Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Wednesday, March 17, 2021

శృంగార పద్యాలు

 కావ్య శైలిని ప్రతిబింబించు వంద పుటలను ముద్రించి ఒక ఫైలు నందుంచి , నిన్న రేడియో కేంద్రమునకు పోయి అచ్చట కొంతమంది ప్రముఖులను కలసినాను. సాహితీవేత్తలు, భాషాకోవిదులు సాహిత్యా భిమానులు,  భారతవర్షను చదివి  మెచ్చి  ఇచ్చిన అభినందనలు గురించి కొంచెం చెప్పవలెను.

పఠనాభిలాష మెండుగా యున్న  భాషావేత్త కోటేశ్వరరావు గారు (పీ వీ నరసింహారావు గారి సన్నిహితులు)  " అనేక  గ్రంధాలను చదివిన ఈయన వేయిపడగలు కూడ చదివినారు. భారతవర్ష లో గద్యపద్య సౌందర్యము  చూసి  ఇట్టి భాషా సౌందర్యము  వేయిపడగలలో కానరాదని చెప్పుచూ, స్త్రీల వర్ణన అద్భుతంగా యున్నది. శ్రీనాథుడు స్త్రీలను ఇట్లే వర్ణించునుమీ భాష, గద్య పద్య  శైలి శ్రీనాథుడి తలపింప తలపింపజేయుచున్నవి" అన్నారు.  

కొంతమందిరసజ్ఞులు శోభనగృహపద్యాలను కాపీతీయించుకున్నారు. ఆ శోభన గృహ పద్యాలు  మీకోసం.  

"ముందు లకుమ గదిలోకి చూచితిని లకుమ వివేకులు అలసి ఒకే ఆకుపై విశ్రాంతి నొందుచున్న సీతాకోకచిలుకలవలె యున్నారని వర్ణించుచూ ..

 అరుణీకృత కుచగండ మండలావృత అకీర్ణ కేశ కలాపి జాల మున్

 ప్రపత  పటవాసమున్ సయనాస్త్రాణ న్యాస్త ముక్త   భూషణాదులన్

 ప్రోస్థిత తిలకమున్  గంబూర శుక్ర గన్ధావర్తన  సయనావాసమున్

 చూచితి శ్రాంత  చిత్రపతంగికల భంగిమల్ ద్వారద్రక పరివేక్షణన్. 

అరుణీకృత = ఎర్రబారిన (ముద్దులాడుటవలన కావచ్చు); కుచగండ మండలావృత  = స్తనములు  బుగ్గల నావరించిన; అకీర్ణ కేశ కలాపి జాల మున్ = చెల్లాచెదురు గా పడిన కేశములు; ప్రపత  పటవాసమున్ = జారిన లంగా ; సయనాస్త్రాణ న్యాస్త  = పక్క దుప్పటి పై పడియున్న ; ముక్త   భూషణాదులన్ = సడలిన ఆభరణములు; ప్రోస్థిత తిలకమున్  = చెదిరిన తిలకము; గంబూర శుక్ర గన్ధావర్తన  సయనావాసమున్ = శుక్ర  కర్పూర మిళిత గంధమలిమిన శయన గృహము; చూచితి శ్రాంత  చిత్రపతంగికల భంగిమల్ ద్వారద్రక పరివేక్షణన్ = అలసిన ఆకుపై వాలిన రెండు సీతాకోక చిలుకలు చూచితిని. 

తరువాత  అగస్త్యుని గదిలోకి చూడగా మైధున మందు చెలరేగుచున్న జంటను గాంచి 

 భ్రంశిత సిత చేలము న్ విగలిత పరిచేలమున్

 చలిత కుచ కుంభ నితంబ విలోలమున్

 మదన కుతూహల తురగ  విహారమున్

 అభంగ శృంగారాంబర నిరంబర సంసర్గమున్ 

భ్రంశిత సిత చేలమున్ = కదలిన తెల్లని చీర ; విగలిత పరిచేలమున్ = జారిన పైట ; చలిత కుచ కుంభ = కదులుఘన స్తనములు ;  నితంబ విలోలమున్ =ఊగు పిరుదులు; మదన కుతూహల = కాంక్ష తో;   తురగ  విహారమున్ =గుర్రపు స్వారీ; (వలె నగుపించెను)  శృంగారాంబర = శృంగారాకాశ మందు; నిరంబర =నగ్న; అభంగ సంసర్గమున్= అడ్డులేని సంయోగము.  ఇంతకన్నా భంగిమలు  విడమరచి చెప్పుట భావ్యము కాదు, ఊహఉన్నచో ఊహకందును.  ఇటువంటి పద్యములు ఆరు వ్రాసిననూ రెండే చూపి ఆక్షేపింతు రని నాలుగు దాచేసినాను.   

ఈ శృంగార పద్యాలను ముఖపుస్తకమందుంచగా ఒక భాషాభిమాని రసజ్ఞఁడు ఇలాస్పందించారు


కృష్ణ జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ వెంకటశ్రీనివాస్ గారు  భారతవర్షలో  సంస్కృత గీతము లను మెచ్చుకొని  " మీ సాహిత్యం మీరు పాడిన విధానం  చూసి మిమ్మల్ని సంగీత సాహిత్య సమలం కృతుడు అనకుండా ఉండలేకపోతున్నాను " అని చెప్పడమే కాక యూట్యూబ్ లో భారతవర్షం అనే పాటకు ఇవే మాటలను తమ స్పందనగా తెలియజేసారు. 

డాక్టర్ త్యాగరాజ శాస్త్రి సోమయాజుల గారు నేను వ్రాసిన ఆటవెలది పద్యమును మెచ్చుకొన్న తీరును మీరు చూడవచ్చు. గొప్ప  పండితుల మెప్పు పొందిన హృదయానందము సహజము కదా!

రేడియో కేంద్రం వారు భారతవర్షను ఏమిచేయ నిశ్చయించారో ఇప్పుడే చెప్పినచో  ఉత్సుకత తగ్గును, కావున కొలది దినములు వేచి యుండవలెను. భారతవర్ష రానున్న  కాలములో ఇంకనూ పెను సంచలనమగునని చెప్పుటకు ఎంత మాత్రమూ సందేహములేదు. 


5 comments:

  1. మీ రచనా శైలి శ్రీనాధుని రచనా శైలిని‌ పోలి ఉన్నదని నేను ముందే చెప్పితిని.మీరు మరచితిరి.

    ReplyDelete
  2. మీ కథలో ముఖ్య పాత్ర కావటం మా అదృష్టం. నాకే పారితోషికం అక్కర్లేదు.నేను సమాచారం ఇచ్చెదను.

    ReplyDelete
  3. Yes you said it already. Thanks.

    ReplyDelete
  4. I have not forgotten but forgot to mention here that you had already said.

    ReplyDelete
  5. Absolutely wonderful romantic poetry. can you please share these poems with with meanings to me . kb.nagaraju@gmail.com

    ReplyDelete