Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Sunday, June 7, 2020

Anveshana 2020 - Scene 9

  అందరూ మేడ మీద గదిలో ఉన్నారు.  70 ఎం ఎం స్క్రీన్ లాంటి పెద్ద కిటికీ. అందులోంచి చూస్తుంటే  పెద్ద చెట్లు, దూరంగా కొండలు. జగపతి అప్పుడే బేగ్ తెరిచి టెలిస్కోప్ , డ్రోన్ బయటకు తీసాడు.  ఇంతలో వాన మొదలయ్యింది. అడవిలో వర్షం!!! జగపతి, రెజినా ,  సత్య గిరి అలా అందరూ కిటికీ వద్దకు చేరి స్టాట్యూలలాగ నిలిచిపోయారు. అలా ఎంత సేపయ్యిందో తెలియదు  ముందుగా సత్య అన్నాడు "  ఇంత వాన పడితే అడవిలో వాగులు పొంగుతాయి."  వాగులకంటే ఎక్కువ నామనసు పొంగుతోంది" అంది రెజినా.  "ఈ కిటికిలోంచి  నా మనసు ఎప్పుడో వానలోకి ఎగిరిపోయింది" అంది రెజినా.  " అమ్మ కవిత్వం ఆపు , వాగులు పొంగితే జీపు తిరగలేదు." చిరాగ్గా మొహం పెట్టి అన్నాడు గిరి.   " జీప్ డ్రైవర్ వి అనిపించుకున్నావు " అంది రెజీనా.   " చిన్నపుడు ఇలాటివాన లో బయటకు వెళ్లి ఆడుకోవాలని ఉండేది కానీ ఎప్పుడూ మా అమ్మ పక్కనే ఉండేది, ఒప్పుకునేది కాదు ,  ఇప్పుడు కూడా అంతే  సార్ పక్కనే ఉన్నారు" అన్నాడు దూరంగా నిలబడి కిటికిలోంచి చూస్తున్న జగపతిని  చూసి.  


" వెళ్ళారా  వెళ్ళు , నీలాంటివాళ్లకోసమే ఎదురు చూస్తోంది పులి. అన్నాడు గిరి . అంతవరకూ సైలంట్ గా ఉన్న జగపతి  చటుక్కున  వెనక్కు తిరిగి పెట్రోల్ పోస్తే లేచే మంటలా భగ్గుమన్నాడు. " బుద్ధిలేదా, ఏం మాట్లాడుతున్నావ్ , యూజ్ లెస్ ఫెలో , గెట్ అవుట్ " అన్నాడు. గిరి కిందకి పోయి వంటగదిలోకి దూరాడు. "ఏం గిరి ఇలా వచ్చావ్ ? సార్ ఏమైనా అన్నారా?"  అంది అనసూయ. " " కిందకెళ్ళి నువ్వేమైనా భయపడుతున్నావేమో చూడమన్నారు అంతే." అన్నాడు గిరి.  అదే సమయం లో మెడమీద రెజీనాతో జగపతి "అడవిలో పులి లేదు గిలిలేదు అంతా  ట్రాష్ ఆ గిరి మాటలు నువ్వేమీ పట్టించుకోనక్కరలేదు అన్నాడు."   " సార్ పులి అంటే నాకే మీ భయం లేదు" అంది రెజినా .  "అరే ..  పులి లేదని చెప్తుంటే నామాట నమ్మవా ?"  అన్నాడు జగపతి. ఈలోపున కిందనుంచి అనసూయ రాత్రికి ఏమి వండ మంటారో కనుక్కోడానికి జగపతి దగ్గరకి వచ్చింది . జగపతి అనసూయ కిటికీ దగ్గర ఒక పక్కగా మాట్లాడు కుంటున్నారు. మరో పక్క సోఫాలో సత్య రెజినా కూర్చున్నారు. వానచప్పుడు పెరిగిపోయింది.

సత్య రెజినా సంభాషణ.

నన్నువిలేజ్ లో మనుషులు ఎందుకు వింతగా చూసారు.  ఏదో చెప్పబోయి ఎందుకు ఆగిపోయారు. నువ్వు గిరి ఎదో దాస్తున్నారు.  అప్పుడే అక్కడే అడుగుదామనుకున్నాను .ఇప్పుడు సమయం వచ్చింది. నిజం చెప్పు.

ఏంటి నిజం చెప్పాలా ? చెప్తే చాలా పెద్ద రిస్క్ లో పడతాను.

అబద్దాలతో నిజాలని కప్పిపుచ్చి నన్ను చీకట్లో పెడితే  ఈ అడవిలో పని చేయలేను. నా రీసెర్చ్  సక్సెస్ అవ్వాలంటే నిజం కావాలి .

నా లవ్ సక్సెస్ అవ్వాలంటే అబద్దం కావాలి (మనసులో )

చెప్తే చాలా పెద్ద రిస్క్ లో పడతాను.

 ఏంరిస్క్ ఆ జాబ్ పోతుంది అంతేనా ? నిజం చెప్పు.లేకపోతే నేను ఏంచెయ్యాలో అది చేస్తాను.

జాబ్ ఒక్కటే కాదు జాబ్ తో పాటు అనసూయ కూడా పోతుంది. నిజానికి నేను ఇక్కడికి ఎందుకువచ్చినా , పనిచేస్తున్నది , ఇక్కడ ఉంటున్నది నా అనుకోసమే నిజం చెప్పాలంటే రెండేళ్ళ క్రితం మొదలయ్యింది మా ప్రేమ కథ.

ఇప్పుడు నీ ప్రేమ వినే  ఓపికలేదు , మూడ్ కూడాలేదు. నిజం చెపితే నీకే లాభం.  నాతో అనసూయ క్లోజ్ గా ఉంటుంది .  నిజం చెపితే అనసూయ ...

ఆ!!! నిజం చెప్తే ...అనసూయని నాకు సెట్ చేస్తావా ?!
అబ్బా ! ఏం భాష రా బాబు , సెట్ చేయడం ఏంటి! నాతో క్లోజ్ గ ఉటుంది కాబట్టి , తన మనసులో ఎవరున్నారో , నువ్వు ఉన్నావోలేదో చెప్తాను.

నేను సార్ తోనే నిజం చెప్పను, ప్రేమించిన అనసూయకు కూడా బి టెక్ పాసవ్వకుండా యూనివర్సిటీ ఫస్ట్ అని చెప్పాను.  ఆ గిరి గాడు ఒకపెద్ద రిస్క్ అయిపోయాడు.  నాకు సాయం చేస్తానన్నారని నిజం చెపేస్తున్నాను.
ఇంత కీ సింపుల్ గా చెప్పమంటారా డిటైల్డ్ గా  చెప్పమంటారా?

 నన్ను చంపక సింపుల్ గా  చెప్పారా బాబు.

మేడమ్ , ఈ అడవిలో పులి ఉంది.

 అసలువిషయం చెప్పు. ఆ విషం నేను గ్రహించాను.

ఆ పులి మీలాగే ఇంతకుముందు ఈ అడవికి వచ్చిన సుజాత అనే అమ్మాయిని చంపేసింది.
ఈ విషయం నేను చెప్పినట్టు సారికి చెప్తే నన్ను చంపేస్తారు.  నిలువు గుడ్లు, భయం నిండిన పేల  మొహంతో చెప్పాడు.

వాన తగ్గింది. అనసూయ జగపతి కి రెజీనాకి భోజనాలు వడ్డించింది. సత్య , గిరి ఏరి అంది రెజీనా. వాళ్ళు వాళ్ళ రూంలో ఉన్నారు. వాళ్ళు అక్కడే తింటారు, పంపిస్తాను. అంది అనసూయ.  ఎలా పంపిస్తుంది ? తానే వెళుతుందేమో! అనుకుంది. అనసూయ నువ్వు కూడా మాతో తినేయచ్చుకదా ? అంది రెజినా. అనసూయ నవ్వి  పక్షి లా ఒక ధ్వని చేసింది.

ఈ కూత ఏ పక్షిదో తెలుసా? అన్నాడు జగపతి. "ఎలక్ట్రిక్ జి అంటారు , ఇది కామన్ కింగ్ఫిషర్ కూత."  అంది రెజినా. వంటగది లోంచి 60 - 65 మధ్య వయసున్న  ఒక ముసలాయన చేతిలో అన్నం పెట్టె హాట్ పేక్ , గిన్నెలతో  వచ్చాడు. ముతక గుడ్డలు మాసిన పండు గెడ్డం , నష్టపోయి రిటైర్ అయ్యిన వ్యవసాయదారుడులా ఉన్నాడు.   " అన్నం రూమ్ లో పెట్టేస్తే వాళ్ళే  వడ్డించుకుంటారు లే, నువ్వు వడ్డించక్కరలేద్దు. అంది అనసూయ. మాట్లాడకుండా మౌనం గా వెళ్ళిపోయాడు అతడు. వెంటనే   tsli vitt అనే బ్రోకెన్ మ్యూజికల్  నోట్స్ లాంటి  మరో 3 సిలబల్ కూత వినిపించింది.  " ఇది  పైడ్ వాగ్ టైల్ " అంది రెజినా.  తరవాత "tsee - tsee - tsee - chu -chu " మరో కూత .   

         
 "ఇది హై పిచ్డ్  ట్రెమెలో ఇది బ్లు టిట్ పక్షి కూత . బ్రిటిష్ బర్డ్ ఇది. ఇది నా ఫేవరేట్ బర్డ్." అంది రెజినా. మాటల్లో భోజనం ఎప్పుడు ముగిసిందో తెలియలేదు.  జగపతి వాష్ బేసిన్ దగ్గర చేతులుకడుక్కుంటుండగా స్పృహలోకి వచ్చింది రెజినా.  "మొత్తానికి బేసిక్ బర్డ్ వాచింగ్ కోర్స్ నమిలి మింగేశావు రెజినా" అంటూ  జగపతి మెట్లు ఎక్కుతుంటే రెజీనా అతన్ని అనుసరించింది.ఇద్దరు మొదటి అంతస్తు చేరుకున్నారు.


జగపతి అన్నాడు "రేపు అడవిలోకి వెళ్లొద్దు. ఎల్లుండి నుంచి వెళ్ళచ్చు. గిరి బర్డ్స్ స్పాట్స్ చూపిస్తాడు." ఒక్కసారి లోపలి రా అని రెజీనాని తన రూమ్ లోకి తీసుకెళ్లాడు.  బెడ్ రూమ్ ఎల్ షేప్ లో ఉంది 20 x 12 ఉండచ్చు, రూమ్ లోంచి మరో రూమ్ ఉంది . అక్కడ డోర్ వేసి ఉండడంతో ఆ రూమ్ సైజ్ ఎంతో తెలియలేదు. ఇదిగో అంటూ ఒక బేగ్ అందించాడు. అందులో టెలీస్కోప్, రికార్డింగ్ డివైసెస్ ఉన్నాయి.  "రేపు మైక్రోస్కోప్ సెట్ చేసి చూబిస్తాను, డివైసెస్ కూడా ఎలావాడా లో చూబిస్తాను  అన్నాడు." ఇవన్నీ ఎలావాడాలో నాకు తెలుసు అంది రెజీనా. "మరీ మంచిది , యు హావ్ రెడ్యూస్డ్ మై రిస్క్, గుడ్ నైట్" అన్నాడు జగపతి. బాగ్ తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది రెజినా.  మళ్ళీ వాన మొదలైంది.   నిద్ర రావడం లేదు అనసూయతో మాట్లాడదామని క్రిందకు దిగింది. అనసూయ గది  తలుపు వేసి ఉంది.

వాన వెలిసి చిన్న తుప్పర పడుతున్నాది . సిగరెట్ పొగ వస్తోంది అంటే గిరి సత్య మెలుకువగా ఉన్నారన్నమాట. బయట నిలబడి గిరి సత్య మాట్లాడు కుంటున్నారు.  గిరి అని పిలవగానే కంగారుగా సిగరెట్ ఆపేసాడు గిరి." సత్య అనసూయ గది తలుపు వేసేసి ఉంది ఏంటి?" అంది రెజీనా.   " వాళ్ళ నాన్న వచ్చాడు కదా , వాళ్ళ నాన్న వస్తే అనసూయ ఎక్కువ మాట్లాడదు " అన్నాడు సత్య.  "అవును  మేడమ్, వాళ్ళ నాన్న చాలా అరుదుగా వస్తుంటాడు అలా వచ్చినప్పుడు వాళ్లిద్దరూ మాట్లాడుకుంటారు. మామూలుగా అనసూయ అంత తొందరగా పడుకోదు" అన్నాడు సత్య.  "ఆ ముసలాయన ఆమె తండ్రా ! మరైతే ఇక్కడే ఉండొచ్చుగా , అతనెక్కడుంటాడు ?" కుతూహలంగా అడిగింది  రెజీనా.

"ఈ అడవి  గురించైనా , పల్లె గురించైనా , మనుషుల గురించైనా  నాకు కొంచమే తెలుసు , నాకంటే ఎక్కువ గిరి కి తెలుసు , గిరి కంటే ఎక్కువ జేమ్స్ కి తెలుసు , జేమ్స్ కంటే ఎక్కువ నెమలికి తెలుసు." టక టక చెప్పేసాడు సత్య.  " ఎవరికీ ఎంత తెలుసో బాగా తెలుసురా నీకు  అంటూ బలే తగిలించావురా నాకు అన్నట్టు మొఖం పెట్టి , రెజీనా వైపు తిరి బాగోదని ఒక నవ్వు నవ్వి " ఏంలేదు మేడమ్ ఆ ముసలాయనికి మతి స్థిమితం లేదుఅతడు మొదట అనసూయ తో కలిసి ఈ బంగళాలో ఉండేవాడు. తరవాత అతన్ని ఆసుపత్రిలో జాయిన్ చేశారు . చెప్పుకుపోతున్నాడు గిరి.  "ఎందుకు ?" అంది రెజీనా. చెప్పేనుకదా మేడం ఆ ముసలోడి మెంటలని  , అని నాలుక్కరుచుకుని , అదే మతి స్థిమితం లేదని ఆసుపత్రిలో జాయిన్ చేశారు. రెండేళ్లు  ముసలోడు ఆసుపత్రి లో నే ఉన్నాడు. తర్వాత  విలేజ్ లో ఉంటున్నాడు." ఇంకా వివరాలు కావలిస్తే హెడ్మాన్  భార్య నెమలిని అడగండి" అని  ముగించాడు గిరి. 

రెజీనాకి నవ్వాగలేదు. ఆకాశం లో పెల్లుమనే శబ్దం , పెద్ద మెరుపుతీగ ఆకాశమంతా పాకి దూరంగా ఉన్న కొండమీద దిగింది. ఎక్కడో పెద్ద పిడుగు పడింది. "ఈ రాత్రంతా వాన తప్పదేమో." అనుకుంది. " రాత్రంతా కిటికీ దగ్గర నిలబడి జాగారం చేయకండి. వర్షాన్ని చూస్తూ గడిపేయక పడుకోండి. గుడ్ నైట్  అన్నాడు గిరి. 




4 comments:

  1. Now the suspense started sir, Is the tiger really exists or not?

    ReplyDelete
    Replies
    1. your question is answered in scene 12 which also gives you tremendous knowledge of forests. It brings into your view both wild animals and illegal poachers and gives you a feeling of dwelling in forest.

      Delete
  2. Rezina objerve and gather to the information about forest and Anasuya rezina heart in some doubt then she objerve every thing. Sir your writing script very well.

    ReplyDelete