సినిమాలు ఏం చూసారు ?
నేను పుస్తకాలు చదువుతున్నానండి సినిమా వినోదం కంటే నాకు చదవడం ఇష్టం .
జగన్ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నాడు. జగన్ మీద మంచి పోస్ట్ పెట్టాను చూసారా ?
చంద్రబాబు అయినా జగన్ అయినా అవినీతి లో కూరుకుపోయినవారే కదా
ఒక మిత్రుడుతో సంభాషణ ఇలాసాగుతోంది.
ఉచితాలు , రిజర్వేషన్లు అనుభవిస్తూ నీతి కోసం పోరాడుతున్నారు. సినిమాలు వంట పట్టించుకుని సంస్కృతి సంప్రదాయాలు కోసం , విలువల కోసం బాగా మాట్లాడుతున్నారు. ఇంతకీ పుస్తకాలు ఏమైనా చదువుతున్నారా లేకా సినిమాలు చూసే మాట్లాడేస్తున్నారా ? బాగా చదివి ఆలోచించి మాట్లాడుతున్నారా ? ఎవడో చెప్పినది విని రెచ్చిపోతున్నారా ? నిజాయతీగా మాట్లాడుతున్నారా నలుగురితో చేరి కావ్ కావ్ అంటున్నారా ?
పుస్తకాలు చదవడం ఎందుకు గూగుల్ ఉందిగా ఏంకావాలిసినా అప్పటికప్పుడు చెప్పేస్తుంది అన్నాడు
కానీ గూగుల్ తప్పులు ఇస్తుంది కదా అన్నాను , "నో ఛాన్స్ , గూగుల్ అమ్మ చెప్పినది వేదం." అన్నాడు
రామాయణంలో సీతని రావణుడు అపహరించినప్పుడు సీతని ఎలా తీసుకెళ్లాడో తెలుసా?
భూమితో సహా పెకలించి సీతను రావణుడు తీసుకెళ్లాడు. " మీకెలాతెలుసు ?" అన్నాను .
సినిమాలో అలాగే చూబించారు. చాలాచోట్ల విన్నాను అందరూ అలాగే చెపుతున్నారు
వాల్మీకి వ్రాసిన సంస్కృత రామాయణం నిఘంటువు సాయంతో చదవగలుగుతున్నాను , ఆలోచించ గలుగుతున్నాను
1. वामेन सीतां पद्माक्षीं मूर्धजेषु करेण सः।।3.49.17।।
ऊर्वोस्तु दक्षिणेनैव परिजग्राह पाणिना।
सः that Ravana, पद्माक्षीम् lotuseyed, सीताम् Sita, वामेन करेण with his left
hand, मूर्धजेषु holding her hair, दक्षिणेन पाणिना with right hand, ऊर्वोः under her thighs, प्रतिजग्राह held her.
అంటే ఎడమ చేతితో సీత జుత్తు పట్టుకుని , కుడిచేతిని తొడల క్రింద వేసి తన రథంలో పెట్టి తీసుకెళ్లాడు
సీతని రావణుడు తాకలేదు, లక్ష్మణ రేఖ దాటి రాలేక పోయాడు. ముట్టుకుంటే మాడిపోతాడు ఆవిడ మహా శక్తి. అన్నాడు. ఆవిషయం వాల్మీకికి తెలియక అమాయకంగా (నిజాయతీగా) వ్రాసేసాడు. అతడిని క్షమించు అన్నాను.
"లక్ష్మణ రేఖలు అనేవి ఉన్నాయా ?" ఎందుకు లేవు సినిమాల్లో చూసాం కదా అని నాలిక కరుచు కున్నాడు. లక్ష్మణుడు మూడు మంచి మాటలు చెప్పాడు గీతాలు ఏమీ గీయలేదు . సినిమాలని నమ్మలేములే అని మళ్లీ అతడే అన్నాడు. సంతోషం మరి గూగుల్ ని నమ్మొచ్చా? అన్నాను
ఎందుకు చొప్పించారో రేపు ఇదే బ్లాగ్ లో చెపుతాను మళ్ళీ చదవండి. చదవకపోయినా మీ ఇష్టం , కావ్ కావ్ అంటూ ... కానీ చదివితే కొన్ని సంకెళ్లు తెగిపోతాయి . జ్ఞానం విముక్తి ప్రదాయం.
రాధా కృష్ణుల బంధం భౌతికం కాదు ఆధ్యాత్మికం అని చెప్తారు. వాళ్ళు ప్రేమించుకున్నారు భౌతికంగానే కలిసి తిరిగారు. దీన్ని ఆధ్యాత్మికంగా వర్ణిస్తారు. మీకేమనిపిస్తోంది?
O my god! wrong information from Google?
ReplyDeletegoogle is giving right information. valmiki is true. google is true. cinema is wrong.
ReplyDeleteఅవును కదా! మొద్దు బుర్రకు ఎక్కలేదు.రాధాకృష్ణులు కూడా కలిసే తిరిగారు కదా?🤔
Deleteమీలాంటి శ్రే యోభిలాషులకు అర్థం అయితే ఆనందమే. నిరంతర జ్ఞాన చక్రంబున దొరలిన నరులకు దొరకును ఙ్ఞాన చక్షువుల్. రాత్రి మరల చదవండి.గుప్త అభిజాతకు ధన్యవాదాలు.
Deleteమనుషుల్లో అవకాశవాదం మగవారిలో పురుషాహంకారం సహజ లక్షణాలు. వీటికి తోడు స్త్రీకి పాతివ్రత్యం అనే పిచ్చి అంటగట్టి , ఆ పిచ్చికి పరాకాష్ట గా రామాయణాన్ని అష్ట వంకరలు తిప్పారు. ఇది ... మీరు గ్రహించాల్సింది. కానీ నేను మళ్లీ తాత్పర్యం వ్రాయవలసి వస్తోంది. సీతని తాకితే ఆవిడ శీలం పోయినట్టే నని , భూమితో పెకలించి తీసుకువెళ్లాడని మూర్ఖులు ఓవర్ ఏక్షన్ చేస్తే , వారు చెప్పినది విని ఏమీ చదవకుండా అదే నిజమనుకుని అధోగతి పాలైన వాళ్ళని చూస్తే జాలేస్తుంది . చదివి వ్రాసినా అర్ధం చేసుకోలేనివారు ఇంకా దారుణం
ReplyDeleteరాబోయే తరాలకు సరైన జీవన విధానాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో ఎంతో నిజయుతీగా, ధైర్యంగా అపురుపమైన గ్రంధాలని అందించారు గొప్పవాళ్ళు. కాని అటువంటి మహా కావ్యాలని వక్రీకరించి, సాధ్యపడనీ సందర్బాలను సృష్టించి నేటి కాలం ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు. అందరికి సంసృతం చదివేతే సంకెళ్ళు ఎప్పుడో తెగిపోయేవి. కానే సంసృతిని, సంస్కృతాన్ని దూరం చేసిన రోజు నుండే జ్ఞానానికి దూరమైపోయము.
ReplyDeleteYour grasp is great, expression is greater and personality is greatest
Delete