Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Tuesday, June 23, 2020

Anveshana 2020 Scene 16

చుట్టూ అడవి కొండలు మధ్యలో చిన్న గూడెం. ఆ గూడెంలో  జరుగుతోంది గూడెం పండుగ.  ఒక విలేజ్ ఫెయిర్ కి వెళితే ఎలా ఉంటుందో అలాగే ఉంది. రెండు వైపులా  వరసగా చుట్టూ గుడిసెలు .  గుడిసెలమధ్య ఎడం బాగా ఉంది. మధ్యలో చాలా చోట్ల ఖాళీ జాగా ఉంది.  అక్కడక్కడా పెంకుటిళ్లు ఆ మధ్యలోంచి వెళితే  కొంత దూరం తర్వాతా   కర్ర సాములు చేస్తూ ఉన్న యువకులు కనిపించారు. ఇంకొంచెం ముందుకి వెళితే ఒక గుడి ఉంది. అక్కడ ఎవరో వంటికి మట్టి రాసుకున్న యుక్త  వయసులో ఉన్న  ఆడ మెగా ఉన్నారు. రెజినా అడిగింది " ఇది ఏంటి ? ఏంచేస్తున్నారు వీళ్ళఅంతా ? " " కొంచెం ముందుకి వెళితే అర్ధం అవుతుంది " కొంచెం ముందుకి వెళ్ళేరు. ఒక చోట డప్పులు కొడుతూ చుట్టూ మగవారు నిలబడితే , మధ్యలో యువతీ యువకులు డాన్స్ చేస్తున్నారు.  చిన్న చిన్న టెంట్లు , స్టాల్ల్స్  ఒక పాతిక దాకా ఉండచ్చు , వారు బట్టలు తిను బండారాలు అమ్ముతున్నారు.  ఎక్కువ మంది తాటి చాపలమీద  చిన్న చిన్న సామ్యాలు పెట్టి అమ్ముతున్నారు.  గాజులు , సబ్బులు , అద్దాలు, దువ్వెనలు,  ప్లాస్టిక్ బొమ్మలు  తాళం కప్పలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నే నకిలీ వస్తువులే.  కొంతమంది అడవిలో దొరికే వస్తువులు, తేనె, విత్తనాలు, కల్లు,  విప్పసారా , అమ్ముతున్నారు. ఇంకొంచెం ముందుకి వెళ్ళేరు 

గుడిసెల వరస అయిపొయింది చాలా పెద్ద ఓపెన్  స్పేస్  వచ్చేసింది. అందులో  హైవె కి ఇరువైపులా చెట్లు ఉన్నట్టు , ఇటు అటు తాటిచెట్లు ఉన్నాయి.  రోడ్డుకి ఒక వైపు ఒక వరసలో  సుమారు 40 అడుగుల  పొడవైన  తాటి చెట్లు ఒక ఇరవై దాకా ఉన్నాయి . ఆ చెట్ల వరసకి ఎదురుగా నిలుచునట్లు మరో వరసలో చెట్లు ఉన్నాయి.   అది ఎలా ఉందంటే రోడ్డుకి ఇరువైపులా పొడవైన మనుషులు ఎదురు ఎదురు గా నించున్నట్లుంది. దూరంలో మళ్ళీ గుడిసెలు కనిపిస్తున్నాయి. https://www.youtube.com/watch?v=0qClO7uO_zI  (click the link to see the aerial girl)

కుడిచేతి వైపు ఉన్న ఒక వరుస  తాటి చెట్ల మధ్య ,  6 అడుగుల  దూరం లో ఉన్న రెండు  తాటి చెట్ల మద్య  ఉయ్యాలలా ఒక చీర కట్టి ఉంది. ఆ చీర మీద  ఒక అమ్మాయి కేవలం పాదాలు మెలిపెట్టి వెళ్ళాడుతున్నది. మెల్లగా చీర ఊగుతున్నది . చీర ఊపు పెరగగానే పాదాలు రెండు వదిలేసి చేత్తో చీర పట్టుకుంది . ఈ సారి ఊయల బాగా ఊపందుకునే ,  తాటి చెట్టు ఎత్తుని దాటి పైకి పోయింది.   ఎవరీ అమ్మాయి ? అంది రెజీనా.  ఈమెను సింహం గుండె  అంటారు. ఈమె పేరు చంద్రి ఊయల వైపు చూసేసరికి చంద్రి చందమామ మీద ఉన్నట్టు కనిపించింది. ఆ వేగం చూస్తే రేజీనాకి వొళ్ళు తిరుగుతున్నది. కాస్త ఊయల  వేగం తగ్గించి చేతులు వదిలి మోకాళ్ళ మడత తో చీరని పట్టుకుంది.  జనం ఒక ముప్పయి మంది దాకా  పోగయ్యారు.  ఊయల వేగం బాగా పెంచి రెండో  వైపు ఉన్న తాటిచెట్ల వరస  వైపు పిల్ల తన శరీరాన్ని విసిరేసింది.  రేజీనా కళ్ళు తిరిగి పడిపోయింది.  ప్రేక్షకులు ఒక వైపు చాట్ల వరుస  నుంచి మరో వైపుకు చెట్ల వరుస కి  తిరిగారు . అక్కడ ఈ చీర కట్టిన రెండు తాటి చెట్ల కి సమాంతరంగా ఉన్న  రెండు తాటి చెట్ల మధ్య ఒక  మోకు  తాడు కట్టబడి ఉంది.  రెజీనా కళ్ళు తెరిచి చూసే టప్పటికి  చంద్రి  ఆ తాటిని పట్టుకుని వేలాడుతోంది.  చంద్రి ఆ మోకు తాటిమీద నడవడం నుంచి ఊగడం దాకా , వేళ్ళాడడం , గాలిలోకి శరీరాన్ని విసిరీసే , ఒక ట్విస్ట్ చేసి  ఊగుతున్న తాటిని అందుకోడం లాటివి ఎన్నో చేసింది.  రెజీనా చాలా సార్లు కళ్ళు మూసుకుంది.

చివరిగా తాటి మీద నడుస్తూ , వేళ్ళాడుతూ కిందనుంచి విసురుతున్న నాణేలని పట్టుకుంటోంది. ఇంకా రెజీనా వల్ల కాలేదు. ఏడ్చేసింది , ఆ పిల్ల కి ఎంత డబ్బు కావాలన్న నేను ఇస్తాను అని,  వద్దు దిగిపో మనండి అని ఏడుస్తోంది. ఆట ఆగిపోయింది. ఆ గూడెంవాళ్ళు రెజీనాని విడ్డురంగా చూసారు. నోట్లు  గుప్పెడు నిండా  తీసుకుని చంద్రి చేతులో  పెట్టి,  వద్దు ఇలాటివి చేయవద్దు అమ్మా,  అంది.  చంద్రి రెజీనా కళ్ళు తుడిచింది.  ఆ నీళ్లు తొలగిన  కళ్ల తో చంద్రికని స్పష్టంగా చూసిన తరువాత అవాక్కయ్యిది.  ఈమెనే పట్టాభి .. 

చంద్రిక డబ్బు తీసుకోలేదు . నెమలి రెజీనాని ఓదార్చి తీసుకెళుతూ " ఈ అమ్మాయి  సర్కస్ లో ఏరియల్ గర్ల్ గా చేసింది,  ట్రెపీజ్ విన్యాసాలు చేసేది. కోటిమందిలో ఒక్కరికి  అంత గట్స్ ఉంటాయి. ఎందుకంటే సర్కస్ లో రీటేక్ ఉండదు, డూప్ ఉండదు, కిందపడితే ప్రాణం ఉండదు. " రెజీనా మ్రాన్పడి పోయి బొమ్మలాగ మెకానికల్గా నెమలి వెంట నడుస్తున్నది. " రింగ్ మిస్ట్రెస్ దాకా వెళ్లిన ఆమె ఉజ్జోగం కోల్పోయింది.  రింగ్ మాస్టర్ అనే పేరు విన్నాను , రింగమిస్ట్రెస్ అనే పేరు మొదటిసారి వింటున్నాను చూస్తున్నాను. రింగ్ మిస్ట్రెస్ అంటే చాలా ముఖ్యమైన జాబ్. ఆ సర్కస్ కంపెనీ వాళ్లకు బుద్ధి లేదు ఎందుకు తీసేసారు? ఆ సర్కస్ కంపెనీ మూత పడింది. అయినా ఈ అమ్మాయి ప్రతిరోజు ఉదయాన్నే 5 గంటలకి ప్రాక్టీస్ మొదలుపెడుతుంది.

ఈ అమ్మాయి ఏంచేస్తుంటుంది ? అంది రెజీనా . చంద్రిక వింటనర్ ( vintner) అంటే వైన్ మేకర్. చాలా రకాల వైన్స్ , ద్రాక్ష , మహువా , చెర్రీస్ ఇంకా చాలా. ఎవరికీ కావలిసినా ఇంటికి తెచ్చి ఇస్తుంది. " జేమ్స్ కి  కూడానా ? " అంది.  వెంటనే నవ్వేసి  సత్య , గిరి ఏరి అంది . నెమలి నవ్వింది. " అయ్యో చూడలేదా   వాళ్ళిక్కడికి వచ్చిన పనిమీద ఉన్నారు. అని కొంచెం  దూరంలో  ఉన్న ఒక అంగడి చూబించింది. అక్కడ వీళ్ళిద్దరూ ఏంచేస్తున్నారు? అంది రెజీనా . దగ్గరికి వెళ్లి చూస్తే ఇద్దరూ ఇప్పసారా తాగుతూ కనిపించారు.  "డైజేషన్ కి చాలా మంచిది " అన్నాడు గిరి , అంటే నాకు డైజేషన్ పాడయ్యింది కదా అందుకని అని సత్య చెప్పబోయాడు. " ముసుగులు అనవసరం , ఇష్టం అందుకే   తాగుతున్నాము అని చెప్పండి " అంది నెమలి.

ఇద్దరూ కొంచెం ముందుకి నడిచారు  అక్కడ ఒకడు విలువిద్య ప్రదర్శిస్తున్నాడు. చేతులమీద నిలబడి కాలితో బాణం ఎక్కుపెట్టి  వరుసగా  వేలాడదీసిన రక రకాల  పళ్ళని గురిచూసి కొడుతున్నాడు. చూడడానికి వచ్చినవాళ్లలో ఒకడు వాటర్ మెలోన్ చూపాడు ,బాణం దానిలోంచి దూసుకుపోయింది. మరొకడు పపాయ చూపాడు  బాణం దానిలోంచి దూసుకుపోయింది. మరొకడు నారింజ చూపాడు బాణం దానిలోంచి దూసుకుపోయింది, మరొకడు నారింజ , మరొకడు నిమ్మ చూపాడు , చివరగా ద్రాక్ష పండు ఉంది. అది కొట్ట మంటే , ఒక నిమిషం ఆగాడు కాళ్లతో బాణం కిందపెట్టి  లేచి నిలుచున్నాడు, " ఎవరైనా తలమీద పెట్టుకుంటే కొడతాను   గురి తప్పితే  నా తల తీసుకోండి"  అన్నాడు   ఎవరొస్తారు . ఎవ్వరూ  రాలేదు. వీడిని అసిరిగాడు అంటారు  అంది నెమలి. అయితే అంత  బుద్ధి తక్కువగా ఎవరు తలమీద పెట్టుకోగలరు.   అంది రెజీనా చంద్రిక రావడం ద్రాక్షపండు నెత్తిమీద పెట్టుకోడవం  అసిరిగాడు దాని గురి చూసి కొట్టడం అన్నే ఒక్క క్షణంలో జరిగిపోయాయి .

మేడం మీరు తప్పక చూడవలసింది ఒకటుంది , అందులో వైలెన్స్ ఏమీ ఉండదు . పెళ్లి చూడడమే అన్నాడు గిరి . సింపుల్ గా  పెళ్లి అంతే అన్నాడు సత్య కొంచెం నిషా స్వరంతో. కొంచం ముందుకి పోగానే అక్కడ ఒక గుంపు ఉంది. నెమలి అంది  ఇది ఫినాలీ,  లాస్ట్ ఐటెం ఆఫ్ ది కార్నివాల్ .  గుంపుని తోసుకుని లోపలికి వెళ్ళగానే మొట్టమొదట కనిపించిన వ్యక్తి పట్టాభి. ఇంకో నలుగురు గూడెం పెద్దలు , కొంత మంది స్త్రీలు ఉన్నారు.

రెజీనా పక్కనే ఉన్న ఒక గూడెం  స్త్రీని అడిగింది ఎం జరుగుతోందని. ఆడపిల్లలని అబ్బాయిలు  లేవదీసుకు పోతారు. అయ్యో  వాళ్ళ తల్లి తండ్రులు ... అంది రెజీనా. అదిగో అక్కడ కనిపిస్తున్నారు వాళ్ళే పిల్ల తల్లి తండ్రులు. అంటే తల్లి తండ్రులు చూస్తుండగానే లేవదీసుకుపోతాడా ? అంది రెజినా . "అబ్బా ! గూడెం అంతా చూస్తుండగా కూడా పబ్లిక్గా లేవదీసుకుపోతుంటే." అంది నెమలి .  మట్టి రాసుకున్న పిల్ల పిల్లాడు వచ్చారు. పిల్ల చెయ్యి పిల్లాడు పట్టుకుని  అందరి ముందు లేవదీసుకు పోయాడు.  జీప్ అడవి మార్గం పట్టింది. నిజంగా ఇలాంటి ఆచారాలు ఇండియా లో ఉన్నాయా ? ఇంకా ఇలాటి ఆచారాలు చాలా ఉన్నాయి . అంది నెమలి.  జీప్ బంగాళా చేరింది. కార్తీక్ రాలేదు , రెజీనా రూంకి వెళ్లి ఆలోచనల్లోకి జారుకుంది.

2 comments:

  1. గూడెం పండగని, వాళ్ళ ఆచారాల్ని కళ్ళకి కట్టినట్టు చూపించారు

    ReplyDelete
  2. చాల బాగుంది. విళ్ళు విద్య చాల బాగుంది ఎలాంటి దనినై గురితప్పకుండ కొట్టడం super talent తలపై ఉన్న ద్రాక్షాను కొట్టడం great వాళ్ళ ఆచారల గురించి చాలా బాగా చెప్పారు సార్

    ReplyDelete