Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Sunday, March 28, 2021

వాల్మీకి రామాయణంలో ఏముందో తెలుసా ?

 నిజం తెలుసుకోడం ఎంతో కష్టం. నిజం మాట్లాడడం అంతకంటే కష్టం.   నిజం తెలుసుకోడానికి చాలా శ్రమ పడాలి.  నిజం మాట్లాడడానికి దమ్ముండాలి.  పక్కవాడిని ద్రుష్టి లో పెట్టుకుని ఆలొచించే వాళ్ళే ,  రిస్క్ ఎందుకు అని నోరెత్తని వాళ్ళే   ఎక్కువగా కనిపిస్తారు. కానీ అది సత్వం అనుకుంటారు .  బానిసత్వం అని తెలుసుకోరు. 

మనకి అబద్దాలే ఎక్కువ ప్రచారంలో ఉంటాయి.  చాలా కష్టపడి మనం నిజం తెలుసుకున్నా , ఆ నిజాన్ని ప్రజలు అంగీకరించలేరు.  ఉదాహరణకి  వాల్మీకి రామాయణం పెద్ద గందరగోళం. సంస్కృతం లో ఉంది కాబట్టి ,  చాలా పెద్దది కాబట్టి  చదవడం కష్టం. ( నేను సంస్కృత వాల్మీకి రామాయణం చదువుతున్నాను)

 ఒకవేళ ఏతా వాతా  చదివేవనుకో  నిజం చెప్పగలవా ? వాల్మీకి గొప్ప కవి అని అంతా  అనుకున్నాక,   రాజుగారి దివ్య వస్త్రాలు కథలో చిన్నపిల్లాడు నాకు బట్టలు కనిపించడం లేదు అని చెప్పినట్టు వాల్మీకి లో నాకు గొప్ప కవి కనిపించడం లేదు అనగలవా ?

 నువ్వు అంటే మాత్రం పక్కన ఉన్నవాళ్లు ఒప్పుకుంటారా ? నిజాన్ని సహిస్తారా? ఆ సహృదయత వారికి ఉంటుందా ?  వారికి ఉందో  లేదో పక్కన పెట్టి,  నీకు సహృదయత ఉంటే నే ఈ ఆర్టికల్  చదువు.  లెకపొతే ఇక్కడే ఆపేయ్.

వాల్మీకి రామాయణం పెద్ద గందరగోళం. నాకు నచ్చలేదు.  కారణం చాలా విషయాలు  అర్ధవంతంగా వ్రాయలేదు. 


లక్ష్మణుడు సూర్పణక ముక్కుచెవులు కోయడం మీకు పెద్ద తప్పు గా అనిపించకపోవచ్చు. అడవికి వెళ్ళమన్న తల్లి అభిప్రాయాన్ని అంగీకరించేముందు భార్య అభిప్రాయాన్ని రాముడు కనుక్కోలేదు. అవసరం లేదేమో. చాకలి అంత  విలువఇచ్చిన రాముడు భార్య అభిప్రాయానికి   కూడా విలువ ఇస్తే బాగుండేది.  సరే  భార్య చచ్చినట్టు భర్త ని  అనుసరించాలని అనుకుందాము, మరి లక్ష్మణు ఎందుకు అంత అతిభక్తి చూపాలి ? సరే చూపాడు , మరి ఊర్మిళ ఎందుకు సీతలా భర్తని అనుసరించలేదు ? 

అగ్నిలో కాలక పోవడానికి శీలానికి సంభందం ?  చాలామందికి అర్ధం కాదు. సీత అగ్ని ప్రవేశం చేసేముందు ఏమందో తెలుసా ? అంతా  అయ్యిన  తర్వాత అడవికి పంపాల్సిన అవసరం లేదే మో ?  పంపేముందు భరణం ఇవ్వాలికదా, వాల్మీకి ఆశ్రమంలో ఉన్నందుకు  ఆయనకీ ఏమీ ఇవ్వలేదు. ఆయన పాలనలో  ఒక రాణి పరిస్థితి ఇంకొకలా పంచన చేరి రాముడికి ధర్మ సూక్షమమ్ తెలుసుకదా ఏవన్నా వాల్మీకికి ఇచ్చి ఉండాల్సింది.  

కొన్ని విషయాలు చిరాకు తెప్పిస్తాయి  ఉదా రావణుడు కౌసల్యని అపహరించడం. దశరథుడి పెళ్లి శాంత ఋష్య శృంగుని మోహపరచడం వంటివి చూస్తే విలువలు మీద మాట్లాడలేము. రంభని రేప్ చేయడం, రంభ శాపం వల్ల  రావణుడు సీతని తాకకపోవడంమనకి తెలుసు. కుబేరుడు కూడా రావణుడికి శాపం పెట్టీసినప్పుడు సీత ఎందుకు పెట్టలేదు? నన్ను కిడ్నప్ చేస్తే నీ తల వ్రక్కలుగును గాకా! అని రాముడు తాకడంతో నీటిలో రాళ్ళు తేలి వారధి కట్టారు. అంటే రాముడు మహిమ ఉపయోగించాడు కదా మరి అదే మహిమ ఉపయోగించి సముద్రంపై నడిచి వెళ్ళొచ్చుకదా!

ఆపై దానిని వక్రీకరించడాలు,  స్వేచ్ఛానువాదాలు,  చొప్పించడాలు తో రామాయణంలో ఏది నిజం ఏది అబద్దం అనేది చెప్పడం చాలా కష్టం . ఇవన్నీ ఒకెత్తైతే సినిమాపైత్యం మరొక ఎత్తు. రామాయణం లో సినిమాపైత్యం ఎంతుందో తెలిస్తే ఆశ్చర్య పోతారు. 

3 comments:

  1. మీలాంటి వారు ఏ విషయాన్ని అయినా కూలంకషంగా పరిశీలిస్తారు.పరిశోధిస్తారు.కాబట్టి నిజాన్ని గ్రహిస్తారు.కానీ సామాన్య వ్యక్తులు పెద్దలు చెప్పారు.మనం అనుసరించాలి అంటారు.వారికి వారుగా దేన్నీ తెలుసుకోవటానికి ప్రయత్నించరు.నిజానికి పురాణాలకు సంబంధించి నాకు చాలా సందేహాలు ఉన్నాయి.సీతాదేవి పరపురుషున్ని కన్నెత్తి చూడలేదు ఆమె పతివ్రత అని రామాయణంలో చూపించారు. ఐదుగురు భర్తలు ఉన్న ద్రౌపది కూడా పతివ్రతే అని భారతంలో చెప్పారు. పాతివ్రత్యం విషయంలో సీత గొప్పదో, ద్రౌపది గొప్పదో అర్థం కాదు.అసలు పాతివ్రత్యం అంటే ఏంటో అర్థం కాదు. రామాయణం, మహాభారతం అనేవి చరిత్రలో, కల్పిత కథలో అర్థం కావు.(ఇవన్నీ చిన్నప్పటి నుంచి నా మనస్సులో ఉన్న సందేహాలు).ఏది ఎమైనా మీ గ్రహణ శక్తి మీద ఉన్న నమ్మకంతో నేను నిజాన్ని ఒప్పుకుంటాను. కానీ ఇతరులు దీన్ని వివాదాస్పదం చేస్తారు.

    ReplyDelete
  2. Valmaki has made it enough controversial. If we play with literature it plays with our lives. If we misuse words we are misusing ourselves. It is very hard to understand the concept unless discussed in depth. A day will come to discuss such delicate things in person.

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete