Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Tuesday, June 30, 2020

Anveshana 2020 Scene 21

ఆ మరుసటి రోజు జగపతి రావడం. ఆ మరుసటిరోజు తెల్లవారు జామున గిరి టెలిస్కోప్ తో సహా ఇంట్లోంచి పారిపోవడం కార్తీక్ ని రెజీనాని విస్మయానికి గురి చేశాయి. జగపతి వస్తే జేమ్స్ తప్పక వస్తాడు అనుకున్న రెజీనా. అనుకున్నట్టుగానే ఆ మద్యానం జేమ్స్ బంగళాకి  వచ్చాడు. జగపతి కార్తీక్ ని లంచ్ కి ఆహ్వానించాడు.  అందరికి అనసూయ లంచ్ అరేంజ్ చేసింది. జగపతి కార్తీకాని జేమ్సని ఒకొరికొకరిని పరిచయం చేసాడు. " కార్తీక్  ఇతను జేమ్స్  నా చిన్ననాటి స్నేహితుడు ,  ఫారెస్ట్ రేంజర్, జేమ్స్, ఇతను  కార్తిక్ ఇతను"   అని జగపతి అంటుండగా జేమ్స్ కలుగజేసుకుని ఉండుండు నేను చెపుతాను అని చెప్పడం ప్రారంభించాడు  "ఇతను  MSc Wildlife Science  WII  లో చదివి వైల్డ్ లైఫ్ రీసర్చ్ అండ్ కంజర్వేషన్ మీద ఆసక్తి పెంచుకున్నాడు. పోజెక్ట్ టైగర్ లో పని చేస్తున్నాడు. అసలు వీళ్ళ ఫెమలిలో  లో అందరికీ  వైల్డ్ లైఫ్ పిచ్చేనట."  అనసూయ వడ్డించి , అందరూ  భోజనాలకి లేవండి. తింటూ మాట్లాడుకోవచ్చు అంది.


 అందరు భోజనాలకి కూర్చున్నారు , జేమ్స్ కంటిన్యూ చేసాడు "వీళ్ళ  నాన్నగారు హెర్పటాలజిస్ట్  మద్రాస్ క్రొకోడైల్ బ్యాంకు ట్రస్ట్ లో పనిచేస్తున్నారట. వీళ్ళ తమ్ముడు  శ్రీలంక లో రెంకావా టర్టిల్ కన్జర్వేషన్  రీసర్చ్ లో ఉన్నాడట . వీళ్ళ చెల్లి ఓఫియాలజీ , అంటే పాముల రీసర్చ్ చదువుతున్నది. మొత్తానికి వీళ్లదంతా వైల్డ్ లైఫ్ ఫామిలీ  ఆహ్  హ్హ  హ్హ  హ్హ  హ్హ హ్హ" అంటూ నవ్వుతూ , "ఇంతకీ మీ అమ్మగారు?"  అని కార్తీక్ వైపు చూసాడు. రెజీనా ఇంత కథ చెప్పాడా ? అనుకుంది మనసులో.  " బలే చిత్రం గా ఉందే ఇతని స్టోరీ  ఇక్కడే ఉంటున్నాడు అని తెలిసి బర్డ్స్ రీసర్చ్ లో రేజీనాకి తోడుగా ఉండమని అడిగాను ,నాకు ఇంత కథ  అల్ల గలడని నాలిక కరుచుకుని , అదే అదే ఇంత కథ ఉంది అని నాకు తెలియదు " అన్నాడు జగపతి.  " 

నాకు  కూడా తెలియదండి " అంది రెజీనా  ఏం కదా అల్లేవురా  అన్నట్టు పేస్ పెట్టి . "ఇప్పుడు మీరు చేస్తున్న రీసెర్చ్ దేనికి సమ్మందించి సార్?" చల్లగా  అంది రెజీనా ఆట పట్టిద్దామని. "వైల్డ్ లైఫ్ మీద హెలికాఫ్టర్ సౌండ్ ప్రభావం ఎలా ఉంటుంది అనేది నా స్టడీ అండీ. " అన్నాడు కార్తీక్.  "ఇదేం  స్టడీ అయ్యా , హెలికాఫ్టర్లు ఈ అడవిమీదనుంచి ఎన్ని తిరుగుతున్నాయి , టైగర్స్ మీద  వాటి ప్రభావం ఏముంటుందయ్యా?" అన్నాడు జేమ్స్. జగపతి నవ్వుతున్నాడు  కార్తీక్ ఏంచెప్తాడో చూద్దామని  సార్ మన టైగర్ ప్రాజెక్ట్ ఎవరు లాంచ్ చేశారు ? అన్నాడు సీరియ్సగా , జేమ్స్ ఆలోచనలో పడ్డాడు.  మన టైగర్ ప్రాజెక్ట్ ని 1973 లో  ఇందిరాగాంధీ గారు లాంచ్ చేశారు .  అన్నాడు కార్తీక్ . మరి అప్పుడు ఎన్ని టైగర్స్ ఉన్నాయి ? అన్నాడు కార్తీక్.  జేమ్స్ మల్లె ఆలోచనలో పడ్డాడు. అప్పుడు 40,000 టైగర్స్ ఉండేవి . అని కార్తీక్ ఆన్సర్ చెప్పేసాడు. మరి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? అన్నాడు . అప్పడు జేమ్స్ , నన్ను ప్రశ్నలు అడగకుండా  నువ్వు చెప్పదలచుకున్నది చెప్పు. అన్నాడు. ఇప్పుడు 3000 పులులు మాత్రమే ఉన్నాయి . వాటిని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. పులులు కూడా  పసిబిడ్డల లాంటివే సార్. వాటిని అనాధలలా వదిలేస్తామా ? అన్నాడు. జేమ్స్ మొహం జేగురించింది. జగపతి , రెజీనా ముసి ముసి నవ్వులు , మూసి మూసి   నవ్వుకున్నారు. భోజనాలు ముగిసాయి జేమ్స్ వెళ్ళిపోయాడు.
.                   

రెజీనా కార్తీక్ కింద ఉన్నారు. కొంతసేపు హాల్ లో సోఫాలో  కూర్చుని  మాట్లాడుకున్నారు  జగపతి విశ్రాంతి తీసుకోడానికి తన గదిలోకి వెళ్ళిపోయాడు.గిరి ఎందుకు పారిపోయాడు ? అంది రెజీనా  అనసూయతో. మొత్తం నాకు తెలియదు. సత్యాన్ని అడిగితే తెలుస్తుంది అంది తప్పించుకుంది. సత్య తో మాట్లాడేరు , ఏమో ఏంచేశాడో సార్ ఇప్పుడు లేనిది గిరిని లాగిపెట్టి లెంపకాయ కొట్టారు. ఎందుకో నాకు తెలియదు అన్నాడు  సత్య.  టెలీస్కోప్ ఎందుకు పట్టుకెళ్ళాడు అన్నది రెజీనా . గిరి చెప్పడం లేదు నీళ్లు నములుతున్నాడు. అప్పుడు అనసూయ వచ్చి "  టెలిస్కోప్ తో పాటు పది వేలు డబ్బు కూడా పట్టుకెళ్ళాడు. టెలిస్కోప్ చాలా ఖరీదైనది అని విన్నాడు , మరి ఎం అవసరం వచ్చిందో ? అంది .  ఇంకా ఇన్వెస్టిగేషన్ బాగోదని కార్తీక్ " సరే నేను వెళతాను " అని బయలుదేరాడు. 

ఇంటివెనుక ఉన్న కొండమీద ఎవరో కదులుతున్నట్టు అనిపించింది. రేపు కొండా ఎక్కాలి అనుకున్నాడు వాడెవడో కనిపెట్టాలి. అనుకున్నాడు .  మరుసటిరోజు కార్తీక్ రూంలో ఎవరో చీటీ  పడేసారు ఒక బెదిరింపు చీటీ. ఆ మరుసటి రోజు ఫోటో లు వచాయి ఒక అమ్మాయి కట్టేసి ఉన్న ఫొటోస్.  నన్ను బెదిరించడానికో , డైవర్ట్ చేయడానికో ఎవడో చేస్తున్నాడు. జేమ్స్ కావచ్చు లేదా ఆ   కొండమీద వాడు కావచ్చు   రెజీనా బినాకులస్ తో చూసినా ఆ మనిషి  దాక్కున్నాడు. ఇంక టెలిస్కోప్ ఉన్నా లాభం లేదు, కొండెక్కాలి తప్పదు అనుకున్నాడు.  కార్తీక్ బంగళాకి వెళ్లి రెజీనాని కలిసేడు. ఒక రెండు రోజూలు నేను మా హెడ్ క్వాటర్ కి వెళ్ళాలి మా చీఫ్ నుంచి పిలుపు వచ్చింది  ఒక రెండురోజులు మేనేజ్ చేసుకోగలవా? అన్నాడు . నీకు భయం అయితే రికార్డింగ్ కోసం వెళ్ళద్దు. సత్య ఉన్నాడు కదా . వాడిని తీసుకెళ్లినా పిల్లిని చంకలో పెట్టుకుని పెళ్ళికి వెళ్ళినట్టే. ఏపర్వాలేదు అంది రెజీనా ఇంతకీ మీ చీఫ్ ఎవరు అంది మళ్ళీ "Additional Director General of Police " అన్నాడు కార్తీక్.  రెజీనా సత్య వెళ్లి డ్రాప్ చేసి వచ్చారు అనసూయ కూపర్ ని తీసుకుని కూడా వెళ్ళింది.

ఆరోజు రెజీనా చెంచుగూడెం దగ్గర రికార్డ్ చేస్తుండగా ఇద్దరు ఆగంతకులు రెజీనా మీద నెట్ విసిరి బందించి జీపులో తీసుకు  పోతుండగా కార్తిక్ వాళ్ళని రెజీనా  జీప్ లో  ఫాలో అయ్యాడు. రెజీనాని మధ్యలో వదిలేసి వాళ్ళు జీపులో పారిపోయారు.  అదేంటి నువ్వు వూరు వెళ్ళలేదా  అని అడిగింది రేజీనా , నీకోసమే వెళ్లినట్టు నటించాను అన్నాడు కార్తీక్. మరి రైలు ఎక్కవు కదా ? అంది రెజీనా . పక్క స్టేషన్ లో దిగి వచ్చేసాను. అన్నాడు. ఈ రిస్క్ అంతా మనకి ఎందుకు మనం వెళ్ళిపోతే మంచిదేమో ? అంది రెజీనా . నువ్వు వెళ్లిపోవచ్చు జగపతిగారికి చెప్పేసి నీజాబ్ క్రిమినల్స్ ని డీల్ చేయడం కాదు కాబట్టి , కానీ నా జాబ్ ఇదే.  నేను వెళ్ళడానికి కుదరదు. నువ్వు కోపరేట్ చేస్తే  ఈ సస్పెన్స్ కి  రెండ్రోజుల్లో ముగింపు పలుకుతాను. అన్నాడు కార్తిక్.  జీప్ లో రెజీనాని ఇంటికి తీసుకొచ్చేసాడు  

బంగాళా నుంచి వచ్చేసిన తర్వాత  కార్తీక్ తన రూంలో పడుకుని ఆలోచిస్తున్నాడు.  టైం చూసాడు 9 గంటలు అయ్యింది.  నెమలి తమ్ముడు ని  పట్టు కోవాలంటే  నెమలి  మూమెంట్స్ మీద ఒక కన్నేసి ఉంచాలి,  అనసూయ ఆ సైకో క్రిమినల్ గుప్పిటలో ఉంది కాబట్టి అనసూయ మీద ఒక కన్నేసి ఉంచాలి, కొండమీద వాడిమీద ఒక కన్నేసి ఉంచాలి  అయ్యో  ఉన్నవి రెండు కళ్ళేనే ఇంత మంది మీద ఎలా కాళ్ళేసి ఉంచడం  ఇలా సాగుతున్నాయి కార్తీక్ ఆలోచనలు.  గేట్ చప్పుడు అయ్యింది గేట్ తీసుకుని పట్టాభి బైటకు వెళ్ళాడు.  కాస్సేపు తర్వాత గెట్ మళ్లీ  చప్పుడు అయ్యింది. నెమలి గెట్ తీసుకుని బైటకు వెళుతోంది. ఎప్పుడూ చీరకట్టే నెమలి పేంట్స్ షర్ట్ వేసుకుంది.  


కార్తీక్ బైటికి వచ్చాడు  . చీకట్లో నిలబడి చూస్తున్నాడునెమలి నాలుగు దిక్కులా చూసింది. ఎవరూ  చూడటం లేదని నిర్ధారించుకున్నాక మెల్లగా ముందుకి సాగింది. కార్తీక్ ఆమెను అనుసరించాడు. నెమలి జేమ్స్ క్యాంపు హౌస్ చేరింది. కార్తీక్ చిన్న కన్నం లోంచి చూస్తున్నాడు. రోజురోజుకీ కోర్కెలు పెరిగిపోతున్నాయి దొరగారికి అంది నెమలి. దొరసునికి పెరగటం లేదా ? అన్నాడు జేమ్స్ . నీకన్నా ఎక్కువే ఉన్నాయి కోరికలు. అందుకే వాన పడకపోయినా వచ్చాను. అంది. జేమ్సని బెడ్ మీదకి తోసి అతడి మీద కూర్చుంది. వారిద్దరిమద్య మాటలు ఆగిపోయి ఏక్షన్  మొదలైంది ఒక్కనిమిషం మించి చూడలేకపోయాడు. ఇంకా ఎక్కువ చూస్తే  వాయురిజం లా ఉంటుంది తప్ప ఇన్వెస్టిగేషన్ లా ఉండదు అనుకుని చెవి మాత్రం టెంటుకి ఆనించి మొహం పక్కకి తిప్పేడు. లక్ష వోల్ట్ల షాక్ తగిలింది. గిరి పక్కనే చిన్న సెల్ల్ఫోన్ తో ఫొటోస్ తీసుకుని తలెత్తాడు. మెల్లగా చప్పుడు చేయకుండా ఇద్దరూ అక్కడనుంచి చీకట్లో కలిసిపోయారు. 

 కొంచెందూరం వెళ్లిన తర్వాత గిరి నోరువిప్పారు. తాను ఎందుకు పారిపోయింది చెప్పాడు , అనసూయ గుట్టు విప్పాడు. అనసూయ దగ్గర తురాయ సాటిలైట్ ఫోన్ ఉంది సార్  రెజీనా వచ్చిన కొత్తలోనే అనసూయ సెటిలై ఫోన్ వాడడం చూసాను. వాళ్లెవరో జగపతిగారిని చంపాలని పన్నాగం లోకి  అనసూయని లాగారు. మా అయ్యగారిని ఎవరు  ఎందుకు చంపాలనుకుంటున్నారో,  అనసూయ ఎందుకు వాళ్ళకి సహకరిస్తోందో నాకు తెలియదు కానీ అప్పటినుంచి నేను అనసూయ మీద ఓకన్నేసి ఉంచేను. అనసూయ ఈ మధ్య వంటచేయడం కంటే మేకప్ మీద ఎక్కువ టైం పెడుతోంది .   జగపతిగారు వచ్చిన తర్వాత చంద్రి వచ్చి కాషూ ఫెని , గ్రేప్ వైన్ రెండు రెండు బాటిల్స్ ఇచ్చింది. దాని కళ్ళల్లో మత్తు , దాని గొంతులో మత్తు , సమంగా తయారైతే విశ్వామిత్రుడ్ని ఒక చెంకలోని , ప్రవరాఖ్యుడిని  మరో చంకలో పెట్టేస్తుంది సార్.  నీట్ గా  తయారయ్యి సార్ కే  సైట్ కొడుతుంటే , డౌట్ వచ్చి ఒక రాత్రి ఫాలో  అయ్యాను. వైన్ పట్టుకుని సార్ బెడ్ రూమ్ లోకి వైన్ పట్టుకుని వెళ్ళింది.  వాళ్ళు తలుపు గడియ వేసుకోలేదు కొద్దిగా తెరిచి కూడా ఉంది .  కొంచెం ఇంటిమేట్ గా ఉన్నారు. 

అది నేను చూసిన సంగతి జగపతిగారు చూసేసారు. అందుకే మెన్నెర్ల్స్ ఫెల్లో అని తిట్టేరు. లాగిపెట్టి ఒక్కటి కొట్టేరు.  సార్ ని  పడేసింది  సార్. వాళ్ళు ఆయన్ని ఎం చేస్తారో అని నేను టెలిస్కోప్ పట్టుకుని కొండమీదకి  పారి పారిపోయాను. అనసూయ తండ్రిని బందించి , అనసూయచేత ఈపని చేయిస్తున్నారు. కానీ ఎందుకు చేయిస్తున్నారు అనేది తెలీదు .  ఆ క్రిమినల్ సైకో గాడికి ఇంత అవసరం లేదు , వాడికి రెజీనా కావలి అని తెలుసు , కానీ జగపతి తో ఏంపని ? అదే అర్ధం కావడం లేదు, జేమ్స్ గాడిని  నెమలి తో సమ్మందం ఉంది అని అరెస్ట్ చేయలేము, అరెస్ట్ చేసినా దానికి ఇష్టం ఉన్నప్పుడు అదేం తప్పుకాదు . నెమలి ఏంటండీ ఆ జేమ్స్ గాడి కేబిన్లో మరో అమ్మాయి కూడా ఉంది కదా? చూడలేదా ? అన్నాడు గిరి. నాకు కనిపించలేదే  అన్నాడు . మీ ఏంగిల్ లోంచి కనిపించదు , నా ఏంగిల్ లోంచి కనిపిస్తుంది కావలిస్తే చూడండి అని ఫోటోలు చూబించాడు . ఓ మై గాడ్ ఆమె కట్టి పడేసి ఉండగానే నెమలి ... . శెభాష్ గిరి ఆమె టూరిస్ట్ ఆమెను బంధించడం క్రిమినల్ ఆఫెన్స్ .  వాడిసంగతి నేను చూసుకుంటాను  ఆ ఫొటోస్ నాకివ్వు అనగానే ఫోన్ ఇచ్చి ఫొటోస్ తీసుకున్న తర్వాత  ఈ ఫోన్   మీ రూమ్ దగ్గర మొక్కల్లో పడేయండి నేను తర్వాత తీసుకుంటాను గిరి వెళ్ళిపోయాడు. 

కార్తీక్ వెనక్కి నేరుగా టెంట్ లోకి వెళ్ళేడు , నెమలి లేదు కానీ పట్టాభి ఉన్నాడు.  అమ్మాయి స్పృహలోలేదు ఆమె   కాళ్లు  చేతులు కట్టేసి ఉన్నాయి  కార్తీక్ జేమ్స్ కి ఫోటోఎవిడెస్ చూబించి లొంగిపోమని అడిగాడు వినలేదు , తుపాకీ చూబించిన తర్వాతగానీ మాట వినలేదు.. లొంగినట్టే లొంగి దాడి చేసాడు. ఆఖరిమాట గా " ఏది వద్దు అనుకున్నానో అది తప్పేట్టులేదు జేమ్స్"  అన్నాడు . ఆతర్వాత అంతా ఉతుకుడే, పట్టాభి కూడా తనవాటా అడిగి మరీ పుచ్చుకున్నాడు.  ఆ తర్వాతా కూడా ఒక్క మాట కార్తీక్ మాట్లాడాల్సి రాలేదు అంతా జేమ్స్ తనంతట తాను  చక్కగా చెప్పి తాను చేసిన నేరాలు అన్నీ ఒప్పుకున్నాడు కానీ పోలీస్ స్టేషన్ లో.   టూరిస్ట్ మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన అమ్మాయి. స్పృహలోకి వచ్చి నతరువాత పోలీసులకి  స్టేట్ మెంట్ ఇచ్చింది. ఇవన్నీ సూర్యోదయానికి ముందే జరిగిపోయాయి.   

సూర్యోదయం తోపాటు కార్తీక్ అడవిలోకి వచ్చాడు , మొట్టమొదట విన్న మాట  గిరి హత్య . పులి దాడి చేసి చంపేసినట్టు మళ్లీ పంచనామా జరుగుతున్నది. నేరస్తుడిని 24 గంటల్లో పట్టుకుని నిజం చెప్పేస్తాను అని చెప్పడంతో పంచనామా నిలిపివేయబడింది. డైరెక్ట్ గా నెమలి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ అనసూయ ఏడుస్తూ కూర్చుంది. తన తండ్రిని చంపేశారు, శవం ఎక్కడుందో తెలీదు , ఇంకా చెప్పలేదు అని తన చేతిలో సిటీలైట్ ఫోన్ కార్తీకి ఇచ్చి  ఎంత పెద్ద తప్పుచేసినా  తండ్రిని కాపాడుకోలేకపోయాను అంటూ శోక సముద్రం లో ములిగిపోయింది. మోకాళ్ళలో తలపెట్టుకుని ఏడుస్తున్నాది. కార్తీక్ నెమలి వైపు చూసాడు , నిన్ను ఎదో అడగాలి వచ్చాను కానీ ఏమీ అడగను ఒక్కటి చూబిస్తాను నీకు చెప్పాలనుకుంటే నిజం చెప్పు. అన్నాడు నెమలి కార్తీక్ వైపు రెప్ప వేయకుండా  చూస్తున్నది. " కార్తీక్ అనసూయ వైపు చూబించి " అదుగో మనుషులు అలా ఉంటారు " అన్నాడు. నెమలి ఇదే నీకు ఆఖరి అవకాశం అన్నాడు. నెమలి చెప్పడం ప్రారంభించింది.   

కలర్ సైన్స్ చదువుకున్న మాతమ్ముడు అమెరికాలో కలర్ కన్సల్టెంట్గా పనిచేసేవాడు. 2008లో వచ్చిన రెసెషన్ వల్ల జాబ్ పోగొట్టుకుని వ్యసనాలకు బానిసైన మా తమ్ముడిని , మా మరదలు వదిలేసి వెళ్ళిపోయింది.  వాడు  క్రమేపి సైకో గా మారి ఆ అడవికి వచ్చిన  టూరిస్టులని రేప్ చేస్తూ పులిలాగా చంపేవాడు. జేమ్స్ ఎవరినీ చంపలేదు. నాకు కూడా అందుకు ఎంతమాత్రం ఇష్టం లేదు. ఎంత చెప్పినా వినలేదు జరగాల్సినదేదో జరిగిపోయింది . అంది నెమలి. కార్తీక్ అనసూయ వైపు చూసి " నువ్వు చేసినది ఎం పెద్ద తప్పుకాదు లే అనసూయ ఏడవకు అన్నాడు . అనసూయ మోకాళ్ళ నుంచి తలఎత్తి చాలా పెద్ద తప్పు జరిగింది వాళ్ళు జగపతిగారిని అపహరించుకు పోయారు. జగపతిగారి బెడ్ రూమ్ లో ఎదో రహస్యం ఉంది అది ఏంటో తెలుసుకోమని నన్ను తరుచు ఆగంతకుడు ( నెమలి తమ్ముడు) వేధించేవాడు . వాళ్ళ ఉద్దేశం జగపతిగారి రూంలో ఎదో కమ్యూనికేషన్ ఎక్విప్ మెంట్ ఉంది , కానీ నాకు తెలిసింది తన రూమ్ లోంచి అడవిలోకి సొరంగ మార్గం ఉందని. అది వాళ్లకి చెప్పను. వాళ్ళు అటునుంచి వచ్చి ఆయన్ని తీసుకెళ్లిపోయారు. కార్తీక్ బంగాళాకేసి పరిగెత్తాడు   

2 comments:

  1. Oh My God!!!! Giri..... Poor fellow!!!!!

    ReplyDelete
  2. O my god Jagapathi kidnapped, Giri murdered. Nemali's brother is a pasycho.He kills ladies only. But who
    is the real villain? who kidnapped Jagapathi?

    ReplyDelete