Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Sunday, July 28, 2019

పింక్ మూన్ - పాట - పూలబాల

This Lyric is Based on the Tune of " Orayyo Endalo Chaligundiro"
From the movie : Sogasu Choodatarama"
This song has the same color but different shade.



ఓరయ్యో నీ చూపే  నను  గుచ్చిందిరో
ఓలమ్మి నీ రూపే తెగ నచ్చిందిలే
చూపులతో  ఇలా మంటలే  రేపనా
మాటలతో అలా మోజులే తీర్చవా 

 వెండి దారాల చీరలో  తళతళ మెరియు తారలా
 కనుపాపలో పాపలా కొలువుండనా
కొరికే పుట్టి హెచ్చి నీ పిచ్చితో నేను  రెచ్చి
పాములా కస్సనీ కాటేయనా

బంగరు వన్నెల శిల్పమే పెంచెను నాలో వలపునే
వలపులు తలపులు ననుతట్టి రేపెను నాలో సలుపునే
మరి పోదాం , పోదాం వలపుల తీరం తాకొద్దాం 
ఓరయ్యో నీ చూపే నను  గుచ్చిందిరో
ఓలమ్మి నీ రూపే తెగ నచ్చిందిలే

ఒడుపుగా తాకి చూడు కదలగా కొత్త కారు 
చూసుకో , చూపించుకో చుంబించుకో
 బంధాలను మెల్లగా  వొదిలించి
అందాలను మొత్తం అందించి
తీర్చుకో ఆర్చుకో సెగలనే

వాడి వాడి గా చూసి, వేడి  సెగలను  రాజేస్తే
వొత్తుకు హత్తుకు కూచుని మెత్తగా నవ్వి ఎగదోస్తే
మత్తుగా , చిత్తుగా హత్తుకుపోయి  మొత్తం దోచుకు పొతాలే

ఓరయ్యో నీ చూపే  నను  గుచ్చిందిరో
ఓలమ్మి నీ రూపే తెగ నచ్చిందిలే
చూపులతో  ఇలా మంటలే  రేపనా
మాటలతో అలా మోజులే తీర్చవా