంఘించు

 రాక్షస క్రీంకార శక్తి స్వరూప పృషదంశ మిత్ర

షడగ్డ్ ట్గగ్ణగ్డ్ గ్ణడగ్డ్ షడగ్డ్  బోకారేశ్వర పాహిమాం"