Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Saturday, June 13, 2020

Anveshana 2020 - The Forest

డీప్ ఫారెస్ట్ ఎలా ఉంటుందో చూడాలని ఉంది అంది రెజీనా. "లంచ్ కి ఇంటికి వెళ్లాలనిలేదా డీప్ ఫారెస్ట్ అంటున్నారు" అన్నాడు సత్య. నా బేగ్ లో మన ముగ్గురికి తినడానికి పళ్ళు ఉన్నాయి అంది రెజినా. సత్య తిండి కి ఆగలేడు మేడమ్ నాకు పర్వాలేదు.  తెచ్చినపళ్లన్నీ నీకే నైవేద్యం పెడతాది మేడమ్ అప్పుడు ఫర్వాలేదా అన్నాడు గిరి.  ఓ పూటకి సద్దుకుంటాను , గొణిగాడు సత్య.  "ఇది వీడు సద్దుకోడం !  సరే నేను జీప్ తెస్తాను" అని వెనక్కి వెళ్లి జీప్ తీసుకొచ్చాడు.  మొట్టమొదటి పోస్ట్ నేల లో దింపి స్టీరింగ్ ముందు కూర్చుని  ఎక్కండి అన్నాడు  గిరి. "గత రాత్రి కురిసిన వానలో నాని  నవ నవ లాడుతోంది  అడవి.  నవవధువు నవ్వుతున్నట్టుంది." అంది రెజీనా


 "ఇక్కడే  మీరు ఇంత సరదా  పడితే డీప్ ఫారెస్ట్ లోకి డీప్ ఫ్రీజర్ లో పెట్టినట్టు ఫ్రీజ్ అయిపోతారు."  " మరి జీప్ కుదరదు అన్నావు ? అంది రెజీనా.  "అంటే ఒకే రోజు అలిసిపోయేలా తిప్పేయకుండా ,  మీరు నిదానంగా  అడవి చూడాలి అని సార్ ఉద్దేశం " అని గిరి ముగించాడు. " లోపలకి జీప్ లో వెళ్లినా  అక్కడ దిగి నిదానంగా నడుద్దాం " అంది రెజినా.  " నడుద్దాం కాదు మేడం నడవాలి , నడవడమే కాదు అప్పుడప్పుడూ గుట్టలు కూడా ఎక్కాలి"  అన్నాడు గిరి .  జీపు ఉంటుండగా నడవడమెందుకు  మళ్ళీ . అన్నాడు సత్య . మనఇక్కడికొచ్చింది అడవి లో జీప్ ట్రిప్ కి కాదు. పక్షుల వెంట పడడానికి  అని గిరి అంటుండగా "పులి మన వెంట పడకుండా ఉంటె చాలు"  అన్నాడు సత్య. పులి ఊసెత్త గానే గిరి మండి  పడ్డాడు " సార్ ఏం  చెప్పేరు, మేడమ్ ని  అలిసిపోయేలా తిప్పకూడదు  , పులివూసెత్త కూడదు, గుర్తుందా, ఇంకొకసారి పులిఊసెత్తితే జీపులోంచి తోసేస్తాను " అన్నాడు గిరి.  " మరి నువ్వు కూడా పులి అని అంటుండేవాడివి కదా గిరి ? అంది రెజీనా. " ఇంటి దగ్గర వేరు మేడం ,  లక్ష మాటలు అంటాం , అడవిలో పరాచికాలాడకూడదుకదా ? అన్నాడు గిరి. "ఎటువంటి పరిస్థితుల్లోను ఆడకూడదు కానీ  నాకు పులి భయం లేదు నువ్వు రిలాక్స్ అవ్వు ఆ స్టీరింగ్ ఇలా ఇయ్యి అని గిరిని వెనక సీట్లోకి  పంపి ఆమె స్టీరింగ్ తీసుకుంది  "  గిరి వెనక సీట్లో కూర్చున్నాడు  సత్యపక్కన . జీప్ ని నిలకడగా పొనిస్తున్నది రెజీనా.   సడన్గా " ఆహ్  హ్హ  హ్హ హ్హ  హా  అని పెద్దగా నవ్వేడు సత్య . మేడం గిరి కి చెమటలు పట్టేసాయి పులి ఊసెత్తగానే వొణుకుతున్నాడు చూడండి. అన్నాడు. వాళ్ళ మాటలు ఏం పట్టించుకోకుండా  ఒక అరగంట అడవి ని ఊపిరి తీసుకోవడం మర్చిపోయి  స్టాండ్ కి బిగించిన కెమెరా లా చూస్తూ మైమరచిపోయి నడపసాగింది.  

 చాలా మౌనం తర్వాత , "అడవుల మధ్య అందాల పోటీ పెడితే ఈ అడవే  గెలుస్తుంది. వాట్ ఎన్ అస్టోన్డింగ్ బ్యూటీ." అంది.  "ఆ చెట్లు వంక ఆలా  చూడండి ,ఒక్కసారి దిగి నడుస్తున్నట్టు ఊహిచుకోండి మేడమ్"  అన్నాడు గిరి.  జీప్ ఆపింది రెజినా దిగండి నడుద్దాం అంది రెజీనా " నిజంగానే నడుద్దాం , ఊహించుకోడం ఎందుకు.  థ్రిల్ అనేది అనుభవించాలి ఊహించుకోకూడదు" అంది. ముగ్గురు దిగారు.    ఇంతలో పికిలి పిట్ట కూత  వినిపిపించింది. రోడ్డు దిగి చెట్లలోకి నడుస్తున్నారు.  "మేడం గుర్తు పెట్టుకోండి ఈ ఫారెస్ట్ లో తార్  రోడ్డు , మట్టి రోడ్డు , కాలి  బాటలు మూడు ఉంటాయి . కాలి  బాటలుపట్టుకుని చెట్లమధ్యకి వెళుతున్నప్పుడు డైరెక్షన్ మరిచిపోతే మళ్లి రోడ్డు మీదకు రాడం చాలా కష్టం అంటూ  గిరి ఒక పోస్ట్ పాతాడు.    ఆ పోస్ట్ మీద ఆరంజ్ అండ్ గ్రీన్ ఏరోస్ మాత్రం ఉన్నాయి. ఆరెంజ్ ఏరో బంగాళా వైపు,  గ్రీన్ ఏరో  డీప్ ఫారెస్ట్ వైపు. దిగి ముగ్గురు నడుస్తున్నారు.  ముందు రెజినా నడుస్తున్నది.  గిరి సత్య ఆగిపోయారు . ఆ సంగతి చూసుకోకుండా రెజినా చాలాదూరం వెళ్ళిపోయింది.

ఏయ్ గిరి మేడమ్ జడుసుకుంటుందేమో, మనకోసం వెతుక్కుంటుందేమో అన్నాడు సత్య.  అదే చూద్దాం  మనకోసం ఎలా వెతుక్కుంటుందో చూద్దాం అన్నాడు  గిరి.  "వెతుక్కోలేకపోతే"  అన్నాడు అన్నాడు సత్య  సీరియస్గా మొఖం  పెట్టి . ఒరేయ్ పిచ్చోడా నేను వెర్రోడినికానురా ఇదిగో అంటూ జుబులోంచి విజిల్ తీసి చూబించాడు గిరి. "మరేం విజిల్ వెయ్యి" అని సత్య తొందర చేసాడు. రెండు నిమిషాలు ఆగరా మేడమ్ తెలివితేటలు బయటకొస్తాయి అన్నాడు గిరి. అవున్రా ఈవిడ ఎంత తెలివైనదో చూద్దాం అని హుషారుగా అన్నాడు సత్య కూడా. ఇంతలో వెనక నుంచి ఒక చెయ్యి వచ్చి బుజం మీద తట్టింది. " చూసింది చాలా ఇంకా చూస్తారా ?" పక్కనే రెజీనా. సత్య , గిరి గతుక్కుమన్నారు. మేడం ఎలా వచ్చారు అన్నారు ఇద్దరూ గుటకలు మింగుతూ. చేతిలో కాంపస్ చూబించింది. అయినా వెనుకా ముందు  చూసుకోవాలి కదా , ఒక వేళా కాంపస్ పోతే ఎలా వచ్చేవారు ? అన్నాడు గిరి . నేనెలా వచ్చేదాన్నో తరువాత చెప్తాను గానీ , నేను రాలేకపోతే నువ్వెంచేసేవాడివో అది చెప్పారా అంది రెజినా. గిరి విజిల్ నోట్లో పెట్టుకుని ఊదాడు , పలకలేదు , మళ్ళీ  ప్రయత్నించాడు  విజిల్ మూగగా ఉండిపోయింది. రెజినా అరచేతిలో ఒక చిన్న బాల్ చూబించింది. అది విజిల్ లో ఉండే బాల్. అది చూడగానే గిరి ఏడుపు మొఖం తో " ఇది చాలా మోసం !" అయినా మీచేతిలోకి ఎలా వచ్చింది అన్నాడు ఇందాక నేను డ్రైవింగ్ సీట్ లోకి వచ్చేటప్పుడు నీ విజిల్ కిందపడితే తీసి ఇచ్చాను కదా అప్పుడే ఈ బాల్ లాగేసాను ఇలా అని ఆ ప్లాస్టిక్ విజిల్ చెంపలు రెండు వేరుచేసి అందులో బాల్ పెట్టి విజిల్ వేసి చూబించింది.  గిరి ఇంకా ఏడుపు మొహం తోనే ఉన్నాడు  సత్య మాత్రం డాన్స్ చేస్తున్నాడు. వారు దట్టమైన చెట్లమధ్యలో ఉన్నారు. ఒక్కసారి గిరి రెజీనా మీదకి ఉరికాడు. రెజినాకి దగ్గరలో ఉన్న చెట్టు మీద ఒక ఆకుపచ్చ కొండ చిలువ. కింద పడ్డ ఆమెనే చూస్తోంది. 

ఇద్దరూ వెంటనే లేచి దూరంగా జరిగారు.  అలా ముగ్గురు నడుచుకుంటూ ముందుకు సాగారు. ఇక్కడ కి కొంచం ముందుకి వెళితే ఒక చెరువు వస్తుంది అది మన మొదటి బర్డ్స్ స్పాట్. చాలా పక్షులు వస్తాయి అక్కడికి అన్నాడు గిరి. అటువైపు నడవ సాగారు.  అటువెళుతుంటే  నేల అంతా  బురదగా ఉంది. బూట్లు దిగబడిపోవటం అప్పుడప్పుడు  జారిపోవడం వల్ల ఇబ్బందిగా నడుస్తున్నారు. రెజీనా చిన్నగా అరిచింది " ఈ , పగ్ పగ్ ,  పగ్మార్క్,  వెయిట్ , వెయిట్ " అంది. పగ్  పగ్మార్క్ అంటే ? అన్నాడు గిరి.   చూపుటి  వేలితో నేలకేసి చూబించింది  " సత్య, గిరి ఆశ్చర్యంగా చూసారు.

గిరి రెజినా మెల్లగా ముందుకి నడుస్తున్నారు.   సత్య వెనకే ఉండి  పోయాడు. గిరి సత్య దగ్గరికి వెనక్కి వెళ్ళాడు  సత్యకి కాళ్ళు వణుకుతున్నాయి మేడమ్.  ఏరా సత్తిగా ఇందాక నాకు కాళ్ళు వణుకుతున్నాయి అని అన్నావు. పులి ఎప్పుడో వెళ్లిపోయి ఉంటుంది పదరా.  అన్నాడు గిరి . ముగ్గురు మూడు దిక్కులు చూస్తూ ముందుకు నడుస్తున్నారు. మేడం పులి వెళ్ళిపోయి ఉందంటారా ? వణుకుతూ అడిగాడు.  గిరి పులి లేదు గిలి లేదు అన్నోడిని పాతేయాలి. మనం ఉన్నది నల్లమల అడవిలో . ప్రస్తుతం నల్లమల 68 పులులు ఉన్నాయి . అంత ఖచ్చితంగా మీకెలా తెలుసు అన్నాడు సత్య .  నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వాళ్ళు లెక్క కట్టి ఇంటర్నెట్ లో పెట్టారు .  మన దేశంలో అంతరించిపోతున్న పులి జాతులను కాపాడటానికి 1973 లో టైగర్ రెసెర్వ్స్ ప్రారంభించారు . 9 రిజర్వ్ ల నుండి మొదలుకొని ఈ సంఖ్య  ప్రస్తుతం 50 కి చేరింది. నాగార్జున్‌సాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ భారతదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్. ఈ రిజర్వ్ ఐదు జిల్లాలు, కర్నూలు, ప్రకాశం , గుంటూరు , నల్గొండ , మహబూబ్‌నగర్ జిల్లాల్లో విస్తరించి ఉంది.  ఈ  టైగర్ రిజర్వ్ వైశాల్యం మొత్తం ( బఫర్ జోన్ 700 కిలోమీటర్లు  కోర్  జోన్  2595 కిలోమీటర్లు కలిపి ) 3296  కిలోమీటర్లు.

ఈ అడవి పెరిఫెరల్ జోన్ 552 కిలోమీటర్లు. మన బంగాళా, విలేజ్ పెరిఫెరల్ జోన్ చివరలో బఅఫర్ జోన్ దగ్గర్లో ఉన్నాయి. టైగర్స్ కోర్ జోన్ లోనే ఉంటాయి. బఫర్ జోన్ లోకి అప్పుడప్పుడూ వస్తుంటాయి. అంది.  అయితే అన్నే తెలుసు కునే వచ్చారా మేడమ్.  అన్నాడు సత్య. ఆ పులి వాళ్ళను చూడలేదు . దూరంగా ఏదో జంతువుని చూస్తూ  ఒక్కసారిగా అటు లంఘించింది.

  ఆ చెరువు మధ్య ఒక చెట్టు ఉంది , కొమ్మలు బాగా విస్తరించి ఉన్నాయి. ఆ కొమ్మలనిండా అనేక పక్షులు కూర్చొని ఉన్నాయి. ఇదే మన బర్డ్ స్పాట్ 1 అంది అక్కడ ఒక పోస్ట్ పాతేడు . గిరి రికార్డింగ్ స్టార్ట్ చేద్దాం. అంది  రెజీనా. అంటే పక్షులు చెరువులో చెట్టుమీద ఉన్నాయి కదా రికార్డింగ్ ఎలా  చేస్తాము? అన్నాడు గిరి . డిస్టెన్స్ రికార్డింగ్ ఎక్విప్మెంట్ ఉంది మన దగ్గర. ఆ బేగ్ ఇలా ఇయ్యి  అంది . గిరి బేగ్ ఇచ్చాడు. సత్య ఒక చెట్టుకింద కూచుని తినడం స్టార్ట్ చేసాడు. రెజినా బేగ్ లోంచి రిమోట్ మైక్రోఫోన్ తీసింది మనం ఇది వాడాలి అంది. ఇవన్నీ ఏంటి బేగ్ లో చాలా ఉన్నాయి అడిగాడు గిరి.  ఇది రీఛార్జబుల్  8 జి బి  డిజిటల్ రికార్డర్, ఇది మినీ పెండెంట్ రికార్డర్ అని చూబించింది.  ఇన్నెందుకు అన్నాడు గిరి  అవసరాన్ని బట్టి అంది రెజినా . ఈ చిన్న రిమోట్ మైక్రోఫోన్ ని ఆ చెట్టుమీద పెడితే ఆ సౌండ్ ఇక్కడ రికార్డుల అవుతుంది అంది.   కానీ ఆ చెట్టు చాలా దూరం లో ఉందే అన్నాడు. చాలా దూరం కాదు 300 మీటర్స్ దూరంలో ఉండచ్చు. ఈ మైక్రోఫోన్ 1000 మీటర్లు దూరం సిగ్నల్స్ పంపగలదు. ఆహా ఏమి టెక్నాలజీ ,  ఇప్పుడు నేను చెరువులో ఈదుకుంటూ వెళ్లి ఆ చెట్టెక్కి  ఈ మైక్రోఫోన్ అక్కడ పెట్టి వస్తాను. అన్నాడు చెట్టు వంక చూస్తూ , వెనక్కి తిరిగి చూసేసరికి చేతులో క్రాస్ బో తో రెజినా టెలి లెన్స్ నుంచి చూస్తూ ఒక్క బాణం వదిలింది .

ఆ బాణం నేరుగా పోయి పక్షులు కూర్చున్న కొమ్మ లోకి నాటుకుంది. ఒక్క సారిగా అనేక  పక్షులు ఎగిరి పోయాయి, కాస్సేపటిలో మళ్లీ అదే కొమ్మమీద వాలాయి.  ఆమె బాణం ఎందుకు వేసిందో అర్ధం కాలేదు. అదే అడిగాడు గిరి . బేగ్ లోంచి ఒక బినాయకులర్స్ తీసి ఇచ్చింది చూడమని. గిరి కి ఆ కొమ్మకి గుచ్చుకున్న శరానికి  ఒక మైక్రోఫోన్ కనిపించింది. అదే సమయంలో చేతులో ఉన్న రిమోట్ నొక్కగానే మైక్రోఫోన్ కి ఉన్న లైట్ వెలిగింది . హేండ్ సెట్ గిరి చెవి దగ్గర పెట్టింది. పక్షుల అరుపులు వినిపిస్తున్నాయి. రికార్డింగ్ అవుతున్నది అని సైగ చేసింది. ఈ లోపున సత్య తినడం ముగించి వచ్చి , చేతిలో బాణాలేమిటి ? ఇక్కడ జంతువులని వేటాడడం నేరం.  అని అరవసాగాడు. రికార్డింగ్ అవుతున్నది అంది గిరి సత్య నోరు ముయ్యబోయాడు. గిరి ఎం పర్వాలేదు. అక్కడి నుంచి వచ్చిన ఎలెక్ట్రిక్ సిగ్నల్స్ నే తీసుకుంటుంది. మాట్లాడినా మీ పర్వాలేదు. " సరే మేడం , మరి ఆ బాణం ఎప్పుడు తేవాలి , రికార్డింగ్ అయినా తర్వాత తేవాలా ?  అక్కరలేదు , దానికి 16 గంటలు బేటరీ బేకప్ ఉంది. మనం వెళ్లే టప్పుడు , ఏరో కూడా తేవక్కరలేదు. రిమోట్ తో మైక్రోఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయచ్చు ఇంకో స్పాట్ కి వెళదామా. అంది " టైం ఒంటిగంట కావస్తోంది , నేను ఫుడ్ తెస్తాను తినేసి వెళదాము" అన్నాడు గిరి. ఈ అడవిలో హోటల్స్ ఉంటాయా ? అంది . గిరి పడి పడి నవ్వాడు.   హోటల్స్ ఇక్కడెందుకుంటాయి మేడమ్ , ఇక్క డ నేరేడు, రేగు, సపోటా  చెట్లు ఉన్నాయి , ఇంకా ఇక్కడ లేత వెదురు ఆకులు చాలా బాగుంటాయి. నేనెళ్ళి పటు కొస్తాను  అని గిరి అంటుండగా " ఇక్కడ అరటి తోటలు లేవా ? మంచి అరటి పళ్ళు ఉంటె తేరా అన్నాడు." అన్నాడు సత్య . "చక్కర కేళీ లు తెమ్మంటావా , మామూలువి సరిపోతాయా ? అని సత్యతో అని రేగినావైపు తిరిగి " ఆ చెట్టుకి వేసిన బాణం మరొక్కటి ఉంటె ఇవ్వండి మేడం  వాడికి వేసేస్తాను. " అని  దరిద్రుడా !! అని తిట్టుకుంటూ బయలుదేరాడు. గిరి తెచ్చిన పళ్ళు చెట్టునీడలో  కూర్చుని మెల్లగా తిన్నారు. లంచ్ ఇంత బాగుంటుంది అని అనుకోలేదు  అంది రెజీనా . మీరు  ఈ చెట్టు నీడలో రిలాక్స్ అవ్వండి అని ఆమెతో చెప్పి వెనక్కి పరిగెత్తుకువెళ్లి జీప్ తీసుకు వచ్చాడు.

జీప్ బయలుదేరింది ఒక అరగంట ప్రయాణం తరువాత ఒక చిన్న రోడ్డులోకి తిరిగింది . అక్కడ జీప్ తిప్పి ఒక పోస్ట్ పాతరా సత్తి  అన్నాడు . సత్య దిగి ఒక పోస్ట్ పాతాడు. జీప్ ముందుకు పోతుంటే ఇక్కడేముంది అంది  , అంటుండగానే జీప్ ఆగింది . దిగండి మేడమ్జీ అంటూ గిరి జీప్ లోంచి దిగిపోయాడు. సత్య కూడా దిగి గిరి వెంట నడవసాగాడు . మెల్లగా తన బేగ్ తీసుకుని దిగిన రెజీనా తన కళ్ళని తానే నమ్మ లేక పోయింది. ఎదురుగా ఆకాశగంగ లా అద్భుతమైన జలపాతం. మనుచరిత్ర లో అల్లసాని పెద్దన గారి పద్యం "అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ పటల ముహుర్ముహుర్ లుఠ దభంగ తరంగ ".. అంటే ఇదేనేమో  అనుకుంది. చుటూ ఆకాశాన్ని తాకే పెద్ద చెట్లు , పెద్ద చెట్ల మీద చిన్న పిట్టలు. ఆకాశం అంత ఎత్తులో , కంటికి కనిపించని చిన్న పిట్టలు , వినిపించి వినిపించని కూతలు , గుండె తలుపులను తట్టాయి. ఆనందంతో , ఉద్విగ్నంగా గుండెలు ఎగిసి పడుతుండగా .   థాంక్ యు గిరి అండ్ సత్య . మన రావలిసింది చోటుకే వచ్చాము.
అంటూ ఈ బర్డ్ సాంగ్స్ రికార్డ్ చెయ్యాలి అని బేగ్ లోంచి పెరబోలిక్ మైక్రోఫోన్ తీసుకుని వాటర్ ఫాల్ వైపు పరిగెత్తింది. మేడం బర్డ్ సాంగ్స్ అంటున్నారు అస్సలు ఒక్క పిట్టా  కనిపించడం లేదు. అని గిరి అనగానే పరిగెడుతున్న ఆమె వెనక్కి చూడకుండా తన వద్ద ఉన్న బినాక్లాస్  గిరికి అందేలా విసిరేసింది.  గిరి బినాక్లాస్ తో చెట్టు మీదకి చూసాడు. ఆకాశాన్ని ముద్దాడుతున్నట్లు  ఉన్న వృక్ష శిఖరాల లో కూచుని ఉన్న అందాల రంగు రంగుల  పక్షులు ఏ బ్యూటీ పార్లర్ అవసరం లేని బ్యూటీస్ , ఏ సంగీతం కోర్సు అవసరంలేని గాయకులూ , గాయకురాళ్లు లా కనిపించాయి.

ఒక రాయి మీద నిలబడి చేతిలో పేరాబోలిక్ మైక్ ని కుడిచేత్తో చెట్ల  శిఖరాలవైపు చూపుతూ ఎత్తి పట్టుకుని రికార్డింగ్ ప్రారంభించింది. పరిగెత్తులు వెళ్లి గిరి కూడా  ఆమెపక్కనే నిలబడి ఆసక్తిగా తిలకించ సాగాడు. " మేడమ్ , ఇదేంటి కొత్తరకం మైకా ? అన్నాడు. అవును దీన్ని పేరాబోలిక్ మైక్రోఫోన్ అంటారు. అని హెడ్ఫోన్స్ గిరి చెవులకి అమర్చింది. " అద్భుతం , ఎక్కడో ఆకాశంలో చిటారుకొమ్మన కూస్తున్న పిట్ట నా  బుజం మీద కూర్చుని కూస్తున్నట్టుంది " అన్నాడు గిరి .  మరదే, పేరాబోలిక్ మైక్రోఫోన్ అంటే  వందల మీటర్ల దూరంలో ఉన్న చిన్న సౌండ్ ని కూడా రికార్డ్ చేయగలగడమే దీని గొప్పతనం. అంది రెజీనా .

" ఎందుకురా అంత ఎక్సయిట్ అవుతావు , ఇవన్నీ  ఎప్పుడో కాచి వడబోసేసాను , అన్నాడు సత్య. రెజీనా ఆశ్చర్యంగా అవునా అన్నట్టు చూస్తోంది.  అప్పుడు గిరి అన్నాడు " అవును మేడమ్ సత్య గురించి సమంగా చెప్పలేదుకదా వీడు మామూలోడు కాదు ,  బి టెక్ ఎలక్ట్రానిక్స్ .. (కాస్సేపాగి)  .....అని చెప్పుకుంటుంటాడు, పెద్ద ....అని కాస్సేపాగి  బోకు అన్నాడు . వాళ్లిద్దరూ  ఒకరినొకరు గుర్రుగా చూసుకుంటుంటే రెజీనా కి నవ్వాగలేదు. "నేను పూర్తిగా రిలాక్స్ అయ్యాను వియ్ నీడ్ యు సత్య అంది రెజీనా" థాంక్స్ మేడమ్ సార్ కూడా ఇలాగే అంటూ ఉంటారు అన్నాడు సత్య . రెజీనా మళ్ళీ  నవ్వింది.

కొద్దీ సేపు రికార్డింగ్ చేసి టైం చూసుకుంది రెజినా.  గిరి టైం 3 గంటలు అయ్యింది ఇంకా ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి అంది రెజీనా. మొత్తం ఒక పది అనుకున్నాము. ఈ రోజుకి ఇంకొకటో రెండో చూడొచ్చు,  కోర్ ఫారెస్ట్ మినహాయించి బఫర్ ఫారెస్ట్ లో మనం ఇంకొంచెం లోపలి వెళదాము అన్నాడు  గిరి .  ఇంకా.... లోపలికా  డేష్ లు  ఉంటె ? అన్నాడు భయంగా మొహం పెట్టి సత్య. డేష్ లు అంటే అంది రెజీనా.  చెప్తే గిరి గాడు నన్ను జీపులోంచి తోసేస్తాడు. పర్వాలేదురా ఇప్పుడు జీపులో లేం కదా  అన్నాడు . అదే పులి ఉంటె , అన్ని పులులు ఇందాక కనిపించిన పులిలాగ వెళ్ళిపోతాయని గేరంటీ ఏమిటి ? అది మంచిది కాబట్టి వెళ్లి పోయింది . అన్నాడు సత్య . నన్ను నమ్మండి మేడం , సార్ కి పర్సనల్ అసిస్టెంట్ గా నన్ను పెట్టుకున్నది నేను అవుట్ స్టాండింగ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అని, ఆడు ఉత్త డ్రైవర్ . అన్నాడు సత్య  " అనసూయకి చెప్పే మాటలు మాకు చెప్పకురా , మేం నమ్మం " అన్నాడు గిరి . " అది మాత్రం నమ్మిందేటి?" గొణుక్కున్నాడు సత్య. అందరూ జీప్ ఎక్కేసారు. జీప్ బయలుదేరింది.  రెజీనా అంది " గిరి, మిగితా ఎనిమిది స్పాట్స్ జీప్ లోంచే చూబించేయి. అలా కుదురు తుందా? టైం సరిపోతుందా ? "  4 గంటలకి తిరుగు ప్రయాణం మొదలు పెట్టాలని అనుకున్నాను. కాకపోతే , మిగితా స్పాట్స్ అన్నీ చూడాలంటె 5 గంటలకి బయలుదేరాలి , 5 గంటలకి బయలుదేరిన 7 గంటలకి ఇంట్లో ఉంటాము. జీప్ వేగం పుంజుకొంది . పది నిమిషాలు తర్వాత జీప్ ఆగింది . గిరి దిగి ఒక పోస్ట్ పాతేడు. పర్వాలేదు మేడమ్ దిగి చూడొచ్చు. రెజీనా దిగి సెల్ ఫోన్ తో ఫోటో తీసుకుని , ఫోటో మీద నెంబర్ 3 అని ఎడిటింగ్ టూల్ తో రాసుకుంది . ఆరు స్పాట్స్ ఇలాగే  జరిగింది . మొత్తం ఎనిమిది స్పాట్స్ అయ్యాయి ఇంకా రెండు స్పాట్స్ చూస్తే వెనక్కి వెళ్లి పోవచ్చు అన్నాడు సత్య . టైం నాలుగున్నర అయ్యింది , ఇంకా ఇరవయి కిలో మీటలు వెళ్ళాలి లాస్ట్ స్పాట్ , అదేం అంత కష్టం కాదు అన్నాడు.  గిరి

అనుకున్న పని పూర్తి అయితే  చాలా హేపీగా ఉంటుంది. అంది రెజినా.  మీరు కావలిస్తే కాస్సేపు రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు అన్నాడు గిరి. లేటైతే అనసూయ భాద పడుతుంది  ఫోన్ చేసి  చెపుదామంటే ఈ అడవిలో సిగ్నల్స్ ఉండవు . అని సత్య అంటుండగా  గిరి అడిగాడు " మరి ఎందుకురా సెల్ ఫోన్ జేబులో పెట్టుకుని తిరడగడం ? భలేవాడివే స్మార్ట్ ఫోన్ తో ఎన్నో పనులుంటాయి. అన్నాడు సత్య. ఏవుంటాయిరా , వీడియోలు చూడడమేగా ఇలా సాగుతోంది సంభాషణ.  పదే పదే అనసూయాగురించి మాట్లాడడం, ఆమె బాధ పడుతుంది అని అనడం వల్ల సంభాషణ భారం గా అయిపోతోందని  టాపిక్ డైవర్ట్ చేయడానికి  కావాలనే గిరి గొడవ పెట్టుకున్నాడు.

గొడవ ముగిసింది , జీపాగింది. మేడమ్ దిగండి  ఇది స్పాట్ నెంబర్ 10 వెళ్లే టప్పుడు స్పాట్ నంబర్  9 చూబిస్తాను. అన్నాడు  సూర్యుడి తీక్షణత తగ్గింది . కానీ చాలా వెలుతురూ ఉంది. " చాలా బాగా టైం మెంటైన్ చేస్తున్నావు.  అని మెచ్చుకొంది రెజీనా , అవును మేడమ్ మంచి స్పీడ్ నడుపుతాడు, ఇదివరకు ట్రావెల్స్ బస్సులు నడిపేవాడు. వోల్వో బస్సులు నడిపేవాడు. " నేను బస్సు డ్రైవెర్న్య్ అని చెప్పడం అంత అవసరమా ? గొడవకు దిగాడు గిరి. ఇవేం పట్టించుకోకుండా  రెజీనా కెమెరా తో కదిలిపోయింది , ఆమెని కదిలించే దృశ్యాల్ని బంధించడానికి . అప్పుడే చింకారా ( పెద్ద కొమ్ముల లేడి ) దుముకుతోంది. రెజినా కెమెరా క్లిక్ మంది.

మేడం ఇక్కడెవ్వరూ ఇలా తిరగరు ఇలాటి చోట మీరు ఫ్రీగా ఫోటోగ్రఫి మొదలెట్టారు. ఇక్కడ ఎలుగు బంట్లు ఉంటాయి తెలుసా  అన్నాడు సత్య. ఎలుగు బంట్లు వస్తే ఏంచేయాలో కూడా తెలుసు అరిచింది రెజీనా. ఇంకా లాభం లేదని ఇద్దరూ రెజీనా వెనక పరిగెత్తడం ప్రారంభించారు.  ఇంతలో మొరొక లేడి , కనిపించింది. నాలుగు కొమ్ముల లేడి.  బలేగుంది అన్నాడు సత్య . దీన్ని చాసింగా (chousingha)అంటారు అంది రెజీనా. ఆలా కనిపిస్తున్న జంతువులని ఫోటోలు తీకుంటూ ముందుకు సాగుతుండగా...చెట్ల వెనక ఏదో అలికిడి అయ్యింది . ఒక జత నల్ల బూట్లు చెట్టు చాటున కనిపించాయి . దగ్గరికి వెళ్ళబోయింది. మేడం ఆ చెట్లలోకి వెళ్ళకండి అని గిరి అరిచాడు . వెనక్కి తిరిచూసి మళ్ళీ చెట్టుచాటున చూసేసరికి ఎవరో పారిపోతూ కనిపించారు. గిరి దగ్గరకి వచ్చాడు " మేడం ఏవయ్యింది ?" అన్నాడు . " నన్ను ఎవరో గమనిస్తున్నారు  , ఇదిగో నేను చూడగానే పారిపోయాడు అంది. అంతా  మీ బ్రమ  అలా చూడండి , అక్కడ ఉన్నది ఇద్దరు పిల్లలు . ఈ పక్కనే చెంచుల గూడెం. వాళ్ళు చెంచుల పిల్లలు  ఇక్కడ  చెంచు  కుటుంబాలు ఒక పది ఉన్నాయి.  రేజీనా కెమెరా తో  పిల్లల ఫోటోలు తీసుకుంది.
" ఇక్కడ చెంచులు  ఫారెట్ డిపార్ట్మెంట్ మనుషులు . వేకువజామునే బయలుదేరి పులి  అవశేషాలు , అంటే తిని వదిలేసినవి అలాగే విసర్జకాలు ఏరుతారు. " అందు వల్ల వాళ్ళకేంటి లాభం? అంది రెజీనా . మేడమ్ వాళ్ళది జాబ్ . అన్నాడు సత్య . ఇలాంటి జాబ్స్ కూడా ఉంటాయా ? అంది రెజీనా ఆశ్చర్యంగా . " మేడమ్ ఉదయాన్నే వస్తే ఇక్కడ పక్షులు కనిపిస్తాయి. ఇక్కడికి ఒక్కోసారి ఫోటో జర్నలిస్టులు కూడా వస్తుంటారు  అన్నాడు గిరి ఎత్తైన కొమ్మలమీద ఉన్న  కొన్ని పక్షుల ఫొటోస్ తీసుకుంటోంది రెజీనా. " అడవిలో తిరిగే హాబీలు  ఉన్నాయంటే నమ్ముతారు జాబ్స్ ఉన్నాయంటే నమ్మరా ?  మీకు ఉన్నహాబీ ఎంత భయంకరమైనదో తెలుసా? దీనివల్ల మీకు లాభం ఏంటి అని ఎవరైనా అడిగితే మీరు ఎం సమాధానం చెప్తారు ? అన్నాడు సత్య. "హాబీలే ఉండాలి జాబ్స్  ఉండకూడదని నేను అనలేదు సత్య , కానీ నా హాబీ వల్ల  నీకు వచ్చిన నష్టం ఏంటి? "అంది .  నష్టమా , ప్రమాదం , సింహం వస్తే  నా  ప్రాణానికే ప్రమాదం. అన్నాడు సత్య  ఈ అడవిలో సింహాలు లేవు.  అంది రెజీనా. మేడం పులి కంటే సింహం బలమైనది  కదా  అన్నాడు గిరి.  "కాదు , సింహం ఎన్నిసార్లు పోరాడిన పులిని గెలవలేదు , పైగా సింహం పులి అంత ధైర్యశాలి కాదు. వంటరిగా వేటకు పోదు గుంపులు గుంపులుగా పోతుంది."  అంది రెజీనా . అప్పుడు సత్య అన్నాడు " మరి సినిమాలో, సింహం ఎప్పుడు సింగల్ గా వస్తుంది అని ఎందుకు చెప్పాడు " అన్నాడు సత్య.     గిరి గుర్రుగా చూసాడు  "ఒరేయ్ నువ్వు అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ వి కాదు రా , ఔట్ సైడ్ స్టాండింగ్ స్టూడెంట్ విరా." అన్నాడు . అందరూ జీప్ వైపు వెళ్ళసాగారు. జీప్ కదులుతుంటే ఒక పెద్ద కొమ్ముల లేడి కనిపించింది . దీన్ని సాంబార్ ( Sambar) అంటారు మేడం . ఫోటో తీసుకుంటారా ? అని జీప్ ఆపేడు. కిటికీలోంచి ఒక ఫోటో తీసుకుని , గిరి దీన్ని సాంబార్ అనరు, సాంభర్ అంటారు. అంది

ఈ స్పాట్ గుర్తు ఉంచుకోండి మేడమ్. అవును ఉదయాన్నే ఇక్కడుండాలి అంతే  కదా. అది కాదండి  ఈ చెంచులు తో జాగ్రత్తగా ఉండాలి. " అంటే ? " అంటే  ఎదో చేస్తారని కాదు  వీళ్ళకి  బాణామతి చిల్లంగి లాంటి విద్యలు .. సరే గిరి   ఎన్నిటి కానీ భయపడతాం అంది  రెజీనా నవ్వుతు.  "ఉదయానే రావాలంటే కష్టమేమో ?" అన్నాడు సత్య . " ఎవరికీ నీకా?" అన్నాడు గిరి ." మీ ఇద్దరూ  రావక్కరలేదు నేను వంటరిగా వెళ్ళగలను. ఉదయమే కాదు రాత్రి కూడా పని ఉంటుంది . "  రాత్రా అడవిలోనా ? అన్నారు ఇద్దరూ . అవును కొన్ని పక్షులు రాత్రే పా డతాయి.  నార్తెన్ మాకింగ్ బర్డ్ , హెర్మిట్ త్రష్ ,  ఈస్ట్రన్ విప్ పూర్ విల్ , నైట్ హెరాన్ , కామన్ నైటింగేల్  లాంటి అనేక పక్షులు  నైట్ సింగింగ్ బర్డ్స్ గా ప్రసిద్ధి. అంది  " ప్రసిద్దా ? నేను అసలు వీటి పేర్లే వినలేదు ?" అన్నాడు. సత్య . "మీరు చెపుతుంటే పక్షులగురించి చాలా తెలుసుకుంటున్నానండి"  అన్నాడు గిరి.   నార్తెన్ మాకింగ్ అనేక స్వరాలూ , అనేక నోట్స్ పాడటమే కాక తరుచు కొత్త ట్యూన్ కి మారిపోతూ తన పాడేశక్తిని చూపుతుంది. అనే అనేక భాషలు మాట్లాడే వారిని పోలిగ్లోట్ అంటారు.   అందుకే నార్తెన్ మాకింగ్ బర్డ్ని  మైమస్ పోలిగ్లోట్టస్  అంటారు.  అద్దర్రాత్రి పాడటం ఏంటి చిరాగ్గా ? ఎవడు వింటాడు ? దేవుడు ఇలాటి వేస్ట్ పనులు ఎందుకు చేస్తాడండీ ? అన్నాడు సత్య  హెర్మిట్ త్రష్ కేవలం వేకువజామునే పాడుతుంది. పక్షులు కోర్టుషిప్ రిట్యువల్స్, వాటి టైం  ఎంతపద్ధతిగా పాటిస్తాయో తెలుసా. ఋతువులని , సమయాన్ని పాటిస్తూ ఎంతో క్రమ శిక్షణగా మెలుగుతాయి   మనకి అవి కావాలి అనుకుంటే క్రమశిక్షణ పాటించాలి. ఫింగర్ లేక్స్ నడిబొడ్డున ఉన్న   ఆర్నిథాలజీ లేబ్ నుండి సౌండ్ రికార్డింగ్ నేర్చుకున్నాను. కొన్ని వర్క్‌షాప్లకి వెళ్లి  ఈ విషయాలు నేర్చుకోగలిగాను.   కార్నెల్ ల్యాబ్ ని ఉందిలే . అది ఒక  ఆర్నిథాలజీ కాలేజీకి సంబంధించింది.  వర్క్ షాప్ సూర్యోదయానికి ముందే   ప్రారంభం అవుతుంది. అని చెప్పుకొస్తోంది రెజీనా  " అంత  ఉదయాన్నే అంటే కష్టమే!  ఏం పెడతాడు తినడానికి ? ఆడు పెడతాడా మనం పట్టుకెళ్లి పోడమేనా ?" అన్నాడు సత్య. వర్క్ షాప్ అంటే క్లాస్ లో కాదు.  ప్రతి రోజు మైదానంలో ప్రారంభమవుతుంది, డాన్ కోరస్  ఉదయాన్నే పక్షుల అరుపులు వినడం  పక్షుల పాటలను   రికార్డ్   చెయ్యడం నేర్చుకున్నాను . జీప్ దూసుకు పోతోంది.

 ఇంతలో చనిపోయిన  పిల్ల ఏనుగు కనిపించింది. రోడ్డు పక్కాగా ఒక చెరువు వద్ద పడి ఉంది. అయ్యో ! ఎలా చచ్చి పోయింది  చిన్న పిల్ల . అంది రెజీనా . జీప్ ఆపు అంది . జీప్ స్లో చేసాడు ,  లాభం లేదు మేడం చచ్చిపోయి రెండురోజులు అయ్యి ఉండొచ్చు , నీటిలో అమోనియా కలిపేస్తారు , రంగు వాసనా కూడా ఉండదు , అవి తాగి ఈ అమాయక జీవులు చనిపోతాయి . ఆ దంతాలు కోసం , ఈ పని చేస్తారు.  కొంచెం సేపు అంతా మౌనం . కొంత సేపు తర్వాత గిరి అన్నాడు.  స్పాట్ నంబర్ 9 వచ్చేస్తోంది . కొంచం ముందుకి వెళ్లి  ఇక్కడ లెఫ్ట్ కి తిరుగుతున్నాము. అని జీప్ ఆపి సత్తి , అని పిలిచాడు గిరి. ఇంకేంచెప్పకు ఇప్పుడు నాకు పూర్తిగా డిసిప్లిన్ వచ్చేసింది. అని జీప్ దిగి ఒక పోస్ట్ పాతాడు.   జీప్ పక్కకి తిరిగింది . అదంతా ఎర్రమట్టి రోడ్డు. ఇక్కడ  ఒక్కసారి నడవాలనుంది . ఎందుకు మేడమ్ నడవటం జీప్ వెళుతుంది.   షిన్రిన్  యోకు అనే మాట విన్నావా గిరి . జాపనీస్ భాషలో షిన్రిన్ అంటే అడవి , యోకు అంటే స్నానం , అంటే ఫారెస్ట్ బాత్ అన్నమాట. ఇప్పుడు టైం 5. 30 ఐయ్యింది.  5. 40 కి జీప్ బయలుదేరితే 6. 40 కి బంగాళా కి చేరిపోతాము. అన్నాడు గిరి.  మీరు కూడా రండి అంది రెజీనా. ముగ్గురూ దిగి నడుస్తున్నారు.

"ఇక్కడేదో పాడుబడిన గుడిలా ఉందే, అడవుల్లో దేవాలయాలు ఉండటం చాలా ఆశ్చర్యంగా ఉంది." గుడి  పూరాతనమైనదే కానీ పాడుబడిపోలేదు.  ఈగుడిని వేరేచోటకి మార్చేశారు. ఇంతకీ ఇక్కడికి పక్షులు వస్తాయా? ఇక్కడకి బాగా వలస పక్షులు వస్తాయంటారు. ముగ్గురు నడుస్తూ జీప్ వద్దకు వచ్చేసారు.  అడవుల్లో దేవాలయాలు ఉండటం చాలా ఆశ్చర్యంగా ఉంది. మళ్ళీ అంది.  "అడవుల్లో కాదు టైగర్ రిజర్వ్ లలో కూడా దేవాలయాలున్నాయి." అన్నాడు సత్య  వన్యప్రాణుల  మానవ సంచారం  తగ్గించే ప్రయత్నంలో ఈ మధ్యనే బండిపూర్ టైగర్ రిజర్వ్ లోపల ఉన్న కొన్ని దేవాలయాలను అటవీ అంచుకు అటవీ శాఖ మార్చేసింది. అనే వార్త లు వచ్చాయి.   అదే విధంగా ఇక్కడి శివాలయాన్ని కూడా మార్చేశారు.  ఆ మార్చే సింది ఎక్కడికో కాదు మన  విల్లెజ్ లోకే. అంతా జీప్ ఎక్కారు జీప్ కదిలింది . డైరెక్ట్ గా బంగాళాకే అన్నాడు సత్య. ఒక నలభై నిమిషాల పాటు  అంతా మౌనం. వెలుతురు  తగ్గిపోతున్నాడని గిరి హెడ్లైట్స్ ఆన్ చేసాడు. ఒక ముప్పై మంది ఒక లారీలో నుంచుని ఉన్నారు , లారీ రోడ్డు దాటుతున్నది. వీళ్ళందరూ వుడ్ కటింగ్ బ్యాచ్ , రెడ్ సేండర్స్  స్ముగ్గ్లింగ్ ముఠా, లేకపోతే ఇప్పుడు వేళ్ళకి అడవిలోకి ఏంపని ? అన్నాడు . నీది పోలీస్ బ్రెయిన్ గిరి అంది రెజీనా.  కాస్సేపట్లో బంగాళా వచ్చేసింది. 

1 comment:

  1. ఒక వైపు అడవి అందాలను ఆస్వాదిస్తూ మరో వైపు భయానక సంఘటనలు ఎదుర్కొంటూ అడవిలో కథానాయిక ప్రయాణం ఉత్కంఠభరితంగా, ఆసక్తికరంగా సాగుతుంది.నల్లమల అడవి గురించి చాలా బాగా వివరించారు.తెలుగులో రాస్తున్నందుకు ధన్యవాదములు.అర్థం చేసుుుుకోగలుగుతున్నాము.ఆస్వాదించగలుగుతున్నాము.

    ReplyDelete