Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Tuesday, June 30, 2020

Anveshana 2020 Scene 22

సాయంకాలం 6 గంటలు. రెజీనా ఫైనల్ రిపోర్ట్ తయారుచేసింది. ఒక్కాసారి ఫైల్ ఇది తాను ప్రమాదం అంచులలో పరిగెడుతూ సాధించిన ఫలం అడవి ఫలం. కార్తీక్  నిన్న  ఉదయం నుంచి , కాదు కాదు మొన్న  రాత్రినుంచి నిద్ర పోకుండా పడుతున్న శ్రమ గుర్తొచ్చింది. నేను ఇప్పుడు హాయిగా రూమ్ లో కూరుచున్నాను, బంగాళా చుట్టూ పోలీస్ భద్రత  కార్తీక్ మాత్రం ఇంకా సైకో క్రిమినల్ వేటలో అడవిలోనే ఉన్నాడు. చీకటి పడేటప్పటికీ కార్తీక్ ఇంటికి చేరుకుంటే పండగే. తాను చెప్పేడు ఉదయం నుంచి బంగళాలో ఏంజరిగింది, నెమలి ఇంటినుంచి బంగళాకి పరుగు పరుగున నాకోసం వచ్చి  పిచ్చివాడిలా నాకోసం ఎలా గాలించాడో

 ఉదయం 7. 00 గంటలు. కార్తీక్ బంగాళా కి చేరిన తరువాత రెజీనా! , రెజీనా!!  అని అరుస్తూ బిల్డింగ్ అంతా కలియతిరుగుతుంటే , సత్య వచ్చి మేడం రికార్డింగ్ కి వెళ్ళేరు అని చెప్పేడు.    "ఇదేంటి ? బాలసుబ్రమణ్యం రికార్డింగ్ కి వెళ్ళేరు అని చెప్పినంత  సులభంగా చెప్పేసావు , ఇదేమన్నా స్టూడియో కి వెళ్లడమా?" అని అరిచాడు కార్తీక్.  " మేడంకి సార్ కిడ్నాప్ అయిన సంగతి తెలియదు , నేనే చెప్పదన్నాను. " అన్నాడు సత్య.  "ఓహో!  ఇది నీ డైరెక్షనా? సరే జగపతిగారి బెడ్ రూమ్ చూబించు." అన్నాడు కార్తీక్.   సత్య బిలియర్డ్స్ రూమ్ పక్కన ఉన్న జగపతి బెడ్ రూమ్ చూబించాడు. లోపల తాళం వేసిఉండగా మనిషిని కిడ్నప్ చేశారు అంటే తలుపు పగలగొట్టక తప్పదు అన్నాడు కార్తీక్ . సత్య గున్నపం తెచ్చి ఇచ్చాడు. కాస్సేపటిలో  తలుపు తెరిచాడు కార్తీక్.   తలుపు తీసేటప్పడికి నెమలి ఇంటినుంచి మెల్లగా నడుచుకు వచ్చింది అనసూయ.  డబుల్ కాట్ ని  పక్కకి నెడితే దానికింద చెక్క తలుపు ఉంది "అనసూయా , కూపర్ని తీసుకురా."  అన్నాడు కార్తీక్ . అనసూయ కూపర్ని తీసుకొచ్చింది . " దీనికి తిండి దండగ అనుకున్నాను, ఆమ్మో సార్ మామూలోడు కాదు ఇలాంటిదేదో జరుగుతుందని ముందే ఊహించాడు." అన్నాడు సత్య   " భౌ భౌ  భౌ  భౌ " అరిచింది కూపర్. చెక్కతలుపు తెరిచి కూపర్ని తీసుకుని సొరంగంలోకి ప్రవేశించాడు.

                                                                 *** 

సాయింకాలం 6 గంటలు అయ్యేసరికి 2 పోలీస్ జీప్స్ రెండు పోలీస్  వేన్లు వచ్చి బంగాళా ముందు ఆగాయి. ఒక కంపెనీ  పోలీసులు తో వస్తున్నా కార్తీక్ ని చాలా వింతగా చూసారు  గ్రామస్థులు. " వెళ్లండయ్యా వెళ్ళండి " వారిని బంగాళా ముందునుంచి క్లియర్ చేస్తున్నాడు ఒక కానిస్టేబుల్. జగపతి దిగి బంగాళాలోకి వెళ్లాడు. కొంతమంది గ్రామస్థులు లోపాలకి వెళ్ళడానికి ప్రయత్నించారు . పోలీసులు వారిని నెట్టేస్తున్నారు.  ఆ బాబుని సూడనియ్యండి  బాబు అని పోలీసులతో  బేరాలాడుతున్నారు కొంత మంది గ్రామస్థులు. వెల్లడయ్యా చెప్తుంటే మీక్కాదూ.  నెట్టేస్తున్నారు పోలీసులు.    అనసూయ మోహంలో ఆందోళన నిండి ఉంది. " రెజీనా ఇంకా రాలేదు " అని చల్లగా చెప్పింది. బాంబ్ పేలినట్ఠయ్యింది, కార్తీక్కి. రాత్రి 7 గంటలు అయ్యింది పోలీసులు ఫారెస్ట్ లో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.    8 గంటలవరకూ కంపెనీ  అంతా అంటే 134 మంది వెతుకుతున్నారు. ఒక జత కళ్ళు చెట్టులో కలిసిపోయి వెతుకుతున్న ఇద్దరు పోలీసులకేసి చూస్తున్నాయి. ఒక్కసారిగా వారిమీద పడి  మట్టు  పెట్టాడు ఆ సైకో. మళ్లీ  అలాగే పొదచాటున నక్కి మరో ఇద్దరు పోలీసులని చంపబోయాడు. పోలీసులు తప్పించుకున్నారు.
కార్తిక్ ఫైర్ చేసాడు. వాడు దుమకడం ప్రారంభించాడు. కార్తీక్ వాడి వెనుక పరిగెడుతున్నాడు. పోలీసులు టార్చ్ వేసుకుంటూ వెనక పరిగెడుతున్నారు. క్షణాల్లో మాయమైపోయాడు , సబ్ ఇన్స్పెక్టర్ వచ్చి"సార్ చూసారా వాడేసుకున్న  జంపింగ్ షూస్, వాటి సాయంతో వాడు 12 అడుగుల ఎత్తు ఎగరగలడు 10 అడుగుల నుంచి 20 అడుగులకు ఒక అంగ పడుతున్నది వాడిది.  సార్ వాడేసుకున్నవి మామూలు బూట్లు కావు, వాటిని కంగారు షూస్ అంటారు. అన్నాడు సబ్  ఇన్స్పెక్టర్. " అవి వేసుకున్నోడు కూడా మామూలోడు కాడు " అన్నాడు కార్తీక్.  " అర్ధం కాలేదు" అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్. వాడు కెమాఫ్లాజ్ ఎక్స్పర్ట్ , యిట్టె పరిసరాల్లో కలిసిపోయి దాక్కోగలడు అందుకే అందరికీ ఒక విషయం చెప్పాలి అన్నాడు కార్తీక్. ఇదిగో సార్ అంటూ మెగాఫోన్ ఇచ్చాడు సబ్ ఇన్స్పెక్టర్. ఇది మైకుల్లో చెప్పేది కాదు అని చెవిలో చెప్పాడు . అతను  ఇంకొక పోలీస్ చెవిలో చెప్పాడు. కొద్దీ సేపట్లో అక్కడ పోలీసులు ఎవరూ లేరు.
                                                                 ***     
  
 ఉదయం 8 గంటలు అయ్యింది , వాన కురుస్తుండడం తో రాత్రంతా మేలుకునే ఉంది ,  చుట్టూ నాలుగు కొండల మధ్య లోతైన ప్రదేశంలో పడి  ఉన్న రెజీనా తలెత్తి చూసింది పైన ఎదో శబ్దం అయ్యింది. ఏమీ కనిపించలేదు. కాస్సేపు తర్వాత చప్పుడు వినిపిస్తున్నది.  ఆకాశం లోంచి ఏదో తెల్లని వస్తువు తన వైపు రాసాగింది. అది డ్రోన్ , అది కార్తీక్ పంపేడు అని గ్రహించడానికి ఎక్కువ సేపు పట్టలేదు. కొద్దిసేపు డ్రోన్ రెజీనా మీద తిరిగి  వెనక్కి వెళ్ళిపోయింది. ఒక అరగంటలో కార్తీక్ పెద్ద మోకుతాడు  నడుముకి కట్టుకుని పోలీసుల సాయంతో రెజీనాని బయటకు తీయడానికి లోయలోకి  దిగాడు.  కొండమీద నుంచి తాడు ఒక కొస  పోలీస్లు  పట్టుకుని ఉన్నారు.  రాత్రంతా వానపడుతున్నాదా  అని అడిగాడు కార్తీక్.  అవును ఇక్కడికి ఒక పెద్ద  ట్రక్ కూడా వచ్చింది. ఈ నాలుగు  కంటైనర్ల లో ఒక దాన్ని తీసుకెళ్లింది. కార్తీక్ చూసాడు , నెల మీద హెవీ ట్రక్ టైర్ మార్క్స్ ఉన్నాయి. వాన పడడం వల్ల మార్కులు  క్లియర్ గా ఉన్నాయి.  అక్కడ బైటకి వెళ్ళడానికి దారి ఉంది కానీ మూసివేసారు . ఒక బండరాయి తో దాన్ని కప్పేశారు. అక్క డా మూడు పెద్ద కంటైయినెర్స్ ఉన్నాయి. అవి ఆర్మ్స్ డంప్  అని తెలుసుకున్నాడు.
  " ఆపిల్ ఆఫ్ డిస్కార్డ్ , ది రూట్ కాజ్ అఫ్ అల్ ప్రోబ్లెమ్స్ " అన్నాడు. రెజీనా అయోమయంగా ఏమీ అర్ధం కానట్టు మొహం పెట్టింది . " ఈ అడవిలో జరిగే అనేక అరాచకాలకు మూల కారణం ఈ ఆయుధాల డంప్ " అని వివరించాడు కార్తీక్. రెజినా ఒంటిమీద గాయాలు చూసాడు. అయ్యో రెజీనా ఈ గాయాలేంటి అసలెలా వచ్చావు ఇక్కడికి ? తన నడుం కి కట్టి  ఉన్న మోకు తాడుని విప్పుతూ.   జేమ్స్, గిరి సత్య అందరు చెప్పారు   వాటర్ ఫాల్స్ దాటివెళ్ళద్దు ప్రమాదం  అని , కానీ ప్రమాదం అంటే ఇలా ఉంటుంది అని  తెలియదు,  నిన్న వ్వాటర్ ఫాల్స్ దగ్గరకి వచ్చేసరికి మద్యానం అయ్యింది  చాలా కొత్త పక్షులు రావడంతో ఈ లోతులోకి దిగేను ఈలోయలోకి   దిగేటప్పుడు సులభంగా దిగిపోవచ్చు కానీ ఎక్కడ చాలా కష్టం. నిన్నసాయంకాలం వాన కురిసింది, ఎక్కడానికి చాలా సార్లు ప్రయత్నించాను , రెండుసార్లు పడిపోయాను. సాయంకాలం హెల్ప్ హెల్ప్ అని పిచ్చిదానిలా అరిచాను.  రాత్రంతా  వాన పడుతూనే ఉంది. ఈ చెట్లకొమ్మలకింద తలదాచుకున్నాను. కార్తీక్ రెజీనా వంక జాలిగా చూస్తూ తాడు ఇద్దరి నడుములకి కడుతున్నాడు. ఆ  పెద్ద బండరాయిని ట్రక్ లోంచి వచ్చిన ఒక మెకానికల్  ఆర్మ్ పక్కకి తొలగించింది , అలాటి ట్రక్ నేనెప్పుడూ చూడలేదు అంది రెజీనా , దానిని సెల్ఫ్ లోడింగ్ కంటైనెర్ ట్రక్ అంటారు. అంటే ట్రక్ లోనే క్రేన్ ఆర్మ్ ఉంటుంది. అన్నాడు కార్తీక్. అలాంటి ట్రాక్ పెద్ద కంటైనర్ ని తనంత తానూ లోడ్ చేసుకోగలదు. అంటూ తాడు ఒక కొసని ఇద్దరి నడుములకి ముడి వేయడం పూర్తి చేసాడు. సమంగా ముడి పడిందా అని చెక్ చేసాడు. గాయాలు ఉన్న చోటులంతా చేతులతో తడిమి చూస్తున్నాడు. "ఇన్స్పెక్టర్ ఏంటిది?" అంది . ఇన్స్పెక్టర్ కాదు కార్తీక్ అన్నాడు.
తాడు రెండవ కొస పైన పోలీసుల చేతుల్లో ఉంది. జేబులోంచి విజిల్ తీసి ఒకసారి ఊదాడు. మెల్లగా పైనించి వాళ్ళు తాడుని లాగుతున్నారు , కిందనుంచి  కార్తీక్, రెజినా కొండ ఎగప్రాకుతున్నారు.  కొండ ఎగుడు , జారుడు పెరిగింది , కాళ్ళు చేతులలో పట్టు తప్పుతోంది , తాడుతో టెన్షన్ పెరిగింది , పైనుంచి వాళ్ళు గట్టిగా లాగుడు మొదలుపెట్టేరు . ఈ తాడు లేకపోతే , పైనుంచి సహాయం లేకపోతే ఎక్కడం అసాధ్యం అనిపించేలా ఉంది. దూరం డ్రోన్ వీరిద్దరినీ చూస్తోంది డ్రోన్ కంటిలో  రెండు చీమలు కొండపైకి ప్రాకుతున్నట్టు కనిపిస్తోంది. డ్రోన్ పోలీసుల వెనక్కి వెళ్ళిపోయింది . వారి వెనక నుంచి ఒక  నిమిషం చూసి  రెజీనా మొఖం  కేసి చూస్తూ ఎగిరిపోయింది .ఎవరిపని వాళ్లు చేసుకున్నారు.  ఇంకొక పది నిమిషా లతరువాత పైకి చేరుకున్నారు. రెజినా కార్తీక్ భుజంమీద చేయివేసి కుంటుతూ జీప్ దగ్గరికి చేరుకుంది. ఇద్దరు జీప్ లో కూర్చున్నారు. కార్తీక్ డ్రైవ్ చేస్తున్నాడు , పక్కనే  భుజం మీద వాలి కూర్చుంది రెజీనా.


జీప్ బయలు దేరింది. జీప్ వెనుక వెన్లో పోలీసులు.  చల్ల గాలి తగులుతోంది.  సడన్గా రెజీనా మొఖంలో వెలుగు కనిపించింది. " ఎంతో కాలం నుంచి అర్ధం కానీ చిక్కుముడి ఇప్పుడు విడిపోయింది. అంది. ఏంటి అన్నాడు కార్తీక్ . ఆర్మ్స్ డంప్  లో కంటైనర్లు ని తీసుకెళుతున్న ట్రక్ హార్న్ ..అదే అదే ట్రక్ హార్న్ నేను ఒకప్పుడు  రికార్డింగ్స్లో విన్న ఏనుగు ఘీంకారం ." అంది రెజీనా. భలేదానివే  ట్రక్  ఏంటి ఏనుగు ఘీంకారం ఏంటి? అన్నాడు కార్తీక్.  నిన్న రాత్రి కంటైనర్ తీసుకువెళ్లిన ట్రక్ పైన ఏనుగుల పెయింటింగ్ ఉన్న కాన్వాస్ కప్పేరు , ఆ  ట్రక్ హార్న్ కి బదులు  ఏనుగు ఘీంకారం వినిపిస్తుంది .  ఇదే నేను టెలిస్కోప్ లో చూసినప్పుడు కనిపించింది .. ఏనుగుల గుంపు కదులుతున్నట్టు కదిలి ఏనుగు ఘీంకారం వినిపించి మరు క్షణం మాయమవుతుండేది. అంది రెజినా.  కానీ ఈ స్పాట్  మన బంగాళా కి చాలా దూరం  ఎలా చూసావు ? అన్నాడు కార్తీక్ . లేదు కార్తీక్ ఇపుడు మన వెళుతున్న రోడ్ మీద ఆ ట్రక్ వెళ్ళింది . అదే నేను టెలిస్కోప్ లో చూసాను. మన బంగాళా చాలా ఎత్తుగా ఒక దిబ్బమీద  ఉంటుంది.  విలేజ్ మన బంగళాకి చాలా దిగువగా ఉంటుంది. విలేజ్ నుంచి ఈప్లెస్ ని చూడలేము కానీ  బంగాళా నుంచి చూడగలము.

కార్తీక్ జీప్ ఆపేడు . చూడమ్మా కాస్సేపు నువ్వు చెప్పినిదే నిజం అనుకుందాము అంతదూరం నుంచి  ఏనుగు ఘీంకారం రికార్డింగ్ సాధ్యమా ? మరీ సిల్లీ గా ఉందే!  అన్నాడు కార్తీక్ . " కార్తీక్ , నువ్వు క్రిమినాలజీ చదివేవు నేను రికార్డింగ్ ఎక్స్పర్ట్ ని " అంది రెజీనా. ఐ యామ్ సారీ  అన్నాడు కార్తీక్. జీప్ ముందుకి పోనిచ్చాడు. కొంత సేపు మౌనం. "కోపం తగ్గిందా" అని అడిగాడు కార్తీక్ .  మైక్రోఫోన్ ఎంత దూరం వరకు శబ్దాన్ని లాగుతుంది ? అన్నాడు కార్తీక్.  ఏ మైక్రోఫోన్  కూడా శబ్దాన్ని లాగలేదు. ధర్మామీటర్ వేడి తగిలితే పనిచేసినట్టు , శబ్దం దానికి తగిలితే అది రికార్డ్ చేస్తుంది.  శబ్దం ప్రయాణించే దూరం దాని డెసిబుల్స్  అంటే లౌడ్నెస్ మీద , దాని పిచ్ మీద , ఇంకా తరంగ దైర్ఘ్యం అంటే  వేవ్ లెంగ్త్ మీద ఆధారపడి ఉంటుంది.  ఏనుగు ఘీంకార శబ్దం  తరంగ దైర్ఘ్యం తక్కువ ఉండటం వల్ల 20 మైళ్లవరకు వినబడుతుంది. అయితే మామూలు చెవికి వినపడదు. నా దగ్గర ఉండే మైక్ -50 డెసిబుల్స్ కూడా వినగలిగే  సున్నిత మైన మైక్. ఇంకా చెప్పాలంటే స్టేజి మీద ఒక ఆర్టిస్ట్ తలతిప్పి ఇంకొక ఆర్టిస్ట్ వైపు చూస్తే , ఆ తలా తిప్పిన శబ్దం కూడా వినగలదు. ఆ రకంగా ఉదయం ఇంటికి చేరి విశ్రాంతి తీసుకుని , నీట్ గా తయారయ్యి, నిదానంగా ఫైనల్ రిపోర్ట్ తయారు చేసి  సాయంకాలం 6 గంటలకి కార్తీక్ కోసం ఎదురు చూస్తూ కూర్చుంది.

                                                                     ***

కార్తీక్ పోలీసులకి  ఇచ్చిన ప్లాన్ ప్రకారం పోలీసులు అందరు యూనిఫామ్స్ వదిలి  కెమాఫ్లాజ్ టెక్నీక్ అనుసరించి పొదలు మాదిరిగా , వంటికి రాగులు పూ సుకుని చెట్లమాదిరిగా , రాళ్ళ మాదిరిగా అడవిలో కలిసిపోయారు. అలా సైలెంట్గా కదలకుండా పులి మాటు వేసినట్టు వేశారు. వారి శ్రమ ఫలించింది.  కార్తీక్ గిరి మొబైల్ లో తీసిన మిగితా ఫొటోస్ చూస్తుంటే హౌస్ ఫోటోస్ చాలా కనిపించాయి. ఆ రాత్రి గిరి అన్నీ టైంలేక అన్నీ చెప్పలేకపోయాడు , కానీ ఈ మొబైల్ ఫోటోస్  గిరి చెప్పలేని చాలా విషయాలు చెప్తున్నాయి. ఆ మడ్ హౌస్ లో  కట్టేసిన అమ్మాయిల ఫోటోస్ ఉన్నాయి , పట్టాభి కూడా ఉన్నాడు. ఇది సైకోగాడి అడ్డా  అన్నమాట అనుకున్నాడు కార్తీక్. కానీ ఈ మడ్ హౌస్ ఎక్కడుందో ఎలా కనుక్కోడం ? చాలా గూడేలలో ఇలాటి ఇళ్ళు  చూసాను అని ఆలోచిస్తున్న కార్తీక్ కి తళుక్కున మెరిసిన ఆలోచన - పట్టాభి . పట్టాభిని పట్టుకోవాలి. పోలీస్ స్టేషన్ కి వెళ్లాలి  , పట్టాభిని తీసుకురావాలి అన్నాడు కార్తీక్. " పోలీస్ స్టేషన్ కి ఎందుకు సార్ పట్టాభి గ్రామంలోనే ఉన్నాడు వాడికి బెయిల్ మీద. వెంటనే పట్టాభిని తీసుకొచ్చారు. కార్తీక్ సబ్ ఇన్స్పెక్టర్ మడ్ హౌస్ చేరేటప్పటికి సాయింకాలం 4 గంటలు అయ్యింది  ఆ సైకోగాడు అక్కడే ఉన్నాడు.  వీళ్ళని  చూడగానే కాళ్ళకి స్ప్రింగ్ షూస్ కట్టేసాడు. ఆ తరువాత ఇన్స్పెక్టర్ కార్తీక్ వాడి వెంట పడలేక పడలేక పరిగెడుతుంటే వాడు లేడిపిల్లలా దుముకుతుంటే పట్టాభి నవ్వుతూ అన్నాడు " వాడు మీకు చస్తే దొరకదు." కార్తీక్ పరిగెడుతూనే ఉన్నాడు , పట్టాభి నవ్వుతున్నాడు , సడన్గా అతడి చెంప చెల్లుమంది , పక్కనే సబ్ ఇన్స్పెక్టర్ నిలబడి ఉన్నాడు. పట్టాభి మొఖం జేగురించింది. " ఎలా దొరుకుతాడో నువ్వే చూద్దుగాని. అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్.

                                                                     ***


5 గంటల ప్రాంతంలో సైకో ఒక ప్రదేశం లో పరిగెడుతున్నాడు . చుట్టూ ఎవరూ లేరు , పరుగాపి ఒక బండరాయి మీద కూర్చున్నాడు. " ఈ అడవికి రాజు సింహం , నా తర్వాతే అనుకున్నాడు  అహంకారంతో. చుట్టూ ఉన్నపొదలు పొదలు కాదు పోలీసులు. మరుక్షణం కార్తీక్ అటురావడం చూసి ఒకపొదలో దూరేసాడు. కోడిపెట్టాలా ఉక్కిపోయాడు అదిచూసి పట్టాభి మొఖం మాడిపోయింది. ముల్లుని ముల్లుతో తియ్యడం అంటే ఇదే పట్టాభి అన్నాడు కార్తీక్.             
                                                                      ***
                                                                 
సాయింకాలం 6 గంటలు దాటింది ఎదురు చూస్తున్న రేజీనా కంట్లో మెరిశాడు  కార్తీక్ . అతడి కళ్లల్లో విజయ గర్వంతొణికిసలాడింది.   రెజినా కళ్ళలో  కార్తీక్ , రెజీనా దంపతులు అయ్యి సాగిపోతున్న దృశ్యం కనిపించింది.  కార్తీక్ కోసం రెజీనా అన్వేషణ,  సైకోక్రిమినల్ కోసం  కార్తీక్ అన్వేషణ . పక్షి పాట ల్లో  సంగీత స్వరాల మీద పరిశోధన జగపతి అన్వేషణ  అన్ని అన్వేషణలు ఫలించాయి. ఇందులో అనేక విజయాలు , అనేక విజయ గీతాలు దాగి ఉన్నాయి.
                                    శుభం

 Epilogue : James lost his job. He was sentenced to 7 years imprisonment. Pattabhi being accomplice  got 2 years term and Nemali for supporting criminals got 1 year. During police interrogation the psycho criminal vomited the name of the terrorists behind the dump, the police nabbed the  king-pin and days after the arrests the dump was recovered. Satya and Anasuya got married.                                                                   
                                                   

Anveshana 2020 Scene 21

ఆ మరుసటి రోజు జగపతి రావడం. ఆ మరుసటిరోజు తెల్లవారు జామున గిరి టెలిస్కోప్ తో సహా ఇంట్లోంచి పారిపోవడం కార్తీక్ ని రెజీనాని విస్మయానికి గురి చేశాయి. జగపతి వస్తే జేమ్స్ తప్పక వస్తాడు అనుకున్న రెజీనా. అనుకున్నట్టుగానే ఆ మద్యానం జేమ్స్ బంగళాకి  వచ్చాడు. జగపతి కార్తీక్ ని లంచ్ కి ఆహ్వానించాడు.  అందరికి అనసూయ లంచ్ అరేంజ్ చేసింది. జగపతి కార్తీకాని జేమ్సని ఒకొరికొకరిని పరిచయం చేసాడు. " కార్తీక్  ఇతను జేమ్స్  నా చిన్ననాటి స్నేహితుడు ,  ఫారెస్ట్ రేంజర్, జేమ్స్, ఇతను  కార్తిక్ ఇతను"   అని జగపతి అంటుండగా జేమ్స్ కలుగజేసుకుని ఉండుండు నేను చెపుతాను అని చెప్పడం ప్రారంభించాడు  "ఇతను  MSc Wildlife Science  WII  లో చదివి వైల్డ్ లైఫ్ రీసర్చ్ అండ్ కంజర్వేషన్ మీద ఆసక్తి పెంచుకున్నాడు. పోజెక్ట్ టైగర్ లో పని చేస్తున్నాడు. అసలు వీళ్ళ ఫెమలిలో  లో అందరికీ  వైల్డ్ లైఫ్ పిచ్చేనట."  అనసూయ వడ్డించి , అందరూ  భోజనాలకి లేవండి. తింటూ మాట్లాడుకోవచ్చు అంది.


 అందరు భోజనాలకి కూర్చున్నారు , జేమ్స్ కంటిన్యూ చేసాడు "వీళ్ళ  నాన్నగారు హెర్పటాలజిస్ట్  మద్రాస్ క్రొకోడైల్ బ్యాంకు ట్రస్ట్ లో పనిచేస్తున్నారట. వీళ్ళ తమ్ముడు  శ్రీలంక లో రెంకావా టర్టిల్ కన్జర్వేషన్  రీసర్చ్ లో ఉన్నాడట . వీళ్ళ చెల్లి ఓఫియాలజీ , అంటే పాముల రీసర్చ్ చదువుతున్నది. మొత్తానికి వీళ్లదంతా వైల్డ్ లైఫ్ ఫామిలీ  ఆహ్  హ్హ  హ్హ  హ్హ  హ్హ హ్హ" అంటూ నవ్వుతూ , "ఇంతకీ మీ అమ్మగారు?"  అని కార్తీక్ వైపు చూసాడు. రెజీనా ఇంత కథ చెప్పాడా ? అనుకుంది మనసులో.  " బలే చిత్రం గా ఉందే ఇతని స్టోరీ  ఇక్కడే ఉంటున్నాడు అని తెలిసి బర్డ్స్ రీసర్చ్ లో రేజీనాకి తోడుగా ఉండమని అడిగాను ,నాకు ఇంత కథ  అల్ల గలడని నాలిక కరుచుకుని , అదే అదే ఇంత కథ ఉంది అని నాకు తెలియదు " అన్నాడు జగపతి.  " 

నాకు  కూడా తెలియదండి " అంది రెజీనా  ఏం కదా అల్లేవురా  అన్నట్టు పేస్ పెట్టి . "ఇప్పుడు మీరు చేస్తున్న రీసెర్చ్ దేనికి సమ్మందించి సార్?" చల్లగా  అంది రెజీనా ఆట పట్టిద్దామని. "వైల్డ్ లైఫ్ మీద హెలికాఫ్టర్ సౌండ్ ప్రభావం ఎలా ఉంటుంది అనేది నా స్టడీ అండీ. " అన్నాడు కార్తీక్.  "ఇదేం  స్టడీ అయ్యా , హెలికాఫ్టర్లు ఈ అడవిమీదనుంచి ఎన్ని తిరుగుతున్నాయి , టైగర్స్ మీద  వాటి ప్రభావం ఏముంటుందయ్యా?" అన్నాడు జేమ్స్. జగపతి నవ్వుతున్నాడు  కార్తీక్ ఏంచెప్తాడో చూద్దామని  సార్ మన టైగర్ ప్రాజెక్ట్ ఎవరు లాంచ్ చేశారు ? అన్నాడు సీరియ్సగా , జేమ్స్ ఆలోచనలో పడ్డాడు.  మన టైగర్ ప్రాజెక్ట్ ని 1973 లో  ఇందిరాగాంధీ గారు లాంచ్ చేశారు .  అన్నాడు కార్తీక్ . మరి అప్పుడు ఎన్ని టైగర్స్ ఉన్నాయి ? అన్నాడు కార్తీక్.  జేమ్స్ మల్లె ఆలోచనలో పడ్డాడు. అప్పుడు 40,000 టైగర్స్ ఉండేవి . అని కార్తీక్ ఆన్సర్ చెప్పేసాడు. మరి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? అన్నాడు . అప్పడు జేమ్స్ , నన్ను ప్రశ్నలు అడగకుండా  నువ్వు చెప్పదలచుకున్నది చెప్పు. అన్నాడు. ఇప్పుడు 3000 పులులు మాత్రమే ఉన్నాయి . వాటిని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. పులులు కూడా  పసిబిడ్డల లాంటివే సార్. వాటిని అనాధలలా వదిలేస్తామా ? అన్నాడు. జేమ్స్ మొహం జేగురించింది. జగపతి , రెజీనా ముసి ముసి నవ్వులు , మూసి మూసి   నవ్వుకున్నారు. భోజనాలు ముగిసాయి జేమ్స్ వెళ్ళిపోయాడు.
.                   

రెజీనా కార్తీక్ కింద ఉన్నారు. కొంతసేపు హాల్ లో సోఫాలో  కూర్చుని  మాట్లాడుకున్నారు  జగపతి విశ్రాంతి తీసుకోడానికి తన గదిలోకి వెళ్ళిపోయాడు.గిరి ఎందుకు పారిపోయాడు ? అంది రెజీనా  అనసూయతో. మొత్తం నాకు తెలియదు. సత్యాన్ని అడిగితే తెలుస్తుంది అంది తప్పించుకుంది. సత్య తో మాట్లాడేరు , ఏమో ఏంచేశాడో సార్ ఇప్పుడు లేనిది గిరిని లాగిపెట్టి లెంపకాయ కొట్టారు. ఎందుకో నాకు తెలియదు అన్నాడు  సత్య.  టెలీస్కోప్ ఎందుకు పట్టుకెళ్ళాడు అన్నది రెజీనా . గిరి చెప్పడం లేదు నీళ్లు నములుతున్నాడు. అప్పుడు అనసూయ వచ్చి "  టెలిస్కోప్ తో పాటు పది వేలు డబ్బు కూడా పట్టుకెళ్ళాడు. టెలిస్కోప్ చాలా ఖరీదైనది అని విన్నాడు , మరి ఎం అవసరం వచ్చిందో ? అంది .  ఇంకా ఇన్వెస్టిగేషన్ బాగోదని కార్తీక్ " సరే నేను వెళతాను " అని బయలుదేరాడు. 

ఇంటివెనుక ఉన్న కొండమీద ఎవరో కదులుతున్నట్టు అనిపించింది. రేపు కొండా ఎక్కాలి అనుకున్నాడు వాడెవడో కనిపెట్టాలి. అనుకున్నాడు .  మరుసటిరోజు కార్తీక్ రూంలో ఎవరో చీటీ  పడేసారు ఒక బెదిరింపు చీటీ. ఆ మరుసటి రోజు ఫోటో లు వచాయి ఒక అమ్మాయి కట్టేసి ఉన్న ఫొటోస్.  నన్ను బెదిరించడానికో , డైవర్ట్ చేయడానికో ఎవడో చేస్తున్నాడు. జేమ్స్ కావచ్చు లేదా ఆ   కొండమీద వాడు కావచ్చు   రెజీనా బినాకులస్ తో చూసినా ఆ మనిషి  దాక్కున్నాడు. ఇంక టెలిస్కోప్ ఉన్నా లాభం లేదు, కొండెక్కాలి తప్పదు అనుకున్నాడు.  కార్తీక్ బంగళాకి వెళ్లి రెజీనాని కలిసేడు. ఒక రెండు రోజూలు నేను మా హెడ్ క్వాటర్ కి వెళ్ళాలి మా చీఫ్ నుంచి పిలుపు వచ్చింది  ఒక రెండురోజులు మేనేజ్ చేసుకోగలవా? అన్నాడు . నీకు భయం అయితే రికార్డింగ్ కోసం వెళ్ళద్దు. సత్య ఉన్నాడు కదా . వాడిని తీసుకెళ్లినా పిల్లిని చంకలో పెట్టుకుని పెళ్ళికి వెళ్ళినట్టే. ఏపర్వాలేదు అంది రెజీనా ఇంతకీ మీ చీఫ్ ఎవరు అంది మళ్ళీ "Additional Director General of Police " అన్నాడు కార్తీక్.  రెజీనా సత్య వెళ్లి డ్రాప్ చేసి వచ్చారు అనసూయ కూపర్ ని తీసుకుని కూడా వెళ్ళింది.

ఆరోజు రెజీనా చెంచుగూడెం దగ్గర రికార్డ్ చేస్తుండగా ఇద్దరు ఆగంతకులు రెజీనా మీద నెట్ విసిరి బందించి జీపులో తీసుకు  పోతుండగా కార్తిక్ వాళ్ళని రెజీనా  జీప్ లో  ఫాలో అయ్యాడు. రెజీనాని మధ్యలో వదిలేసి వాళ్ళు జీపులో పారిపోయారు.  అదేంటి నువ్వు వూరు వెళ్ళలేదా  అని అడిగింది రేజీనా , నీకోసమే వెళ్లినట్టు నటించాను అన్నాడు కార్తీక్. మరి రైలు ఎక్కవు కదా ? అంది రెజీనా . పక్క స్టేషన్ లో దిగి వచ్చేసాను. అన్నాడు. ఈ రిస్క్ అంతా మనకి ఎందుకు మనం వెళ్ళిపోతే మంచిదేమో ? అంది రెజీనా . నువ్వు వెళ్లిపోవచ్చు జగపతిగారికి చెప్పేసి నీజాబ్ క్రిమినల్స్ ని డీల్ చేయడం కాదు కాబట్టి , కానీ నా జాబ్ ఇదే.  నేను వెళ్ళడానికి కుదరదు. నువ్వు కోపరేట్ చేస్తే  ఈ సస్పెన్స్ కి  రెండ్రోజుల్లో ముగింపు పలుకుతాను. అన్నాడు కార్తిక్.  జీప్ లో రెజీనాని ఇంటికి తీసుకొచ్చేసాడు  

బంగాళా నుంచి వచ్చేసిన తర్వాత  కార్తీక్ తన రూంలో పడుకుని ఆలోచిస్తున్నాడు.  టైం చూసాడు 9 గంటలు అయ్యింది.  నెమలి తమ్ముడు ని  పట్టు కోవాలంటే  నెమలి  మూమెంట్స్ మీద ఒక కన్నేసి ఉంచాలి,  అనసూయ ఆ సైకో క్రిమినల్ గుప్పిటలో ఉంది కాబట్టి అనసూయ మీద ఒక కన్నేసి ఉంచాలి, కొండమీద వాడిమీద ఒక కన్నేసి ఉంచాలి  అయ్యో  ఉన్నవి రెండు కళ్ళేనే ఇంత మంది మీద ఎలా కాళ్ళేసి ఉంచడం  ఇలా సాగుతున్నాయి కార్తీక్ ఆలోచనలు.  గేట్ చప్పుడు అయ్యింది గేట్ తీసుకుని పట్టాభి బైటకు వెళ్ళాడు.  కాస్సేపు తర్వాత గెట్ మళ్లీ  చప్పుడు అయ్యింది. నెమలి గెట్ తీసుకుని బైటకు వెళుతోంది. ఎప్పుడూ చీరకట్టే నెమలి పేంట్స్ షర్ట్ వేసుకుంది.  


కార్తీక్ బైటికి వచ్చాడు  . చీకట్లో నిలబడి చూస్తున్నాడునెమలి నాలుగు దిక్కులా చూసింది. ఎవరూ  చూడటం లేదని నిర్ధారించుకున్నాక మెల్లగా ముందుకి సాగింది. కార్తీక్ ఆమెను అనుసరించాడు. నెమలి జేమ్స్ క్యాంపు హౌస్ చేరింది. కార్తీక్ చిన్న కన్నం లోంచి చూస్తున్నాడు. రోజురోజుకీ కోర్కెలు పెరిగిపోతున్నాయి దొరగారికి అంది నెమలి. దొరసునికి పెరగటం లేదా ? అన్నాడు జేమ్స్ . నీకన్నా ఎక్కువే ఉన్నాయి కోరికలు. అందుకే వాన పడకపోయినా వచ్చాను. అంది. జేమ్సని బెడ్ మీదకి తోసి అతడి మీద కూర్చుంది. వారిద్దరిమద్య మాటలు ఆగిపోయి ఏక్షన్  మొదలైంది ఒక్కనిమిషం మించి చూడలేకపోయాడు. ఇంకా ఎక్కువ చూస్తే  వాయురిజం లా ఉంటుంది తప్ప ఇన్వెస్టిగేషన్ లా ఉండదు అనుకుని చెవి మాత్రం టెంటుకి ఆనించి మొహం పక్కకి తిప్పేడు. లక్ష వోల్ట్ల షాక్ తగిలింది. గిరి పక్కనే చిన్న సెల్ల్ఫోన్ తో ఫొటోస్ తీసుకుని తలెత్తాడు. మెల్లగా చప్పుడు చేయకుండా ఇద్దరూ అక్కడనుంచి చీకట్లో కలిసిపోయారు. 

 కొంచెందూరం వెళ్లిన తర్వాత గిరి నోరువిప్పారు. తాను ఎందుకు పారిపోయింది చెప్పాడు , అనసూయ గుట్టు విప్పాడు. అనసూయ దగ్గర తురాయ సాటిలైట్ ఫోన్ ఉంది సార్  రెజీనా వచ్చిన కొత్తలోనే అనసూయ సెటిలై ఫోన్ వాడడం చూసాను. వాళ్లెవరో జగపతిగారిని చంపాలని పన్నాగం లోకి  అనసూయని లాగారు. మా అయ్యగారిని ఎవరు  ఎందుకు చంపాలనుకుంటున్నారో,  అనసూయ ఎందుకు వాళ్ళకి సహకరిస్తోందో నాకు తెలియదు కానీ అప్పటినుంచి నేను అనసూయ మీద ఓకన్నేసి ఉంచేను. అనసూయ ఈ మధ్య వంటచేయడం కంటే మేకప్ మీద ఎక్కువ టైం పెడుతోంది .   జగపతిగారు వచ్చిన తర్వాత చంద్రి వచ్చి కాషూ ఫెని , గ్రేప్ వైన్ రెండు రెండు బాటిల్స్ ఇచ్చింది. దాని కళ్ళల్లో మత్తు , దాని గొంతులో మత్తు , సమంగా తయారైతే విశ్వామిత్రుడ్ని ఒక చెంకలోని , ప్రవరాఖ్యుడిని  మరో చంకలో పెట్టేస్తుంది సార్.  నీట్ గా  తయారయ్యి సార్ కే  సైట్ కొడుతుంటే , డౌట్ వచ్చి ఒక రాత్రి ఫాలో  అయ్యాను. వైన్ పట్టుకుని సార్ బెడ్ రూమ్ లోకి వైన్ పట్టుకుని వెళ్ళింది.  వాళ్ళు తలుపు గడియ వేసుకోలేదు కొద్దిగా తెరిచి కూడా ఉంది .  కొంచెం ఇంటిమేట్ గా ఉన్నారు. 

అది నేను చూసిన సంగతి జగపతిగారు చూసేసారు. అందుకే మెన్నెర్ల్స్ ఫెల్లో అని తిట్టేరు. లాగిపెట్టి ఒక్కటి కొట్టేరు.  సార్ ని  పడేసింది  సార్. వాళ్ళు ఆయన్ని ఎం చేస్తారో అని నేను టెలిస్కోప్ పట్టుకుని కొండమీదకి  పారి పారిపోయాను. అనసూయ తండ్రిని బందించి , అనసూయచేత ఈపని చేయిస్తున్నారు. కానీ ఎందుకు చేయిస్తున్నారు అనేది తెలీదు .  ఆ క్రిమినల్ సైకో గాడికి ఇంత అవసరం లేదు , వాడికి రెజీనా కావలి అని తెలుసు , కానీ జగపతి తో ఏంపని ? అదే అర్ధం కావడం లేదు, జేమ్స్ గాడిని  నెమలి తో సమ్మందం ఉంది అని అరెస్ట్ చేయలేము, అరెస్ట్ చేసినా దానికి ఇష్టం ఉన్నప్పుడు అదేం తప్పుకాదు . నెమలి ఏంటండీ ఆ జేమ్స్ గాడి కేబిన్లో మరో అమ్మాయి కూడా ఉంది కదా? చూడలేదా ? అన్నాడు గిరి. నాకు కనిపించలేదే  అన్నాడు . మీ ఏంగిల్ లోంచి కనిపించదు , నా ఏంగిల్ లోంచి కనిపిస్తుంది కావలిస్తే చూడండి అని ఫోటోలు చూబించాడు . ఓ మై గాడ్ ఆమె కట్టి పడేసి ఉండగానే నెమలి ... . శెభాష్ గిరి ఆమె టూరిస్ట్ ఆమెను బంధించడం క్రిమినల్ ఆఫెన్స్ .  వాడిసంగతి నేను చూసుకుంటాను  ఆ ఫొటోస్ నాకివ్వు అనగానే ఫోన్ ఇచ్చి ఫొటోస్ తీసుకున్న తర్వాత  ఈ ఫోన్   మీ రూమ్ దగ్గర మొక్కల్లో పడేయండి నేను తర్వాత తీసుకుంటాను గిరి వెళ్ళిపోయాడు. 

కార్తీక్ వెనక్కి నేరుగా టెంట్ లోకి వెళ్ళేడు , నెమలి లేదు కానీ పట్టాభి ఉన్నాడు.  అమ్మాయి స్పృహలోలేదు ఆమె   కాళ్లు  చేతులు కట్టేసి ఉన్నాయి  కార్తీక్ జేమ్స్ కి ఫోటోఎవిడెస్ చూబించి లొంగిపోమని అడిగాడు వినలేదు , తుపాకీ చూబించిన తర్వాతగానీ మాట వినలేదు.. లొంగినట్టే లొంగి దాడి చేసాడు. ఆఖరిమాట గా " ఏది వద్దు అనుకున్నానో అది తప్పేట్టులేదు జేమ్స్"  అన్నాడు . ఆతర్వాత అంతా ఉతుకుడే, పట్టాభి కూడా తనవాటా అడిగి మరీ పుచ్చుకున్నాడు.  ఆ తర్వాతా కూడా ఒక్క మాట కార్తీక్ మాట్లాడాల్సి రాలేదు అంతా జేమ్స్ తనంతట తాను  చక్కగా చెప్పి తాను చేసిన నేరాలు అన్నీ ఒప్పుకున్నాడు కానీ పోలీస్ స్టేషన్ లో.   టూరిస్ట్ మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన అమ్మాయి. స్పృహలోకి వచ్చి నతరువాత పోలీసులకి  స్టేట్ మెంట్ ఇచ్చింది. ఇవన్నీ సూర్యోదయానికి ముందే జరిగిపోయాయి.   

సూర్యోదయం తోపాటు కార్తీక్ అడవిలోకి వచ్చాడు , మొట్టమొదట విన్న మాట  గిరి హత్య . పులి దాడి చేసి చంపేసినట్టు మళ్లీ పంచనామా జరుగుతున్నది. నేరస్తుడిని 24 గంటల్లో పట్టుకుని నిజం చెప్పేస్తాను అని చెప్పడంతో పంచనామా నిలిపివేయబడింది. డైరెక్ట్ గా నెమలి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ అనసూయ ఏడుస్తూ కూర్చుంది. తన తండ్రిని చంపేశారు, శవం ఎక్కడుందో తెలీదు , ఇంకా చెప్పలేదు అని తన చేతిలో సిటీలైట్ ఫోన్ కార్తీకి ఇచ్చి  ఎంత పెద్ద తప్పుచేసినా  తండ్రిని కాపాడుకోలేకపోయాను అంటూ శోక సముద్రం లో ములిగిపోయింది. మోకాళ్ళలో తలపెట్టుకుని ఏడుస్తున్నాది. కార్తీక్ నెమలి వైపు చూసాడు , నిన్ను ఎదో అడగాలి వచ్చాను కానీ ఏమీ అడగను ఒక్కటి చూబిస్తాను నీకు చెప్పాలనుకుంటే నిజం చెప్పు. అన్నాడు నెమలి కార్తీక్ వైపు రెప్ప వేయకుండా  చూస్తున్నది. " కార్తీక్ అనసూయ వైపు చూబించి " అదుగో మనుషులు అలా ఉంటారు " అన్నాడు. నెమలి ఇదే నీకు ఆఖరి అవకాశం అన్నాడు. నెమలి చెప్పడం ప్రారంభించింది.   

కలర్ సైన్స్ చదువుకున్న మాతమ్ముడు అమెరికాలో కలర్ కన్సల్టెంట్గా పనిచేసేవాడు. 2008లో వచ్చిన రెసెషన్ వల్ల జాబ్ పోగొట్టుకుని వ్యసనాలకు బానిసైన మా తమ్ముడిని , మా మరదలు వదిలేసి వెళ్ళిపోయింది.  వాడు  క్రమేపి సైకో గా మారి ఆ అడవికి వచ్చిన  టూరిస్టులని రేప్ చేస్తూ పులిలాగా చంపేవాడు. జేమ్స్ ఎవరినీ చంపలేదు. నాకు కూడా అందుకు ఎంతమాత్రం ఇష్టం లేదు. ఎంత చెప్పినా వినలేదు జరగాల్సినదేదో జరిగిపోయింది . అంది నెమలి. కార్తీక్ అనసూయ వైపు చూసి " నువ్వు చేసినది ఎం పెద్ద తప్పుకాదు లే అనసూయ ఏడవకు అన్నాడు . అనసూయ మోకాళ్ళ నుంచి తలఎత్తి చాలా పెద్ద తప్పు జరిగింది వాళ్ళు జగపతిగారిని అపహరించుకు పోయారు. జగపతిగారి బెడ్ రూమ్ లో ఎదో రహస్యం ఉంది అది ఏంటో తెలుసుకోమని నన్ను తరుచు ఆగంతకుడు ( నెమలి తమ్ముడు) వేధించేవాడు . వాళ్ళ ఉద్దేశం జగపతిగారి రూంలో ఎదో కమ్యూనికేషన్ ఎక్విప్ మెంట్ ఉంది , కానీ నాకు తెలిసింది తన రూమ్ లోంచి అడవిలోకి సొరంగ మార్గం ఉందని. అది వాళ్లకి చెప్పను. వాళ్ళు అటునుంచి వచ్చి ఆయన్ని తీసుకెళ్లిపోయారు. కార్తీక్ బంగాళాకేసి పరిగెత్తాడు   

Sunday, June 28, 2020

Anveshana 2020 Scene 20

చెట్ల మధ్య అడవి దారిలో రెజీనా జీప్ ఆపింది. ముందు జగపతి జీప్ దిగిపోయాడు. పెళ్లి ఎప్పుడు అనుకుంటున్నారు అన్నాడు జగపతి జీప్ దిగుతూ. ముందు మనిద్దరం చేయాల్సిన  పెళ్లిళ్లు ముహూర్తం మించిపోకుండా చేసేస్తే  మా పెళ్లి ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అన్నాడు కార్తీక్ నవ్వుతూజగపతి వెళ్ళిపోతూ కోడ్ భాషలో ఏదో  చెప్పి ఎల్లుండి బంగళాలో కలుద్దాం అన్నాడు.   జీప్ ముందుకి  కదిలింది.   కార్తీక్ నీ కాలు ... ఆపరేషన్ అంది  బులెట్  తగిలింది  కానీ లోపలకి దిగలేదు. ఆపరేషన్ పూరయ్యేదాకా ఆపరేషన్ జోలికి పోను. కనీసం కట్టు...  అంటుండగానే కట్టు కట్టి ఉన్న కాలు చూబించాడు . నడుం  బెల్ట్ లో  ఉన్న బెండెజ్ , ఎమర్జెన్సీ  మెడిసిన్స్ చూబించాడుఇవన్నీ పట్టుకుని తిరుగుతున్నావా ? "నువ్వు పట్టుకుతిరగటలేదూ ఒక పెద్ద కిట్ ?" అన్నాడు నవ్వుతూ. ఇక్కడాపు అన్నాడు జీప్ ఆపింది , సీట్లోంచి లేవబోయి మళ్ళీ పడిపోయాడు. అయ్యాయో , మళ్లీ  ఇందాకట్లాగే పడిపోయావు అంది రెజీనా. కొంచెం బేలన్స్ తప్పుతోంది అన్నాడు కన్నుకొడుతూ. .. అంటే ఇందాకకూడా .... యు చీట్  అంది. నవ్వుతూ జీపుదిగి నడుస్తున్నాడు. నాదగ్గర బేలన్స్ లేకపోయినా పర్వాలేదు నెమలి దగ్గర జాగ్రత్త


అడవిలో   రాత్రి నీతో  వెన్నెల్లో షికారు చేయాలని ఉంది.   చదువుకునే రోజుల్లో ఎప్పుడూ బుర్రలో పుస్తకాలు తిరుగుతుండేవి అప్పుడు కారు నువ్వు తీసుకొచ్చినా  ద్యాస కారు మీదే ఉంది తప్ప ... అని కార్తీక్ అంటుండగా " హ్మ్ ఇప్పటికి లైట్ వెలిగింది అన్నమాట , చెప్పు  బుర్రలో ఇప్పుడు ఏం తిరుగుతున్నాయి ? అనగానే  జీబులోంచి ఫోన్ తీసి తానూ తీసిన ఫొటోస్ ని జూమ్ చేసి చూబించాడు. ఛీ ఛీ  ఫోటోలు ఇలా  తీసుకుంటారా ? అంది. ఇన్ని ఫోటోలు ఎలా తీసుకున్నావు. అంది రెజీనాఅవన్నీ తెలుసుకోవాలంటే మన రాత్రి 10 గంటలకి కలుసుకోవాలినేను బంగాళా దగ్గరకి వచ్చిన తరువాత మూడు షార్ప్ ట్రిల్స్  ఇస్తాను అని   సౌండ్ చేసి చూపించాడు. నువ్వు చెప్పినది ఒకటి చేసినది ఒకటి. నువ్వు చెప్పినవి  ట్రిల్స్.   మాకింగ్ బర్డ్ ట్రిల్స్  చేస్తుంది. నువ్వు చేసిన సౌండ్ని చిప్పింగ్  అంటారునువ్వు చేసి  చూబించింది  చిప్పింగ్  స్పారో కాల్ట్రిల్స్ కాదుఇంకా నయం చేసి చూబించావు ,   అని రెండుచేతులు ఎత్తి  దణ్ణం పెట్టింది. అమ్మ తల్లి నాకు పోలీస్ ట్రైనింగ్ ఇచ్చారు బర్డ్ ట్రైనింగ్ ఇవ్వలేదు.నవ్వుతూరెజీనా   జీప్ లాగించేసింది. కార్తీక్ జగపతి ఇద్దరు  వేర్వేరు ప్రదేశాల్లో అడవిలో జీప్ దిగిపోయారురెజీనా వంటరిగా ఇంటికి వచ్చేసింది  విషయాలన్నీ తేటతెల్లం అయిపోయాక , మబ్బులు వీడిన ఆకాశంలాగా మనసు నిర్మలంగా అయిపొయింది.

10 గంటలు అయింది, రెజీనా మనసులో  వెన్నెల షికారు మొదలయ్యి గంట అయ్యింది. సడన్గా  చిప్పింగ్ కాల్స్ వినిపించాయి . మనసు గంతులేసింది. ఫైబర్ మస్కారా పూసుకుని , మోకా  లిప్స్టిక్  రాసుకుని  ప్లెయిన్  సిల్వర్ ఇయర్ రింగ్స్ , డెనిమ్ బ్లూ జీన్స్  వేసుకుని రెడీ అయ్యింది.   అయ్యో  చెప్పులు..  చెప్పులు .. నా చెప్పులు ఏవి.   ఓపెన్ టెర్రస్ మీద వదిలేసాను కదా అని గుర్తొచ్చి రూమ్ బయటకి వచ్చింది. కార్తీక్ నల్ల దుస్తుల్లో ఉన్నాడుతనను నల్ల దుస్తుల్లో ఉన్నా నడక, నడిచేటప్పుడు కుడి చెయ్యి ఆడించే పద్ధతి బట్టి తనని గుర్తు పట్టొచ్చని  చెప్పాడుచెప్పులు వేసుకుని కిందకి చూసింది . గేటుదగ్గర అనసూయ కనిపించింది. కార్తీక్ అనసూయని చూడగానే చీకట్లో కలిసిపోయాడు. అనసూయ అటు ఇటు చూసి నడుస్తూ చీకట్లోకి వెళ్ళిపోయిందిఆమెను అనుసరిస్తూ ఆమె వెనక కార్తీక్ వూడూ మెజీషియన్ వెంట వెళ్లే బొమ్మలా వెళ్తుంటే, పేకాటలో మొత్తం ఓడిపోయినట్టు మొహం వేలాడేసుకుని రెజీనా వెళుతోంది.

నాతో వెన్నెల షికారు అని చెప్పి ఇదొస్తే దీనితో వెళ్ళిపోతావా , ఛీఛీ వెధవ మగబుద్ధి , ఐనా మగవాళ్ళని అనుకోడానికి ఆడవాళ్ళు తిన్నగా ఉంటె కదా అనుకుంది , నెమలే అనుకున్నాను,  ఛీ  అడవిలో అంతా ఒకేలా ఉన్నారు .  అనసూయ ఒక డొంకదారిలోకి ప్రవేశించింది. అది దారి అంటే ఎవ్వరూ నమ్మరు.అలా ముందుకెళ్లి  , వెళ్లి ఒకచోట ఆగింది అక్కడ ఏముంది అనుకున్నారు.  క్రీపర్స్ కప్పి ఉన్న ఒక వుడెన్ కేబినెట్ ఉంది అక్కడ నిలబడి అనసూయ చిప్పింగ్ కాల్స్ ఇచ్చింది.   వుడెన్ కేబినెట్ తలుపు తెరుచుకుంది.


కార్తీక్ చెక్క కేబిన్ దగ్గరికి వెళ్ళేడు చిన్న కన్నం లోంచి  కన్ను పెట్టి చూసాడు , కేండిల్ వెలుతురులో ఒక పొడవైన మనిషి అనసూయని తాకుతున్నాడు , చీదరించుకుని విదిలించుకుంటోంది. పక్కన కుర్చీలో ఒక ముసలాడు కట్టిపడేసి ఉన్నాడు. కార్తీక్ మనసులో ప్లాన్  సిద్ధమైపోయింది. రెజీనా  వెనకే వచ్చిఉండాలని గెస్ చేసాడు. వెనక్కి తిరిగి చూడగానే రెజీనా, మాట్లాడకుండా వెళ్ళిపోతోంది. ఆమెను అనుసరించాడు కార్తీక్. డొంకదారి దాటేంతవరకూ ఇద్దరూ మౌనం గా నడిచారు.  రెజీనా ప్లీజ్ స్టాప్ , ఛీ నాతో మాట్లాడకు అంది రెజీనా. వెన్నెల్లో షికారు వంకాయ అని చెప్పి .. ఇప్పుడు మాత్రం ఎంపోయింది ఇప్పుడు  షికారు వెళదాం.  ఇక్కడే  పక్కనే లేక్ ఉంది అందులో చిన్న బోట్  కూడా ఉంది.  అన్నాడు. అయినా రెజీనా ఆగలేదు. రెజీనా పోలీస్ తో వస్తున్నప్పుడు వాడికి  సడన్గా అనుకోని పని తగలచ్చు అని గెస్ చేయలేవా? అయినా పోలీసుని అనుసరించేటప్పుడు మినిమమ్ 100 ఫీట్ డిస్టెన్స్ మైంటైన్ చేయాలని తెలీదా , వుడెన్ కేబినెట్ కి  అంత  దగ్గరగా వచ్చేసావేంటి ? అన్నాడు. బాబూ నాకిచ్చింది బర్డ్  ట్రైనింగ్ పోలీస్ ట్రైనింగ్ కాదు. అంటూనే ఇద్దరికీ నవ్వాగలేదు. వెన్నెలలో షికారులో, పడవలో ఇచ్చి పుచ్చుకుందాము అన్నాడు కార్తీక్ . " ఏంటీ ? " అంది రెజీనా. "అదే ట్రైనింగ్, ఒకరినొకరు ట్రైన్  చేసుకుందాము." అన్నాడు.  

మరి అనసూయ? అనసూయకి ఏం కాదు. అనసూయ తండ్రిని బందీ గా పెట్టుకుని అతని రూపంలో ఇంటికివస్తున్నది ఒక ఒక యువకుడు అని గమనించాము కదా. ఇప్పుడు వాడే  అనసూయని బెదిరిస్తున్నాడు . అనసూయని ఎం చేయడు అనసూయ ద్వారా ఎదో పని జరగాలి అనసూయతో వాడికి అవసరం ఉంది. అది ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అంది రెజీనా. అలా తెలుసుకోవాలి అంటే మనం ఇప్పుడు ఇక్కడనుంచి వెళ్ళిపోవాలి.  

The romantic interlude at night began even before they got into the boat. Kartheek got into the boat and was trying to balance for Regina to get in , but Regina , not used to boat, could not keep foot in the centre or karthik misbalanced it the boat has lost its equilibrium fell on Karthik that her breast dashed against karthik's chest. The soft touch of her shaddocks has wetted him emotion. He instantly laid his hand on her waist. The romantic music started in their nerves. For a while the boat fluttered like a bird. They both sat down after all the tremors died but the tremors in their body started. Regina and Kartik locked at each other. Their eyes got locked for couple of minutes. It was Regina who extricated from the mesmerizing looks. Karthik was still staring at her. Regina noticed that he was leering at her curves she said " You are fixed like Eros statue at the Piccadilly Circus , shall we start boating. The boat moved as he pulled the oar. The glint of moon is clear on the lake water. The forest is deathly still. In the tranquility and chillness of the night the small boat was gliding softly. One who watches from the hills find the boat moving on a huge sheet of glass. After a while the oaring slowed down. Regina's eyes are asking for something though her lips don't permit. He felt the perfume of her body. sometimes circumstances create the need.  He smelled her hair and neck.  They slid closer and closer oared the boat slower and slower until Kartheek dug his face in her bosom. The boat stalled on the water. The night melted in the heat of romance. 

                                                            End of Scene 20