Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Thursday, June 18, 2020

Anveshana 2020 Scene 13

జీప్ బంగాళా లోకి ప్రవేశిస్తుండగా కూపర్ అరుపు వినిపించింది. జీప్ కాంతి లో  అనసూయ హాఫ్ వైట్ సారీ లో తళతళ మెరిసిపోతుంది  చేతిలో కూపర్ బెల్ట్ , చుట్టూ  గ్రామంనుంచి వచ్చిన కొంతమంది స్త్రీలు కూడా ఉన్నారు. ముగ్గురు జీప్ దిగి అనసూయ వైపు నడవసాగారు. దూరం నుంచి కనిపించే లేదు గానీ అనసూయ మొఖం  ఆందోళన వల్ల వాడిపోయినట్టు కనిపించింది , కళ్లకింది నల్ల వలయాలు  స్పష్టంగా కనిపించాయి. కూపర్  రెజీనా మీద , గిరి , సత్య మీద ప్రేమగా దుమికింది  తోక ఊపుతూ వారి కాళ్ళకి తన శరీరాన్ని రాపాడిస్తూ తిరుగుతోది. అనసూయ మౌనం గా ఉండిపోయింది , కానీ మిగితా స్త్రీలు అనసూయ ఎంత ఆందోళన చెందిందో  తెలియజేసి గిరిపై  ఆలస్యంగా వచ్చినందుకు , చెప్పనందుకు మండి పడ్డారు. సత్య మధ్యలోకి దూరి తిట్లు తిన్నాడు.  వెనక్కి తిరిగి మౌనంగా వెళ్లిపోతున్నా అనసూయని చేయ్యపట్టుకుని ఆపి ఓదార్చింది. దగ్గరకు తీసుకుని వర్షిస్తున్న కళ్ళని తుడిచింది.  ఇంతలో ఒక స్త్రీ ఈ రోజు ఏంజరి గిందో తెలిస్తే .. అంటూ ఎదో చెప్పబోయింది . అనసూయ ఆమెను అడ్డుకుని వారందరినీ పంపించేసింది.
 అందరూ బంగాళా లోకి  ప్రవేశించారు అనసూయ ప్రేమకి చలించిపోయింది రెజీనా. చిన్నప్పుడు తనతల్లి తనగురించి పడ్డ ఆవేదన గుర్తుకొచ్చింది. అందరూ సోఫాలో కూరుని ఉండగా చిటికలో కాఫి ఇచ్చింది. కాఫి తాగగానే , గీజర్ వేసి ఉంచాను  హాట్ వాటర్ రెడీ  అంది . స్నానాలు చేసి రాగానే అందరికీ భోజనాలు సిద్ధం. అందరూ భోజనం చేశారు. జగపతి లేరు కాబట్టి అందరూ డైనింగ్ టేబుల్ వద్ద తిన్నారు . అనసూయని అందరితో  తినమంటే గిరిమీద దండకం చదివింది. ముందు అతిధులు తినాలని తర్వాతే తానూ తింటానని చెప్పింది. రెజీనాని ఇలా ఇష్టమొచ్చినట్టు తిప్పితే కాలు విరగ్గొడతానని వార్ణింగ్ ఇచ్చింది. " ఏయ్ అను , నువ్వు చాలా బయపడ్డట్టున్నావ్ ,  ఈ సత్య ఉన్నంత వరకూ  మిమ్మల్ని ఎవ్వరూ ఎంచేయాలేరు."  అన్నాడు సత్య . " ఏంటి , వాళ్ళందరూ నిన్ను ఓదార్చడాన్నికి వచ్చారా!!!"  ఆశ్చర్యంగా అన్నాడు గిరి.   "అను ఆ స్త్రీలు ఎదో చెప్పడానికి ప్రయత్నించారు కానీ నువ్వు ఆపేసావు అదేంటో చెప్పు"  అంది రెజీనా. మొదట చెప్పలేదు కానీ తర్వాత మెల్లగా తానె చెప్పింది .ఇప్పుడొద్దు భోజనాలు అయ్యాక చెప్తాను అంది. అంతా భోజనాలు ముగించారు. 


ఇప్పుడు భోజనాలు అయిపోయాయిగా ఇప్పుడు చెప్పు అంది రెజీనా.  మద్యానం ఇక్కడ పంచాయతీ జరిగింది అంది అనసూయ మెల్లగా.  ఓహ్ పంచాయతీ జరిగిందా , ఆహ్  హ్హ హ్హ హ్హ హ్హ , దానికి నువ్వు ఇంత ఇదైపోతున్నావా . అన్నాడు సత్య.  " మన విలేజ్ లో గొడవలు పంచాయతీలు  మామూలే కదా  అయినా మన బంగళా మీదకి వచ్చారా  సారికి ఒక్క ఫోన్ కొట్టకపోయావా? అన్నాడు గిరి. పంచాయతీ  కి నేనే వెళ్లెను, సార్ కి కూడా ఫోన్ చేసాను. అంది అనసూయ  అప్పుడే  ఉహ్ , ఉహ్  దగ్గు వినిపించింది. తలతిప్పి చూసేసరికి ఫారెస్ట్ రేంజర్ జేమ్స్."అది మామూలు పంచాయతీ కాదు , శవపంచనామా పోలీస్ కూడా  వచ్చారు, the inquest Panchanama. It is to be done in accordance with Section 174 of the Cr. P.C., when any person dies under any suspicious circumstances. అన్నాడు జేమ్స్. అనుకోకుండా  ఇంగ్లీషులో వచ్చేసింది జేమ్స్  మాట . 

అంత ఇంగ్లిష్ లో చెప్తే మా సత్య కి అర్ధం కావద్దూ తెలుగులో చెప్పండి  జేమ్స్  గారు అసలు పంచనామా అంటే ఏంటి ? అన్నాడు గిరి. "నువ్వు టెన్త్ క్లాస్ నేను బి టెక్  డిస్టింక్షను, అది మర్చిపోకు." అన్నాడు సత్య. మీరు కూడా కూర్చోండి మీకు కూడా వడ్డిస్తాను , భోంచేయండి. నో నో ఐ మస్ట్ గో. ఒక గ్లాస్ మంచినీళ్లు చాలు అంటూ సోఫాలో కూర్చున్నాడు .  పంచనామ  అంటే  "ఐదుగురు వ్యక్తుల పరిశీలన రికార్డు" అని అర్ధం. పంచనామ అనేది ఒక డాక్యుమెంట్ . ఇది  ఐదుగురు వ్యక్తుల సమక్షంలో జరిగే కొన్ని విషయాలను రికార్డ్ చేసే పత్రం. ఐదుగురిని కొన్ని విషయాలు చూడటానికి మరియు వినడానికి నేరస్థలానికి తీసుకువెళతారు. ఒక నేరానికి ప్రత్యక్ష సాక్షులు లేనట్లయితే కేసు పూర్తిగా  సర్కమష్ఠ ల్  ఎవిడెన్స్పై  ఆధారపడిఉంటుంది .అన్నాడు జేమ్స్.  ఇంతకీ పంచనామా ఎందుకు జరిగింది ? అంది రెజీనా. ఈ రోజు పట్టపగలే పులి వచ్చింది.  గూడెం  నుంచి వచ్చే మిల్క్ మెయిడ్ ని  చంపేసింది.  గాలి మొదలయ్యింది  ఎక్కడో ఉరిమింది  , జేమ్స్ మొఖం వెలిగింది.  వర్షం వచ్చే లా ఉందే అంది అనసూయ. 
 సరే జాగ్రత్త చెపుదామని వచ్చాను. డీప్ ఫారెస్ట్ లోకి వెళ్లకండి, ఒకవేళ తప్పదు వెళ్ళాలి  అంటే నా హెల్ప్ తీసుకోండి.  జేమ్స్ బయలుదేరాడు. పులి ఎప్పుడు ఆడవాళ్లనే ఎందుకు చంపుతోంది? అన్నాడు సత్య . ఎందుకంటే పులి మగది  కాబట్టి అన్నాడు గిరి. జేమ్స్  తలుపు దగ్గరికి వెళ్ళాడు , గుమ్మం దాటబోతూ ఒక్కసారి వెనక్కి తిరిగాడు  లాగి చెంపమీద కొట్టినట్టు ఉంది మొఖం. గిరి నవ్వాడు. జేమ్స్ కూడా నవ్వాడు. "ఈ మద్యానం పులి ఎవరినో ఆడమనిషిని చంపేసింది అని అందరు అనుకుంటున్నారు. ముఖం గుర్తు పట్టలేని విధంగా ఉండడం తో మిల్క్ మెయిడ్ అనే విషయం చాలా సేపటిదాకా తెలియలేదు. నేను హడిలిపోయి జగపతిగారికి ఫోన్ చేసాను. కొద్దిసేపట్లో జేమ్స్ బంగళాకి వచ్చారు. నన్ను అక్కడికి తీసుకెళ్లారు.  పట్టాభి కూడా అక్కడికి వచ్చారు." "పట్టాభి ఎవరు?" అంది రెజీనా. నెమలి భర్త , విలేజ్ హెడ్.  "పంచనామా అయ్యేసరికి చాలా లెట్ అయ్యింది. జేమ్స్ కి పోలీసులతో పని ఉండటం తో పట్టాభి నన్ను  బంగళాలో దింపి వెళ్ళేరు." అంది అనసూయ. స్వరం లో ఆందోళన స్పష్టం గా వినిపిస్తోంది, ఎప్పుడూ నవ్వుతూ ఉండే అమ్మాయి మొఖం కళావిహీనం అయిపొయింది.  టైం 9 గంటలు అయ్యింది. అనసూయ నీ గోతులో ఉండే పక్షులు ఎక్కెడికి ఎగిరిపోయాయి అంది . అనసూయ కూ కూ అంది కోయల లా కూసింది. పాడుకోమన్నట్టుగా లాలి పాటలా ఉంది.  నువ్వేం దిగులు పడకు , రేపు జగపతిగారితో ఫోన్ లో మాట్లాడి , ఈ రీసెర్చ్ క్షేమంగా  జరిగేలా  మంచి మార్గం చూడమని అడుగుదాం, గుడ్ నైట్ అనసూయ.  అంది రెజినా. "అయ్యో .....వాన పడలేదు."  అని రాగం తీస్తూ గిరి సత్య రూమ్ లో దూరారు. రెజీనా మేడ ఎక్కి  రూమ్ లోకి వెళ్లి తలుపువేసుకుంది.  

బాగా రాత్రి అయ్యింది. కప్పుకున్న దుప్పటి తీసి చూసింది.  కిటికీలోంచి ఎవరో తనని గమనిస్తున్నారు అనిపించింది. నల్ల బట్టలు వేసుకుని మొఖానికి నల్ల రంగు పూసుకుని ఉన్న ఆకారం కదులుతున్నట్టనిపించింది. లేచి లైట్ వేసింది . అప్పుడు తెలిసింది. కేరన్త పోయిందని. కిటికీవద్దకి వెళ్ళింది ఆ ఆకారం కదలడం ఆపేసింది ఏమో ఏమీ కనిపించలేదు.  ఇంక వెనక్కి వచ్చేద్దామని అనుకుంటుండగా రెండు కళ్ళు చటుక్కున తెరుచుకున్నాయి. ఉలిక్కి పడింది. కరంట్  షాక్ కొట్టినట్టు కిటికీ నుంచి ఒక్కసారి బెడ్ మీదకి తూలిపడింది.  వెన్నులోంచి చలి. గట్టిగా అరవాలని ప్రయత్నించినా నోరు రాలేదు. కరెంట్ వచ్చింది. రూంలో లైట్ వెలిగింది. ధైర్యం వచ్చింది. రూమ్ తలుపు తీసింది.  ఆ ఆకారం పారిపోతోంది.  అప్పుడే గేటువద్దకు చేరుకుంది ఆ  ఆకారం.  చంద్రుడు మబ్బుల చాటున ఉండడంతో , వెలుతురూ చాలా తక్కువగా ఉంది. రెజీనా కూడా బంగళా గేటు వైపు పరిగెత్తింది. ఆ నల్లని ఆకారాన్ని పట్టుకోవాలని చెయ్యి జాచింది. అంతే  వెనకనుంచి ఎవరో క్లాత్ తో  నోరుమూసి , ఆ క్లాత్ ని  సాంతం అలా నోట్లోకి తోసేశారు. మరొకరు ఆమెకు ఒక బేగ్ తొడిగారు. బేగ్లో బందీ అయిన తనని ఇంకొకడు భుజం మీద వేసుకుని మోసుకుని పోతున్నాడు.  

 ఖచ్చితంగా అడవిలోకి తీసుకెళుతున్నారు. ఒక పది నిమిషాలు కదలకుండా పడి  ఉంది. ఒకడన్నాడు  "ఈరోజు రాత్రి మనకి విందు , రేపు పులికి విందు." అంతా నవ్వారు. ఇంకెంత దూరం మోస్తాం కింద పడేయరా  అన్నాడొకడు. పిట్టలకోసం వచ్చిన పిట్ట  రావే బైటకు అని సంచిని  కింద పడేసాడు. మబ్బులు పూర్తిగా తొలిగిపోయి వెన్నెల అడవంతా పరుచుకుంది. సంచిలోంచి బైటకురాగానే ఒంటిమీద బట్టలు లేవు. అయ్యో ! అరుద్దామంటే నోట్లో గుడ్డలు కుక్కి ఉన్నాయి. లేచి పరిగెడుతోంది. ఆ ముగ్గురు వెంబడిస్తున్నారు.  మూగ్గురు ధరించినివి ఒకే రకమైన నల్ల బూట్లు.  తాను నగ్నంగా పరిగెడుతోంది , నల్ల బూట్లు తరుముకొస్తున్నాయి.   తాను పరిగెడుతోంది నల్ల బూట్లు వెంబడిస్తున్నాయి. చేతులు కట్టేయలేదు కదా ..చూసుకోగానే  వెంటనే నోట్లో  గుడ్డలు లాగేసింది. పరిగెడుతూ చీటా వాటర్ స్పాట్ దగ్గరకి వచ్చింది. మొదటిరోజు జీప్ బంగళాకి వచ్చిన తోవ  ఇదే . అక్కడనుంచి ఒక మూలకి పరిగెత్తింది .అక్కడ ఉంది చెరువో  లేక సరస్సో చూసుకోలేదు అందులోకి ఒక్క గెంతు గెంతింది. అప్పుడు తెలిసింది అది కల అని. మంచం మీద నుంచి ఒక్క సారి కింద పడింది.  ఫ్రిజ్ లోంచి మంచినీళ్లు తీసుకుని తాగింది. గుండె వేగం హెచ్చింది , వొళ్ళంతా చెమట. నిజంగా పరిగెత్తినట్టే అనిపించింది. 

అమెరికా వెళ్లిన కొత్తలో కూడా ఇలాగే కలలు  వచ్చేవి , ఏరోప్లేన్ నుంచి పడిపోతున్నట్టు, న్యూయార్క్ సిటీలో బ్రాడ్వే టైమ్స్  స్క్వేర్ దగ్గర, కళ్ళు లేని వాళ్ళలాగా చేతులు ముందుకు చాచి తడుముతూ నడుతున్నట్టు పిచ్చి కలలు. ఇంక అడవిలో సరే సరి.అర్ధరాత్రి అయ్యింది.వాన మొదలయ్యింది.తనదగ్గర ఉన్నమోస్ట్ సెన్సిటివ్ మైక్రోఫోన్ తో సౌండ్స్ రికార్డు చేసింది,మళ్ళీ టెలీస్కో ప్ కిటికీ దగ్గర పెట్టి  నుంచి చూసింది. మళ్లి  ఏనుగుల గుంపు ఒకటి కదలడం చూసింది. ఒక క్షణం కనిపించి గుంపు మాయమయింది  ఇంతలోగేటు చప్పుడు అయ్యింది. రూమ్ లోంచి బైటకు రాడానికి భయం వేసిఒక కిటికీ లోంచి చూసింది. ముసలాయన వెళుతూ కనిపించాడు. ఓహో వాన పడితే ముసలోడు వస్తాడు, ఏనుగులు గుంపు కదులుతుంది. ఇంతలో ఆలాపనగా , వినిపించి వినిపించినట్టు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్  సౌండ్.  యా ఈ మ్యూజిక్ కూడా.  ఈవానకి ఈ  సంఘటనలకు సమ్మంధం ఏంటి ? అని ఆలోచిస్తుండాగా  టింగ్ మని  మైండ్ లోకి మెసేజ్ వచ్చింది " ఈ సంఘటనలకీ నేను వచ్చిన పనికీ సమ్మందం ఏంటి? " అని. సర్లే నాకెందుకు.  నాకు సేఫ్టీ లేకపోతే  రేపు జగపతిగారితో మాట్లాడి వెళ్ళిపోడం  మంచిది. నాకెందుకు ఇవన్నీ అనుకుంది.  ఇప్పుడు చేసిన రికార్డింగ్స్ లాప్టాప్ లోకి ట్రాన్స్ఫర్ చేసింది . గత సారి వాన కురిసినప్పుడు రికార్డ్ చేసిన ఆడియో కూడా  లాప్టాప్ లో డేట్ టైం తో సహా ఉంది. రెండు ఆడియోలు  ఒక్క సారి ప్లే చేసి వింది. పక్షుల పాటలు రికార్డింగ్స్ అన్నీ వింది. భయ స్థానంలో ఆసక్తి వచ్చి చేరింది.  నోట్స్, మెలోడీ, ట్యూన్ , లెన్త్  బట్టి పక్షుల పాటలని వేరు వేరు ఫోల్డర్స్ లో పెట్టి పడుకుంది. 

ఆ తర్వాత కూడా మత్తుగా నిద్ర పట్టలేదు , ఏవేవో కలలు. తలుపు దగ్గర బర్డ్ కాల్స్ వినిపిస్తున్నాయి. అనసూయ వచ్చేసింది అనుకుంటూ తలుపు తీసింది. కాఫి తాగేసి తయారయ్యి వస్తే  అని ఆగిపోయింది అనసూయ . ఆ వస్తే ..?. అంది రెజీనా . కిచ కిచ కిచ కిచ అని వెళ్ళిపోయింది. ఏదో సంథింగ్ స్పెషల్ ఉందన్నమాట అనుకుంది. కొంచం హేపీ గా అనిపించింది.  కాఫీ తాగుతుంటే  రాత్రి వొచ్చిన కల గుర్తొచ్చి వణికింది రెజినా . తరువాత వచ్చిన కలలు గుర్తు తెచ్చుకుందామన్నా గుర్తురాలేదు.  వేడి నీళ్లతో తలస్నానం చేసింది డ్రెస్ చేసుకుని మేడ దిగి సోఫాలో కూర్చుంది.  రాత్రికురిసిన వానకి బంగాళా లో చెట్లు అన్నీ తడిసి ముద్దయ్యాయి. ఆకుల నుంచి ఇంకా నీటిబొట్లు కారుతున్నాయి. అప్పుడే  సూర్యోదయం అవుతోంది. నీటిబిందువులు మంచిముత్యాల్లా మెరుస్తున్నాయి.   ఇదేంటి అనసూయ ఇంకా రాలేదు అనుకుంటుండగా బంగాళా గేటులోంచి ఒక స్త్రీ ఆ కారం , ఓహ్ నెమలి  చేతులో వెదురు బుట్టతో వస్తోంది . వెనకాలే మరో స్త్రీ ఆమె చేత్తో కూడా వెదురుబుట్ట , ఆ వెనక మరో స్త్రీ  అలా ఒక పది మంది దాకా లోపాలకి వచ్చారు కానీ ఇంట్లోకి రాలేదు ఈ లోపు ఇంట్లోంచి అనసూయ వచ్చి ఈ రోజు బ్రేక్ఫాస్ట్ ఉండదు. అంది. ఇదా ఈ రోజు స్పెషల్ ? అనుకుంది అర్ధం చేసుకుని నవ్వింది అనసూయ. ఈ రోజు అడవి పండగ  , పూజ అయినా తరువాత నైవేద్యం  పెట్టి ప్రసాదం ఇస్తారులే. అంది అనసూయ.  రెజీనా నవ్వింది. అందరూ బంగళాలో బిల్వ వృక్షం దగ్గరికి వెళ్లారు. అక్కడ వెదురు బుట్టలు పెట్టి అందులోంచి  అందులోంచి  ఆకులతో చేసిన బుట్టలు , పసుపు, కుంకుమ, పూలు  పూజ సామాగ్రీ తీశారు.  బిల్వ వృక్షం శివుడికి ప్రీతి అంటూ తన నాలుగు ఆకు బుట్టలు చెట్టుముందుంచింది ఒకామె . ఆవిడ అలివేణి , గ్రామ శివాలయం పూజారి భార్య .రెజీనా చెవులో చెప్పింది అనసూయ.  ఒక బుట్టలో విత్తనాలు , ఇంకో బుట్టలో ప్రసాదం , మరో బుట్టలో పూలు , మరో బుట్టలో కర్పూరం , నూనె సీసా , వత్తి  ప్రమిద లాంటివి ఉన్నాయి. అలాగే ఇంకోకామె కూడా నాలుగు ఆకు బుట్టలు ఉంచింది. ఆమె చండి  కంసాలి భార్య మెల్లగా అంది.  తర్వాతా మరొకామె నాలుగు బుట్టలు చెట్టుకింద ఉంచింది. ఆమె గౌరి  స్టేషన్ మాస్టార్ గారి భార్య. 
ఆ తర్వాత ఒక ఆమె తన  నాలుగు బుట్టలు తీసి పెట్టింది.  " నా పేరు నాగమణి " కిరాణా కొట్టు రాంబాబు గారి భార్యని " అంది రెజీనా వైపు చూస్తూ. మొహమంతా నవ్వే ఆమెకి. పక్షులకోసం వచ్చింది నువ్వేనా అమ్మా అంది ఆమె. రెజీనా ఆశ్చర్యం ఆనడం కలిగాయి.  అయ్యింది . నేను కొండలరావు పెళ్ళాన్ని నాపేరు శివంగి. మా యజమానిది పోడు వ్యవసాయమండీ ,   నేను అడ్డాకుల విస్తరలు బుట్టలు సేస్తాను అంది. ఇంకొకమ్మాయి పెళ్లి అయ్యిందో లేదో తెలియదు ఒక 24  ఏళ్ళు ఉండొచ్చు  తనని పరిచయం చేసుకోకుండా " అమెరికానుంచొచ్చిన అమ్మాయిగారు మీరేనా అంది "  " అవును అంది రెజీనా , మీ పేరు ఏంటి అంది రస్సా , అంది ఆ అమ్మాయి.  నెమలి తనబుట్టలు పెట్టేసి , అను నువ్వు కూడా కానీయ్ అంది , అనసూయ కూడా తనబుట్టలు చెట్టుకింద పెట్టింది. అందరూ పసుపు కుంకుమలతో బిల్వ వృక్షాన్ని పూజించి అడవి పాట  పాడారు. రేజీనా వారితో శృతి కలపలేకపోయింది కానీ  మైమరచి వింటోంది. వినడమే కాకుండా వీడియో తీసుకుంటోంది. "భూమిని పూజించే పాటలు విన్నాను , అడవిని  పూజించే పాటలు లేవు. అడవి అందాన్ని వర్ణించే కవితలు ఉన్నాయి, అడవిమీద విప్లవ గీతాలు ఉన్నాయి గానీ అడవిని పూజించే పాటలా ?! " అనుకుంది రెజీనా 
సివంగి,నాగమణి, రస్సా లీడ్ సింగెర్స్ కాగా అలివేణి, గౌరీ, నెమలి కోరస్ అయ్యారు. రెజీనా కేవలం స్పెక్టేటర్ అయ్యింది. అప్పుడే నిద్రలేచి టిఫిన్ కి వేళ దాటిపోతోంది అని గిరి,సత్య మొహం చిరాగ్గాపెట్టి చూస్తుండగా అడవి పాట  ఇలా మొదలైంది 

పచ్చ పచ్చని అడవి పచ్చాని అడవి,  చెట్టు చేమలు నీ పట్టు చేలాలు ,
పచ్చ పచ్చని అడవి పచ్చాని అడవి,  పచ్చని చేలన్నీ కంఠ హారాలు. 
కొండకోనలు నీకు దృఢమైన భుజములు,  ఆహార ధాన్యాలు అందించు భూములు  
తోరంపుటేరులు ముత్యాల హారాలు,   మెరిసేటి చెరువులు ముక్కుపుడకలు నీకు 
 జలజలా పారేటి జలపాతాలు, జలపాతాలు నీ జడపాయాలు.
  
పచ్చ పచ్చని అడవి పచ్చాని అడవి,  చెట్టు చేమలు నీ పట్టు చేలాలు ,
పచ్చ పచ్చని అడవి పచ్చాని అడవి,  పచ్చని చేలన్నీ కంఠ హారాలు. 
చిఱుతపులి పెద్దపులి జింక సింగాలు నీ  వొడిలో ఆడుకొను పసికూనలు 
నత్తగుల్ల  పాకేటి పాపలు వడ్రంగి పిట్టలు కరిచేటి పాపలు
బుల్లి పిట్టలు నీ కనురెప్పలు  పాడేటి పక్షులు  నీ తీయని స్వరాలూ 

మార్గశిర మాసము నీశిరసుకు,  తెచ్చేను మంచుతెర మేలిముసుగు
డొంకదారులు నీ  అరచేతి రేఖలు నీ అరచేతి రేఖలే మాకదృష్ట రేకలు
శ్రీ లక్ష్మి భూలక్షి  అడవిమాతల్లి  గజరాజు వంటి మందగమనము తోటి 
శ్రీ లక్ష్మి భూలక్షి  అడవిమాతల్లి కన్నతల్లి లాంటి వెన్న మనసుతోటి
చిరునవ్వులొలికించు శ్రీ మహాలక్ష్మి. వానలు కురిపించు వనమహాలక్ష్మి. 

అందరు ప్రసాదాలు తిన్నారు. నెమలిని రెజీనా తన రూంకి తీసుకెళ్లింది. కాస్సేపు కిటికిలోంచి అడవిని చూస్తూ మాట్లాడుకున్నారు. "వర్క్ అయ్యిన తర్వాత  వంటరిగా ఈ రూంలో బోర్ కొడితే మా ఇంటికి వచ్చేయ్." అంది నెమలి.  "ఫోన్ ఉంటె మాట్లాడుకునేవాళ్లమి , ఇక్కడ ఫోన్ సిగ్నల్స్ లేవుగా." అంది రెజీనా. " గ్రామంలో సిగ్నల్స్ ఉంటాయి. అయినా సిగ్నల్స్ లేకపోడమే మంచిది. పర్సనల్ గా కలుసుకోవచ్చు." అంది నెమలి.  సాయింకాలం 6 గంటలకి మాఇంట్లో ఫంక్షన్ ఉంది రమ్మని పిలిచి వెళ్ళిపోయింది నెమలి. 

నెమలిని డోర్ దాకా పంపి వెనక్కి తిరిగి చూసే టప్పటికి , గిరి సత్య బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నారు . మీరు ఇంతవరకు ఇక్కడలేరుకదా , ఇప్పటికిప్పుడు ఎలా వచ్చేరు ? అంది రెజినా . మాకు అదృశ్య విద్య ఉంది. కావలిస్తే ఇప్పటికిప్పుడు మాయం అయిపోతాం . అన్నారు ఇద్దరూ. ఏడిసారు   ఇంత దాకా వంటగది లో దూరి నువ్వు నెమలి తో మాట్లాడుతుంటే  వెనకనుంచి ఆకలేస్తున్నదని సైగలు చేస్తున్నారు. అంది అనసూయ. రెజీనా  అనసూయ ఇద్దరు నవ్వుకున్నారు. నవ్వులతో , పాటలతో కడుపు నింపేస్తావా ? ఈ రోజుకి బ్రేక్ఫాస్ట్ లేదా ? అన్నాడు గిరి ఫ్రస్ట్రేషన్ మొఖంలో చూబిస్తూ. అను అందరికి వడ్డించింది. బ్రేక్ఫాస్ట్ అవ్వగానే టెలిఫోన్ మోగింది అనుకున్నట్టుగానే జగపతి నుంచి కాల్ . " రెజినా యువర్ సెఫ్టీ ఈజ్ టాప్ ప్రియారిటీ, టైగర్ ఇన్సిడెంట్ గురించి విన్నాను , ఫారెస్ట్ కన్సర్వేటర్ తో మాట్లాడాను పెరిఫెరీ లోకి టైగర్స్ రావు అంటున్నారు  నీకొచ్చిన భయం ఏమిలేదు జేమ్స్ ఎట్టి పరిస్థితులలో నీతో ఉంటాడు " నేను ధైర్యంగానే ఉన్నాను. జేమ్స్ సహాయంగా ఉంటున్నారు. మీ శ్రీమతికి ఎలా ఉంది ? మీరు ఎప్పుడు వస్తున్నారు. రెండు రోజుల్లో ఆపరేషన్ ఉంది . మా అబ్బాయి ఆస్టేలియా నుంచి వచ్చాడు. నేను వచ్చ్చే వారం బంగళాకి వస్తాను. ఇంకొక ముఖ్యమైన విషయం కార్తిక్ అని సి బీ సీఈ ఐ డి  ఇన్స్పెక్టర్ రేపు  బయలుదేరుతున్నాడు. ఎల్లుండి  నీదగ్గర ఉంటాడు. అతను మన బంగళాలో ఉండదు.  విలేజ్ లో ఉంటాడు. కానీ అతను ఇన్స్పెక్టర్ అనే విషయం ఎవరికీ చెప్పవద్దు. టైగర్ విషయం ఏంటో అతను  చూసుకుంటాడు. నువ్వు నిశ్చింతగా ఉండు  " జగపతి ఫోన్ కట్ చేసాడు.  రెజీనా ఫోన్ పెట్టేసి వెనక్కి తిరగగానే  నవ్వుతూ  జేమ్స్ కనిపించాడు. 

                                                     End of the scene 13

     

3 comments:

 1. Very exciting sir. Was that milkmaild certainly killed by a tiger?

  ReplyDelete
  Replies
  1. Everything will unfold after giving you the pleasure of reading and suspense. please read the last part of the Scene again. How is the forest song?

   Delete
 2. NATURE MAKES MIND PEACEFUL,
  YOUR NOVELS MAKES HEART PEACEFUL
  THANK YOU SIR

  ReplyDelete