Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Thursday, March 4, 2021

Bharatavarsha 138

తూరుపు కనుమలలో బాలభానుడు  ధవళ కాంతులు గుప్పించుచుం డెను. బడిపిల్లల బస్సులు కళాశాలలకు కార్యాలయములకుపోవువారి వాహనములు రహదారులపై పరుగులు తీయుచుండ, వాహనముల జోరు యంత్రఘూష హోరుతో నగరమంతయూ సందడి నెలకొనెను. 

మేడపైనుండి ఆ దృశ్యమును పార్వతికి చూపుచూ  “ఓ బల్లిపాడుబాలా మీ ఊరినందెన్నడైననూ ఇట్టి సుందర దృశ్య ము చూచితివా?” అని ఆమె భుజముపై చేయిడ, పార్వతి అతడి చేతిని భుజముపై నుండి తీసివేసి “ఉదక మండలమందు ముద్దు ముచ్చట్లన్నియూ చెల్లించిననూ దొరగారి ఆత్రమింకనూ తగ్గలేదే!  అని దూరముగా తొలగి

“ఆర్యా! మా బల్లిపాడునందు కనులు తెరచిన సస్యకేదారముల విమల శోభలు కనిపించుచుండును, కోవెల గంటలు వినిపించుచుండును, కనులు మూసిన, వేణుగోపాల స్వామి సుందరరూపము కనిపించుచుండును, వేల చందముల  వేణుస్వానంబు వినిపించుచుండును. ఇట్టి దృశ్యము చూచు అదృష్టము మాకింకనూ పట్టలేదు! అని పార్వతి అనగా  “బేలవనుకొంటిని జాణవేసుమీ!” అని బసవడు తన తెలివి తక్కువ తనమునకు సిగ్గు పడుచుండెను. 

పార్వతి  వాలిన బసవని చుబుకము క్రింద, చేతినుంచి “నాజాణ తానమంతయూ నీ పరము జేసి, నా కన్నెతనమును కూడా నీకు బహుమతిగా నొసగితిని కదా!” అని లాలన చేసెను.  బసవడు పార్వతి కళ్ళలోకి చూచుచూ “ఊటీ చలి రాత్రులన్నియూ నిప్పులకుంపటి జెసిన వొప్పులకుప్పకు నేనే బహుమతి ఇవ్వగలను?”

The scenery of Ooty


పార్వతి: నీవు ఇవ్వదలచినచో వీణ బల్లిపాడు పోయి వీణ తెచ్చుకొనుటకు అనుమతినిమ్ము 

బసవడు: వీణకొరకు బల్లిపాడు పొనేల.  నేడే నీకొక వీణ ను కొనిచ్చెదనే,  ఓ వీణా నెఱజాణ. 

 పార్వతి: సౌభాగ్యమన్న ఇదియే కదా!” ప్రేమతో ఆదరించు అత్తమామలు,  అరచేతిలో నడిపించు అన్న ఉన్న  నేనెంత అదృష్టవంతురాలిని! అని పార్వతి అనుచుండగా బసవడి

ముఖము చిన్నబోయెను “ఒహో అయినచో నీ సౌభాగ్యమందు నేను లేనా!” వ్యాకుల చిత్తుడు డాయెను. అప్పుడు పార్వతి “ఓ వెర్రి స్వామీ నీవే నా అసలు సౌభాగ్యము. కానీ ఈ సౌభాగ్యమునకు కారణమైన వారిని ముందు తలవ వలెను కదా! నాడు నీకు కవిత వ్రాసిచ్చినంత సులభముగాపెళ్ళి కానుకగా మా అన్న యాబది లక్షలకుచెక్కు వ్రాసి ఇచ్చెను. మా  అన్న వర్షుడు అంగీకారము సహకారము తోనే నీవు నా చేయి అందుకొంటివి. అనుచుండగా” నాన్నా ఎంత పని చేసితివి నాకు తెలియకుండా కట్నము స్వీకరించితివికదా” అని బసవడు నిర్వేదము పొందుచుండగా,  పార్వతి “ మావగారి మనసు అర్థముచేసుకొని వర్షుడే డబ్బిచ్చినాడు. ఈ విషయము ఇకపై చర్చించరాదు అట్లు మాట ఇవ్వవలెను.” అని పార్వతి ప్రాధేయ పడుచుండగా “నేనెంత అద్రుష్టవంతుడినో కదా! అట్లే మాట ఇచ్చెను. బసవడు మాట ఇచ్చిన పిదప పార్వతి” ఆడిన మాట తప్పవుకదూ అని బెదురు కళ్ళ జింక వలె బసవడి కళ్ళలోకి చూచుచుండగా బసడి కళ్ళలో కనీరు నిండినది. ఆ కన్నీటి పొరలనుండి అస్పష్టముగా ఇంటి గేటు వద్ద ఒక జంట కనిపించెను. సుందరి అగస్త్యులు వచ్చినారు అనుచూ పార్వతి గేటు తీయుటకువడి వడిగా మేడ దిగెను. బసవడు కూడా క్రిందకు దిగి “అత్యంత ఖరీదైన కారు గల ఆసామి ద్విచక్రికపై తిరుగుటయా అని ఆశ్చర్యపడుచుండగా సుందరి నవ్వుచూ “భర్తతో ఇట్లు తిరుగుట ఒక అద్రుష్టమ”నెను. బసవడు “ఓహ్ అర్ధమైనది ద్విచక్రిక  పై భర్తనల్లుకొని కూర్చొన్నచో వలపు రాపిడే కదా!”

                                                                           ***

పులిహోర, పాలతాలికలు  తెచ్చి బుచ్చమ్మగారు  సుందరి అగస్త్య , బసవ పార్వతి లకు అందించగా చందన గ్లాసులతో మంచినీరు అందించుచూ “సందీపు అన్న వచ్చినాడు” అని గట్టిగా అరిచెను.  అప్పుడే గేటు తీసుకొని వచ్చుచున్న సందీపునివైపు చూచి బుచ్చమ్మగారు పలహారము తెచ్చుటకు వంటగదిలోకి వెళ్ళినారు. “ఇప్పుడేనా వచ్చుచున్నావు” అని సందీపుని  బసవడు ఆహ్వానించెను. విమానము దిగి నేరుగా ఇచ్చటికే వచ్చుచు చున్నాను అని సందీపుడు వచ్చి వారి మధ్య కూర్చొనెను. 

బసవ ఎట్లు గడిచినదిరా నీ శృంగారయాత్ర.? ఉదకమండలమంతయూతెగలబడిపోయినదా! అని సందీపుడు అడుగగా,  అగస్త్యుడు  “మేము వచ్చుసరికి చక్రవాకము  వలె మేడపై విహరించుచున్నారు. బసవడు రసికుడే సుమీ” అనెను.

సుందరి పార్వతి ప్రక్కన కూర్చొని  “పార్వతికి ఊటీ విహారము చాలకున్నది. అగస్త్యునితో అని “నీకు కొత్త మిల మిలలు అబ్బినవి, అంతా ఊటీ మహిమే  సందేహము లేదు." అని సుందరి పార్వతిని మెచ్చుకొనెను.

బుచ్చెమ్మరగారు పలహారములు పట్టుకువచ్చి సందీపునికి ఇచ్చి, సుందరితో “సుందరీ ! వైవాహిక ఆనందము నీ కనులలో తొణికిసలాడుచున్నది, మీరందరూ జంటలుగా ఉండగా పాపము సందీపుడే వంటరి వాడయ్యెను.” అని అనగా సందీపుడు “మీరు పాపము తలుచుచున్నారు కానీ మంజూష కుండవలెనుకదా!” అని అనగా బుచ్చమ్మగారి మనసు పిండినటయ్యి “పిల్లలని పెంచు రీతి ఇదా? చూడవయ్యా ఆ మాలిని పిల్లను ఎట్లు పెంచినదో. దానికి తగిన బుద్ధి చెప్పక ఇట్లు దిగులు పడినచో ఏమిలాభము?” బసవడు “అమ్మా అట్లు మట్లాడవలదు  నీకునూ ఒక ఆడపిల్ల కలదు. అని తల్లిని తగ్గమనెను.  పార్వతి " ముందు ఆ దామినిని అనవలెను ముంజూషను ఇంకనూ అతిగారాభము చేయుచున్నది. సందీపుడు తినుట ముగించి “ఎవ్వరినీ అనవలసిన పనిలేదు వర్షుడు నా చేతులు పట్టుకొని నా చెల్లిపై దయచూపుము అని అన్నమాటలను నేనెట్లు మరువగలను. దానికి మొగుడు పై లేకున్ననూ నాకుస్నేహితునిపై ప్రేమాభిమానములు ఉన్నవి. పలహారములు ముగిసినవి.

సందీపుడు “అత్యవసర పరిస్థితి ఉన్నది రావలెనని కోరగా ఉన్నపళముగా బయలదేరి వచ్చితిని, ఏమిజరిగెను?” అని అగస్త్యునడిగెను. బసవడు కూడా అదే ప్రశ్న అడిగెను. మనము బయటకు పొయి మాట్లాడుకొందుమనుచూ అగస్త్యుడు బసవడు సందీపునితో గేటు బయటకు పోయెను 

అగస్త్యుడు “మీ ఇద్దరి సహాయము తప్పనిసరిగా కావలెను. వకీలు వద్దకు పోయి షూరిటీ సంతకములు చేయవలెను.”  చెప్పగా సుందరి “మావగారికి హై కొర్టు లో రెండు లక్షల పూచి కత్తు పై బైల్ మంజూరు అనయినది. ఇద్దరు పూచీదార్లు అంతే మొత్తము  చెల్లించి షూరిటి సంతకములు చేయవలెను." అని చెప్పగా అగస్త్యుడు "డబ్బుమీరు కట్టవలసిన పనిలేదు సంతకము పెట్టిన చాలును." అని వారిద్దరిని చెంతనే ఉన్న లాసంస్ బే కాలనీలో ఉన్న వకీలు వద్దకు తీసుకుపొయెను.  అడ్వకేట్ రాజ్ కుమార్ గారు  అగస్త్యునితో “డబ్బు తెచ్చినారా, ఈ రొజు కొర్టులో చెల్లించవలెను.” అగస్త్యుడు” నాలుగు లక్షలు సిద్ధము గానున్నది.”   అడ్వకేట్” బైలు నిబందనలు గుర్తు ఉన్నవి కదా, మీ నాన్న గారి పాస్పోర్ట్ కోర్ట్ కి సబ్మిట్ చేయవలెను ప్రతి శనివారము పోలీస్ స్టేషన్ కి పొయి సంతకము పెట్టవ లెను. కోర్టు అనుమతి లేనిదే దేశము విడిచి పోరాదు.” 

అగస్త్యుడు సుందరి అన్నిటికీ అట్లే అని తలవూపిగా బసవడు సందీపుడు సంతకములు చేసినారు. అగస్త్యుడు వకీ లుతో వ్యక్తిగతముగా మట్లాడవలెనని అనగా సందీపుడు పార్వతి బసవడు బయట వేచి యుండిరి. బసవడు సందీపుడు మాటలలో మునిగి యుండిననూ పార్వతికి ఎందుకో సందేహము కలిగి తలుపు వద్దకు పోయి వినసాగెను. అగస్త్యుడు చెప్పు మాటలు వినుచున్న ఆమెకు హృదయమందు అగ్గి రాజుకొనెను. బసవడు మంజుషను కలుసుటకు ఇష్టపడక బెంగళూరు వెడలి పోయెను. పార్వతి ద్విచక్రికపై పోవుచున్న అగస్త్యుని సుందరిని అనుసరించెను. ద్విచక్రిక ద్వారకానగర్ మంచుకొండ నగల దుకాణము ముందు నిలిపి సుందరి అగస్త్యుడు లొపలికి పోయినారు. సుందరి బైటకు వచ్చిన పిదప  బసవడు పార్వతి దుకాణములొనికి పోయి వర్తకులను అడగగా “ఆ దంపతులు గత కొద్దికాలముగావారి నగలను ఒక్కటిగా ఇచ్చట అమ్ముచున్నారు, నేడు మంగళ సూత్రము తో సమేతముగా ఉన్ననగల న్నీ అమ్మి లక్ష రూపాయలు తీసుకెళ్ళినారు.” అని చెప్పినారు. 

                                                                          ***

రాత్రి పది గంటలు: కబ్బన్ రహదారి మీదుగా ఇన్నోవా ఇందిరానగర్ కేసి సాగుచున్నది మీనాక్షి నిద్రకు జోగుతూ యమున పై వాలి చటుక్కున కళ్ళుతెరచి సర్దుకుని కూర్చొని అంతలోనే మరల ఆమెపైవాలి నిద్రించుచుండెను. బెంగుళూరు ప్రెస్స్ క్లబ్లో ముఖ్యమంత్రి చేతిమీదుగా మీనాక్షికి జరిగిన సన్మానము యమున మదిలొ చిత్రమువలే తిరుగుచుండెను.  ఇన్నోవా  చెనుస్వామి క్రీడాప్రాంగణము  దాటుచున్నది. మీనాక్షి కళ్ళు తెరచి “విమానము వాలి నదా!” అని మత్తుగా అడిగెను. యమున తలపై చేయి వేసుకొని “తమిళ్ చిత్ర నిర్మాతల మండలి నిన్న చెన్నై లో చేసిన సన్మానము, మొన్న ముంబై లో రికార్దింగ్ ఇట్లు విమానములలో, కార్లలో  తిరుగుచూ ఎచ్చటున్నదో తల్లి. ఇన్నోవా ఇల్లు చేరెను. యమున మీనాక్షిని పక్కపైకి చేర్చెను. మీనాక్షి నిద్రలోకి జారుకొనెను.  

దూరవాణి మ్రోగుచుండెను యమున సాధనమునందుకొనెను.  బుచ్చమ్మగారి స్వరము. యమున ఆమెతో “అమ్మా మీనాక్షి లేదా?”  "ఇప్పుడే సన్మాన కార్యక్రమము నుండి ఇంటికి  చేరి నిద్రించుచుండెను." 

చాలా కాలము నుండి అగస్త్యుని అనుసరించి బసవడు చాలా విషయములను తెలుసుకొనెను కానీ మా బసవడు చెప్పుటకు సందేహించుచున్నాడు. ఇంత రాత్రి చేసినందుకు ఏమీ అనుకొనరాదు. అగస్త్యుని ఆర్ధిక పరిస్తితి దయనీయముగాను న్నది. ఆత్మాభిమానముతో ఆదంపతులు వారి కష్టములను ఎవ్వరికీ తెలపక డబ్బు సాయము చేయగా తీసుకొనక ఇబ్బందులు పడుచున్ననూ నవ్వుతూ గడుపుచున్నారు.  భర్తకు అనుకూలవతియగు ఆ సుందరి అతిడికి చేదొడువాదోడుగా ఉన్నది. కానీ ఆమె గర్భవతి. యమున మనసు స్తంబించెను.

7 comments:

 1. తండ్రిని కాపాడుకొనే ప్రయత్నం ఒక వైపు, ఆర్థిక దుస్థితి ఒకవైపు,. ఏమీ అగస్త్యుని కష్టములు.వివాహములు జరిగిన తర్వాత ఒక్కో జంట కధ ఒక్కోలా ఉంది.

  ReplyDelete
 2. ప్రేమకు కష్టాలే గీటురాయి కష్టాలు వచ్చినప్పుడు నిలబడితేనే ప్రేమకి విలువ. ప్రేమ, మానవ సంబంధాలు, పరివర్తన ఇవి లేనప్పుడు కథకైనా జీవితానికైనా విలువేముంటుంది?

  ReplyDelete
 3. ఒకప్పుడు అగస్త్య డబ్బుని మంచినీళ్ళలా ఖర్చు చేసాడు. ఇప్పుడు కష్టాలు అనుభవిస్తున్నాడు. కలకాల ఉండవులే కష్టాలు. నచ్చిన మనిషితో కష్టాలైన శృంగారమైనా.స్నెహితులముందు చేయి చాచని ఆత్మాభిమానం సొంత తల్లినైనా తండ్రికోసం కనుక అడగకూడదనే ఇంగితం, అదేవ్యక్తిత్వం.అదే పరివర్తన ఒప్పుకుంటారా? సుందరిలో పార్వతి లో శృంగారం, పరిపక్వత కనిపించాయా? వర్షుడు మొత్తమ్ డబ్బు ఖర్చు పెట్టేసి సోదరి ప్రేమ సుగంధాన్ని పూసుకొని ఎలా కనిపిస్తున్నాడు? లకుమలో, సందీపుడి లో, ఏమి చూసారు? ఆనందాన్ని పంచుతున్నదా రచన?రెండు టీ వీ చానల్స్ భారతవర్ష నచ్చి (భాష నచ్చి , ఎవ్వరికీ కథ పూర్తిగా తెలియదు) అవకాశము ఇచ్చాయి.అవన్నీ ముఖ్యంకాదు , కథ మొత్తమ్ చదివిన వారు సాహిత్య ప్రియులు మీరుమీ మాట నమీద నాకు గురి , మీకు కథ నచ్చిందా?

  ReplyDelete
 4. లకుమలో, అగస్త్యలో వచ్చిన పరివర్తన కించిత్ ఆశ్చర్యానికి గురి చేసింది.సుందరి మొదటి నుండీ బాధ్యతగా ఉంది.ఇప్పుడు భర్త కష్ట సుఖాలను పంచుకుంటూ మరింత బాధ్యతగా ప్రవర్తిస్తుంది.వివాహములు జరిగిన తర్వాత ఈ అమ్మాయిలంతా అప్పటి అల్లరి అమ్మాయిలేనా అనిపిస్తున్నారు.ఒకప్పుడు నందిని చెప్పినందుకు మంజూషను ప్రేమించాడు సందీపుడు.ఇప్పుడు వర్షునికిచ్చిన మాట కోసం ఆమె పెంకితనాన్ని భరిస్తున్నాడు.వర్షుని గురించి వ్రాయుటకు మాటలు రావట్లేదు.ఇతరుల ఆనందంలో తన సంతోషాన్ని వెతుక్కుంటున్నాడు.భారత వర్ష చదవటం వల్ల నాలో వచ్చిన పరివర్తన -సౌమ్యత, ప్రశాంతత, ఏదో తెలియని భరోసా

  ReplyDelete
 5. Your words (నాలో వచ్చిన పరివర్తన -సౌమ్యత, ప్రశాంతత, ఏదో తెలియని భరోసా)-shine like truth in my heart forever. This is the objective of this profound work. I used exactly the same words several times and asked my friends Bharat and Hemanth to read this novel they could not understand.I thank you with all my heart. I want to admit the fact that I derived great satisfaction of writing this voluminous book of prose and poetry but I have derived greater satisfaction by reading your feedbacks.

  ReplyDelete
 6. Refreshing to read the pure telugu languge. Nice work sir

  ReplyDelete
 7. Started out in 2012, Data Science Central is one of the industry’s leading and fastest growing Internet
  community for data practitioners. Whether it is data science or machine learning or deep learning or
  big data, Data Science Central is a one-stop shop that covers a wide range of data science topics that
  includes technology, tools, data visualisation, code, and job opportunities. Also, many industry experts
  contribute to the community forum for discussion or questions.

  DATASCIENCETraining in OMR Chennai

  ReplyDelete