Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Wednesday, June 10, 2020

Anveshana 2020 Scene 11

" ఫారెస్ట్ కి పోనీయ్ రా గిరి , మేడం కి డీప్ ఫారెస్ట్ చూబిద్దాం  సార్ ఆజ్ఞ అయ్యింది కదా " అన్నాడు సత్య.    " వద్దురా బంగళాకి పోనీయ్ రా భోంచేసి మద్యాన్నిచ్చి వెళదాం అడవిలోకి , తొందరేముంది ,  పక్షులు ఎక్కడికీ పోవు అడవీ ఎక్కడికీ పోదు " అన్నాడు సత్య."  అనసూయ ఎక్కడికీ  పోదు బంగాళా ఎక్కడికీ పోదు , ముందు అడవిలోకెళ్ళి, బర్డ్ స్పాట్స్ , ఏనిమల్  స్పాట్స్ చూసి , డైరెక్షన్ పోస్టులు పాతి  ఫొటోస్ తీసుకుని అప్పుడు బంగళాకి " అన్నాడు గిరి  " బలే వాడివే , స్టేషన్ కి వెళ్లే తప్పుడు వాగులు చూడలేదా ఎలా ఉన్నాయో, అయినా అడవిలోకి జీప్ వెళ్లదని నువ్వేకదా చెప్పావు" అన్నాడు సత్య మొహం సీరియస్ గా పెట్టి. " జీప్ వెళ్ళదు , మనమే వెళతాం , నడుచుకుంటూ " అన్నాడు గిరి.  ఆమ్మో నడుచుకుంటూ నా,  నడుచుకుంటూ అయితే నే రాలేను , నన్ను బంగళాలో దింపేయ్ , కావలిస్తే మీ ఇద్దరు వెళ్ళండి. "ఎదవ ఐడియాలు వెయ్యకురా సత్తిగా , అని రెజీనా వైపు తిరిగి , మేడం వీడు ఇప్పుడు బంగళాకి ఎందుకు వెళతాను అంటున్నాడో తెలుసా ? అన్నాడు . ఏమో , ఏదైనా మధ్యలో ఆపేసిన  బుక్ చదువుకోవాలేమో , ఊరుకోండి మేడం , వీడు ఎగ్జామ్ ముందురోజు కూడా చదివడు , అనసూయని కెలికేద్దామని వీడీప్లాన్   అంటూ సత్య వైపు తిరిగి  ఒరేయ్ సత్తిగా పగటి కలలు  కంటున్నావురా . " గిరి విలేజ్ లోకి పోనీయ్ , నెమలి దగ్గరికి. " అంది .జీప్ నెమలి ఇంటిముందు ఆగింది. అదృష్ట వశాత్తు హెడ్మాన్ లేడు.

నెమలి ఆకుపచ్చ చీర కట్టుకొని ఇంటి ఆవరణ లో ఉన్న తోటలో  ఉంది. పచ్చని మొక్కల్లో కలిసిపోయింది. నెమలి ఇంట్లో ప్రత్యేకత పెద్ద ఆవరణ, చెట్లు , మొక్కలు ముఖ్యంగా గేట్  దగ్గర ఉండే బోగన్ విల్లా. నెమలి వారిని చూసి  పలకరింపుగా నవ్వింది. రెజీనా కూడా నవ్వి "యు అర్ లైక్ కమీలియాన్" అంది. కమెడియన్ ఇంట్లో లేడనుకుంటాను మెల్లగా గొణిగాడు సత్య.   "కమీలియాన్ కి కమీడియన్ కి తేడా తెలీదు , ఎప్పుడు ఎం మాట్లాడాలో తెలీదు షట్అప్!!" అంది రెజీనా  సత్య కి మాత్రమే వినబడేలా. నెమలి చేస్తున్న పని ఆపేసి లోపలికి రండి అంది. మేము ఎందుకులెండి , మేము బయట ఉంటాము. అన్నాడు గిరి .  దమ్ముకొట్టుకోడానికేగా , అది కాఫీ తాగాకైనా కొట్టుకోవచ్చు. రండి కాఫీ తాగి వెళ్ళండి, సత్య నువ్వు కూడా రా, అంటూ లోపలి తీసుకెళ్లింది.   ముగ్గురూ హలో ఉండే సోఫాలో కూర్చున్నారు. కాసేపట్లో నెమలి కాఫీ తెచ్చింది.   గార్డెనింగ్ మీ హాబీ నా ? అంది రెజీనా .      "ఊ , తినడం హాబీ అవుతుందా? అది కిచెన్ గార్డెన్ , కూరగాయలు పండిస్తున్నాను. రైల్వే స్టేషన్ నుంచి వస్తున్నారా? గెస్ట్ ఎవరూ రాలేదు మీతో అంటే ఎవరినో  డ్రాప్ చేశారు , ఎవరిని చేసుంటారు...  అనసూయని డ్రాప్ చేసే  అవకాశం లేదు, అయితే జగపతిని డ్రాప్ చేసి ఉంటారు. బంగాళాకి వెళుతున్నారా, అడవికి వెళుతున్నారా ? "
అయ్యబాబోయ్ మీరు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండాల్సింది. అన్నాడు గిరి. అక్కా పోలీస్ ట్రైనింగ్ ఏవన్నా తీసుకున్నావా ? లేకపోతే ట్రైనింగ్ మధ్యలో పారిపోయివచ్చేసావా? అన్నాడు సత్య . "నేను పారిపోయే రకం కాదు , పారిపోయే రకం గిరి. అయినా పోలీస్ ట్రైనింగ్ అయినా కుక్క బంగాళా లో ఉండగా  మనుషులకి కూడా ఎందుకులే పోలీస్ ట్రైనింగ్?" హాస్యం ఆడుతున్నట్టుగా అంది నెమలి.  అయ్యబాబోయ్ ఎమ్ పోలీస్ అక్కా ,  నువ్వు పోలీసులకే సహాయం చేయగలిగే   డిటెక్టివ్ లా ఉన్నావు  అన్నాడు గిరి. ఆంటే అగస్త్ డ్యూపాం లా అన్నమాట  అగస్త్ డ్యూపావా? వాడెవడు ? అన్నాడు  అన్నాడు సత్య.   "స్టోలెన్ లెటర్ అనే ఇంగ్లిష్ నాటికలో డిటెక్టివ్  కదా? ఇంతకీ మీరు ఏమి చదువుకున్నారు ?"  అంది రెజీనా.  "క్రిమినల్ సైకాలజీ." అంది నెమలి.   "క్రిమినల్ సైకాలజీ చదువుకుని ఈ అడవిలో ఉంటున్నావా? నమ్మలేకపోతున్నాను." అన్నాడు గిరి.  UNO లో పనిచేసే అమ్మాయి ఈ అడవిలోకి , మా ఇంటికి వచ్చింది అంటే నేను మాత్రం నమ్మగలుగుతున్నానా !   అక్క నువ్వు ఇంత చదువుకున్నావని నాకెప్పుడూ చెప్పలేదే అన్నాడు సత్య. "మనకి అంత సీన్ ఉందా , చదువు గురించి మనం ఎప్పుడైనా మాట్లాడతామా ? మన మొఖం చూస్తే చదువు గురించి మాట్లాడాలని ఎవరికైనా అనిపిస్తుందా? నిజం  చెప్పారా సత్తి ." అన్నాడు గిరి  "ఇంతకీ బేగ్ పట్టుకుని వచ్చారు , నాకేమైనా తెచ్చారా?" అంది నెమలి మాట మారుస్తూ. " ఏదో అనుకోకుండా ఇలా రావటం వల్ల .."అంది రెజీనా. "అనుకోకుండా వచ్చారా , ఊరక రారు మహాను బావులు అని ఒక సామెత ఉంది."  అంది నెమలి. తాను వచ్చినపని అనసూయ గురించి , అనసూయ తండ్రి గురించి  అడుగుదామని, ఎలా అడగాలా అని ఆలోచిస్తుంటే. గిరి సత్య కాఫి తాగడం అయ్యింది కదా ఇంకా సిగరెట్ కాల్చుకోండి పోయి. మనం బైటికి పోతే వెళ్ళేవో  మాట్లాడు కుంటారు పదరా గిరి. గిరి సత్య బయటకు వెళ్లిపోయారు.  మా ఆయన పట్నం వెళ్ళాడు రాత్రికి గానీ రాడు. రండి అంటూ బెడ్ రూమ్ లోకి తీసుకెళ్లింది. గోడకు టీవీ , డెస్క్ మీద కంప్యూటర్ ఒక మ్యూజిక్ సిస్టం ఉన్నాయి. మీరు పాటలు వింటారా ? అంది రెజీనా . లేదు పాడతాను. అబ్బా నా గురించి ఆపి మీ గురించి చెప్పండి.

UNO లో పనిచేస్తూ ఇక్కడికెలా వచ్చారు ? అంది నెమలి. నా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఫ్రాన్స్ లో. మాటీమ్ తో  ఫ్రాన్స్  వెళ్ళడానికి  రెండు నెలలు టైమ్ ఉంది.   నాది  సోషల్ వర్క్ కదా ఫ్రెంచ్ మాట్లాడడం వస్తే తీసుకెళతారు. యూరోప్  చూసినట్టు ఉంటుంది ఫ్రాన్స్ లో పనిచేసినట్టు ఉంటుంది. " మరి  ఫ్రెంచ్ నేర్చుకుంటున్నారా ?"  "అవును.ప్రాక్టీస్ చేస్తున్నాను."అంది రెజీనా.  ఇల్లంతా  అన్ని గదులు చూబించింది. బెడ్ రూమ్ లో కంప్యూటర్ ఆన్ చేసి తాను ఫారెస్టులో తీసిన  ఫొటోస్ చూబించింది. చాలా పెద్ద కలెక్షన్ , ఎంతకాలం నుంచి తీస్తున్నారో , ఒక సంవత్సరం తీశాను. ఇప్పుడు తియ్యటం లేదు . ఫారెస్ట్ బోర్ కొట్టేసిందా? అంది రెజీనా. " అదేం కాదు  లైఫ్ ఇంకా బోర్ కొట్టలేదు " అంది నెమలి. అబ్బా మీతో మాట్లాడడం చాలా కష్టం అని  అంటూ గోడ వైపు చూసింది. గ్రిఫిత్ యూనివర్సిటీ భవనం ముందు స్నేహితులతో దిగిన ఫోటో. ఆస్ట్రేలియాలో చదువుకున్నారా ? మరి జాబ్ చేయాలని లేదా? అంది రెజీనా. తియ్యగా నవ్వింది నెమలి. అమెరికాలో కనీసం ఐదు వేల డాలర్లు నుంచి పాతిక వేల  డాలర్లు  దాకా ఇస్తారు.  ఇండియా లో క్రిమినల్ సైకాలజీ మాట అటుంచి సైకాలజీ కి కూడా ఏమీ విలువ లేదు . " అవునండీ బర్డ్ వాచింగ్ అంటే కూడా  నవ్వు తున్నారు "    అనసూయ తండ్రి ఎందుకలా ? ఏలేదు తెలుసుకోవాలని కొంచం క్యూరియాసిటీ. అనసూయ ట్రాఫికింగ్ లో దొరికి దయనీయ పరిస్థిలో ఉంటె జగపతిగారు గవర్నమెంట్  రిహెబిలిటేషన్  సెంటర్ కి తరలిస్తుండగా ఆమె పక్షి స్వరాలను అనుకరించడం , ఆయన్ను ఆకట్టుకుంది. ఆమెను  తండ్రి తో సహా తన దగ్గరే  పనిలో పెట్టుకున్నారు.  నెమలి చెప్పుకుపోతోంది , రెజీనా శ్రద్దగా వింటోంది , ఇంతలో  దగ్గు వినిపించింది. అది మెగ స్వరం.  ఇంకా ఫారెస్ట్ లోకి వెళ్ళాలి మరి నేను బయలుదేరతాను  అంది. ఒకే మళ్లీ కలుద్దాం. అలాగే కానీ ఈసారి మీరు బంగాళా కి రావాలి  అని రెజినా బయలుదేరింది . రెజీనా రావడం చూసి గిరి జీప్ స్టార్ట్ చేసాడు,  గేట్ వరకూ వచ్చింది నెమలి . జీపులో కూర్చుని చెయ్య ఊపుతూ  ఉంటె కిటికీలోంచి ఒక మొఖం కనిపించింది. అది  భర్త ఇంట్లో ఉంటె లేదని ఎందుకు చెప్పింది ? అది ఖచ్చితంగా హెడ్మాన్ , అంటే నెమలి భర్త కాదు. మరెవరబ్బా? జీప్ బయలుదేరింది. జీప్ ఆగెంత వరకు మనసులో ముసురుకున్న ఆలోచనలతో  ఈలోకంలోకి రాలేదు. మేడం ఇక్కడనుంచి జీప్ లో వెళ్లడం మంచిది కాదు.

ముగ్గురు కాలి  బాట పట్టారు. సమయం 11 గంటలు అయ్యింది. వానపడి అడవి లో  జీవకళ తొణికిసలాడుతోంది. సత్య పోస్టులు ,  గిరి రెజీనాతో ముందు నడుస్తున్నాడు. వారి వెనక సత్య దారి మిస్ అయితే సహాయం కోసం డైరెక్షన్ చూబించే పోస్టులు మోసుకు వెళుతున్నాడు. 


  ( continues now and will be updated by evening.)  

4 comments:

  1. Interesting sir. Every character is suspectable except Satya and Giri. Waiting for continuation of the story with suspense

    ReplyDelete
    Replies
    1. Sahitya I am more than sure that your excitement reaches peaks in the following scenes.

      Delete
  2. very interesting. curious to know the next scene.
    like a thriller novel with lot of suspense.

    ReplyDelete