Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Tuesday, April 22, 2014

కాశ్మీరు కధలు

కాశ్మీరు కధలు  -  లాల్ దేడ్ - కాశ్మీరు యోగిని

కాశ్మీర్ అంటే మనకి మక్కువ ఎక్కువ కానీ తెలిసింది తక్కువ. బిల్హన , కల్హణ వంటి కవులు , ఆనందవర్ధన, అభినవ గుప్త వంటి సంస్కృత వేదాంత వేత్తలు కవులే కాక , కవయిత్రులు అనేక పండితులు , ఋషులు సన్యాసినులు కు పుట్టినిల్లు కాశ్మీరు, సంస్కృతం, శైవం వర్ధిల్లిన భూమి భూతల స్వర్గం కశ్మీరు. బిల్హన రాసిన 50 ప్రేమ పద్యాలు స్పేనిష్ లో, లోస్ చిన్ క్వెంత పోయమాస్ దెల్ అమోర్ ఫర్తివో గా అనువదించ బడ్డాయి. మన భాషల్లో దొరకకపోయినా విదేశా భాషలలో దొరకడం కొంత విడ్డూరంగా ఉంటుంది. కల్హననుడు రాసిన ఆత్మ కవిత్వం (సోల్ పోయెట్రీ ) మీద భరతముని రాసిని నాట్యశాస్త్రం మీద వ్యాఖ్యానం రాశాడు అభినవ గుప్తుడు . ఇది కూడా ఇంగ్లిష్ లో దొరుకుతున్ది.
కాశ్మీర్ లో లాల్ దేడ్ అనే గవర్నమెంట్ ఆశు పత్రి ఉన్ది. అది మెడికల్ కాలేజీ కూడా. ఆపేరు విచిత్రం గా అనిపిస్తుంది కాశ్మీర్ లో ఆసుపత్రికి శివ యోగిని పేరుపెట్టడం వెనుక ఆసక్తికరమైన కథ ఉన్ది. పామ్పొర లో ఆమె పేరున ఒక సరస్సు కూడా ఉంది. ఐక మత్యం , సహనం, భాత్రుత్వం గురించి చెపుతూ కాశ్మీరు లోయలో తిరిగిన వెన్నెల కురిపించిన చందమామ. ఈమె గురించి హిందువని, ముస్లిం అని రెండు మతాల వారు వాదించుకున్నారు. కానీ ఇరువరూ ఆమెను గౌరవించారు. ఇప్పటికీ కాశ్మీర్ లో ఆమె అంటే చాలా గౌరవం చూపుతారు. ఆమె పెళ్లి ఒక వ్యధ , భర్త అత్తగారు పెట్టిన బాధలకు గొప్ప సహనాన్ని చూపిన ఆవిడ మాట్లాడే ప్రతి మాట పద్యరూపం లో ఉండేదని చెపుతారు. ఆశువుగా పద్యాలు చెప్పిన కవయిత్రి అత్తగారు ఆమె ను ఎన్ని బాధలు పెట్టినా కిమ్మనక సహించటమేకాక ఏంటో గౌరవం చూబించేది. ఆమె అన్నం ప్లేట్లో అత్తగారు ఒక రాయి పెట్టి ఆ రాయి పై అన్నం వద్దిన్చేవారట. చూసే వారికి ఎక్కువ అన్నం పెట్టినట్టు కనిపించేది కాని ఆమెకు మాత్రం తిండి సరిపోయేది కాదు. అయినా అత్తా గారి పట్ల ప్రేమతో , సహనంతో ఉన్న ఈ వనిత భోజనానంతరం, ఆ రాయిని సుబ్రం చేసి ఒక మూల తన అత్తగారు మళ్ళీ వాడడానికి సిద్దం చేసేది. ఈమెకు మరొక పేరు కూడా ఉన్ది. అదే లల్లెస్వరి.
కాశ్మీర్ లో శైవానికి ప్రతీక లల్లాదేవి ఆద్యాత్మికతను తన పద్యాలలో నింపి శుష్క మత సంప్రదాయాల్లో డొల్ల తనాన్ని , పలాయనా వాదాన్ని, భయాన్ని ఎండగట్టిన ఆత్మ యోగిని. లల్ల దేవి పద్యాలు ఆద్యాత్మిక దివ్యకాన్తులీనుతూ జ్ఞాన మార్గాన్ని చూపుతాయి. మనసు గుర్రాన్ని జ్ఞానమనే కళ్ళెం తో అదుపు చేయమనే ఆమె తాత్వికత, ఎముకలలో కి రక్తమాంసాల లోను నిండి ఉన్న భగవంతుడ్న్నిశరీరంలో కనుగోవాలని, లేకుంటే మరణానంతరం కనుగోలేమనే ఈ యోగిని ఆలోచనలు పద్యరూపంలో నిలిచి ఉన్నాయి. తన పద్యాల్లో మృత్యుంజయు రాలు మిగిలిన యోగిని లల్ల దేవి.