రాత్రి పది గంటలు ఐయ్యింది. బెడ్ మీద వాలి కళ్ళు మూసుకున్నా నిద్ర పట్టలేదు.కిటికీలోంచి బయటకు చూస్తే దట్టమైన అడవి , చిమ్మ చీకటి. చెవిపోడుచుకున్న వినిపించని నిశ్శబ్దం. దీన్నేడెఫెనింగ్ సైలెన్స్ అంటారు. వెంటనే "డెఫెనింగ్ సైలెన్స్" ప్రొఫెసర్ ఆఫ్ సోషల్ సైకాలజీ పాత్రీజియా రోమితో రాసిన బుక్ గుర్తొచ్చింది. రెజీనా తన బేగ్ తెరిచిపుస్తకం తీసి చదవసాగింది. ఆమె చదువుతున్నది డెఫెనింగ్ సైలెన్స్ యొక్క ఇటాలియన్ వెర్షన్ " ల డిప్రెసియోనె దొపో ఇల్ పార్తో."
296 పేజీల పుస్తకం లో 280 పేజీలు పూర్తి అయిపోయాయి. అప్పుడు అప్పుడు చదివేసింది. వంటరిగా ఉన్నప్పుడుబెస్ట్ కంపేనియన్స్ బుక్స్ అనేది నిజం అనిపించింది. తెలియని పదాలు అండర్లైన్ చేసుకుంటూ డిక్షనరీ లో వాటి అర్ధాలు వెతుక్కుంటూ మెల్లగా పుస్తకపఠనం ముగించింది. ఇటాలియన్ పురుషాధిక్య సమాజంలో స్త్రీల పై జరుగుతున్న హింసను కనిపించకుండా సమాజం ఏరకంగా భాషను సృష్టించింది , ఆ భాషాద్వారా ఏరకమైన ఏరకమైన భావజాలాన్ని మెదళ్ళపైరుద్ది , ఒక మైండ్ ఫ్రెమ్ ని సృష్టించింది అనే ఒక కంటికి కనిపించని సున్నితమైన అంశంపై రాసిన పుస్తకం అది.
ఇంతలో ఎదో కీచుమనే చప్పుడు వినిపించింది. ఇది బంగాళా గేట్ చప్పుడు లా ఉందే. వెంటనే గది బయటకు వెళ్లి మేడమీంచి గేట్ వైపు చూసింది. గేట్ లోంచి ఒక ఆకారం బయటకు వెళుతోంది. " ఆ ముసలాయన వెళ్ళిపోతున్నాడు అయ్యో మతి స్థిమితం లేని పెద్దాయన ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో " అనుకుని అనసూయ రూమ్ వైపు వెళ్ళింది. తలుపు కొట్టలేక పోయింది. మళ్ళీ
గేట్ వైపు చూసింది
ఎవ్వరూ లేరు. రెజినా చేసేది లేక
రూంకి వెళ్ళిపోయింది . పడుకుంది కానీ కొత్తప్రదేశం కాబట్టి మధ్యలోనే మెలుకువ వచ్చేసింది.
సమయం 3.00 అయ్యింది. కిటికీలోంచి చూస్తే నీలాకాశం, మినుకు మినుకు మంటూ మిల మిల మెరిసే తారలు. పుస్తకం చదువుతున్నప్పుడు తెలియలేదు గానీ వాన ఆగిపోయింది. నీలి ఆకాశం లో చంద్రుడు మనసుని తడుతున్నట్టుగా ఉంది. అప్పుడే స్నానం చేసి వెన్నెలలో కూర్చున్న రాకుమారిలా ఉంది అడవి. వెన్నెలలో స్త్నానం.రెజీనా మనసు గాలిపటంలా ఎగురుతోంది. బట్టలు ఎక్కువైతే పెట్టి మూత పట్టనట్టు సంతోషం ఎక్కువైతే మనసు మూత పట్టదు కదా! సడన్ గా టెలిస్కోప్ గుర్తొచ్చింది. టెలిస్కోప్ తీసుకుని గది బయటకు అడుగు పెట్టింది. వెన్నెలలో మేడమీద టెలిస్కోప్ అమర్చింది.
టెలిస్కోప్ తో వినీలా కాశం లో విహరించింది. చంద్రుణ్ణి చుంబించి తారల్ని పలకరించి పులకరించింది. అప్పుడప్పుడూ ఎక్కడినుంచో ఆలాపనగా చిన్న ధ్వనులు వినిపిస్తున్నాయి. వెంటనే తన దగ్గర ఉన్న పవర్ఫుల్ మైక్ SM 58 తో రికార్డు చేసింది. టెలిస్కోప్ ని అడవి వైపు తిప్పింది. దూరంగా కొండదగ్గర చెట్లగుంపు మధ్యలో కొన్ని ఏనుగులు మెల్లగా నడుస్తున్నాయి. ఒక్క క్షణం కనిపించి చెట్లమధ్యకి వెళ్లి పోయాయి. తర్వాత ఎంతసేపు చూసిన అవి కనిపించలేదు. టెలిస్కోప్ వేరేవైపుకి తిప్పింది. అక్కడ కనిపించిన సీన్ చూసి బిత్తరపోయింది. రైన్ కోట్ వేసుకుని జగపతి కనిపించాడు. అంటే ఇందాక వెళ్ళింది జగపతి అన్నమాట. రెయిన్ కోట్ వేసుకుని వెళ్ళేడంటే వాన పడుతున్నప్పుడే వెళ్లాడన్నమాట. బర్ద్ రీసర్చ్ తో పాటు ఇక్కడేదో జరుగుతున్నది. ఏంటది ???
అలోచించి అలోచించి బుర్ర దిమ్మెక్కిపోయింది . చివరికి పిన్ బాల్ గేమ్ లో బాల్ తిరిగి తిరిగి ఒక పోకెట్ లో సెటిల్ అయిపోయినట్టు, మైండ్ అలోచించి అలోచించి అలిసిపోయి కామ్సే కామ్ రఖనా అనుకుని అలా నిద్రలోకి జారుకుంది. పక్షుల కూతలు చెవిలో మోగుతుంటే తెలివి వచ్చింది.
కిందకి దిగి వచ్చింది. సత్య కూపర్ ని బయటకు తిప్పి తీసుకు వచ్చాడు. ఏదో చేసుంటాడు. క్లాస్ ఇంకా కంటిన్యూ అవుతున్నాది. రెజినాని చూడగానే , గుడ్మార్కింగ్ రెజీనా, అని ఆమె వైపు తిరిగి నవ్వాడు . సత్య చల్లగా జారుకున్నాడు. కమాన్ లెటస్ హావ్ బ్రేక్ఫాస్ట్ అని కూర్చున్నాడు. ఆమె కూడా కూర్చుంది. అనసూయ ఇడ్లి సాంబార్ పెట్టింది. మరో సారి కాఫీ ఇచ్చింది. కాఫీ తాగుతూ నేను ఈ రోజు హైదరాబాద్ వెళ్ళాలి. మంజులకి వంట్లో బాగోలేదు . రావటానికి వారం రోజులు పడుతుంది. అన్నాడు. మంజుల అంటే అంది రెజీనా. " గెస్ చెయ్యి " అన్నాడు నవ్వుతూ. " మీ భార్యా ?" అంది రెజినా. "కరెక్ట్ గ గెస్ చేసావు." అన్నాడు జగపతి నవ్వుతూ. ఆయ్యో ! అమ్మగారికి ఏమయ్యిందండీ ? అంటూ విషణ్ణ వదనంతో అడిగింది. " లైట్గా తీసుకో అను , న్యూమోనియా ఐ సి యు లో జేర్చారు. అన్నాడు. రెజీనా తినడం ఆపేసింది. కమాన్ రెజీనా , ఏమికాదు అంటూ గిరి అని కేకేశాడు. గిరి వచ్చాడు. ఇపుడు 8. అయ్యింది. 9 గంటలకు స్టేషన్ కు చేరగలమా? అన్నాడు . " ఈజీగా " అన్నాడు గిరి. రెజినా గిరి సత్య జగపతి కూడా వెళ్లారు , అనసూయ బంగాళా లో ఉండిపోయింది.
జీపు నడుస్తున్నాది "రెజీనాని తీసుకెళ్లి అడవి ఓకే సారి చూపించు" అని గిరి సత్యా కి చెప్పాడుజగపతి . జేమ్స్ కి చెప్పనా మీకు హెల్ప్ చేయమని అన్నాడు మళ్ళీ . చిరాక్గా మొహం పెట్టి ఆయనెందుకండీ బాబు అన్నారు ఇద్దరూ ఒకేసారి . అంతా నవ్వు కున్నారు . "హెడ్మాన్ ఊసెత్తినా జేమ్స్ ఊసెత్తినా ఎందుకు మీరు చిరాకు పడాతారు." అంది రెజీనా. ఆరోజు నెమలి గారు మిమ్మల్ని ఇంట్లోకి లాక్కెళ్లక పోతే ఏంటండీ మీ పరిస్థితి? మర్చిపోయారా? అన్నాడు గిరి. ఆమ్మో!! అని అరిచింది రెజీనా. అంతా నవ్వుకున్నారు.జీప్ స్టేషన్ కి చేరింది. అంతా జగపతి రైల్ ఎక్కేదాకా ఉండి చేయి ఊపి వెనక్కి బయలుదేరారు. జీప్ స్టేషన్ నుంచి వెనక్కు మళ్లింది గిరి అన్నాడు "సార్, మీరు లేచేవరకు ఉండి కనిపించి మీతో పక్షుల స్వరాల రికార్డింగ్ గురించి మాట్లాడి వెళ్లాలని ఆగారు లేకపోతే 6 గంటలకే వెళ్లి పోయేవారు. రెజీనా అవాక్కయ్యింది.
అలోచించి అలోచించి బుర్ర దిమ్మెక్కిపోయింది . చివరికి పిన్ బాల్ గేమ్ లో బాల్ తిరిగి తిరిగి ఒక పోకెట్ లో సెటిల్ అయిపోయినట్టు, మైండ్ అలోచించి అలోచించి అలిసిపోయి కామ్సే కామ్ రఖనా అనుకుని అలా నిద్రలోకి జారుకుంది. పక్షుల కూతలు చెవిలో మోగుతుంటే తెలివి వచ్చింది.
కిటికీలోంచి చూస్తే వెండి కొండలమీద సూర్యోదయం. టైం చూసింది 8 గంటలు అయ్యింది. అనసూయ నవ్వుతూ కాఫీ కప్ అందించింది. అయ్యగారు తయారయి బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర ఉన్నారు. మీరు తయారయ్యి వస్తే టిఫిన్ తినవచ్చు అంది. పది నిమిషాలలో ఉంటాను అని హడావిడి పడుతుంటే , " ఎం పర్వాలేదు " ఆయన కిందన సత్య కి క్లాస్ పీకుతున్నారు, కనీసం పావుగంట పడుతుంది. " మీరు ఇరవై నిమిషాల్లో వచ్చినా పర్వాలేదు. అంది అనసూయ నవ్వుతూ. రెజీనా కూడా నవ్వింది. కొంచం మనసు తేలికపడడంతో వెలిగిపోతున్న కొండలను చూస్తూ మెల్లగా కాఫి సిప్ చేస్తూ ప్రొఫెసర్ లాంగ్ ఫెలో " సన్ రైజ్ ఆన్ ది హిల్స్" అనే పద్యాన్ని నెమరవేస్తోంది.
Sunrise on the Hills
I stood upon the hills, when heaven's wide arch
Was glorious with the sun's returning march,
And woods were brightened, and soft gales
Went forth to kiss the sun-clad vales.
జీపు నడుస్తున్నాది "రెజీనాని తీసుకెళ్లి అడవి ఓకే సారి చూపించు" అని గిరి సత్యా కి చెప్పాడుజగపతి . జేమ్స్ కి చెప్పనా మీకు హెల్ప్ చేయమని అన్నాడు మళ్ళీ . చిరాక్గా మొహం పెట్టి ఆయనెందుకండీ బాబు అన్నారు ఇద్దరూ ఒకేసారి . అంతా నవ్వు కున్నారు . "హెడ్మాన్ ఊసెత్తినా జేమ్స్ ఊసెత్తినా ఎందుకు మీరు చిరాకు పడాతారు." అంది రెజీనా. ఆరోజు నెమలి గారు మిమ్మల్ని ఇంట్లోకి లాక్కెళ్లక పోతే ఏంటండీ మీ పరిస్థితి? మర్చిపోయారా? అన్నాడు గిరి. ఆమ్మో!! అని అరిచింది రెజీనా. అంతా నవ్వుకున్నారు.జీప్ స్టేషన్ కి చేరింది. అంతా జగపతి రైల్ ఎక్కేదాకా ఉండి చేయి ఊపి వెనక్కి బయలుదేరారు. జీప్ స్టేషన్ నుంచి వెనక్కు మళ్లింది గిరి అన్నాడు "సార్, మీరు లేచేవరకు ఉండి కనిపించి మీతో పక్షుల స్వరాల రికార్డింగ్ గురించి మాట్లాడి వెళ్లాలని ఆగారు లేకపోతే 6 గంటలకే వెళ్లి పోయేవారు. రెజీనా అవాక్కయ్యింది.
This comment has been removed by the author.
ReplyDeleteVery interesting sir. Your writings are very informative. By following your blog we can gain knowledge.
ReplyDeleteSahitya Priya this story is dedicated to you, you and you alone.
DeleteIts is good situation writing words is very logical
ReplyDeleteInteresting
ReplyDeleteit is very interesting and inspiring sir.
ReplyDelete