తెలుగు వారు ఇంగ్లిష్ గ్రామర్ నేర్చుకుని ఇంగ్లిష్ లో మాట్లాడగలరా?
ఇంగ్లిష్ మాట్లాడ దానికి కేవలం గ్రామర్ ఒక్కటీ సరిపోతుందా?
సరిపోదు. ఎందుకు?
శబ్దం, పద ఉచ్చారణ , పద్ధతి, ఆలోచన ఇగ్లిష్ మాట్లాడానికి అవసరం
శబ్దం: అక్షరాలు శబ్దాలకు ప్రతినిధులు. ఏ భాష అయినా మొదట సబ్ధరూపంలోనే ఉన్నది. భాష కనిపెట్టిన వేల సంవత్సరాల తరువాత లిపి కనిపెట్టబడింది అని మర్చిపోవద్దు. ఏ భాషనైనా ఆ భాషకి చెందిన సబ్దాలతోనే ఉచ్చరించాలి. మంచులక్ష్మి గారు మాట్లాడే తెలుగు చూసి అందరూ గేలి చేయడానికి కారణం పరభాషా శబ్దాలతో తెలుగు మాట్లాడడమే. మరి మనం చేసేది అదే. ఇంగ్లిష్ ని తెలుగు శబ్దాలతో మాట్లాడుతున్నాము.
అ ఆ యి ఈ ... అలాగే
క ఖ ,, ట .. త .. ద ... ధ న ప ఫ బ భ మ య ర ల వ ... మొదలగు అన్ని అక్షరాలనీ ఎలా చదవాలో తెలుగువారికి తెలుసు. అంటే వాటి శబ్దాలు మనకు తెలుసు. కానీ ఇంగ్లిష్ లో ఈ శబ్దాలు లేవు.
ర అనే శబ్దం ఇంగ్లిష్ లో r శబ్దం ఒక్కటి కావు.
క అనే శబ్దం ఇంగ్లిష్ లో K శబ్దం ఒక్కటి కావు.
వ అనే శబ్దం తెలుగులో ఒక్కటే ఉంది. ఇంగ్లిష్ లో రెండు - వ - శబ్దాలు ఉన్నాయ్.
W ,V ఈ రెండు అక్షరాలూ రెండు రకాల ‘వ’ శబ్దాన్ని ఇస్తాయి. ఇంతే కాక
దీర్ఘము, (కా) : ఈత్వము (కీ) : ఒత్వము (కో); ఐత్వము (కై) వంటి వి ఇంగ్లిష్ లో లేవు.
అంటే; అంటే కాల్ , టాక్ , వాటర్ అని పలకడము సుద్ధ తప్పు. ఎందుకంటే ఇంగ్లిష్ లో దీర్ఘము లేదు.
అలాగే కోట్ (తొడుక్కునేది), నోస్ (ముక్కు) ఇలాటి ఓ తో వచ్చే ఉచ్చారణలు కూడాలేవు.
అంటే కోట్ , నోట్, నోస్ తప్పుడు ఉచ్చారణలు.
Cat, Bank కేట్ అని బేంక్ అని రాయలేము కదా? క్యాట్ , బ్యాంక్ అని ఎందుకు రాస్తాము?
కేట్ అని బేంక్ అని రాయడం తప్పు అని తెలుసు గనక.
ఇదంతా విన్న తరువాత శబ్దం ఎలా ఉంటేనేం? అని ఒక నిరక్ష రాస్యుడు మాత్రమె ప్రశ్నిస్తాడు.
పద ఉచ్చారణ ప్రాముఖ్యత : ఆవు అనే పదాన్ని ఎవు అని పలికితే ఎలావుంటుంది?
చాలా చికాకు గా అనిపిస్తుంది. ఇది నిజం. ఎవరైనా భాషనీ తప్పుడు ఉచ్చారణతో పలికితే వినలేము.
పైగా ఉచ్చారణ మారితే పదం యొక్క అర్ధం మారిపోతుంది.
కట్టు. కుట్టు. కొట్టు. ఉచ్చారణ బట్టి ఒక్కొక్క పదానికి ఒక్కొక్క అర్ధం ఉంది.
బహుళ ఉచ్చారణలు : ఇంగ్లిష్ అక్షరాలూ పదాలూ కూడా స్థిర ఉచ్చారణను కలిగి ఉండవు.
In English the sound of a letter and pronunciation is not fixed as in Telugu.
ర - ఈ అక్షరాన్ని ర అనే చదువుతాము . క - ఈ అక్షరాన్ని క అనే చదువుతాము
ఇంగ్లిష్ లో ఇలా కుదరదు. A అ అని చెప్పలేము. Apple. Manace. Age. Apartment. Water.
Apple లో A చేసే శబ్దం తెలుగు లో రాయడానికి కుదరదు. తెలుగులో అటువంటి శబ్దం లేదు.
Menace లో A - యి శబ్దాన్ని ఇస్తుంది. Age లో A చేసే శబ్దం తెలుగు లో లేదు.
Apartment లో A ని పలకము. Water లో A ని ఒ గా పలుకుతాము.
అక్షారాలు - బహుళ శబ్దాలు :
U అనే అక్షరాన్నే తెసుకోండి. ఇది ఒకే శబ్దాన్ని ఇవ్వడు. BUT, PUT, BUSY, BURY, DUTY.
బట్, పుట్, బిజి, బెరి , డ్యూటి. U అనే ఒకే అక్షరం ఐదుశబ్దాలని ఉత్పత్తి చేస్తుంది.
O అనే ఇంగ్లిష్ అక్షరం ఒక్కో సారి ఒక్కోలాగా పలకాలి. ONE వన్. ORDER ఓడ. OPINION అపీన్యన్.
రాయడానికి వీలుకాని శబ్దాలు:
బృవ్వట బాబా తలపై పువ్వట... అని తెనాలి రామలింగడు చలన చిత్రం లో ఒక రాయడానికి వీలుపడని శబ్దం గురించి ప్రస్తావన ఉంది. ఇంగ్లిష్ లో ఇటువంటి శబ్దాలు అనేకం. అంతే కాక A అంటే అ అని G అంటే గ అని P అంటే ప అని E అంటే ఎ అని తెలుగునుంచి ఇంగ్లిష్ కి అన్వయించడం కుదరదు. Colonel - కర్నల్ అని పలుకాలి. ఈ పదంలో r అనే అక్షరం లేనే లేదు.Psychology సైకాలజీ అని పలుకాలి. ఈ పదంలో P అనే అక్షరం ఉచ్చరించబడదు.
పద ఉచ్చారణ;
వివిధ ఉచ్చారణలు : ఇంగ్లిష్ లో ఒకే పదానికి రెండు ఉచ్చారణలు ఉండడం సహజం
ఇంగ్లిష్ లో ఉచ్చారణ బట్టి పదం అర్ధం ఉంటుంది. (స్పెల్లింగ్ ఒకేలా ఉన్నప్పటికీ కూడా )
Conduct - ఈ పదాన్ని కాండక్ట్ . కండక్ట్. అని రెండు రకాలగా పలకవచ్చు.
మొదటి రకంగా ఉచ్చరిస్తే నామవాచకము. దీని అర్ధం ప్రవర్తన.
రెండవ రకంగా ఉచ్చరిస్తే క్రియ (verb) దాని అర్ధం నిర్వహించు.
ఇలాటి పదాలు ఇంగ్లిష్ లో అసంఖ్యాకం. మరి కొన్ని ఉదాహరణలు Progress. Project. Insult. Import.
Order, ఆజ్ఞ , ardour, పట్టుదల, odour. వాసన అని వేరు వేరు అర్ధాలు ఉన్నట్టే వీటికి పద ఉచ్చారణ కూడా వేరు.
చాలామంది order – ఆడ్దర్ అని పలుకుతారు. మిగితా రెండు పాదాలు వారికి తెలియవు. అనేక అంతర్జాతీయ భాషలను కలుపుకున్న మహా సముద్రం ఇంగ్లిష్. తెలుగు నుంచి ఇంగ్లిష్ నేర్చుకోదానికి ముందు ప్రతి తెలుగువారు తప్పక చదవవలసిన తెలుసుకోవలసిన విషయాలు ఇవి. హుందాగా ఉండే ఉచ్చారణ , తప్పులులేని భాష మీ సొంతం అవుతుంది. అందుకు మీరు చేయవలసిందల్ల ఇంగ్లిష్ లో ఉన్న శబ్దాలు, పద ఉచ్చారణ, పధ్ధతి అంటే భావ వ్యక్తీకరణ పద్ధతి మరియు ఆలోచన తెలుసుకోవడమే. ఆలోచన అంటే ఇంగ్లిష్ ఆలోచన. ఇవి తెలుసుకోవడం వల్ల మంచి ఇంగ్లిష్ చక్కటి ఉచ్చారణతో మాట్లాడవచ్చు లేకపోతె మనం మాట్లాడేది బట్లర్ ఇంగ్లిష్ మాత్రమె.
పదాలు: కొన్ని పదాలను తెలుగు నుంచి ఇంగ్లిష్ లో కి తర్జుమా చేయకూడదు. వాటి సమ పదాలను (equalents) తెలుసుకొని వాడాలి. అంటే భావము కలిఇగిన లేదా అర్ధాన్నిచ్చే పదాన్ని తెలుసుకోవాలి. లేదా వినేవాడికి అంతా మకతిక* గా ఉంటుంది. ఈ క్రింది పదాలను ఇంగ్లిష్ లో ఊహించగలరా?
అతడు చేయతిరిగిన చిత్రకారుడు.
నోరుతిరగని పదాలు.
పోలీసులు ఖంగు తిన్నారు.
నా ఖర్మ కాలిపోయింది.
ఈ భావనలు ఇంగ్లిష్ లో కూడా ఉన్నాయ్. కానీ వేరే విధంగా ఉన్నాయ్. అలాగే ఇంగ్లిష్ లో ఉన్న పదాలు తెలుగులో వేరే విధంగా ఉండచ్చు. ఉదాహరణకు: call girl అంటే పిలుపు అమ్మాయి కాదు.
పద్ధతి
బస్ ఎక్కడం, పరీక్షా రాయడం , గిజగిజ లాడిపోవడం. అయిపోయిన్దేదో అయిపొయింది.
ఈ భావనలు ఇంగ్లిష్ లో కూడా ఉన్నాయ్. కానీ చెప్పే పద్ధతి వేరు.
Climbing bus ఎంత తప్పో Writing exam అని వాడడం కూడా అంటే తప్పు.
I am taking the bus / making the bus. I am taking the test / appearing for the test.
చివరిగా తెలుగు ఆలోచనల గురించి తెలుసుకుందాం.
ఏం తిన్నది అరగడం లేదా? వాడికి కళ్ళు నెత్తికెక్కాయి- వంటి ఆలోచనలు వేరే భాషలో ఉండాలని నియమం ఏమీ లేదు. చాలావరకు ఉండవు. అప్పుడు మన ఆలోచనలను మార్చుకోవాలి. అలాగే చెప్పడానికి ప్రయత్నిస్తే పెళ్లి నూరేళ్ళ పంట marriage is hundred years crop. అని శ్రీవారికి ప్రేమలేక కాదు కాదు శ్రీవారికి ప్రేమలేఖ చిత్రం లోలేక శంకర్ దాదా MBBS లో లాగ infront crocodile festival లా ఉంటుంది మనభాష.